పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/5

ఈ పుట ఆమోదించబడ్డది

శస్థుఁడో చెప్పుట కాధారములు లేవు. పేరునుబట్టి బహుశః కర్నూలు గుంటూరుసీమలవాఁ డని యూహింపవచ్చును. కవితాచాతురీధురీణుఁ డనియు, నిఖిలభాషాప్రవీణుఁ డనియు, తాను జెప్పికొనెను. ఈకవి రచించిన హయలక్షణవిలాసము, అయిదాఱాశ్వాసముల గ్రంథ మైనను ప్రస్తుతము మొదటి మూఁ డాశ్వాసములును, నాల్గవయాశ్వాసమునఁ గొంతభాగమువఱకే లభ్యమైనది. కొన్ని వ్రాతప్రతులలో, ఆశ్వాసములకు బదులుగా అధికారము లనుపేరు కాన్పించుచున్నది.

ఏతద్గ్రంథమందు, అశ్వప్రశంసయు, ఆవర్తలక్షణంబును, దశక్షేత్ర విభాగంబును, గంథలక్షణంబును, పుండ్రలక్షణంబును, నిదానలక్షణంబును, చికిత్సయును, లవణవిధియును, ఉదకవిధియును, ఘాసఖాణప్రకారంబులును, గ్రమంబునం చెప్పంబడినవి.

మనుమంచిభట్టారకుఁడు రచించిన గ్రంథభాగ మేగ్రంథమున కనువాదమో చెప్పుటకు వీలు లేదు. ఈ గ్రంథమును శాలిహోత్రాది సంసృతకవుల యశ్వశాస్త్రములతో సరిచూచి భాషాంతరీకరణవిషయమును నిర్ణయించుటకు నాకాగ్రంథము లెవ్వియుఁ జిక్కుట లేదు. ఈగ్రంథముయొక్క మాతృకను కనిపెట్టి దానికిని దీనికిని గల పోలికలను నిర్ణయించుట యే విమర్శకులైనను జేయఁబూనినయెడల నేతద్గ్రంధవిమర్శనము సమగ్రము కాఁగలదు.[1]

మనుమంచిభట్టారకుని శైలి చాల రసవంతముగా నుండి కడుహృద్యమైనది. సామాన్యజనులకు రుచిగలుగని పశుశాస్త్రవిషయ మైనను, ఈకవి తనశైలీమాధుర్యముచే మనోరంజకముగాఁ జేయఁగలిగెను. అచ్చ టచ్చట చక్కని యుపమాద్యలంకారములు వాడుకచేసియు, ద్రాక్షాఫలగుళుచ్ఛములవలె మనోజ్ఞ మగు పదజాలము నుపయోగించియు, మృదులకవితాపాకమును మంజుల నిక్వాణగతిని మేళవించియు, హృదయానురంజకముగాఁ జేయఁగలిగెను. నన్నయాదికవులయందువలె సంస్కృతశబ్దజాల మెక్కువగా నున్నను, అన్వ

  1. ఈగ్రంథముతోపాటు మఱియొక గ్రంథభాగము గూడ కలసి యచ్చుపడియున్నది. ఆభాగమును అశ్వశాస్త్రసంబంధ మైనదియే. అది కొంకణపతియగు కన్నరాజున కంకితము చేయఁబడినది. ఆకన్నరాజు మల్లయామాత్యునకును భీమాంబకును పుత్రుఁడు. అతనికి రాయచౌహత్తమల్ల యను బిరుదముగలదు. కవియెవరో తెలియదు.