పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తత్ఫలంబులెల్ల తర్వాత వివరింతు
కంపరాజ భూనిలింపరాజ.

18


సెలవుల యందును కేశాంతములయందును వీరుల యొక్క మొదల్ళును.


క.

చక్కగ సెలవుల రెంటన్
జక్కనిరోమజములున్న సైంధవరత్నం
బెక్కన రౌతుకులంబున
నక్కాలమునిచ్చుచుండు నిష్టార్థంబుల్.

19


సెలవులయండు రెండురోమజములు (సుళ్లు) గలిగినటువంటి తురంగమును ఎక్కినరౌతునకు సర్వకాల సర్వావస్తలయందును యిష్టార్థముల నిచ్చుచుండును.


క.

శుక్తులు కేశాంతములను
వ్యక్తములై రెండుగల్గు వాహము నెక్కన్
యుక్తిగలవాడు విజయా
సక్తుండౌ పుత్రపౌత్రసంపద గలుగున్.

20


కేశాంతములందు సుళ్లు కలిగిన గుర్రము నెక్కినవాడు విజయుడై పుత్రపౌత్రసంపదలతో తులతూగుచుండెను.


గీ.

హయము రంద్రోపరంధ్రపర్యంతభూమి
గానవచ్చిన సుళ్లు మేఖలములంచు
అట్టి మేఖలి కెక్కిన యధిపు డెపుడు
మణివిభూషణ సౌభాగ్య మహిమ దనరు.

21


క.

నిలుతురు తురంగవేదులు
నెలయగ జెవిగూబలందు వృషభావర్తాం
బులు గల్గుతురగరత్నము
విలసన్మణికుండలాదివిభవము లిచ్చున్.

22