పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/10

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థాయిలలో వ్యక్తిగత అసక్తితో తెలంగాణా భాష పైన పరిశోధనలు చేశారు చేస్తున్నారు కూడా.

తెలంగాణ తెలుగు భాషానిధి ఎందుకు ?

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ (1985 నుంచి తెలుగువిశ్వవిద్వాలయం) భద్రిరాజు కృష్ణమూర్తి గారి అధ్వర్యంలో మాండలిక వృత్తిపదకోశాలు అనే పేరుతో ఒక సమగ్రమైన సర్వేను 1974 లో చేపట్టింది. అందులో ముఖ్యంగా వారు వ్యవసాయం, చేనేత వడ్రంగం, మేదర, కళలు, కమ్మరం, కుమ్మరం, మొదలైన అనేక సాంప్రదాయిక వృత్తుల నుంచి పద సేకరణ చేసి, వివిధ సంపుటాలుగా తెలుగు అకాడమీ 25 వృత్తిపదకోశాలను ప్రచురించారు. వీటిని ఆధారంగా చేసుకొని భద్రిరాజు కృష్ణమూర్తి గారు తెలుగును నాలుగు మండలాలుగా విభజించారు (చూ. తెలుగు భాషాచరిత్ర). ఇలాంటి గొప్ప సర్వే భారతదేశంలోని ఏ భాషలోనూ దీనికి ముందుగాని లేదా తరువాత గానీ జరగలేదు. తెలంగాణా తెలుగులో నిక్షిప్తమై ఉన్న జ్ఞాన భాండాగారాన్ని బయటికి తీయాలన్నా తెలుసుకోవాలన్నా పరిశోధనలు చేయాలన్నా తెలంగాణ భాషపై అధ్యయనాలు జరగాలన్నా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తెలుగుపై పరిశోధనలు చేయడానికి తెలంగాణ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానితో పాటుగా ఇప్పటివరకు వివిధ రంగాల్లో తెలంగాణా తెలుగులో ప్రచురితమైన సాహిత్యాన్ని ప్రచురణ కర్తల నుంచి, రచయితల నుంచి సేకరించి మన తెలంగాణా తెలుగుకు కావలిసిన సాంఖ్యీక భాషానిధిని సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సాంకేతికంగా అభివృద్ది చెందని భాషలు ఆపన్న లేదా అత్యాపన్న భాషల జాబితాలో చేరడానికి ఇదొక కారణమని యునెస్కో హెచ్చరికలు జారీ చేసింది. ఈ జాబితాలో చేరకుండా ఉండాలంటే మన భాషని ఆధునీకరించుకాని ఆధునిక అవసరాలకు వాడుకునే విధంగా అభివృద్ది చేసుకోవాలి. అప్పుడే మన తెలుగు నాలుగు కాలాల పాటు నిలబడుతుంది.

ఆంగ్ల భాషానిధులు:

1960 నుండి ఆంగ్లంపై భాషానిధి ఆధారిత పరిశోధనలు మొదలయ్యాయి. సాంఖ్యిక రూపులో ఉన్న పాఠనిధులు లేక భాషానిధులు భాషాశాస్త్ర విశ్లేషణ చేయడానికి ఉపకరిస్తాయి. ఆంగ్ల భాషాశాస్త్ర పరిశోధకులు సాంఖ్యిక రూపంలో సమాచారాన్ని నిక్షిప్త పరిచి వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్షలు, స్వచ్చంద సంస్థలు, భాషానిధి నిర్మాణం, భాషావిశ్లేషణ, భాషోపకరణాలను తయారు చేశారు. ఉదాహరణకు బ్రిటిష్‌ అమెరికన్‌ ఇంగ్లీషు మధ్య ఉన్న భేదాలను వైవిధ్యాన్నీ వెలికి తీయడానికి బ్రౌన్‌, బ్రిటిష్‌ నేషనల్‌ భాషానిధులను రూపొందించారు. సాంఖ్యిక నిధులను మొదటి తరం, రెండో తరం అంటూ రెండు భాగాలుగా విభజించారు. మొదటి తరం నిధులలో భాగంగా బ్రౌన్‌ కార్బస్‌ (ఫ్రాన్సిస్‌, కుసెరా 1964), లాన్‌ కాస్టర్‌ ఒస్త్లో బర్గెన్‌ (ఎల్‌ ఓ. బి.) (మూడు విద్యాసంస్థలు సంయుక్తంగా బ్రిటిష్‌ ఇంగ్లీషు భాషానిధి నిర్మాణం చేపట్టారు), లండన్‌ లుండ్‌ కార్పస్‌ (ఎల్‌.ఎల్‌సి.) (జన్‌ స్వార్తిక్‌,1975) మొదలైనవి అభివృద్ది చేశారు. రెండో తరం నిధులలో భాగంగా కోబిల్డ్‌ ప్రాజెక్ట్‌ (జాన్‌ సిన్‌ క్లేర్‌ 1980), లాంగమెన్‌


కార్పస్‌ నెటవర్క్ (జోహన్సన్స్‌ 1970-78) బ్రిటీష్‌ నేషనల్‌ కార్పస్‌ (లాంగ్మెన్‌ అండ్‌ డబ్లూ. ఆర్‌. చాంబర్స్‌, 1991-94), ఇంటర్నేషనల్‌ కార్పస్‌ ఆఫ్‌ ఇంగ్లీషు (గీన్‌ బామ్‌, 1988) మొదలైనవి. వీటిని లిఖిత, మౌఖిక భాషలను ఆధారంగా రూపొందించారు. అంతే కాకుండా బ్రౌన్‌ కార్బస్‌, బ్రిటీష్‌ నేషనల్‌ కార్పస్లను నిర్మించిన పద్దతిలోనే కెనెడియన్‌, న్యూజిలాండ్‌, స్విట్టర్‌ లాండ్‌ ఇంగ్లీషు భాషానిధుల (కార్పొరా) బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లీషు భాషానిధుల నిర్మాణం వివిధ విశ్వవిద్యాలయాలలో చేపట్టారు. బ్రౌన్‌ కార్చస్‌, బ్రిటీష్‌ నేషనల్‌ కార్పస్లను (బి.ఎన్‌.సి) ఆధారంగా చేసుకొని ఇండియన్‌ ఇంగ్లీషు భాషానిధిని ఆచార్య ఎన్‌.వి. శాస్తి (1988) గారు శివాజీ విశ్వవిద్యాలయం, మహారాష్ట్రలో నిర్మించారు.

భారతీయ భాషలలో భాషానిధులు:

భారతీయ భాషల (ఎమిల్లీ) భాషానిధిని యు.కె. లోని లాంకాస్టర్‌ విశ్వవిద్యాలయం (ఎనెబిలింగ్‌ మైనారిటీ లాంగ్వేజ్‌ ఇంజనీరింగ్‌) (ఆన్దోని, వారి టీమ్‌ మెంబర్లు), భారతీయ భాషా కేంద్రం(జయరాం, ఉదయ్‌ నారాయణ్‌ సింగ్‌), భారత ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఎమిల్లీ ప్రాజెక్ట్‌ లో భాగంగా నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ లో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, సింహళ, తమిళం, తెలుగు మరియు ఉర్ధూ మొదలైన భారతీయ భాషలకు పాఠనిధులను అఖివృద్ధి చేశారు. భారతీయ భాషలకు భాషాశాస్త్ర సమాచార సమితి (లింగ్విస్టిక్‌ డేటా కన్నార్టియం ఫర్‌ ఇండియన్‌ లాంగ్వేజస్‌) అనే పేరుతో భారతీయ భాషా సంస్థ, మైసూరు డిపార్టమెంట్‌ ఆఫ్‌ ఎలక్షానిక్స్‌, భారత ప్రభుత్వం సహకారంతో భారతీయ భాషల భాషానిథిని నిర్మించారు. ఇందులో దాదాపు ముప్ఫై లక్షల పదాల నిడివిగల భాషానిధిని ప్రధాన భారతీయ భాషలకు (ద్రావిడ, ఆర్య) నిర్మించారు. వివిధ భారతీయ విశ్వవిద్యాలయాలు (హైదరాబాదు విశ్వవిద్యాలయం, ఐ.ఐ.ఐ.టి., హైదరాబాదు, ఐ.బ.టి కాన్పూర్‌, జవహరలాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ వివిధ పరిశోధన సంస్థలు) ఈ భారతీయ భాషానిధిని ఉపయోగించి, ప్రధాన భారతీయ భాషలకు భాషోపకరణాలను అభివృద్ధి చేశారు.

ఆ తరువాత లింగ్విస్టిక్‌ డేటా కన్సార్నియం ఫర్‌ ఇండియన్‌ లాంగ్వేజస్‌ ప్రాజెక్టులో భాగంగా భారతీయ భాషలకు (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ) భాషాభాగాలను గుర్తించారు, టీకాసహిత పాఠనిధులను తయారు చేశారు. ఆ తరువాత జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హిందీ నుండి ఇతర భారతీయ భాషలకు (తెలుగు, ఒడియా, పంజాబీ, బెంగాలీ మొదలైనవి) సమాంతర పాఠనిధులను తయారు చేశారు. ఇలాంటి సమాంతర పాఠనిధులు యంత్రానువాద ఉపకరణాలను అభివృద్ధి చేయడానికి ఉవయోగపడతాయి. అదే విధంగా ఆచార్య జి. ఉమామహేశ్వరరావు గారు కోటి పదాల తెలుగు భాషానిధిని లాంగ్వేజ్‌ టెక్నాలజీ లాబరేటరి, అనువర్తిత భాషాశాస్రజ్డుల మరియు అనువాద అధ్యయనాల కేంద్రం, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేశారు. ఈ భాషానిధి ఆధారంగా తెలుగు పద విశ్లేషిణీ పద జనకం, భాషాభాగాల గుర్తింపు, వాక్య విశ్లేషిణి, యంత్రానువాదం, తెలుగు దిద్దరి మొదలైనవి ఎన్నింటినో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

10