పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/13

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు పొత్తాలలో. అన్నిటికీ తెలుగుపేర్లను పుట్టిద్దాం ఇప్పుడు” అంటూ మొదలు పెట్టినాను......

1. వెన్ను+ఇడి+ఏలు= వెన్నీడేలు అకశేరుకము వెన్ను అనేది కుదురుమమాట. ఆ మాటకు రెండు చేర్పులు చేరినాయి. “ఇడి” అనే చేర్పుకు 'లేని అని తెల్లము. “పామిడి తురగపుపాదములో అన్నమయ్య పామిడిని వాడినాడు. పాము + ఇడి, అంటే 'పాములు లేకుండా” అని. వెన్నిడేలు అంటే వెన్నులేని ఏలు అనీ.

2. తొలి+ఏలు = తొలేలు ప్రోటోజోవా ప్రోటో అంటే తొలి లేదా మొట్టమొదటి.

3. తూటు+ఏలు = తూటేలు పోరిఫెరా తూట్లుతూట్లుగా ఉండేది.

4. చదును+ఏలు = చదునేలు ప్లాటి హెల్మెంతిస్‌ చదునుగా ఉందేది.

5. పేలిక+ఏలు = పేలికేలు నిమాటి హెల్మెంతిస్‌ పేలికలాగా సన్నగా పొడవుగా ఉండేది.

6. బొజ్జ+ఏలు = బొజ్జేలు సీలెంటిరేటా బొజ్జను కలిగి ఉండేది.

7. చుట్టు+ఏలు = చుట్టేలు అనిలెడా తాకితే చుట్టచుట్టుకొనేది.

8. కీలు+ఏలు = కీలేలు ఆర్షోపొడా కీళ్లను కలిగి ఉండేది.

9. జిగట+ఏలు = జిగటేలు మొలస్కా తాకితే జిగటగా ఉండేది.

10. గరుకు+ఏలు = గరుకేలు ఇకైనొడెర్మేటా తాకితే గరుకుగా ఉండేది.

11. వెన్ను+ఏలు = వెన్నేలు సకశేరుకము వెన్ను కలిగినది.

12. నీరు+ఏలు = నీరేలు జలచరము నీటిలోనే ఉండేది.

18. ఇరు+ఏలు = ఇరేలు ఉబయచరము నీటిలోనూ నేలమీదా ఇరుతావులా ఉండేది.

14. పాకు+ఏలు = పాకేలు సరీసృపము నేలమీద పాకేది.

15. తుర్రు+ఏలు = తుర్రేలు పక్షి తుర్రు అంటే మిన్నులో ఎగరడం. తెన్నాటి తెలుగువారిలో తుర్రు అనేమాట వాడుకలో ఉంది. పక్షిని తురవ అంటారు. పొద్దుతుర్రే (పైకెగిరే) దిక్కును తెలుగులో తూరుపు అంటాము.

16. రొమ్ము+ఏలు = రొమ్మేలు క్షీరదము రొమ్ములు కలిగినది.

17. మెడ+ఏలు = మెడేలు జిరాఫీ మెడ పొడవుగా ఉండేది.

18. కత్తి + ఏలు = కత్తేలు కడ్గమృగం

19. జడ+ఏలు = జడేలు యాక్‌ ఒళ్లంతా జడలు ఉండేది.

20. గెంతు+ఏలు = గెంతేలు కంగారూ

“మచ్చుకు కౌన్నిమాటలే ఇవి. వేలమాటలను ఈ '“ఏలు'తో పొందించవచ్చు. నారాయణా నువ్వు గొప్ప తెలివరివి. నీ తెలివిని పెరనుడి కోసం కాకుండా అమ్మనుడి కోసం వాడు. పెరనుడి తగులా(వ్వామోహా)న్ని వదిలించికో” అంటూ ముగించినాను.

“ఇప్పుడిక ఇంటికెళ్లి ఏం వండుకొని తింటావులే అన్నయ్యా. ఇవ్వేళ మాయింట్లో నీరేలుకూర. ఇక్కడే తినేసి వెళ్లు” అన్నాడు చిన్నయ్య. నీరేలుకూర అనే మాటను విని అందరమూ హాయిగా నవ్వుకాన్నాం.

2

“అన్నయ్యా, మొన్న నువ్వు 'ఏలుతో కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది నారాయణకు. ఇక మన జోలికి రాడు” అంటూ వచ్చినాడు చిన్నయ్య.

నాకు ఒళ్లు మండింది. “చిన్నయ్యా నువ్వు మాట్లాడుతున్నది తప్పు నారాయణ కూడా మనలో ఒకడు. అతని అనిపింపును అతను చెప్పినాడు. అది సరికాదు అని దిద్దినాం మనం. ఇట్ల అందరినీ వద్దనుకొంటూ ఎడం చేసుకొంటూ పోతే చివరకు మనం ఇద్దరమే మిగులుతాం. నిక్కానికి నారాయణ నీకన్నా నాకన్నా తెలివయినవాడు. నుడెసిది(బాషాశాస్త్రం)ని చదివినవాడు. సంసుక్రుతం కూడా మనిసి నోటినుండి పుట్టిన నుడే అని మరచి, అదొక వేలుపునుడి అనే తలపుతో దానిమీద పేరనుగు(తీవ అబిమానం)ను ఏర్పరచుకొన్నాడు. ఆ

తలపును అతనినుండి తొలగించి తెలుగుదారిని పట్టించాలి కానీ ఇట్ల ఏవగించుకోకూడదు. వెళ్లు, వెళ్లి నారాయణను పిలుచుకొని రా” | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021 |

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

13