పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/48

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఐడా పారిశ్రామిక వేత్తలు, ఆర్ధిక నేరగాళ్ళు, మానభంగం, హత్య తదితర నేరాలకు పాల్పడ్డ నేరస్తులు చట్ట సభలకు ఎన్నికయ్యే దుస్థితి దాపురించేది కాదన్న వాస్తవంతో పాఠకులు ఏకీభవిస్తారన్న నమ్మకం నాకున్నది).

ఈ దేశంలో ప్రజాస్వామ్యం మాయ అయినప్పటికి, ఆ రహస్యం బయటకు కనిపించకుండా చేసే ప్రయత్నంలో భాగమే రాజ్యాంగం మూడవ విభాగంలోని ప్రాథమికహక్కులు. అదే క్రమంలో ప్రాథమికహక్కులకు విరుద్ధమైన చట్టాలపై న్యాయసమీక్ష జరిపే అధికారాన్ని న్యాయస్థానాలకు నంక్రమింప చేయటం జరిగింది. ఈ అంశానికి నంబంధించి. రాజ్యాంగ నిర్మాతల ఆలోచన ఏవిధంగా ఉన్నప్పటికి, ఆచరణలో, ఈ ఏర్పాటు, పాలక వర్గాలకు తలనొప్పిగా మారింది. ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ప్రభుత్వాలు తీసుకున్న అనేక చర్యలు, చట్టాలకు న్యాయస్థానాల నుండి ఎదురు దెబ్బలు తగలటం ప్రారంభం అయింది. ఈ పరిస్థితిని జీర్ణించుకోలేని పాలకవర్గాలు, న్యాయస్థానాలకున్న న్యాయ నమీక్షాధికారాలను కుదించివేయటానికి, వారించివేయటానికి ప్రయత్నాలు చేయటం ప్రారంభించాయి. ప్రజాతంత్ర వాదులు ఇందుకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ పోరాటంలో ఒక భాగమే, కేశవానంద భారతి కేసు.

న్యాయ సమీక్షాధికారానికి సంబంధించి, న్యాయవ్యవస్థకు, పాలక వర్గాలకు (ప్రభుత్వానికి) మధ్య పోరాటం నిజానికి 1950లోనే ప్రముఖ పార్లమెంటేరియన్‌, కమ్యునిస్టు పార్టీకి చెందిన ఎ.కె. గోపాలన్‌ అక్రమ నిర్బంధంతోనే ప్రారంభం అయింది. ప్రాథమిక హక్కులను హరించే విధంగా చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకు లేదని ఆ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. వెంటనే ప్రభుత్వం, రాజ్యాంగాన్ని సవరించింది. తొమ్మిదవ షెడ్యూలును అదనంగా చేర్చటం జరిగింది. తొమ్మిదవ షెడ్యూలులో చేర్చబడిన చట్టాలపై న్యాయస్థానాలకు న్యాయసమీక్షాధికారం లేకుండా చేయబడింది. ఈ రాజ్యాంగసవరణ యొక్క జెచిత్యాన్ని ప్రశ్నించటం జరిగింది. శంకరీవ్రసాద్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, రాజ్యాంగాన్ని సవరించే సంపూర్ణాధికారం పార్లమెంటుకు ఉన్నదన్న సుప్రీం కోర్టు, గతంలో, ఎ.కె. గోపాలన్‌ కేసులో ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మరికొంత కాలం గడిచింది. 17వ రాజ్యాంగ సవరణ ద్వారా మరికొన్ని శాననాలను తొమ్మిదవ షెడ్యూలులో చేర్చటం వివాదగ్రస్తం అయింది. సుప్రీం కోర్టు మళ్ళీ జోక్యం చేసుకున్నది. 'పాథమిక వాక్కులను వారించే విధంగా చట్టాలను చేసే అధికారంగాని, రాజ్యాంగాన్ని సవరించే అదికారంగాని పార్లమెంటుకు లేదన్నది సుప్రీం కోర్టు. (గోలక్‌నాథ్‌ కేసు, 1971). దీనితో పాలకవర్గాలు ఖంగుతిన్నాయి. 24వ రాజ్యాంగ సవరణ ద్వారా సుప్రీంకోర్టుకుగల న్యాయ సమీక్షాధికారాలను కుదించటం జరిగింది. ఈ 24వ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తూ దాఖలు చేయబడిన కేసే కేశవానంద భారతి కేసు. రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యాలకు చట్టాలను రూపొందించే హక్కు పాలక వర్గాలకు లేదన్న సుప్రీం కోర్టు ఒక రకంగా పాలక వర్గాల నిరంకుశాధికారాలను పరిమితం చేసింది.

ఈ తీర్పుతో ఇందిరాగాంధీ, న్యాయవ్యవస్థపై తీవ్రంగా మండి వడింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని తెరపైకి తీసుకువచ్చిన ఆరుగురు న్యాయమూర్తులలో ఒకరైన ను్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన సిక్రీ, ఆ తీర్పు వెలువడిన మర్నాడే పదవీ విరమణ చేశారు. క్రొత్త ప్రధాన న్యాయమూర్తి నియామకంలో అవ్పటి వరకు నంవ్రదాయంగా వస్తున్న నీనియారిటీ సంప్రదాయాన్ని కాదని, తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఏ.ఎన్‌.రే ను సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమించింది ఇందిరాగాంధి. ఇందుకు నిరసనగా ఏ.ఎన్‌.రే ఖన్నా సీనియర్లయిన న్యాయ మూర్తులు షెలాత్‌, హెస్టే, (గ్రోవర్లు తమ వదవులకు రాజీనామా చేశారు. ఇందిరాగాంధీ అంతటితో శాంతించలేదు. రాజ్యాంగాన్ని మరింతగా సవరించింది. ప్రాథమిక హక్కులకు, న్యాయస్థానాల న్యాయనమీక్షాధికారానికి వ్యతిరేకంగా అనేక రాజ్యాంగ సవరణలు జరిగాయి. వాటిలో 1977లో జరిగిన 42వ రాజ్యాంగ నవరణ ముఖ్యమైనది. రాజ్యాంగంలోని చాలా అధికరణాలు ఆ సవరణ ద్వారా నవరించబడ్డాయి. (సుప్రీం కోర్చుకుగల న్యాయ నమీక్షాధికారాలకు కత్తెరవేన్తూ 368 అధికరణంలో (4), (5) క్లాజులను అదనంగా చేర్చటం, ఆ రాజ్యాంగ సవరణలలో అతి ముఖ్యమైనది). ఇది జరిగిన కొద్ది కాలానికే, రాయబరెల్లీ నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ తీర్పురావటం, ఎమర్జెన్సీ విధింపు, తదనంతర ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవటం, జనతాపార్టీ అధికారంలోకి రావటం, ఇందిరాగాంధీ కాలంలో తీనుకువచ్చిన అనేక రాజ్యాంగ సవరణలను, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేయటం తదితర పరిణామాలు సంభవించాయి.

కానీ విచిత్రం ఏమిటంటే, ఇందిరాగాంధీ పరిపాలనా కాలంలో జరిగిన చాలా రాజ్యాంగ సవరణలను రద్దు చేసిన జనతాపార్టీ (ప్రభుత్వం, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, సుప్రీం కోర్టుకుగల న్యాయసమీక్షాధికారాలకు కత్తెరవేస్తూ, 368 అధికరణంలో అదనంగా చేర్చబడ్డ (4), (5) క్లాజులను మాత్రం తొలగించలేదు. అంటే న్యాయవ్యవన్ళకు ఉన్న న్యాయన మీక్షాధికారాలను తొలగించటంలో అన్ని పార్టీలది, పాలకవర్గాలది, ఒకటే దారి నియంతృత్వ దారి. పౌరహక్కుల విధ్వంసక దారి.

(ప్రజాస్వామ్యం పేరుతో దోపిడీని కొనసాగించాలన్నది, పాలక వర్గాల ఏకైక మనోరథం. అది నెరవేరాలంటే, న్యాయస్థానాల అడ్డు తొలగాలి. న్యాయస్థానాలకు ఎటువంటి న్యాయ సమీక్షాధికారాలు ఉండరాదు. ఇందుకు సంబంధించిన పోరాటం కేశవానంద భారతి 'కేసుకన్నా ముందే ప్రారంభం అయింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఇక ముందూ కొనసాగుతుంది. ఈ పోరాటంలో తీర్పులు అటూ ఉంటాయి, ఇటూ ఉంటాయి. ఇందుకు కారణాలు ఏమిటన్నది మరొక (వ్రత్యేకమైన అంశం. ఆ అంళంలోకి పోవటానికి ఇది సందర్భం కాదు. ఏది ఏమైనప్పటికి, ఈ దేశంలో అత్యధికులైన కార్మిక, కర్షక, ఐదుగు, బలహీనవర్గాల ప్రాథమిక హక్కులకు సంబంధించిన అవిశ్రాంత పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉన్నదన్నది వాస్తవం. వారికి ప్రాథమిక హక్కులు నిరాకరింపబడుతున్నాయన్న విషయం వాస్తవం. ఆ విధంగా ప్రాథమిక హక్కులు నిరాకరింపబదు తున్నంతకాలం పోరాటం తప్పదు. ఆ పోరాటం కొనసాగినంతకాలం, భౌతికంగా మన మధ్య లేకపోయినా, స్వామీ కేశవానంద భారతి చిరంజీవిగా మన మధ్యే ఉంటాడు. అవిధంగా ఆయన ధన్యజీవి. తన జీవితాన్ని చరితార్థకం చేసుకున్న సర్వసంగ పరిత్యాగి. | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |