పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/40

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మరిచిపోడు. సర్వమంగళం మాట తప్పినప్పుడు దాని అవసరం వస్తుందని అతడి అనుమానం. “పంచశీల ఒప్పందం కుదిరిన రోజుల్లో రాసిన ఈ నవల యిప్పటికీ అర్ధవంతంగానే వుంటుంది. యీ నవలకు 1966లోనే కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వాళ్లిచ్చే వుత్తమ బాల సాహిత్య బహుమతిని అప్పుటి దేశాధ్యక్ష్యుడి దగ్గర నుంచి అందుకున్నాడు సదానంద. 2007లో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్యానికి కూదా బహుమతులనివ్వడం ప్రారంభించినప్పుడు ఆ అవార్డును తెలుగులో తొలిసారిగా “అడవి తల్లి” నవలకందుకోవడం చాలా సహజంగా, తగినదిగా జరిగిన పని.

తెలుగులో ఉన్న అతి కొద్దిమంది గొప్ప వ్యంగ్య హాన్య రచయితలలో సదానంద ముఖ్యులు. 1976లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఆయనా కధల సంపుటం “నవ్వే పెదవులు - ఏద్బే కళ్లులో రామదాసు చెర, ఇన్‌ జెండేకే నీచే, తాత దిగిపోయిన బండి వంటి గొప్ప కథలున్నాయి. వొకానొక స్వాతంత్ర్య దినోత్సవం నాడు బడిపిలల్లనంతా ఊరి మధ్యలో ఉండే పోలీసు మైదానంలో సమావేశపరుస్తారు. పిల్లలా ఎండలో ఎలా అవస్త పడుతున్నారో పట్టించుకోకుండా ఊరి ప్రెసిడెంటు, ఆయన వందిమాగధులు కొలువు చేస్తారు. యెండలో నిలువుకాళ్ల వుద్యోగం చేసే బడిపంకుళ్లను పట్టించుకోరు. చివరకు విల్లలకిచ్చే మిలాయిల్లో కూదా పెద్ద శాతం వాళ్లకు చేరదు. సమావేశానంతరం పెద్ద బండిలో గాంధీ పఠం పెట్టి వూరేగిస్తారు. మరునాటి ఉదయాన చూసినప్పుడు అదే బండిలో మునిసిపాలిటీ వాళ్లు చెత్త పోగేస్తుంటారు. అంటే ఆ వూరేగంపు కోసమని ఆ బండిని స్వాతంత్ర్య దినోత్సవం నాడు మాత్రం శుభ్రం చేసి వాడుకున్నారన్న మాట! అది చూసి నివ్వెర పోతున్న కధకుడితో మరో పంతులు అశ్చర్య పోతున్నావా సదానందం! మన దేశంలోనే అది యిప్పుడు తాత దిగిపోయిన బండి అంటాడు. అవనిగడ్డ గాంధీ క్షేతం మండలి బుద్ధప్రసాద్‌ గారు తెలుగు కథల్లో గాంధీ దర్శనం ఉన్న కథల్ని నంకలనం చేయించినప్పుడు, ఆ సంకలనానికి సంకలన కర్త “తాత దిగిపోయిన బండి” అనే పేరు పెట్టారు. (సంకలన కర్త : మధురాంతకం రాజారాం. ప్రచురణ- గాంధీ క్షేతం, అవనిగడ్డు.

“రామదాసు చెర”లో ఊరేగింపులో వున్న దేవుడు బియ్యం కొనడం కోసం ఖాళీ సంచితో వెళ్తున్న రామదాసునే మధ్యతరగతి బడుగు జీవివికీ వల్లమాలిన ఫోజు లేందుకు ? బొగ్గు పొడి ఉండగా పేస్టలే కావల్సి వచ్చాయా? నీ ముఖానికీ పౌడర్లు తక్కువా?” అని మందలిస్తాడు. అదే వూరేగింపులో ఎదురైన ధనవంతుల్నీ, రాజకీయ నాయకుల్నీ బుజ్జగించి మురినిపోతాడు నినిమా తారతో సల్లాపాలాడుతారు. 'ఇస్‌ డెందేకే నీచే' కథలోని మధ్యతరగతి వుద్యోగి బట్టలింగడి వాదికి సమయానికి అవ్వుకట్టలేక రాజవీధులొదలి పెట్టి సందు గొందుల్లోనే తిరుగుతాడు. 'రంగు రంగుల చీకటి” అనే కథలో వూర్లో థియేటర్‌లో విడుదలైన సినిమాని ప్రచారం చేసే బండిలో మైకు పట్టుకుని ప్రేక్షకుల్ని రకరకాల మాటలతో వూరించి కవ్వించే మనిషాకడుంటాడు. చిత్రమేమిటంటే వాడు పుట్టంధుడు. జీవితం వాణ్ణీ వాడు చూడలేని లోకాన్ని వర్ణించి బులిపించే వుద్యోగంలోకి నెట్టేసింది.

సదానంద గారు చిత్తురు జిల్లాలో పాకాల అనే చిన్న బస్తీలో పుట్టి అక్కడే చదివి, ఆ ఊరి బడుల్లోనే వుద్యోగం చేసి అక్కడే పదవీ విరమణ చేని అక్కదే చివరి వరకూ జీవించి, అ వూర్లోనే చనిపోయాడు. ఆయన తనకు తెలిసిన “పాకాలిను మెొత్తం భారతదేశానికంతా ప్రతీకగా మలిచేసారు. ఆయన రాసిన “రక్త యజ్ఞం), “గందరగోళం? 'గాడిదబ్రతులు, నవలల్లోనూ యిటువంటి హాస్యమూ, వ్యంగ్యమూ, పాఠకుల్ని సవాలు చేస్తాయి. గురజాడ “కన్నాశుల్మం' లో లాగే ఆయన కథల్లోనూ భీభత్స రసమే వుంటుంది.

ఇలా సమకాలీన సమాజంపైన అసహనం, నిరశనా వుండడం వల్లనే నదానంద గారు పాకాల సామాజిక జీవనంలో గూడా మవేకంగా లేదు. యెక్కువగా ఇంటిలోనే కాలం గడిపే అంతర్ముఖత్వమే ఆయన స్వభావం. ఆయన మాట యొప్పుడూ స్పష్టంగానే ఉండేది. ఆయన దృష్టి చాలా నిశితమైంది. ఆయన రాత యెప్పుడూ బలంగానే వుందేది. సమకాలీన సమాజం తాను ఆశించిన తీరులో వుండనప్పుడు, దాన్ని నిరసించడానికీ మరోమార్గం లేకపోయినవ్చుడు, రచయిత తన అభిప్రాయాల్ని చెప్పకుండా ఉండలేకపోయినప్పుడు, వ్యంగ్య రచనలు మాత్రమే గత్యంతర మవుతాయనీ విమర్శకులు అంటారు. 'ఓండ్రింతలు” అనే పేరుతో రెండు రశాబ్బాల క్రితం సదానంద గారు రాసిన వ్యంగ్య కథలు యిప్పటి రాజకీయ పరిస్థితులకు కూడా వ్యాఖ్యానాలుగా వుంటాయి.

సదానంద గారు చిత్రకారుడు గూడా! అనేక పుస్తకాలకు ఆయన ముఖచిత్రాలు రూపొందిచాదు. కార్టూన్లు చాలా వేశాడు. అసలే అందమైన తెలుగు లివి ఆయన దస్తూరీలో మరింత అందంగా ఉండేది. ముష్పయ్యేళ్ల క్రితం ఆయన రాసిన పిల్లల కథను ఆంధ్రప్రభలో ఆయన దస్తూరిలోనే బ్లాకు చేసి ప్రచురించారు.

నిరుడు కురిసిన హిమసమూహాల్లో సదానంద గారు గూడా ఇప్పుడు కలసిపోయారు. ఆయన రచనలు మాత్రం కాలదోషం పట్టకుండా నిలిచే ఉంటాయి.


రాయలసీమ పాటకు ఆహ్వానం

పాట రాయలనీమ నిర్దిష్ట జీవితాన్ని ్రతిబింబించాలి. పాట ప్రక్రియ లక్షణాలు తప్పనిసరిగా పాటించాలి. ఇరవై పాదాలకు మించకుండా ఉండాలి. ఈ పోటీల కోసమే కొత్తగా రాయాలి. అక్టోబరు నెల 15వ తేదిలోపు రాసిన పాటను 9492287602 వాట్సప్‌ నెంబరుకు పంపాలి. దసరా సందర్భంగా అంతర్జాల వేదికలో ఏర్పాటు చేసే రాయలసీమపాట కార్యక్రమంలో తమ పాట ఎలా పాడాలో రచయితల తెలియచేయవలని ఉంటుంది.

వివరాలకు : డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, రాయలసీమ సాంస్కృతిక వేదిక, 9963897187 | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |