పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/39

ఈ పుటను అచ్చుదిద్దలేదు

డా! మధురాంతకం నరేంద్ర 98662 43659

తెలుగు కథల కొలను సదానంద

దాదాపు నెల రోజుల క్రితం (25, ఆగష్టు 2020) తన 81వ యేట కాలధర్మం చెందిన కలువకొలను సదానంద గారిలా బాల సాహిత్యాన్నీ పెద్దల సాహిత్యాన్నీ సరిదీటు గా సృజించిన రచయిత తెలుగులో మరొకరు లేరనడం అతిశయోక్తికాదు. సునిశితమైన వ్యంగ్యంతో సమాజాన్ని తూర్చారబట్టే ఆలోచనా త్మకమైన రచనలనూ, సున్నితమైన అమాయక పాఠకులైన పిల్లలకోసం సులభంగా అర్ధమయ్యే నీతి కథలనూ వొకే రచయిత రాయగలడని నిరూపించిన అరుదైన కథకుడు సదానందగారు. యస్సెల్సీ మాత్రమే చదువుకొని, ప్రాధమిక పాఠశాలలో వుపాధ్యాయుదై, సాహిత్య సాధనను తన వుపాధ్యాయకత్వానికి వుపనదిగా మార్చుకొన్న కొద్దిమంది గొప్ప తెలుగు కథకుల్లో ఆయనే చివరివాడు గావచ్చుగూడా!

“మాతృభాషలో మాత్రమే గొప్ప రచయితలు పుడతారు” అని నిర్వద్వంగా చెప్పేవాడు ప్రఖ్యాత కన్నడ రచయిత యు.ఆర్‌. అనంతమూర్తి. అయితే మాతృభాష మాత్రమే తెలిసిన సదానందగారి లాంటి రచయితకు నలభైయాఖై యేళ్లక్రితం గొప్ప రచయితల్ని తయారు చేసే ఒక గొప్ప సాహిత్య ప్రపంచం వుండేది. తన సాహితీ జీవితపు ప్రారంభాన్ని గురించి చెబుతూ ఆకలి, వొంటరి తనం అడుగడుగునా పరామర్శించే పడుచుప్రాయంలో భయంకరమైన అధోలోకపు జీవులతో మాత్రమే తిరుగాడు రోజుల్లో, వాళ్లల్లో వాకడుగా పరిణామం చెంది పతనమైపోకుందా తనను కాపాడింది తనలో అంకురించిన రచనాసక్తి వొకటి మాత్రమేనంటాడాయన.

ఆరోజుల్లో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక అనే రెండు పత్రికలు తనను రచయితగా తయారు చేశాయని అంటారు సదానంద. తిండీ నీళ్లూ లేకపోయినా వుండగలినే వాణ్మిగానీ వాటిని చూడకపోతే వుండలేకపోయేవాణ్జి అంటాడు అప్పటి తెలుగు పండితుల గొవ్ప్చతనంవల్ల భాషా న్వరూపం ఆయనకు కరతలామలకమై పోయిందట. సరిగ్గా అదేరోజుల్లో తెలుగులో ప్రపంచ ప్రసిద్ధ నవలలు ఒక ఉద్యమంలాగా అనువదింపబడేవి. విజయవాడ కేంద్రంగా ఆంధ్రగ్రంధమాల వంటి ప్రచురణ కర్తలు అనేక అనువాదాల్ని ప్రచురించారు. టాగూరుకథలు, ఓహెన్రీ కథలు, కాశీమజిలీ కథలు, అరేబియన్‌నైట్స్‌,దార్‌క్విక్సెట్‌, రాబిన్‌హుద్‌, రాబిన్‌ సన్‌క్రూసో ట్రెజర్‌ ఐలాండ్‌, హంచ్‌బాక్‌ ఆఫ్‌ నాటర్‌దాం, లేమిజరబుల్స్‌, క్రీమస్క్‌టీర్స్‌ గొగోల్‌ వోవర్‌కోట్‌, జాక్‌లండన్‌ కాల్‌ ఆఫ్‌ది నేచర్‌-మొదలైన పుస్తకాల అనువాదాలే తనకు పాఠ్యగ్రంధాలని సదానందగారు చెప్తారు. కథాలక్షణాలు యిలా వుండాలి అంటూ మంత్రోపదేశం చేసిన మహర్షులుగా ఆ పుస్తకాలను ఆయన సంభావిస్తారు.

ఆయన విల్లల సాహిత్య సృజనతోనే తన సాహితీయాత్ర (ప్రారంభించారు. “మనిషికి నీతి వుండాలి. ఏ వ్యవస్థకైనా ఏ సమాజానికైనా దాని మనుగడకు (ప్రాణభూతమైన నీతీనియమాలు కొన్ని ఉంటాయి. వాటి విలువలు నశిస్తే ఆ నమాజం దెబ్బతింటుంది. పెద్దలకు చెప్పడంకంటే, పిల్లలకు చెప్పడంవల్ల ప్రయోజనం వుంటుంది. అందుకే విల్లలకోసం రానిన కథల్లో వినోదంతోబాటూ ఒకసూక్తి లేదా నందేశం అందించటానికి ప్రయత్నించాను” అంటాడాయన.

పిల్లలకోసం ఆయన రెండు వందలకుపైగా కథలు రాశాడు. అవి కేవలం విల్లలకోసమేగాదు. పెద్దలకు గూడా ఆకథలు జీవితపు వైచిత్రిని విస్పష్టంగా విప్పిచూపుతాయి. “సాంబయ్యగు[ర్రం” కథలో సాంబయ్య యువకుడిగావున్నవ్పుడు మంచి గుర్రాన్ని కొనుక్కొని స్వారీ చేస్తూ తిరుగుతూ వుంటాడు. యెదురైన ప్రతివాణ్నీ అపి, వాడికి తన గొప్పలు చెప్పుకుంటూ వుంటాడు. అయితే కాలక్రమంలో అతని ఆస్తులు పోతాయి. గుర్రమూ ముసలిదైపోయింది. యిప్పుడు మనిషెవరైనా కనబడితే తప్పించుకుని పారిపోదామనుకుంటున్నాడు సాంబయ్య. అయితే మనిషి కనబడ్డప్పుడల్లా ఆ గుర్రానికి మాత్రం ఆగిపోవడం అలవాటైపోయింది. అది ఆగినప్పుడల్లా దాన్ని తిడుతూ తరమడమొక్కటే యిప్పుడు సాంబయ్య చేయగలిగిన పని.

'శోతిబుద్ధి' అనే కథలో వో గురువుగారి దగ్గరుందే బంగారం తయారు చేసే విద్యను శిష్యుడాకడు నేర్చుకోవాలని వెంటబడతాదు. తన దగ్గర కొంత పాత బంగారముంది గానీ, దాన్ని తయారు చేసే విద్యంటూ ఏదీ లేదని గురువు మొత్తుకున్నా వాడు వినడు. తప్పనిసరి గావడంతో గురువు చివరకో మంత్రాన్ని శిష్యుడికి నేర్పించి రాతి 'పైన ఆకు పసరు విండుతూ దాన్ని జపించమంటాడు. అయితే అలా జపిన్తున్నప్పుడు కోతిని మాత్రం తలుచుకోగూడదని, తలచుకుంటే మంత్రం పనిచేయదనీ హెచ్చరిస్తాడు. పాపం, శిష్యుడెంత ప్రయత్నించినా ఆ మంత్రం జపిస్తున్నప్పుడల్లా, కోతి గుర్తుకు వస్తూనే ఉంది మరి!

భారతదేశానికి, చైనాకూ మధ్య 1962లో జరిగిన యుద్ధం భూమికగా సదానంద గారు “బంగారు నడిచిన చోట” అనే నవల రాశారు. పంచతంత్రంలోలాగా అందులోని పాత్రలన్నీ జంతువులే! అడవికి రాజైన సింహంపేరు సర్వమంగళం. వార్తల్ని చేరేసే గ్రద్దపేరు ఆకాశవాణి. జంతువుల్ని తినగూడదని దాంతో సంధికుదుర్చుకున్న మనిషిపేరు బంగారం. అయితే నవల చివరలో సంధి కుదిరిన తర్వాతకూడా బంగారు తుపాకీ నొకదాన్ని దగ్గర పెట్టుకోవడం | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |