పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/34

ఈ పుటను అచ్చుదిద్దలేదు

బాలవ్యాకరణం 1858లో వచ్చింది. బెంజిమన్‌ షూల్డ్‌ గ్రమటిక తెలుగిక 1728లో వచ్చింది. బెంజమన్‌ మాల్డ్‌ ఎనిమిది అధ్యాయాలుగా విభజించడానికి గల కారణం అష్టాధ్యాయినే అనునరించాడని చెప్పడానికి ఈ ఉదాహరణాలన్నీ పేర్కొనడం జరిగింది. షూల్డ్‌ వ్యాకరణం కేవలం పాశ్చాత్యుల కోసం రచన చేసినా ఆనాటి వ్యావవోరిక భాషా పదాలు, ఆకాలం నాటి భాషాబోధనా పద్ధతులు గమనించవచ్చు.

తొలి అధ్యాయం: లిపి (Script) తెలుగు వర్షమాలను సంపూర్ణంగా అక్షరానుగుణంగా వివరించాడు. అచ్చులు, హల్లులు ఆపై య-ర-ల-వ-శ-ష-న -హ-క -క్ష్మ చివరిగా ఐతో ముగించాడు. అధ్యాయం చివర ఇతి: అని ముగింపు. ఆతర్వాత క గుణింతం ఉచ్చారణ [క్రమం వివరించాడు.

అచ్చుల్లో

అ-ఆ-ఇ-ఈ -ఉ-ఊ-రు -రూ-లు-లూ-ఎ-ఐ-ఓ-బె- అం-అ: అని పేర్కొని బు, బూలుకూడా ఉన్నాయి. వాటిని ఉచ్చారణలో రు-రూ అని పలుకుతారు. అని వివరించాడు. గుణింతానికి వస్తే పూర్వం మన పల్లెల్లో ఉండే ప్రాథమిక పాఠశాల స్థాయిలో గుణింతాలు పెద్దగా వల్లె వేయించేవారు. అదే క్రమంలో షూల్డ్‌ కూడా గుణింతాన్ని ఎలా నేర్చుకోవాలో వివరించాడు. బహుశా ఈ పద్ధతి ఆకాలానికి అంటే 1728 నాటికి ఉండి ఉండాలి లేదా ఆయనకు సహకరించిన పండితులయినా ప్రవేశపెట్టి ఉండాలి. ఏమయినా నేటికీ మన ప్రాథమిక పాఠశాలల్లో ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. క కాకు దీర్ధమిస్తే కా కకు గుడిస్తే కి అని వివరించాడు. ఇందులో క గుణింతం, వలపల గిలక ప్రాచుర్యం మొదలయినవి గమనించవచ్చు. పాఠకులు గత సంచిక గమనించండి.

రెండవ అధ్యాయం: ఉచ్చారణ (Pronounciation) ఇందులో వదాలు వలికే తీరు వివరణాత్మకంగా ఉంది. ఉదాహరణకి సర్వేశ్వరుడు మోక్షం, మంచి మనస్సు, సూర్యుడు, ఘడియ, బూడిద, మెఖం, దౌరువు, బొట్టు, పర్వతం, కొండ్డ, బురుద, మంన్ను, తొంట, వారధి, వంత్తెన, పెట, పాళెం, గెవినివాకిలి, తిరువిధి, అంగడి, బంగారు, వెండ్డి, శీసం, సత్తు, వుప్పు, కొమ్మ, పచ్చికసువు, గోధుమలు, పిండి, ఆవాలు, నూనె, సారాయి, పులుసు, మైనం, పాలు, చిలక కొంగ, జెముడుకాకి, పిచ్చిక, బాతులు, నెమలి, పుంజు, పెట్ట, వుడుత, పంద్దికొక్కు గుర్రం, గాడిదె, ఆవు, దూడ, పెంద్ది, కుక్క తాత, అవ్వ, తండ్రి, తల్లి, బిడ్డలు, కొమారుడు, కూతురు, తొత్తు, బానిస, గరిటె, దీపం, సూది, దువ్వెన, అద్ధం, మాదిగెవాండు, ప్రాంత పన్నివాండు, వడ్లవాండు, కుంమ్మరవాండు, వర్తకుడు, మహిమ, నరకం, వెధవది, పొరుగింటి వాండు, మందు, ఆత్మ దాహం, ఆంకలి, వని, కౌక, రాయి, దొవ, యిల్లు ఇందులో తెలుగువారి నంప్రదాయాలు, బాంధవ్యాలు, జంతువుల పేర్సు వృత్తులు, కులాలు, తెలుగు పేర్లు మొదలయిన వెన్నో కన్పిస్తాయి. భాషాపదదోషాలు యివ్పటికీ కాంతమార్చులున్నా సంయుక్తా క్షర ప్రయోగాలు, ద్విత్వాక్షరాలు, దీర్జము మీద సాధ్యపూర్ణాను స్వారాలు ఎన్నో కన్పిస్తాయి.

మూడవ అధ్యాయం: నామవాచకాలు (Nouns). ఇందులో ఏకవచనం, బహువచన రూపాలు వివరించి ఉదాహరించాడు. సంస్కృత వ్యాకరణం అనుసరిస్తే ద్వివచనం కూడా చెప్పాలి కాని తెలుగు రచనా సంవిధాన ప్రక్రియలో కాని, వ్యావహారిక పలుకు బడిలో ద్వివచన విభాగం లేదు. అందువల్ల తెలుగు వ్యాకరణ రచనలో అనాటి ప్రాథమిక రచనాక్రమంలో ఏకవచనం, బహు వచనం మాత్రమే చెప్పాడు. దొర-దొరలు అను విభాగంతోపాటు యొక్క లో, లోపల అనే విభక్తి ప్రత్యయ రూపాలు కూడా ఉదాహరించాడు. దొరలయొక్క దౌరలలో, దౌరలలోపల వీటితోపాటు చేతన్‌, చేన్‌, తోడన్‌, తోన్‌ అనే విభక్తి రూపాలు కూడా దౌరలచేతన్‌, దొరల చేన్‌, దొరలతోడన్‌, దొరలతోన్‌ ఈ రచనా క్రమంలో దౌరకు ధార అని వత్తు ఉంది. బహుశా దొర అనే పలుకులో వత్తుగా ధ అని పలుకుగా విని ఉంచవచ్చు. అది శృతదోషంగా పరిగణిస్తే మిగిలిన రచనా క్రమం అంతా సక్రమంగానే ఉంది. అలాగే అమ్మ అని రాయవలసిన చోట అంమ్మ అని ఉంది ద్విత్వాక్షర రచనల్లో కూడా సంతకు సంత్త అని వింతకు వింత్త అనే రచనా ప్రయోగాలున్నాయి. రచనా సంవిధానం పై సరికొత్త పరిశోధనలు చేయడానికి ఈ వ్యాకరణం ఒక ఆ వరకువు కాగలదు. కొన్ని పండ్లు కూడా ఉదాహరణకు స్వీకరించవచ్చు. అరటి పండు, పనసపంధ్లు, మామిడి పండ్లు, మర్రి చెట్టు, గంగరెని చెట్టు, వేంప చెట్టు, టెంకాయ చెట్టు, పొంక చెట్టు మొదలయినవి ఉన్నాయి. రచనా సంవిధానంలో వత్తులు, పొల్లులు, సంయుక్తాలు, ద్వితాక్షరాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి.

నాల్గవ అధ్యాయం: విశేషణాలు (Adjectives) ఇందులో ప్రత్యేకంగా విశేషించి పేర్కొనదగినవి ఉన్నాయి. ఉదాహరణకు అశ్లీలమైన పదాలు కూడా రచనలో స్వీకరించిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు మంచి మనుషుడు, మంచి ఆండది, ఛడ్డ పాపిష్టి ఛడ్డ లంజ, చివరి పదం సాధారణంగా రచనలో కాని అక్షర బద్దం చేయడంకాని జరుగదు. కాని జనవ్యావహారిక పద పలుకుబడిని స్వీకరించాడనడానికిది ఉదాహరణ. అలాగే షూల్డ్‌ తొలిగా అచ్చువేసిన తెలుగు పుస్తకాల శీర్షికలు కూదా ఇక్కడ కన్పిస్తాయి. పుంణ్యపుదొవ, పాపపుదొవ, ఆకాశపునిచ్చెన, నరకపు వెదన, శశరీరపుపని, తర్మపు మాట. ఈ వదాలు 1746-47లో అచ్చు వేసినన వుస్తకాలు శీర్షికలలో ఉన్నాయి. అలాగే కొన్ని పదాలు విశేషంగా కనిపిస్తాయి. పొడుగు పర్వతం, వెడల్పు సముద్రం అలాగే సంఖ్యా వాచకాలలో వకటి -రెండ్దు -మూడు - నాలుగు -అఇదు -ఆరు -యెడు - యెనిమిది - తొంమ్మిది -పది -పదకొండు -పంద్రెండు -పధ్మూడు - పధ్నాలుగు - పదిహేను - పదహారు - పది హెడు - పద్దెనిమిది - వందొమ్మిది - యిరువై-నూరు-యింన్నూరు - ముంన్నూరు- నంన్నూరు -యనూరు- ఆరునూరు - యెళ్ళూరు - యెనమన్నూరు - తొంమ్మంన్నూరు- వెయ్యి ఈ అధ్యాయం చివరిగా ఒక వాక్యం ఉంది. 'యంన్ని నాళ్లు బ్రతికి వుంన్నాము అంన్నాళ్ళు ధర్మం శాయవలెను” ఈ వాక్యంలో ధర్మం దగ్గర వలపలగిలక లేదు. దీనిని బట్టి రచనలో సందర్భాన్ని బట్టి వలపలగిలక ప్రాధాన్యం ఏర్పరచినట్టు తెలుస్తుంది.

ఐదవ అధ్యాయం: సర్వనామాలు (Pronouns) సర్వనామాల్లో కూడా ఏకవచన బహువచన రూపాలున్నాయి. నేను-మేము, నీవు- మీరు, వారు-వారులు, తాను-తాము, మొదలయినవి కనిపిస్తాయి. | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |