పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/33

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి

98481 23655

పడమటి గాలితో

నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద

(గ్రమటిక తెలుగిక తొలి తెలుగు ముద్రిత వ్యాకరణ (గ్రంధం. దీనికి పూర్వం ముద్రణా సౌలభ్యం లేనందువల్ల మన రాతలు రచనలు అన్నీ తాళపత్ర, బూర్జుపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. నేదు ప్రామాణిక వ్యాకరణ [గ్రంథమయిన చిన్నయసూరి బాల వ్యాకరణం 1858లో అచ్చయింది. షూల్డ్‌ వ్యాకరణం 1728లో కూర్చబడింది. అంటే షూల్డ్‌ 180 ఏళ్ళ తర్వాత చిన్నయసూరి వ్యాకరణం వచ్చింది. షూల్డ్‌ వ్యాకరణంలో కూడా తొలిగా వర్ణమాలన్సు తెలుగు గుణింతాలను వివరించాడు. పాఠకుల సౌలభ్యం కోసం, యువ పాఠక నేస్తాల కోసం అచ్చు, హల్లు విభాగమేర్చడిన విధానం రేఖా మాత్రంగా వివరించడం అవసరమని పరిచయం చేస్తున్నా.

సంస్కృతంలో వర్ణాలు 50, ప్రాకృతంలో 40, తెలుగులో 36 సంస్కృత వ్యాకరణాలకు పాణినీయం మూలం. అనుంచి అః వరకు అకారాదులు, మొత్తం 16 వర్జాలు. కనుంచిళ వరకు కకారాదులు 34 వర్జాలు హల్లులు అచ్చులు,హల్లులు ఏర్పడటానికి మహేశ్వర సూత్రాలు మూల కారణం అంటారు. ఇవి మొత్తం 14 తాలి నాలుగు సూత్రాల్లో

1అఇఉణ్‌ 2 బుఇలు 3. ఎఓజ్‌ 4 ఐబెచ్‌ చివరిదయిన నాల్గవ దాన్ని ఇద్వర్దాలు అంటారు. మొదటి సూత్రంలోని తొలి వర్ణం 'అ” చివరి సూత్రంలోని చకారంతో కలిపి అచ్చులుగా పేర్కొంటారు. అచ్చులనే స్వరములు ప్రాణములు అనే వ్యవహారం కూదా ఉంది. హల్లుకు అచ్చు ప్రాణం కాబట్టి ప్రాణములు అంటారు. అచ్చులు స్వయం ్రకాశములు అందువల్ల స్వరములు అనికూడా అంటారు. 'స్వ్పయం రాజంతే ఇతి స్వరా: అని నిర్వచనం హల్లుల విషయానికి వస్తే

కహయవరట్‌ 6.లణ్‌ 7ఇమ ణనమ్‌

&ర్తుభజ్‌ 9 ఘధధష్‌ 10. జబగడదళశ్‌

11 ఖఫఛరథచటతవ్‌ 12కపయ్‌

18. శషసర్‌ 14 హల్‌ అనే పది మహేశ్వర సూత్రాలను బట్టి తొలి హ చివరి హల్‌ కలిపి వాల్లుగా పిలుస్తారు. ఇది నూళ్షంగా వివరణ. హల్గులకు వ్యంజనములు అనికూడా అంటారు. సాధారణంగా ఉచ్చారణ సౌకర్యం కోసం ఏదో ఒక అచ్చు హల్లుతో కలిపి పలుకుతాం కాబట్టి స్వరములచే ప్రకాశింప బడేవి వ్యంజనములు అని వాడుక. భాషా శాస్త్ర సౌలభ్యం కోసం మానవ ముఖాభినయ ఉ చ్చారణ సౌలభ్యం కోసం కంఠ్యములు, తాలవ్యములు మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్యాలు, అంతస్థాలు, ఊప్మములు, అనే విభాగం స్పష్టీకరించినట్టు భాషాశాస్ర్రవేత్తల నిర్వచనం. ఇది విశ్వవ్యాప్తంగా అంగీకరించే విషయం.

విశ్వవ్యాప్త భాషాశాస్త్రవేత్తలు పాణిని భాషా శాస్రపితామహుడుగా పేర్కొంటారు. పాణిని క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది వాడని అంచనా. ఈయన గాంధార దేశవాసి. తల్లి దక్షి తండ్రి పాణిని. దక్షీ పుత్ర పాణిని అని ప్రాదీన నామం. పాణిని కృతమే అష్టాధ్యాయి. ఎనిమిది అధ్యాయాలున్న గ్రంథం కాబట్టి అష్టాధ్యాయి అని పిలుస్తారు. పాణిని సంస్కృత భాషలో రచించిన ఈ వ్యాకరణ [గ్రంధం సశాస్రీయమూ, సమగ్రము అయిన వర్ణనాత్మక వ్యాకరణం (౧౪9౦/10/9 ౬౧౧౧౧౪9౧) అని అంటారు. నిజానికి ప్రపంచంలో మరే భాషకు లేనంతటి శాస్త్రీయత పాణిని అప్టాధ్యాయికి ఉంది.

సూత్ర రూపంలో రచించిన అష్టాధ్యాయి లౌకిక, వైదిక సంస్కృత భాషా న్వరూపాన్ని వర్షించే ఈ గ్రంధంలో మొత్తం 3981 సూత్రాలున్నాయి. అప్పాధ్యాయికి పతంజలి మహర్షి రచించిన మహా భాష్యమనే వాఖ్యానం. వామన జయాదిత్యులు విశ్లేషించిన కౌశికా వృత్తి వనిద్ధమైనవిగా పండితులు వ్యాఖ్యానిస్తారు. కౌశికా వ్యాఖ్యానంలో సూత్రార్ధం, ఉదాహరణం, వద ప్రయోజనం మెదలయిన అంశాలున్నాయి. ఈ [గ్రంథ రచన కాశీలో రచించినట్టు చెప్పడం వల్ల కాశిక అనే పేరు వ్యావహారికంలోకి వచ్చి అదే స్థిరపడింది.

అష్టాధ్యాయిలో మొత్తం ఎనిమిది అధ్యాయాలున్నాయి. అవసరాన్నిబట్టి ఒక్కో అధ్యాయంలో నాలుగు ఉప విభాగాలు కూడా ఉన్నాయి.

మొదటి అధ్యాయం : సంజ్ఞలు, పరిభాషలు, ఆత్మనేపద, వరస్మైపద ధాతువులు, విభక్తి రూపాలు, సమాన అవ్యయాలు ఉన్నాయి.

రెండవ అధ్యాయం : సమాస ప్రక్రియ, సమాస భేదాలు, కారక విశేషాలు దశ విధలకారాలు ఉన్నాయి.

మూడవ అధ్యాయం : ఇందులోఅన్ని కృతంద రూపాలున్నాయి.

నాల్గవ అధ్యాయం: స్త్రీ ప్రత్యయ రూపాలు, తద్ధిత రూపాలు ఉన్నాయి.

ఐదవ అధ్యాయం : నాల్సవ అధ్యాయం కొనసాగింపుగా మరికొన్ని తద్ధిత రూపాలున్నాయి. ఆరవ అధ్యాయం : సంధి, స్వర విధానం ఆదేశాలు, అసాధారణ నమాసాలు, అర్ధ దాతుక పరిణామాలు, ఆదేశ కార్యాలు లోప కార్యాలు మొదలయినవి.

వడవ అధ్యాయం : స్వర విధానం, ధ్వని పరిణామ క్రమం ఉన్నాయి.

ఎనిమిదవ అధ్యాయం: స్వర నామాలు, సంధి నూత్రాలు యిత్యాదులున్నాయి.

సూక్ష్మంగా అష్టాధ్యాయి. వివరణ ఇది. బాలవ్యాకరణ కర్త చిన్నయసూరి తన వ్యాకరణ [గ్రంథంలో 1) సంజ్హ 2) సంధి, 3) తత్సమ 4) అచ్చిక 5) కారక. 6) సమాస ?) తద్దిత 8) క్రియ 9) కృదంత 10) ప్రకీర్ణక పరిచ్భేదాలనే విభాగించాడు. చిన్నయ | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |