పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/30

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమరావతీస్తూపము 24

కలవు. నాగార్జునాచార్యుఁ డొక్కఁడు కాడనియు, ఆ పేరు కలవారు వేఱు నేఱు కాలములందుఁ బుట్టి ప్రఖ్యాతులయిన వారు మువ్వురు కల రనియు నొక పాదము కలదు. ఎచ్చట జన్మించినను మాధ్యమిక వాదకర్తయయిన నాగార్జు నుఁడు తన జీవితపు ప్రొద్దు పడుమటి దెసకు వ్రాలిన కడపటి కాలమును కృష్ణానదీతీర ప్రాంతమునందుఁ గడ్డపె సని బౌద్ధ గ్రంథములవలనఁ దెలియుచున్నది. ఆకాల మున దక్షిణాపథము నేకచ్ఛత్రముగఁ బాలించుచుండిన యాంధ్రరాజు ' సాతవాహను' డియార్య నాగార్జును నాద రించి యత్యంతము గౌరవించెను. ఆర్య నాగార్జునుఁడు శ్రీ ధాన్యకటకము చుట్టు నానా చిత్రవిచిత్రిత మయిన ప్రాకా రమును గట్టించుటయే కాక, మహాధానపతి (Patroniser 'సాతవాహను 'ని వితరణోదార్యములవలన శ్రీ పర్వత ము’న ' శైలమంటపాలయము'ను గట్టించెను.

శ్రీ పర్వతమును, ధాన్యకటకమును ప్రముఖము లయిన బౌద్ధ పీఠములని ' మంజుశ్రీ మూలకల్ప 'మను బౌద్ధ గ్రంథమునఁ గలదు. జీవితావసానదశయందు నాగార్జునా చార్యుని కావాసమయిన శ్రీపర్వతమును, పూర్వోక్త గ్రంథ మునఁ బేర్కొనఁ బడిన శ్రీ పర్వతము నొక్కటియే కానో పును. ఈ శ్రీ పర్వతము కృష్ణానదీతీర సమయి నేఁడు వ శైవ