పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/27

ఈ పుటను అచ్చుదిద్దలేదు

£1 ! అమరావతీస్తూపము

మావశ్యకమయి, మహాయానమున బోధిసత్వాదర్శము ప్రా ధాన్యము వహించెను. సంపూర్ణ వికసిత చిత్తులయి, ప్రపంచ ‘దుఃఖమునకుఁ దామును పరితాపము ననుభవించుచుఁ, దమ ప్రేమము కారణముగ 'అలసులుగ' నుండక, అలౌకికౌదార్య ముతో ఈజన్మమునను, భవిష్యజ్ఞన్మము లందును ప్రపంచ సేవచేయఁ గృత నిశ్చయు లై, సర్వభూత నిర్వాణోపలబ్ధకం బాటుపడుడు, ఈజన్మమునందుఁ గాని, భవిష్యజ్ఞన్మమునందుఁ గాని విధాయకముగ బుద్దపదమును బడయు వారు బోధి 'సత్వులు, దరిదాపుగ బుద్ధపదమును సమీపింపవచ్చిన యిట్టి బోధిసత్వులతోడ్పాటు కాని, బుద్ధులతో ణ్పాటు కాని లేని దే ‘మహాయానమున బౌద్ధమతావలంబి బుద్దపడము నొండ నేరఁడు. భక్తిసాధనమున నే బోధిసత్వులు వశులై భక్తునికి తోడ్పడుచుందుకు, ఈ కారణమున, బౌద్ధులకు హీన మాన మున స్తూపమునకు పూవులు సమర్పించుట, దానికి ప్రదక్షిణ ముచేయుట, బౌద్ధ క్షేత్రములను సందర్శించుట, బౌద్ధ భిక్షువులకు భోజన మిడుట కర్తవ్యములు కాఁగా, మహా యానమున బుద్ధునికి భిన్నులయిన బోధిసత్వులు మొదలగు దేవతలను పూజించుట ప్రధాన కార్య మయ్యెను. భోధిసత్వుల కీరీతిని గలిగిన ప్రాధాన్యమువలన మహాయానము 'బో సత్యయాన' మనియు పేరు గాంచినది.