పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/26

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమరావతీస్తూపము 20°


మహాయానమున: నిర్వాణోపలబ్ధి సర్వజన సులభమగుటచేత బౌద్ధమున నెంతయో గొప్ప పరివ ర్తనము సంభవించెను. ఆదర్శములు మాఱినవి; ఆచారములు మాటినవి; తత్వము భేదించినది; భక్తి హెచ్చినది; కర్మకాండము పెరిఁగినది; నూతన సృష్టి యెంతయో కలిగినది. తుదకు బుద్ధుఁడు మొదట బోధించిన బౌద్ధమునకు, ఈవిధమున పరివర్తనము నొందిన బౌద్ధమునకు పెక్కువిషయముల సాదృశ్యమే లేకపోయినది. రాగ ద్వేష మోహనల జ్వాల లంతరించి, స్వకీయ వ్యక్తిత్వము రూపఱుటయును, దుఃఖ సముదయముననుండి ప్రాణి మోక్షము నొందుటయునే నిర్వాణమని ప్రథమమున బుద్ధుఁడు బోధించెను. అంతకన్న 'తత్వ' వరముగ నతఁ డేదియుఁ జెప్పియుండక పోవుటయే కాక, అట్టి దానిని గూర్చిన కల్పనాలోచనములు కూడ వనియు నిషేధించెను. అట్టిది, మహాయానమున, ప్రపంచ సత్యత్వా సత్యత్వములను గూర్చియు, పరమజ్ఞానమును గూర్చియు తర్కవితర్కములు ప్రబలి బౌద్ధదర్శనము (Buddhist philosophy) అంకురించి యది క్రమముగా విస్తరిల్లినది. ఇట్లగుటలో, ధర్మకాయ, సంభోగకాయ, నిర్మాణ కాయములని బుద్ధ కాయ త్రయ సిద్ధాంత ‘మేర్పడినది, హీనయానము' నబౌద్ధులకు ధర్మము, బుధుడు సంఘము అనునని ధర్మముఖంముత శరకాయు