పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మున నున్నది. ఇది యిప్పటి అమరావతీ గ్రామమునకు నడుమ నుండుటచేత అమరావతీ స్తూపమని దీనికిఁ బేరు కలిగి నది. క్రీస్త్వారంభ శతాబ్దులలో ధాన్యాకర మని నామాం తరముఁ గల ధాన్యకటక నగరము దక్షిణాపథము నందలి నగరములలోని కెల్ల నవతంసమై ప్రఖ్యాతిఁ గాంచుటవలన నిది ధాన్యకటక చైత్య మనియు, బౌద్ధ నంఘము నివసించుట కనువయిన విహారములు మొదలగున వనేకము లిచట నుం డుటచేత ధాన్యకటక సంఘారామ మనియు బౌద్ధ వాఙ్మయ మున నిది ప్రసిద్ధమైనది.‌

ఈ స్తూప మెప్పుడు నిర్మిత మయినదో స్పష్టముగఁ దెలిసికొనుట కాధారములు లేవు. శారీరక స్తూపము లెనిమి దింటిలో అశోకుఁ డేడింటిని తెఱపించి యందలి ధాతువులను చిన్న చిన్నవిగ పెక్కు విభాగములు గావించి, యం దొ క్కొక దానిమీఁద నొక్క టొకటిగ దేశమునందలి వేర్వేరు భాగములందు మొత్తముమీఁద నెనుబది నాలుగువేల స్తూప ములను గట్టించినట్లు తరువాతికాలపు బౌద్ధగాథలు తెలుపు చున్నవి. కొన్ని ఇట్టి గాధల వలననే అమరావతీస్తూప నిర్మాత అశోక చక్రవర్తియని తెలియుచున్నది. ఈగాథలు విశ్వసనీయము లనుటకు ప్రమాణాంతరములు లేకపోయినను ఈస్తూపపు రాలమీఁద మౌర్యలిపితో శాసనము లుండుట