పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/15

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాటలీపుత్ర సభానంతరము బౌద్దమతమును దేశదేశములు వ్యాపింపఁ జేయుటకు అశోక చక్రవర్తి మత బోధకుల నంపెను. చక్రవర్తి యాజ్ఞ శిరాసావహించి, దేశాంతరముల కరిగిన మతబోధకులు మాగధులకుఁ దెలియవచ్చినవారు వీరు 1, కాశ్మీర, గాంధారములకు 'మజ్ఝంతిక' భిక్షువు; 2. మహిషమండలమునకు (ఆంధ్ర, మైసూరు దేశములకు) 'మహా దేవ' భిక్షువు; (ఇతఁడు పాటలీపుత్రము నందలి మహాసాంఘి కులకు నాయకుఁడు); 3. 'వనవాసి'కి 'రక్ఖిత' భిక్షువు; 4. 'అపరాంతక'మునకు 'ధమ్మరక్ఖిత' భిక్షువు; 5. 'మహారట్ఠ ము'నకు 'మహాధమ్మరక్ఖిత' భిక్షువు; 6. 'యవనలోకము నకు 'మహారక్ఖిత' భిక్షువు; 7. 'హిమవంతపాదము' నకు 'మజ్ఝిమ' 'కస్సవులు' 8. 'సువణ్ణభూమి'కి 'సోణక 'ఉత్తరులు' ; 9. 'తాంబపణ్ణికి' 'మహింద' భిక్షువు.

చైత్యకులు

బౌద్ధమత వ్యాపనమున కశోక చక్రవర్తి ప్రేపి తుఁడై యాంధ్రదేశమున కరుదెంచిన మగధ మహా సాంఘిక నాయకుఁడగు మహాదేవ భిక్షువు కృష్ణానదీతీరస్థమయిన ధాన్య కటకమును నివాన భూమిగఁ జేసికొని చైత్యక వాద మను నొక పంథ స్థాపించెను. ఈపంథకుఁ జెందిన భిక్షువులకు చైత్యకు లనియు చైత్యక నికాయ మనియుఁ బేరు. ఈరీతిగా