పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/138

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయినను గతశతాబ్దియందుకంటె నేఁడు ఈబౌద్ధవాఙ్మయమును పరిశోధించువారు మన భారతీయులలోఁగూడ ననేకులు కలరు. ఆంధ్రులకు బౌద్ధవాఙ్మయాధ్యయన మత్యంతావశ్యకమైనది. ఒకప్పు డాంధ్రదేశము బౌద్ధమతమునకు భారతదేశమంతటిలో ప్రధానస్థానముగ నుండెను. బౌద్ధాంధ్రదేశ చారిత్రమునకు బౌద్ధవాఙ్మయ మత్యంతోపకారకము. అందువలన ఆంధ్రులు ఏతద్వాఙ్మయమునం దభిమానము వహించి తదధ్యయన, పరిశోధనములకుఁ బూనుకొనుట యావశ్యకము.