పుట:అభినయదర్పణము.pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాయకుని లక్షణము

క.

ఎలమి స్వరజ్ఞానంబును
సరవి లయజ్ఞానమును సుశారీరంబున్
గలపండితుఁడై ధైర్యముఁ
గలవాఁడగు గాయకుండు, కస్తురిరంగా!

49

పాత్రలక్షణము

సీ.

సరసిజనేత్రియై సౌందర్యశాలియై
              చెండ్లను గెల్చు పాలిండ్లతోను
సరవిగా రత్నభూషణములు ధరియించి
              చిఱునవ్వు మోమునఁ జెలువు మీఱఁ
గాలనిర్ణయములు గలిగి భావ మెఱింగి
              గాననృత్యములందు ఘనత మీఱి
నవరసచాతుర్యనయమును సంపద
              దగువిలాసమును శాంతంబు గల్గి


గీ.

కూర్మి దాతృత్వమును గల్గి గుణము గల్గి
మెలఁత తొలకరిమెఱుపు నెమ్మేనితోడఁ
జెలఁగునది పాత్ర యనఁ జెల్లు, శ్రీనుతాంగ!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

50

పాత్రదశప్రాణములు

చ.

నిరతము రూపు రేకలును నిల్కడ వేగముఁ గల్గి కాంతియుం
బరఁగఁగ దృష్టిభేదమును బాటయు వాగ్జరి గల్గి మిక్కిలిన్
అరుదుగ సంతసం, బొదవి యంతట వేసటలేక యుండుటల్
[1]బరువిడి యీ పదిం జెలికిఁ బ్రాణము, గస్తురిరంగనాయకా!

51

పాత్రాంగదేవతాలక్షణము

సీ.

బ్రహ్మరంధ్రానకుఁ బరఁగ సదాశివుల్
              ఫాలంబునకు క్షేత్రపాలకుండు

  1. బరువిడి=లాఘవము