పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/116

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

అప్పకవీయము[1]

పీఠిక



యు న్భూమియు నాఁగఁ బ్రాచిని బ్రతీచిన్ రుక్మిణీదేవి స
త్యాయోషామణియు న్మహోత్సుకత సేయు న్ముంగల న్మోడ్పుఁ[2]గే
ల్దోయిం దార్క్ష్యమరుత్సుతు ల్గొలున శ్రీదుం డేలు నాప్రోలిమో
మై యాకామెవలి న్వసించు హరి నిత్యంబు న్మముం బ్రోవుతన్.

1


తే.

కమల యెందును దనరూపు కాంచి యలిగి
యాత్మతరళాంతరమున నిజాధినాథు
తమ వతఁడు చూప గని చిత్తమునఁ జెలఁగు
నట్టి కౌస్తుభమణి హృదయమునఁ దలంతు.

2


క.

వననిధినందన కుయ్యెల, యనువునఁ దనరారి వారిజాక్షునివక్షం
బున నొప్పువైజయంతీ, వనమాలిక నా కొసంగు [3]వాగ్వైభవమున్.

3


తే.

కౌస్తుభంబును వనమాలికయును దనకు, దిగువగా [4]లచ్చి నొసలిపై దిద్దినట్టి
తిలకమునకు సమంబుగా వెలయునట్టి, చక్రశ్రీవత్సచిహ్నంబు సంస్మరింతు.

4


మ.

ధరఁ గాళిందితటంబునం గలుగు బృందాకాననాంతంబునం
బరితోషాతిశయాళు మోహమున గోపస్త్రీమణుల్ గుంపులై
హరి జేరం జనుదెంతు రెందుఁ [5]జనుదెం చానాద మాలించి స
త్వరయానంబులతోడ నట్టి మురళిన్ వర్ణింతు నిష్టాప్తికిన్.

5


సీ.

పాంచజన్యం బనఁబరఁగి దైత్యారాతి[6]యెడమను బై కేల నెసఁగు నెద్ది
మొగి సుదర్శననామునను [7]మాధవుదక్షిణాగ్రహస్తంబున నమరు నెద్ది

  1. (వా) వావిళ్లవారిప్రతి
    (ప) పరవస్తువారిప్రతి
    (పె) పెండ్యాలవారిప్రతి
    (గి) గిడుగు రామమూర్తిగారు పరిష్కరించిన వావిళ్లముద్రణప్రతి
    (పూ.ము.) వావిళ్లవారి మొదటికూర్పు
    (రా) రావూరివారి సవరణ
    (సూ) సూర్యాలోక ముద్రితప్రతి. పీఠిక అని లేదు. ఇక్కడనుండియే ప్రథమాశ్వాసము ప్రారంభమగును. 1-17 పద్యములకు 'ఆయుధపరిజనసహితవిష్ణుస్తుతి' యని శీర్షిక.

  2. కే
  3. వాంఛితఫలమున్ (వా), వాగ్విభవంబున్ (గి)
  4. నొప్ప (పూ.ము.)
  5. జనునంచా(సూ)
  6. యడమను బయికేల నమరు నెద్ది (వా)
  7. కృష్ణుని (రా)