పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/51

ఈ పుట ఆమోదించబడ్డది

58

అనుభవసారము


దవివర్జితునకు జంగమ
సవిశేషార్చన మ దెట్లు సమకూరు మదిన్?

224

ఇష్టలింగార్పణవిధి

సీ.

వినియెడుశబ్దంబు కనియెడురూపు మూ
          ర్కొనుసౌరభంబు గైకొనురసంబు
ముట్టెడువస్తువుల్ మెట్టెడుఠావు చే
          పట్టుధనంబు పైఁ బెట్టుమనము
కట్టెడువస్త్రముల్ పట్టెడుశస్త్రముల్
          పెట్టుభూషణములు దట్టుసుఖము
డాయుసతులగోష్ఠి పూయులేపనములు
          పాయువిరోధముల్ సేయుక్రియలు


గీ.

వాహనాసనములు వాక్కాయకర్మాంగి
వర్తనములు ప్రాణవల్లభునకు
[1]నవధరింప నిచ్చి యవధరింపఁగఁ గోరు
నతఁడు సావధాని యగుప్రసాది.

225


క.

ముట్టఁ డనర్పితవస్తువు
ముట్టక యర్పింపరాదు మునుముట్టకయున్
ముట్టించి వెండి ముట్టెడు
నట్టివిచిత్రప్రసాది యనువే మరయన్.

226


క.

ఈవచ్చు నెల్లసుఖములు
భావింపఁగ జాగరతనె భావుకులకు స్వ
ప్నావస్థ నిచ్చి కొనుసౌ
ఖ్యావహుఁ డౌ భక్తిజాణఁ డమలినదేహా!

227
  1. ననుభవింప నిచ్చి యనుభవింపఁగ నేర్చు