పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/46

ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

53


ఉ.

నెయ్య మెలర్ప జంగమము నిక్కము లింగ మటంచుఁ బిల్చి యో
జియ్య పనేమి? దేవ యని శీఘ్రమె పోయియు నానతిచ్చి మా
యయ్య మహాప్రసాద మని [1]యర్చన చేసియుఁ బ్రీతి సల్పు మా
యయ్యలు దారె కారె చరితార్థులు భక్తహితార్థకారణా!

207

భక్తభావక్రియార్చనావిధి

సీ.

సాష్టాంగుఁ డై మ్రొక్క నానందజనితాశ్రు
          సమితియె పాదమజ్జనము గాఁగ
నలరుచు నాపోవ కందంద వీక్షించు
          దృష్టులు పూజ లై తేజరిల్ల
సముచిత మొనరించు సత్క్రియాభ్యుదితవా
          సన తాన ధూపవాసన వహింపఁ
జెలఁగుచుఁ బ్రస్తుతి సేయుహృద్యార్థవా
          ఙ్మణులు నీరాజనమహిమ వెలుఁగ


గీ.

విగతలోకుఁ డై నివేదించు నభిమతా
ర్థములె యిచ్చు నోగిరములు గాఁగ
సహజభక్తిపరుఁడు జంగమలింగపూ
జనము సేయ నేర్చు సంతతంబు.

208


చ.

అలయక యెగ్గు లాడ కపహాస్యము సేయక సేఁత కెమ్మెయిన్
జొలయక నీవు దా ననక సుంకరిమాటల నింపు లాడ కి
మ్ములఁ జన కర్థి దింపక ప్రమోద మణంపక గర్వి గాక మా
ర్మలయక యుండఁగా వలదె మానుగ జంగమభక్తుఁ డేనియున్.

209
  1. యచ్చుగ