పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/38

ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

45


ప్రస్తుతము భక్తి వెలిగా
[1]నస్తవ్యస్తులకు మును శివైక్యము గలదే?

174


క.

గతిమతి చైతన్యక్రియ
లతిశయ మై తనకుఁ గల్గు [2]నంత కనర్థ
స్థితిఁ బూజాతిక్రమస
మ్మతుఁ డై వర్తింపఁదగునె మఱి భక్తునకున్?

175


చ.

అవసరమందుఁ బుష్ప మొకటైనను బత్తిరి యైన ము న్నసం
భవ మగునేని నీశునకు భక్తి ప్రధానము గావునన్ మహో
త్సవగతిదృష్టి పూజయును సంస్మరణంబును భావశుద్ధియుం
దవిలి యొనర్చునేనియును దప్పక చేసిన[3]వాఁడె కాఁదగున్.

176


క.

నిర్భయులకు నిష్ప్రియులకు
దౌర్భాగ్యాద్వైతులకు వృథావాదులకున్
దుర్భావకులకుఁ దా నపు
నర్భవసుఖరాశి గలదె? నారయపుత్త్రా!

177


క.

ఆరయ నద్వైతాహం
కారం బది ఫలము గాదు కావున నిరహం
కారస్థితిగాఁ గొల్చిన
వారికి దొరకదు పునర్భవము త్రిపురారీ!

178


సీ.

ఆరయ 'లింగద్వయం సమాఖ్యాత' మ
         నంబడి లింగద్వయంబు వెలయు
నిలఁ జరం చాచర మేవ చ యన జంగ
         మము లింగ మన నందు మహితభక్తి

  1. వ్యస్తలమున్.
  2. నంతకు సార్థ
  3. వాఁడు కాలమున్.