పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/36

ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

43


ఆ.

సత్క్రియానుకూల సారానుభవలోల
భక్తజనహితార్థ [1]భవ్యతీర్థ
[2]పరమసౌఖ్యలోల పరమానురాగసం
సారదుఃఖనాశ! సత్కవీశ!

164


శా.

ఆలస్యంబు మనోవికల్పమును నాత్మాద్వైతమున్ సత్క్రియా
కాలాతిక్రమమున్ జడత్వము నహంకారంబు సంసారలీ
లాలోలత్వము సంచలత్వము దురాలాపంబులుం గూడునే
[3]త్రైలింగార్చన సేయుభక్తునకు నుద్యద్భక్తచింతామణీ!

165


శా.

వ్రాలున్ వ్రాలు శివార్చనాపరవశవ్యాప్తిన్ బ్రమోదంబునన్
గ్రాలున్ గ్రాలు నహర్నిశంబు శివలింగధ్యానసంపన్నుఁ డై
సోలున్ సోలు నపారసారవివిధస్తోత్రప్రలాపంబులన్
దేలున్ దేలు మహానుభావసుఖవార్ధిం భక్తుఁ డుద్యద్గుణా!

166


ఉ.

ఏపున శుద్ధభక్తిరతి యేడెఱ నూల్కొన నేకలింగని
ష్ఠాపరయుక్తి నివ్వటిల సజ్జనభావము పొంగలింప ను
ద్దీపితతత్త్వదృష్టి [4]మతిఁ దేజ మెలర్పఁగ సచ్చరిత్రయం
దోపి వెలుంగుభక్తుఁడు మహోన్నతి నుండు జగజ్జనాశ్రయా!

167


ఉ.

వేళ లెఱింగి సత్క్రియలు వెల్లిగొనంగ మనంబు ప్రీతికిన్
[5]మేళన మిచ్చి యచ్చుపడ మేన సముత్పులకాలి పర్వఁగాఁ
జాలఁగ నేత్రవారి దనసంస్మితవక్త్రము ముంచి యెత్తఁ బూ
జాలసనంబున న్నెగడు సజ్జనభక్తుఁడు సత్క్రియాశ్రయా!

168
  1. పరమయోగ
  2. భవ్యసౌఖ్యయోగ
  3. త్రా
  4. మది దేశ
  5. మేళము లిచ్చి