పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/25

ఈ పుట ఆమోదించబడ్డది

32

అనుభవసారము


క.

భక్తి గలనాఁడె భక్తులు
భక్తునిఁ బాటింతు రతఁడు భక్తియు వదలన్
భక్తులు చేరరు గావున
భక్తియె సౌభాగ్య మండ్రు భక్తుల కెందున్.

109


క.

భూతియు రుద్రాక్షలు న
త్యాతతబహువేషరచన లవి తొడవులె? సం
ప్రీతిగ భక్తునకును బ్ర
ఖ్యాతిగ సద్భక్తి తొడవు గాక మహాత్మా!

110


క.

ముట్టినచోఁ దను [1]విడువక
దిట్టతనంబునను భక్తి ధీరుఁడ ననుచున్
బిట్టాడెడిసందేహికిఁ
బుట్టునె వైరాగ్యగుణము? బుధజనవినుతా!

111


క.

భక్తుండు విషయి యైనను
భక్తుఁడు నిర్విషయి యైనఁ బాటింపరు స
ద్భక్తులు; భక్తియు నిర్విష
యోక్తియుఁ గలయతని మెత్తు రుచితాభరణా!

112


క.

భక్తిపరతంత్రుఁ డై చను
భక్తునిఁ గడు వలతు రండ్రు భక్తులు వలవన్
భక్తపరాధీనుఁడు త
ద్భక్తుని రక్షించు శివుఁడు భవభయదూరా!

113


క.

వంటని దుర్వ్యసనంబుల
[2]పెంటకుఁ గా కీశుభక్తిపెంపునకుం గా

  1. విడువఁగ
  2. పెంటగు