పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/23

ఈ పుట ఆమోదించబడ్డది

30

అనుభవసారము


క.

కడుఁ గలిసియు భక్తులయెడ
నెడమడు గది లేమి భక్తి [1]యెన్నిక కెక్కున్
వెడమాటలఁ గలియుచు మది
నెడమడు గై యునికి భక్తియే? త్రిపురారీ!

99


చ.

అలయక మోచి దున్నియును నంకముఁ జొచ్చియు నష్టవృత్తిమైఁ
గొలిచియుఁ జోరుఁ డై చనియుఁ గూలి యొనర్చియు విద్య చూపియున్
వలి వ్యవహార మాడియున్నవార కవస్థలఁ బడ్డఁ గాని తాఁ
గలుగదు భుక్తి; ముక్తి మును గల్గునె సోమరి వట్టిమాటలన్.

100


క.

తను వొగ్గి ప్రాణ మమ్మియు
ధన మెదు రిచ్చియును భక్తిఁ దాఁ బడయుట వ్రేఁ
గనినం దనువును బ్రాణము
ధనమును వంచింప భ క్తి దగ దొరకునొకో!

101


క.

నిత్యంబు గానియొడలికిఁ
బ్రత్యహమును బెద్ద దుఃఖపడవలె నన్నన్
నిత్యపదం బగుభ క్తికి
నత్యంతము దుఃఖపడక యగునె మహాత్మా!

102


క.

ఘనభ క్తి కటకటా! లే
దనువగయును భక్తి చాల దనువగయును భ
క్తి నిజంబు నాకు నె ట్లగు
ననువగయును గలుగ భక్తి యగుఁ ద్రిపురారీ!

103
  1. యెన్నికునైనన్