పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/2

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకటన

శ్రీమదాంధ్రకవీంద్రులకు నన్నయభట్టారకులు తిక్కన సోమయాజి యేరాశాప్రగడ నాచన సోమనాథుఁడు శ్రీనాథుఁడు మున్నగు ప్రాచీనులు - రాయసదస్యకవులగు పింగళి సూరనార్యులు అల్లసాని పెద్దనార్యులు ముక్కు తిమ్మచార్యులు లోనుగాగల యాధునికులును విరచించిన గ్రంథములు తత్సమభూయిష్టములు గాని కేవలాంధ్రములు గావు. తద్భవములు మెండుగాఁ గలిగి కేవలాంధ్రకృతులు తఱుచుగాఁ గానంబడుట యరిది. కేవలాంధ్రకృతి గావించుట దుష్కరమయినను మృదుపాశశయ్యాదులతో నీ (రామాయణ) మచ్చతెలుఁగుననే కూచిమంచి తిమ్మకవి రచియించెను. ఇది పలుతావులఁ బెక్కుపాఠభేదములు గలిగి చదువువారలకు సుభోధముగాక మెండుస్ఖాలిత్యములు గలిగియుండుటం జేసి చక్కగా సంస్కరింపించి ముద్రింపించినయెడల నన్నిచోటుల వ్యాపించి పాఠ మేకరూపముయి యభ్యసించువారలకు సుబోధమయి యుండునని యెంచి సత్తి రామానుజులు నాయఁడుగారు ముద్రింపించందలంచియుండ - దొరతనమువారు ప్రకృతమందు బి. ఏ. అనుపరీక్షకు నీగ్రంథము సయిత మేర్పఱిచినట్లు ప్రకటించినది తెలియనయినందున స్వప్రయత్నమున కిది మిగుల ననుకూలమని యెంచి శోధింపించి ముద్రింపించిరి. దీనియం దక్కడక్కడఁ దఱుచు కఠినవదములు మొదలగు వానిని విశదము చేయుకొఱకు నొకలఘుటీకయ విరచించి ప్రకటింపబడును.

ఈగ్రంథము చెన్నపురి పెద్దినాయనిపేట టంకసాలవీథినిఁ దలుపులెక్క 81 గల శ్రీనికేతనముద్రాక్షరశాలయందు పత్తి రామానుజులు నాయనివారిచే విక్రయింపఁబడుచున్నది.