పారిభాషిక పదములు
(.......) ఇట్లు కుండలీకరణము (బ్రాకెట్)లలో కనిపించు విషయము మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్యుడు స్వయముగా వ్రాసినది కాదు. సంస్కృత మహాభాగవతము ననుసరించి అర్వాచీనులైన వ్రాయసకాండ్రెవరో తెలుగు భాగవతమునందు చొప్పించినవి కావచ్చును.ఇట్లు చొప్పింపఁబడిన భాగములకు ప్రక్షేపణములని పేరు.
స్కంధము - శ్రీమన్మహాభాగవతమునందలి ప్రధాన విభాగము
అధ్యాయము - ఈ విధమైన విభాగమునకు తెలుగు మహాభాగవతములో అంతగా ప్రాధాన్యము లేదు. ఇది సంస్కృత మహాభాగవతమునందలి అధ్యాయ క్రమము ననుసరించి చేసినది మాత్రమే. తెలుగు మహాభాగవతమునందు ఘట్టములకు మాత్రమే ప్రాధాన్యము.
సంఖ్య - సంఖ్య
(ఉదా :- 1-20) : ఈ విధమైన పరిభాషలో మొదటి అంకె స్కన్ధమును, రెండవ సంఖ్య అందలి పద్యమును గాని వచనమును గాని సూచించును.
శా. = శార్దూల విక్రీడితమను సంస్కృత వృత్తభేదము
మ. = మత్తేభ విక్రీడితమను సంస్కృత వృత్తభేదము
ఉ. = ఉత్పల మాలిక అను సంస్కృత వృత్తభేదము
చం. = చంపక మాలిక అను సంస్కృత వృత్తభేదము
కం. = కందము అను ఆర్యాభేదము
ఆ.వె. = ఆటవెలది అను తెలుగు పద్యభేదము
తే.గీ. = తేటగీతి అను తెలుగు పద్యభేదము
సీ. = సీసము అను తెలుగు పద్యభేదము
వ. = ఛందో నిర్బంధము లేని స్వేచ్ఛావచనము