పల్లెపదాలు/కోతపాట
9 కోతపాట
కోతకొయ్యండమ్మలాలా సేలు
కోరుకున్నా మమ్మలాలా
ఆరు మూడు కాలమైన
అసలుకి మరి కొసరులేదు ...కోత
సోడిసేలు యెన్నులేసి
సోలెడు గింజలకైతే
పాలికాపు బత్తేలకు
సాలొచ్చును కొయ్యండీ ...కోత
దసరా భోగాలంటె
ఆసరా తీరుస్తాయి
పసరాలకి కసవుంటే
భాగ్యాలే పండాయి ...కోత
సాలొచ్చిన మారాజు
సెయిముల గాయిస్తాడు
కాసు సేతపడితేను
గగనమందేముసేను ...కోత
రైతుకు చాలివచ్చిననే చెయ్యిములగా గింజలు కూడా 'కూలివాళ్లకి యిస్తాడు. లేకపోతే ఒప్పుకున్న కాసుమాత్రమే.
—వరిపొలాలకు ఈ చిక్కులేదు. వర్షపాతమెట్లున్నా 'మన్నెపుగొండపై మబ్బులో మెరుపు తీసిపోయిన నదిని పోషించి ' పంట కందించగలదు. వరిచేలలోని చిక్కులు వేరు. 10 కోతపాట
కొయ్యండల్లా కొయ్యండీ
కోసీ బణుపూ లెయ్యండీ
వానల వరదల వంగినసేను
వెన్నుల నీనిన వన్నెలసేను
తిన్నగదీసీ మొదలూకోసీ
పసలన్నీని పొంజెట్టావా
గింజలు బందలొ పడిపోకుండా
పొందుగ వెన్నులు కొయ్యండల్లా
కాలంసూత్తే సీతాకాలం
కొడవలిపాటూ జాగర్తల్లా
కాలూసెయ్యీ ఆడింతేనే
కుండలొ కూడు కలిసొత్తాది.
పనిచేస్తున్నప్పుడు పాడే పాటల వస్తువు ఆ పనికి సంబంధించినదే. దేవాలయ గోపురానికి అలంకారాలు ఆ గోపురపు హ్రాస్వరూపములే. భారత దేవాలయాన్ని అలంకరించిన మనసులే ఈ బృహదాంధ్ర సారస్వతాన్ని నిర్మించినది.