పల్లెపదాలు/ఓయన్ని దాయలాల
5 ఓయన్ని దాయలాల
ఓయన్ని దాయలాల
గొబ్బియాలాలో ...ఓ
కుంటా పూవాసనకు
రాయుడు రాంగా
కుసుమపూవాసనకు
కుంట దారెల్లె
ఓయన్ని దాయలాల
గొబ్బియాలాలో ...ఓ
కుంటాముగదికి
రాయుడు రాంగా
మల్లెపూవాసనకు
మారు దారెల్లె
ఓయన్ని దాయలాలో
గొబ్బియాలాలో ...ఓ
చెరువు ముంగిటికి
రాయుడు రాంగా
సెనిగపూవాసనకు
చెరువు దారెల్లె
ఓయన్ని దాయలాలో
గొబ్బియాలాలో ...ఓ
బాయి ముంగటికి
రాయుడు రాంగా
బంతిపూవాసనకు
బాయి దారెల్లె
ఓయన్ని దాయలలో
గొబ్బియాలాలో ...ఓ
ఈ కూలిజనమువలెనే ఏ మూలనోపుట్టి పరిమళించేవే సెనగపూలూ, బంతిపూలూ, ఎక్కడో ఒక తుప్పలో మల్లెపూవులున్నూ. రాయుడికి ఎక్కడికి పోయినా పూలసౌరభమే.
—వీరి బ్రతుకుబాటల తిన్నదనము ' కామందు ' ల సిరిసంపదలమీదనే ఆధారపడుతుంది. వారి పాడిపంటలూ, పిల్లపాపలూ, ఆవుగోవులూ చల్లగా వుండవాలె. కూలిజనమేకదా రైతుల కుల పురోహితులు!