పల్నాటి చరిత్ర/ప్రస్తుత స్తితి
శ్రీనాధుడు భోగి, మరియన్నము దినుచు సన్నని వస్త్ర ముల గట్టుచు నుద్యానవనములందు దిరుగుచు మృదు శయ్యల బవ్వళింపుచు విలాసముల దేలువాడు, పల్నాటిలోని గ్రామజీవితమును నందలిజొన్నన్నము రుచింపలేదు. అదియును గాక యాకాలమునాటి స్తితిని శ్రీనాధుడు వర్ణించియుండును. కాని యిప్పుడు మార్పు జెంది నాగరికతయందు పల్నాడు పురోగమించినది.
ప్రస్తుత స్థితి
____________
రెంటచింతలలో పెద్ద మిషన్ వైద్యాలయము కలదు. ఆ గ్రామమునందే గ్రుడ్డివారిలకు పాఠశాలకలదు. అక్షరముల నుబ్బెత్తుగా పెద్దవిగా ప్రత్యేక కాగితములమీద తయారు చేయుదురు. గ్రుడ్డివారలా యక్షరముల దడిమి చూచి స్పర్శ జ్ఞానముచే వారియాకారములు తెలిసికొని చదివెదరు. వారికై తయారుకాబడిన ప్రత్యేకపుస్తకములను మాత్రమే చదువ గలరుకాని యన్ని పుస్తకములను చదువలేరు. ఇచ్చట మంచి రాయిదొరకును, గచ్చుగోడలుకట్టుటకు రెంటచింతల రాయి ( శ్రేష్టమయినది. కాగితములమీద బరువునకై పెట్టు రాళ్లను (Paper-weights ) అందముగా తయారు చేయుదురు. దుర్గిలో పనితనముగల రాతివిగ్రహములను తయారుచేయుదురు. తాళ్లపల్లిలో పట్టంచు ఖద్దరు దోవతులను నవారును పరదాలను తయారుచేయుదురు. ఇండ్లకు పఱచు టకు పనికి వచ్చు నాపరాయి పల్నాటిలో విరివిగా కొరకును. రెంటచింతల, మాచర్ల, రాయవరము, గోలి మొదలగుచోట్ల నాపరాయితీసి యితర జిల్లాలకు రైలుమీద నెగుమతి చేయుదురు. పిడుగురాళ్ల వద్ద సిమెంటుకు పనికివచ్చు రాయికలదు. దానిని తీసి రైలు మీద తాడేపల్లిలోని సిమెంటుఫాక్టరి యెగుమతి చేయుదురు. కారెమపూడిలోను దాచేపల్లిలోను ఆకుతోటలు, నారింజ మొదలగు ఫలవృక్షములు గల తోటలు నాగులేటి నీటిచే సాగగుచున్నవి. దండుబాటలో కృష్ణకీవలిగ్రామమగు పొందుగుల వఱకును, ఆవలి గ్రామమగు వాడపల్లి నుండి హైదరాబాదుకు మోటారు సర్వీసు కలదు. హైదరా బాదు వాడపల్లికి 100 మైళ్లుండును. కృష్ణను పడవలలో దాటెదరు. నాగార్జునకొండ ప్రాంతమున కొండపిండియని పిలువబడు చెట్టుపూత దొరకును. దూదికి బదులు పరుపులకు దిండ్లకు వాడిన చలువగానుండును. కారెంపూడి ప్రాంతమున నడవులలో నుండు కొరనాసియను జంతువునుండి క్రొవ్వుదీసి వాతనొప్పులకు నౌషధముగా వాడెదరు.
పిల్లుట్ల:- గుఱ్ఱం వీరారెడ్డిచే స్తాపింపబడిన అనాధశరణాలయ మున్నది. హైస్కూలు వసతి గృహము నున్నవి.
దృశ్యములు
ఎత్తిపోతల:- ఇది జలపాతము, చంద్రవంక వాగులోని నీరు 66 అడుగుల ఎత్తునుండి క్రిందికి దుముకుచుండును . చూచుటకు మనోహరముగా నుండును. మాచర్లకు 5 మైళ్ళ