పల్నాటి చరిత్ర/పల్నాటి కవులు

చున్నది. 1939 లో ప్రారంభమైన రెండవ ప్రపంచయుద్ధము 1945 లో అంతమయ్యెను. 15–8_47 న మన దేశమునకు స్వాతంత్య్రము వచ్చెను. 1948 లో నైజాములో జరిగిన రజకార్ల యల్లరుల మూలమున చాలమంది నైజాము ప్రజలు పల్నాటిలో తలదాచుకొనిరి. 26-1-50న మనదేశము రిపబ్లిక్ ఆయెను. 1950 లో కమ్యూనిస్టులు యల్లరుల మూలమున పల్నాటి ప్రజలు బాధపడిరి. ఆహార వస్తువులమీదను, వస్త్రముల మీదను యుద్ధకాలమున పెట్టబడిన కంట్రోళ్లను స్వాతంత్య్రము వచ్చినను తీసివేయనందున ఇతర ప్రాంతములందలి ప్రజలతో బాటు పల్నాటిప్రజలు కూడ బాధ పడిరి. 1952లో కంట్రోళ్ళు తొలగింపబడెను. ఆ సంవత్సరమే గురజాలలో సెకండరిగ్రేడు ట్రయినింగుస్కూలు యేర్పడెను.

_________________


పల్నాటి కవులు

1. పింగళి సూరన:- పింగళి సూరన గరుడపురాణమును తెనిగించెను. రాఘవ పాండవీయమను శ్లేషకావ్యమును, కళాపూ ర్ణోదయమను నద్భుత కావ్యమును, ప్రభావతీ ప్రద్యుమ్నమును రచించెను. ఇతడు నియోగి బ్రాహ్మణుడు. గౌతమగోత్రుడు . 16వ శతాబ్దమువాడు, ఇతడు క్రీ.శ 1566వ సంవత్సర ప్రాంతయిన నుండెనని కందుకూరి వీరేశలింగముగారు నిర్ధారణ చేసిరి కృష్ణదేవరాయలు (1509 -1530) వఱకు రాజ్యమేలెను. పింగళి సూరనగాని రామరాజ భూషణుడుగాని, కృష్ణ దేవరాయల కేగ్రంధమును అంకితము చేయని కారణముచేత రాయల యాస్తానములో వీరు లేరనియు, తరువాత నుండిరనియు కొందఱి వాదము, అష్టదిగ్గజకవులలో వీరి పేర్లుకూడ నుండుట చేతను, నారీతిగా ననేక చాటుపద్యము లుండుటచేతను కృష్ణదేవరాయల చివరిసంవత్సరములలో వీరిద్దఱు చేరిరనియు, అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణాదులు పెద్దవారలుగా నుండినప్పుడు పిన్నలుగా వీరిద్దరు రాయలవద్ద కవులలో నుండిరనియు, రాయలయనంతరము వీరిద్దరు గ్రంధముల రచించి రాయల తరువాతి రాజుల కంకితము చేసిరనియు కొందరివాదము. ఇతడు రాఘవ పాండవీయమును ఆరువీటి పెద వేంకటపతి భూపాలునకును, కళాపూర్ణోదయమును నంద్యాల కృష్ణభూపతికిని నిచ్చెను. తాను గోకనమంత్రి వంశజుడననియు పింగళి యను గ్రామమున దన పూర్వులు చిరకాలముండుటచే పింగళి యను పేరువచ్చినదనియు, ప్రభావతీ ప్రద్యుమ్నములోని

మ. తరముల్ నాల్గయి దెందునెందు దగుదత్తద్గ్రామ నామంబులం
     బరగున్ వంశములెల్ల పూర్వపునిజప్రఖ్యాతి మాయంగ నే
     మరుదో పింగళినామముందు చిరకాలావాసులైయున్న సు
     స్థిరతన్ గోకనమంత్రివంశజులకుం జెన్నొందుమిన్నందుచున్

అనియు, సూర్యునివరముచే నతని సంతతి శాఖోపశాఖ లై యన్ని ప్రాంతములందు ప్రబలినదనియు, వ్రాసినాడు. పింగళి సూరన గ్రామము పల్నాటిలోని పిన్నెలి. ఇందులకాధార ముళ, పింగళియను గ్రామమాంధ్రదేశమున యెచ్చటను లేదు. పల్నాటిలోని పిన్నిలికి పింగళియను నామముకలదు. అప్పకవి

క. తంగెడసీమను నిర్జర
   గంగాసమ నాగనిమ్నగా పూర్వదిశన్,
   పింగళిపుర దక్షిణమున
   రంగుగ నెలకొన్న గోపరత్నంబునకున్

అని పిన్నెలిని పింగలియని వ్రాసినాడు.

(2) ప్రభావతీ ప్రద్యుమ్నములో

ఉ. రంగుగ గౌతమీ పరిసరంబుల కృష్ణకెలంకులన్ ఘనుల్
    పింగళి రామయాదులు లలిం బలనాటను బాకనాటనున్
    బింగళి గాదయాదులిట పెంపు వహించిన యస్మదాదులా
    పింగళి గోకమంత్రి యిలు పేరనె చాల ప్రసిద్ధ లెల్లచోన్

అని తనవారు పలనాటిలో ప్రసిద్ధులైనట్లు వ్రాసికొనినాడు.

(3) ప్రభావతీ ప్రద్యుమ్నములో సూరన

ఉ. పేర్వెలయంగ నాఘనుడు పింగళి గోకబుధోత్తముండు గం
    ధర్వినొకర్తు బేకియనుదానిని దాసిగనేలె"

యని తనపూర్వుని గుఱించి వ్రాసినాడు. ఈపేకికథ పిన్నెలివారింటిలో నిప్పటికిని వంశ పరంపరగా చెప్పుకొనబడుచున్నది. పిన్నెలివారి పూర్వులలో కొకరింట పేకియను గంధర్వి మనుష్యవేషమున దాసిగానుండెననియు, దూరముగా నున్న దీపమెగసన ద్రోయు టకు సూతికాగృహముననున్న యజమానురాలిచే నాజ్ఞాపింప బడినదనియు, అది లేచుటకు బద్దకించి, యెవరు తనను జూడ లేపకదాయని తలచి, గంధర్వ మాయచే నాలుకను దీపము వఱకు నాచి ఎగఫన త్రోసెననియు దీనిని చూచిన యజమాను రాలు భయపడి భర్తలో చెప్పి దాసిని వెడలగొట్టించెననియు పిన్నెలిలోనివారు వృద్ధపరంపరగ చెప్పికొనెదరు. (4) పిన్నెలి ప్రాంతమును పూర్వము పింగళుడను రాక్షసుడేలినాడనియు అందువలన పింగళియను పేరువచ్చెననియు నచ్చటివారనెదరు. రాక్షస గుడులను పేర చిన్న గుడులు పిన్నెలివద్ద నిప్పటికిని యున్నవి. (5) కందుకూరి వీరేశలింగముగారు కవుల చరిత్రలో సూరనగారి గ్రామమగు పింగళి కృష్ణామండలమున నున్నదని వ్రాసినాడు. ఆకాలమున గుంటూరు కృష్ణజిల్లాలు కలిసి కృష్ణా మండలము (కృష్ణజిల్లా) గ నుండుటచే పింగళి గ్రామము పల్నాడులోని పిన్నెలి యగును. (6) సూరన హాస్యమునకై తెనాలి రామలింగనిమీద కం॥ తెన్నాలి రామలింగడు | తిన్నాడే తట్టెడంత యని వ్రాయగా రామలింగడు 'తీయని బెల్లం ! బెన్నగ దీనినివ్రాసిన | పింగళి సూరన్న నోట... (పేడే) పడెరా || యని పూర్తిచేసెనని చాటుపద్యముకలదు. ఈ పద్యము యొక్క నిజమెట్లున్నను, నిది చాలకాలమునుండి ప్రజలలో చెప్పుకొన బడుచున్నది. ఈ పద్యమునందు పింగళి సూరన్నకు బదులు పిన్నెలిసూరన యనిన ప్రాసభంగము గాకుండును. కావున పిన్నెలియే పింగళియగును. గట్టమంచి రామలింగా రెడ్డిగారు, తమకవిత్వ తత్త్వవిచారములో పింగళిసూరన కవిత్వమును ప్రశంసించిరి.

(2) రామరాజభూషణుడు (3) మూర్తికవి

వీరిద్దరు వేర్వేరు కవులు, భట్రాజులు పల్నాడుతాలూకా భట్రాజుపల్లె వీరిగ్రామము.

రామరాజభూషణుడు వసుచరిత్రమును, హరిశ్చంద్రనలో పాఖ్యానును ద్వ్యర్థి కావ్యమును రచించెను. వసుచరిత్రను తిరుమలరాయని కంకితమిచ్చెను. తిరుమల దేవరాయలు క్రీ.శ. 1567-1577 వఱకు విజయనగర సామ్రాజ్యమును పాలించెను. మూర్తికవి కావ్యాలంకార సంగ్రహమను నలంకారశాస్త్రము వ్రాసి నరసరాజున కంకితమిచ్చెను. రామరాజభూషణుడును మూర్తికవియు సమకాలికులు. అన్నదమ్ముల కుమారులు. ప్రబంధాంకును నింటి పేరుగలవారు. రామరాజభూషణుడు పిన్నవయస్సున కృష్ణదేవరాయల యష్టదిగ్గజములలో నొకడు గనుండి భట్టుమూర్తి యను పేర పరగుచుండవని చాటు పద్య ములవలన తెలియుచున్నది. వీరిగ్గఱురు తమ గంధములలో తమ గ్రామము పేరు చెప్పి కొనియుండలేదు కాని వీరిది పల్నాడు లోని భట్టువారిపల్లెకావచ్చును. అందుల కాధారములు, (1) వీరి యింటి పేరు ప్రబంధాంకమువారు . భట్రాజు ప్రబంధాంకము వారిప్పటికి 30 సంవత్సరములవఱకు. పల్నాటిలో భట్టువారిపల్లెలో నుండిరి. ఇప్పుడు లేచిపోయినారు. భట్టుమూర్తియు రామరాజభూషణకనియు కాశ్యపసగోత్రులు. వీరును కాశ్యపసగోత్రులు,భట్టుమూర్తియొక్కయు రామరాజభూషణుని యొక్కయు వంశజులను తానుచూచి నాననియు, వారు ప్రబంధాంకము వారనియు, పల్నాటిలోని భట్టువారిపల్లెలో పదిదినములు వారితో నివాసము చేసితిననియు, వారితో మాట్లాడితిననియు, వారు సాహిత్యములో ప్రవీణులనియు, రామరాజభూషణుని యొక్కయు మూర్తి కవియొక్కయు నివాసగ్రామము పల్నాటిలోని భట్టువారిపల్లెయనియు 1919 సం॥ మే 28 వ తేదిగల యాంధ్రపత్రిక యుగాది సంచికలో వైయాకరణము గోపాల జయదేవరాజుగారు వ్రాసినారు.

(2) నరసభూపాలీయములో మూర్తికవి 'అమితయమకాశుధీ ప్రబంధాంక' యనియు గద్యములో 'ప్రబంధపఠనారచనా ధురంధర ప్రబంధాంక వేంకటరాయ...' అని యుండుటచే ప్రబంధములు పఠించుటయందును రచించుటయందును గల ప్రజ్ఞనుబట్టి పౌరుషనామధేయముగా ప్రబంధాంకమనివచ్చెనని తెలియుచున్నది. ఇట్లే విద్యాధరిణి మొదలగునవి భట్రాజు లలో పౌరుషనామధేయములు, విద్యాధరణీవారు భట్రాజు లలో పల్నాటిలో మాచెర్ల మొదలగుచోట్ల యిప్పటికిని నున్నారు. వేంకటరాయభూషణుడు, రామరాజభూషణుడు, అనునవి యయావారలచే భూషింపబడినట్లు బిరుదములే కాని నిజనామములు కావనియు, కావ్యాలంకారసంగ్రహము (నరస భూపాలీయము) గద్యములో చెన్నబడిన వేంకటరాయభూషణుని కుమారుడగు మూర్తికవియు, వసుచరిత్ర, హరిశ్చంద్ర నలోపాఖ్యానముల గద్యములలో చెప్పబడిన సూరపరాజు కుమారుడు రామరాజభూషణుడును నొక్క రేయనియు కొంద నెదరు

(4) కాకునూరి అప్పకవి:- అప్పకవీయ మనబడు ఛందోగ్రంథమును రచించెను. ఆంధ్రమునగల ఛందోగ్రంథముల కెల్ల యప్పకవీయము ముఖ్యమైంది. అది క్రీ. శ. 1656–1660 మధ్య వ్రాయబడియుండునని కందుకూరి వీరేశలింగము గారు ఆంధ్రకవుల చరిత్రలో వ్రాసిరి. అప్పకవి బ్రాహ్మణుడు. వైదికుడు. నివాస స్థలము పల్నాడులోని కామేపల్లి. ఇప్పుడున్న కామేపల్లి కాదు. అప్పకవి కామేపల్లి శిధిలమైనది. బ్రాహ్మణపల్లి వద్ద అదియుండెడిది . అప్పకవి తన గ్రామములకు హద్దులను స్పష్టముగా వ్రాసినాడు. అప్పకవీయమందు మలయ వింధ్యాచల మధ్యమంబున గృష్ణ యామ్య తీరమున బ్రహ్మాశ్రమమున ||

గీ. దండకాటవి నాంధ్రాభిధానపుణ్య!
    దేశమున శ్రీగిరీశాన్యదిశను గొండ
    వీటి పడమర దంగెడ విషయమునకు |
    కామేపల్లిని గోపాలధామమునను
    
    గీ। పల్లెనాటనునూట తొంబదియునాల్గు
    గ్రామముల నీడు గానక కాకునూరి
    వేంగనార్యుడు వేదవేదాంగములను |
    ప్రస్తుతికి నెక్కెమాఱట బ్రహ్మయనగ
 

తన గ్రంధ మంకితమిచ్చిన కృష్ణు నిట్లు వర్ణించెను

కం॥ తంగెడసీమను నిర్జర గంగాసమ నాగ నిమ్మగా పూర్వదిశన్ బింగళిపురదక్షిణమున రంగుగ నెల కొన్న గోపరత్నంబునకున్ |

కం॥ సాయప వేంకటపతి భూ
     నాయక దత్తాగ్రహార నగర శాయత దేవా
     లయమున బాయక వ
     సియించు గోపభామాపతికిన్
     
కం॥ కేతవర నామపట్టణ
     ధైతేయాశా సమన్విత నికేతునకున్
     వాతాత్మజ తార్క్ష్య సుతా
     న్వీతునకు సమస్తలోకవిఖ్యాతునకున్
     
కం॥ శ్రుతశాస్త్రాగమ జితిగీ
     ష్పతి వట్టెము పెద్ద నార్య సంపాదిత పు
     ణ్యతరాగ్రహార పూర్వ
     క్షితిజ శమీయామ్యమున వసించినహరికిన్

అప్పకవి వేలకొలది గ్రంధముల బరిశీలించి లక్ష్యముల నుదహరించెను. రావిపాటి తిప్పరాజు (త్రిపురాంతక కవి; చాటుధార

మ॥ సరిబే సైరిపుడేల భాస్కరులు భాషానాధ పుత్రవసుం
    ధరయందొక్కడు మంత్రియయ్యె వినుకొండన్ రామయా మాత్యభా |
    స్కరుడో యౌనయినన్ సహస్ర కర శాఖల్ లేవవేయున్నవే |
    తిర మైదానము చేయుచో రిపుల హేతిన్ వ్రేయుచో వ్రాయుచో

వంటి రసవంతములగు పద్యములప్పకవి యుదహరించుట చేతనే నిలిచియున్నవి. రైళ్లుమోటారులు ముద్రణయంత్రములు లేని యారోజులలో ననేకప్రదేశములుతిరిగి యనేక వ్రాతప్రతులు పరిశీలించి వ్రాసిన అప్పకవి యెంతయో వందనీయుడు. ఆంధ్రవ్యాకరణమును'ఆంధ్ర శబ్దచింతామణి' యను పేర సంస్కృత శ్లోకములలో నన్నయభట్టు రచించెననియు దానిని విపులముగా లక్ష్యములతో పద్యరూపముగా రచించితిననియు యప్పకవి చెప్పికొనెను సాధురేఫశకటరేఫ (ర, ఱ) లకు యతి ప్రాస మైత్రుల నప్పకవి యొప్పలేదు. అతనిపూర్వులలో నొకడు (క) అను అక్షరమునకు నూఱు అర్థములు చెప్పుటచే 'కాకునూరు' యని పౌరుషనామముగా యింటి పేర్లువచ్చెనట.

5. యధావాక్కుల నన్నమయ్య:- బ్రాహ్మణుడు. క్రీ.శ.1241 ప్రాంతమున సర్వేశ్వర శతకమును సత్రశాలవద్ద రచించెను.

అభిమాన కవులు

(పల్నాటినిగూర్చి వ్రాసిన యితర ప్రాంతపు కవులు)

1. శ్రీనాధుడు:- జగద్విదిత కవి. పాకనాటి నియోగి బ్రాహ్మణుడు. భారద్వాజస గోత్రుడు. ఇతడు 1384 A. D. ప్రాంతమున జన్మించి 1404 లో వైషధము 1424 లో భీమ ఖండము 1432 లో కాశీఖండము, తరువాత హరవిలాసము ముసలితనములో పల్నాటి వీర చరిత్ర రచించి యుండును. పల్నాటిలో చాలాసార్లు తిరిగి పద్యములు చెప్పుటయేగాక పల్నాటి వీరచరిత్రను ముంజరి ద్విపదగా రచించెరు, నారికురుపుచే బాధపడుచు శోకభారమున నీసుద్దులు చెప్పెనని కొంద రందురు. కొందరీక్రింది కథ కూడ చెప్పెదరు. “వయసునందు స్వేచ్ఛగదిరుగుటచే యొడలు చెడిపోయెను. పల్నాటిలో చెన్న కేశవుని దర్శింపగ వ్యాధి కొంతతగ్గెన.ు కలలో చెన్నకేశవుడు గాన్పించి వీరుల చరిత్రమును వ్రాసి తనకంకితము చేయుమని కోరెను. శ్రీనాధుడు వ్రాయుటకుబూని పూర్తిచేయు సరికి వ్యాధి పూర్తిగ కుదిరెను. పిమ్మట నేకారణముననో మనస్సు చలించి మొదటివలె విషయలోలుడుకాగా చెన్న కేశవుడు కోపించెను. ప్రతిదినము పగలే ప్రత్యక్షమగు నా దేవుడా రోజ తనికి దర్శనమీయక కలలోకన్పించి నీవుపతితుడవైతిని కావున నీ గ్రంధమును గైకొనజాలను. అది మాదిగలపాలౌగాక యని శిపించెను” ఈకధ యెట్లన్నను శ్రీనాధును రచించిన మంజరీ ద్విపద పిచ్చుకుంటలు మాలలు మొదలగువారి యధీవముననే యుండినది, దానిలో యుద్ధభాగమును అక్కిరాజు ఉమాకాంతముగారు ముద్రింపించిరి .

2. కొండయ్య:- శ్రీనాధునిపిమ్మట నితడు ద్విపదకావ్యముగ పల్నాటి వీర చరిత్రను వ్రాసెను. అది అముద్రితము. చెన్నపురి ప్రాచ్యలిఖిత గ్రంథాలయములో కలదు.

3. మల్లన:- ఇతడుకూడ ద్విపద కావ్యముగ పల్నాటి వీర చరిత్రమును వ్రాసెను. ఇదికూడ ముద్రింపబడ లేదు. ఇది కూడ చెన్నపురి ప్రాచ్యలిఖిత గ్రంథాలయములోనే కలదు.

4. ముదిగొండ వీరభద్రకవి:- వీరభాగవతమను పేర కల్నటి వీనికధను పద్యకావ్యముగా క్రీశ 1862 ప్రాంతమున రచించెను. ఇతడు సత్తెనపల్లితాలూకా నందిగామ నివాసి

5. ఏటుకూరి వరసయ్యగారు:- క్షేత్రలక్ష్మి మొదలగు గ్రంధములు రచించెను. గురిజాల హైస్కూలులో కొంత శాలము ఆంధ్రోపాధ్యాయులుగ నుండెను. మగువమాంచాల యను పద్యకావ్యమును రచించెను.