పల్నాటి చరిత్ర/అనుబంధము 1
ర
అనుబంధము 1
శ్రీనాధునిచే రచింపబడిన పల్నాటి వీరచరిత్రలోని
కొన్ని భాగములు.
మం జ రీ ద్వి ప ద
[1]ు సంగమేశ్వరునకు చక్కగా మ్రొక్కి
[2]గుర్జాలగంగను గోరి ప్రార్థించి
భక్తి గోగులపాటి భైరవుదలచి
మాచెర్లచెన్నుని మదిలోనదలచి
చెన్న కేశవపాద సేవారతుండ
శ్రీనాధుడనువాడ శివభ క్తియుతుడ
§§§§ §§§§ §§§§ §§§§
[3]కొమ్మభూమీశుండు గొబ్బునగదలె
మఱ్ఱివేములదాటి మండలేశ్వరుడు
ఘూర్జిల్లురవముతో గుమ్మడంపాడు
చేరియచ్చట నిల్వచిత్తంబువిడిచి
గరికెపాటికివచ్చి కాలూన 'కచట
కంకణంబులపల్లె కడను నాఘనులు
కంకణంబులుకట్టి కదలిరా వేళ
పట్టభద్రులు పైడిపాటికివచ్చి
మేళ్లవాడుననిల్చె మించినదండు
కదనరంగంబున కార్యమపూడి
పుణ్యభూమినిజేరి పొందుగాదండు
అఖిలభూతములకు నాచారముగను
ఘనమైనపోతుల గావుచెల్లించి
[4]తరువాత సర్ఫాఖ్య తటినిలోపలను
పటుగంగధార నాబరగిన మడుగు
పొంతకుజని వీరపుంగవులెల్ల
నిలిపిరి లింగముల్ నేమంబు తోడ
§§§§ §§§§ §§§§ §§§§
[5] సహాయమునకై నలగామరాజు లేఖలుపంపిన కొందఱు రాజులు
మామగుండముకోట మనుజేశునకును
ధరణికోట పురికి దక్షుడైనట్టి
భీమదేవుండను పృథ్వీశునకును
ఉరగసేనుండను యుర్వీశునకున
పెదబాహుభూపతి భీమపేనులకు
సూర్యకుమారాఖ్య చోళ రాజునకును
సుగ్రామ విజయుడౌ జయదేవునకును
జయసింగ నృపతికి చంద్రాధిపతికి
ప్రాథవాఢ్యుడు వీరభల్లాణునకును
§§§§ §§§§ §§§§ §§§§ §§§§
నగరంబు వెల్వడి నలగామరాజు
దక్షిణదిశయందు దనరెడి బయలు
[6]దూబచెర్వనేడు నుత్తుంగభూస్తలిని
నిలిపించే గజములు నిండినవేడ్క
కాశికి సమమైన కార్యమపూడి
రణరుగభూమిని రాజుదానిల్చె
లవిమీఱ వీరభల్లాణుండువచ్చె
నొక వేయి యశ్వాల నొనర ప్రతాప
[7]రుద్రుడు పంపించె రూఢ సంగతిని
ఇరువది వేలతో నేతెంచెనొడ్డె
[8]భువినేలు బలదేవ పురుషోత్తముండు
గుండమదేవుండు గొబ్బూరిరాజు
పద్మసేనుండును పరువిడివచ్చె
(నలగాముని సైన్యమునకు హద్దులు)
[9]జువ్వలకల్లను సొగసైనపల్లె
సన్నెగండ్ల యనంగ జవరనియూరు
తూరుపు దిక్కుకు తుది మేరసుమ్ము
దక్షిణదిశహద్దు దగవివరింతు
నాగులేటికి తూర్పు నలగొండకాని
చెలువైన యా వప్పిచర్ల జెలంగు
పడమటికిని హద్దు బాలచంద్రుండ
కొదమగుండ్లయనెడు గురిగ్రామ మొకటి
ప్రజలమేలిమి చింతపల్లియునొకటి
ఉత్తరదిశ యెల్ల లొయ్యనగాంచు
(నలగాముని సైన్యములోని కొందరు వీరులు)
పొందుగులనేలు భూరి విక్రముడు
వీరమల్లనునట్టి విఖ్యాతుడొకడు
[10]విక్రమసింహంబు వీరకామేంద్రుండు
(బాలచంద్రుని పుట్టుక సందర్భమున)
వైకుంఠ శృంగార వనములోపలను
చెన్నారు అనిమ్మ చెట్టున కేగి
పలకల బావిలోపల నీరు ముంచి
చనిజమ్మి వృక్షంపు సవ్యభాగమున
- ↑ ముసి కృష్ణలో కలియు చోటగల శివలింగమ
- ↑ గురజాలలోగల గంగమ్మగుడి
- ↑ కొమ్మరాజు అలరాజుతండ్రి. క్రీ. శ. 1188 న కల్యాణము
పాలించిన నాలుగవ సోమేశ్వరుని కుమారుడు. - ↑ నాగులేరు.
- ↑ ఈరాజుల కాలమును విపులముగా చర్చించి
అక్కిరాజు ఉమాకాంతముగారు పల్నాటి యుద్ధకాలమును
నిర్ణయించిరి. - ↑ ఈదూబచెరువిప్పటికి గురజాలలో నున్నది.
- ↑
వరంగల్లునేలు కాకతీయ చక్రవర్తి మొదటి ప్రతాపరుద్రుడు. - ↑ ఓఢ్రదేశమునేలు గజపతి
- ↑ జూలకల్లు
- ↑ నలగామరాజు