ఔద____ఔన 323 ఔనౌ___కంక

  • దల యంటి చూచుకొని యే,యిలు వెడలితి నాక్షణంబ యెత్తినభీతిన్." పాండు. 5. 207.

ఔదల లూచి మెచ్చు

  • సెబా సని మెచ్చు. మెచ్చుటలో తల ఊపుటపై ఏర్పడిన పలుకుబడి.
  • "అ,ప్పప్ప యి దౌర యంచు జను లందఱు నౌదల లూచి మెచ్చగన్." హంస. 1. 34.

ఔదల వంచుకొను

  • అవమానముతో - తల వంచు కొను.
  • "ఠీవి నటించెనా దేవలోక పురంభ గొంచక యౌదల వంచుకొనును." రాధి. పీఠిక. 20.

ఔదల వంచుకొన జేయు

  • అవమానపడజేయు.
  • "అసురేంద్రుని ముందట మాకు నౌదలల్, వంచుకొనంగ జేసితిని." భాగ. స్క. 7. 152.
  • చూ. తలవంపులు.

ఔదెంచు

  • అగు.
  • "తడ నౌదెంచె బుళింద రాజ." హర. 7. 59.

ఔ నను

  • సెబా సను, మెచ్చుకొను.
  • "పలికి తుత్ప్రేక్షోపమలు జాతి పెం పెక్క, రసికు లౌనన మదాలస చరిత్ర." ఆము. 1. 13.
  • "మృగీమదం, బడరెడు పట్టుచీర సొగ సౌ నన దాల్చి నృపాలు కేళికిన్ నడచె వధూలలామ..." హంస. 3. 4.

ఔనౌను:

  • ఔనౌను లే; సరే సరే ! నేటికీ వాడుకలో ఉంది.
  • "ఔనౌ నీ పోటును జూతము రమ్మ." కుమా. 12. 20.

ఔరు సౌ రగు

  • చెల్లాచెద రగు.
  • "చీకటి యౌరు సౌరుగా." కాశీ. 1. 125.

ఔ లెండు!

  • సరే.
  • "ఔ లెం డిటు విమర్శ దూర మైన వాకిట వసించు నెవ్వ డన్వారు నగుచు." ఆము. 4. 7.

కంకణబలము కలిసి వచ్చు

  • వివాహమునకు దైవబలము కలిసి వచ్చు. వివాహం దైవికం అన్న భావంతో యేర్పడినపలుకుబడి.
  • "మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే నేం? కంకణబలం కలిసి రావాలి కాని." వా.

కంకణము కట్టు (కొను)

  • ప్రతిజ్ఞ పూను. శుభ కార్యాలలో ఈ కర్తవ్యాన్ని నెరవేరుస్తా నన్న దృష్టితో చేతికి కంకణం కట్టడం అలవాటు. దానిపై వచ్చిన పలుకుబడి.
  • "ముఖ్యవ్రతస్ఫూర్తి ముంజి కట్టెడు వాడె, కవుల బ్రోచుటకు గంకణము కట్టె." పాండు. 1. 41. కంక____కంగ 324 కంగా____కం
  • "కంకణము కట్టుక యుండెడు నిప్పు డర్జునుం, డౌర! రణంబు పెండ్లికొడుకంచు...." విజ. 3. 154.
  • "వాణ్ణి సర్వనాశనం చేయా లని వీడు కంకణము కట్టుకొని కూర్చున్నాడు." వా.
  • "వా ణ్ణెలా గైనా పైకి తేవా లని నేను కంకణం కట్టుకొన్నాను." వా.

కంకణములు కట్టు

  • దీక్ష పట్టు. ఏ వైదిక - శుభకార్యాని కైనా ముందు దీక్షాకంకణం కట్టుకొనుట ఆచారం అందుపై ఏర్పడిన పలుకుబడి.
  • "కట్టుగ్రతతుల కంకణములు గట్టి, బౌద్ధు నుక్కడచు, వెరవ తలంచుచు." పండితా. ద్వితీ. మహి. పుట. 9.
  • చూ. కంకణము కట్టు.

కంకరగాడిద

  • కంచరగాడిద. బరు వైనపనులు చేయునది.
  • "గాడిదల్ సెడదన్ను కంకరగాడిదల్." సానం. 2. 8.

కంకురుకుంకలు

  • ఒక తిట్టు.
  • "కంకురుకుంక లైనపలుగాకి కలార్థుల కిట్లు." పాణి. 1. 18.

కంకులు పెట్టు

  • నిందించు.బ్రౌను.

కంగనాడు

  • వంచించు, అబద్ధ మాడు.
  • "బంగారు మెరుగుచాయ పడ నొక్కతె గూడి, కంగనాడేవు నాతో కానియ్యరా." తాళ్ల. సం. 3. 51.

కంగా బింగా

  • నలిగీ నలగనట్లుగా, తొందరగా. 'ఆ మిరియాలు కంగాబింగా నమలి మింగు'. 'వాడు కంగా బింగా రెండు మెతుకలు తిని రైలుకు పోయినాడు' వగైరా. వావిళ్ళ.

కంగారు పడు

  • ఆందోళన చెందు.
  • "ఉత్తరం వచ్చిం దనగానే అతను చాలా కంగారు పడ్డాడు." వా.

కంగారెత్తు

  • భయసంభ్రాంతి కలుగు.
  • "ఆ వీధిలో వాళ్ల నాన్న కనిపించే సరికి కంగా రెత్తి పోయాడు." వా.

కంచంతకాపురము

  • మిక్కిలి పెద్దది. కంచి + అంత కాపురము. కంచి ఆ నాళ్ళలో ఉన్న మహానగరాలలో ఒకటి. ఏడువాడల ఊరు. దానిమీద వచ్చినపలుకుబడి.
  • "కాపు గోడలు కంచంత కాపురంబు...గాడ్పఱచి యుఱికె." పాండు. 3. 80.
  • "......వింటను జొచ్చిన దేమి చెప్పు కం, చంతటికాపురంబు సతు లౌ నన జేసెదు జాతి నీతి..." తారా. 3. 66. కంచ______కంచ 325 కంచ_____కంచి

కంచ మరసి పెట్టు

  • కావలసినంత భోజనము పెట్టు - కడుపార అనుట.
  • "ఓ మగువ యతని కన్నము, ప్రేమంబున గంచ మరసి పెట్టుము దినమున్." శుక. 3. 360.
  • చూ. కడుపు చూచి పెట్టు.

కంచము కాల దన్ను

  • ఆదరముతో పెట్టీనదానిని తిరస్కరించు.
  • "పెంచేటి తల్లి దండ్రులు ప్రియ మై వడ్డించ గాను, కంచము కాలదన్న సంగతి యా బిడ్డలకు." తాళ్ల. సం. 8. 20.
  • "అతను ఆదరించి పిల్ల నిస్తా నంటే తిరస్కరించడం ఏం పనిరా? కంచం కాల దన్నిపోతే కడి పుట్ట దంటారు పెద్దలు." వా.

కంచముచెంత పిల్లి

  • సమయంకోసం వేచి ఉన్న వాడు - వేచి ఉన్నది. ఎప్పు డింత పడవేస్తారా అని కంచందగ్గర పిల్లి కాచుకొని ఉండుటపై వచ్చినపలుకుబడి.
  • "అత డది యాది గాగ నయ్యబల మగని, మొఱగి చా వడిలో నిల్చి మొగము సూపు, జిన్నలకు లోగు గంచంబు చెంతపిల్లి, కరణి నెదురింటి వాకిట గాచి యుండు." శుక. 2. 181.

కంచము పొత్తు

  • సపంక్తిభోజనము.
  • "కలయ మోనితేనె లొసగు కంచము పొత్తు లెన్నండె." తాళ్ల. సం. 3. 597.
  • "సమానులతో తప్పా కంచంపొత్తూ మంచంపొత్తూ పనికి రాదు." వా.

కంచములోపలి రాయి

  • అనుభవింప నుండగా అడ్డు పడునది.
  • "చంద్రికాపాయి కంచంబులోపలి రాయి, కౌశికావళికి గన్మూసిగంత." చమ. 3. 39.

కంచరగాడిద

  • ఒక తిట్టు. బల మున్నా పని చేయ లేని పనికి మాలిన వాడు.
  • "వాడు వట్టి కంచరగాడిద. ఇంకెవర్నైనా పంపండి. వా డేం చేసుకొస్తాడు?" వా.

కంచిగరుడసేవ

  • దండుగ. కంచిలో గరుడోత్సవాని కని పోయి జనసమ్మర్దంవల్ల దైవ దర్శనం చేసుకోకనే వత్తు రనుటపై వచ్చినపలుకుబడి.
  • "ఊరికే వెళ్లా మన్న మాటే కాని పని కాలేదు పాటా కాలేదు. వట్టి కంచి గరుడసేవ అయిపోయింది." వా.

కంచిమేక

  • పెద్దపొదుగు గల ఒకరక మైన మేక. ఎక్కువ పాలిస్తుం దంటారు.

కంచియే!

  • దూరమా ! కంచి ఆంధ్రదేశం సరిహద్దు కంచు____కంచు 326 కంచు___కంచు

లో నున్నది. కావున దూరంగా భావింపబడేది. కథ కంచికి వెళ్లుట కూడా దానిపై వచ్చినదే.

  • "కంచియే పడుకిల్లు." విజయ. 3. 200.

కంచుకాగడా వెలిగించి చూచినా

  • ఎంత వెదకినా కనబడ దనే అర్థంలో ఉపయోగించే పలుకుబడి. కంచుకాగడా ఎక్కువ వెలుగు నిస్తుంది.
  • "కంచుకాగడ వెలిగించి కనిన గాని, వలపు కన్పట్టునే వారవనితలకును." శ్రవ. 4. 51.
  • "కంచుకాగడా వేసి చూచినా వానిలో దయాదాక్షిణ్యం కనిపించదు." వా.

కంచుకుత్తుక

  • హెచ్చుస్థాయిలో పలికే కంఠము.
  • కంచు ఖణేలు మంటుంది.
  • "కంచు గుత్తుకలవారి గానముల జొక్కి చిక్కి, కంచుబెంచు నాయె బో నాకడలేనిగుణము." తాళ్ల. సం. 5. 226.
  • రూ. కంచుగొంతు.

కంచుకొమ్ము

  • రాజులు - దేవతలు బయలు వెడలినప్పుడు కొమ్ము పట్టుట ఆచారం. ఆ కొమ్మును కంచుతో చేసి ఉంటారు.
  • "ముందటను గంచుకొమ్ము మిన్నంది మొరయ." వై. జ. 4. 78.

కంచు గీసిన ట్లుండు

  • ఖణేలు మను.
  • "ఆపిల్ల గొంతెత్తితే కంచు గీసినట్లే." వా.

కంచుపదను

  • చాలా పెళుసు. ఏయింత కయినా విఱిగి పోవు ననుట. కంచు చాలా పెళు సైన లోహము.
  • "...ఎం, తని వచియింతు గంచుపద నా చెలి నెమ్మన మెంచ నుద్ధవా!" రాధా. 2. 19.

కంచు పెంచు నగు

  • విఱిగిపోవు.
  • "కంచు గుత్తుకలవారి గానముల జొక్కి చొక్కి, కంచు బెంచు నాయెబో నా కడలేనిగుణము." తాళ్ల. సం. 5. 226.

కంచు మించగు

  • చెల్లాచెద రగు. ముక్కలు ముక్క లగు. కంచు చాలా పెళు సైన లోహం. కొంచెం దెబ్బ తగిలినా ముక్కలు ముక్క లై పోతుంది.
  • "కాక మించుల వినుమానికంపు జోదు, మంచుగమి గంచుమించు గావించుకరణి..." వసు.
  • "కంచుమిం చై పాఱ గ్రమ్మఱ జేరు." రంగ. అరణ్య. 172 పు. కంచు___కంట 327 కంట____కంట

కంచుమించుగ

  • చెల్లాచెదరుగా.
  • "కంచుమించుగ నడవి మెకముల గదుము నివిగో బలు సివంగులు." శుక. 1. 222.
  • "కంచుమించుగ ధరణి గ్రక్కదల." సా. 1. 83.

కంచురాయి

  • శబ్దించే ఒకవిధ మైనరాయి. బ్రౌను.

కంచెకోట

  • కంచెగా కట్టినకోట; హద్దు; రక్షకము.
  • చూ. కంచెగోడ.

కంచెగోడ

  • చూ. కంచెకోట.

కంజాయింపుగా

  • మంచి వసతిగా. అన్నీ అమరి ఉన్న వనుట.
  • "వారి యిల్లు మంచి కంజాయింపుగా ఉన్నది." వావిళ్ళ.

కంటక మగు

  • సరిపడని దగు, విరుద్ధ మగు.
  • "ఇంట భుజించితిం గడగి యింటికి జేటు బొనర్చితిం దుదిం, గంటక మైతి నీమదికి గాసి ఘటించితి..." త్రిశంకుస్వర్గం. అం. 7. 82 పే.
  • "నేనంటే వాడికి కంటక మయి పోయింది. ఎందుకో మఱి?" వా.

కంటక మాడు

  • పరుషము లాడు.
  • "అఱిమినను జివురునకు నగునె కంటక మాడ." మను. 3. 84.

కంటకములు పల్కు

  • మనసు నొచ్చునట్లు మాట్లాడు, దూషించు.
  • "కంటకంబులు పల్కు గా కేమి దీన." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 200.

కంటకురాలు

  • క్రూరురాలు. కంటకము వంటిది.
  • "ఆ, కంటకురాలు పల్కిన వికారపు మాటలు." నిరంకు. 3. 3.

కంట తడి బెట్టు

  • దు:ఖించు.
  • "వాళ్ల యింటాయనను తలచుకొని తలచుకొని ఆవిడ కంట తడిబెట్టు కొంటుంది." వా.
  • రూ. కంట తడివెట్టు.

కంటద్దాలు

  • సులోచనాలు.
  • "కంటాద్దా లుంటేనే గానీ అత నో అక్షరం చదవ లేడు." వా.

కంటను వత్తి పెట్టుకొని

  • అతిశ్రద్ధగా, ఎల్ల వేళల.
  • "బ్రహ్మ మిత్రుండు శి,ష్యులకున్ గంటను వత్తి బెట్టుకొని యాయుర్వేద మోరంత ప్రొ,ద్దుల జెప్పన్ వినుచుండి." మను. 5. 7.
  • కనులు మూతలు పడు నేమో యని వత్తులు వేసికొని యనుట. వాడుకలో నేటికీ ఉన్నది.
  • "కంట వత్తి పెట్టుకొని ఆమె ఆ రోగికి సేవ చేసింది." వా.
  • చూ. కంట వత్తిడుకొని. కంట____కంట 328 కంట____కంటి

కంటపడిన...

  • కనిపించిన ప్రతిదానికీ, ప్రతి వానికీ అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "ఆత్మజాత నొసంగు డనుచు దేవుం డని, యేకంట బడురాతి కెల్ల మ్రొక్కె." కువల. 3. 65.
  • "కంటపడినవాణ్ణల్లా పలకరిస్తూ ఉంటే మన మీ రోజు ఇల్లు చేరుకున్న ట్లే." వా.

కంటపడు

  • 1. కనపడు.
  • "వా డీమధ్య నాకు కంటపడ్డం అపురూప మై పోయింది." వా.
  • 2. కంటి కాను.
  • "వాడికి నీవూ నేనూ యిప్పుడు కంట పడతామా?" వా.

కంట పిడుక బ్రాము

  • మోసగించు, కంట దుమ్ము కొట్టు.
  • "నేటిరాత్రి, కంట బిడుక బ్రామిగర్వంబు గిర్వంబు, నుడుప నైతినేని నొట్టు వెట్టు." దశా. 6. 69. దశ. 6. 54.
  • చూ. కంటిలో దుమ్ము కొట్టు.

కంట పిడకలు గట్టు

  • నానాబాధలు పెట్టు. మోసగించు.
  • "అచ్చుగా దీర్తు మీయ ప్పని కొన్ని, యచ్చిక బుచ్చిక లాడి పత్రములు, గెంటక యిచ్చి యాక్రియ నూఱు వేలు, కంట బిడ్కలు గట్టి కైకొని పిదప." గౌర. హరి. ద్వితీ. పంక్తి. 638.
  • చూ. కంట పిడుక బ్రాము.

కంట వత్తిడుకొని

  • మిక్కిలు శ్రద్ధగా
  • "కంట వత్తిడుకొని సైరిక ప్రభుండు." పాండు. 3. 56.
  • చూ. కంటను వత్తి పెట్టుకొని.

కంటస పడు

  • కోపపడు. కుమారీ. శత. 38.

కంటసరి

  • మెడలో వేసుకునే ఆభరణము. కంటెసరి అని నేటివాడుక.

కంటికసవు

  • కంటిలోని నలుసు మెఱమెఱ లాడుతూ బాధ కలిగిస్తుంది. అట్లే అనుక్షణబాధాకరుడు, భయంకరుడు అనుట.
  • "బ్రహ్మవాదుల కంటికసవు." పండితా. ప్రథ. వాద. పుట. 511.
  • చూ. రొమ్ముగూటము.

కంటి కాగు

  • కంటి కానూ తగుపాటి మనిషిగా కానవచ్చు.
  • "ఈమాత్రం ఆమాత్రం మనిషి వాడి కంటి కాగేట్టు లేడు." వా.
  • చూ. కంటి కాను.

కంటి కాను

  • ప్రియ మగు. తగినంత గొప్పగా కనబడు. కంటి____కంటి 329 కంటి____కంటి
  • "ఆ మాత్ర మైనా లేకపోతే కంటి కానదు." వా.
  • "మనం కాస్త దెబ్బ తిన్నామా? ఇప్పుడు వాడికి కంటి కానడం లేదు." వా. చూ. కంటి కాగు.

కంటి కింపగు

  • ప్రియ మగు.
  • "అంతకంటెను గంటికి నింపైన వాలు గంటిం గంటిన్." కళా. 5. 116.

కంటి కింపిత మైతే వంటి కింపిత మవుతుంది

  • ప్రతిదీ అందంగా ఉండా లనే పట్ల ఉపయోగించేపలుకుబడి.
  • "ఎన్ని పెడితే నేం? కాస్త ఇల్లూ, పాత్రలూ శుభ్రంగా ఉండక పోతే. కంటి కింపిత మైతేనే వంటి కింపిత మవుతుంది." వా.

కంటి కిం పైన

  • మనోహర మైన.
  • "కంటి కింపైన వన్నీ కావా లంటే ఎక్కడనుంచి వస్తాయి." వా.

కంటికి కంటకించు

  • చూడ లేక పోవు; అసూయ కలుగు.
  • "...గందవొడిలోపల బూరుగు వట్టి నట్టు లి,ద్దఱ కొక సౌఖ్య మబ్బినను దైవము కంటికి గంటకించెనో." తారా. 4. 58.

కంటికి కడవెడుగా ఏడ్చు

  • విపరీతముగా దు:ఖించు.
  • "కంటికి గడవెడు గాగ నేడ్చుచును." పల.పు. 99.

కంటికి కడవెడునీళ్ళుగా

  • ఎక్కువగా దు:ఖించె ననుట.
  • "పాపం! ఆపిల్ల కంటికి కడివెడు నీళ్లుగా యేడుస్తూ కూర్చుంది. ఉన్న కాస్త ఆదరవూ పోతే ఏం చేస్తుంది పాపం!" వా.

కంటికి కమికెడు కావర ముండు

  • చాలా పొగ రెక్కి యుండు అన్న సందర్భంలో ఉపయోగిస్తారు.
  • "వాడికి కంటికి కమికెడు కావరం ఉంది. ఒకడు చెబితే వింటాడా?" వా.

కంటికి దిసింతురె

  • లక్ష్య మగుదురా? దృష్టి + ఉంచు - దిసించు అయి ఉంటుంది.
  • "కాపు లచ్చెరుపడ నాదుకంటికి దిసిం తురె వీ రని యాత డుబ్బునన్." శుక. 2. 439.
  • "ఒకింత నవ్వినన్, వెనుక దిసించి చూడ రవనిన్ మగవారల నమ్మరాదు." శృంగారసావిత్రి.
  • "కులుకు జెక్కులు పసిడియాకుల దిసింపడ, జిన్నికుచములు పోకల చెన్నుమీఱ." ముకుందవిలాసము.
  • "నీకు వా డికలక్ష్యమా?" వా.
  • "నాకంటికి వా రాగరు." వా.
  • "వాడి కంతికి మన మిప్పుడు కనబడతామా?" వా.
  • ఇలా వాడుకలో రకరకాల మారే పలుకుబడి రూపాంతరమే యిది. కంటి____కంటి 330 కంటి____కంటి

కంటికి నిదుర రాదు

  • నిద్ర పట్టదు; మనశ్శాంతి లేదు.
  • "నిముస మైనను నాదుకంటికి నిదుర రాదు." సుగ్రీ. పు. 11.
  • "వాడు ఛస్తే గానీ నా కంటికి నిద్ర రాదు." వా.

కంటికి నిదుర వచ్చు

  • మనశ్శాంతి యేర్పడు.
  • "నా కంటికి, నిదుర వచ్చు నేడు నీరజాక్ష!" భార. కర్ణ. 3. 390.
  • "ఈ యీడువచ్చినపిల్లకు పెళ్ళయితేనే నాకంటికి నిద్ర వస్తుంది." వా.

కంటికి పంటెడునీళ్లుగా ఏడ్చు

  • ఎక్కువగా ఏడ్చు. మానినీ. 49.

కంటికి పుట్టెడుగా ఏడ్చు

  • ఎక్కువగా విలపించు.
  • "ఎన్నా ళ్లయినా కొడుకు రాకపోయే సరికి ఆవిడకంటికి పుట్టెడుగా యేడుస్తూ కూర్చుంది." వా.

కంటికి ప్రియ మగు

  • కంటి కిం పగు, మనోహర మగు.
  • "పర పురుష భోగాయత్తచిత్త లగుటం గ్రందుకొను సందడిం బడి కంటికిం బ్రియ మైనవానిం గామించియు..." శుక. 2. 10.

కంటికి భార మగు

  • చూడ లేక పోవు.
  • "ఇపుడు విధికంటి కకట! మే మింత భార,మైతిమే యంచు దలపోసి యలమటించు." నలచ. 5. 145.

కంటికి ఱెప్పచందమున

  • మిక్కిలి జాగ్రత్తగా కాపాడు పట్ల ఉపయోగించు పలుకుబడి.
  • కంటిని ఱెప్ప కాపాడినంత జాగరూకతతో అనుట. చందమునకు బదులు ఉపమానార్థకాలు అన్నిటితోనూ ఇది ఉపయుక్త మవుతుంది.
  • "...పాండురాజసుతు లేవురు గంటికి రెప్ప చంద మై, హరి తము గావగా వెలసి రక్షతదేహవిలాససంపదం." భార. శల్య. 1. 54.

కంటికి ఱెప్పవలె

  • ఇది నేటికీ వాడుకలో ఉన్నది.
  • "న న్నెప్పు డెడ సనక కంటికి, ఱెప్ప వలెం గాచి తిరుగు రేయిం బవలున్." శుక. 1. 389.
  • "అన్న పోయినప్పటినుంచీ తమ్ముడు ఆ పిల్లలను కంటికి రెప్పలాగా చూచుకుంటూ వస్తున్నాడు. వా.
  • చూ. కంటికి ఱెప్పచందము.

కంటికీ మంటికీ ఏకధారగా

  • నిరంతరాశ్రు పాతంగా
  • "కంటికి మంటికి నేకధారగా కంటి నీళ్లు కురిపించాను." ని.

కంటి తడి యార లేదు

  • ఇంకా దు:ఖోపశమనము పూర్తిగా కాలేదు. ఏడువగా చిప్పిల్లిన కంటి నీళ్లింకా ఆరిపోయేంత సావకాశం కూడా లే దనుట. కంటి____కంటి 331 కంటి____కంటి
  • "మొగుడు పోయి మూడునెలలు కాలేదు. ఆ కంటి తడి యారక ముందే పిల్లవాడికి జబ్బు చేసింది." వా

కంటినొప్పి

  • పీడ, బాధకము. కంటిబాధ భరింపరాని దన్న దానిపై వచ్చినపలుకుబడి.
  • "కాసరంబులపాలిటి కంటినొప్పి." శుక. 2. 283.

కంటి ముంటి పడినా

  • ఎంత అవస్థ పడినా, ఎంత గింజుకొన్నా.
  • "తనకును గంటి ముంటి పడినం బడు టింతయ కాని సొమ్ము రా, దని మహి భర్తకుం దెలిపి య్ంపుము నీ వని యంపె నాతడున్." పరమయో. 4. 148.

కంటిలో కన్ను పెట్టుకొని చూచు. అతిజాగ్రత్తగా పరిశీలించు - చూచు.

  • "కంటిలో కన్ను పెట్టుకొని చూచినా అచ్చుతప్పు లేవో మిగిలిపోయినవి." వా.

కంటిలో కలికానికి లేదు.

  • బొత్తిగా లేదు. కలికం కంటికి వేసేమిరియాల గింజవంటి వాని గంధం. అది ఏ కాస్త అయినా చాలు. ఆ యింతకు కూడా లే దనుట.
  • "ఇంట్లో చక్కెర కంటిలో కలికానికి కూడా లేదు. ఇప్పుడు తెస్తే గానీ రేపు కాఫీ ఉండదు." వా.
  • చూ. మందుకు లేదు.

కంటిలో కారము చల్లు

  • మోసగించు.
  • చూ. కంటిలో మిరపపొడి చల్లు.

కంటిలో కొరవెండ్రుక

  • కంటిలో నలుసు.
  • "కంటిలో గొరవెండ్రుకయు రచ్చ మఱ్ఱిని..." హంస. 5. 109.
  • చూ. కంటిలోని నలుసు.

కంటిలో దూరు

  • కంటి కాను.
  • "నీకు ఇప్పుడు చుట్టాలూ పక్కాలూ కంటిలో దూరడం లేదు." వా.
  • చూ. కంటి కాగు.

కంటిలో నలు సై పోవు.

  • కనబడుట అరు దగు.
  • "ఈ మధ్య కంట్లో నలు పై పోయావేం?" వా.

కంటిలోని నలుసు (నెరసు)

  • ఎక్కువ బాధించునది.
  • "కంటిలోని నలుసు కాలిముల్లు." వేమన.
  • "వా డా ఊళ్ళో కంటిలోని నలుసై కూర్చున్నాడు." వా.
  • "వాడు కంటిలోని నలుసుగా తయారయ్యాడు." వా.

కంటిలోని నెరసువలె

  • మెఱ మెఱ లాడుతూ; మిక్కిలి బాధిస్తూ...
  • "...పుష్కరుసేత యుల్లమం, దున్నది కంటిలోన నెర సున్నవిధంబున..." నలచ. 6. 260.
  • చూ. కంటిలోని నలుసు. కంటి____కంటు 332 కంటు____కంఠ

కంటిలో నిప్పులు పోసుకొను

  • ఓర్వలేక పోవు, అసూయపడు.
  • "కాస్త మంచి చీర కట్టుకొంటే ఆవిడ కంట్లో నిప్పులు పోసుకొంటుంది." వా.

కంటిలో పడు

  • తగినంత మంచిస్థితిలో ఉండు, గుర్తింపబడు. 'కంటిలో పడతామా?' 'పడము' అన్నట్లు వ్యతిరేకార్థంలోనే ప్రచురం.
  • "మే మంతా నీ కిప్పుడు కంట్లో పడతామా? ను వ్వేమో పై అంతస్తులో ఉంటివి. మే మేమో మా మూలు మనుషుల మై పోతిమి." వా.

కంటిలో మిరపపొడి చల్లు

  • మోసము చేయు, కన్ను గప్పు.
  • "నా కంటిలోనే మిరప్పొడి చల్లా లని ప్రయత్నించాడు." వా.
  • చూ. కంటిలో కారము చల్లు. కంట్లో...

కంటు గట్టు

  • విరోధము పూను, పగ పట్టు
  • "వాడు నామీద కంటు గట్టాడు. నన్ను సర్వనాశనం చేసేదాకా వదలడట. అదీ చూదాం." వా.

కంటువడు

  • విరోధము గొను.
  • "మింట నుండి కంట బడి కంటు వడు గరిసున కిట్లనియె."భాగ. 10. పూ. 153.
  • వాడుకలో రూపం:
  • "వాడికి నామీద కంటుగా ఉంది." వా.
  • ఇందులోని 'కంటు' ఇదే.

కంటు వాయు

  • పగ దీరు.
  • "అరిది శ్రీ వేంకఋఏశు డల మేలుమంగ గూడి, గరుడనిమీద నెక్కి కంటు వాయ నే సెను." తాళ్ల. సణ్. 6. 107.

కంటు వుట్టగ

  • కంటకముగా; ద్వేష మేర్పడు నట్లు.
  • "బంటు నాడినయట్లు పదుగురు వినగ కంటు పుట్టగ బలుకగ నోర్వలేక." వర. రా. యు. పు. 64. పంక్తి. 10.

కంటె బొట్టు వేయు

  • తాళి కట్టు, వివాహ మాడు. బ్రౌను.

కంట్లో కారం చల్లు

  • మోసము చేయు.<.big>
  • "నా కంట్లో కారం చల్లా లని ప్రయత్నం చేశాడు. కానీ నేను ముందుగానే జాగ్రత్త పడడంవల్ల వాడిపాచిక ఏమీ పార లేదు." వా.
  • "ఆవిడ మొగుడికంట్లో కారంచల్లి ఊరంతా చక్క బెట్టుతూ ఉండి." వా.
  • చూ. కంటిలో మిరపపొడి చల్లు
  • కంటిలో కారముచల్లు.

కంఠంలో ప్రాణ మున్నంత వరకూ

  • తుదిదాకా. ఎప్పటికీ నే నిందుకు అంగీకరించను - పాల్పడను అను పట్టుల ఉపయోగించే పలుకుబడి.
  • "నా కంఠంలో ప్రాణం ఉన్నంత కంఠ____కంఠ 333 కంఠ____కండ

వరకూ ఒకతిని దేహి అని యాచించను." వా.

  • రూ. గొంతులో ప్రాణ మున్నంతవరకూ.

కంఠ గతప్రాణంగా

  • కొన ఊపిరితో.
  • "వా డిప్పుడు కంఠగతప్రాణంగా ఉన్నాడు." వా.

కంఠగతప్రాణ మగు

  • ప్రాణాపాయస్థితిలో నుండు. కొన ఊపిరితో నుండు.
  • "ఇట్లు క్షుధాతురత్వంబున గంఠగత ప్రాణం బై నోరం దడి లేక..." హంస. 1. 192.

కంఠపాఠంగా

  • కంఠోక్తిగా, నోటికిబాగా.
  • "వాడికి ఆ కావ్య మంతా కంఠ పాఠంగా వచ్చు." వా.
  • రూ. కంఠాపాఠం
  • రూ. కంఠోపాఠం.

కంఠము తడుపుకొను

  • దాహము తీర్చుకొను.
  • "తత్కూప తటస్థితి ద్రోణికాగ్రంబున నున్న, యల్పజలంబులం దనకంఠంబు దడిపికొని...." హంస. 1. 192.
  • రూ. గొంతు తడుపుకొను.

కంఠశోష

  • చెప్పడం వ్యర్థము.
  • "వాడికి నీ వెంత చెప్పినా వట్టి కంఠశోషే కాని ఏంఈ లాభం లేదు." వా.

కంఠస్థం

  • కంఠోక్తిగా వచ్చును, నోటికి వచ్చును.
  • "వాడికి ఆ కావ్య మంతా కంఠస్థం." వా.

కంఠస్నానము

  • తల తడుపుకొనకుండా చేయు స్నానము.
  • "వైద్యుడు ఈరోజు కంఠస్నానం చేయ మనీ, రెండుమూడు రోజులు తాళి జ్వరం రాకుంటే శిరస్స్నానం చేయమనీ చెప్పాడు." వా.
  • చూ. శిరస్స్నానం.

కంఠేకాలుడు

  • ఈశ్వరుడు. గొంతుపై నలున్న వాడు గనుక.

కంఠోపాఠం.

  • చూ. కంఠపాఠం.

కండకన్నులవాడు

  • కండకావరము కలవాడు.
  • "కండకన్నులవాని నాకటను బండ, తిట్ల బేతాళికల సారె దిట్టువాని." ఆము. 6. 20.

కండకావరము

  • కండక్రొవ్వు; పొగరు.
  • "కానిమ్ము నీ కండకావర మ్మడతు." ద్వి. సారం. 1. 31.
  • "వాని కెంత కండకావరమో? నీళ్లకు పోయే పిల్లలపై చిల్లరరాళ్లు వేస్తున్నాడట." వా.

కండక్రొవ్వు

  • కండకావరము; పొగరు.
  • "కండక్రొవ్వున గన్ను గానక పెక్కు, దుండగంబులు ప్రేలి త్రుళ్లు గా కేమి?" ద్వి. జగ. పు. 170.

కండ గట్టుకొను

  • బలియు. కండ____కండ 334 కండ____కండ
  • "కండ గట్టుకొంటివా వేంకటరమణుడ దీన,బండు సేసి తిది నన్ను బాపురా లోకానకు." తాళ్ల. సం. 12.62.

కండచక్కెర

  • కలకండ, పటికబెల్లం.
  • "కలికి నీ నెమ్మోని కండచక్కెర." కృష్ణ. శకుం. 3. 48.

కండతుండములుగా

  • ముక్కలు ముక్కలుగా. జం.
  • "ఒంటి వచ్చినవాని గెంటి పోవగ నీక నఱకుండు కండతుండములు గాగ." జైమి. 8. 94.

కండపట్టు

  • లా వగు.
  • ఇది వాడుకలోను 'కాస్త ఆపిల్ల పండపట్టింది (పెట్టింది)' అనేరూపంళో వినబడుతుంది.
  • "ఇవ్విధంబున మెలగు నయ్యింతి యొంటి, తిండికతమున నినుమడి కండపట్టి." శుక. 3. 348.
  • "ఏమోయ్! ఈ మధ్య కాస్త కండ పట్టావే." వా.

కండ పెట్టు

  • బలియు, మదించు.
  • "వాడీ కీ మధ్య కాస్త కండపెట్టింది." వా.
  • "ఓహో! వాడి కేదో కాస్త కండపెట్టినట్టుందే. ఏదో తెగవాగుతున్నాడట." వా.

కండపొదుగు

  • పాలు లేనిపొదుగు.
  • "ఎంత పొదు గుంటే నేం? అది వట్టి కండపొదుగు." వా.

కండ మెం డగు

  • క్రొవ్వెక్కు.
  • "బిడ్డపాపల గని పెంచు జడ్డు లేక తిండిచే గండ మెం డైనదండికతన." హంస. 1. 214.

కండలు కరగునట్లు

  • ఎక్కువగా కష్టించి...
  • "వాడు కండలు కరిగేటట్టు పనిచేస్తాడు. అయినా కడుపుకు చాలడం లేదు." వా.
  • "కండలు కరిగేటట్టు పని చేయడం తప్పితే ఒక సుఖమా ఒక యిదా?" వా.

కండలు కోసి యైన నిచ్చు

  • ఎంత త్యాగమున కైనా సిద్ధపడు. తన సర్వస్వాన్నీ ధారవోయు అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "సఖుడు సంబంధి శిష్యుండు సవ్యసాచి నాకు నతనికి నై యేను నరవరేణ్య కూర్మిమై నిత్తు గండలు గోసి యైన నరయ నాతండు నాయెడ నట్టివాడ." భార. భీష్మ. 3. 283.
  • "అమాయకు లైన పల్లెటూరి వాళ్ళు నమ్మితే కండలు కోసైనా ఇవ్వడానికి సిద్ధపడతారు." వా.

కండలు పెంచుకొను

  • సోమరితనముతో నిర్వ్య పారిగా ఉండు.
  • "అట్లా తిని కండలు పెంచుకోక పోతే కాస్త యింట్లో పనైనా చూచుకుంటే తప్పటరా?" వా. కండ____కండ్ల 335 కండ్ల____కండ్లు

కండ లురలు

  • శరీరమునుండి కండ లూడి పడు.
  • "కండలురులగ గడుదుల జెండె నొకడు." శుక. 1. 263.

కండెవట్టు

  • ఇలుకుపట్టు; వంచ వీలు కానిదగు.
  • "బాహానాళంబు కండె వట్టిన." సాంబో. 3. 128.

కండవడము

  • కాండపటము, తెర. కనపడకుండా కట్టునది.
  • "బెదరుచు నంతరంగమున భీతికి గండవడంబు సుట్టి పల్కెదు..." కుమా. 4. 58.
  • "ననిచిన కల్పవల్లి మదనాగ గతిన్ నడపాడ జొచ్చెనో, యన జనుదెంచె గండవడ మల్లన వెల్వడి బాలికాలితో, ఘనపటలంబు వెల్వడువికాసితతారక సంభృ తేందులే, ఖనయము గ్రేణి సేయుదు నగప్రియనందన చెన్ను వింత గాన్." కుమా. 9. 20.

కండోలవీణ

  • చండాలవల్లకి. ఒక రక మైనవీణ.

కండ్ల కావరం

  • పొగరు.
  • "వాడికి కండ్లకావరం ఎక్కు వయింది. కనిపించినపిల్ల నంతా కన్ను గీటుతున్నా డట." వా.

కండ్ల కు కట్టినట్టు

  • 1. ప్రస్ఫుటంగా.
  • "తిరుపతిజాతరలో తెల్లవారుజాము న్నే గంగమ్మను తీస్తారు. మైలు దూరం నుంచి చూచినా కండ్లకు కట్టినట్టు కనబడుతుంది." వా.
  • "వెయ్యి మందిలో ఉన్నా వాడూ, వాడి వేషం కండ్లకు కట్టినట్టు కనిపిస్తాడు." వా.
  • 2. మఱచిపోకుండా.
  • "ఆనాటి సంబరం ఇంకా కండ్లకు కట్టినట్టుగా ఉంది." వా.

కండ్ల కు పొర లడ్డు వచ్చు

  • 1. కొ వ్వెక్కు.
  • "వాడికి కండ్లకు పొర లడ్డం వచ్చాయి." వా.
  • 2. ఒక రోగము వచ్చు.
  • "ముసలితనం వచ్చేసరికి వాని కండ్లకు పొర లడ్డం వచ్చాయి." వా.

కండ్లు తెరచు

  • ప్రపంచజ్ఞానం కొద్దిగా తెలియు; జ్ఞానోదయ మగు.
  • "వాడు మొన్న పుట్టి నిన్న కండ్లు తెరిచాడు. నన్నేదో తప్పు పట్ట బోతాడు." వా.
  • "వా డిప్పుడిప్పుడే కండ్లు తెరుస్తున్నాడు." వా.

కండ్లు తెరవని

  • వయసు చాలని, అనుభవము లేని.
  • "వాడు కండ్లు తెరవనివాడు. వాణ్ణి కట్టుకొని మన మేం చెయ్యగలం?" వా.

కండ్లు తేలవేయు

  • ఏమీ చేయ లే నన్నట్లు సూచించు, తెలివి తప్పిపోవు. కండ్ల____కంద 336 కంద____కందా
  • "ఏమిరా డబ్బేం చేశా వంటే కళ్లు తేలవేశాడు." వా.
  • "వాణ్ణి పట్టుకొని నాలుగు ఉతికేసరికి కండ్లు తేలవేశాడు." వా.
  • మూర్ఛ పోవునప్పుడు కండ్లు తేలిపోవుటపై వచ్చినపలుకుబడి.

కండ్లతో చూడ లేదు.

  • ప్రత్యక్షంగా చూడ లేదు.
  • "అందరూ అంటున్న మాటే నే నన్నాను. నే నయితే కండ్లతో చూడ లేదు." వా.
  • "అన్నెం పున్నెం దైవాని కెరుక. అందరూ అనడమే కానీ నే నైతే కండ్లతో చూడ లేదు." వా.

కండ్లతో చూడ లేము!

  • 1. అదేదో అతిమనోహరము.
  • "మైసూరు రాజభవనం దసరాలో విద్యుద్దీపాలతో ధగధగ మెరిసి పోతుంటుంది. ఆ వైభవం కండ్లతో చూడ లేము!"
  • 2. అదేదో అతిబాధాకరము.
  • "వాడు కడుపునొప్పితో పడేబాధ కంద్లతో చూడ లేము!" వా.

కండ్లలో కారం పోసుకొను

  • అసూయపడు.
  • "ఎవరు కాస్త పచ్చగా కనబడినా వాడు కండ్లల్లో కారం పోసుకుంటాడు." వా.

కండ్లలో వత్తులు వేసుకొని

  • చూ. కంట వత్తి నిడుకొని.

కందదుంపకు పానకము

  • వ్యర్థము. కందను పానకంలో నాన వేయడ మెందుకు! కుక్కు. 87.

కందనకాయ

  • గుండెకాయ
  • "సందియ మింత లేదు పెలుచన్ నును మొగ్గల మిట్టకోలలన్, గందనకాయ నేసె సుమకార్ముకు డే మని చెప్పువాడ." రాజశే. 3. 146.

కందవాఱు

  • కందిపోవు.
  • "లలితముక్తాహారగుళికాకలాపంబు, ఘ్రాణానిలంబున గందవాఱె." నైష. 2. 119.
  • రూ. కందపాఱు.

కందా కొట్టు

  • తిరిపపుతిండి మెక్కు.
  • వివరమునకు చూ. కందాలరాజు.

కందాలరాజు

  • సోమరి, తిండిపోతు; తిరిపెపు తిండి మెక్కువాడు.
  • కందా అనగా రాజబంధువుల భోజనశాల అని బ్రౌను, అక్కడ ఎవరైనా వచ్చి రాజబంధువు పేరుతో తిని తిరుగుతూ ఉండవచ్చును. అలా ఆ పేర తిని తిరుగు తిండిపోతునకు పే రై యేర్పడిన పలుకుబడి. నందక. 79 పు. కంది_____కందు 337 కందు____కందె

కందికట్టు

  • కందిబేడలు (పప్పు) ఉడికించి వంచుకొన్న నీరు.
  • "ఈ రోజు మా యింట్లో కందికట్టు చారు పెట్టాను. మా వాడు చాలా బావుం దన్నాడు." వా.

కంది కుందు

  • వాడిపోవు; కందిపోవు.
  • "రసిక శేఖరు డా రాజు రాజవ్దన, కంది కుందిననెమ్మోము కళ లెఱింగి." శుక. 1. 305.

కందిపోవు

  • 1. వాడిపోవు.
  • "ఎండలో తిరిగేసరికి వాని మొగం బాగా కంది పోయింది." వా.
  • 2. దెబ్బ తగిలి నల్లవడు.
  • "బాగా రాయి కొట్టుకున్న ట్టుంది. తొడ కందిపోయింది." వా.

కందు కుందును లేని

  • నిష్కళంక మైన.
  • "కందు కుందును లెనికలువల చెలికాడు గలిగిన జెలి మేనికాక దీఱు." రాజగో. 3. 62.

కందువ చేయు

  • నివసించు.
  • "ని,క్కపుగతి ఋశ్యమూకము న గందువ సేయవె?" భాస్క. కిష్కిం. 477.

కందువమాటలు

  • చాటుమాటలు. చాటూక్తులు.
  • "కందువమాట లాడి వగ కారితనంబులు నూపి సన్న లిం,పాందగ సల్పి చేరికల్;అ నుల్లము రంజిలజేసి..." హంస. 3. 32.
  • "కాయజుతూపు లమ్ముదురు కందుక మాటల బుష్పలావికల్." విజ. 1. 14.

కందువ సెప్పు

  • నిర్ణీతస్థలమును తెలియజేయు.
  • "కందువ సెప్పి యొక్కెడ ద్రిగర్తులు దాడికి గూడువారు." భార. విరా. 3. 127.

కందు వాపు

  • కలత తేర్చు.
  • "కళాపూర్ణుండు నివ్విధంబున నవ్వనిత డెందంబు కందు వాపి సాంద్రానందంబున నభిమతక్రీడల రమించె." కళా. 7. 287.

కందువాఱు

  • మాసిపోవు, నల్లబడు, వివర్ణ మగు.
  • "కందు వాఱిన మించు కంచుటద్దము వోలె." హర. 7. 30.
  • "వెలవెల జాఱె మేఘ మరవింద విరోధియు గందువాఱె." నరస. 2. 70.

కందువు మానె డై

  • మోస మెక్కువగా కలిగి.
  • "కందువు మానె డై, కత్తిగొంటు లయినయ త్తగంతు." కుమా. 8. 135.

కందెన పడు

  • లంచ మబ్బు; డబ్బు చేతికి వచ్చు.
  • "కాస్త కందెన పడితే గానీ వాడిచేత పని చేయించుకోవడం కష్టం." వా.
  • చూ. కందెన వేయు.

కందెన వేయు.

  • డబ్బిచ్చు; లంచ మిచ్చు. కందె____కంప 338 కంప___కంప

కందెన వేస్తే బండిచక్రం గబగబా తిరుగుతుంది అనుటపై యేర్పడినపలుకుబడి.

  • "కాస్త కందెన వేస్తే ఆ గుమాస్తా మనకు కావలసిన కాగితా లన్నీ ఈ క్షణంలో తెచ్చిస్తాడు." వా.
  • చూ. కందెనపడు.

కందెఱ

  • 1. కన్ను తెఱచునది.
  • "సృష్టి కందెఱ." కాశీ. 1. 121.
  • 2. కనుచాటు, తెర.
  • "మఱునా డంధకవృష్టిభోజ యదు సామంతాగ్రణీ సేన గం,దెఱగా." ఉ. హరి. 2. 84.

కంపకోట

  • ముండ్ల కంచె. కంపతో వేయుకంచె.
  • "కంపకోట ఘటించుకరణి జుట్టుక యున్న, యీరంపు వెడసందు కేగు వెరవు." రాజగో. 1. 69.

కంప గట్టు

  • కంచె వేయు.
  • "చెట్టుచేమలు, కానంబడ నఱికి కంప గట్టినపిదపన్." విప్ర. 2. 19.

కంపగొట్ట!

  • ఒక తిట్టు.
  • "నీ యింటికి కంపగొట్ట." వా.
  • కంపగొట్టుట పాడుపడుటను సూచిస్తుంది.

కంపగొట్టు

  • పాడువెట్టు.
  • "వా డెప్పుడో నాన్న పోగానే యింటికి కంపగొట్టి దేశాంతరం పోయాడు." వా.

కంపతొడు గీడ్చినట్లు

  • జాడలు ఏర్పడునట్లు అనుట.
  • "కంపతొడు గీడ్చిన ట్లేదు గాన జన్నం,దెరు వెఱుంగుచు." మను. 4. 54.

కంపనబడ్డ కాకి అగు

  • చాలా చిక్కులలో తగులుకొని విలవిల లాడుతున్నా డనుపట్ల ఉపయోగించే పలుకుబడి. కాకి కంపమీద పడ్డప్పుడు విదిలించుకొన్న కొద్దీ మరింత ముళ్లల్లో చిక్కుకొంటుంది కదా?
  • "వా డిప్పుడు కంపనబడ్డకా కై అవస్థ పడుతున్నాడు." వా.
  • చూ. కంపలబడ్డ కాకి అగు.

కంపము పుట్టు

  • వడకు పుట్టు.
  • "వెక్కస మగు నెవ్వగ ల్వొడమె గంపము పుట్టె." పారి. 1. 100.

కంపలబడ్డ కాకి అగు

  • చిక్కులలో తగులుకొన్న వాడగు. కంపలలో పడినకాకి తప్పించు కొనబోయిన ట్లెల్ల మఱింత చిక్కుకొంటుంది. అందుపై వచ్చినపలుకుబడి. ఇది నేటికీ వాడుకలో ఉన్నది.
  • "డక్కిన విష్ణుభక్తియు దృఢంపు విరక్తియు గల్గు నమ్మరు,ద్భుక్కటకుం భజించుమతి పుట్టుక కంపల బడ్డ కాకి నై." పాండు. 2. 184.
  • చూ. కంపనబడ్డ కాకి అగు.

కంపవెట్టు

  • పాడు వెట్టు.
  • "పొంచి యెంతయు దోడ బుట్టిన దానిల్లు, కంప వెట్టినమహాఘనుండు వీడు." బిల్హ. 2. 65.
  • చూ. కంపగొట్టు.

కంబళపురీషము

  • నీచము; కంబళిమీది మలినము - ఒక తిట్టు. తొలగింపరాని దనుట. పట్టుకుంటే వదలని అహిత వస్తువు.
  • "మటుమాయలాడు కంబళ పురీషంబు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 4483.

కంబళికఱ్ఱ

  • ఒకరకం వంటచెఱకు.బ్రౌను.

కంబళిపురుగు

  • నీచుడు అన్న అర్థంలో దీనిని తిట్టుగా ఉపయోగిస్తారు. నల్లగా కంబళివలె ఉండు పురుగు. చెట్ల ఆకులపై ఉంటుంది.
  • "వాడు వట్టి కంబళి పురుగులా ఉన్నాడు." వా.

కంబీ తీయు

  • పాఱిపోవు. చిత్తూరుజిల్లాలో నేటికీ వినిపించే పలుకుబడి.
  • "అప్పు సంగతి యెత్తేసరికి వాడు కంబీ తీశాడు." వా.
  • చూ. కమ్మి తీయు.

కంసాలి ఉన్నచోట కథ చెప్పరాదు

  • యుక్తిశాలి ఉన్నచోట వట్టిమాటలు చెప్పుట కూడదు అనుపట్ల ఉపయోగించేది. కంసాలి యుక్తిశాలి అని ప్రతీతి.
  • ఇది ఒక కథపై యేర్పడినది. ఒకతను కథలు చెప్తున్నాడు. "ఒకచోట ఒక అరటి ఆకూ, మంటి పెళ్ళా స్నేహిత మయ్యాయి. అరటాకు అన్నది కదా 'వానవస్తే నేను నీమీద పడి రక్షిస్తాను. గాలి వస్తే నీవు నామీదపడి రక్షించు - అని." ఇలా అతను చెప్తుండగనే శ్రోతల్లో ఉన్న అతను అందుకొని రెండూ కలసి వస్తేనో అన్నా డట. అప్పుడా కథకు 'కంసాలి ఉన్నచోట కథ చెప్ప రాదు' అని వెళ్ళిపోయా డట!

కంసాలిప్రొవ్వులు

  • దిక్కు కొకరు మొగ మై విడి విడిగా ఉన్నా రనుట. కక___కక 340 కకా___కక్కు
  • ఐక మత్య రాహిత్యాన్ని తెలిపే పలుకుబడి. కంసాలులలో తెగ లెక్కువ. నలుగురు కలిస్తే ఎవ రంతకు వాళ్లే గొప్ప అనుకొని వేరే వేరే పొవ్వులు పెట్టుకొని వంట చేసుకునేవారు. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "ఆ ఊళ్లో ఒకరిని చూస్తే ఒకరికి పడదు. ఏపని వచ్చినా ఊరంతా కంసాలిపొవ్వులుగా తయా రవుతుంది." వా.

కకపిక లగు

  • చెల్లాచెద రగు.
  • "వికవిక లేలె నివ్వెఱ లకుముకులు, కకపిక లాయె దక్కక పికవాణి." అనుక. 2. 115 పు.
  • చూ. కకవిక లగు.

కకబికలు

  • చిక్కులు; బాధలు.
  • "వలచి యతడు కడు మోహము, తలమునుకలు గాగ మరుని తామర విరితూ, పుల కకబికలకు లోబడి, మలయుచు దా వెంట జాలిమాలి దిరుగన్." హంస. 5. 127.
  • రూ. కకవికలు.

కకవిక లగు

  • తలక్రిందు లగు; గందరగోళమగు.
  • "ఒకయూరికి నొకకరణము, నొకతీర్పరి యైన గాక యొగి దఱు చైనన్, గకవికలు గాక యుండునె, సకలంబును...." సుమతి.
  • చూ. కకపిక లగు.

కకాపికగా

  • చెల్లాచెద రగునట్లుగా.
  • "కలిగినపాతకంబులు కకాపికగా విడనాడి." విప్ర. 2. 16.

కకావిక యగు

  • చెదరి పోవు; కలగు.
  • "ఆత్మ సైనికచయంబు కకావిక లై కలంగి." కళా. 8. 58.
  • "ప్రక్క వేఱొక్క మగ డున్న బాగు తెలిసి...మిట్టిపడి కకావికయై." శుక. 1. 228.

కక్కరించు

  • కస్సు మను.
  • "కనుగొని డాయవచ్చి శునకంబు విధంబున గక్కరించి యి,ట్ల్ను." చెన్న. 2. 30.
  • "పిల్లవాడు దగ్గఱకు వస్తే ఆలా కక్క రిస్తా వేం?" వా.

కక్కసపడు

  • కోపపడు, బాధపడు.
  • "ఇంత చిన్న దానికే అంత కక్కసపడతా వేం ఖర్మం?" వా.

కక్కసపెట్టు

  • కష్ట పెట్టు.
  • "రక్కసులం గక్కసపెట్టి." రామాభ్యు. 8. 192.

కక్కిరి బిక్కిరిగా

  • తారుమారుగా, అస్తవ్యస్తంగా. శ. ర.
  • "అదంతా కక్కిరి బిక్కిరిగా ఉంది." వా.

కక్కుఱాయి

  • గఱుకుఱాయి. కక్కు___కక్కు 341 కక్కు___కచ్చు
  • "కంకలు దుంపలు కక్కుఱాళ్లు." సానం. 2. 6.

కక్కుఱితికాడు

  • కక్కుర్తిపడువాడు; తొందర పడువాడు; ఎంత కైనా లొంగువాడు.
  • "కక్కుఱితివాడు కార్యము, చక్కటి మెఱుగండు." నా. పంచ. 1. 320.
  • చూ. కక్కుర్తిగాడు.

కక్కుఱితిపడు

  • దేనిమీది ఆశతోనో ఎంతకైనా లొంగిపోవు.
  • "వా డేదో నాలుగుకాసులు వస్తాయని కక్కుర్తిపడి ఆ ఛండాలపు పని చేశాడు." వా.
  • రూ. కక్కుర్తిపడు.

కక్కుర్తిగాడు

  • స్వలాభమునకై ఎంత నీచాని కైనా ఒడిగట్టువాడు.
  • "కడగి పీనుగుమీద గంచంబు వెట్టి కుడువగా జూచు కక్కుర్తిగా డితడు. గౌర. హరి. ద్వి. 451-452.

కక్కుర్తిపఱుచు

  • కక్కుర్తి పడునట్లు చేయు.
  • "కక్కుర్తి పఱుపరే గాఢతపోరూఢు, డగుమందకర్ణజు నంతవాని." చంద్ర. 2. 74.

కక్కులకళ్లెం

  • ఇనుపగొగ్గు లున్న కళ్ళెము.
  • "ఆ గుఱ్ఱం కక్కులకళ్లెం వేస్తే గానీ మాట వినదు." వా.

కక్కువాయిదగ్గు

  • కోరింతదగ్గు.
  • రూ. కక్కాయిదగ్గు.

కక్కు వేయు

  • తిరిగిలిపై ఇనుపముక్కతో గఱుకుగా ఉండునట్లు కొట్టు.
  • "పిండి పడ్డమే లేదు. తిరగలికి కక్కు వేయించాలి." వా.

కక్కూఱితిపడు

  • కక్కుర్తిపడు.
  • చూ. కక్కుఱితిపడు.

కచ్చ బిగించు

  • గోచి పెట్టు.
  • "నీలిచేల గడితంబుగ గచ్చ బిగించి." క్రీడా. పు. 92.

కచ్చలో కందులు వేయించు

  • అతికామి యగు. గోచిలోనే కందులు వేయించ గల వేడిమి - కామం - కల ...అనుట.
  • "అదంతా కచ్చల్లో కందులు వేయించే రకం." వా.

కచ్చ వద లగు

  • కామోఫ్రేకము కలుగు. కచ్చ బిగించుట నిగ్రహాన్నీ, అది వదు లగుట తన్నా శాన్నీ సూచిస్తుంది
  • "కులుకుచు నొకసారి పలుకరించిన బిచ్చ,వాని కైనను గచ్చ వదలిపోవు."పాణి. 2. 71.

కచ్చుకొను

  • కక్ష పట్టు. కచ్చు____కచ్ఛ 342 కజా___కట
  • "వేల్పు తేజిం,గచ్చుకొని హసించు వీట గల్గుహయంబుల్." చరు. 1. 30.

కచ్చుపెట్టు

  • పట్టుదల వహించు.
  • "కచ్చు పెట్టి వీనులకు గతలెన్ని విన్నాను అచ్చుతు కీర్తన వినే యందు సరి కాదు." తాళ్ల. సం. 10. 250.

కచ్చుపెట్టు కలుగు

  • బాధ, గాయము, ప్రమాదము కలుగు.
  • "చొచ్చితి నీకు శరణు సుద్దు లింక నేటికి, కచ్చుపె ట్టెవ్వరివల్లా గలిగే దేమీ." తాళ్ల. సం. 6. 176.

కచ్చువిచ్చు

  • పురి వీడిపోవు.
  • "కాలపాశము కచ్చు విచ్చె." రుక్మాం. 2. 48.

కచ్చువెట్టు

  • పగపట్టు. 'కచ్చపట్టినాడు' అనేలాంటి రూపంలో ఈ కచ్చు నేడు కానవస్తుంది.
  • "అగపడి కచ్చు వెట్ట యిత డాడిన మాటలకు." శల్యప. 2. 125.

కచ్చెపోతు

  • జగడగొండి; ఈర్ష్యాళువు.

కచ్ఛశుద్ధి

  • బ్రహ్మచర్యం; వ్యభిచార రాహిత్యం.
  • "వాడు కాస్త కచ్ఛశుద్ధి కలవాడు." వా.

కజాయము

  • నువ్వులూ, బెల్లం కలిపిన పిండి కానీ, కొబ్బరితురుమూ బెల్లం కలిపినపిండి కానీ లోపల పెట్టి పైన గోధుమ రేకు మడిచి అల్లి చేసే పిండి వంట.
  • "కజాయంబు లిం దెన్నే నున్నవి." పాండు. 7. 279.
  • చూ. కజ్జాయము.

కజ్జాకోరు

  • కలహశీలుడు.
  • "వాడు ఒట్టి కజ్జాకోరు. వాడిజోలికి పోవద్దు." వా.

కజ్జాయము

  • కజాయము.
  • "బళిరె కజ్జాయ మయ్యరె పాయసములు." వి. 2. 105.
  • చూ. కజాయము.

కజ్జెకాయ

  • పప్పులపొడి లోన పెట్టి గోధుమరేకుతో అల్లిన ఒక ఫలహారం.
  • "వదలుం జక్కెర కజ్జెకాయలును." రా. మా. 2. 115.

కటకట చేయు

  • కస్తీ చేయు.
  • ఇస్తావా చస్తావా అని నిర్బంధ పెట్టు.
  • "వాడి లెక్క ఫైసలు చేయ మని కటకట చేస్తున్నాడు." వా. కట____కట 343 కట____కట

కటకటంపడు

  • బాధపడు. శివ. 1. 87.
  • చూ. కటకటపడు.

కటకటంబడు

  • బాధపడు; విచారపడు.
  • "క్రూరకర్ము లగుకొడుకులం గంటినే యని కటకఋఅం బడి." కా. మా. 2. 25.
  • "కటకట బడి యౌడు గఱచి హుమ్మనుచు, దటము దాటించి చిందఱ రేగినట్లు." గౌ. హరి. ప్రథ. పంక్తి. 1061-62.
  • చూ. కటకటంపడు.

కటకటపడు

  • బాధపడు, కలతపడు.
  • "వెతలం గటకటపడి." రసిక. 4. 9.
  • "కటకట పడ దొడగె నపుడు కరము సెమర్చెన్." హర. 7. 76.

కటకట మని

  • ధ్వన్యనుకరణము.
  • "కటకట మని పండ్లు కొఱికి కసరు విసరుటే." శ్రవ. 3. 86.

కటకటాలు

  • ఇనుప ఊచలతో అడ్డుగా వేసిన ఆవరణము.
  • "కటకటాల వెనుక కూర్చుని వీథిలో పొయ్యేవారిని పిలవడం వాడి అలవాటు." వా.
  • ఈపదమే జైళ్లలో ఉన్న కటకటా లన్న విశేషార్థాన్ని పురస్కరించుకొని బందిఖానాకూ, నిర్బంధానికీ సూచక మైనది.
  • "వాడు కటకటాల వెనుక ఉన్నాడు. ఇప్పుడు మన కేం చేయగలడు? వాడు విడుద లయింతరువాత మాట చూతాం!" వా.

కటకాముఖము

  • బాణమును లాగునప్పటి ఒక విధ మైనహస్తముద్ర.
  • "క్రమ్మఱ బలాశకటకాముఖమున గీర చలిత శాఖాస్ఫుటాశోక శరము గూర్చె." ఆ. ము. 5. 141.

కటపయాది సంఖ్య

  • అక్షరమాలలోని క, ట, ప, యాది అక్షరములను సంఖ్యలకు మారుగా ఉపయోగించు పద్ధతి. బ్రౌను.

కటపుటలు

  • అదరి పాటులు; విఱగ బాటులు. జం.
  • "అతం డక్కటపుటలు మాన్పె." కకు. 2. 104.

కట పెట

  • ధ్వన్యనుకరణము.
  • "కటపెట తొటతొట రాలెడు, పొటపొట చినుకుల ధరిత్రి పొడ నట్టు వడం." వైజ. 2. 146.

కట పెటగా ఉండు

  • చిక్కుగా, ఇబ్బందిగా ఉండు.
  • "వచ్చేడబ్బు చాలక వాడిపరిస్థితి చాల కటపెటగా ఉంది." వా. కటా____కటి 344 కటి____కట్ట

కటాకటిగా

  • దాదాపు; చాలీ చాలక. కొమె మించుమించుగా అనుట.
  • "అర్ధసేరుబియ్యం వేస్తే వాడికి కటా కటిగా సరిపోతుంది." వా.
  • చూ. ముటీముటాలుగా.

కటాక్షించు

  • దయ చూచు.
  • "కృతకవిప్రు నగజ కటాక్షించి." కుమా. 7. 44.
  • "ఏదో పేదవాణ్ణి మీరు కటాక్షించాలి." వా.

కటాక్షించుకొను

  • అనుగ్రహించు, ఆదరముతో చూచు.
  • "కేవలభక్తితో లేవ వణిక్కుల, గ్రేవల నట గటాక్షించుకొనుచు." దశా. 7. 188.

కటాబిటిగా

  • నిక్కచ్చిగా.
  • "అతడు చాలా కటాబిటిగా మాట్లాడతాడు. నాన్చడు." వా.

కటారువాడు

  • ఖడ్గధారి.
  • "నిజ,స్థానము నిర్గమించి పగని జంపగ వచ్చు కటారుకాని చం, దాన మహేశ్వరుం గదిసి." కా. మా. 2. 141.

కటిక ఉపవాసము

  • మంచినీళ్లు కూడా పుచ్చుకోకుండా ఉండే ఉపవాసము.
  • "వైకుంఠ ఏకాదశినాడు కటిక ఉపవాసం చేయడం అతని కలవాటు." వా.
  • "శుక్రవారంపూట కటిక ఉపవాసం చేయకూడదే ముత్తైదుపిల్లలు." వా.

కటికగుండె

  • దయావిహీన హృదయము.
  • "వానిది ఒట్టి కటికగుండె. కన్నతల్లి బ్రతిమాలినా యింటికి రా నన్నాడు." వా.

కటికచీకటి

  • చిమ్మచీకటి.
  • "కని కనుల్ కటికచీ కటులు గ్రమ్మ." రాధి. 2. 20.
  • "ఈ కటికచీకట్లో ఎక్కడికి పోతావు రా. పురుగూ పుట్రా ఉంటుంది." వా.

కటికతనము

  • కాఠిన్యము.
  • "కటికతనంబు మాన్చి చటుకాకు నిడంబము గూర్చి." నైష. 3. 54.

కటికనవ్వు 8విషపునవ్వు. కటిక(కి)నీళ్లు

  • వట్టినీళ్లు మాత్రమే ననుట.
  • "వాడు కటికినీళ్లు తాగి పడుకున్నాడు.పొద్దున్నుంచీ." వా.
  • "ఆ రెడ్డిగారింటికి మజ్జిగకు పోతే ఒట్టి కటికినీళ్లు పోశారు." వా.

కట్టకడ (పటి)

  • ఆఖరు (వాడు-అది)
  • "వాళ్లిల్లు ఆ వీధిలో కట్టకడన ఉంది." వా.
  • "వాడు వాళ్ల అన్నదమ్ముల్లో కట్టకడపటివాడు." వా. కట్ట____కట్ట 345 కట్ట___కట్ట

కట్టడ చేయు

  • ఏర్పాటు చేయు.
  • "పురీరక్షణస్థితికిన్ గట్టడ చేసి." జైమి. 3. 55.
  • 2. ఆజ్ఞాపించు.
  • "అంత నయ్యూరిదొర ముత్తియముల జూచి, తెమ్మని సువేషు దవ్వుల దీవి కేగు, మనుచు గట్టడ సేయగా నతడు వచ్చి." శుక. 2. 210.

కట్టడి

  • ఏర్పాటు; ఆచారం. 'మా ఊళ్లో రోజూ మేకను దేవుని పూజ కివ్వడం కట్టడి' అనడం వాడుక. ఇట్లా అలవాటై ఆ యేర్పాటు ప్రకారం ఇచ్చే సొమ్ముకు కూడా తదుపరి పే రయింది. పెళ్లిలో మెట్టెలు చేసి పెట్టినప్పుడు అయిదు రూపాయిలో ఎంతో ఇస్తారు. దానిని కట్టడి అంటారు. రాయలసీమలో ఇది ప్రచురం.
  • "రోజూ ఒకరు దేవునిపూజ కివ్వా లని ఆ వూళ్లో కట్టడి చేసుకున్నారు." వా.
  • "తాళిబొట్టు చేస్తే ఒక వరహా, బియ్యం, బేడలు కట్టడి." వా.

కట్టడి కట్ట

  • చెలియలి కట్ట.
  • "కడలిగముల్ కడుం దొనకి కట్టడి కట్టలు దాటిపాఱగా." అచ్చ. యుద్ధ. 162.

కట్టని కోట

  • పెట్టని కోట; సంరక్షకము. దుర్గం కాకున్నా దుర్గప్రాయం అనుట.
  • "కట్టని కలుకోట - కరినంది ఱంకె." పల. పు. 7.

కట్ట బెట్టు

  • 1. బలవంతముగా అంటగట్టు. వివాహము చేయు.
  • "ఆ పిల్లను వీడికి కట్టబెట్టి అన్యాయం చేశారు." వా.
  • 2. చీరలు మొదలైనవి ఇచ్చు.
  • "అమ్మాయిని పిలుచుకొని వస్తే ఏదో ఒక చీర కట్ట బెట్టి పంపించాలి కదా!" వా.

కట్టలుక

  • తీవ్రకోపం.
  • "పొలయలుక గట్టలుక సేసి." కుమా. 8. 146.

కట్టలు కట్టుకొని

  • గుంపులు గుంపులు చేరి.
  • "ఆ అమ్మాయి కొత్త పట్నవాసం దుస్తుల్లో వచ్చేసరికి, పల్లె పల్లే కట్టలు కట్టుకొని చూశారు." వా.
  • చూ. కట్టలు గొను.

కట్టలు గొను

  • ఒకరిమీ దొకరు ఆనుకొని చేరు.
  • వాడుకలో: "కట్టలు కట్టి చూస్తున్నారు ఉత్సవాన్ని జనం" అంటారు. కట్ట____కట్టా 346 కట్టా___కట్టి
  • పండితా. ద్వితీ. మహి. పుట. 34.
  • చూ. కట్టలు కట్టుకొని.

కట్టల్క

  • క్రోధము, కోపము.
  • పండితా. ద్వితీ. మహి. పుట. 19.
  • రూ. కట్టలుక.

కట్టవియు

  • విరిసిపోవు, ప్రిదిలిపోవు, అవిసిపోవు.
  • "నీ,రాకర మెల్ల గట్టవిసిన ట్లురులంబఱ తెంచుచున్నదో." కుమా. 12. 61.

కట్ట వెడలు

  • అధిక మగు, పొంగి పొరలు.
  • "కట్టవెడలు కన్నీటిచే." వర. రా. సుం. పు. 103. పంక్తి. 6.

కట్టాణి ముత్యాలు

  • మేలుజాతి ముత్యాలు.
  • "కట్టాణిముత్యాల కంఠమాల." భీమ. 1. 116.

కట్టాయము

  • తప్పక [కట్టాయం = తప్పక తమిళం] కడ్డాయం అనే రూంలో తెలుగులోనూ రాయలసీమలో ఉన్నది.
  • "కట్టాయము సేయుచుండుదు." కుమా. 8. 176.
  • చూ. కడ్డాయము.

కట్టాయితపడు

  • సిద్ధపడు.
  • "పట్టుకొని చంప నొంపం, గట్టాయిత పడక." వేం. పంచ. 3. 158.

కట్టాయిత మగు

  • సిద్ధ మగు.
  • "కట్టాయితం బై సురాసురులు బిట్టేచి." హర. 6. 59.
  • రూ. కట్టాయితం బగు.

కట్టాయితము

  • యుద్ధమునకు సన్నద్ధ మైన సైన్యము.
  • "ఆత్మ సంభవుని కట్టాయితము." భాగ. 6. 445.

కట్టావి

  • వేడి ఆవిరి.
  • "ఎసగు కట్టావిక్రియ నావి రెగయ." ఆము. 2. 69. ఆము. 4. 134.

కట్టి కుడుచు

  • చేసినది అనుభవించు.
  • "కట్టిడి నీ కిట్లు కాకుండ నగునె, కట్టి కుడ్వక పోదె కర్మబంధంబు." సారం. 3. 172.

కట్టి కుడుపు

  • తప్పక అనుభవించునట్లు చేయు.
  • "అట్లగా, బఱచినపాటు కట్టి కుడుపణ్ జనునో చనదో విధాతకున్.." కకు. 1. 163.
  • "వల దన్న మాన కరిగెన్, జలమున దనపాలి విధి వెసం గొనిపోవన్, దొలి జన్మంబున జేసిన, కొలయును బుణ్యంబు కట్టి కుడుపక యున్నే?" సారం. 2. 32.
  • "వెన్న దిన్న యట్టి వెకిలితనము, కట్టి కుడిపె నేడు కంజాత నేత్రుని." శ్రీని. 5. 86. కట్టి_____కట్టి 347 కట్టు_____కట్టు

కట్టిన ముడుపు

  • అందుబాటులో నున్న అమూల్యవస్తువు. కొంగుపసిడివంటిది.
  • "కట్టినముడుపు వెంకటనిలయుడు." తాళ్ల. సం. 11. 55.

కట్టిపెట్టు

  • 1. చాలించు.
  • "నీ మాటలు కట్టిపెట్టి చనుమా." రసిక. 3. 45/
  • "మీ వారి నడతలు గట్టి పెట్టి... న్యాయంబు లాడె దౌర. శశాం. 3. 81.
  • "గర్వసంరంభంబు గట్టిపెట్టు." భీమ. 1. 62.
  • "ఆ గంధర్వముపై వాంఛలు గట్టిపెట్టి." జైమి. 4. 9.
  • "నీ కాని తలపులు గట్టిపెట్టి." జైమి. 1. 61. శివ. 2. 102.
  • "నీ డంబా లింక కట్టిపెట్టు - ఎవరికి తెలియవు?" వా.
  • 2. కట్టించి యిచ్చు.
  • "కలుమఠం బొండె నిల్లొండె గట్టిపెట్టి." భీమ. 6. 55.

కట్టివేయు

  • ఆగు; త్రాళ్ళు మొదలగు వానితో బంధించు.
  • "వానికి నిన్నటినుంచీ మూత్రం కట్టి వేసింది." వా.
  • "రాత్రంతా ఉండిన వాంతులూ, భేదులూ ఒక్క మాత్రతో కట్టివేశాయి." వా.
  • "యజమాని కాళ్లూ చేతులూ కట్టివేసి దొంగలు పారిపోయారు." వా.

కట్టుకంబము

  • ఆలాన స్తంభము. ఏనుగులను కట్టునట్టి స్తంభము.
  • "కట్టుకంబము డుంఠి గంధద్విపమునకు." కాశీ. 5. 135.

కట్టు కట్టు

  • 1. ఒక మాటపై నిలబడు, సమ్మె చేయు.
  • "ఆ మిల్లులో కార్మికు లంతా కట్టు కట్టినారు." వా.
  • 2. మంత్రములతో దిగ్బంధ నాదులు చేయు.
  • "ఆ మంత్రగాడు కట్టు కట్టేసరికి పాడుతున్నవా డల్లా అలా ఆగిపోయాడు." వా.

కట్టుకథ

  • కల్పితకథ; పుకారు. మాటా. 58.

కట్టు కాపించు

  • ...........పరిపాలించు.
  • "కట్ట గాపింప దక్షత లేమి నూరూర, బందెల బడిపోయె బశుగణంబు." మను. 3. 129.
  • వాడుకలోరూపం మారుతుంది.
  • "కట్టేవాడూ కాసేవాడూ లేక పశువులు దిక్కు కొకటి పోతున్నవి." వా.

కట్టుకొంగు

  • చీర తొలిచుట్టు చుట్టి ముడి వేసుకొను కొంగు. కట్టు____కట్టు 348 కట్టు____కట్టు
  • "ఒక యిసుమంత వీడె గట్టుం గొంగున్." విజ. 2. 178. దశా. 3. 89.
  • "ఈ చీర కట్టుకొంగుకంటే పైకొంగే భాగా ఉండి." వా.

కట్టుకొను

  • 1. వివాహ మాడు. ఇది దక్షిణాంధ్రంలో ఈ అర్థంలో విశేషంగా వాడుకలో ఉన్నది.
  • "మన పక్కింటి అమ్మాయిని వాడు కట్టుకొన్నాడు." వా.
  • 2. ధరించు.
  • "ఆవిడ చీర కట్టుకొని వచ్చేసరికి బండివేళ కాస్తా దాటిపోయింది." వా.

కట్టుకొమ్మ

  • అడ్డుకట్ట, ఆనకట్ట.

కట్టుకోక

  • మామూలుగా రోజువారీ కట్టుకొనే చీర.
  • "దానికి కట్టుకోకలే లేవు. ఇంక దాపుడు కోకలు ఎక్కడనుంచి వస్తాయి." వా.
  • చూ. కట్టుచీర; దాపుడుకోక.

కట్టుగడ

  • దాపుడుధనము. బ్రౌను.

కట్టుగడ సేయు

  • దాచు. బ్రౌను.

కట్టుగుండు

  • 1. రాళ్లను పగులగొట్టుగుండు.
  • "కొంద గట్టెడుకట్టుగుండ్లరవము." పరమయో. 5. 40. చంద్రా. 4. 214.
  • 2. తూనిక రాయి.
  • "ఈ కట్టుగుం డేమీ సరిగా ఉన్నట్టు లేదు. తాలూకా కచ్చేరిముద్ర ఉన్నదైతే కానీ నేను ఒప్పుకోను." వా.

కట్టుగుడ్డలతో

  • వస్త్రమాత్ర నిర్వి శేషముగా. దేవీ. 7. 512.

కట్టుగుఱ్ఱము

  • కట్టివేసిన గుఱ్ఱము. బ్రౌను.

కట్టుగొయ్య

  • పశువులు మొదలయినవానిని కట్టివేయుటకై పాతిన కొయ్య.
  • "కట్టుకొయ్యకు జేరి కామధేనువు దప్పె." కామా. 4. 111.

కట్టుగొట్టు

  • కట్టుగొయ్య.
  • చూ. కట్టుగొయ్య.

కట్టుగొఱ్ఱె

  • చంపుటకై కట్టివేసిన గొఱ్ఱె. బ్రౌను.

కట్టుచీర

  • రోజువారీ కట్టుకునే మామూలు చీర.
  • చూ. కట్టుకోక.

కట్టు చెడు

  • కట్టు తప్పు; విచ్చలవిడిగా ప్రవర్తించు. కట్టు____కట్టు 349 కట్టు____కట్టు
  • "అదెంత కట్టు చెడినన్ రాకుందురే?" పాణి. 4. 24.
  • చూ. కట్టుతప్పు.

కట్టు చేయు

  • నియతి యేర్పరచు.
  • "ఆ గ్రామంలో ఎవరూ కల్లు గీయకూడదని కట్టు చేసినారు." వా.

కట్టు తప్పు

  • ఈడేరి స్వేచ్ఛగా తిరుగు.
  • "ఇ, ట్లీడేరి కట్టుతప్పిన, చేడియ నికనైన బెండ్లి సేయందగదే?" యయాతి. 3. 100.
  • "కట్టు తప్పిన పిల్ల నింట్లో పెట్టుకొని ఎన్నాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారు?" వా.

కట్టుదిట్టము చేయు

  • తగినఏర్పాట్లు చేయు.
  • "వాడు ఆ పొలం వ్యవహారం అంతా కట్టుదిట్టం చేసి వెళ్లాడు." వా.

కట్టుదిట్టములు

  • కట్టుబాట్లు; అదుపాజ్ఞలు.
  • "ఆ పిల్లలు కట్టుదిట్టాలు లేకుండా పెరిగారు." వా.

కట్టుదొన

  • కొండలో పారు నీరు ఒక చోట నిలిచినప్పుడు కట్టుదొన అంటారు.
  • కన్నడంలో కోనేరునే కట్టు దొణె అంటారు.
  • "తన చరిత్రాంబునకును ముజ్జగమ్ముల, జనుల వీనులు కట్టుదొనలు గాగ." చంద్రా. 5. 14.

కట్టుపకాసి

  • వీరుడు; ధీరుడు; శూరుడు; క్రూరుడు.
  • "కట్టుపకాసి దీర్ఘదృఢకాయుడు తత్ప్రతిహారపాలకుండు." హరి. పూ. 8. 47.
  • నిర్వ. 4. 54.
  • "ద్రుపదుండు వచ్చి యా, కట్టుపకాసు లిద్దఱకు గ్రక్కున నడ్డము సొచ్చి." భార. భీష్మ. 1. 260.
  • "రావుతుల్ గట్టుపకాసు లై నరుని గప్పిరి." భార. శల్య. 1. 7.
  • "కట్టుపకాసు లై గగనాంగణంబున, మందేహు లింతకు మాఱుకొంద్రు." నైష. 8. 13.
  • బీమ. 4. 47.

కట్టుపడు

  • 1. బందీ యగు.
  • "వల్లభు డిట్లు కట్టుపడువార్త చెవింబడ." దశా. 5. 128.
  • 2. ఏమీ చేయలేని స్థితిలో నుండు.
  • "నే నేదో ఆ పెద్దమనిషి మాటకు కట్టుపడి ఉండిపోవలసి వచ్చింది." వా.
  • 3. తక్కు వగు.
  • ".....శూరుడు, భూమీదాతకు బ్రభావమున గట్టువడున్." భీమ. 5. 65.

కట్టుపఱచు

  • ఆటంకపఱచు, అడ్డగించు.
  • "భానుశశిమార్గములు కట్టు పఱచి." శాకుం. 2. 113.
  • రూ. కట్టుపఱచు. కట్టు____కట్టు 350 కట్టు_____కట్టు

కట్టుపాటు

  • ఏర్పాటు.
  • చూ. కట్టుబాటు.

కట్టుబంట్లు

  • మృగాదులను కట్టుటకై పన్నిన పన్నాగములు. వలలు, ఉరులు వంటివి.
  • "లోలాక్షిదృగ్రుచులో కట్టుబంట్లొ, బాలవీక్షణములో పన్నినవలలొ." పండితా. ప్రథ. పురా. పుట. 333.

కట్టుబండి

  • సరకు నింపినబండి. దీనినే బరువుబండి అని కూడా అంటారు.

కట్టుబడి

  • చేను పట్టాదారుకు, కౌలుకు చేసుకున్న వారు ఏటా యింత అని యిచ్చే ధాన్యాదులు.
  • "ఇరుగుకై జీతంపు టెక్కటీలకు గుజ్జు, పఱపు మామిడి గట్టుబడిగ జేసి." చంద్రా. 4. 84.
  • "మా చేను ఈ సారి కట్టుబడికి ఇచ్చాము. కోరుకు ఇచ్చినప్పు డల్లా వాడు సరిగా లెక్క చూపడం లేదు." వా.
  • చూ. కట్టుపడు; కట్టువడు.

కట్టుబడు

  • లోబడు - నియమబద్ధు డగు.
  • "ధర్మానికి కట్టుబడినాడు." వా.
  • "వాడు మాటకు కట్టుబడి ఉంటాడు." వా.
  • చూ. కట్టుపడు, కట్టువడు.

కట్టుబోతు

  • 1. స్వేచ్ఛాచారి.
  • "కట్టుబోతుల బొడగన్న గౌగిలించు." మల్హ. 3. 4.
  • 2. మంత్రగాడు. మంత్రవేత్తలు వాకట్టు, కను కట్టు మొదలయినవి చేస్తారు. కనుక అట్లా వచ్చిన పలుకుబడి.

కట్టుమట్టుగా

  • నివాసస్థానంగా.
  • "కావించె నెవ్వడు కట్టుమట్టుగ హస్త, తలము సంతతదాతృ తా సురభికి." ఉదయనోదయము. 1. 56.

కట్టుమట్టు చేయు

  • ఏర్పాటు చేయు, కట్టుబాటు చేయు.
  • "సుగ్రీవాజ్ఞ నడవం గట్టుమట్టు చేసి." రామా. 5. 325.
  • వావిళ్ల ని. లో ఈ మాటకు పసులసాల, ఉనికిపట్టు అన్న అర్థాలు కూడా ఉన్నట్లు ఇచ్చారు.

కట్టుమాను

  • తెప్ప. (తమి) కట్టుమరం.

కట్టుమామిడి

  • అంటుమామిడి. విత్తనం వేయకుండా మామిడికొమ్మను నఱికి కట్టు____కట్టె 351 కట్టె____కట్టె
  • వేఱుచోట అంటు కట్టిన మామిడి. చిలుకలు మొదలైనవి కొట్టకుండా బుట్టలు కట్టిన మామిడిచె ట్టని శ. ర. లో చూపిన అర్థం సరి అని తోచదు.

కట్టువడ జేయు

  • కట్టి పెట్టు - ఆపు.
  • "భస్మాంగరాగంబు పని కట్టువడ జేసి." హర. 5.5

కట్టువడు

  • ఆగిపోవు, మూతపడు.
  • "క్రమము దప్పిన మరణముల్ గట్టు వడియె." రుక్మాం. 1. 136.
  • "ఖచరుల త్రోవలు కట్టువడియె." ఉ. రా. 1. 285.
  • "ఆమాట అనేసరికి వాడినోరు కట్టు పడింది." వా.

కట్టు వదలినక్రేపు

  • స్వేచ్ఛాచారి. తాళ్ల. సం. 12. 75.

కట్టె గిట్టె

  • కసవు గట్రా. జం.

కట్టెగుఱ్ఱము

  • ఒక పిల్లల ఆట. ఒక వెదురు కర్రను కాళ్ల సందున పెట్టుకొని దానినే గుఱ్ఱంగా భావించి అదిలిస్తూ పిల్ల లు ఆడుకొనే ఆట.

కట్టెదురు

  • ఎట్టయెదురు.
  • "ఇందుల లే బెయ్య లీకు కట్టెదుర, మంద లై యున్నగోమాతృసంఘంలు..." పండితా. ద్వితీ. పర్వ, పుట. 240. (అదే పుట. 304.)

కట్టెర్ర

  • ఎఱ్ఱదనము.
  • "కట్టెర్ర సోకినట్టి." క్రీడా. పు. 20.

కట్టెవంపు పొయి తీరుస్తుంది

  • ఒక దుర్మార్గునికి ఆ పెద్ద దుర్మార్గుడే సరి అనుపట్ల ఉపయోగించే మాట. కట్టెలు ఎంత వంకరగా ఉన్నా ఆ వంపు మనకు తీయడం ఎటూ సాధ్యంకాదు. పొయ్యిలో పెడితే అంతా భస్మ మై పోతుంది - వంకర ఎలాగూ చక్క నవుతుంది - అన్న వాక్యార్థంపై యేర్పడిన పలుకుబడి.
  • "వీ డిక్కడ అందరనీ యేడిపించుకుని తింటున్నాడు. ఇప్పు డేమో పొరుగూరి కరణమయ్య తగులుకున్నాడు. ఇక వీడిపని సరి. కట్టెవంపు పొయి తీరుస్తుంది మ లే." వా.

కట్టె విఱిచి పొయ్యిలో పెట్టి నట్లు

  • పెడసరముగా.
  • "వా డెప్పుడు మాట్లడినా కట్టె విఱిచి పొయ్యిలో పెట్టినట్లు మాట్లాడుతాడు." వా. కట్టె_____కట్ల 352 కట్లె_____కడ

కట్టెవిఱుపుమాట

  • పెడసరపుమాట; పుల్లవిఱుపు మాట.
  • "వాడి నోట్లో కట్టెవిఱుపు మాటలు తప్ప మంచిమాట ఒక్కటి రాదు." వా.

కట్లజెఱ్ఱి

  • ఒళ్లంతా కట్లున్న జెఱ్ఱిపోతు.
  • "పెద్ద పలువన్నె కట్ల జెఱ్ఱి." ఆము. 4. 89.
  • చూ. కట్లపాము.

కట్లదండ

  • మెడలో వేసుకొను ఒక విధమైన సరము. కట్లసరి అని నే డనేది ఇదే కావచ్చును. శుక. 3. 105.

కట్లపాము

  • ఒళ్ళంతా కట్లవంతి చారలున్న పాము.
  • చూ. కట్లజెఱ్ఱి.

కట్ల పురుగు

  • కట్ల పాము.

కట్ల బల్ల

  • కత్తెరకా ళ్ళున్న బల్ల.

కట్లమంచం

  • ఇనుపకట్లు వేసి బిగించిన మంచం.

కట్ల సంచి

  • తూనిక రాళ్లూ, త్రాసూ మొదలయిన వన్నీ ఉంచే సంచి. బంగారంపని చేసేవా రిప్పుడూ దీన్ని లాగే పిలుస్తారు.
  • చూ. కట్లెసంచి.

కట్లెసంచి

  • చూ. కట్లసంచి.

కట్లసరి

  • ఒకరక మైన దండ.
  • చూ. కట్లదండ.

కడకంట నగు

  • నవ్వును కనులతో సూచించు.
  • "అని యార్తు లై పల్క నా పౌర జనుల, గని కేల వారించి కడకంట నగుచు." ద్విప. జగ. 174.

కడకన్నుల సన్నల చూపు

  • క్రీగంటి చూపులతో సైగచేసి చూపు.
  • "సత్యభామ కాకలికితెఱంగు శౌరి కడకన్నుల సన్నల జూపె." పారి. 3. 20.

కడకడల నుండు

  • దూరదూరముగా నుండు.
  • "లీల మణిమండనుని బవళింపజేసి, కడకడల నుండునంత దత్కటక మేలు...." శుక. 1. 286.

కడకాల దన్ను

  • తిరస్కరించు, త్యజించు.
  • "నడచె భవాంబుధి గడకాల దన్ని." పండితా. ప్రథ. పురా. పుట. 275.
  • చూ. కడకాల ద్రోచు. కడ_____కడ 353 కడ_____కడ

కడకాల మగు

  • అవసానకాలము సమీపించు.
  • "దైవగతిం గడకాల మైన." ద్వాద. 9.98.

కడకాలు పట్టు

  • పాదాగ్రమును పట్టుకొను.
  • "ఆ విశ్వవిభు వైవ నతడు కోపించి, కడగి హస్తిపకుని కడకాలు బట్టి." ద్విప. మదు. పు. 14.

కడకాళ్ళ ద్రోచు

  • తిరస్కరించు.
  • "అయో! మగనిం గడకాళ్ల ద్రోచి." శుక. 1. 154.
  • చూ. కడకాల దన్ను.

కడ కొత్తు

  • త్రోసి వేయు.
  • "నెన్నడ కడకొత్తు హంస మిథున మ్ములు." చంద్రా. 4. 143.

కడకొఱవి

  • సగము కాలిన కొఱవి. పొయిలో వంట కాగా మిగిలిన కొఱువులపై నీళ్లు చల్లి ప్రక్కకు తోస్తారు. అందుపై వచ్చిన పేరు.
  • "జ్ఞాతులు...నీతిం బాసిన విగతవి,భూతిన్ గడకొఱవు లట్ల పొగ యుదు రధిపా!" భార. ఉద్యో. 2. 275.

కడగంట చూచు

  • కటాక్షించు, క్రీగంటితో చూచు.
  • "నను బ్రీతిం గడకంట జూచి, విజయా ! నా చేత నెబ్భంగి నే, పని యైనం గడతేఱు." ఉ. హరి. 2. 21.

కడగను

  • తీరు, నెఱవేరు, కడముట్టు.
  • "కాంక్షితంబు కడగానక." హర. 4. 14.

కడగట్టు

  • కట్టడ సేయు; ఆజ్ఞాపించు; ఏర్పఱచు.
  • "ఇట్టి కోమలి లతాతరునేచన మాచరింపగా, గరుణ యొకింత లేక కడగట్టె మునీంద్రుడు." శృం. శాకుం. 2. 62.

కడగండ్ల మారి

  • ఎప్పుడూ కష్టాలు అనుభవించేవాడు.

కడ గాంచు

  • పూర్తి యగు. కాశీ. 5. 258.

కడగొట్టు

  • 1. చచ్చు.
  • "గిట్టెన్ బులుల్ సింగముల్, గడగొట్టెన్." సారం. 1. 107.
  • 2. కడపటి.
  • "అందఱకుం గడగొట్టు చెల్లె లై." భాగ. 10. పూ. 1685.
  • "వాడు కడగొట్టు కొడుకు. ఇది కడగొట్టు కూతురు." వా.

కడగోరు

  • గోటికొన.
  • "కాటుక కన్నీరు కడగోర దిద్ది." నవ. 2.

కడచను

  • 1. చచ్చు.
  • "సకలసంశప్తకులు కడచనిరి." భార. శల్య. 1. 9. కడ____కడ 354 కడ____కడ
  • 2. పూర్తి యగు.
  • "కడగిన హయమేధమఖము కడచంస్ మికి." భార. ఆర. 3.68.
  • "ఓలిన కడచన నఱువది, నాలుగు విద్యలను నేర్పు నైసర్గిక మై, వాలిన సుకవులకుం గాక." కుమా. 1. 42.
  • నశించు.
  • "విష్ణుమూర్తులు కడచన్న వేళలందు." శివ. 1. 105.

కడచెడు

  • దిక్కుమాలు.
  • "అంత గడచెడి వా రమ్ముని కోప భస్మసాత్కృతతను లై పడిరి." జాహ్నవీ. 2. 82.

కడ చేయు

  • వదలి పెట్టు.
  • "కావున నాసల గడచేసి మరల, దేవలోకమున కేతెంచితిమి." ద్వి. నల. 2. 629.

కడచేరుచు

  • కడతేర్చు.
  • "మము గడచేరుప దగు." భార. ఉద్యో. 4. 155.
  • చూ. కడ తేర్చు.

కడజాతి

  • హీనుడు, అంత్యజుడు; హీనురాలు; .........
  • "ఈ కడజాతినాతి కిహిహీ మహి దేవుడు చిక్కె." పాండు. 3.94.

కడతలు వాచు

  • విసుగెత్తి పోవు.
  • "వీనితో వేగివేగి కడతలు వాచిపోయినవి. ఇంక నాచేత కాదు." వా.

కడతలు వాయించు

  • దండించు. చెంపలు వాయించు వంటిది.
  • "వాడిదగ్గిరికి వెళ్లి యివన్నీ అన్నావంటే కడతలు వాయించి పంపుతాడు. జాగ్రత్త." వా.

కడ తెగు

  • అంత మగు.
  • "కడ తెగక యంత కంతకుం, బొడ వయ్యెను." మైరా. 2. 11.

కడతేఱు

  • గట్టెక్కు; చచ్చు.
  • "అప్పు డాబారి గడతేఱ నగు ప్రయత్న, మెట్లు చింతింపవలయు రాకేందువదన!" శుక. 1. 319.
  • "ఈ కష్టాలనుండీ న న్నెలా ఆ భగవంతుడు కడతేరుస్తాడో ఏమో మరి!? వా.
  • "దీర్ఘ జిహ్వుడు గడ తేఱిపోయె." అచ్చ. సుం. 123.

కడతేర్చు

  • 1. పూర్తి చేయు.
  • "తొడగిన పని చలం బెడపక యతి దుష్క,రం బైన గడరేర్చు ప్రభువులార." భార. విరా. 3. 21.
  • "కడతేర్తు మట్లనే కావింపు మఘము." వర. రా. బా. పు. 41. పంక్తి. 7.
  • 2. చంపు.
  • "దానవు, కపటమ కా దెలిపి వాని కడతేర్చుటయున్." జైమి. 5. 146.

కడ నుంచు

  • వేఱుగా ఉంచు. కడగా పెట్టు అని రాయలసీమలో వాడుక. కడ______కడ 355 కడ_______కడ
  • సూ. ని. లో పరిత్యజించు అనీ, వావిళ్ళ ని. లో గెంటి వేయు అనీ యిచ్చిన అర్థం సరి కాదు.
  • "అల్లు డైన పెం,డ్లికొడుకు నేచి చూచి యవలీల మెయిం గడ నుంచి యచ్చటన్." శుక. 1. 286.
  • "పంకజాతాసనప్రతిపత్తి కడ నుంచి, మృగరాజపీఠిపై మేల్ఘటించి." కకు. 1.13.

కడప త్రొక్కుకొని వచ్చు

  • ఇంటిలోనికి వచ్చు.
  • "ఏదో చుట్టం గదా అని నీ కడప తొక్కు కొని వస్తే యింత మాట అంటావా?" వా.

కడప దాటు !

  • బయటికి పో.
  • "ముందు కడప దాటి మాట్లాడు." వా.

కడపరాని

  • గొప్పైన; వదలివేయ రాని. కడపుట అనగా ఇక్కడ త్రోసివేయుట. త్రోసివేయ వీలు లేని అనగా అంత గొప్పవాడు అని భావార్థము.
  • "నీ వొక్కడ వయు, గడపరాని యట్టి భక్తుడ వే?" పండితా. ద్వితీ. మహి. పుట. 186.

కడపల చేరు

  • అంత మగు.
  • "చాతకంబుల పిపాసలు కడపల జేరె." భాగ. 10. పూ. 753.

కడపి పుచ్చు

  • 1. పంపు.
  • "సార్థవాహులం గడపి పుచ్చి." కాశీ. 4. 64.
  • 2. ఉదాసీనత వహించు.
  • "....రక్షింప జాలియుండి, కడపి పుచ్చిన నూర్ధ్వలోకములు దప్పు." భార. ఉద్యో. 1. 161.
  • 3. వాయిదా వేసి తప్పించు కొను. ఏదో ఒక సాకు చెప్పి తప్పించు కొను అనుట.
  • "సిద్ధసుతుని సిద్ధున కీక యే, గలయ నన్యు ననుచు గడపి పుచ్చె." కళా. 5. 129.
  • 4. జరపు.
  • "పుష్టి సమస్తముంగడపి పుచ్చి." పాండు. 3. 28.
  • 5. దాచు.
  • "...ఆవాగ్ధేవి యావిధంబున నొదవిన కళామర్మభేదన సామ్రాజ్య సంపదను భవావస్థ మానలాఘవశంక నప్రకాశముగా గడపి పుచ్చుటకు నుపాయంబు జింతించి..." కళా. 5. 17.

కడమ కలుగు

  • లోపము కలుగు.
  • "కనకపత్రమున నిచట, గడమ కలదను వ్రాయు లేఖయును లిపియు, మధ్యమును నారు నయ్యె." శృం. శాకుం. 2. 176.

కడమ పడు

  • 1. తక్కు వగు.
  • "ఒక్కత్రాడు సుట్టిన నది రెం డంగుళంబులు కడమ పడియె." భాగ. 10. పూ. 384. కడ_____కడ 356 కడ_____కడ
  • 2. కొఱతపడు.
  • "విభీ,షణుని రాజు జేయగనుట మీ లావునం, గాదె నాకు గలిగె గడమ పడక." భాస్క. యుద్ధ. 24. 79.
  • 3. మిగిలి పోవు - పూర్తి కాక.
  • "చెఱువు కడమపడియె..." ఆము. 4. 53.
  • చూ. కడమవడు.

కడమ పెట్టు

  • మిగిల్చు.
  • "కడమపెట్ట కంతయును నాకు నెఱిగింపు." ప్రభా. 3. 148.

కడమ వడు

  • మిగులు; కొదవపడు.
  • "అట్లు దీనుల వధియించి యచట గడమ, వడిన వసతులు వడ ద్రోచి." కేయూ. 2. 105.
  • చూ. కడమపడు.

కడమ లెంచు

  • కొఱత లెన్ను; లోపము లెంచు.
  • "కని కానని యజ్ఞానజంతు వను, కడమ లెంచ నిక గొల దేదయ్యా." తాళ్ల. సం. 9. 206.

కడ ముట్టబడు

  • దరి చేరు.
  • "మునుగుచును దేలుచును గడముట్ట బడని, జనుల కెల్లను..." భీమ. 5. 170.
  • చూ. కడముట్టు.

కడముట్టు

  • ముగియు; నిర్మూల మగు.
  • "కెంపులహజారము కడముట్టె నొక్కొ." కళా. 3. 130.
  • గౌర. హరి. ద్వి. 2454.
  • "శత్రువు ఋణంబు జిచ్చు నెచ్చరిక తోడ, గడమపెట్టక కడముట్ట నడంప వలయు." ప్రబో. 5. 4.
  • "ఈ పని ఈ రోజు కడముట్టేటట్టు లేదు." వా.

కడయిల్లు

  • పరలోకము. ద్విప. భాగ. 4.

కడయింటి పొడువు

  • పోటుమానిసి. బసవ.

కడలుకొను

  • 1. వ్యాపించు;
  • "....మెఱుగులు దిక్కుల గడలుకొ నగ,మించు దంతపు టుయ్యెల మంచము నను, బొలుపు మీఱుచు దనయంతి పురము సతుల, యూడిగంబులు గైకొంచు నున్న శౌరి." కళా. 2. 15.
  • "కనుగవ నును సోగ కెంపు గడలు కొనంగన్." జైమి. 2. 36.
  • 2. అతిశయించు.
  • "బభ్రువాహను డధిక సౌభాగ్య గరిమ, గడలుకొన." జైమి. 5. 157.
  • "ప్రీతి కడలుకొనంగన్." భార. విరా. 5.388.
  • 3. చిప్పిల్లు.
  • "కనుగవ గడు నశ్రువారి గడలు కొనంగన్." భార. విరా. 4. 152.

కడలుకొలుపు

  • కడలుకొన జేయు.
  • "రతిదేవి నెవ్వీగు రారాపుజన్నులు గడకన్నులకు నింపు గడలు కొలువ." శృం. నైష. 2. 41. కడ_____కడ 357 కడ_____కడ

కడలెత్తు

  • పొంగు.
  • "జొటజొట ధారగా వడియుచున్ గడలెత్తుసుధారసంబు." పాండు. 4. 48.

కడలొత్తు

  • వ్యాపించు.
  • "కరమూలముల కాంతి కడలొత్తి." హరి. పూ. 8. 168.

కడల్కొను

  • చూ.కడలుకొను.

కడవబడు

  • 1. మిగులు.
  • "ఒకడుం, గడవబడకుండ గృష్ణుడు, పడతులకును యమున యాటపట్టుగ జేసెన్." హరి. పూ. 8. 37.
  • 2. ముగియు.
  • "కడవంబడు నొకొ పని యని, కడు వెస జనుదెంచె..." భార. శాంతి. 5. 281.

కడవ బలుకు

  • తిట్టు, దూషించు, త్రోసివేసినట్లు మాటలాడు.
  • కడవన్ = ప్రక్కకు తొలగించునట్లు, తిరస్కరించునట్లు అని భావార్థం.
  • "పండితేంద్రుని గడ్వ బలికిన పాల, సుండ." పండితా. ద్వితీ. మహి. పుట. 12.
  • రూ. కడ్వ బల్కు.

కడవ బల్కు

  • తిరస్కరించు, తూలనాడు.
  • "కాంత దన్నెంతయు గడవ బల్కిన." బస. 5. 127.
  • రూ. కడవ బలుకు.

కడవ బుచ్చు

  • త్రోసిపుచ్చు, తిరస్కరించు. పండితా. ద్వితీ. మహి. పుట. 214.

కడవబెట్టు

  • తొలగించు.
  • "ఆపద గడవం బెట్టంగ, నోపి..." భార. ఉద్యో. 3. 6.

కడవల నీ రినుము ద్రావుకై వడి

  • కాగిన యినుము ఎన్ని నీళ్లు పోసినా తాగుతూనే ఉంటుంది. భోగములతో భోగా సక్తమయినమనస్సు సంతృప్తి చెందదు అన్న భావాన్ని సూచించే ఉపమానం.
  • "వడిగాచి కాచియుండన్, గడవల నీ రినుము ద్రావు కైవడి బైపై." మను. 3. 133.

కడవాడు

  • అస్పృశ్యుడు; చిన్న వాడు.
  • "గారాపు మీతల్లి కడవాడ గాని నే, గణుతింప గడవాడగా జుమయ్య." మను. 5. 4.
  • "అడిగిన నే మీ కడవాడ నందు."భార. ఆర. 1. 96.

కడవుట్టు కూతురు కడగొట్టు కూతురు. అందఱి కంటె చిన్న కూతురు. పండితా. ప్రథ. పురా. పుట. 293.

  • చూ. కడగొట్టు. కడ____కడ 358 కడి____కడి

కడవెళ్ళా

  • పూర్తిగా.
  • "వాడు భాగవతం కడవెళ్లా చదివాడు." వా.

కడవెళ్లు

  • కడతేఱు; దాటు.
  • "విరహవారిధి నే గడవెళ్ళు టెపుడు." ప్రభా. 3.121.

కడవ్రేలు

  • చిటికినవ్రేలు.

కడసంజ

  • సాయంసంధ్య. కళా. 8. 10.

కడసను

  • పేరు పొందు, ప్రఖ్యాత మగు.
  • "కడసన్న నీదు విఖ్యాపితమహిమ, కడ యెఱింగెద మనగా మా తరంబె." బస. 5. 129.
  • రూ. కడచను.

కడసావి ముదుసలి

  • పండు ముసలిది. సావి = కాలము. కడసావి = తుదికాలము.
  • "పసిడి గట్టున కొక వింత మిసిమి నించి, నెఱసె గడసావి ముదుసలి తెఱపియెండ." పారి. 4. 43.

కడసూపు

  • కడతేర్చు, ముక్తి నిచ్చు.
  • "గమయించు వారికి గడసూపు వాడు." బస. 6. 161.

కడికంచము

  • అన్నము తినుకంచము.
  • "కలువలరాజు పువ్వు కడికంచము బ్రహ్మకపాలము..." వీర. 2. 75.

కడికండములు చేయు

  • ముక్కలు ముక్కలు చేయు.
  • "తురంగాంగముల్, కడి కండంబులు సేసి." భార. ద్రోణ. 5. 114.

కడికండలుగా

  • చిన్న చిన్న ముక్కలుగా. భోజనమున కనువుగా నఱికిన కండలుగా-అనగా ముక్కలు ముక్కలుగా నఱకిన వనుట.
  • "పొడుతు గడికండలుగాన్." కుమా. 11. 36.
  • "ఆకాశఘం,టామార్గంబున నుండ కుండ గడికండ ల్గాగ బెల్లేసినన్." కా. మా. 2. 60.

కడికొమ్ము గావించు

  • ఆహుతి చేయు.
  • "వైరిరాజన్యుల వనదుర్గముల నెల్ల గడికొమ్ము గావించె గరటిఘటకు." రాజగో. 1. 70.
  • ఇంకనూ అర్థం విచార్యము. ఇట పాఠమే సరి కా దేమో!

కడిగండము

  • పొరపోవుట. తింటూండగా ఉన్నట్టుండి పొరపోయినప్పుడు ప్రాణాపాయకర మనీ, అలాంటి గండం అన్న దానసుకృతంవల్ల కడి_____కడి 359 కడి_____కడి
  • పరిహార మవుతుం దనీ అంటారు. వేంకటేశ. 44.

కడి గడి యగు.

  • ఆహార మగు.
  • "విడువక చేతిలో విష్ణు ప్రసాదము, గడి గడి యైనది కానీరు గాని." తాళ్ల. సం. 6. 10.

కడిగినముత్యంలాగా

  • నిర్మలంగా, పరిశుభ్రంగా.
  • "ఆ పిల్ల కేం? కడిగిన ముత్యంలా ఉంటుంది." వా.
  • చూ. పులుగడిగిన ముత్యము.

కడిగి (పెట్టి) న సాలగ్రామం లాగా

  • బోసిగా, ఏ నగా నాణ్యం లేకుండా.
  • "వా డెంత సంపాదిస్తే మాత్ర మేం? పెళ్లాం మాత్రం కడిగిన సాలగ్రామం లాగా ఉంటుంది." వా.

కడిగి పెట్టిన గంగాళంలాగా

  • సర్వశూన్యంగా.
  • "ఆవిడ కడిగి పెట్టిన గంగాళం లాగా ఉంది. ఒక సొత్తా? ఒక చీరా?" వా.

కడిగి పెట్టిన నిప్పు లాగా

  • నల్లగా, బొగ్గులాగా.
  • వ్యంగ్యంగా అనుమాట.
  • "ఆ పిల్ల కేం? కడిగిపెట్టిన నిప్పులాగా ఉంటుంది." వా.

కడిగి వదిలి పెట్టు

  • అవమానించు; ఎదుటివాని లోపా లన్నీ బయట పెట్టు.
  • "వా దీసారి కనబడనీ. కడిగి వదిలి పెడతాను. వాడు చేసిన వెధవపను లన్నీ నాకు తెలియనివా ఏమిటి?" వా.

కడిగొను

  • తిను.
  • "చిచ్చు కడిగొనగ వచ్చు నే?" భాగ. 8. 246.

కడిపెడు బిడ్డలు

  • అధికసంతానం.
  • "కాక యున్న మేము కడిపెడు బిడ్డల, వార మెట్లు బ్రతుకువార మనుజ" భోజ. 6. 144.
  • చూ. కడుపు నిండా పిల్లలు.

కడి మాడ సేయునట్టి

  • అమూల్య మయిన. భోజనవిషయంలోనే వాడుక. ఒకొక్కకడి (అన్నం ముద్ద) ఒక మాడ చేస్తుంది అనుట.
  • "అమృతోపమానంబు లైన యన్నంబులు, కడి మాడ సేయంగ గుడుచువారు." విక్ర. 5. 124.

కడియపు చేమీదుగా దివముచేరు

  • ముత్తైదువ చావు చచ్చు. కడియములు సౌభాగ్య చిహ్నములుగా ఇక్కడ భావింపబడినవ్వి. వాడుకలో కూడ నేడు 'ఆమె ముత్తైదువ చావు చచ్చింది. ముత్తైదువగా పోయింది' మొదలైన పలుకుబడు లున్నవి. అయిదువగా స్త్రీ చనిపోవుట కడి_____కడి 360 కడి_____కడు
  • ఎంతో పుణ్య మనీ, గొప్ప అనీ మన సంప్రదాయం.
  • "అంతట నయ్యింతి యాత్మజాతుల గాంచి, కడియంపు జేమీదుగాగ దివము, సేరుటయు..." శుక. 3. 337.
  • వాడుకలో ఈ పలుకుబడి నేడు మారినది.
  • "ఏదో ఆ పుణ్యాత్మురాలు ముత్తైదువగా దాటుకున్నది. చాలు. ఇం కేం కావాలి?" వా.

కడియపుటట్టు

  • కడియమువలె గుండ్రముగా చేయు అట్టు.
  • "కడియంపుటట్లు వెన్న ప్పాలు." కళా. 7. 81.

కడి యెత్తు

  • అన్నం తిను.
  • "పొత్తున గుడువక తా గడి, యెత్తదు..." రాజ. చ. 2. 34.
  • "మీగడపెరుగు లేనిది మా వాడు కడి యెత్త లేడమ్మా, ఏం చేస్తాం!" వా.

కడివోవు

  • 1. ముఱికిపోవు. కసటువోవు.
  • "కడివోవ నొడళులు గడిగి." కుమా. 1. 98.
  • 2. వాసన పోవు. వాడు.
  • "కడివోయిన పువ్వులు మఱి, ముడుచునె రసికు డగువాడు...." భో. 4. 224.
  • 3. భీరువోవు. వ్యర్థ మగు, చెడిపోవు.
  • "తాల్మి కడి వోయిన నించుక లజ్జలావునన్." ఉత్త. హరి. 5. 202.
  • "సంతతము గడి వోనివాసనలు గలుగు,పారిజాతమహీజపుష్పములు ముడిచి." వి. పు. 8. 122.

కడి సేయు

  • భుజించు.
  • "యుగము గాల్చిన చేదు జగము గెల్చినజోదు, గడిసేయ బడిసేయ గలుగడేని." రుక్మాం. 5. 71.

కడిసేసి పెట్టు

  • వంట చేసి పెట్టు.
  • "మృడుడు సౌడవచేత గుడిచినభంగి, గుడిచెనే విధులచే గడి సేసి పెట్ట?" పండితా. ప్రథ. దీక్షా. పుట. 172.
  • నేటి వాడుకరూపం:
  • "కడి చేసి వేసేదిక్కు కూడా లేరు పాపం! ముసలాయనకు." వా.

కడు గైనా తవు డైనా

  • ఏదో యింత అనుట. జం.
  • కుక్కు. 18.

కడుదుర్లు కుట్టినకరణి

  • కందిరీగలు కుట్టినట్లుగా, పొడిచినట్లు, చులుకు చులుకనుబాధను తెలుపుమాట.
  • "కడుదుర్లు గుట్టినకరణి మే నెరియ, నొడలు పెన్నెత్తురు లొలక నయ్య సుర." ద్విప. కల్యా. 148.

కడుపగు

  • గర్భ మగు.
  • ఇది నిరసనలోనే వినవస్తుంది.
  • "అబాలవిధవ కడుపయిం దని ఊరంతా ఒకే గోల!" వా.
  • చూ. కడుపు వచ్చు.

కడుపా కళ్ళే పల్లి చెరువా?

  • వా డంత తింటున్నా డేమిటి? కడు_____కడు 361 కడు_____కడు
  • వట్టి తిండిపోతే అనే భావచ్ఛాయలో ఉపయోగించే పలుకుబడి.
  • "అన్ని పూరీలు ముగించాడు. అదేం కడుపా కళ్లేపల్లి చెరువా?" వా.
  • చూ. కడుపా కళ్లేపల్లి చెరువా?

కడుపా ఖండవల్లి మడుగా?

  • చూ. కడుపా చెరువా?

కడుపా కొల్లేరుమడుగా

  • చూ. కడుపా చెరువా?

కడుపా చెరువా:

  • అంత తినడం సాధ్యమా; అంత తిండిపో తేమిటి అనుట.
  • "ఇన్ని వడ్డిస్తే నే నేం చేస్తాను? నా దేం కడుపా చెరువా!" వా.
  • "అన్ని రకాల పిండివంటలు చేసినా ఒక్కటి వదలకుండా తినేశాడు. వాని దేం కడుపా చెరువా!" వా.
  • ఇదే స్థానికమైన చెరువుల పేళ్లతో చేరిన రూపాలతో వినవస్తుంది.
  • చూ. కడుపా కళ్లేపల్లిచెరువా?; కడుపా ఖండవల్లి మడుగా?; కడుపా కొల్లేరు మడుగా?

కడుపాత్రంవాడు

  • కడుపు కక్కుర్తివాడు. తిండి పోతు. మాటా. 129.

కడుపార

  • 1. కడుపు నిండా.
  • "ఆరగించె కడ్పార." బస. 7. 203.
  • 2. గర్భము ఫలింపగా - క్నులార, చేతులార వంటిదే కడుపార కూడా.
  • "పానీయంబుల్ కడుపార ద్రావె." వేం. పంచ. 3. 363.
  • "తను కడు,పార సతీదేవి కూతు రై జన్మింపన్." కుమా. 3. 22.

కడుపు అంటుకొని పోవు

  • 1. చిక్కి పోవు.
  • "పెంటదొగ్గళ్లలో గడుపంటి శ్మశ్రు, చలనముల గ్రుక్కుజీర్ణోతువుల..." ఆము. 6. 13.
  • 2. క్షుద్బాధ కలుగు.
  • "పాపం ! ఎప్పుడు తిన్నాడో యేమో! కడుపు అంటుకొని పోయింది." వా.

కడుపు అగు

  • గర్భమగు.
  • చూ. కడుపగు.

కడుపు ఆరసి పెట్టు

  • కడుపు చూచి పెట్టు.
  • అనగా ఆకలి యెంతో గుర్తెరిగి ఆదరముతో అన్నము పెట్టు.
  • "హరహర! యెవ్వ రింక గడుపారసి పెట్టెద రీప్సి తాన్నముల్." శివ. 3. 19.
  • చూ. కడుపు చూచి పెట్టు.

కడుపు కందపెర డగు

  • చూ. కడుపు కందవి త్తగు.

కడుపు కందవి త్తగు

  • సంతానాభివృద్ధి యగు. కంద విపరీతంగా పెరుగుతూ పోతుంది అనుటపై వచ్చినది.
  • "అడుగగవలసిన యది యే, నడుగుదు విశదముగ మొదల నాచిలుక యిదె,క్క కడు____కడు 362 కడు____కడు
  • డిది యిట దేక యేటికి, విడిచితి నీ కడుపు కంచవ్ ఇత్తుగ హంసీ!" ప్రభా. 4. 41.
  • చూ. కడుపు కందపెర డగు.

కడుపు కక్కూర్తి

  • తిండికోసమై ఏమిటికై నా లోబడుట.
  • "తడవుల బట్టి యేము సతతంబును బోదుము వాని వీటికిన్, గడు మతి చాలమిం గడుపుకక్కురితిన్ సురలోక నాథ!..." ప్రభా.
  • "కడుపు కక్కుర్తితో వాడా నీచపు పనికి పాల్పడ్డాడు. వా.

కడుపు కట్టు

  • చూ. కడుపుగట్టు.

కడుపు కరగు

  • కొంత కష్టపడుటతో పూర్వమున్న కండ తగ్గినది అనుపట్ల ఉపయోగిస్తారు.
  • "రెండో పెళ్లాం వచ్చేసరికి అయ్యగారికి కాస్త కడుపు కరిగింది." వా.
  • రూ. బొజ్జ కరగు.

కడుపు కాల!

  • ఒక తిట్టు.
  • "దాని కడుపు కాలా ! పిల్లాణ్ణి ఎంత దెబ్బ వేసిం దమ్మా?" వా.

కడుపు కాలు

  • సంతాననష్ట మగు.
  • "పాపం ! మీ అక్క పిల్లాడు పోయాడు రా నాయనా ! కడుపుకాలిన పిల్లను పిలుచుకొని వచ్చి కడుపు చల్ల చేసి పంపడం మన ధర్మం." వా.

కడుపుకుట్టు

  • 1. కడుపు ఈడ్చి పట్టుకొను. ఒక విధ మైనశూల.
  • "తలనొప్పి కడుపుకుట్టుం, బలుగుఱు పుం గాళ్లతీపు పాటించుచు." శుక. 2. 205.
  • "ఆపిల్ల పెళ్లి అయినప్పటినుండీ కడుపుకుట్టుతో బాధపడుతూ ఉంది." వా.
  • 2. ఓర్వ లేమి.
  • "కడుపుకుట్టుకొద్దీ వా డే వేవో చెప్తే అవన్నీ నమ్మ వద్దు." వా.

కడుపు కూడు పెట్టు

  • భోజనము పెట్టు.
  • "ఏనుగట్టివాలు దాన నా కెవ్వరు, కడుపుకూడు వెట్టి కట్ట జీర,యిచ్చి సాకతమున నేలుదు రట్టివా, రలకు పనులు సేసి..." భార. విరా. 1. 298.

కడుపుకూటికి

  • కేవలం తిండికోసం.
  • "దేవా! యిట్లని యానతి, యీవల దే గడుపుగూటికిట రాన్." ఆము. 4. 67.
  • "కడుపు కూటికి తప్పితే వీళ్లందరినీ ప్రాధేయపడాల్సినపని యేముంది?" వా.
  • "ఏదో జనంమీద ప్రేమతో తప్పా, కడుపు కూటి కైతే వైద్యమే చెయ్యాలా?" వా.

కడుపుకొఱకు

  • పొట్టకూటికి.
  • "పేద యై కడుపుకొఱకు పాత,కములు చేసి రౌరవమున గూలు." కేయూ. 8. 293.
  • చూ. కడుపుకోసం.

కడుపుకోసం

  • పొట్టకూటికి. కడు____కడు 363 కడు____కడు
  • "కడుపుకోసం ఎన్నవస్థ లైనా పడాలి మరి!"
  • చూ. కడుపుకొఱకు.

కడుపు గట్టి కాలు గట్టి

  • తా నేమాత్రం అనుభవించకుండా. జం.
  • తిం డైనా తినకుండా అనుట.
  • "వీళ్ల నాన్న పోయినప్పటినుంచీ కడుపు గట్టి కాలు గట్టి యీ పిల్లలను సాకుతున్నాను." వా.

కడుపు గట్టు

  • మరొకరికోస మై అన్నము కూడా తినకుండు. కడుపులు గట్టిగా బిగించుకొని ఆకలి కనబడకుండా చేసికొనుటనుబట్టి వచ్చిన పలుకుబడి.
  • "మగవాడ ననుచు నున్నా, నగునగు నే గడుపు గట్టి యప్పులు మిగులన్, దెగిచి..." శుక. 3. 276.
  • "కడుపు గట్టి కాళ్లు గట్టి అంత సొత్తు సంపాదించి వీళ్ల కిచ్చాను." వా.
  • చూ. కడుపు కట్టు.

కడుపు గడచు

  • జీవనము గడచు, తిండికి జరుగు.
  • "కడుపు గడవడమే కష్టంగా ఉంది. ఇంక వాడు పిల్ల కేం పెళ్ళి చేస్తాడు?" వా.

కడుపు గొట్టు

  • జీవనాధారము పడగొట్టు.
  • "ఎవరెవరి కడుపులు గొట్టో వాడు సంపాదించాడు. అది కాస్తా దొంగలు దోచుక పోయారు." వా.

కడుపుచల్ల కదలకుండా

  • ఏ మాత్రం శ్రమ పడకుండా హాయిగా.
  • "నీ దయ, నెక్కడనుం బ్రొద్దు పొడుచు టెఱుగక నీ వే, దిక్కని యుందుము దాయలు, గ్రక్కతిలన్ గడుపుచల్ల కదలక యుండన్." రామా. 2. 7.

కడుపు చల్లగ పలుకు

  • మనసు కుదుట పడుమాట చెప్పు.
  • "ఏ మెఱుంగమె యార్తి గడుపు చల్లంగ బలికి కరుణ చేసితి..." ఆము. 7. 50.

కడుపు చల్ల చేసి పంపు

  • సంతాననష్ట మైనప్పుడు ఆమెను పుట్టినింటివాళ్లు తీసుకొనిపోయి ఆదరించి బట్టలిచ్చి పంపడం ఒక ఆచారం. ఆ సందర్భంలో అలా చేయుటనే కడుపు చల్ల చేసి పంపుట అంటారు.
  • "పాపం ! మీ అక్క పిల్లాడు పోయాడు రా నాయనా ! కడుపు కాలిన పిల్లను పిలుచుకొని వచ్చి కడుపు చల్లచేసి పంపడం మన ధర్మం." వా.

కడుపు చల్లని తల్లి

  • 1. బహుసంతానవతి.
  • "ఆవిడ కేం ? కడుపు చల్లనితల్లి. ఇంటి నిండా పిల్లలే." వా.
  • 2. వాత్సల్యపూర్ణురాలు.
  • "ఆవిడదగ్గ రుండడాని కేమిరా! కడుపు చల్లనితల్లి." వా. కడు____కడు 364 కడు____కడు

కడుపు చించి చూపితే గారడి విద్య

  • ఎంత తన దుస్థ్సితిని చెప్పుకొన్నా గమనించక పోయినప్పుడు అనేమాట. నిజంగా కడుపు కోసి చూపినా యిదంతా యింద్రజాలము లే అనుటపై వచ్చిన పలుకుబడి.
  • "నేను అప్పుల్లో మునిగిపోయాను మెఱ్ఱో అన్నా, వాడు ససేమిరా నమ్మడు. ఏం చేస్తాం? కడుపు చించి చూపితే గారడివిద్య అన్నట్లుంది." వా.

కడుపు చించుకొంటే కాళ్ళమీద పడుతుంది

  • తనవారి తప్పులను తాను బైట పెట్టకూడదు అనేపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "ఏం చెప్పుకో నమ్మా ! వాడు మరీ బరితెగి తిరుగుతున్నాడు. కడుపు చించుకొంటే కాళ్లమీద పడుతుంది." వా.

కడుపుచిచ్చు

  • ఆకలి.
  • "....కనికరం బుడిగి కడుపుజిచ్చునకు మ్రింగం దఱుముకొని వచ్చి..." మను. 5. 27.

కడుపు చుమ్మలు చుట్టు

  • కడుపులో కలుగు విపరీతమైన బాధను తెలుపుటలో ఉపయోగించునది. కడుపు తఱుగుకొనిపోవు వంటి పలుకుబడి.
  • ఇది ఆంగికమయిన బాధనే కాక, మానసిక బాధను కూడా తెలియజేస్తుంది.
  • "కడుపు చుమ్మలు చుట్టగా గన్న కన్నె, చిలుక నెడబాసి యేరితి నిలుచువాడ." శుక. 1. 462.
  • "కడుపుచుమ్మలు చుట్ట." పాండు. 3. 24.

కడుపు చుఱు క్కను

  • కడుపు మండిపోవు.
  • "కడుపు జుఱు క్కను గన్నవారికిని." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 929.
  • నేటి రూపము కడుపు భగ్గుమను.
  • "మా అబ్బాయి ఊరునించి చిక్కి సగ మయి వచ్చాడు. వాణ్ణి చూస్తే కడుపు భగ్గు మంటుంది." వా.

కడుపు చూచి పెట్టు

  • ఆకలి గుర్తెఱిగి అన్నము పెట్టు.
  • "మా అమ్మ పోయిం తర్వాత నాకు కడుపు చూచి అన్నం పెట్టెదిక్కు లేదు." వా.
  • చూ. కడు పారసి పెట్టు.

కడుపుచూపి కాళులొత్తి జీవించు

  • నీచముగా బ్రతుకు. రామచం. 30.

కడుపు చెక్క లగునట్లు

  • గట్టిగా, కడుపుబ్బగా.
  • "వాడి గంగిరెద్దువేషం చూస్తే కడుపు చెక్కలయేట్లు నవ్వు వస్తుంది." వా. కడు____కడు 365 కడు____కడు

కడుపు చెరు వగు

  • దు:ఖాతిరేకము కలుగు.
  • "ఆపిల్ల పడేబాధను చూస్తే కడుపు చెరు వై పోతుంది." వా.

కడుపుచేటు

  • వ్యర్థజన్మ మనుట.
  • "కలుగ నేటికి దల్లుల కడుపు చేటు." జాహ్నవీ. 1. 49.

కడుపు చేత పట్టుకొని

  • జీవనార్థ మై, జీవనాధారంకోసమని.
  • "వాళ్ళ సంసారం అంతా చితికి పోయింది. పాపం ! ఆవిడ కడుపు చేత పట్టుకొనిపట్ణానికి వెళ్ళిపోయింది." వా.
  • "దిక్కూ మొక్కూ లేక కడుపు చేత పట్టుకొని యింత దూరాభారం రావలసి వచ్చింది." వా.

కడుపు చేయు

  • గర్భము చేయు. కొంత నిరసనలో నే యీ మాట వినవస్తుంది.
  • "అవ్వసిష్ఠుడు, మదయింతికి గడుపు చేసె మదనక్రీడన్." భాగ. 9. 250.
  • "వాడు వాళ్లింట్లో ఉన్నట్లే ఉండి ఆ పిల్లకు కడుపు చేసి పాఱిపోయాడు." వా.
  • "వాడు దాన్ని నమ్మించి బేలు పెట్టి వంచించి కడుపుచేసి వదిలిపెట్టాడు." వా.

(నీ) కడుపు తఱగ

  • ఒక తిట్టు.

కడుపు తఱుగుకొని పోవు

  • తీవ్ర మైన ఆవేదనకు గుఱి యగు.
  • "దిక్కు లేని ఆ పిల్లలను చూచేసరికి నా కడుపు తఱుగుకొని పోయిం దంటే నమ్ము." వా.

కడుపుతీపు

  • సంతానముమీది ప్రేమ.
  • "పాపం ఆవిడ కడుపుతీపికొద్దీ అంతగా చెప్తున్నది గానీ తనకోసం కాదు రా బాబూ." వా.

కడుపు తీయించుకొను

  • గర్భస్రావము చేయించుకొను.
  • "ఆసకేశి రామేశ్వరయాత్రకు పోలేదూ, ఏమీ లేదు. ఎక్కడకో వెళ్లి కడుపు తీయించుకొని వచ్చిందట." వా.
  • చూ. కడుపు దించుకొను.

కడుపు తెచ్చుకొను

  • గర్భ మగు.
  • "జారు శశి బొంది కటా !, కడు పేల తెచ్చుకొంటి." భాగ. 9. 378.

కడుపుతో ఉండు

  • గర్భిణి యై యుండు
  • "మా పిల్ల యిప్పుడు కడుపుతో ఉంది. రోజూ కాసిని పూలు తెచ్చి పెడుతూ ఉండవె నాగమ్మా!" వా.

కడుపు దిగు

  • గర్భస్రావ మగు.
  • "కడుపు దిగె నంచు బౌరులు గలగ బడగ." భాగ. 10. 62.

కడుపు దించుకొను

  • గర్భస్రావము చేయించు కొను. కడు____కడు 366 కశు____కడు
  • "అది సంవత్స రాని కొకసారి కడుపు దించుకొంటూ ఉంటుంది. దాని కేం ? నీతా ? జాతా?"
  • చూ. కడుపు తీయించుకొను.

కడుపున ఒక కాయ కాచు

  • సంతానము కలుగు.
  • "నా కోడలి కడుపున ఒక కాయ కాస్తే చూచి పోదా మని ఉంది. ఆ ఆశ కాస్తా తీర్చు నాయనా ! ఇప్పు డీ సంబంధం కా దనకు." వా.

కడుపునకు పెట్టు

  • తిండి పెట్టు. ఇందు. 2. 15.

కడుపున చిచ్చిడు

  • గర్భశోకము కలిగించు.
  • "కొడుకులార ! నాదు కడుపున జిచ్చిడి." దేవీ. 6. 801.

కడుపున పుట్టిన కొడుకు

  • సొంత కొడుకు. ఔరసుడు. అత్యాదరమును స్ఫురింపజేసే పట్టుల ఉపయోగించే మాట.
  • "కడుపున బుట్టిన కూరిమి కొడుకున్." హర. 2. 75.
  • "తనకడుపున బుట్టినకొడుకు లట్టె." భార. ఆశ్ర. 2. 163.
  • "వాడు పరాయివా డయినా ఇతను కడుపున పుట్టిన కొడుకులాగా చూచుకున్నాడు." వా.

కడుపున బెట్టుకొను

  • వాత వేసుకొను.
  • "ఓరీ! చక్కనిమృగమును, గోరిక గడుపునను బెట్టుకొంటిని నా దే." షట్చక్ర. 2. 143.
  • "అన్ని కోళ్ళనూ ఆ దొంగరాముడే కడుపున బెట్టుకొన్నాడు." వా.
  • చూ. పొట్ట బెట్టుకొను.

కడుపు నిక్కు

  • గర్భ మగు.
  • "పోలిరెడ్డికి మగపోడిమి కేదుగా, గాది కేలాగున గడుపు నిక్కె." శుక. 2. 423.
  • చూ. కడుపు వచ్చు, కడుపు అగు.

కడుపునిండా కూడు - వంటి నిండా బట్ట.

  • ఆమాత్రం ఉంటే చాలును అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • " నా కేం కావాలి ? ఇంత కడుపునిండా కూడు-వంటినిండా బట్ట ఉంటే చాలు. కొడుకూ కోడలూ వాళ్లిష్టం వచ్చినట్టు సంసారం నడుపుకోనీ. నే నేమాత్రం కల్పించుకోను." వా.

కడుపునిండా పిల్లలు

  • కావలసినంత సంతానం ఉన్నదనుట.
  • "ఆమె కేం అమ్మా ! అదృష్టవంతురాలు. కడుపునిండా పిల్ల లున్నారు." వా.

కడుపునిండిన బేరము

  • అనవసరము కనుక అంత ఆసక్తి లే దనుట.
  • "నీ కేమయ్యా ! కడుపునిండిన బేరం. నేను నీలాగా బెట్టు చేస్తే కుదురుతుందా?" వా. కడు____కడు 367 కడు____కడు

కడుపు నిండిపోవు

  • చాలా సంతృప్తి అగు. వ్యంగ్యంగా అనుమాట.
  • "వచ్చీ రాక ముందే నువ్వు అనవలసిన మాట లన్నీ అన్నావు. దాంతోనే కడుపు నిండిపోయింది ! ఇంత భోజనం కూడా ఎందుకు?" వా.

కడుపునొప్పి వచ్చినప్పుడు అటుకులు తిన్నట్లు ఉంటుందా ?

  • పరిణామంలో గాని చెడుపని వలని ఫలితం తెలియ దనుట.
  • "అడుకులు దిన్నట్లగునే, కడుపున గుట్టెత్తినపుడు." భార. ద్రో. 4.
  • "కడుపు నొప్పి వచ్చినప్పుడు అటుకులు తిన్నప్పు డున్నట్లుండదు రా తమ్ముడా." వా.
  • "అటుకులు రుచిగా ఉన్నా యవి తింటే కడుపుకుట్టు వచ్చినప్పుడు బాధ పడవలసి వస్తుంది." వా.

కడుపుడక !

  • ఒక తిట్టు.
  • "వాని కడుపుడకా ! ఎంత రంపు చేశాడే." వా.

కడుపుపంట

  • సంతానము.
  • "కలుములవెలంది గారాపు గడుపు పంట." శ్రవ. 1. 6.

కడుపు పండు

  • సంతానవతి యగు.
  • "కాస్త మా కోడలి కడుపు పండిందంటే చాలు. మా కిం కేం కావాలమ్మా?" వా.

కడుపు పగులగా

  • కడుపు చెరు వగునట్లుగా. శోకాతిరేకము కలుగునట్లుగా.
  • "కడుపు పగులంగ గన్నుల, గడు గొల్పితి నీ రిదేమి?" బుద్ధ. 1.99.

కడుపు పగులు

  • భరింపరాని శోకము పాలగు.
  • "దిగులుచే నేమియు దెలియక, కడుపు పగిలి చెమర్చె." వర. రా. బా. పు. 93. పంక్తి. 22.

కడుపు పోవు

  • గర్భస్రావ మగు.
  • "ఆవిడ కీ మధ్య కడుపు పోయిందట." వా.
  • "పాపం ! ఆ పిల్లకు నాలుగు నెలల్లోనే కడుపు పోయిందట. దానితో సగం తీసిపోయింది." వా.

కడుపుబ్బ నవ్వు పుట్టించు

  • మనసారా నవ్వునట్లు చేయు.
  • "కన్యాశుల్కం చదువుతుంటే కొన్ని ఘట్టాలు కడుపుబ్బ నవ్వు పుట్టిస్తాయి." వా.

కడుపుబ్బు

  • 1. ఏదైనా రహస్యమును దాచలేక పోవుట.
  • "కడగి చెప్పిన గాని కడుపుబ్బు దిగదు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1035.
  • "ఎవరిని గురించి యే చెడు విన్నా ఊరంతా టాంటాం వేయందే వదలడు. వాడి కడుపుబ్బు ఇంతా అంతా అని చెప్పలేం." వా. కడు____కడు 368 కడు____కడు
  • 2. అసూయ.
  • "వాడికి నేనంటే చాలా కడుపుబ్బు." వా.

కడుపు బ్రోచు

  • పొట్ట పోసికొను.
  • "ఎచ్చోట కడుపు బ్రోతునొ యనుచున్." భార. విరా. 1. 268.

కడుపుమంట

  • అసూయ.
  • "నే నంటే వాడికి కడుపుమంట." వా.

కడుపుమంట పుచ్చుకొను

  • కడుపును మండించు అనగా బాధ పెట్టు.
  • "మక్కువ లేక నా కడుపుమంటయు బుచ్చికొనంగ బూని యీ, చక్కెర వంటిపండ్లు తినసాగి రటంచు..." శుక. 3. 376.
  • చూ. కడుపు మంట పెట్టుకొను, కడుపు మంట పోసుకొను.

కడుపు మంట పెట్టుకొను

  • కడుపును మండించు; బాధించు.
  • "వాడు ఊరికే వేధిస్తూ నా కడుపు మంట పెట్టుకుంటున్నాడు." వా.
  • చూ. కడుపుమంట పుచ్చుకౌను, కడుపుమంట పోసుకొను.

కడుపుమంట పోసుకొను

  • వేధించు, సాధించు.
  • "అది నేనొకటి చేస్తే ఒకటి చేస్తూ నాకడుపుమంట పోసుకొంటూ ఉంది." వా.
  • చూ. కడుపుమంట పుచ్చుకొను, కడుపుమంట పెట్టుకొను.

కడుపు మసి యగు

  • సంతానము వ్యర్థ మగు. పుత్రశోకము కలుగు.
  • "ఈతని గనదేని కన్నతల్లి, కడుపు మసి గాదె దయ్యమ ! కరుణ లేదె." ఉ. హరి. 5. 278.

కడుపుమీద కొట్టు

  • బ్రతుకు చెడగొట్టు; జీవనాధారము పడగొట్టు.
  • "ఆ యజమానితో వ్ వేవో తంటాలు చెప్పి, వాడు నా కడుపుమీద కొట్టాడు." వా.

కడుపులో ఆవాలు పోసినట్లగు

  • ఎక్కువ సంకటంగా ఉండు; ఆవేదనగా ఉన్న దనుట.
  • "ఆ విషయం వినేసరికి నాకు కడుపులో ఆవాలు పోసిన ట్లయింది." వా.

కడుపులో కెలికిన ట్లగు

  • సంకటముగా ఉండు.
  • "ఆ బండికింద పడి చితికిపోయిన శరీరం చూచేసరికి నాకు కడుపులో కెలికినట్లు అయింది." వా.

కడుపులో చల్ల కదలకుండా

  • ఏమాత్రం శ్రమ లేకుండ - హాయిగా.
  • "కడుపులో జల్ల గదలక కలికి వినుము." హంస. 4. 60.
  • "వాడి కేం? కడుపులో చల్ల కదలకుండా కూర్చున్నా జరిగి పోతుంది." వా. కడు_____కడు 369 కడు_____కడు

కడుపులో చెయి పెట్టి కలచినట్లగు

  • విపరీత మయిన సంకటము కలుగు. విచారముతో వికారము కలిగిన దనుట.
  • "కడుపులో జెయి బెట్టి కలచినట్లైన." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1723.
  • "ఆమాట వినెసరికి నాకడుపులో చెయ్యి పెట్టి కలచిన ట్లయింది." వా.
  • చూ. కడుపులో చెయిపెట్టి తిప్పినట్లగు.

కడుపులో చెయిపెట్టి తిప్పినట్లగు

  • "బావురు మంటూ ఉన్న యీ యిల్లును చూచినప్పు డల్లా కడుపులో చెయి పెట్టి తిప్పినట్లు అవుతుంది." వా.

కడుపులో దేవిన ట్లగు

  • చూ. కడుపులో చెయి పెట్టి కలచినట్లగు.

కడుపులోపలి పుండు

  • పైకి కనిపించనిబాధ. తాళ్ల. సం. 11. 3 భా. 38.
  • చూ. పేగులోపలి తీట.

కడుపులో పెట్టుకొను

  • తప్పులను మన్నించు.
  • "ఏమీ ఎరగనిపిల్లవాడు. ఏం తప్పుచేసినా మీరు కడుపులో పెట్టుకొని కాపాడండి." వా.
  • "వా డేం చేసినా నేను కడుపులో పెట్టుకొంటూ వచ్చాను." వా.

కడుపులో ప్రేవు లరుచు

  • ఆక లగు.
  • "నా కడుపులో ప్రేవు లరుస్తున్నవి.కాస్త యేమైనా వడ్డించేది ఉందా? లేదా? వా.

కడుపులో మంట మండు

  • అసూయ కలుగు.
  • "దు, ఎమార్గుల కడుపులో మంట మండె." శతా. 115.

కడుపు వచ్చు

  • గర్భ మగు.
  • "ఆపిల్లకు చిన్నతనంలోనే మొగుడు పోయాడు. పాపం ! ఏం చేస్తుంది. ఎక్కడ ఎవడు మోసం చేశాడో యేమో ! కడుపు వచ్చింది. ఇప్పుడు నలుగురిలో తల యెత్తుకో లేక పోతున్నది." వా.

కడుపు సాగు

  • తిండి లేకుండు. కడుపు నిండా తిన్న ప్పుడు కడుపు ఉబ్బి పొడవు తక్కువవుతుంది. అది లేనప్పుడు పొడ వెక్కు వవుతుంది.
  • "అంతగా వాని కడుపు సాగిన దేమిటీ?" వా.

కడుపుసుత్తు

  • గర్భశోకము.
  • "కడుపు సుత్తు తెల్పగరాని గాసి వెట్ట." దేవీ. 9. 98.
  • చూ. గర్భశోకము.

కడుపూద

  • కడుపుబ్బు.
  • చూ. కడుపుబ్బు. కడు____కణ 370 కత____కత

కడుపెడు కుమాళ్లు

  • కడుపునిండా సంతానము.
  • "కడుపెండేసి కొమాళ్ల గూతుల దగం గన్నట్టియిల్లాండ్రకున్." కళా. 7. 123.
  • చూ. కడుపు నిండా పిల్లలు.

కడుపే కైలాసము.

  • తిండే సర్వస్వము. తన కడుపు నించుకొనడం తప్ప మరొకటి కాబట్ట దనుట. స్వార్థపూరితు డనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "అంతముగ జూడ డంత వేదాంత విద్య, కడుపు కైలాస మరయ నక్కష్ట యతికి." పంచ. (వేం) 2. 94.
  • "ఎవ రెట్లా పాడై పోతే యేం? వాడికి కడుపే కైలాస." వా.

కడ్డాయముగా

  • నిర్బంధంగా - తప్పకుండా చేయ మనునట్లుగా - (తమిళం - కట్టాయం - తప్పక) రాయలసీమలో వాడుక:
  • "అంత కడ్డాయంగా మాట్లాడితే ఎట్ల నప్పా! కొంచెం వ్యవధి ఇవ్వు - నిల్చిపోయి ఉన్నా నిప్పుడు." వా.
  • "వాడు నన్ను బాకీ తీర్చి తీరా లని కడ్డాయం చేస్తున్నాడు." వా.

కణక బొసి వోవకుండ

  • ఒక్క ముక్క విడవకుండా - పూర్తిగా అనుట. కణిక=ఉండ లేక ఉంట అనే అర్థంలో అలవాటులో ఉన్న దే.
  • "చాముండిదేవి గరము గణక, బొసి వోవకుండ రాక్షసుల నెల్ల, మ్రింగి." కుమా. 12. 111.

కతకారి

  • మాటకారి.
  • "నెఱ లైనపెద్దలు నేరనియట్టి, కఱపులు గఱచె నీకతకారి బిడ్డ." అష్టమ. క. 1. 32.
  • చూ. కతలకారి.

కతకు కాళ్లు, ముంతకు చెవులు ఉండవు

  • అసంభవము అనుపట్ల ఉపయోగించు పలుకుబడి.
  • "కొడుకుపయి నీకు గడు బ్రే,ముడి గావున గతకు గాళ్లు ముంతకు జెవులీ,వడి గెదవు రాజ..." సారం. 3. 18.
  • రూ. కథకు...

కతపత్ర మిచ్చు

  • గట్టిగా చెప్పవచ్చు; ప్రమాణ పత్ర మివ్వవచ్చు.
  • "కతపత్ర మిడవచ్చు గల గాంచునపుడైన, గోరిక బరకాంత గోర డనుచు." పాండు. 1. 163.

కతపత్రము

  • ప్రమాణపత్రము. వ్రాసి ఇవ్వవచ్చు ననుట.
  • "కతపత్ర మిడ వచ్చు." పాండు. 1. 63.

కతలకారి

  • చూ. కతకారి. కత____కత్త 371 కత్తి____కత్తి

కతల పుట్ట

  • కథల కాణాచి. పుట్ట అనునది నిధానము, కాణాచి అన్న అర్థంలో ఎన్నో పదాలతో చేరి వినవస్తుంది.
  • "అన విని హేమావతి మో, మున నవ్వు జనింప గతలమునిపుట్ట సుమీ, కన నీదు కడుపు బ్రహ్మకు..." హంస. 2. 71.
  • చూ. అబద్ధాల పుట్ట.

కత్తరించినట్లు

  • తుంచినట్లు, సరిగ్గా. అట్లునకు బదులు చందము, కైవడి వగైరా ఉపమాన వాచకా లన్నిటితోనూ ఇది ఉపయుక్త మవుతుంది.
  • "కత్తరించిన చందంబున బందెంబు సఱచినవిధంబున." ఉ. హరి. 3. 123.

కత్తరి గలయు

  • సంకర మగు. కత్తెరలో అటుది ఇటూ, ఇటుది అటూ కలగలసి పోవుటపై వచ్చినపలుకుబడి.
  • "వర్ణములు నాశ్రమంబులు వసుమతీశ!, కలియుగంబున గత్తరి గలసిపోవు." హరి. ఉ. 9. 37.
  • "పెరుగును వడ్లును కలిపిన, కరణిన్ వర్ణాశ్రమములు కత్తరి గలయున్." జైమి. 8. 213.

కత్తరిల్లు

  • కదలు. కత్తెర ఆడినట్లాడు అనుటపై ఏర్పడినది కావచ్చును
  • "కటము లద్రువంగ మీ సాలు గత్తరిల్ల." నైష. 7. 46.

కత్తి కట్టు

  • విరోధము పూను; పగ బట్టు. కత్తి, పోరాటానికీ పగకూ సూచకము.
  • "వాడు నామీద కత్తి కట్టి ఉన్నాడు." వా.
  • "వీడు నామీద కత్తి కట్టితే ఏం లాభం? అసలువాడు వేరే ఉన్నాడు." వా.
  • రూ. కత్తి గట్టు.

కత్తికి ఎదురు లేదు

  • వాడి మాటను కాదనేవాడు ఎవడూ లేడు. వాడు చెప్పిన ట్లెల్లా జరుగుతుంది అనుట.
  • "ఈ పది పల్లెల్లోనూ ఆ రెడ్డిగారి కత్తికి ఎదురు లేదు." వా.
  • కత్తి ఇట పరాక్రమప్రాభవ సూచకము.

కత్తికి ఒడ్డుకొను

  • కత్తిదెబ్బ కాచుకొను.
  • "వ్రేటున కెత్తినట్టి ప్రతివీరుని కత్తికి నొడ్డుకొంట యె,చ్చోటను గల్గినట్టిది." కళా. 8. 72.

కత్తికోత

  • విపరీత మైనపోరు. తాళ్ల. సం. 3.181.
  • "ఈ కత్తికోత పడలేకనే ఆ కోడలు పాపం ఈ ఇంట్లోనుండీ వెళ్ళి పోయింది." వా. కత్తి____కత్తి 372 కట్టి____కట్టి

కత్తిగంటము

  • ఒక వైపు తాటాకులు కోసి కొనుటకు ఉపయోగించు కత్తిగా, ఒకవైపు వ్రాయుటకు గంటముగా ఉపయోగించునది.
  • "ముదుక తలపాగయును బాహుమూల మందు, గవితె చర్మపుటొరలోని కత్తి గంట, మలతి నీర్కావి దోవతి యమర గ్రామ, కరణ మేతెంచి రెడ్డిచెంగట వసించె." శుక. 2. 416.

కత్తిగొంటులు

  • ఱాచి రంపాన పెట్టువారు.
  • "కత్తిగొంటు లైనయత్తగంతు." కుమా. 8. 135.

కత్తిపీట

  • కూరలు తఱుగుకొను కత్తి గల పీట.
  • "ఆ కత్తిపీట యిలా తీసుకు వచ్చి కూరలు తరుగు. నాకు చెయ్యి తీరడం లేదు." వా.

కత్తిమీది సాము

  • కష్టసాధ్యము; అసిధారా వ్రతము. అసలు సాము చేయుటే కష్టం. ఇక కత్తిమీద సామైతే ఏక్షణంలో నైనా తెగిపోవచ్చు ననుటపై వచ్చినపలుకుబడి.
  • "పరికింపరు దొరతనపున్, సరవుల్ మఱి కత్తిమీది సాములు సుమ్మీ!" కువల. 4. 82.
  • "వాడితో వ్యవహారం కత్తిమీది సాము. ఏకాస్త పొరబా టొచ్చినా తగులుకుంటాడు." వా.

కత్తి రాతికి పాసినగొంటు

  • మొండివెధవ, ఒక తిట్టు. కత్తితో నఱికినా, రాతితో మోదినా చావని గొంటు వెధవ అనుటపై వచ్చెనేమో.
  • "పలుగత్తి రాతికి బాసినగొంటు." గౌర. హరి. ద్వి. 651.

కత్తిరించు

  • దొంగలించు; ఖండించు.
  • "కత్తి గుత్తుకను బిఱాన గత్తిరించి." చంద్రా. 2. 88.
  • "వాడిచేతి కేది యిచ్చినా కాస్త కత్తిరించుకొని గానీ యియ్యడు." వా.
  • చూ. జేబులు కత్తిరించు.

కత్తివాటుకు నెత్తురుచుక్క లేదు

  • వెల వెలపోయెను అనే అర్థంలో ఉపయోగిస్తారు. కత్తితో కొట్టినా రక్తం చిమ్మే స్థితిలో లే దనుట. 'ముఖంలో' అన్నట్లు ముందేదో ఉండి తీరాలి. క్రింది పలుకు బడిలోనూ అంతే.
  • "వాడు చేసిన వెధవపను లన్నీ నేను వరసపెట్టి చెప్పేసరికి, వాడి మొహాన కత్తివాటుకు నెత్తురుచుక్క లేదు." వా.
  • చూ. కత్తి వేస్తే...

కత్తి వేస్తే నెత్తురుచుక్క లేదు

  • వెల వెలపోయె ననుట.
  • "న న్నన్ని అన్నాడా! అకస్మాత్తుగా అక్కడ నేను కనిపించేసరికి వాని మొగాన కత్తి వేస్తే నెత్తురుచుక్క లేదు." వా.
  • చూ. కత్తివాటుకు... కట్టు____కత్తు 373 కత్తు____కత్తె

కత్తు కలుపు

  • ఏకీ భావము చెందు; జత కలుపు.
  • "వా డా ఊరికి వెళ్లగానే రెడ్డిగారితో కత్తు కలుపుకొన్నాడు. ఇం కేం?" వా.

కత్తుల పచ్చడిగా చేయు

  • కై మాకువలె ముక్కలు ముక్కలుగా నఱుకు.
  • "కత్తుల పచ్చడిగా జేసినట్లు, తుత్తు ము రై రూపు దోపక కలసి." గౌ. హరి. ప్రథ. పంక్తి. 517-18.

కత్తుల బోను

  • అటూ యిటూ కదలనీని ఆటంకము.
  • అతితర మైన బాధను కలిగించునది. అటూ ఇటూ మసల నీయనిది.
  • కత్తులబోనులో మనిషి దూరినప్పుడు ఎటు మసలినా కత్తి గుచ్చుకొంటుంది. పులులూ మొదలయిన క్రూర మృగాలను ఇలాటి కత్తులబోనులో పెడతారు. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "అత్తయు మామయు మగడును, గత్తులబోను లయి బిఱుసు గావలె నెపుడున్." జైమి. 3. 38.
  • "...ఏమిటి నెంచి చూచినన్, గత్తుల బోను కాపురము కామిని నీతల పొప్ప దీయెడన్." చెన్న. 4. 277.
  • "ఆ పిల్లకు అత్తవారిల్లు ఒక కత్తుల బోనులాగా తయా రయింది." వా.

కత్తులు గట్టు

  • పగ పూను.
  • "కత్తులు గట్టి కోలం గొట్టిన తెఱంగున." హర. 2. 28.
  • చూ. కత్తిగట్టు.

కత్తులు నూరు

  • పగ గొను, పోరాటమునకు సిద్ధపడు. ఆనాడు యుద్ధసన్నద్ధ మగుటలో కత్తులకు పదును పెట్టుట ఒక భాగం కదా.
  • ".............యింతలో, బచ్చని వింటివా డొక నెపం బిడి కత్తులు నూర నేటికిన్?" రాజశే. 3. 103.
  • "కాయజు డాకెపై నరిగి కత్తులు నూఱుచు నుండు నంతటన్." కళా. పూ. 7. 35.
  • "ఆరోజు తనకు నే నడగ్గానే ఋదో చేయలేదని అతగాడు నామీద కత్తులు నూరుతున్నాడు." వా.

కత్తులు కఠారులు నూఱు

  • పగ గొను; తగాదాకు సిద్ధపడు.
  • "ఆ వ్యాజ్యం వేశా నని నామీద వాళ్లు కత్తులూ కఠారులూ నూఱుతున్నారు." వా.
  • చూ. కత్తులు నూరు.

కత్తెరకాలు

  • మర కాలు. శ. ర.

కత్తెరగాయము

  • ఒక విధమైనకిటికీ.
  • "పురిచుట్టున్ నిశరుండు సారణుడు నున్ భోజాంధకుల్ గూడి క,త్తెర కత్తె____కత్తె 374 కథ____కథ
  • గాయంబుల గండముంగిళుల.... నిరంతరమున్ శోధనదీవె లెత్తి." ఉ. హరి. 2. 94.

కత్తెరదొంగ

  • జేబులు, సొమ్ములు మొదలగునవి కత్తిరించుకొని పోవుదొంగ.
  • "రద్దీగా ఉన్న తావుల్లో మదరా సంతా కత్తెర దొంగలు ఎక్కు వై పోయినారు." వా.

కత్తెరబీవిలీ

  • గూబకు పెట్టుకొను ఆడవాళ్ల ఆభరణము. ఇదే గూబబావిలీ; బావిరీ అని కూడా నేడు దీనిని అంటారు.
  • రూ. కత్తెరబావిలీ.

కత్తెరయెండలు

  • మండుటెండలు. కత్తెర అంటే కృత్తిక. కృత్తికా నక్షత్రంలో సూర్యుడు ఉండేకాలాన్ని దక్షిణాంధ్రంలో 'కత్తెర' అంటారు. అప్పు డటువైపు ఎండలు విపరీతంగా ఉంటాయి. అట్లే ఉత్తరాదిలో నేమో రోహిణి కార్తిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి.
  • "అప్పుడే కత్తెరయెండ లారంభ మయినవి. ఇక మధ్యాహ్నం బయటికి వెళ్ళడం సాధ్యం కాదు." వా.

కథ కట్టిపెట్టు

  • ఈ, ఆ ప్రసంగం చాలించు.
  • "నీ కథ కట్టిపెట్టి ఆప నేదో చూడు." వా.

కథకు కాళ్లు ముంతకు చెవులు కల్పించు

  • అసంభవములను సంభవము లనునట్లు, చెప్పు.
  • "కడమ వన్ని యు నిక నేల కతకు గాళ్లు, ముంతకు జెవులు గల్పింప ముజ్జగముల." సుదక్షి. 4. 25.

కథకు కాళ్లు లేవు ముంతకు చెవులు లేవు

  • కల్పితకథలలో వాస్తవికతకు, ప్రత్యక్షప్రమాణాదులకు తావు లేదు అనుట.
  • "మీట నొక్కితే సొరంగాలూ, మాళిగలూ ఈ నవలల్లో. కథకు కాళ్లు లేవు, ముంతకు చెవులు లేవు కదా."

కథ చాలదూరము వెళ్లు

  • మించి పోవు.
  • ఆ వ్యవహారం చాలా నడిచింది అనుపట్ల ఉపయోగిస్తారు. చేయి దాటిపోయింది, ఇక మనం చేసే దే ముంటుంది అన్న ఛాయలు కూడా యిందులో ఉన్నవి.
  • "కథ చాలా దూరం వెళ్ళిం దన్నమాట. వీడు పిలవడం వాడు రావడం కూడా నాకు తెలీకనే జరిగిందీ?" వా. కథ____కథ 375 కథ____కద

కథ తెలిసి వచ్చు

  • బండారము బయట పడు.
  • "ఏమీ తెలియని రైతులను ఏడిపించుకొని తినినట్టు కాదు. కరణమయ్యతో కంటు కట్టుకుంటే నీ కథ తెలిసొస్తుంది." వా.
  • "వాని కథ ఈనాటిక్కానీ నీకు తెలిసి రాలేదు. నే నెప్పు డనగా చెప్పాను. వాడు వట్టి దగుల్బాజీ అని?" వా.

కథల కామరాజు

  • కథల పుట్ట.
  • "వాణ్ణి పలకరిస్తే ఒక కథ చెప్తాడు. ఆ కథలకామరాజుతో పెట్టుకుంటే మన మీనాడు కొంప చేరుకున్నట్టే!" వా.

కథలు పన్ను

  • కల్పించు, ఏవో కల్పనలు చేసి మోసగించు.
  • "కఱకంఠ! యిది యేల కథలు వన్నెదవు." బసవ. 4. 104.
  • రూ. కథలుపన్ను.

కథలు, నీతులు, కారణాలు

  • కథలూ అవీ. జం.
  • "కథలును నీతులు గారణంబులును." పండితా. ప్రథ. దీక్షా. పుట. 152.
  • వాడుకలో రూపం:
  • కథలూ కారణాలూ.

కథలూ కారణాలూ

  • కథలూ అవీ. జం.
  • "ఏదో మధ్యాహ్నం పూట కథలూ కారణాలూ చెప్తూ ఉంటుంది మా బామ్మ." వా.
  • చూ. కథలూ కారుణ్యాలూ.

కథలూ కారుణ్యాలూ

  • కథలూ అవీ. జం.
  • చూ. కథలూ కారణాలూ.

కథా కమామీషూ

  • పుట్టు పూర్వోత్తరాలు. జం.
  • "దాని కథా కమామీషూ చెబుతాను విను." వా.

కథానాయకుడు

  • ముఖ్యుడు.
  • "ఈ వ్యాజ్యంలో కథానాయకుడు మీ మామే." వా.

కథాశేషు డగు

  • చనిపోవు.
  • చూ. కీర్తి శేషు డగు.

కదలారతి పళ్లెరము

  • వధూ వ రాదులు గృహ ప్రవేశం చేసేటప్పుడు హారతి యిచ్చు పళ్లెము.
  • "జాళువా కదలారతి పళ్లెరంబు సొంపున." చంద్రి. 4. 68.

కదలించి చూచు

  • సూచనగా అభిప్రాయం తెలుసుకొను.
  • "పోనీ. మీ మామ ఏమంటాడో కాస్త కదలించు చూడు. తర్వాత సంగతి చూతాం." వా.
  • చూ. కదిలించి చూచు.

కదలించు

  • అనవసరముగా రెచ్చగొట్టు.
  • "కదలింపకుము నన్ను గన్న మాయయ్య." పల. పుట. 48.
  • "న న్ననవసరంగా కదలించకు. తర్వాత విచారిస్తావు." వా. కది____కన 376 కన____కన

కదియబడు

  • కలబడు; పోరులో ఎదుర్కొను.
  • "అత్తఱి మాళవుండు గదియంబడి." దశ. 12. 65.

కదిలించి చూచు

  • ప్రస్తావవశంగా ఇంగితము తెలుసుకొను.
  • "అతణ్ణి కదిలించి చూస్తాను. అత డేమంటాడో చూచి ఆ తరవాత ఈ విషయంలో ఏదో ఒకటి నిర్ణయించు కొందాము." వా.
  • "వా రేమో పిలిస్తే తప్పకుండా వస్తాడు అని నువ్వు అంటున్నావు; రాడు అని నా నమ్మకం. అయినా కదిలించి చూడు. పోయే దేముంది?" వా.
  • చూ. కదిలించి చూచు.

కదుపు గట్టు (కొను)

  • గుంపు కూడు.
  • "పులుల కూనలు జింకపిల్లలు మృగేంద్ర, పోతకంబులు నాల క్రేపులును గదుపు, గట్టుకొని కూడి చూడ." శృం. శాకుం. 2. 49.

కదుము గట్టు

  • దెబ్బ తగిలి వాచు.
  • "నా మోకాలికి ఆ వాకిలి కొట్టుకొని కదుము కట్టింది." వా.

కనకతప్పెట

  • బంగారు తప్పెట.
  • వాద్యవిశేషము.

కనకన

  • కణకణ (మండు)
  • "కనకన వెలుగుచు." సడా. 1. 182.
  • "పొయ్యిలో నిప్పులు కనకన మండుతున్నాయి." వా.

కనకన మను

  • కణకణ మండు.
  • "కనకన మను నిప్పుదునుక లనగ." యయా. 2. 76.
  • చూ. కనకన.

కనకనలాడు

  • చూ. కనకన మను.

కనకస్నాన మాడించు

  • బంగారునీట ముంచు; అనగా అంత పచ్చగా అనుట.
  • "మేపూత, డంబుతోడ వచ్చె దుంబురుండు, కడలవారిని గనకస్నాన మాడించు, పదకమును సు నేత్రపటము దాల్చి." కళా. 2. 82.

కన నోపునె నుదుట కన్ను గల వా డైనన్

  • ఫాలాక్షు డయినా కన్నెత్తి చూడ లేడు అని అర్థం.
  • ఎంత గొప్పవా డైనా దానిని కన్నెత్తి చూడజాల డనుట.
  • "మత్కాంతారము, గన నోపునె నుదుట గన్ను గలవా డైనన్." శుక. 1. 280.
  • నేటిరూపం:

కనరువోవు

  • కాటు వోవు.
  • మంట సరిగా లేక వంట చెడి
  • 'ఫాలాక్షు డయినా సరే నేను జంకను', ఇత్యాది... కన_____కని 377 కని_____కని
  • నప్పుడు వేసే వాసనను కనరూ, కాటూ అంటారు.
  • "కనరు వోకుండ గాచిన యాన వాలతో." శృం. శాకుం. 1. 135.

కనరెక్కు

  • కాటు పోయి వాసన వచ్చు.
  • "ఈ కూర కన రెక్కి పోయింది. తిన లే నంటే తిన లేను." వా.

కనాకష్టం

  • కనీసం.
  • "ఆ తిరనాళ్లకు పోవా లంటే కనా కష్టం చేతిలో పదిరూపాయ లన్నా ఉండవలె గదా!" వా.

కనాకష్ట మైన

  • అతినీచ మయిన కొత్త. 253.

కనాతి గోడ

  • బట్టతో కట్టిన అడ్డు, హద్దు. వావిళ్ళ ని.

కని గుడ్డి - విని చెవుడు

  • కండ్లుండి కానలేక వీను లుండి వ్నలేక పోవుట.
  • "కని గుడ్డును నదె విని చెవుడును నిదె." తాళ్ల. సం. 8. 185.
  • "కని గ్రుడ్డియు విని చెవుడును, జనవర! నీ మాయ కిక నసాధ్యము గలదే?" కవిక.
  • "మీ లాంటివారి కెవ రేం చెప్తారు? కని గుడ్డీ విని చెవుడూ." వా.

కనినది గాదు విన్నదియు గాదు

  • అపూర్వం; అసంభవం.
  • "................నే, గనినది కాదు విన్నదియు గా దది తెల్పిన దెల్పు లేక యుం, డిన మఱి యూరకుండెదవు...." శుక. 2. 226.
  • వాడుకలో నేటిరూపం.
  • కన్నదీ విన్నదీ కాదు.

కనిపట్టు

  • కనిపెట్టు.
  • చూ. కనిపెట్టు.

కనిపెట్టు

  • ఏదో తెలుసుకొను.
  • "ఇందులోని ఆంతర్యం కని పెట్టి చెప్పావంటే కృతజ్ఞుణ్ణి." వా.
  • చూ. కనిపట్టు.

కనిపెట్టుకొను

  • నిరీక్షించు.
  • "నీ, కొనర నిత్తు నేను గనిపెట్టుకొని వచ్చి." కళా. 5. 197.
  • "నీ కోసం నేను పొద్దున్నించీ కనిపెట్టుకొని ఉన్నాను." వా.

కని పెంచు వయసు

  • పిల్ల లను కని పెంచ వలసిన వయసు అనగా యౌవనము. దశా. 6. 45.
  • వాడుకలో రూపం : కనీ పెంచే వయసు.

కని యెత్తి పెంచు జోలి లేదు

  • కని పెంచే బాధ్యత లేదు.
  • నేటి వాడుకలోనూ 'దానికి కని పెంచే బాధ లేదు' అన్నట్లు వినవస్తుంది.
  • "బిడ్డ పాపల గని యెత్తి పెంచు జోలి, లేదు." హంస. 3. 131. కనీ____కను 378 కను____కను

కనీ పెంచే వయసు

  • యౌవనం; ప్రాయము ఆడవారి విషయంలోనే దీనిని ఉపయోగిస్త్తరు.
  • "కనీ పెంచేవయసులో ఈ మలేరియా పట్టుకున్న దేమిటే నీకు?" వా.

కనీసపక్షము

  • అధమపక్షము; అంతకు తక్కువ కాకుండా.
  • "జయపురపాలనం బొసగి సాకినదాత కనీసపక్ష మా." నానా. 248.
  • "కనీసపక్షం ఆసభకు యాభై వేలమంది జనం వచ్చి ఉంటారు." వా.

కనుకట్టు

  • 1. మోసగించు. కన్నులు మూయు. లక్షణయా వంచించు, కానకుండ చేయు అని కూడా అర్థం.
  • "కనుకట్టి గాంగేయగర్భు డాగురు మూత, లాడించె వత్సాపహరణ వేళ." పాండు. 3. 178.
  • 2. ఇంద్రజాలము. మంత్రముతో - ఉన్నది కనబడకుండానో, మరొకవిధంగా కనబడునట్లుగానో చేయుట.
  • "కనుక ట్టొనర్చిన ఘాత లిడిన." ప్రబంధ. 7. 38.

కనుకట్ట విద్య

  • ఇంద్రజాలము.

కనుకని

  • వేగముగా, సంభ్రమముతో, తత్తఱపాటుతో, పట్టుదలతో. భార. అర. 6. 231.
  • "కాందిశికు లై కనుకనిం జని." కుమా. 2. 76.
  • "క్రతురక్షకుల దాకి కనుకని బో ద్రోలి." కుమా. 2. 66.
  • "ఎదిరిరిపుల్, గాలుదురు వీని గను కని, దూలందు రెందేని నర్కతూలమ వోలెన్." అదే. 4. 17.
  • "కనుకని దొల్లి దానిదె గన్నుల జూచినవాని నేయు నా,మనసిజుడు." అదే. 8. 153.

కనుకని బాఱు

  • వేగముగా పాఱు.
  • "కపులు వెనుదగుల గ్నుకనిం బాఱి." భాస్క. యుద్ధ. 650.

కనుకలి

  • చూడగా కలిగిన ప్రేమ. ఇలాంటిదే - వినుకలి.
  • "కర మర్థి నిను జూచి కనుకలి గలిచిన, పడతుల కల్పు నిష్ఫలము గాగ." కుమా. 5. 74.
  • "ఇన్నాతి చెలువంబు గన్న శచీ ప్రియుం,డైనను గనుకలి నవయకు న్నె." భార. విరా. 2. 27.
  • "ఈస్వరు జూచి, కనుకలి మింద్రియ స్థలనంబు గాగ." పండితా. ప్రథ. వాద. పుట. 683.
  • "కనుకలి వినుకలి గలిగినట్టి పాపము." భాగ. 6. స్కం. 46.
  • దృష్టి, చూపు అని వావిళ్ల ని. అది సరి అని పై ప్రయోగాలు సూచించుట లేదు.

కను కల్గి

  • సావధానతతో. కను____కను 379 కను____కను
  • "కనుకల్గి తత్పాద కంజాతములకు సాగిలి మ్రొక్కి." వర. రా. రా. పు. 195. పంక్తి. 24.
  • "ఈ విషయంలో కాస్త కనుకలిగి ప్రవర్తించక పోతే ప్రమాదం తప్ప దనుకుంటాను.." వా.
  • చూ. కను గలిగి...

కనుకుట్టు

  • పగదాయి; అసూయ.
  • "కలువకనుకుట్టు." సాంబో. 2. 145.
  • "వాడికి నన్ను చూస్తే కనుకుట్టు." వా.

కనుకుట్టుతనము

  • అసూయ; ఓర్వ లేనితనము.
  • "కనుకుట్టుతనంబున నతని ధర్మంబునకు విఘ్నంబు గావింప దలచి." భోజ. 6. 125.

కనుకూర్కు

  • నిద్రించు.
  • "జరఠ యొకర్తు...కనుకూర్కు చుండ." రమా. 2. 97.

కనుకూలి

  • గింజల కూలి. బ్రౌను.

కనుకోనలు

  • కండ్ల లోతులు.
  • "వాడికి కనుగోనలలో ఎక్కడో కాస్త ఊపిరి టకటక లాడుతూ ఉంది." వా.

కనుగంట చూచు

  • కన్ను లార చూచు.

కనుగట్టు

  • కనులు కానకుండా చేయు. మఱపించు, మోసగించు.
  • "నీకామ శాస్త్రముల్ బిడ్డ, కన్గట్టి కాళ్ళను గట్టింప నెట్లు, విచ్చేయు." పండితా. ప్రథ. పురా. పుట. 362.
  • "కనుగట్టి గాంగేయగర్భు డా గురు మూత, లాడించె వత్సాపహరణవేళ." పాండు. 3. 178.
  • "సొరిది నిందఱి కనుగట్టి సున్న బెట్టి." రాధి. 4. 81.
  • రూ. కనుకట్టు.

కను గలిగి యరయు

  • జాగ్రత్తగా పరిశీలించు.
  • "కను గలిగి యరసిననుం దేటపడి యెడు." భార. శాంతి. 2. 366.

కను గలిగి మెలగు

  • జాగ్రత్తగా మెలగు.
  • "పెనిమిటియు నత్త వదినెలు, కను గలిగి మెలంగ వెడలగా నెడ లేమిన్..." శుక. 2. 508.

కను గల్గి యుండు

  • జాగ్రత్తతో నుండు.
  • "తనకు మృత్యువుచేర దఱి యయ్యె గానం కనుగల్గి యుండ వేగ మె పల్కు డరిగి." వర. రా. సుం. పు. 89. పంక్తి. 17.

కనుగవ కోరగించు

  • కను లెఱ్ఱ నగు.
  • "అచ్చట నెత్తురు గ్రక్కెనో యనం, గనుగవ గోరగింప బొడకట్టె సముజ్జ్వల సాంధ్య రాగముల్." పారి. 2. 32.

కనుగవ నెఱసంజ వొడము

  • కన్నెఱ్ఱజేయు అనగా కోపించు.
  • "చ,య్యన వచ్చి యొక్క నెచ్చెలి, కను కను____కను 380 కను____కను

గవ నెఱసంజ వొడమగా నిట్లని యెన్." పారి. 1. 74. కనుగానమి

  • గర్వము.

కనుగాపు

  • కనుసైగను గ్రహించి పని చేయు సేవకుడు. కనిపెట్టుకొని యుండువాడు.
  • "కనుగాపు లట్ల మువ్వెట్టియు జేసి చేసియును వేసరి." హర. 3. 11.

కనుగిట్టు

  • కను గీటు.
  • "కనుగిట్టి చూపువారును..." కుమా. 2. 82.

కనుగిఱపు

  • కనుసన్న చేయు.
  • "విప్రస్ఖాలిత్యము బైలు సేసి కనుగిఱపు సభన్." ఆము. 4. 47.

కను గీటు

  • కనుసైగ చేయు.
  • "గౌతము డత్రికి గను గీటె." గౌ. హరి. ప్రథ. పంక్తి. 125.

కనుగొనల నిప్పు లురలు

  • కోపించు. కోపము వచ్చినప్పుడు కన్ను లెఱ్ఱబడుట ద్వారా వచ్చిన పలుకుబడి.
  • "అని తెంపు చేసి కనకన, గనుగొనల న్నిప్పు లురలగా వాలము..." శుక. 2. 252.
  • చూ. కన్నెఱ్ఱ, కన్నెఱ్ఱ చేయు.

కనుగొను

  • కన్ను గలుగు, చూచు.
  • "ఈ తటినిం, గను గొను పుణ్యుడు మిక్కిలి, కనుగొను నెన్నుదుట." దశా. 1. 123.

కనుగొలుపు

  • సైగ చేయు.
  • "తనమ్రోలం, గనుపట్టు ననుంగుపట్టి కనుగొలుపుటయున్." నీలా. 1. 84.
  • రూ. కనుగిలుపు.

కనుచాటు

  • 1. రహస్యము.
  • "కన్నయాత్మజుని గనుచాటుగా నుండగను జాటు వెట్టి." రంగ. ఉత్త. 92.
  • 2. కనుమఱుగు.
  • "చని నూతిలోపల గుభు, ల్లన నొకగుం డెత్తి వైచి యల్లన గనుచా, టున నిలువ బడియె..." శుక. 2. 135.

కనుచాటు చేయు

  • అదృశ్యము చేయు.
  • "రాఘవామోఘాస్త్ర మేను, కను చాటు చేసి యేగతి నైన దొలగి, చంపి వచ్చెద." వర. రా. యు. పు. 45. పంక్తి. 12.

కనుచాటుతిండి

  • దొంగతిండి.
  • ఒకరికి తెలియకుండా అనుభవించుట అన్న అర్థంమీద లక్షణయా వ్యభిచారం అన్న అర్థంలో కూడా యిది ప్రయుక్తం. కను____కను 381 కను____కను
  • "కనుచాటుతిండి నడిపిన, పనులం గండలును బెరిగి బకుతండ్రి హిడిం,బుని కొడుకు..." శుక. 2. 207.

కనుచాటుమెలకువ

  • రహస్యప్రవర్తనలు - దొంగ చాటు వ్యవహారాలు.
  • "సతి కొడిగట్ట లేనికనుచాటు మెలంకువ తీగ బోండ్లకున్, గడుపులు దించ..." శుక. 2. 24.

కనుచీకటి

  • మునిచూపు చీకటి. అప్పుడప్పుడే చీకటి వ్యాపిస్తున్న సమయము.
  • "అప్పుడే కనుచీకటి పడింది. త్వరగా ఊరు చేరుకోవడం మంచిది." వా.

కనుచూపు

  • దృష్టి.
  • "వాడి కీ మధ్య కనుచూపు తక్కువయింది. అద్దాలు పెట్టుకోవాలో ఏమో?" వా.
  • "వాడికి ఈ మధ్యే కనుచూపు కొంచెం మధ్యస్థ మయింది." వా.

కనుచూఱ యొసగు

  • కనువిందు కూర్చు.

కను చెదరు

  • అజాగ్రత్తగా నుండు.
  • "కార్యవేళల నిట్లు కను చెదరుదురె." వర. రా. యు. పు. 182. పంక్తి. 10.

కనుదోయి నీరు చిలుకు

  • కన్నీరు చిందు.
  • "కర్ణి కాకుసుమ రింఖన్మరందంబుతో, నిడువాలు గనుదోయి నీరు చిలుక." శుక. 1. 486.

కనుదోయి పదివేల్ వలయు

  • అంత దర్శనీయము అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • చూచుటకు పదివేల కండ్లు కావలె ననుట.
  • ఈ సంఖ్య అటూ యిటూ ఎక్కు వవుతూ, తగ్గుతూ ఉంటుంది.
  • "నరు నత్యద్భుతవిక్రమ, పరిణతి సూడ గనుదోయి పదివే ల్వలయున్." భార. కర్ణ. 2. 283.
  • చూ. రెండు కండ్లు చాలవు.

కనుపట్టు

  • కనబడు.
  • "నవాంబుదంబు కనుపట్టె." రుక్మాం. 3. 82.

కనుపాటు

  • 1. దృష్టిదోషము.
  • "సుదతి నీమై జక్క జూచుట కోడెద, గనుపాటు వొరయునో యని తలంచి." భార. విరా. 2. 47.
  • 2. దృష్టి.
  • "శివుని కనుపాటు దాకని చిత్త భవుడొ." విక్ర. 8. 52.

కనుపాప వలె

  • అత్యాదరంతో అపురూపంగా - చూచుకొనవలసిన దనుట. కనుపాప వంటిది అనుటపై వచ్చిన పలుకుబడి.
  • "లేక లేక కలిగిన ఆ పసిపాపను వాళ్లు కనుపాపలాగా చూచుకొంటారు." వా. కను_____కను 382 కను_____కను

కనుపుగొట్టు

  • 1. పశువులను కొట్టినట్లు కొట్టు, పాఱు వేటాడి కొట్టు, తఱిమి తఱిమి కొట్టు అనుట. కనుముపండుగలో పాఱువేట ఒకభాగము. కనుము పైనే వచ్చినది కనుప. (కనుపు+కొట్టు.)
  • "కర్ణనందను డిట్లత్యుదీర్ణ భంగి, బాండు రాజతనూజుల బలము నెల్ల, గనుపుగొట్టంగ జొచ్చిన..." భార. ద్రో. 1. 196.
  • "ఇవ్విధంబునం గురుసేనం గనుపుకొట్టి నవ్వుచున్న కవ్వడిం గనుగొని." భార. ద్రో. 3. 159.
  • "వేదండకాండంబులు తండతండంబు లై పయింబడం బడలు వడం గనుపు కొట్టినయప్పట్టున." జైమి. 2. 75.
  • 2. క్షోభపెట్టు.
  • "అతండు ప్రీతుం డై కశ్య పాదులం గనుపుగొట్టు మని పనిచిన." భార. అను. 3. 220.
  • 3. నశింపజేయు.
  • "అమ్మహాభాగు డద్రిజాప్రాణనాథ, కథలదురితంబు లన్నియు గనుపు గొట్టె." ఉద్భ. 1. 8.
  • "అందు మందాకినీ నందనుం డమంద పరాక్రమ క్రీడం గౌంతేయబలంబు గనుపుగొట్టె." భార. భీష్మ. 2.

కనుబడి యగు

  • ఆదాయము వచ్చు. లాభము కనిపించు. కాశియా. 228.

కనుబా టగు

  • దృష్టిదోషము తగులు.
  • "కనుబాటు గాకుండ వనిత చన్దో యికి." భాస్క. కిష్కిం. 60.

కనుబేటము

  • 1. విరాళి.
  • "ఒకచెం,గట నుండెం దెలియరానికను బేట మనన్." సింహ. 12. 30.
  • 2. ప్రేమ; దృష్టిజనిత ప్రేమ. కుమా. 5. 44.

కనుబొమ్మలు

  • కనుసోగలు.
  • "వాని కనుబొమ్మ లెంతో అందంగా ఉన్నవి." వా.

కనుబ్రాము

  • మోసగించు. వర. రా. యు. పు. 182. పంక్తి. 10.

కనుమబ్బు

  • కనుచీకటి. వేం. పంచ. 1. 246.

కనుమఱి చెడు

  • బయట పడిపోవు, చాటు తప్పు.
  • "కనుగీటి చూపువారును, గనుమఱిచెడి పట్టు జూప గడగెడివారున్." కుమా. 2. 82.

కనుమఱువడు

  • కనుమఱుగు చెందు, దాచి పెట్టుకొను, దాగుకొను.
  • "కనుగిట్టి చూపువారును, గను మఱి కను_____కను 383 కను____కను
  • "చెడిపట్టు జూప గడ గెడువారున్, గని కడపి పుచ్చువారును, గనుమఱుపడు వారు బరుల గనుగొనువారున్." కుమా. 2. 82.

కనుమాటు

  • మోసగించు, కనుమొఱగు.
  • "ఒరులు తెలియక యుండన్, గను మాటి తిరుగుచుందురు." రాధా. 1. 99.

కనుమాయ

  • ఇంద్రజాలము.
  • "కనుమాయకరణి యయ్యె." హరి. పూ. 9. 142.

కనుమారిపడు (ఉఱుకు)

  • కొండమీదినుండి దుమికి ప్రాణములు తీసుకొను. మరు ప్రపాత మని సంస్కృతంలో దీనికి పేరు. శిక్షగానూ, లేక తన పాపములకు ప్రాయశ్చిత్తము గానూ దీనిని కొందరు పూర్వం ఆచరించేవారు.
  • "కల్లు ద్రావినపాతకంబు...కనుమారి నుఱుకంగ బాయు." భార. శాంతి. 1. 307.
  • "పాయ దగు మిమ్ము గనుమారి బడ బొసంగు, విషము ద్రావుట యోగ్యంబు." ఉత్త. 4. 56.

కనుముక్కుతీరు

  • అంగసౌష్ఠవం.
  • "ఆ అమ్మాయి కనుముక్కు తీరుగల మనిషి." వా.
  • "ఆ పిల్ల కనుముక్కుతీరు ఎంతో బావుంటుంది." వా.

కను మూయు

  • 1. నిద్రించు.
  • "విషాద వేదనన్, ముప్పిరిగొన్న చింత గనుమూయ నెఱుంగక నెమ్మనమ్ములో, నెప్పుడు తెల్లవాఱును..." కా. మా. 2. 137.
  • "కనుమూయ నెఱుగక." కవిక. 2. 132.
  • 2. మోసగించు.
  • "కపురంపుబలు కంచు గనుమూసి కటకటా!, బూది గప్పిన నిప్పు బాదు కొల్పి." చంద్రా. 4. 167.

కనుమూసి గంత

  • దాగిలిమూతలాట.
  • "కనుమూసిగంత నలుకంబాలాట..." కళా. 6. 202.

కనుమోడ్చు

  • నిద్రించు.
  • "నడురాత్రి యరుదెంచె నరలోకనాథ,కడు డస్సినా డవు కనుమోడ్తు గాక." రంగ. రా. బాల. పు. 39. పంక్తి. 15.

కనుమోసము

  • ఎట్టయెదుటే చేయుమోసము.
  • "కను, మోసము లే కొక్క మొగిన ముసరగ వలయున్." భార. విరా. 4. 230.

కనుఱెప్ప వెట్టని

  • కన్ను మూయని.
  • "కనుఱెప్ప వెట్టని తన వేయి కన్నుల." భాస్క. అరణ్య. 43.

కనుఱెప్పలు తేలవైచు

  • తెలివి తప్పిపోవు. కను____కను 384 కను____కను
  • శోష వచ్చి పడిపోవుపరిస్థితిలో కనులు తేలవేయడం అలవాటు.
  • "కనుఱెప్పలు దేల వైచి కడు సోలుటయున్." కళా. 6. 250.

కనుఱెప్ప వేయక చూచు

  • తేఱి చూచు. కాశీ. 4. 99.

కనులకు గంతలు కట్టు

  • మోసగించు.
  • "అది మొగుడికండ్లకు గంతలు కట్టి ఊరంతా సటారిస్తూ ఉంటుంది." వా.

కనులార్చు

  • కనుసైగ చేయు; కనుఱెప్పలు పదేపదే అల్లార్చు.
  • "పొరుగింటిబ్రాహ్మణి బుణ్య గేహిని నేల, యపహరించితి కనులార్చి యార్చి." కాశీ. 7. 256.
  • "కండ్లార్పేవాడు ఇండ్లార్పుతాడు." సా.

కనులు చింతనిప్పు లగు

  • కోపము కలుగు.
  • "సభలో అత నేదో తప్పు పట్టేసరికి శాస్తుర్ల వారి కళ్లు చింతనిప్పు లయ్యాయి." వా.

కనులు చెమర్చు

  • దు:ఖము కలుగు.
  • "అతనిని చూడగానే ఆవిడ కన్నులు చెమర్చినవి. ఎంత సుఖముగా నున్న వాడు ఏ స్థితికి వచ్చినాడు!" వా.

కనులు తీసుకొని చూచు

  • కను లింత చేసికొని నిరీక్షించు.
  • "అని కనులు దీసికొని యా,తని రాకకు నెదురు చూచు..." శ్రవ. 4. 62.

కను లెఱ్ఱ చేయు

  • కోపించు.
  • "కలుషించి అనపోతు కను లెఱ్ఱ చేసి." పల. పు. 48.

కనువిం దగు

  • నేత్రపర్వ మగు. శుక. 1. 507.
  • చూ. కన్నులపండువగు.

కను విచ్చి చూచు

  • కండ్లు తెఱచి చూచు.
  • "అంత గను విచ్చి చూచె నన్నాత డేను, బ్రణతి జేసితి..." కళా. 4. 154.

కను విచ్చు

  • కనులు తెఱచు.
  • "కను విచ్చి ననుం జూచు." భర. ద్రోణ. 1. 40.

కనువి ప్పగు

  • తెలిసి వచ్చు.
  • "వాడు చెప్పిం దంతా వినేసరికి నాకు కనువి ప్పయింది." వా.

కనువెలుగు

  • దారి చూపువాడు.
  • "కనువెలుగు నీవు గా నీ, వెనుక భవన్మతమ యూది వీరలు నేనుం, జను దెం చెదము..." భార. ద్రోణ. 1. 66.

కనువేదుఱు

  • విరహము.
  • "చూపులన్, విన్నదనంబు దోప గను వేదుఱునన్ బయిగాలి సోకినన్, వెన్న వలెం గరంగు..." మను. 2. 57. కను____కన్న 385 కన్న____కన్న

కనువేదు ఱెత్తు

  • చక్షూరాగము కలుగు.
  • "కసిగాటుపెనకువ కనువేదు ఱెత్తి." వర. రా. బా. పు. 50. పంక్తి. 6.

కనువేయు

  • మోహించు.
  • "వీ డా పని పిల్ల మీద కనువేసినట్టున్నాడే!" వా.
  • చూ. కనువైచు.

కనువైచు

  • కన్ను వేయు.
  • "ఒక్కమగవానిపయిన్ గనువైచి తేమొ? కువ. 3. 107.
  • వాడుకలో రూపం; కన్ను వేయు.
  • చూ. కనువేయు; కన్నువేయు.

కనుసన్న

  • సైగ.
  • "అన్యసతుల, యునికి గనుసన్న జూపె నా యుత్పలాక్షి." కళా. 6. 124.

కనుసన్న మెలగు

  • అజ్ఞానువర్తి యగు.
  • "నీ కనుసన్నన మెలగెద, నేకార్యం బైన నడపు మీవ తగంగన్." భార. విరా. 2. 124.

కనుసోగ

  • కనుబొమ్మ.
  • చూ. కన్సోగ.

కన్న కడుపు

  • కన్న తల్లి
  • "కన్నకడుపు గాన గాంక్ష మిక్కుటము." పల. పు. 52.

కన్నకూళ్లు కుడుచు

  • అన్ని నీచాలకు పాల్పడు.
  • "వాడు కన్నకూళ్ళూ కుడిచి అంత బావుకున్న దేమిటో తెలీదు." వా.
  • చూ. కన్నగడ్డీ కఱచు.

కన్న కొడుకు

  • ఔరసుడు. ప్రేమాతిశయాన్ని తెలియ జేయవలసినపట్ల దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
  • "వాణ్ణి చిన్నతనంనుంచీ కన్న కొడుకుగా చూచుకుంటూ వచ్చాను." వా.

కన్న గడ్డీ క`రచు

  • ఎంత నీచాని కైనా పాల్పడు.
  • "కన్న గడ్డీ కఱిచేవాడు ఎం తైనా సంపాయించ వచ్చు. దాని కేం?" వా.
  • చూ. కన్నకూళ్లు కుడుచు.

కన్న గడ్డీ తిను

  • చూ. కన్నగడ్డీ కఱచు.

కన్నగాడు

  • దొంగ. ఇండ్లకు కన్నము వేసేవాడటవల్ల వచ్చినది.
  • "నా దగు తారకా రుచిధనంబు హరించినకన్న గాడు." విప్ర. 3. 22.

కన్నడసేయు

  • తిరస్కరించు, ఉపేక్షించు.
  • "సేవకునింట శివార్చనంబు మే, ల్గదుర నొనర్పగా వలయు గన్నడ సేయక మీర లన్న..." చెన్న. 4. 333.

కన్నడుగుచేయు

  • అగుడు పెట్టు. కన్న____కన్న 386 కన్న____కన్న
  • ".....నీవే, కన్నడుగు చేసి తేమని విన్నప మొనరింతు..." వాల్మీ. 3. 33.
  • ఇది కాన్నగుడు కావచ్చును.

కన్నతండ్రి

  • 1. ఆదరంతో చేయుసంబోధన.
  • "ఎన్న డభ్యాస మాయెరా కన్న తండ్రి." నిరంకు. 2.83.
  • 2. తండ్రి.

కన్న తల్లి

  • తల్లి; కన్న తల్లివలె అతి వాత్సల్యంతో చూచుకొను ఇల్లాలు.
  • "నన్ను కన్నతల్లి యన్న పూర్ణా మహాదేవి." భీమ. 3.9.

కన్నదిక్కున జాఱు

  • దిక్కులుపట్టి పరుగెత్తు.
  • "కలగి కన్నవారు కన్నదిక్కున బాఱి, పోయిరి." ఉ. హరి. 4. 66.
  • ఈ 'కన్న' అన్నది 'నానా' అన్న అర్థంలో మనకు బాగా అలవాటు.
  • "వాడు కన్నవాళ్ల కాళ్లు పట్టుకొన్నాడు." వా.
  • ఇత్యాదు లూహ్యములు.

కన్నది గతిగా

  • ఎటు పడితే అటుగా
  • "కన్నది గతి గాగ గిన్నరు లరిగిరి." పారి. 5. 37.

కన్నదే గాతిగా

  • దొరకినదే చాలు నని.
  • "తండ్రీ! సారెకు దువ్వు నాగ్రహము మీదం గన్నదే గాతిగా, గుండ్రాలం గొని దాయ గాక...." వరాహ. 59. 3.

కన్నపుదొంగ

  • గజదొంగ.
  • కన్నము వేసి దొంగతనము చేయువాడు.
  • "సిరిమనోధనము మ్రుచ్చిలినకన్నపు దొంగ." నిరంకు. 1. 2.

కన్న పెట్టు

  • 1. దొంగిలించుటకై కన్నము వేయు.
  • "యామికావళికన్ను బ్రామి యంత:పురాం,గణము లైనను జొచ్చి కన్న పెట్ట...." శుక. 2. 502. క్రింద.
  • 2. దొంగతనము చేయు.
  • "ప్రజల యిండ్ల గన్న వెట్టని దొక్కటే కాని కొదవ." నిరంకు. 2. 26.
  • "మావీటం గన్న పెట్టి..." దశ. 4. 24.
  • చూ. కన్న మిడు.

కన్న మరులు

  • పితృమాతృవాత్సల్యము.
  • "కన్న మరులుకన్నా పెంచిన మరు లెక్కువ." వా.

కన్న మిడు

  • కన్నము వేయు.
  • "ఒకనా డేగురు దొంగలు...కన్నమిడువాంఛన్ వచ్చి." ద్వాదశ. 10. 115.
  • చూ. కన్న పెట్టు.

కన్నము పెట్టు

  • కన్నము వేయు. కన్న_____కన్న 387 కన్న_____కన్న
  • "రాత్రి సెట్టిగారిల్లు కన్నంపెట్టి సొత్తుల పెట్టె దొంగిలించా రట." వా.
  • చూ. కన్న పెట్టు.

కన్న పోవు

  • దొంగతనము పోవు. పరమ. 5. 15.

కన్నయ్య

  • 1. కన్న తండ్రి.
  • "అని యామిటారి చిగురుకటారి రాయల కన్నయ్యతో మఱియు నేననుచున్నది:-" హేమా పు. 51.
  • 2. కృష్ణుడు. శ. ర.

కన్నఱ

  • చూచుటకు దుర్భర మైన విచారము.
  • తమి. కన్ఱావి.
  • "తలిదండ్రులు వా రెట నున్న వారొ యీ,కన్నఱ జూడ బా లయితి." రామా. 2. 41.

కన్నఱి

  • కన్నఱ కలవాడు, దు:ఖితుడు.
  • "కిన్నరులు గన్నఱులుగా భూతంబులు భీతంబులుగా." ఉ. హరి. 6. 28.
  • చూ. కన్నఱ.

కన్నవస్థా పడి

  • నానాబాధ పడి.
  • "కన్నవస్థాపడి ఆ ఉద్యోగం యిప్పిస్తే మీవాడు రాజీనామా పెట్టి వచ్చాడు." వా.

కన్నవస్థా పడి కంచిలో చేయి కడిగి

  • ఎన్నో బాధలు పడి.
  • "చేతిలో దమ్మిడీ లేకుండా బయలు దేరాను. కన్నవస్థా పడి కంచిలో చెయ్యి కడిగి ఎలాగైతే నేం పట్ణం చేరుకున్నాను." వా.

కన్న వాడు

  • తండ్రి.
  • చూ. కన్నాడు.

కన్న వారు

  • ప్రతివారు.
  • "కోరెన్ వెండియు గన్న వారలకు సంక్షోభింపకే మ్రొక్కి." కా. మా. 2. 89.
  • "ఉన్నదైతేయు లందఱు గన్నవారు, కన్నదిక్కుల బోయి సాగరములోన, నడగిరి." ఉ. హరి. 4. 240.

కన్నవిటి

  • గ్రుడ్డివాడు.
  • "చెవిటికి శంఖధ్వని గ,న్న విటికి దీపంబు...వృథ యగున్." భల్లాణ. 4.

కన్న విన్న యది కాదు

  • వింత.
  • "ఎన్నుకొన్న లో,కమునను గన్న విన్న యది గా దది కొంత నిజంబు కొంత స్వ,ప్నము నని..." ప్రభా. 122.

కన్న వెట్టు

  • దొంగిలించు.
  • "వన్నె మాటల వలతువా నీవు నా మనసు, కన్న వెట్టంగ గదా కడు బేల నైతి." తాళ్ళ. సం. 3. 281.
  • చూ. కన్న పెట్టు.

కన్నళవి సేయు

  • గొడవ పెట్టు; ఉపేక్షించు.
  • "కన్నళవి సేయక కరుణ మీఱగా." హేమా. పు. 51. కన్న____కన్నా 388 కన్నా____కన్ని

కన్నళవు చేయు

  • అగుడు పెట్టు; గొడవ పెట్టు.
  • "కన్నళవు సేయు గచ్ఛపాకారగరిమ గరిమరాళికయాన నీ చరణమహిమ."
  • అరవంలో ఎళువు - ఏడుపు, నేటికీ దక్షిణాంధ్రంలో అల్లరి, అగుడు అనే అర్థాలలో ఈ మాటను ఉపయోగిస్తారు.
  • "ఏమిట్రా ఈ యెళువు?" వా.

కన్నాకు

  • ప్రథానము, ముఖ్యము. ముఖ్యుడు. శ్రేష్ఠుడు.
  • తమలపాకులకట్టలో పైన పెట్టేఆకు మంచిది చూచి పెడతారు. అదే కన్నాకు. తద్వారా వచ్చిన పలుకుబడి.
  • "కన్నాకు మనకు భీష్ముడు." భీష్మ. 1. 76.
  • "మంత్రులు పన్నిద్దఱకును... గన్నాకుగా బెద్ద గద్దియ నునిచి." బస. 2. 27.

కన్నాగు (కన్ను + ఆగు)

  • కన్ను మూయు; మూర్ఛిల్లు.
  • "నేడు రణశయ్యన్ భూవిభుం డుండగా, గన్నాగం దగు నయ్య నీ నిదురకుం గాలం బయోధ్యం గదా!" భాస్క. యుద్ధ. 5. 83.

కన్నాడు

  • తండ్రి.
  • "నిన్ను గన్నాని రప్పింపక." ఉద్భ. 3. 28.
  • చూ. కన్న వాడు.

కన్నార చూచు

  • 1. కనులు తెఱచి చూచు.
  • "సన్ను తానందబాష్పంబుల జేసి, కన్నార జూచు వీక్షణములు మునుగ." పండితా. ప్రథ. దీక్షా. పుట. 221.
  • 2. ప్రత్యక్షంగా చూచు. వాడుకలో ఇది కండ్లారా అన్న ట్లుంది.
  • "కండ్లారా చూచినసంగతి చెప్పడానికి భయ మేమిటి?" వా.

కన్నాస

  • కనుపండు వైనది. కంటికి ఆశ గొలుపునది.
  • "అది విటాళుల కన్నాస యై మెలంగు." హంస. 5. 215.

కన్నిగట్టు

  • త్రాడు కట్టు; బంధించు; నిర్బంధించు.
  • పశువులకు దూడలకు మెడకు తగిలించి కట్టేత్రాడును కన్ని త్రా డని అంటారు.
  • "మన్ను దినియెడిదూడ...కన్నిగట్టి యెందాక గాయవచ్చును." తాళ్ల. సం. 11. 3. భా. 79.

కన్నిచ్చకు వచ్చు

  • కంటి కింపగు, కంటికి ప్రియమగు.
  • "మృగంబులుం దెగ జూచి యేచి కన్నిచ్చకు వచ్చు పెక్కునంజుడులు చేవ డించక కావడించి..." పాండు. 3. 89.
  • చూ. కన్నిచ్చ వచ్చు. కన్ని_____కన్నీ 389 కన్నీ_____కన్నీ

కన్నిచ్చ వచ్చు

  • ప్రియ మగు; దృష్టి నాకర్షించు.
  • "కనుగొని పాఱిన గన్నిచ్చవచ్చు, కనుపారుచీరలు ధరియించి శౌరి." ద్విప. మధు. 5.
  • చూ. కన్నిచ్చకు వచ్చు.

కన్నిడి యుండు

  • గమనించి యుండు.
  • "అన్నిటన్ ధరణిపాలుడు గన్నిడి యున్న బెం పగున్." భార. శాంతి. 2. 283.
  • చూ. కన్ను పెట్టి ఉండు.

కన్నిడు

  • 1. కన్ను వేయు.
  • "రుచిమీదన్ గన్నిడి యా శచీ విభుడు దిరుగు..." భార. అను. 2. 189.
  • 2. చూపు పెట్టు. దృష్టి సారించు.
  • "వసంతకుడు దమపై గన్నిడ గా రాకు గెం,దలిరా కయ్యెనొ నా." కుమా. 4. 85.

కన్నియమెఱుగు

  • క్రొక్కారు మెఱపు. తొలకరి వానలలో మెఱిసే తొలి మెఱుపు.
  • "తళుకు తళుకున నింగి దాటించె బలుమాఱు, నీరాళ్లగొంది గన్నియ మెఱుంగు." పాండు. 4. 21.

కన్నీరు

  • అశ్రువులు. దు:ఖము కల్గినప్పుడు కండ్లలో వెడలునీరు.
  • "కన్నీ రొలుకగ నేడ్చిన, నన్నరపతు లెల్ల నేడ్చిరి..." భార. ద్రోణ. 1. 29.
  • "వాడు కన్నీరు కారుస్తూ కూర్చున్నాడు." వా.

కన్నీరు కాలువలు కట్టు

  • అధికముగా విలపించు.
  • "ఆమె కన్నీరు కాలువలు కట్టేటట్లు ఏడుస్తుంటే చూడలేక పోయాను." వా.

కన్నీరు గ్రుక్కుకొను

  • దు:ఖోద్వేగ మాపుకొను.

కన్నీరు గోట మీటు

  • కన్నీరు గోటితో తుడిచి వేసి కొను.
  • "కెందలిరుపాన్పునం దను వొందక లేచి కూర్చుండి కన్నీరు గోట మీటుచు బోటితో వరూధిని యి ట్లనియె." మను. 3. 28.

కన్నీరు మున్నీరుగా (ఏడ్చు)

  • ఎక్కువగా (దు:ఖించు.)
  • "అబ్బాయి కారుకింద పడ్డా డని వినగానే ఆవిడ కన్నీరు మున్నీరుగా యేడుస్తూ కూర్చుంది." వా.

కన్నీళ్లు తుడుచు

  • తాత్కాలికంగా ఏవో మాటలు చెప్పి ఓదార్చు.
  • "మమ్ము గన్నీళ్లు తుడిచి వే పొమ్మని యెను." నందక. 43 పు.
  • "ఏవో నాలుగు మాటలు చెప్పి కన్నీళ్లు తుడిచి పంపించాడు గానీ, ఈ పిల్లల కేమైనా సాయం చేద్దా మనుకున్నాడా వాళ్ళ చిన్నాన్న?" వా. కన్నీ____కన్ను 390 కమ్ము____కన్ను

కన్నీళ్లు తుడుచుమాటలు

  • శుష్కప్రియాలు; పై పై ఓదార్పుమాటలు.
  • "ఈ కన్నీళ్లు తుడిచేమాటలతో ఏం లాభం? కొంప మునిగిపోయి ఛస్తుంటే." వా.
  • చూ. కళ్లతుడుపు మాటలు.

కన్నీళ్ల నడచుకొను

  • కన్నీళ్లు గ్రుక్కుకొను, దు:ఖమును సమాళించుకొను.
  • "ఇందాక నెఱుగకే నేమి యంటినొ మిమ్ము?, ననుచు గన్నీళ్లు రా నడచు కొనుచు..." కళా. 4. 171.
  • చూ. కన్నీళ్లు గ్రుక్కుకొను.

కన్ను

  • రీతి, జాడ.
  • "నాకడనుంచి, యేగినక న్నేల నెఱుగ నైతి." కుమా. 6. 160.

కన్నుండ కనుపాప తీయు

  • అతి నేర్పరితనము సూపు. కొంత నిరసనగా అనుమాట. కను పాపను తీస్తే కన్ను పోవాలి; కానీ అలా కాకనే తీయగల దంటే ఎంత నేర్పరి అని!
  • "విను వల్లభ ! కన్నుండం, గనుపాపం దివియ నేర్పు గల మునిము చ్చీ, వనిత..." కళా. 3. 199.
  • "అమ్మా ! ఆవిడా? కన్నుండగానే కనుపాప తీసేరకం." వా.
  • చూ. కన్నుండ కనుపాప కొన్నట్లు.

కన్నుండ కనుపాప కొన్నట్లు

  • అతినేర్పుగా.
  • "కన్నుండ గంటిపాపం, గొన్నట్లు మొఱంగి బాలు గొనిపోవుటకున్, అన్నీచు బంధుయుతముగ, మన్నిగొనక యున్న నేటిమాటలు మనకున్." ఉ. హరి. 5. 288.
  • "కన్నుండగ గనుపాపను, గొన్నవిధంబునను సతుల గూడకయును దా, గన్న మిడి మనోధనములు, గ్రన్నన గొనిపోవు గన్న కాడుంబోలెన్." విక్ర. 8. 9.
  • "కన్నుండగానే కనుపాపను తీసి నట్లుగా, ఆ పిల్ల తనేమీ ఎఱగనట్లూ, అత్తదే అంతా తప్పన్నట్లూ మగనికి చెప్పి ఒప్పించిం దంటే నమ్ము." వా.
  • చూ. కన్నుండ కనుపాప తీయు.

కన్నుండ గంటిపాపను గొను

  • మోసము చేయు, అతి చాక చక్యముతో ప్రవర్తించు. నేడు వాడుకలో దీని రూపం.
  • "వాడా అమ్మా! కన్నుండగానే కంటిపాపను తీసేరకం." వా.

కన్ను కట్టు

  • 1.ఒక పిల్లల ఆట.
  • "వెన్నెలకుప్పలు కన్నుకట్టు." ప్రబంధ. 6. 3.
  • కన్నులకు బట్టకట్టి తోడి వారిని తెలుసుకొనే ఆట కావచ్చును.
  • 2. మోసగించు.
  • "నే నెవరి కన్ను కట్టి ఈ డబ్బు తేలేదు. కష్టార్జితం." వా. కన్ను____కన్ను 391 కన్ను____కన్ను

కన్ను కన్నూ కనిపించని చీకటి

  • కటిక చీకటి. కంటికి కన్నే కనిపించనంత చిమ్మచీకటి అనుట.

కన్ను కానక

  • గర్వముతో - పొగ రెక్కి.
  • "వనితా ! యె ట్లోర్వవచ్చు వలవని గర్వం,బున గన్ను గాన కాడెడి, యనుచితవాక్యంబు లేరి కైన దలంపన్." కళా. 1. 175.

కన్ను కానక పోవు

  • గర్వించు.
  • చూ. కన్ను కానక.

కన్ను కానమి

  • గర్వము.
  • చూ. కన్ను కానకపోవు.

కన్నుకుట్టు

  • 1. అసూయ.
  • "వాడికి నన్ను చూస్తే కన్ను కుట్టు." వా.
  • 2. అసూయపడు.
  • "వానిసిరిం జూచి కన్ను కుట్టినది." ధర్మజ.
  • "ఆపిల్ల కాస్త తల దువ్వుకుంటే ఆ ముసలిమొగుడికి కన్ను కుడుతుంది." వా.
  • 3. కండ్ల కలకరోగము వచ్చు.
  • "వాడు గాలిలో తిరిగేటప్పటికి కండ్లు కుట్టాయి. కంద్లు తెరవకుండా బాధపడి పోతున్నాడు." వా.
  • ఇందులోనుండే పై రెండు పలుకుబళ్లూ వచ్చినవి.

కన్ను కొట్టు

  • సైగ చేయు. కామమోహాదుల విషయంలోనే దీనిని ఉపయోగిస్తారు.
  • "వాడు ఆ పిల్లను చూచి కన్ను కొట్టే సరికి అది వాళ్లవాళ్లకు చెప్పడం, వాళ్లు ఇంటిమీదికి రావడం గొడవో గొడవ అయి పోయింది." వా.

కన్నుకొదమలు

  • ఉత్తమనేత్రములు. సింగపుగొదమ అనుచోట తరుణ మని అయినా 'కొదమ' యువతను. ఉద్ధతిని, ఉత్తమతను సూచించును.
  • "శంభు వికసితాంబకస,ముదితంబు లగు కన్ను కొదమలో యనగ." పండితా. ద్వితీ. మహి. పుట. 100.
  • చూ. కొదమగుబ్బలు.

కన్ను గానక

  • పొగ రెక్కి.
  • "జనకకన్య జగన్మాన్య జెనక వచ్చి కన్ను గానక చనె బలుగాకి కాకి." రామాభ్యు. 5. 70.
  • చూ. కన్ను కానక.

కన్ను గిలుపు

  • కనుసైగ చేయు.
  • చూ. కన్ను కొట్టు.

కన్ను గీటినంతలో

  • అతిశీఘ్రముగా, ఱెప్పపాటులో, ఒక నిమిషములో.
  • "....అఖిలాన్నంబుల్, కను గీటినంత కన్ను____కన్ను 392 కన్ను____కన్ను
  • లోననె, యనుజునకు దదగ్రజాత యమరించి..." పాండు. 3. 26.

కన్ను గూర్కు

  • నిద్రించు.
  • "కన్ను గూర్కెడునంత నగ్గహనభాగ, మేలుబేతాళు డతి దుర్నిరీక్ష్యు డగుచు." శుక. 1. 279.
  • చూ. కనుగూర్కు.

కన్ను చెదఱు

  • మిఱుమిట్లు గొలుపు.
  • "ఆ అమ్మాయి రవ్వలకమ్మలు చూస్తే కన్ను చెదరుతుంది." వా.

కన్ను దనియగా

  • కనులవిందుగా, నేత్రపర్వముగా.
  • "కన్ను దనియగ బదపదార్థములును... వడ్డింప..." పండితా. ప్రథ. దీక్షా. పుట. 119.

కన్ను దనియు

  • కనులకు తృప్తి చేకూర్చు.
  • "మొలపించె బహునూపముల గన్ను దనియ." వర. రా. బా.పు. 161. పంక్తి. 21.

కన్ను దెఱచు

  • కటాక్షించు, అనుగ్రహించు, గుర్తించు.
  • "ఇంక నెన్నండు దయ బరమేశ్వరుండు, గన్ను దెఱచునో యని." కుమా. 7. 19.
  • "ఆ దేవు డెప్పుడు కన్ను తెరుస్తాడో గాని అంతదాకా నే నిలా అఘోరించ వలసిందే." వా.

కన్నునీరు

  • కన్నీరు.
  • "కన్నునీరు గొ,బ్బున వెడలంగ." భోజ. 4. 167.

కన్ను పడు

  • ఆసక్తి కలుగు. ఇందులో ఈఆసక్తి అత్యాశో, దురాశో అన్నధ్వని కూడా ఉన్నది.
  • "వానికి ఆ ఉద్యోగంమీద కన్ను పడింది." వా.
  • "వానికి ఆ యింటిమీద కన్ను పడింది." వా.

కన్ను పెట్టు

  • కనిపెట్టు.
  • "ఆ వ్యవహారంమీద కాస్త కన్నుపెట్టి ఉండక పోతే లాభం లేదు." వా.

కన్ను పొడుచు

  • అపకారము చేయు.
  • "కన్ను పొడిచి కంటిలో నీ రెందు కంటే ఏం లాభం?" వా.

కన్ను పొడుచుకొన్నా కనుపించని

  • ఏమాత్రం కనపడని.
  • "కన్ను పొడుచుకున్నా కనిపించని చీకట్లో వెళ్లాడు పాపం!" వా.
  • "ఆ కొంపలో కన్ను పొడుచుకొన్నా ఏదీ కనిపించదు." వా.

కన్ను పొడుచునట్లు

  • ఎదుటివారికి బుద్ధి వచ్చునట్లు, ఎదుటివారి కన్ను కుట్టునట్లు.
  • "నానాట గృశియించు నను జూచి కనుగీటు, పువ్వుబోడుల గన్న పొడిచిమట్లు." రాధికా. 3. 63. కన్ను____కన్ను 393 కన్ను____కన్ను
  • "నే నిందుకొఱకె, నవ్వ స,హా నోడుదు వట్టి నింద లందితి నయ్యో, యైన దిక నాయె నందుకె, పూనుద మందఱకు గన్ను పొడిచినరీతిన్." రాధామా. 1. 46.

కన్ను మూతపడు

  • నిద్ర వచ్చు.
  • "రాత్రంతా కన్ను మూతపడ లేదు." వా.
  • "అదేం కర్మమో! కాస్త కన్ను మూత పడేసరికి కలలు వస్తాయి." వా.

కన్ను మూయు

  • చనిపోవు.
  • "అని ప్రలాపించి కనుమూసె నా క్షణంబు." శుక. 1. 396.
  • "ఈ పిల్లలను నా చేతుల్లో పెట్టి ఆయన కాస్తా కన్ను మూశాడు." వా.
  • "వాడు కన్ను మూసి మూడు నెల లయిందో కాలేదో? వాడికొడు కా ఆస్తినంతా ధ్వంసం చేశాడు." వా.

కన్ను మూసి తెరచేలోగా

  • వెంటనే; ఒక్క త్రుటిలో.
  • "కన్ను మూసి తెరచేలోగా అంతా అయి పోయింది." వా.

కన్ను మూసే అవకాశం లేదు

  • ఏమాత్రం వ్యవధి లేదు.
  • "కను మూయు నెడయు లేదు." బస. 3. 64.
  • "కన్ను మూసే వీలు లే దమ్మా! ఈ కొంపలో పొద్దస్తం చాకిరీ అలా చేస్తూ ఉండ వలసిందే!" వా.

కన్ను మూసే తీరిక లేదు

  • వ్యవధి లేదు అనుట.
  • "నాకు కన్ను మూసే తీరిక ఉంటే ఎంతో చదవాలసి ఉంది. ఏదీ ఈ వెధవ చాకిరీతోనే సరిపోతుంది గా." వా.

కన్ను మొగడు

  • కన్ను మూయు; నిద్రించు.
  • "ఇన్నాలుగుతెఱగులందు నెయ్యది యైనన్, గన్ను మొగుడ నీ దటె." భార. సౌప్తి. 1. 67.

కన్ను మొగము ఏర్పడు

  • రూ పేర్పడు; ఒక స్వరూపమునకు వచ్చు.
  • "అల్లనల్లన మూడేడు లయ్యె నకట, కన్ను మొగ మేరుపడదు నాగర్భమునకు." పద్య. బసవ. 1. 96.
  • రూ. ముక్కు మొగ మేర్పడు.

కన్ను మొగుచు

  • కన్ను మూయు, నిద్రించు.
  • "ఒయ్య నొయ్యనం గదలు తూగు టుయ్యెలలం గన్ను మొగిచియున్న విలాసినీవిలాసులునుం గలిగి." పారి. 2. 53.
  • "గవనిమొగసాల యరుగుపై భైరవుండు, గన్ను మొగిచె." కాశీ. 3. 23/

కన్ను మొఱగు

  • మోసగించు.
  • "అంత:పురాంగనలన్ గన్ను మొఱంగి." భీమ. 1. 111.
  • చూ. కనుమొఱగు.

కన్ను మోడ్చు

  • నిద్ర పోవు.
  • "ఏ నింత కన్ను మోడ్చు, తఱిని గలలోన." రా. వి. 1. 15.
  • రూ. కనుమోడ్చు. కన్ను_____కన్ను 394 కన్ను_____కన్ను

కన్ను మోడ్పు

  • నిద్ర.
  • "ఇంచుకసేపు కన్ను మోడ్పు నెఱపి." హంస. 2. 53.

కన్నుల కచ్చి

  • ఒక బాలక్రీడ.
  • "కన్నుల కచ్చి గుడుగుడుగుంచాలు కుందనగిఱి." హంస. 3. 146.

కన్నుల కద్దుకొను

  • అత్యాదరముతో చూచు, అభిమానించు.
  • "పేదవాని కన్నం పెడితే కన్నుల కద్దు కొని తింటాడు." వా.

కన్నుల కరవు దీరగా

  • కండ్లార; తృప్తిగా.
  • "ఇమ్మహాభుజు నిప్పు డోకొమ్మలార!, కంటిమి గదమ్మ కన్నుల కఱవు దీఱ." విజ. 1. 72.
  • "కంచిలో వరదరాజస్వామిని కన్నుల కరువు దీరా చూశా మమ్మ్మా ఈనాడు. జనసమ్మర్దం లేదు కదా." వా.

కన్నుల గట్టినట్టు

  • ప్రత్యక్షముగా ఉన్నట్లు. బొత్తిగా ఒక సంఘటననో మనిషినో మఱచి పోలేకున్నా మనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "మలయుచూడ్కులు గల మంచి నీ మోము, గన్నుల గట్టిన కైవడి దోచు." హరి. 2. భా. 1879.
  • "మా కోడలు ఊరికి పోయి నెలనాళ్లయింది. మనమడు కన్నులకు కట్టినట్టుగా ఉన్నాడు. వెళ్ళయినా చూచి రావాలి." వా.

కన్నుల గప్పుకొను

  • కన్నుల నద్దుకొను; ఆదరముతో అభిమానించు.
  • "కన్నియ నన్ను వల్లభుడు గన్నుల గప్పుకొనంగ నుండి." పారి. 1. 88.
  • "గరిమ నందుడు గన్నుల గప్పుకొనగ." రాధికా. 1. 56.
  • "ఆ కాంతలు గొల్వ నన్ను సముఖంబున గన్నుల గప్పుకొంచు." రాజగో. 1. 36.

కన్నుల గెంపొదవు

  • కోపము కలుగు.
  • "విని కన్నుల గెం పొదవగ." జైమి. 7. 192.

కన్నుల నద్దుకొను

  • గౌరవ ప్రేమ సూచకంగా ఒకవస్తువును కన్నులకు అద్దుకొనడం అలవాటు. గౌరవ ప్రేమలను సూచించుట భావార్థము.
  • "శిరంబున మోపుకొని కన్నుల నద్దుకొని తిరుగ నతని చేతిక యిచ్చి." కళా. 4. 60.
  • "ను వ్వేమో అంత సంకోచిస్తున్నావు. ఇదే ఇంకొక రైతే కండ్ల కద్దుకొని తీసుకొంటారు." వా.
  • చూ. కన్నుల కద్దుకొను.

కన్ను ల నవ్వు

  • హసన్ముఖు డగు, ప్రసన్న ముఖు డగు. బస. 1. 9. కన్ను_____కన్ను 395 కన్ను_____కన్ను

కన్నుల నిప్పులు డుల్లు

  • కోపించు, కన్నెఱ్ఱ చేయు.
  • "కోపాటోపశిఖలు, నిండారి కన్నుల నిప్పులు డుల్లి." పండితా. ద్వితీ. మహి. పుట. 15.
  • చూ. కన్నుల నిప్పులు రాలు.

కన్నుల నిప్పులు రాలు

  • ఆగ్రహోదగ్రత కలుగు. కన్ను లెఱ్ఱవడు.
  • "కనుగొని కోపవేగమున గన్నుల నిప్పులు రాల..." భార. విరా. 2. 133.
  • "కనుగొని కౌశికుం డలిగి కన్నుల నిప్పులు రాల ని ట్లనున్." మార్కం. 1. 228.
  • "అప్పుడు విశ్వామిత్రుడు, ముప్పిరి గొనునట్టి కోపమున గన్గొనలన్, నిప్పులు రాలగ నమ్ముని, దప్పక వీక్షించి పలికె దారుణభంగిన్." హరి. 1. 150.
  • "వా డేదో తూస్కారంగా మాట్లాడగానే రెడ్డిగారి కండ్లలో నిప్పులు రాలాయంటే నమ్ము." వా.
  • చూ. కన్నుల నిప్పులు డుల్లు.

కన్నుల నిప్పు లొల్కు

  • అతిక్రోధంతో కన్ను లెఱ్ఱనగు. కోపాన్ని నిప్పులతో పోల్చుట అలవాటు.
  • "అల్కతో, గన్నుల నిప్పు లొల్కు హరుకాదిలి దక్షుని జూచి యిట్లనున్." కుమా. 2. 82.
  • చూ. కన్నుల నిప్పులు రాలు.

కన్నుల నీలాలు గారు

  • ఏడ్చు. కన్నీరు రాలు.
  • "ఏడిస్తె నీ కండ్ల నీలాలు గారు." పాతపాట.
  • చూ. కన్నుల ముత్యాలు గారు.

కన్నుల నీళ్లు కుత్తుక వట్టు

  • డగ్గుత్తిక పడు.
  • "గొనకొని కన్నుల నీళ్లు గుత్తుక వట్టెడిని." తాళ్ల. సం. 12. 290.

కన్నుల నూపిరి పెట్టుకొను

  • ప్రాణావసానదశలో నుండు.
  • "ఎం డనక వా ననక యరక కొయ్య కొట్టుకొని కనుల నూపిరి పెట్టుకొని యున్నచో జేటుపాటు మీకు దెలియ కుండునా?" ధర్మజ. 47 పు. 2 పం.- తెను. జాతీ.

కన్నులనె ప్రాణము నిల్పు

  • ప్రాణావసానదశలో నుండు. ప్రాణం పోవునప్పుడు ఆఖరున కనులలో నుండి పోవు ననుటపై యేర్పడినది.
  • "....శకుంతల ప్రాణనాయక, ధ్యానము తోడ గన్నులనె ప్రాణము నిల్పి శరీర మాత్ర యై." శృం. శా. 3. 74.
  • "వాడు కళ్లల్లో ప్రాణం నిలుపుకొని ఉన్నాడు." వా.

కన్నుల నొత్తుకొను

  • కన్నుల కద్దుకొను. ఇది ప్రేమాదరసూచకము.
  • "పొలతి నీచిఱునవ్వు బువ్వు లాతడు గోసి, కులికి కన్నుల నొత్తుకొనంగాను." తాళ్ల. సణ్. 3. 279.
  • చూ. కన్నుల నద్దుకొను; కన్నుల కద్దుకొను. కన్ను____కన్ను 396 కన్ను____కన్ను

కన్నుల పండువు(గా)

  • నేత్రపర్వము. మనోజ్ఞము. మనోహరము.
  • "సుందరాకృతులు గన్నులపండువు." 7. 123.
  • "ఆ అమ్మాయి నడుస్తుంటే కన్నుల పండువుగా ఉంటుంది." వా.

కన్నుల బడు

  • కానవచ్చు. కువ. 3. 59.

కన్నుల ముంచి క్రోలు

  • ఆసక్తితో చూచు.
  • "నీ వన్నెల్ కన్నుల ముంచి క్రోలుటలు." నారా. శత. 46.
  • వాడుకలోనూ: "కళ్ళతో త్రాగి వేస్తున్నా డా అమ్మాయిని" వంటి రూపాలలో ఇది వినవస్తుంది.

కన్నుల ముత్యాలు గారు

  • ఏడ్చు.
  • "ఎన్నడు నెండక న్నెఱుగనిశిశువు కన్నుల ముత్యాలు గాఱ నేడ్చెడిని." హరిశ్చ. 2. 924.
  • చూ. కన్నుల నీలాలు గారు.

కన్నుల ముసు గిడు

  • కన్నులు గప్పు.
  • "కన్నుల ముసుగిడ్డ కంతుని మాయాం ధతమసపటము..." రాధా. 2. 199.

కన్నులమ్రాను

  • చెఱకు.

కన్నులలో నిప్పులు పోసికొను

  • ఓర్వలేక పోవు.
  • "మనము నేర్చుచున్న విద్యను గాంచి తాను గన్నులలో నిప్పులు పోసికొను చున్నాడు." సాక్షి. 47. పు.

కన్నుల సన్న నునుచు

  • ఆజ్ఞానువర్తులనుగా చేయు. కనుసన్న మెలగున ట్లొనర్చు.
  • "దిగధీశ్వరుల నోలి, మన్నించి కన్నుల సన్న నునిచె." కుమా. 7. 155.

కన్ను లాకలి తీర్చు

  • కన్నులు తనియించు; కండ్లారా చూడ నిచ్చు.
  • "ఎన్నడు వచ్చునో యిందిరావిభుడు, కన్ను లా కలి తీర్ప గలుగునో యనుచు." ద్విప. మధు. పు. 38.

కన్ను లార

  • కనులకు సంతృప్తిగా, బాగా, ప్రత్యక్షంగా.
  • "కన్నులారా జూచుచును." పండితా. ప్రథ. దీక్షా. పుట. 155.
  • "కన్నులారా అందరు చూస్తుండగా దొంగ పారిపోయాడు." వా.

కన్ను లార్చు

  • వంచించు.
  • "...వనితకు గన్ను లార్ప నిటు వచ్చిన వాడవె..." రుక్మాం. 5. 22.

కన్నులు కట్టు

  • మోసగించు; కన్నుకొట్టు.
  • "నన్ను నమ్మించి తెచ్చి, కాననంబు లో గన్నులు కట్టి కాడు, పఱచి నీ కిట్లు పోజన్నె భావజన్మ!" కుమా. 5. 65.
  • చూ. కన్నులు గట్టు.

కన్నులు కానని

  • అంధురాలయిన. చూపు లేని. కన్ను____కన్ను 397 కన్ను____కన్ను
  • "తల్లి మదేక పుత్రక పెద్ద కన్నులు, గాన దిప్పుడు మూడుకాళ్ల ముసలి." శేం. నైష. 1. 108.

కన్నులు గలవే! (చూడగా)

  • కన్నులు చాల వనుట, అతి దర్శనీయము.
  • "శృంగారించిన నిన్ను జూడ గన్నులు గలవే?" భాస్క. సుంద. 189.
  • చూ. రెండుకన్నులు చాలవు.

కన్నులు గట్టు

  • మోసగించు.
  • "పౌండ్రవిభు కన్నులు గట్టి ప్రలంబ వైరికిన్, సేవ యొనర్చి." ఉ. హరి. 2. 98.
  • చూ. కన్నులు కట్టు.

కన్నులు గప్పు

  • మోసగించు.
  • "తలిదండ్రుల కనులు గప్పి వా డలా చెడుతిరుగుళ్లు తిరుగుతున్నాడు." వా.

కన్నులు చల్లగా

  • తృప్తిగా - నేత్రపర్వముగా.
  • "కన్నులు చల్లగా గనుగొందు నేను మి,మ్మిరువుర దేవి దేవరను బోలె." శృం. నైష. 2. 86.
  • "మా అమ్మాయి పిల్లవా ణ్ణెత్తుకొని యింట్లో తిరుగుతుంటే కన్నులు చల్లగా చూడా లని ఉంది." వా.

కన్నులు చల్ల నగు

  • సంతోషము కలుగు; సంతృప్తి కలుగు.
  • "జముని జూడగ గన్నులు చల్ల నయ్యె." కాశీ. 3. 147.
  • "నిన్ను చూడగానే కన్నులు చల్ల నయ్యాయి నాయనా! అంతే చాలు." వా.

కన్నులు చెదరి పోవు

  • మిఱుమిట్లు గొలుపు.
  • "చీకట్లో నుంచి వెలుతురులోకి వస్తే కండ్లు చెదిరిపోతాయి." వా.

కన్నులు చెమర్చు

  • చూ. కన్నులు చెమ్మగిల్లు.

కన్నులు చెమ్మగిల్లు

  • దు:ఖము కలుగు.
  • "హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి యేడుస్తుంటే ప్రేక్షకు లందరి కండ్లూ చెమ్మగిల్లినవి." వా.
  • రూ. కనులు చెమర్చు.

కన్నులు జేవురించు

  • కన్ను లెఱ్ఱ నగు - కోపము కలుగు.
  • "క, న్గానడు యాదవుం డనుచు గన్నులు వేయును జేవురింప." పారి. 4. 63.

కన్నులు తల కెక్కు

  • పొగ రెక్కు. వినయవంతుడు క్రిందికి చూస్తాడు. అట్లే పొగరుబోతు ఆకాశంలోకి చూస్తూ నడుస్తాడు అనుటపై ఏర్పడిన పలుకుబడి. ఇలాంటి వేకన్నులు నెత్తి కెక్కు, కన్నులు నెత్తికి వచ్చు ఇత్యాదులు. చితా. 6 అం. 59 పు.
  • "వాడి కీమధ్య కన్నులు తల కెక్కినట్లు కన్ను_____కన్ను 398 కన్ను_____కన్ను
  • న్నాయిలే. అందుకే అలా వాగుతున్నాడు." వా.
  • చూ. కన్నులు నెత్తి కెక్కు.

కన్నులు దనియు

  • కన్నులు చల్ల వడు.
  • "అ,గ్గలిక మెఱసె నట్ల మీకు గన్నులు దనియన్." భార. ద్రోణ. 1. 33.

కన్నులు నీరుబుగ్గ లగు

  • కన్నులనుండి కన్నీరు ఏక ధారగా కారు. నీటి బుగ్గలలో నేల చీల్చుకొని నీరు పై కుబుకుతుంది. ఏక ధారగా అలా వస్తూనే ఉంటుంది. అలాగే కన్నుల నుండి కన్నీరు అపరిమితంగా వస్తున్న దని తెలుపు పలుకుబడి.
  • "మతి వెత జెంద బేడిసల మార్కొను కన్నులు నీరుబుగ్గ లై, పొదలగ." శుక. 1. 188.

కన్నులు నెత్తికి వచ్చు

  • పొగ రెక్కు.
  • "అయ్యో! రామా! వాడు మనతో మాట్లాడు తాడా ఇప్పుడు? కన్నులు నెత్తికి వచ్చాయే." వా.

కన్నులు నెత్తి కెక్కు

  • గర్వించు, పొగ రెక్కు.
  • "ఏమిట్రోయ్! కన్నులు నెత్తి కెక్కా యేమిటి? అలా తోసుకొని పోతున్నావు." వా.

కన్నులు పైకి వచ్చు

  • పొగ రెక్కు.
  • చూ. కన్నులు నెత్తికి వచ్చు.

కన్నులు మూసి చరించు

  • మోసగించి తిరుగు. ఒకరి కంట పడకుండా రహస్యముగా వర్తించుటపై వచ్చినది.
  • "....నేర్పు వగమాటలు నేరని తప్పు పాటలుం, గనబడ నవ్వధూటి పతి కన్నులు మూసి చరించు నిచ్చలున్." శుక. 3. 109.
  • చూ. కన్నులు గప్పు.

కన్నులు వాచు

  • 1. అత్యాసక్తితో ఎదురు చూచు.'
  • "కన్నులు వాచు నీ మొగము గానక యెప్పుడు జూడకున్న." యయా. 2.
  • చూ. మొగము వాచు.
  • 2. ఏడ్చి యేడ్చి కను లుబ్బు.
  • "నీదు చై,దములకు వాచె గన్నులు." శ్రవ. 5. 37.

కన్నులు విచ్చి చూచు

  • కనులారా చూచు.
  • "కన్నులు విచ్చి చూచి పురఘస్మరు దిక్పరి పూర్ణ దీప్తి సం, పన్నతకున్ భయాకులితపద్మనిరీక్షణు డై." కా. మా. 1. 77.

కన్ను వఱపు

  • చూచు; దృష్టి సారించు.
  • "అయ్యింటిలో గన్ను వఱపి." భార. అను. 1. 76.

కన్ను వేయు

  • 1. మోహించు; కాముకతతో ఆశించు. కన్ను_____కన్ను 399 కన్ను_____కన్నూ
  • "అయ్యబలమీద నలిననాభుండు కను వేసినాడు." వరాహ. 11. 52.
  • "కల నైన నన్యకాంతకు గానికాపును, గనువేసి విటుని జేసినగయాళి." బహులా. 5. 87.
  • ".............ఏ వధూటిపై దమి గను వేసితో..." విప్రనా. 4. 37.
  • "వా డా పిల్లమీద కన్ను వేశాడు." వా.
  • "వా డెప్పుడూ ఆ సందులోనే తిరుగుతుంటాడు. ఆ పిల్లమీద కన్ను వేశాడా యేమిటి?" వా.
  • 2. చూచు, దృష్టి సారించు.
  • "గుబ్బ పాలిండ్ల క్రేవ గ్రక్కున మురారి, కన్ను వేయుట గని లజ్జ గదుర..." ఆము. 6. 133.
  • చూ. కను వేయు.

కన్ను వొందకుండు

  • కనుమూత పడక పోవు; నిద్ర పట్టక పోవు.
  • "కడుపునిండ గుడువ గానమి రే యెల్ల, గన్ను వొందకున్న గరము డస్సి, యున్నవాడ." భార. ఆది. 6. 289.
  • "సౌఖ్య మొదవ నాకు గన్ను వొంద కుండు." ఈదురుపల్లి భవానీశంకరకవి. ధర్మ ఖండము. 1. 237.
  • కన్ను వొందు అన్నట్లు కాకా ఇలా తద్విరుద్ధస్థితి సూచక రూపంలోనే ఇది కానవస్తుంది.

కన్ను వైచు

  • కన్ను వేయు.
  • "సితభాను డాచార్యు చికు రాకు బోడిపై, గన్ను వైచిన కన్నె కలుపు మరులు." నైష. 7. 151.
  • చూ. కనువైచు.

కన్ను సన్న మెలగు

  • ఆజ్ఞానువర్తి యగు.
  • "ఎయ్యది పనిచిన నొయ్యన జేయుచు, గనుసన్న మెలగు భూజనుల దలచి." విక్ర. 6. 59.
  • రూ. కనుసన్న మెలగు.

కన్ను సన్నల ద్రిమ్మరు

  • ఆజ్ఞానువర్తి యగు.
  • "ఇందఱలో నల సత్యభామ కన్, సన్నల ద్రిమ్మరున్ హరి వశంవదుడై యన విందు గాని." పారి. 1. 65.

కన్ను సిమి<.big>

  • కన్ను బ్రామి, మోసగించి,
  • "చంపకు నన్ను గన్ను సిమి." పాండు. 5. 224.

కన్నూ మిన్నూ కానక పోవు

  • పొగ రెక్కి మెలగు; ఎవడేమిటి లెక్ఖ అన్నట్లు ప్రవర్తించు.
  • "వాడి కీ మధ్య కాస్త డబ్బు రాగానే కన్నూ మిన్నూ కానక పోతున్నాడు." వా.

కన్ను మిన్నూ కానరాక పోవు

  • హెచ్చు తక్కువలు తెలియక పోవు; పొగ రెక్కి తిరుగు.
  • "వాడి దిప్పుడు కన్నూ మిన్నూ కానరాని వయస్సు." వా. కన్నె___కన్నె 400 కన్నె____కన్నె
  • "వాని కీమధ్య డబ్బున్న స్నేహితుడు చిక్కా ళ్ళే. అందు కని కన్నూ మిన్నూ కానరావడం లేదు." వా.

కన్నె కయ్యము

  • తొలిపోరు.
  • "కన్నెకయ్యం బిది కని పెట్టి పోరు." పల. పు. 107.

కన్నె కలుపు

  • తొలి కూటమి, ప్రథమ సంగమము.
  • "సితభాను డాచార్యు చికురాకు బోడిపై, గన్ను వైచిన కన్నెకలుపు మరులు." శృం. నైష. 7. 151.

కన్నె కూర్మి

  • తొలివలపు.
  • "జనవిభుండు, కన్నెకూర్మి ప్రకాశంబు గాక యుండ." శృం. నైష. 1. 84.

కన్నె గోరుకోత

  • కన్నెలకు గోళ్లు తీసే ఒక సంస్కారము. బ్రౌను.

కన్నె బావి

  • చిన్న బావి.
  • నిర్జలకూప మని బ్రౌను.

కన్నె ముత్తైదువ

  • కన్య.
  • "ఎవ రైనా కన్నెముత్తైదువుకు చీరా రవికా, పసుపు, కుంఖం మా ఆవిడ రే పివ్వా లట." వా.

కన్నె ఱికము పెట్టు

  • తొలిసారిగా యుక్తవయస్కు రా లయిన వేశ్యను పొందుటకై ఒకానొక సంస్కారము జరుపు.
  • "ధనదత్తు డపుడు తన చెలికానిన్, బని చెను పుష్ప సిగంధికి, నొనరంగ గన్నె ఱికమునకు నొడబఱపింపన్." మల్హ. 2.3.

క న్నెఱుగు

  • 1.విధము తెలియు, జాడ తెలియు.
  • "పరమేశ్వరుండు...సుప్రసన్నుం డైన కన్నెఱింగి గౌరి." కుమా. 5. 25.
  • "తమ యందఱకు వగ గల్గిన కన్నెఱింగి." కుమా. 6. 29.
  • "త న్నెర్గకున్న కన్నె ఱిగి." పండితా. ప్రథ. పురా. పుట. 351.
  • "కరితురంగ, రథ పదాతిచయము రావింవుచున్న యా,క న్నెఱింగి కోప కలితు డగుచు." వి. పు. 7. 413.
  • 2. భావమెఱుగు, ఇంగిత మెఱుగు.
  • "నిజ జీవితేశ్వరి కన్నెఱింగి దానికి సమ్మతించిన..." కుమా. 1. 102.
  • కన్ను జాడ, తీరు, లక్షణయా భావము అను అర్థములలో విరివిగా ప్రయుక్తం.
  • చూ. కన్నెర్గు.

కన్నెఱ్ఱ చేయు

  • కోపించు.
  • "చేడెపై గన్నెఱ్ఱ చేసె దేమి?" రసిక. 5. 164. కన్నె____కన్వే 401 కన్వే____కపు

కన్నెర్గు

  • కన్నె ఱుగు, జాడ తెలియు.
  • "విన్న వింపగ నున్న కన్నెర్గి." బస. 1. 5.
  • చూ. కన్నెఱుగు.

కన్నే చు

  • కనుకుట్టు; ఒకరిని చూచి ఓర్వ లేక పోవు.
  • "కన్నే చినయట్టు, జైనులకన్ను లీక్షణములో జెఱచి." పండితా. ద్వితీ. మహి. పుట. 114.
  • చూ. కన్నుకుట్టు.

కన్నోట

  • సంకోచము.
  • "మున్ను పలికినట్ల కన్నోట లేక ప,ల్కుటయు." భార. శాంతి. 4. 392.

కన్పండువు

  • చూ. కనుపండువు.

కన్గిలుపు

  • కన్ను గీటు. విజయ. 3. 28.

కన్పెట్టు

  • చూ. కనుపెట్టు.

కన్మొఱగు

  • వంచించు, మోసగించు.
  • "శ్రీ కాంతామణి గన్మొఱంగి." పాండు. 1. 1.
  • చూ. కనుమొఱగు.

కన్వెలుగు

  • చూ. కను వెలుగు.

కన్వేగిన వెనుక

  • చీకటి విచ్చగనే.
  • కను చీకటి అనగా కనుల కంతగా కనిపించని వేళ, కను వేగుట అనగా కనులకు కొంత కనిపించు సమయము.
  • "ఒనరంగ నిట బొండకొయ్య నుంచిరి కన్వే,గినవెనుక దెలిసికొని య, చ్చని నను బొ మ్మాందురు..." శుక. 3. 204.

కన్వేగు

  • తెల్ల వారుజాము అగు.
  • "కన్వేగినవెనుక దెలిసికొని." శుక. 3. 204.

కన్సోగ

  • కనుబొమ్మ.
  • రూ. కనుసోగ.

కపటధర్మకంచుకము

  • పైకి ధర్మముగా కనబడుతూ లోన పాపభూయిష్ఠ మైనది.
  • "ఇది పాపశీలంబు, కపటధర్మకంచు కంబు నువ్వె." భార. శాంతి. 3. 65.

కపురపుబాగాలు

  • కర్పూర ఖండముల తోడి విడెము; అందులో చేర్చు సుగంధద్రవ్యములు.
  • "తుఱుములోపల నరవిరిసరులు దుఱిమి, వేడ్క గపురపు బాగాలు వేసి కొనుచు." హంస. 5. 254.
  • "పండుటాకులు గపురంపు బాగములును, బరగ జేపట్టిరి." రాజ...
  • "కట్టెడు తెల్ల నాకులును గప్పుర బాగలు నిచ్చు నిచ్చలున్." తారా. 2.
  • "క,ర్పూరంబుతోడి బాగా, లీరాదో యాకు మడిచి యీరాదొ చెలీ!" కళా. 4. కప్ప____కప్ప 402 కప్ప_____కప్ప

కప్పకాటు

  • అసంభవము.
  • కప్ప కఱవదు గనుక.
  • "బాపనపోటు కప్పకాటుం గలదే?" రుక్మాం. 5. 28. వేంకటేశ. 72.

కప్పకుఱుపు

  • బొబ్బ. శ. ర.

కప్పచిప్ప

  • ఆలిచిప్ప.

కప్పడి కంబళి.

  • కప్పుకొను కంబళి.
  • "గద్దెకంబళ్లు గప్పడి కంబళ్లు." పండితా. పర్వ. 346.

కప్పతాళము

  • తాళం కప్ప.
  • "వాళ్ళింటికి పెద్ద కప్ప తాళం తగిలించి పోయారు. అయినా దొంగలు విడిచి పెట్టారా?" వా.

కప్పదాటులు వేయు

  • మధ్యలో మధ్యలో వదలిపెట్టి అక్కడ ఒకటీ యిక్కడ ఒకటీ చెప్పి - వ్రాసి సరిపుచ్చు.
  • "ఏది వ్రాసినా సక్రమంగా సంపూర్ణంగా వ్రాయాలి గాని, ఇలా కప్పదాటులు వేయడం నాకు సరిపడదు." వా.

కప్ప నాగు(వు)రు

  • చిఱుకప్ప కాటుచే పశువులకు కలిగెడు రోగవిశేషము. హరి. పూ. 6. 45.

కప్పయెలుగు పాము

  • పైకి సాధువుగా కనిపించే క్రూరవ్యక్తి.
  • గోముఖవ్యాఘ్రము వంటిది. ధ్వని కప్పదే కాని అసలు పా మనుట.
  • "....మన మటు గాన నెప్పుడును మాదెస గప్పయెలుంగుపామ వై, యునికి యెఱుంగ వచ్చె నెటు లూరటగా వర మిచ్చినాడవో!" భార. ద్రోణ. 3. 101.

కప్పరపడు

  • సంభ్రమము చెందు; అబ్బుర పడు.
  • "వాల్మీకి వచ్చి సీతాసుతులన్, గప్పర పడి చూచి..." జైమి. 6. 89.
  • "చెప్పిన నంతయు విని నే, నప్పుడు తల యూచి యమ్మహాదేవి మొగం, బొప్పార జూచి నవ్విన, గప్పరపడి నన్ను బలికె..." విష్ణు. నా. 1. 206.
  • "ఉప్పొంగి మానసంబున, గప్పరపడి భూతములు జిఘాంసా పేక్షన్." 5. 193.
  • చూ. కప్పరపాటు.

కప్పరపాటు

  • సంభ్రమము.
  • "కప్పరపాటుతో నతని గన్గొని..." రంగా 1. 70.
  • చూ. కప్పరపడు.

కప్పల తక్కెడగా

  • ఒకటి సరిపడితే మరొకటి చెడిపోతున్నప్పుడు అనే మాట. కప్పలను తక్కెడలో పెట్టి కప్ప_____కప్పి 403 కప్పి_____కప్పు

సరిగా తూచవలె నంటే అసాధ్యం. ఒకటి వేస్తే మఱొకటి ఎగిరిపోతూ ఉంటుంది. అందుపై వచ్చిన పలుకుబడి.

  • "ఈ వ్యవహార మంతా కప్పల తక్కెడగా తేలింది. వీడు దారికి వస్తే వాడు దారికి రాడు; వాడు దారికి వస్తే వీడు దారికి రాడు." వా.

కప్పవలె నోరు తెఱచుకొను

  • తెలివి తక్కువను కనబరుస్తున్నా డనుపట్ల ఉపయోగిస్తారు. నోరు తెరచుకొనుట బుద్ధిమాంద్యసూచకము.
  • "ఆవెధ వేవో కారుకూతలు కూస్తుంటే వీడు కప్పలాగా నోరు తెరుచుకొని వింటున్నాడు." వా.

కప్పారు

  • నల్ల పడు.
  • "కుచాగ్రతలంబులతోన యారు గ,ప్పారె." కుమా. 3. 24.
  • "కప్పారు రేణువు కమలాప్తబింబంబు, రాహుమండలమున రమణ గప్ప." భార. భీష్మ. 1. 242.

కప్పిడు

  • కప్పి పుచ్చు.
  • "కప్పిడగ నేల యొప్పమి, నిప్పుడ యెఱిగింపు కలిగెనేని మహాత్మా!" శేష. 4. 38.

కప్పినకన్ను

  • మూసుకుపోయిన కన్ను. పండితా. ద్వితీ. మహి. పుట. 108.

కప్పి పల్కు

  • దాచి మాట్లాడు. ప్రచ్ఛన్నంగా పలుకు.
  • "అని కప్పి పల్కం బోయి బయల్పడ బల్కి వెలవెలబాఱుచు..." కుమా. 5. 126.

కప్పిపుచ్చు

  • దాచు.
  • "కల్లతనములు పలుమాఱు గప్పిపుచ్చు." కాశీ. 4. 90.
  • "వాడు చేసిన దంతా కప్పిపుచ్చా లని నీ వెంత తాపత్రయపడుతున్నావో నాకు తెలుసు. కానీ ఏం లాభం! ఆ వెధవ పనులు దాచితే దాగేవి కావు." వా.
  • చూ. కప్పిడు.

కప్పుకొను

  • 1. దాచుకొను.
  • "కప్పుకో నేల బంగారమా పువుబంతు, లవి సువర్ణలతోదయములు సుమ్ము." కవిరా. 1. 31.
  • 2. క్రమ్ము.
  • "ఒప్పనితమకము చిఒత్తము, గప్పుకొనుట నుత్తలంబు గదురగ." భార. విరా. 2. 36.

కప్పుదెంచు

  • క్రమ్ము.
  • "అఱిముఱి కప్పుదెంచు విలయాభ్రము చాడ్పున." భార. ద్రోణ. 1. 89.

కప్పుదేరు

  • నల్ల నగు.
  • "కప్పుదేరు తెగబారెడు నిద్దపు సోగ వెండ్రుకల్." విజయ. 3. 89. కప్పు____కప్పు 404 కప్ర___కమ

కప్పురగంది

  • స్త్రీ.
  • "కప్పురగంది రాధ యనుకన్నియ." రాధా. 1. 12.

కప్పురభోగాలు

  • ధాన్యవిశేషం.
  • "కప్పురభోగి వంటకము." క్రీడా. పు. 54.

కప్పురము పెట్టి యుప్పు గొను

  • అమూల్య మయినదానికి బదులుగా పనికిమాలినదానిని తీసికొను.
  • కర్పూరం అమూల్య మనీ ఉప్పు కా దనీ అన్న అభ్యూహపై ఏర్పడినది.
  • "మేను...దీనిరహి బుణ్య మమ్ముట, కప్పురంబు వెట్టి యుప్పు గొనుట." ఆము. 6. 62.

కప్పురముల క్రోవి

  • సౌదర్య రాశి. పచ్చకర్పూరమూ, పునుగు, జవ్వాజి మొద లైనవి సౌందర్యప్రవర్ధ కాలుగా మనవారు భావిస్తారు. అందు పై వచ్చినపలుకుబడి.
  • "కప్పురంబుల క్రోవి యక్కాంత మోవి." హంస. 2. 20.

కప్పు వెట్టు

  • పోరాడుటలో దెబ్బ తీయుటకై పొంచి నిలుచు.
  • "కప్పు వెట్టి వెన్ను కందమ్ము సమముగా, బొదవి." మను. 4. 23.

కప్రంపుదిమ్మ

  • అంద మైనది. కర్పూరపుదిమ్మెవంటి దనుట. మదన. శత. 72.

కబంధహస్తాలు

  • దూరంలో ఉన్నవాటి నన్నిటినీ పట్టుకొని బంధించేవి అనే పట్ల ఉపయొగిస్తారు.
  • రామాయణంలోని కబంధుని కథపై వచ్చిన పలుకుబడి.
  • "ఈ జిల్లాలో ఎవ డెక్కడ దావా పడవేసినా మా ఊరి కరణంగారి కబంధ హస్తాలకు దొరకి పోవలసిందే." వా.

కబోది (పక్షి)

  • గుడ్డి.
  • "కండ్లు లేని కబోదిని తల్లీ ! కాస్త భిక్షం వేయి." వా.
  • చూ. కళ్ళు లేని కబోది.

కబ్బము కరాటము

  • పుస్తకము, మందుల సంచి. జం.
  • వైద్యులు వెంట కొనిపోవు నవిగా ఉపయోగించే మాట. నారా. శత. 6.

కమరులు వోవు

  • ఎండి పోవు. కుమా. 5. 169.

కమలించు

  • కమలి పోవు. వాడుకలో కొంత మారీఆవేడి కా పువ్వు కమలి కమ_____కమి 405 కమి_____కమ్మ

పోయింది.' 'ఆ మంటలలో వానిశరీరం కమలి పోయింది.' అన్న ట్లుంది.

  • ".....రాతి...పతిం దలంచి కమలించి." కుమా. 5. 98.

కమలి పోవు

  • వాడిపోవు.
  • "పాపం ఎండకు పిల్లమొగం కమ(మి)లి పోయింది." వా.

కమాను వెళ్లు

  • కాంపు వెళ్లు.
  • ఇది యిప్పుడు జైళ్లల్లో విశేషంగా వినవస్తుంది. ఉద్యోగస్థులలో దాదాపు మాసిపోయినట్లు కనబడుతుంది.
  • "దొరగారు మొన్న కమాను వెళ్లారు. రేపటికి గానీ రారు." వా.

కమామీసు

  • వ్యవహారదక్షత; కాలము. బ్రౌను.
  • కథా కమామీషూ అన్నచోటే నేడిది జంటపదంలోని భాగంగా వినవస్తుంది.

కమిచికొను

  • నోటితో పట్టుకొను, కఱచి కొను.
  • "...నేల బడ్డవనజగర్భు, గమిచికొని మరాళకము వాఱె జెందమ్మి, గఱచి కొని రయమున బఱచినట్లు." కుమా. 2. 70.

కమియార

  • పూర్తిగా, సంతృప్తిగా. కమియు అనగా పూర్ణముగా. ఈ అర్థంలో చాలాతావుల ప్రయుక్తం; కమియార పండు ఇత్యాదులు.
  • "కాంతాజనంబులు కమియార నిడుదురే, పురములో దత్కాలపుణ్య భిక్ష." భీమ. 3. 7.

కమ్మకట్టు

  • చేసుకొన్న ఒడంబడికనుబట్టి ఇతరరాజులు పంపుసైన్యము.
  • "కోయిలవజీరుల దుమ్మెద కమ్మకట్టు మూ, కల గొరవంకరాదొరల." చంద్రి. 2. 82.

కమ్మగుట్టు

  • అతిరహస్యం.
  • "అదంతా కమ్మగుట్టు. చచ్చినా బయటికి తెలియదు." వా.

కమ్మచుట్ట

  • జాబు. తాటాకుతో వ్రాసి గొట్టంలో పెట్టి పంపే అలవాటుపై వచ్చినమాట.
  • "శుభవార్తల బంగరు కమ్మచుట్ట నా, దినకరమండలంబు...." విజయ. 3. 92.

కమ్మనూనె

  • వాసననూనె.

కమ్మచ్చు

  • బంగారు వెండి కమ్మిగా తీసే కమ్మ____కమ్మ 406 కమ్మ____కమ్మే
  • ఒక అచ్చు, ఇనుప పలకలో రక రకాల పరిమాణాలలో రంధ్రాలు వేసి ఉంటారు.
  • "వెండి తీగలు నిగిడించు, చదలు కమ్మచ్చు బెజ్జము లనంగ." పారి. 2. 39.
  • "దీన్ని సాగ్గొట్టి కమ్మచ్చులో లాగ రా." వా.
  • రూ. కమ్మెచ్చు.

కమ్మటాకు

  • ఒక ఆభరణం. ద్వార. 4. 140.

కమ్మనీరు

  • 1. తేనె.
  • "మున్నీ రైనయా కమ్మనీ,రు రహిన్ గూడిన నేర్పరించు గము లై రోలంబ కాదంబముల్." ఆము. 5. 121.
  • 2. పన్నీరు.
  • "...ఒక పంకజలోచన వ్రాసె... గుబ్బవలిచన్నులపై మకరీకలాపముల్, వావిరి గమ్మ నీరు మృగ నాభి రసంబున మేళవించి." శృం. నైష. 3. 102.

కమ్మపంజు

  • కమ్మలోని రాళ్ళు పొదిగిన భాగం.

కమ్మపిల్లి

  • పునుగుపిల్లి. శృంగా. శాకుం. 1. 98.

కమ్మ పూత

  • గందపు పూత.

కమ్మ యగు

  • రుచికరముగా నుండు.
  • "కాలెనొ చవి గావొ కమ్మ గావో నీకున్." కా. మా. 3. 88.

కమ్మవడ

  • ఒక భక్ష్యము. పాంచా. 4. 59.

కమ్మిచీర

  • కమ్ములు పోసి నేసినచీర.

కమ్మితీయు

  • 1. చిక్కిపోవు.
  • "బాల్యంబు కమ్మితీసె." పార్వ. 2. 24.
  • 2. చల్లగా జారుకొనిపోవు. దక్షిణాంధ్రంలో ఇది ఈ అర్థంలో ఎక్కువగా వినవస్తుంది.
  • "వాడు మేం మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే చల్లగా కమ్మితీశాడు."వా.
  • చూ. కంబి తీయు.

కమ్మినూకు

  • కమ్మచ్చున బెట్టి తీగగా తీయు.
  • "కమ్మి నూకిన నూత్నకలధౌతమును బోలె." భీమ. 4. 130.

కమ్మిపెట్టు

  • కప్పిపెట్టు. కొత్త. 340.

కమ్మీ చేయు

  • నేరము దాచు.
  • కమ్మేరాకు. తమలపాకులో ఒక విధం. అవి రెండు రకాలు. కారపాకులు, కమ్మేరాకులు. కయి____కయి 407 కయి____కయ్య

కయికాన్క చేయు

  • బహుమతు లిచ్చు.
  • "విశేషభూషణో,ద్భాసిత చిత్రచేలము లపారముగా గయికాన్క చేసి..." శుక. 4. 80.
  • చూ. కైకాన్క.

కయిచూఱగా

  • కొల్లగా.
  • "హయగజరథములు నావు లెద్దులును, గయిచూఱగా మాకు గలిగినకొలది." ద్వి. భల్లాణ. 1. 19.

కయిదండ

  • చేయూత.
  • "ఇకన్ గయిదండ గొమ్ము." ఉ. రా. 6. 66.
  • చూ. కైదండ.

కయిదండ బట్టు

  • చేయూత నిచ్చు.
  • "చెలికత్తె ల్గయిదండ బట్టగ సురస్త్రీ లెంద ఱైన న్గెలం, కుల సేవింపగ." కా. మా. 2. 6.

కయిలకట్ట

  • కవిలకట్ట. కుక్కు. 31.
  • చూ. కవిలకట్ట.

కయిలాగు

  • చేయూత.
  • "చెట్లు వెంబడి గయిలా గొసంగ." కువ. 2. 47.

కయివారము

  • స్తోత్రపాఠము. రాజులు మొదలగువారు వెడలునప్పుడూ, కొలువు తీరినప్పుడూ చేసే స్తోత్రపాఠాలనే కైవారము లంటారు. బస. 2. 26.
  • చూ. కైవారము.

కయివ్రాలు

  • వంగు.
  • "క్రిందికి గయివ్రాలు తత్సలిలనిర్మలధార." ఆము. 4. 21.
  • "కయివ్రాలక వాడక తావి వోక." విప్ర. 2. 29.
  • చూ. కైవ్రాలు.

కయిసేయు

  • అలంకరించు.
  • "చెలువ చాల నిట్లు గయిసేయగ." వసు. 5. 123. హర. 2. 108.
  • చూ. కై సేయు.

కయ్యపుగ్రచ్చ

  • జగడగొండి.
  • "గొడవగొట్టులు మడివిడుపులు చాల, గడసరుల్ కయ్యంపు గ్రచ్చలు... వారవనితలు." పండి. పురా. 115.

కయ్య మిచ్చు

  • యుద్ధము చేయు.
  • "కయ్య మి మ్మని...పిల్చుటయు." హరి. ఉత్త. 4. 16.

కయ్యమునకు కాలు దాచు

  • యుద్ధానికి పిలుచు.
  • "...దివ్యమౌనీంద్ర! నా, కమృగీనేత్రల మీద గయ్యమునకుం గాల్ దాచులా గొప్పెడున్." కళాపూ. 1. 147.
  • చూ. కయ్యమునకు కాలు ద్రవ్వు. కయ్య_____కయ్యా 408 కయ్యా_____కర

కయ్యమునకు కాలు ద్రవ్వు

  • జగడమున కీడ్చు.
  • "కయ్యమునకు వలదు కాల్ద్రవ్వ." భార. శాంతి. 2. 282.
  • చూ. కయ్యమునకు కాలు దాచు.

కయ్యము పొడుచు

  • యుద్ధము చేయు.
  • "అధిప! నీ తనయుడు కయ్యంబు వొడుచు, తెంపు వదలక విభవంబు పెంపు మెఱసె." భీష్మ. 1. 142.
  • చూ. కయ్యము వొడుచు.

కయ్యము లిడు

  • కలహములు పెట్టు.
  • "...కయ్యంబు లిడ నెందు గతి గల్గునో యని, వెదకుచు..." కళా. 2. 6.

కయ్యము వొడుచు

  • కలహించు, యుద్ధము చేయు.
  • రూ. కయ్యము పొడుచు.

కయ్యము సెల్లు

  • యుద్ధ మగు.
  • "పిదప నెట్లు గయ్యము సెల్లెన్." భార. కర్ణ. 2. 215.

కయ్యము సేయు

  • యుద్ధము చేయు.
  • "కయ్యము సేయుట కప్పు డిమ్మగున్." భార. విరా. 4. 207.

కయ్యాలక్రచ్చ

  • జగడగొండి.
  • "కయ్యాలక్రచ్చ లై కడగి యీవచ్చు, దయ్యాల ముక్కులు దఱిగి ఖండింతు." గౌ. హరి. ప్రథ. పంక్తి. 1981-82. పాండు. 4. 210.

కయ్యాలమెకము

  • నక్క. వావిళ్ళ.

కరకర ధ్వన్యనుకరణము.

  • "వాడు కరకర నమలి మ్రింగా లని చూస్తున్నాడు." వా.

కరకర ఆకలి అగు

  • బాగా ఆకలి వేయు.
  • "జబ్బుపడి లేచావు. కరకర ఆకలి అయ్యేదాకా యేమీ తినకు." వా.
  • "ఈ మందు నాలుగురోజులు పడుకో బోయే ముందు వేసుకున్నా వంటే కరకరా ఆకలి వేస్తుంది." వా.

కరకర పడు

  • కోపపడు.
  • "పటురోషమునన్, గరకరపడుచును నెదిరిన, ఖరకరవంశజుడు ద్రుంచె ఖరుని శిరంబున్." మొల్ల. రామా. అర. 15.

కరకర ప్రొద్దు పొడుచు

  • అప్పు డప్పుడే సూర్యోదయ మగు.
  • "పూర్వదిశయందు గరకర బ్రొద్దు పొడిచె." హర. 7. 139.
  • "కరకర పొద్దు పొడిచేవేళకు మన మా ఊరు చేరుకుంటే, మనపను లన్నీ ముగించుకొని సాయంకాలానికి ఇల్లు చేరవచ్చు." వా.

కరకరించు

  • కొట్లాడు.
  • "మఱియొకడు వానిపై గరకరించి." పార్వ. 6. 70. కర_____కర 409 కర_____కర

కరకరి పుట్టు

  • ద్వేషము కలుగు, గుఱ్ఱు పుట్టు.
  • "కరకరి పుట్టుగా గలదు కామిని! నీ వలి చన్నుదోయికిన్." శృం. నైష. 5. 132.

కరకస

  • పగ. బ్రౌను.

కరగి పోవు

  • నీ రగు.
  • "గానంబు వినిపింప బూనెనా యా మహా, గిరిరాజ మైనను గరగిపోవు." రాధి. పీఠి. 20.

కరగుపడు

  • క్షీణించు. మను. 6. 9.

కరగ్రహవంతురాలి చేయు

  • పెండ్లి చేయు.
  • "ఇంతనాడు కరగ్రహవంతురాలి జేసి తోడ్కొని వచ్చితి." నిరం. 2. 58.

కరజంభలముగతి

  • సుస్పష్టముగా అని భావము. జంభల మనగా నిమ్మకాయ. అరచేతిలోని నిమ్మకాయ అన్ని వైపులా కానవచ్చును. దానివలె అతిస్పష్ట మనుట. ఈ అర్థంలో తఱుచుగా వినవచ్చే మాట కరతలామలకము.
  • "సచ్చిదానందసం,పద చేతం గరజంభ లంబుగతి గన్పట్టున్ ధరాధీశ..." హంస. 1. 51.
  • చూ. కరతలామలక మగు.

కరటకదమనకులు

  • ఎడబాయక ఉన్న వంచకులు.
  • "ఆ ఊరికి వా ళ్లిద్దరూ కరటక దమనకులు. ఏ వ్యవహారం వచ్చినా దాని వెనక వీళ్లు ఉన్నా రన్నమాటే." వా.

కరడు కట్టిన మనసు

  • గట్టి మనసు; కఠినహృదయం.
  • "ఆ పిల్ల అంతగా ఏడ్చినా వాని కరడు గట్టినమనసు ఏమాత్రం కరగ లేదు." వా.

కరణకమ్మలు

  • బ్రాహ్మణులలో ఒక జాతి.

కరణికము

  • చూ. కరణీకము.

కరణీకము

  • కరణపువృత్తి.
  • "వాళ్లకు ఆ ఊళ్లో కరణీకం ఉంది." వా.
  • చూ. కరణికము.

కరతలామలక మగు

  • అతిస్పష్ట మగు. చేతిలోని ఉసిరిక కాయవలె పూర్తిగా తెలియవచ్చునది అనుట.
  • "ఆ వీరుని యక్కజ మగు, లావు వెరపు గరతలామలక మై తోచెన్." భార. ద్రోణ. 3. 154.
  • చూ. కరజంభలముగతి. కర____కర 410 కర____కర

కరతిత్తి

  • చేతిసంచి; చర్మపుసంచి.
  • "ముష్టిం, బరసిన కరతిత్తి పత్రాల సంచి." గౌర. హరి. ఉ. 503.
  • "కావళ్ళ, గరతిత్తులను నుదకంబును గొనుచు." పండితా. పర్వ. 354.

కరదివ్వె

  • కరదీపము; దివిటీ. గౌర. హరి. పూ. 1856.
  • చూ. కరదీపిక.

కరదీపిక

  • దివిటీ.
  • చూ. కరదివ్వె.

కరన్యాసం

  • కొన్ని కర్మలలో చేతిలోని ఒక్కొక్క వ్రేలినీ తాకుతూ కొన్ని మంత్రాలు పఠించడం అలవాటు. దీనిని కరన్యాసం అంటారు. ఇది ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అక్షరక్రమంతో ఉంటుంది. ఇలాంటిదే అంగన్యాసం.

కరపత్రము

  • చీటి, ప్రకటనపత్రము. ఇది హాండ్ బిల్. పాంఫ్‌లెట్ అను ఆంగ్లపదాల ద్వారా వచ్చినది.
  • "ఎన్నికలలో ఇరుపక్షాలవాళ్లూ కరపత్రాలు పంచి పెట్టారు." వా.

కరపీడనము

  • పాణిగ్రహణము; పెండ్లి.

కరములు మొగుచు

  • నమస్కరించు.
  • "సమర్చనములు చేసి కరంబులు మోడ్చి తిరంబుగ గన్నవి." రుక్మాం. 1. 82. పాండు. 2. 155.

కరవట్టు

  • చేతిగుడ్డ; కరాటము.
  • "తడి యొత్తు కరవట్టు దడిసి యున్నది యొ." పండితా. ప్రథ. పురా. పుట. 4. 52.

కరవట్నాలు

  • అర్థము విచార్యము.
  • "కాంతల మాన మనేటి కరపట్నాలకు దిగె, మంతనాన జీవు డనే మంచి మరకాడు." తాళ్ల. సం. 9. 99.

కరవాడి

  • అధికతీక్ష్ణత.
  • "కరవాడి బిఱ్ఱెండ గాయకుండ." భీమ. 3. 88.

కరవాడిచూపులు

  • అందమైన చూపులు. కరవాడి ఒకరకమైన చేప. 'వాలుగ చూపులు' వంటి మాట యిది. చూపులను చేపలతో పోల్చుట పరిపాటి.
  • "ఔర! కరవాడి చూపుల యౌఘళంబు." పాండు. 1. 117. కర____కరా 411 కరి____కరు

కరవు దీర

  • తనివి తీర.
  • "కరవు తీరా చూశాడు." వా.
  • "కరవు తీరా మాట్లాడుకొన్నాము." వా.

కరసాన పట్టు

  • సాన పట్టు.

కరామలకము

  • కరతలామలకము; అతిస్పష్టము.
  • "సర్వము నీ కరామలక మై యుండుం గదా?" భాగ. స్క. 2. 73.
  • చూ. కరతలామలకమగు.

కరారావుడి చుట్టు

  • సున్న చుట్టు. క్రారవడి వాడుకలో కరా రావుడిగా మారిపోయింది. ఆ వత్తు ఆకారసామ్యంతో యేర్పడిన పలుకుబడి.
  • "వాడు ఇస్తాను ఇస్తా నని ఆఖరికి కరా రావుడి చుట్టాడు." వా.

కరారావుడు

  • ద్రావిడి. తక్కువచూపుతో నిరసనగా అనుమాట. బ్రాహ్మణులలో ఒక తెగ ద్రావిడులు. అందులో ఆరామద్రావిడులు. పేరూరు ద్రావిడులు ఇత్యాదిగా చాలా రకా లున్నవి.
  • "వాడు వట్టి కరారావుడు గాడు." వా.

కరికరి పడు

  • పగగొను; కోపపడు.
  • "పంకరుహాక్షున్, గరికరిపడి దూషించిన, నరు లేగుదు రుగ్ర మైననరకంబునకున్." పద్మ. ఉత్త. 2. 28.
  • చూ. కరకర పడు.

కరికోత పెట్టు

  • వేధించు, బాధించు.
  • "హరిమధ్య యెవ్వతె కరికోత బెట్టునో, యదలించి మత్తేభయాన లార!" రాధి. 3. 69.

కరిజకాయ

  • చూ. కజ్జకాయ.

కరి మ్రింగిన వెలగపండు

  • చడీ చప్పుడూ లేకుండా లోని సారం పోయినది.
  • "సిరి దా బోయిన బోవును, గరి మ్రింగిన వెలగపండుకరణిని సుమతీ!" సుమతి.
  • చూ. ఏనుగ తిన్న వెలగ కాయ.

కరుకు కరుక్కున

  • నఱకుటలోని ధ్వన్యను కరణము.
  • "కరుకు కరుక్కున నఱికి పట్టి." రాధి. 3. 130

కరుడు కట్టిన...

  • సారభూత మైన. ఇది శ్రేష్ఠతను, ఉత్తమతను సూచించును.
  • "సాక్షాత్కరించిన శాంతరసంబు నా, గరుడు గట్టినతపోగరిమ యనగ..." కళా. 3. 13. కరు____కర్క 412 కర్కో___కర్ణ

కరుడు గట్టు

  • గట్టిపడు.
  • "కలల మై విప్పువారుచు గరుడుగట్టి." శకుం. 2. 144.

కరుణ గలుగు

  • కరుణ కలవా డగు.
  • "కరుణ గలిగి యునికి యిది యకారణము సుమీ." పారి. 1.

కరువు గట్టు

  • పోత పోయుటకై దిమ్మను తయారు చేయు.
  • "ఇరువురు సౌఖ్యరసముల గరువు గట్టి, పోసి చేసిన రూపుల పోల్కు లైరి." నిర్వ. 8. 70.

కరువున పోయు

  • పోత పోయు, విగ్రహముగా నొనరించు.
  • "...గరువున బోసిన పరమసత్యంబు నా, రాశియై యున్న వైరాగ్య మనగ..." కళా. 3. 13.

కరువులో అధికమాసము

  • ఉన్న కష్టాలు చాలక మఱొక పెద్ద కష్టం వచ్చిన దనుట. కరువు కాలంలో అధికమాసం కూడా వస్తే మరొక నెల పెరిగినట్లుగా భావించి అనేమాట.
  • "కరువులో అధికమాస మని, ఇంట్లో బియ్యం లేక ఛస్తూంటే యిప్పుడే మా మామగారు సకుటుంబంగా వేంచేపు చేశారు." వా.

కర్కటిగర్భము

  • ఆత్మవినాశకము. ఎండ్రకాయ (పీత) పిల్ల లను పెట్టి తాను చనిపోతుంది అని ప్రతీతి. తేళ్ల విషయంలో కూడా యిలాగే అంటారు.
  • "కర్కటిగర్భమట్లు నను గాసిలి వెట్టెడు..." బసవ. 1. 97.
  • "కర్కటి గర్భముకరణి గాత్రము వ్రచ్చె." భార. భీష్మ. 3. 405.

కర్కోటకుడు

  • క్రూరుడు.
  • "వాడు వట్టి కర్కోటకుడు. వాని దగ్గరికి ఎవరు పోతారు?" వా.

కర్తరిపాణి

  • ఒక చేయిని మఱొక భుజం పైకి వచ్చునట్లు చేతులను కత్తెరవలె కట్టుకొనుట. పండితా. ద్వితీ. పర్వ. పుట. 514.

కర్ణములు అదిమికొను

  • చెవులు మూసుకొను... ఆ వినుమాట ఎదో విన రాని దనుటను ఈ చేష్ట సూచించును.
  • "చేతుల గర్ణంబు లదిమికొనుచు." కాశీ. 7. 239.
  • చూ. చెవులు మూసికొను.

కర్ణ శృంగఖ్యాతి గనుపట్టు

  • ముందు వచ్చిన చెవులకంటె వెనుక వచ్చిన కొమ్ములు వాడి యనుమాట నిజ మగు.
  • "కర్ణశృంగఖ్యాతి గనుపట్టె నని..." లక్ష. 3. 94. కర్ణా___కర్ణా 413 కర్ణు____కర్మ

కర్ణాంజలి పుటము లొగ్గు

  • చెవి యొగ్గు; మాటను శ్రద్ధగా విను.
  • "నిజమధుర వచన సుధాసారంబునకు గర్ణాంజలి పుటంబు లొగ్గ నక్కంజ నయన యి ట్లనియె." శుక. 3. 474.
  • చూ. చెవి యొగ్గు.

కర్ణాకర్ణికగా

  • గాలివార్తగా, జనశ్రుతిగా.
  • "అచ్చెలువ నెచ్చెలుల ముచ్చటలవలన గర్ణాకర్ణిక నవ్వార్త మధురలాలస చెలి కత్తెలు విని." కళా. 7. 237.
  • చూ. కర్ణాకర్ణి గా.

కర్ణాకర్ణి గా

  • జనశ్రుతిగా. ఎవరో ఒకరికి చెప్తే. మరొకరికి వారు చెప్తే, అలా ప్రాకినట్టి వార్తల పట్ల ఉపయోగించే మాట.
  • "...తచ్చరిత్రములు నాచే గ్రొత్తగా నేల క,ర్ణాకర్ణిం గథలందు మున్ను వినమే నానాప్రకారంబులన్." ఉ. హరి. 5. 296.
  • "కర్ణాకర్ణిన్ గథలందు మున్ను వినమే." ఉత్త. హరి. 4. 296.
  • "ఆ విషయం నేను కర్ణాకర్ణిగా విన్నాను." వా.
  • చూ. కర్ణాకర్ణి కగా.

కర్ణామృతముగా

  • వీనుల విందుగా.
  • "విమలవాగ్భంగి గర్ణామృతములు గాను." రుక్మా. 1. 51.

కర్ణుడు లేని భారతము

  • అసలు సున్నా అయినది. ముఖ్య మయినదే లోపించినది - అనుట.
  • "నీవే రాకపోతే నీ పెత్తనానికి మేం వెళ్ళడ మేమిటి? కర్ణుడు లేని భారతమా?" వా.

కర్ణునితల భారతము

  • దీని కంతా ప్రధానుడివి నువ్వే అనుపట్ల ఉపయోగించే పలుకుబడి. కర్ణుని తలమీదనే భారతకథ అంతా నిలిచి ఉన్న దనుటపై యేర్పడినది.
  • "నువ్వే యిలా అంటే యెలాగు రా? కర్ణుని తల భారతం అన్నారు." వా.

కర్ణేజపుడు

  • చెవి కొరుకువాడు. ఒకరిపై చాడీలు చెప్పేవాడు.

కర్మ (0) కాలి

  • దురదృష్టవశాత్తూ.
  • "నా కర్మం కాలి వా డక్కడకు వస్తే...ఇంక నా పని అయినట్టే." వా.
  • "వాడి కర్మ కాలి వీనిముందుకే ఆ కాగితం వెళ్లాలా?" వా.

కర్మ కాలిపోవగా

  • విసుగు వేసటలను దెలిపే ఊతపదం.
  • "లంజముండలం, దుత్సుకతాభరమ్ము గొను టొప్పునె కర్మము కాలిపోవగన్." పాణి. 4. 45. కర్మ____కఱ 414 కఱ____కఱ

కర్మచండాలుడు

  • చండాలుడు కాకపోయినా పనులచే చండాలు డయిన వాడు.
  • "చక్కన ముచ్చట్లు జరపగ నేల, యిక్కర్మచండాలు రెంతటివారు." బస. 7. 188.
  • "వాడు జన్మత: పెద్ద వంశంవాడే. అయితే నేం కర్మచండాలుడు." వా.

కర్మ చాలక

  • దురదృష్టవశాత్తు.
  • "కర్మ చాలక అక్కడికి వెళ్లాను, అన్ని మాటలు తిన్నాను." వా.

కఱకరి (ఱి) పెట్టు

  • నిర్బంధ పెట్టు.
  • "కఱకఱి పెట్టి సొ మ్మడుగు." ఆము. 5. 61.

కుఱకుట్లు, చంకలో పొత్తములు

  • అంది పొందని నడవడి; కపట వర్తనము అనుపట్ల ఉపయోగించే సామ్యము. మాంసపు ముక్కలనూ, పుస్తకాలనూ చంకలో పెట్టుకోవడం ఎలా కుదురుతుంది?
  • "...తగునే కఱకుట్లును జంక బొత్తముల్." ఉ. హరి. 2. 137.

కఱకుమాటలు

  • కఠినోక్తులు. శృం. నైష. 7. 93.

కఱకు లాడు

  • కఠినోక్తు లాడు.

కఱకొను

  • గట్టిపడు; నిలుచు.
  • "గుఱుకొని చేసినయఘములు, కఱకొని దృఢవజ్రలేపకం బగు దరుణీ." పద్మ. 3. 88.

కఱగొఱ

  • అఱకొఱ; అవమానము.
  • "కడిందిగ జూడకు నీకు నేమియుం, గఱగొఱ గాదు." భార. ద్రోణ. 3. 223.
  • "చాలమి దెచ్చుకొన్న నా, కఱగొఱ దీర్తు గాక." కకు. 5. 34.

కఱతలయోగి

  • పరమపదము నందుకొన్న యోగి.
  • కఱ - తీరము. (తమి) ఆఖరు మెట్టు చేరినవా డనుట.
  • "కఱతలయోగిని కర్మ మంటునా!" తాళ్ల. సం. 7. 211.

కఱతలాడు

  • విజ్ఞుడు నేర్పరి.
  • "ఉపనిషత్ప్రపంచంబు, గడదాక నెఱిగిన కఱతలాని...గాంచి." కాశీ. 2. 160.
  • చూ. కఱతలయోగి.

కఱదూపము

  • పొయినుండీ వచ్చే నల్లని పొగ.
  • "విరహ పరితాప వేదన వేగుచున్న, చక్రవాకాంగనల కటాక్షముల యగ్గి, నావహిల్లిన కఱదూప మనగ నొప్పు, నుడుగణాధీశబింబంబు నడిమిమచ్చ." భీమ. 2. 45. కఱ____కఱ 415 కఱ____కఱి

కఱపడు

  • కొఱతపడు.
  • "యత్న మేమియున్, గఱపడకుండ." వేం. పంచ. 5. 58.

కఱ వగు

  • లేకపోవు, అరు దగు.
  • "కఱవు గఱ వయ్యె." రుక్మా. 1. 136.
  • "వాని దర్శనమే ఇటీవల కఱ వయి పోయిం దమ్మా! ఏం చేస్తాం? పెద్దవా డయ్యాడు." వా.

కఱవవచ్చు

  • 1. కసురుకొను.
  • "వాణ్ణి పలకరిస్తె కఱవ వస్తాడు." వా.
  • 2. మీదికి వచ్చు. నా. మా. 39.

కఱవు

  • అరుదు, అపురూపము. కఱ వేర్పడి నప్పుడు ఆహార ధాన్యాదులు కఱ వగును. తద్వారా వచ్చిన పలుకుబడి.
  • "కలియుగంబున ధర్మంబు కఱవు గాన." భీమ. 5. 152.
  • "ఈ ఊళ్ళో ఇంగువకే కఱవా? ఎక్కడి కెళ్ళి అడిగావో ఏమో? లే దంటూ వచ్చావు." వా.

కఱవునకు తోడు ఆవ వంట కలిగినట్లు

  • బాధలో మఱింత బాధ కలిగినట్లు. కరువు మూలంగా కడుపు మండిపోతుండగా ఆవాలు పండినా, అవి కాచి తాగితే మరింత మంట యెక్కు వవుతుందే కాని తగ్గదు. నిప్పునకు గాలి తో డైనట్లు అనుట వంటిది.
  • "పరు సైన యెండమెండున, నరవర లై హాయి లేక యలజడి పడగా, సుర గాలి యేచె బ్రజలం, గఱువుకు దో డావపంట గలిగినకరణిన్." కువ. 1. 101.

కఱవున పడినట్టు

  • దొరికిందే చాలు నని ఎగబడి.
  • కరువో కాలమో అని వాడుక. అన్నం కనిపించగానే వాడు కరువో కాలమో అని తినడం మొదలు పెట్టినాడు ఇత్యాది రూపాలలో వినవస్తుంది.
  • "తెచ్చుకొని యిచ్చలోపలి హెచ్చు కోర్కు, లెన్ని గల వన్నియును దీఱ నెనసి చతుర, రతుల కఱవున బడినట్టు లతుల సౌఖ్య, వారినిధి దేలు చుండిరి..." శుక. 2. 344.

కఱవో కాలమో అని

  • దొరికిందే తడవుగా దాని ననుభవించుటకై ఎగబడి.
  • "ఆ ఊళ్ళోకి నిమ్మకాయలు రాగానే కఱవో కాలమో అని అమ్మలక్క లంతా చుట్టుకున్నారు." వా.

కఱిగొను

  • మాడిపో జేసికొను. పాడు చేసికొను అనుట. కఱు____కల 416 కల____కల
  • "ఈ మట్టికుండల, నిచ్చ వండి పెట్ట మెచ్చు రాదు, వంట జేసి మొదలి వంట నే కఱి గొన్న,దాన దొలుత వంట దగుట యెట్లు." సింహా. 2. 30.

కఱుదులపూప

  • నేర్పరి. నేర్పు లన్న అర్థంలో కఱుదులు చాలచోట్ల కానవస్తుంది.
  • "కఱుదులపూప వై మునులు గానని యట్టి కతల్ వచింపగా..." కళా. 6. 183.

కఱుదులాడు

  • నేర్పరి.
  • "కఱుదులా డగుచక్రి కపటంపు టనువున, దను మోసపుచ్చిన." హరి. ఉత్త. 7. 30.
  • క్రియగా నేర్పులు పల్కు అని అర్థ మిస్తుంది.

కఱ్ఱతేనె

  • వెదురు తేనె.
  • "తిన్న డిచ్చిన కఱ్ఱ తేనియ ద్రావునే." రుక్మా. 3. 231.

కఱ్ఱపెత్తనము

  • పని యేమీ చేయకుండా అజమాయిషీ చేస్తున్నట్టు-అటూ ఇటూ తిరుగుతూ, అదిలిస్తూ నటించుట.
  • "వా డేం పని చేస్తాడు. కఱ్ఱపెత్తనం చేస్తాడు. అంతే." వా.

కలకంఠము

  • మనోహర మైన కంఠస్వరము.
  • "వాడు కలకంఠం విప్పితే పాములు నాట్యం చేస్తా యనుకో." వా.

కలకండ (ము)

  • పటికబెల్లము
  • "కలకండ పానకం చేసి తాగితే నీ వేడంతా క్షణంలో పోతుంది." వా.

కలక దేఱు

  • నిర్మల మగు, తేఱు.
  • "ఏఱులందు గలక దేఱ దొడగె." కుమా. 6. 115.

కలకపడు

  • కలతపడు.

కలకపాటు

  • చూ. కలతపాటు.

కలకబారు

  • కలత చెందు.
  • "కాంచి తల వంచి సిగ్గుచే గలక బారు." రాధి. 1. 107.

కలకబాఱు

  • కలత చెందు, ఎఱ్ఱవడు.
  • "కలకంబాఱి మఱంది చెల్లెలి నుదగ్ర క్రోధుడై పట్టి." భాగ. 10. పూ. 44.

కలకల (నవ్వు)

  • ధ్వన్యనుకరణము.
  • "తా గల కల నవ్వుచున్న పరిఖావల యంబువిధంబు జూచితే." కళా. 5. 109.

కలకలము

  • సద్దు, సందడి, జనసమ్మర్దం.
  • "కలకలంబులకు డగ్గఱక హర్మ్యాగ్ర తలములపైనుండి దర్శించువారు." బస. 2. 26. కల____కల 417 కల____కల

కలకల లాడుతూ

  • ఎంతో సంతోషంగా; సుందరంగా.
  • "పిల్లా జెల్లాతో ఆ యిల్లు కల కల లాడుతూ ఉంటుంది." వా.

కలకలు తేర్చు

  • కలత పోగొట్టు.
  • "తాకియుం దలచెడు వారు లే రని మనంబుగలంకలు దేర్చి." పారి. 2. 52.

కలకాలము

  • ఎల్ల ప్పుడు.
  • "ఈ పని కలకాలం నిలిచేది గనుక ని న్నింతగా పురికొల్పుతున్నాను. ఈ పాఠశాల ఎలాగో నీవే కట్టించాలి." వా.

కలగంప

  • కలగూరగంప.

కలగంప కడుపు

  • సంతానసమృద్ధి కలది.
  • "వారి కలగంప కడుపుల నేరుపరుల, నరిదిబిడ్డల బడసినబిరుదుసతుల." భాగ. 10. 255.

కలగంప వలపు

  • అమ్మజూపు వలపు; విలువ లేని ప్రేమ అనుట.
  • "కలగంప వల పాయె కాదా మఱి." తాళ్ల. సం. 3. 620.

కల గన్న యట్టులు

  • అస్పష్టముగా.
  • "ఎలమీం దద్రాజకన్య నేలాగుననో, కల గన్నయట్టు లొకనా, డలవోకం జూచి మన్మథాజ్ఞావశు డై." శుక. 1. 544.

కలగబడు

  • కలతపడు; ఛిన్నా భిన్న మగు.
  • "సాత్యకి కో,ల్తల కోర్వక నీ బలము గలంగంబడియెన్." భార. ద్రో. 4. 5.
  • "శరముల వేగంబున గద, పరుస దనంబునను గలగబడి చేడ్పడ నా, కరులం దోలెను భీముడు..." భార. భీష్మ. 2. 215.

కలగబాఱు

  • క్షోభపడు; చెల్లచెద రగు; కలత చెందు.
  • "....ధారణీపాల సభల, గలగ బాఱక సుకవులు మెలగు టెట్లు." చంద్రా. 1. 16.
  • "కలగం బాఱి తొలంగె వారుణ బలౌఘంబుల్." హరి. 8. 272.
  • "శాంతి సం,పద నొకయంతయున్ గలగ బాఱక యుండడె నిర్వికారు డై." భార. శాం. 6. 202.

కలగలుపు చేయు

  • కలుపు.
  • "వీరి వారి గలగలుపు చేయున న్నన వలయు గాక." రాధికా. 3. 45.

కలగల్పు

  • 1. కలిసి మెలసి పోవుట.
  • "కలగల్పుచూపుల, రాకపోకల బయల్ ప్రాకజేయు." పాండు. 3. 62.
  • 2. కలుసుకూర.
  • ఇ దీనాడు కలుసుకూర అన్న కల____కల 418 కల____కల
  • పేరనే దక్షిణాంధ్రంలో విశేషంగా వినవస్తుంది. ఏవో కూరగాయల ముక్కలతో పప్పు కలిపి చేసిన పొడికూర.
  • "ఒక కొన్ని కలగల్పు లొక కొన్ని బజ్జులు." పాండు. 4. 184.
  • 3. కల్తీ పదార్థం.
  • "ఇదంతా కలగలుపునెయ్యిగా ఉంది. వడ్డించకండి." వా.
  • చూ. కలగలుపు చేయు.

కలగాపులగం

  • గందరగోళము; నానా సంకీర్ణము.
  • "ఇందులో పద్యాలూ, పాటలూ అన్నీ కలగాపులగంగా ఉన్నాయి." వా.
  • "పప్పు లన్నీ కలగాపులగంగా కలిసి పోయాయి. ఏర్పరించాలి." వా.

కలగుండు గొను

  • కలత చెందు. భార. ద్రో. 1. 293.

కలగుండు చేయు

  • కలత పఱుచు.
  • "భీకరవనీకిటి యొక్కటి పక్కణంబులో, మదమున జొచ్చి యందుగల మానవులన్ గలగుండు చేయుచున్." చెన్న. 2. 77.

కలగుండు వడు

  • కలత చెందు.
  • "కలగుండువడి హల్లకల్లోల మై చాల గలగె వాహినులు." జైమి. 2. 33.
  • "కలగుండు వడ రొప్పి గవినుండి కుప్పించు, పులి గుండ్లవియంగ బొడిచె నొకడు." శుక. 1. 263.
  • "గుప్పనగూర చొచ్చెగలగుండు వడెన్మది యింక నెట్లొకో!" రాధా. 2. 21.

కలగుండు వెట్టు

  • కలత పెట్టు.
  • "కురుసైన్యంబుల గలగుండు పెట్టు." భార. భీష్మ. 3. 64.

కలగూర

  • నానావిధము లైన ఆకు కూరలు.
  • "కూలికి నూనె లంటి కలగూరల కై పొల మెల్ల జుట్టి." శుక. 2. 363.

కలగూరగంప

  • అన్నీ కలిసి ఉన్నది.
  • "ఇదంతా కలగూరగంపగా ఉంది. కావ్యమో, నాటకమో, నవలో చెప్పడానికి వీల్లేదు." వా.

కలగూరగంప చేయు

  • సంకర మొనర్చు.
  • "శాస్త్రసాహిత్యములు మాకె చాల జీత, మంచు గలగూరగంప సేయకుము..." బహు. 1. 110.

కలగొన బాఱు

  • కలత చెందు.
  • "కలగొన బాఱుచున్ సతులు కన్నుల నశ్రుజలంబు లొల్క." భార. శల్య. 2. 19.

కలగొను

  • కలత చెందు.
  • "కలవిహంగమంబులు గలగొన నఱచు తెఱగు దోచె." భార. సౌప్తి. 2. 6. కల____కల 419 కల____కల

కలచి యాడు

  • సంక్షోభింప చేయు.

కల నిక్కల యగు

  • కల నిజ మగు.
  • "కలయు నిక్కల యైన కరణి వట్రిల్లె." పండితా. ద్వితీ. మహి. పుట. 62.

కలని నక్క

  • ఎప్పుడు ఎవరు పోతారా, ఎవరికి ఆపద వస్తుందా, మనం దాన్ని స్వార్థానికి ఉపయోగించుకుందామా అని ఎదురు చూచేవాడు.
  • "కలనిన క్కైనయధికారి గలనృపతికి, నేడుదీవులు గొన్న సమృద్ధి లేదు." ఆము. 4. 237.
  • నేటి వాడుకరూపం:
  • గుంతకాడి (కడ) నక్క.
  • గుంత కాడి నక్క అంటే శ్మశానంలో నక్క. అ దెప్పుడూ ఎప్పుడు పీనుగ వస్తుందా అని ఉంటుంది. 'కలనినక్క' యుద్ధభూమిలోది. అది ఎప్పుడు ఎవరు యుద్ధం చేస్తారా అని కాచుకొని ఉంటుంది.
  • "వాడు గుంతకాడి నక్కలా కాచుకొని ఉంటాడు. వానిమాట నమ్మి అన్నదమ్ములు కాట్లాడకండి." వా.

కలను చెప్పు

  • యుద్ధము జరుగు నని, యుద్ధానికి రావలసిన దని చెప్పు. నేడు వాడుకలో 'భోజనానికి చెప్పడం' ఇత్యాదుల వంటిదే ఇది.
  • "హిమవంతంబు నుత్తరంబునం, గలను సెప్పి." కుమా. 10. 177.
  • "కలను చెప్పి మొనల దీర్చి కదిసిన సమయంబున." దశ. 2. 10.
  • "తద్రాజడింభకుల యెదుర బలికి కలను చెప్పి ర మ్మని వీడుకొల్పిన." ఉ. హరి. 4. 170.
  • చూ. యుద్ధము చెప్పు.

కల నైన

  • ఎన్నడూ అలా జరగదు అను సందర్భంలో ఉపయోగించే పలుకుబడి. వాస్తవంలోనే కాదు భావనలో కూడా అనుట.
  • "కలలోన నైన నవ్వుల కైన నా మాట జవదాట వెఱచునో చంద్రవదన." పారి. 1.
  • వాడుకలో రూపం: కలలో నైనా; కలలో కూడా.
  • "కలలో నైనా అతను అబద్ధ మాడడని గట్టిగా చెప్పగలను." వా.
  • "అతను కలలో కూడా ఒకరికి చెడుగు తలపెట్టేవాడు కాదు." వా.
  • చూ. కలలో నైన; కలలో కూడ.

కలపనగంప

  • అభూతకల్పనలు చేయువాడు.
  • "కలపనగంప యీతపసి కాలును నోరును బాదు గాన కె,వ్వలన బరిభ్రమించుచు.." హరివం. పూ. 5. 110. కల____కల 420 కల____కల

కలపనపిండి యగు

  • అతలకుతల మగు, క్షోభపడు.
  • "కలసెద బతి నత డిచ్చట, మెలగుట మా తండ్రి విన్న మే లగునే ప్రే,వులలోన సురియ ద్రిప్పిన, కలపన బిం డైన జెలిమికత్తెలు నగ రే." ఉ. హ. 5. 163.
  • ఇందులో పాఠం 'కలపనపిందైన' = యుక్తి, కాయ అయిన అనగా చెడిపోయిన అని అర్థం చెప్పి - వావిళ్ల ని. పాఠాంతరం ద్వారా అర్థం సాధించింది.
  • శ. ర. లో 'కలపనబిండి' = అని ఉన్నది. సూ. ని. కూడా అంతే. పాఠం తేలితే కానీ ఏమీ నిర్ధారణగా చెప్పలేము.

కలబడు

  • చేతులు కలుపు; కొట్లాడు.
  • "ఇరువాగు జగడమున గలబడియెన్." చంద్రా. 6. 74.
  • "మాటా మాటా వచ్చి వాడు వీడితో కలబడ్డాడు." వా.

కలయంపి చల్లు

  • ఇంటి ముంగిట పేడ కలిపిన నీళ్లను చల్లు.
  • "కస్తురి కలయంపులు చల్లి." యయా. 4. 152.
  • చూ. కళ్ళాపు చల్లు.

కలయబడు

  • కలబడు.
  • "కలయబడి పోర దొడగిరి..." భాస్క.రా. యు. 755.
  • ఇందుకు దగ్గరగా ఉన్న కలిసి పోవు, అన్యోన్యం తాకు వగై రాచ్ఛాయలలోనూ ఇది ప్రయుక్తం.
  • చూ. కలబడు.

కల యర్థము

  • ఉన్న సంగతి.
  • "ఏమన గలదాన గలయర్థము దెల్పు మటన్న..." శుక. 1. 320.

కలలో కలిమి

  • అస్థిరము. సుమతి. 102.

కలలో కూడ

  • బొత్తిగా అనుట.
  • "కలలోన నైన నవ్వుల కైన నా మాట జవదాట వెఱచు నో చంద్రవదన." పారి. 1. 94.
  • "వా డిట్లా చేస్తా డని కలలో కూడా అనుకో లేదు." వా.
  • సామాన్యంగా కలల్లో జరిగే సంఘటనలకు మన ఇష్టానిష్టాలతో నిమిత్తం ఉండదు. అటువంటప్పుడు కూడా అనుట.
  • చూ. కల నైన.

కలలోని కాన్పు

  • అసంభవము. కలలోని వన్నీ ఆయింతసే పే. కల____కల 421 కల____కల
  • అవి యథార్థం కావు అనుటపై వచ్చినది.
  • "అది కలలోని కాను పయి యంబిక యానతి మున్నె కల్గి..." హరి. ఉత్త. 7. 174.
  • చూ. కలలోని వార్త.

కలలోని వార్త

  • అసంభవము.
  • "మించు ననబోడిచందంబు మేలు కనిన, వాడు తలపోయి గలలోని వార్త యయ్యె." పాండు. 4. 238.
  • చూ. కలలోని కాన్పు.

కలలో నైనా

  • కలలో కూడా, ఎన్నడూ, బొత్తిగా అలాంటిది లేదనుట.
  • చూ. కలలో కూడ.

కలలో లేని

  • అసంభవ మైన.
  • చూ. ఇలలో లేని.

కలవంటకము

  • రకరకాల వంటలు. రకరకాల పదార్థాలు కలిపి చేసినవంటలు.
  • "పైడిచూలాలి వేవిళ్ళు వాయ దోట కలిమిచెలివెట్టు కలవంటకంబు లనగ." యయా. 4. 9.

కలవరపడు

  • కలతపడు; కంగారుపడు.
  • "అప్పులవాడే వచ్చ డేమో అని నీవు తలుపు తట్టగానే కలవరపడ్డాను." వా.

కలవాడు

  • 1.ధనవంతుడు; ఉన్నవాడు.
  • "అరకూటలాప మర్హ మే కలవానికిని." శృం. నైష. 4. 68. కాశీ. 3. 47.
  • "పేరు గలవాడు కలవాడు పెద్దవాడు." హంస. 1. 57.
  • 2. అయినవాడు, ఆప్తుడు.
  • "శాంతనవుండు సర్వకురుసంతతికిం గలవాడు జాడె." భార. ఉద్యో. 2. 165.

కలవు (వలపు)

  • కలవాడవు.
  • "నాతోడి వలపు గల వేని." బస. 3. 49.

కలశము లెత్తు

  • ప్రకటము చేయు. తాళ్ల. సం. 4. 133.

కలసికట్టుగ

  • ఒకమాట మీద, ఏకీభావముతో.
  • "కలసికట్టుగ నుందము గాక యున్న, జులుకదన మగు జుమ్ము..." వేంకటే. 3. 216.
  • "వారంతా ఏమైనా చాలా కలసి కట్టుగా పనిచేస్తారు. అందువల్లే పనులూ సానుకూల మవుతవి." వా.

కలసి మెలసి

  • అన్యోన్యముగా.
  • "ఒండొంటిం గలసి మెలసి విలసిల్లు తులసియు." విప్ర. 2. 25.
  • "ఆ యిద్దరు అన్నదమ్ములూ ఎప్పుడూ కలసి మెలసి ఉంటారు." వా.
  • రూ. కలసి మెలసి.

కలహమునకు కాలు ద్రవ్వు

  • జగడమున కీడ్చు. కల___కలి 422 కై___కలి
  • "స్వర్గ మర్త్యవదూటుల చక్కదనము, తుచ్ఛ మని నాగకన్యలతోడి కలహ,మునకు గాల్ ఫ్రవ్వెదనొ లేక బొటనవ్రేల, బుడమి వ్రాసెద విది యేల పువ్వుబోడి!" దశా. కూర్మ. 82.
  • చూ. కయ్యమునకు కాలు ద్రవ్వు.

కలహమె కల్యాణముగ నెంచు

  • కలహశీలు డగు.
  • "పలుదెఱగు ముళ్లమాటల, గలహమె కళ్యాణ మని జగంబులవెంటన్..." పారి. 1. 85.

కలాపన పొసగు

  • కల్లోలము రేగు. కాశీయా. 371.

కలికమున కైన.....

  • ఏ మాత్రమూ. బొత్తిగా దొరకదు అనుపట్ల ఉపయోగిస్తారు. ఏ మిరియాలగింజ వంటి దానినో నూరి కండ్లకు కలికం వేస్తారు. ఆ కలికానికి ఏ ఆవంతైనా చాలు. దానికి కూడా లే దనుట.
  • "ఆ ఊళ్లో మజ్జిగ కలికాని కైనా దొరకదు." వా.
  • "వాడిదగ్గర తెలివితేటలు కలికానికి కూడా లేవు." వా.

కలికితురాయి

  • శిరో వేష్టనముపై రాజులు మొదలగువారు చెక్కుకొను తురాయి.
  • "కిలికితురాయి మెఱయ." వేం. మా. 1. 134.

కలిగినంతలో

  • ఉన్నంతలో.
  • "కలిగినయంతలో సుఖముగా." పాణి. 4. 18.
  • "కలిగినంతలో అతనూ తన కుటుంబం హాయిగా ఉంటున్నారు." వా.

కలిగినది

  • ఏ దుంటే అది.
  • "ఉప్పో ఊరగాయో మా యింట్లో కలిగింది లేదనకుండా పెడతాము. తిని పోతూండు నాయనా!" వా.

కలిగినప్పుడు

  • సంపద ఉన్నప్పుడు.
  • "కలిగినప్పు డెల్ల జెలువుని చెంగట, నడగి మడగి యుండు టరిది గాదు." శుక. 2. 366.
  • చూ. ఉన్నవాడు, కలవాడు.

కలిగిన యంత చెప్పు

  • ఉన్న దంతా, సర్వమూ చెప్పు.
  • "కలిగిన యంతయు, నిక్కముగ జెప్పు డనుటయు వారల్." కళా. 6. 161.

కలిగినవాడు

  • సంపన్నుడు. పాండు. 2. 71.

కలి ద్రచ్చి వెన్న గొనగల

  • అసాధ్య కార్యములను నెఱవేర్చగల - జాణ అనుటలో నిరసనగా అనుమాట. కలి_____కలి 423 కలి_____కలి
  • జొన్న-బియ్యం కడిగిన నీళ్లను చిలికి వెన్న తీయగలగడం అసాధ్యం కదా.
  • చూ. కలి ద్రచ్చి వెన్న దీయు.

కలిని ద్రచ్చి వెన్న దీయు

  • అసాధ్యకార్యము చేయు.
  • "...కలియు ద్రచ్చి వెన్న గొనగ, గడవ నేర్పు గలిగి కందువు మానెడై, కత్తిగొంటు లయినయత్తగంతు." కుమార. 8. 135.
  • చూ. కలి ద్రచ్చి వెన్న గొనగల.

కలి, నూనె కలిసినట్లు

  • వేరువేరుగా ఉండు. కడుగునీళ్ళలో నూనె కలిసి పోయినట్లు, పూర్తిగా కలవక వేరు వేరుగానే ఉండుదు రనుపట్ల ఉపయోగించే సామ్యం.
  • "కలియు నూనెయు రెండు గలిసిన యట్లు." పండితా. ప్రథ. పురా. పుట. 3. 48.

కలి పోసిన వెనుక ఉట్టి కను గొనుమాడ్కి

  • కావలసిన దేదో అయిపోయిన తరువాత అందుకై విచారించి లాభ మేమి అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "కలవె యిక నేటి యాసలు, కలిబోసిన వెనుక నుట్టి కనుగొను మాడ్కిన్." రాధి. 3.
  • చూ. కలి పోసినవెనుక ఉట్లు కనుగొనుట.

కలి పోసిన వెనుక ఉట్లు కనుగొనుట

  • నిష్ప్రయోజనము. కుండలోని కలి అంతా పోసిన తరువాత, ఇంక ఉట్టి మీద చూపు లెందుకు అనుట.
  • "అలయింప గలంతయు న, న్నలయించితి చాలు మందరాద్రికి జని య,మ్మలహరు గొలిచెద నేలా, కలి పోసిన వెనుక నుట్లు గనుగొనగ నృపా!" రుక్మాం. 4. 75.

కలిమిదండుగ

  • ధనికులతో రాజులు వసూలు చేయుదండుగ.
  • "తెల్లబట్టల గట్టి తిరుగులాడెడివారి బిగియించి కలిమిదండుగలు పెట్టి." పార్వ. 2. 94.

కలి మెడు చల్లితే తూమెడు పండే....

  • తక్కువ పండునట్టి. విత్తనాలకంటే పంట తక్కువగునట్టి అనుట. కాశీయా. 115.

కలివిడి

  • 1. కలుపుగోలుతనము కల.
  • "కలివిడిమాటల బ్రియముల, నలయింపక యావులందు నాదరణమునన్." రుక్మాం. 3. 64.
  • "ఆ అమ్మాయి చాలా కలివిడిగా మాట్లాడుతుంది." వా.
  • 2. తెలివివచ్చి; స్పృహకలిగి.
  • ".....కలివిడి వడి నౌ, దలయంటి కలి_____కలి 424 కలి_____కలు
  • చూచుకొని యే,నిలు వెడలితి నాక్షణంబ యెత్తినభీతిన్." పాండు. 5. 207.

కలియగలపు

  • కలవేసుకొను.

కలి వెన్న బుచ్చ నేర్చు

  • జొన్నలో బియ్యమో కడిగిన నీళ్ళను కలి అంటారు. కలిలో వెన్న తీయగల జాణ. అసాధ్య కార్యములను చేయగల దనుటలో వచ్చిన నిరసన సూచక మైనపలుకుబడి.
  • పండితా. ప్రథ. పురా. పుట. 359.
  • చూ. కలి ద్రచ్చి వెన్న దీయు.

కలిసి మెలిసి

  • ఒకటిగా, అన్యోన్యంగా.
  • "కపట మెఱుగనిమమతల గలసి మెలసి." పారి. 1. 94.
  • "వా రెంతో కలిసి మెలిసి ఉంటారు." వా.
  • రూ. కలసి మెలసి.

కలిసి వచ్చు

  • అన్నీ సమకూరి వచ్చు. మన ప్రయత్నానికి తోడు దైవబలం కలిసి వచ్చింది అనే అర్థంలో ఉపయోగించే మాట.
  • "వాడు ఆవ్యాపారం అభివృద్ధి చేయడానికి ఎన్నోవిధాల ప్రయత్నం చేసినమాట వాస్తవమే. అయితే అంతకంటే యెక్కువపెట్టినవాళ్లూ ఉన్నారు. వాళ్లు అంతంతమాత్రంలోనే ఉండగా వీడేమో పైకి ఎక్కిపోతూనే ఉన్నాడు. కలిసివచ్చింది గనక." వా.
  • "దేని కైనా కలిసి రావాలి. తొందర పడితే లాభం యే ముంది?" వా.
  • "పాపం అహోరాత్రస్య కష్టపడ్డాడు. కానీ కలిసి రాలేదు. ఏం చేస్తాడు?" వా.
  • రూ. కలసి వచ్చు.

కలిసివచ్చే రోజులు

  • అదృష్ట కాలము.
  • "కలిసివచ్చేరోజులు కనక వా డేం చేసినా లాభంగానే ఉంది." వా.

కలుకోడి

  • రాతికోడి. నీటికోడి వంటి మాట. ఒరయూరులో రాతికోడి కూస్తుం దనీ, కలుపొన్న పూస్తుం దనీ, ప్రతీతి. దీని విశిష్ట తేమిటో తెలియుట లేదు. కలుకోడిధ్వని వినాశసూచకమని వ్రాశారు కాని అది యిక్కడ కుదరదు.
  • "కలుపొన్న విరుల బెరుగన్, గలు కోడిరవంబు దిశల గలయగ జెలగన్." కుమా. 1. 5.

కలుగజేసికొను

  • జోక్యము కల్పించుకొను.
  • "నే నిందులో కలుగజేసుకో దలచుకో లేదు." వా. కలు____కల్ల 425 కల్ల____కల్ల

కలుగు బెట్టు

  • కొద్దికొద్దిగా ఖర్చు పెట్టు, బొక్క పెట్టు.
  • "తులసిపోగులు మొదలుగా గలుగు బెట్టి." నిరం. 2. 116.

కలుగోట త్రోవలు

  • తప్పుదారి నడిచేవారు కావచ్చును. దూషణలో ప్రయుక్తం.
  • "కులహీను లధములు గులజు లుత్తములు, దొలగనికలుగోటత్రోవలు." పండితా. ప్రథ. పురా. పుట. 345.

కలుచపడు

  • కలత చెందు.

కలుపుగోలుతనము

  • నలుగురితో కలిసి మెలిసి ఉండునేర్పు.
  • "ఆ అమ్మాయి చాలా కలుపుగోలు తనంగా ఉంటుంది." వా.

కలో అంబలో

  • ఏదో యింత - కడుపు నించు కొనుటకు - అనే సందర్భంలో ఉపయోగిస్తారు.
  • "ఏదో రాక రాక వచ్చావు. మాకు కలిగింది యేదో కలో అంబలో తీసుకొని వెడితే మాకు సంతోషం." వా.

కలో గంజో

  • చూ. కలో అంబలో.

కల్లగుట్టు

  • తెచ్చికోలు ధైర్యము. తన సత్తా సార తెలియనీయకుండా మెలగుట.
  • "దద్విరహదశావికలిత ధైర్యుండయ్యు, నుల్లంబునం గల్లగుట్టు నెట్టు కొలిపి." కళా. 5. 20. ఆము. 2. 58.
  • 'లేని ధైర్యం తెచ్చుకొని' వంటి పలుకుబడుల వంటిది.

కల్ల గుల్ల

  • తిట్టు.
  • ఒంటి. శత. 17.

కల్లనిజములు

  • సత్యాసత్యములు.
  • "వేగిరించక నీవ భావించుకొనుము, కల్లనిజములు క్రమమున గానవచ్చు." కళా. 3. 195.

కల్ల పెనుపులు పెనచు

  • దొంగ లెక్కలు వేసి అప్పు మొత్తమును అధికము చేయు.
  • "పెట్టవచ్చిన కల్ల పెనుపులు పెనచి." గౌ. హరి. ద్వితీ. పంక్తి.481.

కల్లబొల్లి కబురులు

  • మాయమాటలు.

కల్లబొల్లిమాటలు

  • మాయమాటలు.

కల్ల లు పెనచు

  • అబద్ధాలు సృష్టించు.
  • "కైలాటములు జేసి కల్లలు బెనచి." ద్విప. కల్యా. 129. కల్ల_____కల్లు 426 కల్లు_____కల్వ

కల్ల వచ్చు

  • కీడు కలుగు.
  • "...ఘనుల, గదిసినప్పుడ మీకు గల్ల వచ్చు." 3. 161.

కల్ల వాపు

  • నొప్పి గాని, కుఱుపు గాని లేక కనిపించే వాపు. అలా వచ్చినవాపు దానంతటదే తగ్గిపోతూ ఉంటుంది.

కల్ల సేయు

  • మోసము చేయు.
  • "మాయకా డేతెంచి మనలను గల్ల, సేయుచున్నా డెర సేయక వీని, దెగటార్పు." గౌర. హరి. ప్ర. 1853-55.

కల్లాకపటములు లేని

  • అమాయక మైన, నిర్మలమైన.
  • "వా డేమాత్రం కల్లాకపటం లేని వాడు." వా.

కల్లుపాక

  • కల్లంగడి.

కల్లుపూసిన యద్దమువలె

  • మసక మసకగా.
  • "చందనంబు గలయ సఖి బల్మి పూసిన, పొలతి వదనలీల పొలిచె దెరలు, వుచ్చి బెరయ గల్లు పూసినయద్దంబు, భంగివోలె నిజవిభాతి దఱకి." కుమా. 9. 64.

కల్లుపెంట

  • కల్లంగడి.

కల్లువడు

  • శిలాకృతి తాల్చు, నిశ్చేష్టుడగు.
  • "బసుమంబు సల్ల గుండె జల్లు మని కల్లువడి..." మను. 5. 19.

కల్పతరువు కింద గచ్చచెట్టున్నట్లు

  • సత్పురుషుని దగ్గర చెడ్డవారు ఉన్నా రనుటవంటి సందర్భాలలో ఉపయోగించే పలుకుబడి. వేమన. 57.

కల్పవృక్షము

  • అన్ని కోరికలను తీర్చువాడు. కల్పవృక్షము వంటివా డనుటకు కల్పవృక్షము అని వ్యవహారం.
  • "సంసార మర్థార్థిజనమనస్సంతాప, కార్పణ్యము లడంప గల్పశాఖి." శుక. 1. 366.
  • వీని పర్యాయపదాలను కూడా ఈ అర్థంలో ప్రయోగిస్తారు. కల్పతరువు, కల్పలత, కల్పశాఖి ఇత్యాదులు.
  • చూ. చింతామణి, కామధేనువు.

కల్వడగలు

  • వీరధ్వజములు.
  • "సితలోచనద్యుతుల్ సెదరి దిక్కుల యందు, బొలయుకల్వడగల పొలుపు గాగ." కుమా. 12. 205. కవ_____కవ 427కవి_____కశ్శ

కవకవ నవ్వు

  • కిలకిల నవ్వు.
  • ధ్వన్యనుకరణము.
  • క్రీడా. పు. 69.
  • "కవకవ నవ్వరే త్రిదశకాంతులు వింతలు సేయు నా పనిన్." ఉ. హరి. 1. 80.
  • చూ. కహకహ నవ్వు.

కవ గూడు

  • జత గూడు, సంగమించు.
  • "ఎడ లేక కవ గూడి యే ప్రొద్దు రతి సల్పు." హంస. 3. 205.

కవగూర్చు

  • జత చేయు.
  • "విధి దిట్టు నినుం గవ గూర్ప లేమికిన్." శ్రీరాధా. 3. 147.

కవడు వాయు

  • బాధానివర్తి యగు.
  • "ఇవల శ్రీ వెంకటేశు డింతలో దిక్కయి కాచె, కవడు వాసె జీవుడు కన్నవారిచేతను." తాళ్ల. సం. 8. 64.

కవలుకొను

  • తప్పిపోవు.
  • వేదపఠనంలో పొర బాట్లు వచ్చు.
  • "కమలజుని వేదపఠనంబు కవలు కొన్యె." విక్ర. 4. 51.

కవలువోవు

  • తప్పిపోవు.
  • "పాఠ మొనరించుతఱి దోడుపడు గురునకు, గవలు వోకుండ బుత్రు డో కలువకంటి." పాండు. 2. 19.
  • చూ. కవలుకొను.

కవిలసంచి

  • పాతపుస్తకాల కట్ట లుంచుకొనే సంచి; తూకంరాళ్లు వగైరా లుంచుకునే సంచి.
  • చూ. కయిలకట్ట.

కవిలెకట్ట

  • పాత కాగితాలకట్ట; జాబితా.

కవిలె కెక్కు

  • జాబితాలోనికి చేరు. (వారి) శ్రేణిలో చేరు.
  • "ఖ్యాతిగా బ్రమథుల కవిలియ కెక్కెబో తనూజుం డని పొంగుచు." పండితా. ప్రథ. పురా. పుట. 471.
  • రూ. కవిలియ కెక్కు.

కవిలె పట్టు

  • లెక్కలు అవీ వ్రాసిన పాత కాగితాల కట్ట.
  • "అని పల్కి చిత్రగుప్తుం, డనుపమముగ గవిలెపట్టుటాకులు గేలం, గొని..." సానం. 2. 59.

కవుగిట నోలలార్చు

  • కౌగిట దేల్చు.
  • "చెక్కిలి నొక్కి చుంబనము చేసి కవుంగిట నోలలార్చి." కళా. 7. 162.

కవుకున

  • తటాలున.
  • ధ్వన్యనుకరణము.
  • "అనుచు గవుకున బట్టరా దరయ వలయు." శుక. 2. 249.

కశ్శన్నగాళ్లు

  • ఊరూ పేరూ లేనివారు. సంస్కృతంలో య: కశ్చన కశ్చీ_____కష్ట 428 కష్ట_____కస
  • అంటే ఫలానా అని కూడా చెప్పడానికి వీలుపడని యెవడో ఒకడు అని అర్థం. అదే వైదికుల మాటలలో కశ్శనగాళ్లుగా మారింది.

కశ్చిత్కాంతాకాచిత్కాంతా అను

  • మాట పూర్తి కాక ముందే అనవసరంగా వాదానికి దిగు
  • మేఘదూతంలోని మొదటి శ్లోకం 'కశ్చిత్కాంతా' అని గురువు ఆరంభించగానే శిష్యుడు 'కశ్చిత్కాంతా ఎలా అవుతుంది. కా చిత్కాంతా కావాలి గదా' అన్నా డన్న కథపై యేర్పడినది. కశ్చిత్ అన్నది కాంతా అన్న దానికి విశేషణం కాదు అన్నసంగతి ఒక పాదం పూర్తి వింటే చాలు. తెలిసి పోయేదే. ఆ ఓపిక కూడా లేక వాదానికి దిగా డన్నది కథ.
  • "నేను చెప్పేది పూర్తిగా వినవయ్యా స్వామీ! కశ్చిత్కాంతా కాచిత్కాంతా అని ప్రారంభంలోనే తగులుకొంటే యెలా?" వా.

కష్టపడు

  • శ్రమించు, బాధపడు.
  • "వైరులచే నేను గష్టపడితి." భార. భీష్మ. 3. 137.

కష్టపాటు

  • చెఱుపు, బాధ.
  • "వజ్రనాభు, డపుడు చేసిన కష్టపాటబ్జనాభ, యిపుడు తలపున బాఱిన హృదయమునకు, నధికతర మైనపరితాప మావహిల్లు." ప్రభా. 1. 73.
  • చూ. కష్టపుపాటు.

కష్టపుచావు

  • దుర్మరణము.
  • "కౌరవవంశజాతుడవు గష్టపు జచ్చుట దెచ్చుకొంటి నీ,పేరును బెంపు మాలి." భార. శల్య. 2. 55.

కష్టపుపాటు

  • "కౌరవకోటిచేత మన కష్టపు బాటు దలంపు వచ్చినన్." భార. ఉద్యో. 4. 90.
  • చూ. కష్టపాటు.

కష్టముపాటు

  • "ఎంతయు గష్టముపాటు వచ్చిన." భార. ఉద్యో. 2. 129.
  • చూ. కష్టపాటు.

కసకోల

  • చెలకోల, ఎద్దులను తోలు కొరడా వంటిది.
  • "పృథుజవాశ్వములు వేదములు, పగ్గములు చతుస్స్వరములు, ప్రణవంబు గసగోల, బ్రహ్మ సూతుడు..." కుమా. 2. 25.

కసపిస

  • ధ్వన్యనుకరణము.
  • "కసపిస నమలు." వా.

కస బెస (నూఱి)

  • ధ్వన్యనుకరణము. కస_____కస 429 కస_____కసి
  • కలియునట్లుగా. నవ. 5.
  • చూ. కసపిస.

కసమస

  • తొందర, తొట్రుపాటు.

కసరికొట్టు

  • కసరుకొను; చీదరించుకొను.
  • "కసరికొట్ట నొకింత విసువ డయ్యె." పాణి. 3. 32.

కసరుకాయ

  • పచ్చికాయ.
  • "రస రసా న్నములను మెసవెడువాడు, కసరుగాయల బ్రొద్దు గడపుచున్నాడు." రంగ. రామా. అయో.137.

కసరుకొను

  • చూ. కసరికొట్టు.

కసరు చూపు

  • కోపించు.
  • "పసుల గోడలు నాన్పి వసుధ పై గూల్పని, ముసురు వానలమీద గసరు జూపు." శుక. 2. 505.

కసరెత్తు

  • విజృంభించు, ఉప్పొంగు.
  • "మబ్బున గసరెత్తి యుబ్బి యంతం తకు." కా. మా. 4. 50.

కసవు కట్టెలు నీళ్లు మోయించు

  • నానాచాకిరీ చేయించు.
  • "నీల శైలాబ్జములు మ్రోల నిలిచినపుడె, కసపు కట్టెలు నీళ్లును గడగి మోయ జేసె నే మనవచ్చు." హంస. 2. 186.
  • శ్లేషలో ఈ భావము స్ఫురించుటే కవి ఉద్దేశము.
  • "కులగోత్రములవారి నిలిపి కట్టెలు నీళ్లు, మోయించుచుండెడు ములుచదనము." హంస. 2. 236.

కసపు గుట్ర

  • చెత్తా చెదారం. జం.
  • "....పసిండినాగటం గసపు గట్రం జిక్కకుండం బెక్కుచాళ్లు దున్ని ములకవిత్తులు వెదపెట్టువిధంబున." బసవ. 7. 334

కసపు గఱచు

  • గడ్డి గఱచు.
  • చూ. పూరి గఱచు; గడ్డి కఱచు.

కసవు నూకు

  • కసవు తుడుచు, ఊడ్చు. రాయలసీమలో నేటికీ వాడుకలో ఉన్నపలుకుబడి.
  • "శ్వసనుండు నట మున్న కసవులు నూక." పండితా. పర్వ. ద్వితీ. పు. 464.
  • "ఇల్లు కసవు నూకవే ఇం కైనా. పొద్దెక్కి పోయింది." వా.

కసికాటు

  • 1. అపరిణతానుభవము. పరిపూర్తిగా అనుభవించనిది. పై పై కాటు అని వాచ్యార్థము. దీనికి వ్యతిరేక మయినదే నమిలి మ్రింగుట.
  • "మోసపోయితి గసికాటు ముచ్చటలనె..." ప్రబంధ. 7. 50. పాండు. 3. 72. కసి____కసి 430 కసి____కసు
  • 2. దంతక్షతము.
  • "కామిని నీదుమోవి కసు గాటుల చెక్కుల గోటినొక్కులన్." సురా. 128.

కసిగాటుగా

  • కొద్దిగా.
  • "అగ్గ,లం బయినచింత వలసి యొల్లమి నతండు, సొగటులను బోయి కసిగాటులుగ భుజించి." విజయ. 3. 4.
  • "కొంత గొంత కసిగాటులుగా భుజియించి." శృం. శాకుం. 2. 167.

కసిగాటులు సేయు

  • చిఱుకొఱుకులు కొఱుకు.
  • "తేనియల్, చిలికెడు మోవి పల్మొనలచే గసిగాటులు సేసి వీనులన్..." రాజగో. 4. 25.

కసిడికోత

  • పోరు; ఱంపపుకోత. పోరి పోరి బాధ పెట్టుట అని భావార్థము.
  • "కసిడికోతకు నోర్చిలో విసిగికొనక ధాత దూరక తండ్రిసేతకు వగవక." పాండు. 4. 145.
  • "కసిండికోత వలదా మీకున్ విచారింపగన్." వరా. 5. 93.
  • "అటువంటి మగనితోడ, గాపురము సేయు సతి దొడ్డగరిత యగుచు, గసిడి కోతల నోర్చి." పాండు. 4. 157.
  • చూ. కసినికోతలు.

కసిదీఱ

  • 1. ఆశ తీరా; మనసార. భావతిరేకము తీరునట్లుగా.
  • "వా,తెఱమొన పంటికొద్ది కసిదీఱ జుఱుక్కున నొక్కినొక్కి యీ, కరణి బరస్పరంబు..." హంస. 2. 52.
  • 2. పగ తీరా.
  • "కసి తీరా చెంపమీద తీసికొట్టాడు." వా.

కసినికోతలు

  • ఇంటిలోవారి పోరు.
  • "ఇంటివారల కసినికో తెల్ల నుడివి." శుక. 3. 297.

ఛూ. కసిడికోత. కసిబిసి యగు

  • నలిగిపోవు.
  • ధ్వన్యనుకరణము.
  • "ముసలంబుల మోదులన్ గసిబిసి యగువారును." భాస్క. రామా. యుద్ధ. 14. 32.

కసివోని వలపు

  • తనివి తీరనివలపు. కామపరమావధి ఇక్కడి కసి.
  • "ఎంతయు గసివోని వలపు హెచ్చిన కతనన్." శుక. 1. 301.

కసుకందకుండు

  • వాడకుండు.
  • "పార్వతీ చరణ పుష్కరము ల్గఠి నాశ్మఘట్టనం,బున గసుగందకుండ..." కా. మా. 1. 99.
  • చూ. కసుగాయ.

కసుగంద నిచ్చు

  • కందునట్లు చేయు.
  • "సతి నిట్లు....కసుగంద నీక." రాధి. 1. 62. కసు____కస్తి 431 కస్తి____కళ

కసుగందు

  • 1. పసిపాప.
  • "కావు కా వంచు నేర్పుల్ దలిర్పన్ గసుంగంద వై." పారి. 3. 38.
  • "ఈ కసుగందును కట్టుకొని నే నేం చేయగలను?" వా.
  • 2. క్రియగా వాడిపోవు అనే అర్థంలో ఇది ప్రయుక్త మై కనబడుతుంది.
  • "కసుగందినబాహులతతో." ఉత్త. 4. 221.

కసుగందులు కందు

  • బాగా వాడిపోవు.
  • "కసుగందులు గందిననవ, కుసుమలతిక వోలె మిగుల గోమలి యొప్పెన్." కళా. 4. 106.

కసుగాయ

  • పచ్చి కాయ.

కసుమాలము దేవు

  • కశ్మలమును చేతులతో తీసివేయు.
  • "దేవా! యీ కసుమాలము, దేవెడు కేల్దోయి నీదుదేహం బంటన్..." కా. మా. 3. 97.

కసురుకొను

  • కోపించు.
  • "వాడి దగ్గిరికి పోతే అనవసరంగా కసురుకొంటాడు." వా.

కసువు గట్రా

  • గడ్డీగాదము. జం.
  • బస. 3.65.

కస్తిపడు

  • ఇబ్బందిపడు.
  • "మానసికవ్యథల్ రుజలు మాన్పగ నోపినపుణ్యరాశి గం, గానది జేరి యుండియును గస్తిపడం దగు నయ్య." ఉత్త. రామా. 6. 251.

కస్తి పెట్టు

  • కస్తీ పెట్టు, నిర్బంధించు.
  • "చిత్తంబు వ,చ్చినచో మానుదు గాని ని న్నిపుడు కస్తిం బెట్ట నా కేటికిన్." కా. మా. 3. 72.
  • "రూకలకు నిండా కస్తీ పెడుతున్నాడు. అంత కస్తీ చేస్తే ఎట్టా?" వా.

కస్తీ చేయు

  • డబ్బు మొదలయిన వాని కోసమై నిర్బంధించు.
  • "ఈ నెల లోనే బాకీ ఫైసలు చేయమని వాడు చాలా కస్తీ చేస్తున్నాడు." వా.

కస్తీపఱుచు

  • నిర్బంధించు.
  • "కామమోహిత యగునింతి గస్తి పఱుప, ననుజు బురికొల్పి తిది నీకు జనునె రామ!" శృం. నైష. 8. 130.
  • దీనికి దు:ఖపెట్టు అని వావిళ్లలో చూపిన అర్థం సరికాదు.
  • చూ. కస్తీ చేయు.

కహకహ నవ్వు

  • ధ్వన్యనుకరణము.
  • "కహ కహ నవ్వి దంష్ట్రికల గల్ల మెఱుంగులు భానుదీప్తిసం, గ్రహము దిరస్కరింప..." కాశీ. 7. 29.

కళపట్టు

  • చూ. కళవట్టు. కళ_____కళ 432 కళ_____కళ్ల

కళపెళ

  • ధ్వన్యనుకరణము.
  • "కళపెళ నుడుకు చక్కని గూనియలు." నీలా. 3. 161.
  • "అన్నం కళపెళా ఉదుకుతున్నది." వా.

కళ లంటు

  • కళాస్థానములను తాకు. స్త్రీ శరీరములో కామోద్రేకము కలిగించు స్థలములు కొన్ని కలవని కామ శాస్త్రము. వాని నంటు-అని అర్థం.
  • "ఎలమి గళ లంటి యలరించి యలవరించి." శుక. 1. 299.
  • "కళ లంటి కరచి తన చె. య్వుల జొక్కెడు తపసి మది చివుక్కురు మనగా..." కళా. 3. 52.

కళల గరగించు

  • రతిపారవశ్యము గలిగించు.
  • "కళల గరగించి సంధించి కౌగిలించి." హంస. 3. 102.
  • చూ. కళ లంటు.

కళవట్టు

  • మూర్ఛపడు.
  • "కళవట్టిన భీముడు దెలిసెన్ హరి కరుణ." దశా. 9. 160.

కళవళపడు

  • కలవరము చెందు, కలత చెందు.
  • "ఆత్మలోన గళవళపడుచున్." జైమి. 6. 151.
  • "తెలియ శోధింపక కళవళపడ రా దటంచు నవ్విటుని నేపార బిలిచి." సానం. 5. 14.

కళవళపాటు

  • కలత.
  • "కళవళపాటుతో జెలిమికత్తెల దూఱుచు." నీలా. 3. 14.
  • "ఏం జరిగిం దనిరా? అన్నిటికీ అంత కళవళపా టయితే ఎట్లా?" వా.

కళవళ మగు

  • కలతపడు.
  • "...మునుల మనంబుల్, గళవళ మయ్యెం దదీయగర్వోద్ధతికిన్." నృసిం. 4. 139.

కళ్ల జూచు

  • 1. సంపాదించు. రూపాయల విషయంలోనే ఈ ఛాయ కానవస్తుంది.
  • "నెలకు వెయ్యిదాకా కళ్ల జూస్తున్నాడు." కొత్త. 262.
  • 2. చూచు.
  • "నా కొడుకును ఎప్పుడు కళ్ల జూస్తానో ఏమో?" వా.

కళ్ల తుడుపు మాటలు

  • చూ. కళ్లనీళ్లు తుడుచుమాటలు.

కళ్లనీళ్ల పర్యంత మగు

  • దాదాపు ఏడుపు వచ్చు పరిస్థితి ఏర్పడు.
  • "నే నామాట అనేసరికి వాడికి కళ్లనీళ్ల పర్యంతం అయింది." వా.

కళ్ళప్పగించి

  • దిగాలుపడి, దిగ్భ్రాంతుడై.
  • "ఏమి టలా కళ్ళప్పగించి చూస్తావేం?" వా. కళ్ల_____కళ్లు 433 కళ్లు____కాంతా

కళ్లలో కారం చల్లు

  • మోసగించు.
  • చూ. కళ్లలో దుమ్ము కొట్టు.

కళ్లలో కారం పోసుకొను

  • అసూయపడు. కొత్త. 185.

కళ్లలో దుమ్ము కొట్టు

  • మోసము చేయు.
  • "నా కళ్లలో దుమ్ము కొట్టా లని మాత్రం ఎప్పుడూ ప్రయత్నం చేయవద్దు. నే నలా టోపీ పడేవాణ్ణి కాను." వా.
  • చూ. కళ్లలో కారం చల్లు.

కళ్లు తిరుగు

  • 1. పైత్యోద్రేకముతో తనచుట్టూ ఉన్న వన్నీ తిరుగుతున్నట్లుగా కనిపించు.
  • "పైత్యం చేసిందో యేమో! కళ్లు తిరుగుతున్నాయి." వా.
  • 2. పొగ రెక్కు.
  • "ఏం కళ్ళు తిరుగుతున్నాయా? నోటికొచ్చిణ్ దల్లా అంటున్నావు." వా.

కళ్లు తెఱచు

  • జరుగుతున్న విషయము తెలుసుకొను.
  • "ఇది యెన్నాళ్లనుంచో జరుగుతున్నా వా డిప్పుడే కళ్ళు తెరిచాడు." వా.

కళ్లు దించుక పోవు

  • కను లీడ్చుకొని పోవు.
  • "ఎన్నా ళ్ళయిం దేమిటి అన్నం తిని? కళ్ళు దించుకుపొయ్యా యేం?" వా.

కళ్లు నిప్పులు క్రక్కు

  • కోపోద్దీపితు డగు.
  • "వాడి కళ్లు నిప్పులు కక్కుతున్నాయి." వా.

కళ్లు నెత్తికి వచ్చు

  • పొగ రెక్కు.
  • "వాడికి నాలుగురాళ్లు చేరగానే కళ్లు నెత్తికి వచ్చాయి." వా.

కళ్లు పచ్చలు గ్రమ్ము

  • తల దిరిగిపోవు. కళ్లు తిరుగు.
  • "పొద్దున్నించీ అన్నం తినక పోయేసరికి కళ్ళు పచ్చలు కమ్మినవి." వా.

కళ్లు పొరలు కమ్ము

  • పొగ రెక్కు.
  • "వాడి కీమధ్య కళ్లు పొరలు కమ్మినవి. మనమాట యెందుకు వింటాడు>" వా.

కళ్లు మూసుకొని ఉండు

  • కాసంత ఓపిక పట్టి ఉండు.
  • "ఈ ఒక్క రోజూ కాస్త కళ్లు మూసుకొని ఉండవే. మనఊరు వెళ్లాక నీ యిష్టం వచ్చినంత గోల చేద్దువు గాని." వా.

కళ్లు లేని కబోది

  • గుడ్డివాడు, గుడ్డిది.
  • "కళ్లు లేని కబోదిని తల్లీ! కాస్త కబళం వేయండి." వా.

కాంక్ష చను

  • కోరిక తీరు; ఆశ తీరు.
  • "కావ్యములు పెక్కు సెప్పియు గాంక్ష సనక." భీమ. 1. 17.

కాంతాళ పడు

  • 1. బెంగపడు.
  • "తాళవృంతానిలోత్తాల వేదన కోడి తాళక మిగుల గాంతాళపడుచు." చంద్రా. 4. 275. కాందా____కాక: 434 కాక____కాక
  • 2. కోపపడు.
  • "పిల్లలమీద అంత కాంతాళపడితే ఎలా?" వా.

కాందారి మాందారి ప్రొద్దు

  • అర్ధ రాత్రి. కానిదారి మానిదారి ప్రొద్దు అనుటపై యేర్పడినది. అంటే దారి తెలియని వేళ, చెట్టేదో గుట్టేదో కూడా తెలియని చీకటిసమయం అని అర్థం.
  • "వూని కాందారి మాందారి ప్రొద్దు కడను, నెందు వోయెదు తలిదండ్రు లెవ్వ రనిన." యయా. 2.
  • చూ. కాదారి మాదారి ప్రొద్దు.

కాందారి మాందారి వేళ

  • అర్ధ రాత్రి.
  • "శివశివా కాశీపతీ యంచు...కాందారి మాందారి వేళను ధన్యు ల్విహరింతురు." మల్లవై. 85.
  • చూ. కాందారి మాందారి ప్రొద్దు.

కాక: కాక: పిక: పిక:

  • సమయం వచ్చినప్పుడు దేని నిజరూపు దానిదే అను పట్ల ఉపయోగించే పలుకుబడి.
  • 'వసంత కాలే సంప్రాప్తే కాక: కాక: పిక: పిక:' అను శ్లోకభాగంలోని భావము.
  • కాకీ, కోయిలా చూడ్డానికి నల్లగా ఒక విధంగానే ఉన్నా వసంతం రాగానే కోయిల కూస్తుంది. కాకి అరుస్తుంది. అప్పుడు అవి ఏ జాతికి చెందినవో స్పష్టంగా తెలిసిపోవును అని అర్థం.
  • "ఆ కామిని యటు నే నిటు, కాక: కాక: పిక: పిక: యటన్నవిధం బై ...కన బాయగ వలసె...." రాధా. 2. 20.

కాకతాళీయముగా

  • ఆనుషంగికముగా, యాదృచ్ఛిక సంఘటనగా.
  • కాకి తాటిచెట్టుమీద కూర్చోవడం, తాటిపండు కింద రాలడం ఒకేసారి జరిగినా - కాకి కూర్చున్నందువల్ల తాటిపండు పడ లేదు. అది కేవలం ఆనుషంగికం అనుటపై వచ్చిన పలుకుబడి.
  • "నేను పనిమీద ఆ ఊరు వెళ్లాను. అతనెక్కడికో పోతూ కాకతాళీయంగా తటస్థపడ్డాడు." వా.

కాకదంతపరీక్ష

  • పనికిరాని పరిశీలన.
  • 'కాకస్య కతివా దంతా: మేష స్యాండం కియత్ పలం' అన్న చాటువుపై ఏర్పడినది. కాకికి ఎన్నిపం డ్లున్నవి? మొదలయినవి అనవసర ప్రశ్నలు గదా.
  • "వాని నే మడిగె దెవ్వడు గాక నీ కేమి, యిది కాకదంతపరీక్ష సుమ్ము." కళా. 3. 272. కాక____కాక 435 కాక____కాక

కాకదేఱు

  • తప్త మగు; ఆరితేరు.
  • "నిగ మఘోటలలాట నేత్రానలజ్వాల గాక దేఱిన కాముకాండములును." కవిరా. 3. 110.

కాకపక్షం

  • పిల్ల జుట్టు.

కాకపడు

  • కోపపడు.
  • "ఎందు కయ్యా! అంత కాక పడుతున్నావ్?" క్రొత్త. 25.

కాకమ్మ కథ

  • పిట్టకథ. ప్రామాణిక మైనది కా దనుట.
  • "ఈ కాకమ్మ కథల కేమి లే, గట్టి నిదర్శన మేదైనా ఉంటే చెప్పు." వా.

కాకమ్మ గువ్వమ్మ కథలు

  • పిట్టకథలు. వాస్తవిక మయినవి కావు అన్న భావం ఇందులో ఇమిడి ఉంది.
  • "ఈ కాకమ్మ గువ్వమ్మకథల కేమిలే." వా.

కాకరకాయరీతిగా గగుర్పొడుచు

  • ముళ్లుముళ్లు రేగి ఒడ లంతా గగుర్పాటు కలుగు. కాకరకాయపై ముడులు తేలినందుపై వచ్చిన పలుకుబడి.
  • "ఓ రసికశిఖావతంస! యదురత్నమ! కాకర కాయ రీతిగా, గిసలయపాణి చన్నుగవక్రేవ గగుర్పొడిచెం బొరిం బొరిన్." ప్రభా. 4. 75.

కాకరపువ్వువత్తి

  • ఒక విధమైన బాణసంచా.
  • చూ. కాకరవత్తి.

కాకరవత్తి

  • బాణసంచాలో ఒకవిధం.
  • "పిల్లలకు కాకర వత్తులు తెస్తే పోతుంది. పెద్ద వైతే ప్రమాదం." వా.

కాకరిచేతలు

  • చిల్లర చేష్టలు.
  • "ఈ కాకరిచేతలకు లోకము వారు నగరా!" తాళ్ల. సం. 12. 341.

కాకఱపులు

  • 1. కారుకూతలు, వ్యర్థప్రలాపాలు.
  • "లేకులు లోకుల కాకఱపులకు, చాకిచాకని యేల సందడించెదవు." బస. 4. 89.
  • 2. వట్టి బెదిరింపులు.
  • "ఈ కాకఱపులకు భయపడి పారిపోయేవా రెవరూ లేరు." వా.

కాకలు పుట్టు

  • ద్వేష మేర్పడు; కోప తాపాలు పొడము.
  • "అతుల....కాకలు పుట్టు బిదప." విజయ. 1. 44.

కాక వడు

  • తప్త మగు. కాకి____కాకి 436 కాకి____కాకి
  • "కర్బు రేక్షణ వహ్నికణములచేత, గకుబంతములు పెక్కు కాక వడగ." గంధ. 20.

కాకి ఎంగిలి

  • పై పై ఎంగిలి. పిల్లలు వాడే మాట. ఎవరైనా తింటున్న దడిగితే కాకెంగిలి చేశామంటూ బట్టపైన వేసి కొఱికి ఇస్తారు. అది ఎంగిలికింద లెక్క కాదు.
  • "కాకెంగిలి చేసి ఇవ్వరా కాస్త." వా.
  • చూ. చిలుకకొట్టుడు.

కాకికి మెతుకు విదిలించని

  • అతిలోభి అయిన.
  • "వాడు కాకికి మెతుకు విదిలించనిరకం. వానిదగ్గరికి పోతే విరాళం ఇస్తాడా?" వా.

కాకికూడు

  • పిండం.
  • కాకులకు కర్మలలో, తద్దినాలలో పిండాలను వేస్తారు. అందుపై వచ్చినది.
  • "ఈ కాకికూ డెవరి క్కావాల్లే? నేనే అడుక్కు నైనా తింటా కాని నీవు విదిలించి వేసిన మెతుకుల కాశిస్తానా?" వా.

కాకిగోల

  • విపరీత మైన గోల.
  • కాకులు పది చేరితే విపరీతంగా గోల చేస్తాయి. అందుపై యేర్పడినది.
  • "కాసేపు శాంతంగా చదువుకుందాం అంటే యిదేమిట్రా యీ కాకిగోల?" వా.

కాకిచావు

  • నీచపుచావు; దిక్కులేని చావు.
  • "అన్నాళ్లు అంతగా బతికి కడకు వాడు కాకిచావు చచ్చాడు." వా.

కాకిచిప్ప

  • శంబూక. నీటిగుల్ల. యయా. 3. 29.

కాకిచెఱకు

  • ఒక రకమైన గడ్డి.

కాకితీపు

  • ఒక విధమైన మూర్ఛరోగం. శ. ర.
  • చూ. కాకిసొమ్మ.

కాకితెలుపు

  • అసంభవము.
  • 'తెల్లని కాకులును లేవు' అన్న ప్రథపై యేర్పడినది. రాధి. 4. 79.

కాకిదొండ

  • ఒక రకమైన దొండ.

కాకినలుపు.

  • కారునలుపు.
  • "ఆ పిల్ల వట్టి కాకి నలుపు. దాని నెవరు చేసుకుంటారు?" వా.

కాకి పగ

  • తీరని పగ. కాకి పగపడితే ఒక సారైనా కాకి____కాకి 437 కాకి____కాకి
  • కాళ్ళతో తన్నిపోతుం దన్న ప్రతీతిపై ఏర్పడినది.
  • "వాడిది ఒట్టి కాకిపగ. కాటికి పోయినా వదలడు." వా.

కాకిపెసర

  • ఒక రకమైన పెసర. దీనినే పిల్ల పెసర అంటారు.

కాకిబంగారం

  • పసుపుపచ్చని అభ్రకం.
  • "బంగారం కాకపోతే కాకిబంగారం వేసుకోవచ్చు లేవోయ్ బావా!" వా.

కాకిబేగడ

  • అభ్రకం.
  • "నెల్లూరుజిల్లాలో కాకిబేగడ చాలా దొరుకుతుంది." వా.
  • "వేషాల కిరీటాలకు కాస్త కాకిబేగడ అంటిస్తే దీపాల వెలుగులో ధగ ధగ లాడుతాయి." వా.

కాకిబ్రతుకు

  • నీచపు బ్రతుకు.
  • కాకి, యెంగిలి తిని బతుకుతుం దనుటపై వచ్చిన పలుకుబడి.
  • "వాడిది వట్టి కాకి బ్రతుకు. అలా బతకడంకంటే చావడం మేలు కదా." వా.

కాకిముక్కుకు దొండపండు

  • అననురూప మైనది.
  • "ఆ పిల్లను ఆ ముసలాడి కివ్వడం కాకి ముక్కుకు దొండపండును కట్టినట్టు." వా.
  • చూ. కాకిముక్కు పగడం.

కాకిముక్కు పగడం

  • అననురూప మైనది.
  • కాకి ముక్కు నల్లగా ఉండడం, పగడం ఎఱ్ఱగా ఉండడంపై వచ్చినపలుకుబడి.
  • "అంత అంద మైనపిల్లను ఆ అనాకారి వెధవకు ఇచ్చారు. అది కాకిముక్కు పగడం అయిపోయింది." వా.
  • చూ. కాకిముక్కుకు దొండ పండు.

కాకి ముట్టిన కుండ

  • చెడిపోయినది; మైల పడినది.
  • "ఆ పిల్ల ఏదో యెప్పుడో చేసిం దని వాళ్లంతా ఆవిడని కాకి ముట్టిన కుండ లాగా చూస్తున్నారు." వా.

కాకిమూక

  • అల్లరిమూక.
  • "వాళ్ళ దంతా వట్టి కాకిమూక. వాళ్ళల్లో పడితే అయినట్టే." వా.

కాకివ్రాతల వలె

  • కోడిగీతలవలె కలగాపుల గంగా అటూ ఇటూ గీసిన అర్థరహిత మైన గీతలవలె.
  • "తిలకంబు నిడుబొట్టు దిరుమన్ను భూతి వలదె వారికి గాకివ్రాతలపగిది." పండితా. ప్రథ. వాద. పుట. 645.

కాకిసంగీతం

  • కర్ణకఠోర మైన అరపు. ఇది కాకిగోలవంటి మాట.
  • "ఆ, వాడి దేం సంగీతం, కాకి సంగీతం." వా.
  • చూ. కాకిగోల.

కాకిసొమ్మ

  • మూర్ఛరోగం.
  • చూ. కాకిసోమాలు. కాకి____కాకు 438 కాకు____కాకు

కాకిసోమాలు

  • మూర్ఛరోగం.
  • "ఆ పిల్లకు కాకిసోమాలు ఉందిట. ఎలా చేసుకుంటాం." వా.
  • చూ. కాకి సొమ్మ.

....కాకుండా చేయు

  • సరిపడకుండ చేయు.
  • "ఆ పిల్ల వచ్చి మాకూ వాడికీ కాకుండా చేసింది." వా.

.....కాకుండా పోవు

  • సరిపడక పోవు; ద్వేష మేర్పడు.
  • "ఆ వ్యాజ్యం వచ్చినప్పటినుంచీ వాళ్లకూ మాకూ కాకుండా పోయింది." వా.
  • "ఈ పిల్లను చేసుకున్న నాటినుంచీ మా మేనమామకూ మాకూ కాకుండా పోయింది." వా.

కాకు చేయు

  • చూ. కాకు సేయు.

కాకులకు గాని ముసిడి పండిన నేమి, యెండిన నేమి?

  • పనికి రానిది ఏమయితే నేమి? ముష్టి పండు విషం. ఏ పక్షులు తినుటకూ పనికిరాదు.
  • "లండు బోతవు కాకులకు గాని ముసిడి, పండిన నెండిన ఫల మేమి రోరి!" సారం. 1. 649.

కాకులతెఱగున చను

  • చెల్లాచెదరుగా పాఱిపోవు. ఉష్ అంటే కాకులు దిక్కు కొకటి పారిపోతాయి.
  • "అడవుల పాలై, కాకులతెఱగున జని రేకాకు లగును." కా. మా. 4. 104.

కాకులను కొట్టి గద్దలకు వేయు

  • ఒకరిని పీడించి మరొకరికి సాయపడు.
  • "వారి భూమి తీసి వీరికి పంచిపెడితే ఏం చేసినట్టు? కాకులను గొట్టి గద్దలకు వేయడమే గా?" వా.

కాకులబడి

  • గందరగోళము. కాకులను బడిలాగా చేరిస్తే ఒకే గోలగా ఉంటుంది కదా.
  • "అదంతా కాకులబడిగా ఉంది." వా.
  • చూ. కాకిగోల.

కాకులు దూరని కారడవి

  • కీకారణ్యము.
  • కాకులు దూరని కారడవీ, చీమలు దూరని చిట్టడవీ అంటూ జానపదకథల్లో విపరీతంగా వినవస్తుంది.
  • "ఆ రాజకుమారిని కాకులుదూరని కారడవిలో వదిలేశారు." వా.

కాకులు పొడిచినట్లు '*మనిషి కొకమాట అని వేధించుపట్ల అంటారు.

  • "ఆ పిల్ల అమ్మ గారింటినుంచీ ఏమీ తేలే దని అత్తారింటివా రంతా కాకులు పొడిచినట్లు పొడిచారట." వా.

కాకు సేయు

  • 1. చీకాకు పఱుచు. కాకు_____కాగ 439 కాగి_____కాజే
  • "కాదంబనికురుంబకలిత యై ప్రవహించు, కాళింది గర్వంబు గాకు సేసి." మను. 3. 19.
  • 2. బాధించు.
  • "కగ్గు లేనివారి నేల కాకుసేసె నిపుడు." తాళ్ల. సం. 3. 110.
  • 3. వ్యర్థపుచ్చు.
  • "ఆతడు జమునిలావు, జేవయును బొల్లుగా గాకుజేసి విడిచె." హరి. పూ. 4. 155.
  • "ఒక టిచ్చి వేఱొకటి గోరినయట్టి కానీనుగర్వంబు గాకు చేసి." చంద్రాం. 1. 21.
  • 4. అవమానించు.
  • "కలికి పై బడి తద్ద గరగించు నిన్ను, గాకున్న నెన్నైన గల్లలు గూర్చి, కాకు సేయును రాజుగారితో జెప్పి." ద్వి. తి. సా.
  • 5. మాట తీసివేయు, తిరస్కరించు.
  • "నిను వేడుకార్యము గాకు చేయక చేయుమీ." మైరా. 1. 72.
  • "గంధర్వసౌఖ్యంబు కాకు సేయడు గదా." రుక్మా. 5. 55.
  • చూ. కాకుచేయు.

కాగలకార్యము గంధర్వులు తీర్తురు

  • మనం చేయవలసిన పని దానంత టదే మరొకరితో నెఱవేరుతుంది.
  • భారతంలో గంధర్వులు దుర్యోధనుని బంధించినప్పుడు పాండవమధ్యము లను మాటపై వచ్చినది.
  • "వానిసంగ తేదో ఆ రెడ్డిగారే చూచేట్టున్నారు. మన మేం చేయ నక్కర లేదు. కాగలపని గంధర్వులే తీరుస్తారు." వా.

కాగి చల్లారిన పాలభంగి

  • శాంతపడినట్లు; పొంగు చాల్లారిన-అనుట.
  • "నందను డొప్పుగ గ్రాగి చల్ల నా,రి వెలయు పాలభంగి నొకరీతిని వచ్చెడు దన్క." పాణి. 4. 104.

కాచి పోయు

  • వంట చేసి పెట్టు. ముఖ్యంగా గంజి కాచి పోయుటపై యేర్పడిన పలుకుబడి./
  • "ఎంత ముసలివా డైనా కాచి పోసే దిక్కు లేక మళ్లీపెళ్లి చేసుకుంటూ నంటున్నాడు." వా.
  • "ఎంతుంటే నేం? వేళ కింత కాచిపోసేదిక్కు లేక అతను నానాబాధా పడుతున్నాడు." వా.

కాచి విడుచు

  • చంపక వదలిపెట్టు.
  • "దయ గాచి విడిచె." విజయ. 1. 58.

కా చేసుకొను

  • ముగించు. కాశీయా. 272.
  • "ఆపని కాస్తా కాచేసుకొని గానీ నేను ఊరికి వెళ్ల దలచుకో లేదు." వా.

కాజేయు

  • 1. ముగించు.
  • "వారి, కింత విష మిడి కా జేసి యెల్ల వేళ." దేవీ. 11. 114. కాట_____కాటి 440 కాటి_____కాటు
  • 2. అపహరించు.
  • "వదినగారి ఆస్తి కాస్తా వీడు కాజేశాడు." వా.
  • 3. కలిగించు.
  • "ఎక్కి తలంచిన నీ రూప మైన, గ్రక్కున నప్పుడు కాజేయుగిరులు." బస. 3. ఆ.

కాట గలియు

  • నశించు.
  • కాడు = స్మశానము; అడవి.
  • "కటకటా! యెట్లు తన బుద్ధి కాట గలియ, నిసువు జంపంగ నెంచెనో నీ మగండు." హరవి. 2.99.

కాటాకట్టు

  • తూనికకు అమర్చు. కొత్త. 13.

కాటికాపలా

  • వ్యర్థము.
  • "పంటంతా పశువులు మేసిపోయాయి. ఈ కాటికాపలా యెందు కని వచ్చేశాను." వా.
  • చూ. శవజాగారం.

కాటికి కాళ్లు చాచు

  • మరణమునకు సిద్ధముగా నుండు.
  • "కటకటా! కాటికి గాళ్లు సాచియును విటతనంబులజాడ విడువ డీశుడును." గౌర. హరి. ద్వి. 1056, 1057.

కాటికి కాళ్లు చాచుకొని యుండు

  • చావ సిద్ధముగా నుండు; ముదుసలి యగు.
  • "నే నింకేం చేస్తాను నాయనా! కాటికి కాళ్లు చాచుకొని ఉన్నాను." వా.

కాటిపాపడు

  • గొల్లవాడు. శైవులలో జంగాలవంటి వారు భిక్షాటనం చేస్తుంటారు. గొఱగొయ్యల లాగే కాటి పాప లనీ ఉన్నారు." బస. 4. ఆ.

కాటుకకన్నులు

  • నల్ల కన్నులు.
  • "ఆ యెఱ్ఱటి పిల్లకు కాటుక కన్ను లెంతో అందంగా ఉంటాయి." వా.
  • "కాటుక కండ్లవాణ్ణి నమ్మకూడ దంటారు పెద్దలు." వా.

కాటుక తీర్చు

  • కాటుక పెట్టు.
  • "కడలరేఖ లమర్చి కాటుక తీర్చె వా, ల్గన్నుల కొకవింత కాంతి మెఱయ." శుక. 1. 226. పాండు. 3. 74.

కాటుక పట్టు

  • నల్ల బడు.
  • "బహుళజలప్లవమాన, ద్రుహిణాం డము చెమ్మ యుఱికి రూక్షార్కనిభా, రహితత గాటుక పట్టెను, రహి చెడియన నంధతమసరాసులు బెర సెన్." మను. 3. 28.

కాటుక పేటు లెత్తు

  • కాటుక యెండి పెట్లిపోవు.
  • "తొలచిన యట్లు వోయెడు గనుం గవ కాటుక బేటు లెత్తు." పారి. 3. 12. కాటు_____కాడు 441 కాడు_____కాడు

కాటులాడు

  • కొట్లాడు. సింహా. 9. 103.
  • రూ. కాట్లాడు.

కాటువడు

  • గాయపడు.
  • "తలలు జీరలును గంపలు కట్టుకొని, గాసిగా మ్రగ్గుటడవులు గాటువడియు." నిర్వ. 4. 76.

కాడికి తెచ్చు

  • విధేయముగా నొనర్చు. గిత్తలను కాడికి కట్టి మాట వినునట్లు చేయుటపై వచ్చిన పలుకుబడి.
  • "వాణ్ణి కాడికి తేగలిగా వంటే చాలా గొప్పవాడివి అన్నమాటే." వా.

కాడి పారవేయు

  • బాధ్యతను వదలివేయు. ఎద్దులను కట్టిన కాడి బాధ్యతా స్వీకారానికి గుర్తుగా వాడడం కలదు. అందుపై వచ్చినపలుకుబడి.
  • "వాడు నట్టనడియేట్లో కాడి పారవేశాడు. ఎలాగూ యిన్ని యేర్పాట్లు చేసుకున్నాక ఎలా మానడం?" వా.

కాడిపాఱు

  • గరు సెక్కు.
  • "కాడి పాఱిన మేని గరులు బ్రహ్మాండంబు, కణప పూబంతి కక్కజము దోప." శివ. 1. 61.

కాడుచేయు

  • గాడ్పఱచు, పాడు చేయు.
  • "ఒక్క నదిపొంత గార్హస్థ్య యుక్తమైన, పుణ్యతప మాచరించుచు బుణ్య జనులు, తారు బంధులు దామరతంప రగుచు, గూడి యుండంగ నెంతయు గాడు చేసి." భీమ. 4. 180.

కాడుపడు

  • పా డగు; చెడిపోవు.
  • "ఇరు లన్న నో యనియెడు తమిస్ర గాడుపడి పొలంబు లెల్ల దిరిగి." ఆము. 6. 12.
  • "కటకటా! మీ వివేకంబు కాడుపడగ." భీమ. 4. 53.

కాడుపఱచు

  • దిక్కుమాలునట్లు చేయు; పాడు చేయు.
  • "అబల గడునెండ యెఱుగని యాట దాన, మెలుత నతిభీత నన్ను నమ్మించి తెచ్చి, కాననంబులో గన్నులు కట్టి కాడు, పఱచి నీ కిట్లు పోజన్నె భావజన్మ!" కుమా. 5. 65.

కాడ్పఱచు

  • పాడు చేయు.
  • "పాలవంటి కులంబు గాడ్పఱచి చనియె." పాండు. 3. 80.

కాడ్పాటు

  • పాడువడుట.
  • "ఆ నిసి బలియును నొండొక, మాని సియుం బడడు దృష్టిమార్గంబున న,ట్లేనును గాడ్పాటున జన,గా." వేం. పంచ. 1. 482.

కాడువారు

  • పా డగు.
  • "పాడరి జాడరి కాడువారియున్." బొబ్బిలి. 1. 53. కాణా_____కాదు 442 కాదు_____కాదు

కాణాచి కాపు

  • కావలివాడు.
  • "కామక్రోధములకు గాణాచి కాపను." తాళ్ల. సం. 7. 246.

కా దనిపించుకొను

  • నడత మంచిది కా దనిపించుకొను; చేసినపని సరి కాదనిపించుకొను.
  • "ఎల్లవారిచే గా దనిపించుకో ఫలము గల్గునె." విప్ర. 5. 56.
  • "పదిమందిలో కా దనిపించుకొంటే నీ కేమి వస్తుంది." వా.

కాదారి మాదారి ప్రొద్దు

  • అర్ధ రాత్రి.
  • "వడివడిం జని పట్టి యో వాలుగంటి, నీదుపే రేమి యెవ్వడు నీదు మగడు, పూని కాదారి మాదారి ప్రొద్దుకడను, నెందు వోయెదు తలిదండ్రు లెవ్వరనిన." యయా. 2. 89.
  • చూ. కాందారి మాందారి ప్రొద్దు.

కాదు

  • సరిపడదు.
  • "వాడికీ వీడికీ కాదు. అంచేత నువ్వు జాగ్రత్తగా మసలుకో." వా.

కాదు అను

  • 1. తిరస్కరించు.
  • "గంగాదితీర్థమహిమ మ,హిం గా దను తీర్థ మెద్ది." పాండు. 2. 214.
  • "నీ మాట ఎవడు కా దంటాడు." వా.
  • 2. లెక్కించక పోవు.
  • "వాణ్ణి కా దని ఆ ఊళ్లో ఒక్కరూ ఈ విషయంలో ముందుకు రారు." వా.

కాదు అవును అని యెఱుగక పోవు

  • లోకజ్ఞత లేకపోవు.
  • "కడు బసిబిడ్డ వీ డొకటి కా దవునా నెఱుగండు." భార. విరా. 2. 213.

కాదు కూడ దంటే

  • బలవంతం చేస్తే నిర్బంధిస్తే.
  • "నా కేం అంత ఒంట్లో బాగా లేదు. బయటికి ఎక్కడికి పోకుండా పడుకుందా మని ఉంది. అంత మీరు కాదూ కూడ దంటే రాక తప్పుతుందా!" వా.

కాదు కూడ దను

  • 1. వద్దను.
  • "ఈ రామారత్నము కాదు కూడ దనినన్ రాజాల నీ చోటికిన్." హర. 2. 58.
  • "ఒక్కరుడును గాదు గూడ దన గల్గెనె?" భార. విరా. 2. 257.
  • 2. నిర్బంధించు.
  • "నాకు ఉన్న యిబ్బందు లన్నీ నీకు చెప్పాను. నె నొక్కనిమిషం లేకపోతే యిక్కడ జరగదు. ఇంత చెప్పినా, నీవు కాదు కూడ దని నన్ను లాక్కెళు తున్నావు." వా.

కాదు పొ మ్మను

  • తిరస్కరించు.
  • "నను గాదు పొ మ్మని నాతి జేరిన వాని." రాధి. 4. 35.

కాదు పోదు

  • ఇ దయ్యేపని కాదు.
  • "ఊరికే వానిచుట్టూ తిరిగీ లాభం లేదు. కాదుపోదు, వృథాగా ఈ లంపటంతా దేనికి?" వా. కాన_____కాని 443 కాని_____కాని

కానక కన్న సంతానము

  • లేక లేక పుట్టిన బిడ్డ.
  • "కానక కన్న సంతానంబు శిశువులు, జీవనస్థితి కేన తావలంబు." శృం. నైష. 1. 108.

కానగ వచ్చు

  • కనబడు.
  • "కలకంఠికి బొడవు దోచి కానగ వచ్చెన్." రుక్మాం. 1. 141.

కానగాబడు

  • కనబడు.
  • "అంభోరుహాప్తుడు గానగాబడె." రుక్మాం. 5. 44.

కాననివాడు

  • అంధుడు.
  • "కాననివాని నూతగొని కాననివాడు విశిష్టవస్తువుల్, కాననిభంగి." భాగ. 7. 182.

కానబట్టు

  • కనబడు.
  • "భూ, నాకం బప్పుర మే కొఱంతయును గానంబట్ట దెప్పట్టునన్." భాస్క. రా. యు. 15.

కానబడయు

  • చూడ గలుగు.
  • "కన్నులారగ మిమ్ము గాన బడసి." హర. 4. 59.

కానబడు

  • కనబడు.
  • "స్వానుభవంబున దథ్యము కానంబడు." కా. మా. 1. 80.

కానికల

  • దు:స్వప్నము.
  • "వామహస్తము నురముపై వైచి నిదుర జెందుతఱి గానికల గందు రందు రెందు." శుక. 4. 126.

కానికి గై కొనక

  • లక్ష్యపెట్టక.
  • ఒక కానీకి కూడా పనికి వచ్చునని భావింపక.
  • ".......తేజోనిధిన్, మౌనిం గానికి నైన గైకొనక..." వరాహ. 5. 19.
  • చూ. కానికి గొనక.

కానికి గొనక

  • లక్ష్యపెట్టక.
  • "మము, గానికి గొన వప్పు డిపుడు గాడిద వైతే." భార. శాంతి. 4. 389.
  • చూ. కానికి గైకొనక.

కానిచ్చు

  • 1. జరుగ నిచ్చు.
  • "అట్లే కానిమ్ము లె మ్మనిన." ఆము. 6. 66.
  • 2. పూర్తి చేయు.
  • "ఆపని కానిస్తే ముందు, తర్వాత మిగతవి చూచుకో వచ్చు." వా.

కానితెఱగులు

  • అపమార్గములు. పాండు. 5. 69.

కానికి నైన గొనక

  • ఏమాత్రం లక్ష్య పెట్టక.
  • "ఆ నీలుండు వరూధినీపరివృతు డై పోయి తేజోనిధిన్, మౌనిం గానికినైన గైకొనక..." వరాహ. 5. 19.

కానితనము

  • దుర్మార్గము; దౌష్ట్యము. కాని_____కాని 444 కాని___కాన్పీ
  • "మారు డదే కానితన మూని పోరె." రాధికా. 4. 51.

కాని తిరుగులు తిరుగు

  • చెడుతిరుగుళ్లు తిరుగు.
  • "వా డీ మధ్య కాని తిరుగుళ్లు తిరుగుతున్నాడు. కాస్త అదుపులో ఉంచితే తప్ప లాభం లేదు." వా.

కానిది

  • కూడనిది.
  • "కానివాని మాన జెప్పి." భార. ఆను. 1. 278.

కానిపేరిది

  • అయిష్ట మైనది; సరిపడనిది.
  • "పలుమాఱుం దలవాకిట మెలగుట యసతీజనైకమిత్రత....నాకు గాని పేరివి మగువా." భార. అర. 5. 302.

కాని పోని

  • లేనిపోని; జరగని. జం.
  • "అరుంధతివి కానక నీపయి గానిపోని యీ, వింత ఘటించినట్టియవి వేకుల కోటికి శాస్తి చేసి..." శుక. 4. 54.
  • "ఈ కానిపోని మాటలతో ఏం గానీ! అయ్యేపని చూడండి." వా.
  • చూ. లేని పోని.

కానివలను

  • కానికార్యము; తగనిపని.
  • "వట్టి ప్రయాసంబు కానివలను దలంపన్." కళ. 8. 164.

కానివాడు

  • 1. అనర్హుడు.
  • "కానివాని, కీకు మీవిద్య పాత్రదా సైకనిరత." భార. శాంతి. 6. 65.
  • 2. పరాయివాడు.
  • "నీవు కానివాడ పోలెం దొలంగి యున్నాడవు?" భార. అరణ్య. 7. 416.
  • 3. అనిష్టుడు, శత్రువు.
  • "న న్నెందుకు ఈ పనిలో దింపి మావాళ్లకు కానివాణ్ణి చేస్తావు?"
  • "ఇన్నాళ్లు పెట్టి పోసి యింతా చేస్తే వానికి నే నిప్పుడు కానివాణ్ణి అయిపోయాను." వా.

కానివావి

  • 1. విరోధము. వివాహాదులలో వరుస చూచి పిల్ల నివ్వడం అలవాటు. వావి కుదిరిన దనగా సంబంధమునకు తగు నన్న మాట.
  • దానికి వ్యతిరేకముగా ఇక్కడ 'కానివావి' కి భావార్థము - పొసగక పోవుట.
  • "గడ్డి వేయడు కరణంబు కానివావి." శుక. 3. 405.
  • 2. తగనిపని.
  • "బొంకు నాలుకకు జేర్చుట కానివావి." గౌ. హరి. ప్రథ. పంక్తి. 235.
  • చూ. తగనివావి.

కానుక పట్టు

  • బహుమతి యొసగు.
  • "ఆశీర్వాద పూర్వకంబుగా నారోజునకు గానుక వట్టుటయు..." కళా. 5. 2.

కాన్పించు

  • కనబడు. కాన్పి____కాపి 445 కాపు____కాపు
  • "కృప దలిర్పంగ గాన్పించె గేశవుండు." కళా. 2. 98.

కాన్పించుకొను

  • చూచు.
  • ఇది రాయలసీమలో నేటికీ వినవస్తుంది.
  • "పాణిపాద ప్రక్షాళ నాచమనా నంతరంబ యతనిం గాన్పించుకొని." ఆము. 4. 199.
  • "ఆ ఊరికి ఎటూ పోతున్నావు. కొంచెం ఆ రెడ్డిగారిని కనిపించుకొని రా." వా.

కాన్పు కెక్కు

  • పేరు కెక్కు.
  • "మరుమర్లుదీ గెలో మంజు సౌదామనీ ఖండంబులో యన గాన్పు కెక్కి." శ్రీరాధా. 4. 151.

కాన్పు చేయు

  • ప్రసవసమయమున సాయపడు.
  • "కాన్పు చేయడానికి మా అమ్మను రమ్మని ఉత్తరం రాశి ఉన్నాము." వా.
  • "ఆ మంత్రసాని ఎన్నివందల కాన్పులు చేసిందో ఏమో? ఇప్పుడు చేయ లేక పోతుందా?" వా.

కాన్పు నడుపు

  • కాన్పు చేయు.
  • "చెల్వుగ బిడ్డ కాన్పు నడిపెన్ వామాక్షి బాలింత యై." కా. మా. 410.

కాపిడు

  • కాపుదల పెట్టు; కావలి పెట్టు.
  • "పవ లెల్ల లోపల జొరకుండ గాపిడి." పండితా. ప్రథ. పురా. పుట. 380.

కాపుండు

  • కాపుర ముండు.
  • "ఇప్పురంబున గాపుండ కితర మైన, పురమునం దేల నిల్చె నిర్జరవిభుండు." హర. 7. 177.
  • "అల పన్నిద్దఱు నూరులందును సముద్యల్లీల గా పున్న వె, గ్గలపుం దాపము బాప నా..." ఆము. 1. 10.

కాపురము నారడి పుచ్చు

  • కాపురము చెడగొట్టు.
  • "అక్కట! భర్త గాపురము నాఱడి పుచ్చి నృపాలమౌళితో..." హంస. 1. 124.

కాపురములు కూల్చు

  • కొంప లార్పు.
  • "జార! యెన్ని, కాపురంబులు గూల్చితో కద యటంచు, బలుక నా వంటి వా డిందు గలిగె ననుచు." శుక. 3. 201.
  • "వా డీసరికి ఎన్ని కాపురాలు కూల్చాడో? వీళ్లింటికి ఎసరు పెట్టాడు." వా.

కాపురము సేయు

  • నివసించు.
  • "ఆ పురమునందు జేయుం గాపురము." నిరంకు. 1. 556.

కాపుర మెత్తిపోవు

  • కాపురము పా డగు. ఇది నేడూ రాయలసీమలో వ్యవహారంలో ఉన్న పలుకుబడి. కాపు_____కాబ 446 కామ_____కామి
  • 'ఆ సంసారి ఎత్తిపోయినాడు' - ఇదే అర్థంలోనే ఎత్తుబడు అన్నక్రియ కూడా ఉన్నది. జబ్బులో కావచ్చు లేక మరొక విధంగా కావచ్చు. లేవలేని పరిస్థితిలో ఉన్నాడు - అన్న అర్థంలో ఇది ఉపయుక్త మవుతుంది: 'పశువు ఎత్తుబడింది.'
  • "శరీర మొక్క మ,ట్టైన సమానదు:ఖ మెసయం దన కాపుర మెత్తిపోవదే." శుక. 2. 133.
  • "వారి సంసారం పూర్వం బాగా ఉండేదే కాని ఇప్పుడు ఎత్తిపోయింది." వా.

కాపురుషులు

  • చెడ్డవారు.
  • "కా పురుషుల వలన నిట్టి కాఱియ పుట్టెన్." భార. విరా. 4. 140.

కాపులు పోవు

  • వలస పోవు.
  • "సర్వత్ర నిలింపకామినుల వాడకు గాపులు వోయి..." ఆము. 1. 37.

కాపెట్టుకొను

  • కాచుకొను.
  • "రతిసేన మందిర,మును గాపెట్టుకొని యుండుమోహము కలిగెన్." హంస. 5. 133.

కాబట్టదు

  • ఇష్టం లేదు.
  • "వాడికి సంసారం అంటే కాబట్టదు. మరెవరు చూచుకొంటా రనుకన్నాడో!" వా.

కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు

  • అరిషడ్వర్గాలు.

కామధేనువు

  • కోరిక లిచ్చే దేవతల ఆవు. తద్వారా మనోరథాలు నెఱవేర్చేవాడు, అది.
  • "అతను ఆశ్రితుల పాలిటి కామధేనువు." వా.

కామవరపు జీడి

  • తగులుకొంటే వదలనిది. జీడిరంగు తగిలితే అది యింక వదలదు. కామవరం అనే ఊరిజీడి మరింత ప్రసిద్ధి కావచ్చును.
  • "వాడు కనిపించాడా? ఇక వెళ్లినట్లే. కామవరపుజీడిలా పట్టుకుంటాడు." వా.
  • రూ. కామారపు జీడి.

కామాటపుపని

  • ఇంటిపని.
  • "భానుపుత్రాదులన్, వినుమీ చంపక పట్టి తెచ్చి దినమున్ నీ యింటి కామాటపుం,బనికిం జొచ్చెద మన్న దాక నిదె చెంపల్ వైతు మత్యుద్ధతిన్." రామా. 8. 185.
  • కామాట మంటే ఇంటిలోని సామగ్రి, పరికరాలు అని వావిళ్ళ. ని.

కామినీభూతము

  • భూతాలలో ఒకటి. అతి కాముకి. కాము____కాయ 447 కాయ____కాయ
  • ఇలాంటి అతికాముక స్త్రీలను కామినీభూతము లంటారు. భూత విశేషాలు - కామిని, శాకిని, ఢాకిని, ప్రేంఖిణి ఇత్యాదులు.
  • "కంటికి బ్రియ మగువానిన్, గెంటని తమకమున గామినీభూత మనన్, వెంటబడి..." శుక. 2. 106.

కాముకుని లజ్జ

  • అసంభవము.
  • 'కామాతురాణాం న భయం న లజ్జా' అనుటపై యేర్పడినది. రాధి. 4. 79.

కాయకము

  • 1. కష్టం, శ్రమ అను అర్థాలపై వచ్చి లాక్షణికంగా వృత్తి జీవనం అని మారినది.
  • "మఱి యెందు గాయకం బెఱు గమి జేసి." బస. 4. 118.
  • 2. సేవ; శరీరశ్రమ. ఇందుమూలంగానే పని అని కూడా అర్థ మేర్పడినది.
  • "చేయు కాయకమును శివభక్తితతికి, బాయకట్టుల సమర్పణ సేయుటయును." పండితా. ప్రథ. పురా. పుట. 477.
  • "పాయక తనచేయు కాయకంబట్ల, చేయుచు..." అదే. 479 పుట.

కాయకల్పము

  • ముదుసళ్ళకు జవ్వనం ప్రసాదించే ఆయుర్వేదప్రక్రియ.
  • "ఆ ముసలాయన కాయకల్పచికిత్స చేసుకొని ముప్పైయేళ్లవా డయ్యాడు." వా.
  • చూ. కాయసిద్ధి.

కాయకష్టము చేయు.

  • శ్రమించు. నా. మా. 97.
  • "ఏదో కాయకష్టం చేసుకొని ఆ పిల్లలను వాడు పోషించుకుంటున్నాడు." వా.

కాయక్లేశము

  • శరీరశ్రమ.
  • "కాయక్లేశ మేమీ లేకుండా పనులు కావాలంటే ఎలా?" వా.

కాయగసరులు

  • కాయలూ కసురులూ. జం.
  • "జడలు ధరియించి యడవుల, నిడుమల బడి కాయగసురులే మెస వెడు పెన్..." రామాభ్యు. 6. 152.

కాయ గాచు

  • 1. సంతానము కలుగు.
  • "ఇత డొక కాయ గాచి సుతుని ల్లనిపించె మునీంద్ర." కకుత్స. 2. 64.
  • "నాలుగేన్, కాయలు గాయ వచ్చెలువ గర్భమునం దెటువంటి పాపమో." వేం. పంచ. 1, 588.
  • "ఏదో మా పిల్లకడుపున ఒక కాయ కాస్తే చూచి వెళ్ళిపోతాను." వా.
  • 2. పని సేయుట మొదలయిన వాని ద్వారా చేతులు మొదలయిన వాటిపై చర్మం గట్టిపడి కాయవలె ఏర్పడు.
  • "కట్టెలు కొట్టి కొట్టి చేతులు కాయలు కాచిపోయాయి." వా. కాయ____కాయ 448 కాయా____కారా

కాయగూరలు

  • కాయలు కూరలు. జం.
  • మొత్తంగా కాయలకూ కూరలకూ కూడా ఉపయోగిస్తారు. కుమా. 11. 43.
  • "ఏవైనా కాయగూరలు పట్టుక రారా." వా.

కాయము కొట్టు

  • బాలింతలకు వేడిని కలిగించుట కని, శీత వాతాది దోషములు పోవుట కని కొన్ని దినుసులను దంచి పొడి చేయు. మదన. శత. 6.

కాయముతో కైలాసమునకు పోవు.

  • బొందితో కైలాసమున కేగు. సశరీరముక్తి చెందు.
  • పండితా. ప్రథ. పురా. పుట. 406.

కాయశుద్ధి చేయు

  • శాస్తి చేయు, తన్ని వదలిపెట్టు.
  • "ఇలానే ప్రవర్తించా వంటే ఆ ఊళ్లో కాయసుద్ధి చేసి పంపిస్తారు. జాగ్రత్త." వా.
  • చూ. దేహశుద్ధి చేయు.

కాయసిద్ధి

  • నిత్యయౌవనము. దీనిని సాధించుటకు చెప్పిన ఔషధాది ప్రక్రియలను 'కాయకల్పం' అంటారు.
  • "వీరిబగిసికి మఱి గారవించి హరుడు, కాయసిద్ధి యొసంగునే కల్ల గాక." శుక. 3. 94.
  • చూ. కాయకల్పము.

కాయా పండా ?

  • పని అయిందా కాలేదా అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "వివరా లన్నీ తరవాత చెబుదువు గానీ ముందు కాయా పండా చెప్పు." వా.

కారణజన్ముడు

  • ఏదో ఒక పనికి పుట్టినవాడు.
  • "కారణజన్ము లై తనువికారము వచ్చిన బెంపు తప్పునే." భార. విరా. 4. 22.

కారము నూరు

  • కోపించు.
  • "దానిపై, గారము నూరు గాని తగు గారవమున్ బచరించి యేలునే?" పాణి. 5. 15.
  • చూ. కారాలు మిరియాలు నూరు.

కారము లేని విడెము

  • నిస్సార మైనది. వేంకటేశ. 64.

కారాకు మేపి చంపు

  • నానాబాధలూ పెట్టి చంపు.
  • "కృప, చాలు న్గారాకు మేపి చంపకు ప్రజలన్." ఆము. 3. 32.

కారాకులు డుల్లి నట్లు

  • గబగబా. కారా____కారా 449 కారు____కారు
  • సులువుగా పడిపోవుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "వైరమున నులిచి త్రెంపక, కారాకులు డుల్లినట్లు కర్మము లెల్లం, దార పెడ బాయ వలయుట." భార. భీష్మ. 1. 104.

కారాకూర మగు

  • అల్లరిపడు. క్షోభ పడు.
  • "సారెకు గేకలు వేయుచు, గారా కూర మయి మనసు కళవళపడగన్..." సారం.
  • "కారాకూరంబు లై రాక్షసులహృదయముల్ గాడ్పడన్."ఉ. రా. 1. 176.

కారాకూరము చేయు.

  • క్షోభపెట్టు. బాధపెట్టు.
  • "....మీ పల్లెకుం బొండు కా,రా కూరంబులు చేసినం గదలి నే రా నిచ్చటన్." కా. మా. 3. 82.
  • "మా,రదశన్ వేగెడుకాంత నింత పెను గారాకూరముల్ చేసె." పరమ. 3. 275.

కారాని

  • కూడని.
  • "కారానితలంపు బుట్టించె." హర. 3. 95.
  • "కారాని చోటికి పోతే రారానిమాటలు వస్తాయి." సా.

కారాలు మిరియాలు నూరు

  • కోపించు; ద్వేషించు.
  • "డబ్బంతా ఖర్చు చేశా వని తెలిసి మీ నాన్న కారాలు మిరియాలు నూరుతున్నాడు." వా.

కారుకమ్మగా వండు

  • కరకర మనునట్లు - కమ్మగా వండు.
  • "పెక్కు చందముల జిన్నక పెద్దక కారుకమ్మగా వండుదురు." కా. మా. 3. 66.

కారుకూతలు కూయు

  • తిట్టు. కొత్త. 84.

కారుకొను

  • వ్యాపించు. క్రమ్ము; అతిశయించు.
  • "...మెఱుగుటారు...గాటమై పూట పూటకు గారుకొనియె." రసిక. 6. 99.

కారు గ్రమ్ము

  • నలు పెక్కు.
  • "నిగిడి యీగులకెంపు నెలకట్టు కలచోట, గల్పకాపరి కారు గ్రమ్ముచోట." పాండు. 3. 158.

కారుచిచ్చు

  • దావాగ్ని.

కారుచిచ్చునకు గాడ్పులు తోడగు చందమున

  • మఱింత ప్రోత్సాహ మబ్బినట్లు.
  • నిప్పునకు గాలి తో డయి నపుడు మరింత ప్రబలును.
  • "ఉదారసారరణకోవిదబాహులు లోక పాలకుల్, గలసిరి కారుచిచ్చునకు గాడ్పులు దో డగు చంద మెందగన్." ఉ. హరి. 1. 22. కారు____కార్చి 450 కార్య____కార్య

కారుణ్యము సేయు

  • దయచేయు; ఇచ్చు.
  • "అమ్మదాలస గారుణ్యము సేయు మీతనికి." మార్క. 3. 8.

కారుబారు చేయు

  • పెత్తనము చేయు.
  • "తా నెత్తి పెంచగా దగు నిళాసతి మీద వడి నేల బలు కారుబారు చేసి." రాధి. 1. 49.
  • నేటికీ రాయలసీమలో 'వాని కారు బారు జోరుగా సాగుతూ ఉంది' అని అంటారు.

కారె మెత్తు

  • నీళ్ళు తాటిదోనెతో తోడు.
  • "బడలినవార లిందనుక బాదులు త్రవ్వియు గారె మెత్తియున్." విప్ర. 3. 84.

కార్కొను

  • దట్ట మగు.
  • "పుడమి నెల్లెడల నిండి మెండుకొని జగదండఖండంబున గార్కొని." విప్ర. 2. 14. కవిక. 2. 67.

కార్చిచ్చులోపలి మిడ్త లట్లు

  • చిచ్చులో ఉరికిన మిడత నిమిషంలో మాడి పోతుంది. కానీ అగ్గిలోకి ఉరుకుతూనే ఉంటుంది. అలా ప్రమాదంలో తమంత దుముకు వారియెడ అనుమాట.
  • "వలదె కార్చిచ్చులోపలి మిడ్త లట్లు, పొలసి పోవనె కాక నిలువగగలరె?" బస. 7. ఆ. పుట. 187.

కార్యకర్మములు నడుపు

  • పనులు నెఱవేర్చు.
  • "ఫలములయెడ బ్రహ్మార్పణ, కలన పరుం డగుచు గార్యకర్మము నడపన్, వలయున్." భార. శాంతి. 1. 69.

కార్యకాడు

  • పని నెఱవేర్చుకొనగలవాడు. ఆము. 4. 263.

కార్యఖడ్గములు

  • సామదండో పాయములు. జం.
  • "కార్య ఖడ్గము లనుచరుల్ గాన బలుక, వలయు." ఆము. 4. 259.

కార్యభారము

  • బాధ్యత.
  • కార్యనిర్వహణలోని బరువు. బరువుతోడి ఉపమానస్ఫూర్తివల్లనే కార్యభారము వహించు అని కూడా వ్యవహారం యేర్పడింది. కడకు కార్యబార మప్పగించుట అనే దానిలో ఆబరువును మోయుట కూడా కలిసిపోయినది.
  • "చొక్కి బహువత్సరము లచ్చో వసించి, పిదప ప్రభుకార్యభారము మది దలంచి." శుక. 1. 196.

కార్య మరయు

  • పని చూచు.
  • "ఒకవేళ రేపు నృపాలకజాలసాల దు,ర్గమదుర్గహరణైక కార్య మరయు." శుక. 1. 355. కార్య____కాఱి 451 కాఱి____కాఱొ

కార్యము చేయు

  • నిషేకము చేయు.
  • "మా అమ్మాయికి కార్యం చేయాలి ఈ నెలలో?" వా.

కార్యము తప్పు

  • కార్యము చెడు.
  • "ఇక నిట్టటు, దడసిన గార్యము దప్పు ననుచు." కళా. 6. 71.
  • "అప్పుడు మంత్రులు కార్యము దప్పె గదా యనుచు." నిరంకు. 4. 68.

కార్యము తెగు

  • పని ముగియు.
  • "తెగు గార్య మనువార్త." విజయ. 1. 41.

కార్యము పాకము తప్పు

  • పని చెడిపోవు.
  • "మతి దలపోసి యీపలుకు మానుడు పాకము దప్పె గార్యముల్..." భార. భీష్మ. 1. 13.
  • చూ. పని పాకము తప్పు.

కార్యవాది

  • అనవసరంగా వాదాలతో పని చెఱచుకొనక పని అయ్యేటట్టు చూచుకొనేవాడు.
  • "లేనిపోనివానికి వెళ్లేవాడుకా దతను. కార్యవాది." వా.

కాఱియపెట్టు

  • బాధపెట్టు.
  • "దుర్భాషా, ఘనశరములు మనము నాటి కాఱియ బెట్టన్." భాగ. స్క. 4. 221.

కాఱియవడు

  • కష్టపడు; బాధపడు.
  • "జూదమాడి ధర్మనూనుండు రాజ్యంబ, ననుజులను బ్రియాంగనను బణంబు, గాగ నొడ్డి యాడి కాఱియవడ డె."భార. విరా. 5. 245.

కాఱియ వెట్టు

  • కష్టపెట్టు.
  • "మా ఱెందు లేక నిరతము, గాఱియ వెట్టంగ బెగడి." రుక్మాం. 3. 4.

కాఱుకూతలు

  • దుర్భాషలు.
  • "కన్ను లెఱ్ఱచేసి యన్నుల గని కాఱు, కూత లఱచె దేల కోకిలంబ!" రసిక. 4. 170.

కాఱు లఱచు

  • 1. దుర్భాష లాడు.
  • "కతలు సెప్పెదు విను మంచు గాఱు లఱచు, నేర్పు గలుగుట." రుక్మాం. 5. 86.
  • 2. కాఱుకూతలు కూయు.
  • "కంటే బ్రాహ్మణు డెన్ని కాఱు లఱచెన్ గర్వించి వీ రెల్ల నా,కంటెన్ బాత్రులె." మను. 5. 14.

కాఱులాడు

  • వ్యర్థప్రలాపాలు పల్కు.
  • "ఇవము నూడుకొలపుటేలికల్ ము న్నెందు, గాఱు లాడి రనినకత యెఱుంగ." అచ్చ. అయో. 30.

కాఱులు చెప్పు

  • కారుకూతలు కూయు.
  • "ఏమి కాఱులు చెప్పె దీమఱ్ఱి నాకు?" ద్విప. జగ. 158.

కాఱొడ్డెకాడు

  • దుర్భాషి. శేష. 3. 269. కాల____కాల 452 కాల____కాల

కాలం ఇట్లే ఉండదు

  • ఇట్లాగే ఎప్పుడూ ఉండదు.
  • "నే నేదో యిప్పుడు తక్కువస్థితిలో ఉన్నాను. అంతమాత్రంతో నువ్వు తిరస్కరించ నక్కఱ లేదు. కాలం ఇట్లాగే ఉండదు." వా.

కాలం కర్మం కూడి వచ్చు

  • కాలము కలిసి వచ్చు అనుట వంటిది. అయితే ఏదో చెడు రావలసి వచ్చు అన్న సూచన ఉన్నది.
  • "కాలం కర్మం కూడివచ్చే వాడు ఆ ఊరికి వెళ్లాడు. దివాలా తీశాడు." వా.

కాలకూటజ్వాలను కబళించు

  • అసాధ్య కార్యము చేయు.
  • "కాలకూటజ్వాల గబళింప నగు గాని, యతివలతోడ మాటాడ నగునె? శుక. 1. 364.

కాలక్షేప మగు

  • హాయిగా కాలము గడచు.
  • "ఏవో నాలుగు నవల లుంటే కాలక్షేప మవుతుంది." వా.

కాలక్షేపము చేయు

  • పని చేయక గడపు.
  • "అనవసరంగా ఇదో అదో అని కాలక్షేపం చేస్తున్నా డతను. ఊరికే నమ్ముకొని ఉంటే ఏం లాభం?" వా.

కాలగర్భములో కలిసిపోయిన

  • ఎన్నడో నశించిన. పాతకాలపు నాటి మాట అనుట. మాటా. 39.

కాలగోచరు డగు

  • చనిపోవు.
  • "...అయ్యఱువది వేవురు నతిదర్పితు లై యేకకాలంబున గాలగోచరు లగుదు రనియు..." భార. అర. 3. 51.

కాల చేత తన్ను

  • చితక తన్ను.
  • "ఇదే, మడరె బరపురుష వాసన, చెడుగా నొడువు మని కాల జేతం దన్నెన్." శుక. 2. 195.
  • "వానిని కాలా చేతా తన్ని వదిలి పెట్టినారు." వా.
  • చూ. కాలా చేతా తన్ను.

కాల చేత పొడుచు

  • చితుక తన్ను.
  • "ముత్తైదువ నటంచు బత్తిబొట్టు వహింప, జిన్నెలా యని కాల జేత బొడుచు." శుక. 2. 115.
  • చూ. కాల చేత తన్ను.

కాలదోషము పట్టు

  • ప్రామిసరీ నోట్లు మొదలగు వానికి మూడేండ్లలోగా చెల్లు వేయక పోతే అవి చెల్లవు. అప్పుడే కాలదోషము పట్టిన దంటారు. అలాగే కొన్ని కొన్నిటికి ఏదో కాలనిర్ణయం ఉంటుంది. అది దాటితే కాలదోషం పడుతుంది.
  • "నోటుకు కాలదోష మని." గుంటూ. ఉత్త. పు. 2. కాల_____కాల 453 కాల_____కాలా

కాల ద్రొక్కు

  • ధ్వంసము చేయు.
  • "*"పాపముల గమి గాలం, ద్రొక్కెదవు నీవ." పారి. 1. 50.

కాలధర్మ చెందు.

  • మరణించు.
  • రూ. కాలధర్మము పొందు.

కాలనేమిజపము

  • దొంగజపము.
  • కాలనేమి ఒక రాక్షసుడు. లక్ష్మణుని మూర్ఛ తీర్చుటకు హనుమంతుడు సంజీవకరణి తెచ్చుటకు పోవుచుండగా దారిలో మునివేషమున నుండి మోసము చేయదలచినవాడు. అందుపై యేర్పడిన పలుకుబడి.

కాల మగు

  • వేళ యగు.
  • "కాలం బగుటయు నృపులకు, నాలము సమకూరె." భార. భీష్మ. 1. 6.

కాల మయి పోవు

  • చనిపోవు.
  • "వాళ్ల నాన్న కాల మయి పోయి అప్పుడే సంవత్సరం అయిపోయింది." వా.

కాలము చేయు

  • మరణించు.
  • "మాయ గోవు పడుచుం, గనుగ్రుడ్లం దిరుగ వేసి కాలము చేసెన్." వరాహ. 10. 40.
  • "ఆయన కాలం చేసి అప్పుడే నాలుగయిదేం డ్లయింది." వా,.

కాలము చేరు

  • అంత్య కాలము సమీపించు.
  • "ఇందఱకు నేర్పడ గాలము చేరె నావుడున్." భాస్క. సుంద. 357.

కాలము చేరు వగు

  • కాలము దాపురించు; మరణ మాసన్న మగు.
  • "తథ్యంబుగా వజ్రనా, భునకుం గాలము చేరు వౌట యిది నీ బుద్ధిన్ వివేకింపుమా?" ప్రభా. 1. 127.
  • రూ. కాలము దగ్గఱకు వచ్చు.

కాలాంతకుడు

  • అసాధ్యుడు.
  • "వాడు కాలాంతకుడు. వాడితో తగాదా పడితే మనం ఏం గెలుస్తాం?" వా.

కాలాగు

  • కొంతకాలం అగు; నిలుచు.
  • "తిమురు మధ్యాహ్న మయ్యెను దేవ! యిచట, నేడు కాలాగి మా మంద పాడిచూచి, గోరసము బాయసంబులు నారగించి, నిగ్రహం బైన మమ్ము మన్నింపవలయు." శకుం. 1. 123.

కాలాడునపుడు

  • అనగా ఇంకా శరీరములో ఏకొద్దో బల మున్నప్పుడు.
  • "కాలాడినపుడ, నడవవలెగాక కైలాస నగము జూడ." కా. మా. 3. 177.
  • "కాలుచేతులు ఆడుతున్నప్పుడే అంతంతమాత్రం. ఇక అవీ పడిపోయా యంటే ఇక నా దిక్కు చూచేవా ళ్లెవరు తల్లీ!" వా. కాలా___కాలా 454 కాలి___కాలి

కాలాతీత మగు

  • వేళ మీఱు.
  • "ఇప్పటికే కాలాతీత మయింది. నాలుగు ముక్కల్లో నా ఉపన్యాసం ముగిస్తాను." వా.

కాలాదిపఱచు

  • దౌడు తీయించు.
  • గుఱ్ఱంమీద కూర్చున్నప్పుడు దానిని అదిలించుటకు కాళ్లను దాని డొక్కలకు తాకి పరువెత్తు మని సంజ్ఞ చేయుట అలవాటు. అందుపై వచ్చిన పలుకుబడి. పలుకుబడి కనుకనే ఏనుగ విషయంలో ఇది అసాధ్య మయినా భావార్థంలో ఉపయుక్త మైంది.
  • "ఐరావతంబు గాలాది పఱవ." నిరంకు. 3. 36.

కాలార్చు

  • కాలాడించు.
  • "ఱోలుచు నెత్తురు ఱొంపిలో మునిగి, కాలార్ప నేరనికరితురంగములు." ద్విప. కల్యా. పు. 79.

కాలావసరములు

  • కాలకృత్యములు.
  • ఏ కాలమునందు అవసరమైన పనులు, పూజలు ఆకాలమున తీర్చుట కాలావసరములు తీర్చుట.
  • "కాలావసరములు గడలు వెట్టితివొ." పండి. పురా. ప్రథమ. 452.

కాలికంచము

  • ఒక పిల్లల ఆట.
  • "కాలికంచంబును గట్టెగుఱ్ఱము." హంస. 3. 146.

కాలికింద బలాదూరు

  • దాని కిది తీసికట్టే అనుట. దానిముందు ఇది ఏమాత్రం పనికి రాదు అనుపట్ల ఉపయోగిస్తారు.
  • "కలకత్తా మేడలతో పోలిస్తే మదరాసు కాలికింద బలాదూ రనుకో." వా.

కాలికి బందాలు వేయు

  • ఆకొట్టుకొను.
  • "వాడి కేదో ఉద్యోగం ఇస్తా నని ఓక్షణంలో కాలికి బందం వేశేశాడు. ఇక వాడు మన మాట వినడు." వా.

కాలికి బలపం కట్టుకొని తిరుగు

  • అదే పనిగా ఎక్కువగా తిరుగు.
  • బలపం వ్రాస్తుంది. అరిగి పోతుంది. అందుపై కాళ్లరిగి పోవునట్లుగా, కాళ్ల జాడలు శాశ్వతంగా ముద్రితమై పోవునట్లుగా అన్నట్లుగా వచ్చిన పలుకుబడి.
  • "కూతురు సంబంధంకోసం అతను ఆరు నెల్లనుంచీ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నాడు." వా.

కాలికి బుద్ధి చెప్పు

  • పాఱిపోవు. కాలి____కాలి 455 కాలి____కాలి
  • "నలుగురూ చేరేసరికి ఆ దొంగ కాలికి బుద్ధి చెప్పాడు." వా.

కాలికి ముల్లు గ్రుచ్చుకొనదు

  • ఏమాత్రం అపాయం కలగదు.
  • "కాలు ములు గాడునే సదా మేలె గాక, వెఱపు వలదు." ప్రబోధ. 4. 56.

కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి వేయు

  • ఏదో విధంగా వాదంలో తికమకలు పెట్టు.
  • "వానితో మనం వాదించ లేం. కాలికి వేస్తే మెడకూ, మెడకు వేస్తే కాలికీ వేస్తూ కూర్చుంటాడు. ఏదీ తెగ నివ్వడు; ఎందుకూ అంగీకరించడు." వా.

కాలికి వేస్తే మెడకు వేయు

  • ఒకదానికి సమాధాన మివ్వగా మరొక తగాదా లేవదీయు.
  • "వాడితో సమాధానపడడం సాధ్యం కాదు. కాలికి వేస్తే మెడకు వేస్తుంటాడు." వా.

కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి

  • చూ. కాలికి వేస్తే మెడకు మెడకు వేస్తే కాలికి.

కాలిక్రింది కసవుగా చూచు

  • హీనముగా చూచు. ఇక్కడ కసవు గడ్డి అనే అర్థంలో ప్రయుక్త మైనది.
  • "పరభయంకరబిరుదవిస్ఫురితు డైన, కాంతు నయ్యిందుముఖి తన కాలిక్రింది, కసవుగా నెంచు వెడమాయ గప్పి చోర,ధవుల మాటలు వడకి యౌదల ధరించు." శుక. 3. 128.
  • పొరక, పూచిక, గడ్డిపుల్లలను హీనతాసూచకములుగా ఉపయోగించిన పలుకుబడులు మనకు చాలా ఉన్నవి.
  • "వాడు నన్ను పొరకపుల్లకంటే హీనంగా చూస్తాడు." వా.
  • "ఆ పని వాడికి పూచికపుల్లతో సమానం." వా.
  • "వాడు నాకు గడ్డిపరకతో సమానం." వా.

కాలికొద్దీ పరుగెత్తు

  • ఎంత శక్తి ఉన్నదో అంత శక్తినీ ఉపయోగించి పరుగెత్తు.
  • "నలుగురూ చుట్టుకొనేసరికి ఆ దొంగ కాలికొద్దీ పరుగెత్తాడు." వా.

కాలికొద్దీ పరువెత్తు

  • వేగముగా పరుగెత్తు.
  • "కుక్క తరుముకు వచ్చేటప్పటికి వాడు కాలికొద్దీ పరు వెత్తాడు." వా.

కాలికొలది

  • కాలిదాకా.
  • "కొదమతట్టువగుంపు కాలికొలందికి వ్రేలు లాలు కుంచెలు." ఆము. 4. 35.

కాలి గోటికి దీటు రాదు

  • ఏమాత్రం సరిపోలదు.
  • "రంభ కూడా దాని కాలిగోటికి దీటు రా దంటే ఇక ఊహించుకో! ఎంత అంద మైన పిల్లో." వా. కాలి____కాలి 456 కాలి____కాలి

కాలి గోరున పోలకుండు

  • ఏమాత్రమూ సరిరా కుండు.
  • "వారల యగణ్యరూపలావణ్యతతులు, బాల! నీ కాలి గోరున బోలవరయ." రామాభ్యు. 5. 179.

కాలిజోడు

  • పాదరక్షలు.
  • "నా కాలి జోడు వాళ్ల యింట్లో మరిచి పోయి వచ్చాను." వా.

కాలి జోళ్ళు తెగేదాకా.

  • ఎక్కువగా (తిరుగు. కొట్టు).
  • "వాడి కొంప చుట్టూ కాలిజోళ్లు తెగేదాకా తిరిగాను." వా.
  • "వాడు ఆ సందు మొనలో ఒంటిగా చిక్కగానే కాలిజోడు తెగేదాకా కొట్టాను." వా.

కాలిడ నిచ్చు

  • ప్రవేశింప నిచ్చు.
  • "........దృష్టికి గన్పడె గొన్ని రూపముల్, కనుపడి మమ్ము నీ మగడు కాలిడ నీయడు మా స్థలంబులం, దునిమెదము..." హంస. 3. 114.
  • వాడుకలో రూపం: కాలు పెట్ట నిచ్చు.
  • "వా ణ్ణిక ఈ యింట్లో కాలు పెట్ట నిస్తానా?" వా.

కాలిడి నిల్చు

  • ధైర్యంగా నిలబడు.
  • "భీషణవేషమూ జూచి నేలపై, గాలిడి నిల్తురే." కుమా. 10. 144.

కాలిడు

  • ప్రవేశించు; గృహప్రవేశము చేయు.
  • "నృపాలు సారెలకు గాలిడ నెందును జోటు లేక..." భోజ. 7. 130.
  • "నీ, యనుజయు నేను గా లిడుదుము." వేం. పంచ. 1. 86.
  • వాడుకలో రూపం: కాలు పెట్టు.

కాలితెరువు

  • కాలిబాట.
  • "ఒక్క నాటి పయనంబున నది మార్గంబు దప్పి కాలిత్రోవం బడి..." శుక. 2. 245.
  • చూ. కాలిబాట.

కాలి దాటగు

  • కీడు తగులు.
  • పీడానివారణార్థం మాంత్రికులు ఏవో దిగదుడిచి నాలుగువీధులు కలిసినచోట పారవేయడం అలవాటు. వాని నింకెవ రైనా దాటినపుడు ఆ కీడు వారికి సోకుతుం దని నమ్మకం. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "వాని కెక్కొడో కాలిదాటై ఒళ్లు తెలియకుండా జ్వరం వచ్చింది." వా.

కాలినడక

  • బండీ బడకా లేకుండా నడిచి పోవుట.
  • "ఆ పల్లె వెళ్లా లంటే కాలినడక తప్ప మార్గం లేదు." వా. కాలి____కాలి 457 కాలి____కాలి

కాలినపుండ్లలో ఉప్పులు చల్లు

  • ఎక్కువబాధ కలిగించు. గోరుచుట్టుపై రోకటిపోటు వంటిది.
  • తాళ్ల. సం. 12. 33.
  • చూ. కాలినపుండుమీద కారం చల్లు.

కాలినపుండ్లమీద కారం చల్లు

  • ఎక్కువ బాధ పెట్టు.
  • అసలే పుండు నొప్పి. దాని మీద కారం చల్లితే మరింత బాధ.

కాలిబాట

  • దగ్గరదారి.
  • బండ్లు కాకుండా మనుష్యులు మాత్రమే పోవుటకు వీలయిన దారి.
  • "బండ్లబాటమీద పోతే పదిమైళ్లుంటుంది. కాని కాలిబాటన పోతే రెండు పరువులు ముటీముటాలుగా ఉంటుంది." వా.
  • చూ. కాలిత్రోవ.

కాలిమట్టులు

  • కాలిత్రొక్కిళ్లు.
  • "బలనికాయము కాలిమట్టులనె యడచు." పారి. 1. 23.

కాలిమానిసి

  • కాల్బలము; పదాతి.
  • "కరి తురంగంబులు కాలిమానుసులు." పల. పు. 22.
  • చూ. కాలుమానిసి.

కాలిమీది కాలు తీయకుండా

  • ఏమాత్రం పని చేయకుండా, హాయిగా సాగు ననుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "వాడి కేం? కాలుమీది కాలు తీయకుండా జరిగిపోతుంది." వా.

కాలిమీది కాలు వేలిమీద రాయి వేసుకొని

  • అట్టహాసంగా - పనీ పాటా లేకుండా.
  • "వాని కేం? తండ్రి పెట్టిపోయిన ఆస్తి ఉంది. కాలిమీద కాలు వేలిమీద రాయి వేసుకొని బతుకుతాడు." వా.

కాలిముల్లు

  • బాధ పెట్టునది.
  • "గాలి కాలిముల్లు కుభృత్ పాలి పాలి పిడుగు రావణుడు డిందె." ఉత్త. రామా. 1. 149.
  • "కంటిలోని నలుసు కాలిముల్లు." వేమన.

కాలియాఱు

  • కాలిపోవు.
  • "అంగజన్మ నీ, విలసితచారురూపతను విభ్రమసంపద లీక్షణంబులో, బొలుపఱ గాలియాఱె నహిభూషణకోప దవానలాహతిన్." కుమా. 5. 72.

కాలీచవడగా

  • కాళ్ళు అరిగిపోవునట్టుగా అనుట వంటిది.
  • తిరిగి తిరిగి కాళ్ళు చిక్కి పోగా అనుట.
  • "కాలీచవడ జరింపుదు, నీ లోకమునందు నెల్ల..." పాండు. 2. 204. కాలు___కాలు 458 కాలు___కాలు

కాలుకంబము

  • ద్వారబంధపు ప్రక్కస్తంభం.
  • "మరుడు శృంగారవీథు లేర్పఱచి తనదు, పేర నొక పేట గట్టి సంప్రీతి దోర, ణాల నుంచిన కాలుకంబాల నంగ, గలికి యూరులు చెలగు బై గాంచి మెఱయ." బిల్హ. 2. 115.

కాలుకడ

  • కాళ్లవైపు.
  • "కాల్కడ యొద్ద కల్ల, జని వినమ్రు డై నిలుచుండె సవ్యసాచి." ఉద్యో. 1. 65.

కాలు కింద పెట్టకుండా

  • ఏమాత్రం పని చేయకుండా.
  • "వాని కేం? కాలు కింద పెట్టకుండా జరుగుతుంది. మనకు రెక్కాడితే గానీ బొక్కాడదు." వా.

కాలు కింద పెట్టనీయకుండా

  • ఏమాత్రం పని చేయనీయ కుండా.
  • "ఆపిల్లను కాలు కింద పెట్టనీయకుండా చూచుకొంటున్నాడు." వా.

కాలు కొను (కొననిచ్చు)

  • కాలు నిల్పు.
  • "కాలు కొనక లీలోద్యానంబున కేకాంతంబున జని." కుమా. 5. 116.
  • "అంత కంతకు నెక్కుచు సంతమసము, గాలుకొన నీక చంద్రుండు గ్రాలె నధిప!" భార. ద్రో. 5. 275.

కాలుగాలిన పిల్లి వలె

  • ఆలస్యమున కోర్వ లేక. ఒక చోట నిలువక. అత్యాందోళితస్థితిని తెలిపే పలుకుబడి.
  • "కాలు గాలిన పిల్లికరణి నీ వెంట, నేల నీబంట నై యెల్లందు దిరుగ." గౌర. హరి. 2. భా. 1243.
  • "ఎంతసేపటికి భార్య రాకపోయేసరికి వాడు కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు." వా.

కాలు గీరు

  • సైగ చేయు.
  • "వాడు నేను మాట్లాడుతుండగా ఎక్కడ వాళ్లమాటకు ఒప్పుకుంటానో అని కాలు గీరాడు. తరువాత చూస్తామని చెప్పి లేచి వచ్చాను." వా.

కాలు గోకు

  • చూ. కాలు గీరు.

కాలు చాపు

  • 1. విశ్రాంతి తీసుకొను.
  • "కాస్త కాళ్లు చాపే అవకాశం కూడా లేదు. ఎన్నాళ్లని మీద వేసుకుని చేస్తాం?" వా.
  • 2. పని చేయుట మానివేయు.
  • "వాడు నా చేత కా దని మధ్యలో కాళ్లు చాపేశాడు." వా.
  • 3. త్వరగా నడుచు.
  • "సాయంకాలం కావచ్చింది. ఇంక పరువుదాకా ఉంది పల్లె. కాస్త కాలు చాపితే కాని చీకటి పడేలోగా చేరుకో లేం?" వా.
  • 4. ఆశించు.
  • అఱ్ఱులు చాపు వంటిది.
  • "కోమలాంగుళదళహస్త తామరసము, కర్ణపూరత్వలీలకై కాలు సాప." శివ. 2. 18. కాలు____కాలు 459 కాలు____కాలు

కాలుచ్చు

  • పక్షులు మొదలగువాని కాళ్లకు చుట్టుకొనే వల, ఉరి.
  • "మిడిబోనుల గాలుచ్చుల, బడదోలియు బోగులోను పఱచియు లేళ్లన్, వడి గల జింకల నెల్లన్, బొడిచిరి..." యయా. 2. 19.

కాలు జారు

  • తప్పుదారి త్రొక్కు.
  • వ్యభిచరించు.
  • "ఆ పిల్ల ఎప్పుడో చిన్నతనంలో కాలు జారిం దని అంత నీచంగా చూడడం ఏం బాగ లేదు." వా.
  • "ఒకసారి కాలు జారితే ఇక ఆపుకోవటం కష్టం." వా.

కాలు తీసి పెట్టకుండా

  • చూ. కాలు క్రింద పెట్టకుండా.

కాలు త్రొక్కి కంకణం కట్టు

  • విధివిహితంగా పెండ్లి చేసుకొను. వివాహంలోని ఆచారంపై వచ్చిన పలుకుబడి.
  • "అంత నిర్బంధం చేయడానికి నీ వేం కాలు తొక్కి కంకణం కట్టావా? నా యిష్టం వచ్చినచోటికి నేను పోతాను." వా.
  • చూ. కాలు ద్రొక్కు.

కాలు త్రొక్కికొని వచ్చు

  • వెన్నంటి వచ్చు.
  • "మీకును మాకును నీ వైరం బెక్కడ నుండి కాలు త్రొక్కికొని వచ్చెనో యెఱుంగ." థర్మజ. 59. 17.

కాలు త్రొక్కికొను

  • తొందరపడు.
  • "కాలు త్రొక్కికొనుచు గళవళపడుచున్న, నెన్నొ యట్టిస్థితులు మున్ను కన్న, వార లౌట నా యొయారులు వాడక, పదిలపఱిచి సరగ స్వాంతములను." భద్రావత్య. 2.
  • "ఏదో చేయాలి గానీ ఊరికే కాళ్లు త్రొక్కుకుంటూ కూచుంటే ఏం లాభం?" వా.

కాలు దన్ను

  • కాలూని నిలుచు.
  • "అచటికి వేగంబ యరుగక యిచట గా,ల్దన్ని యుండెడు నట్టి ధైర్యమెందు,గలదు. భార. మౌస. 97.
  • "ఇట్లు వెఱచఱచి యవిసినకలంబు జనంబులు దీవి సేరినయట్లు కర్ణుం జేరి కాలు దన్ని నిలిచె." భార. కర్ణ. 3. 165.

కాలుదివిటీ మర్యాద

  • రాచమర్యాదలలో ఒకటి.
  • "ఆయనగారు కాలుదివిటీ మర్యాదలతో తీసుకొని వస్తే గానీ వచ్చేట్టు లేడు." వా.
  • చూ. కాలుదివియ.

కాలుదివియ

  • రాజులూ మొదలయినవారు పోతుండగా దివిటీలను వంగి పట్టుకొని ముందు నడుస్తుంటారు. అ దొక రాచ మర్యాద. అలా పట్టుకొనే దివిటీలను కాలుదివియ లంటారు. దీనినే కాలుదివిటీ కాలు____కాలు 460 కాలు____కాలు
  • మర్యాద అనుట కూడా కలదు.
  • "వారు సంభ్రమించి వడి గాలు దివియలు, గొనుచు....నృత్తశాల జొచ్చిరి." భార. విరా. 3. 4.

కాలు దూయు

  • పాఱిపోవు.
  • "ఆలు కాలు దూసిన నాట గోలె బవలు, రాతి రన బోక దాసరి రామలక్ష్మి..." భద్రావత్య. 2.

కాలు ద్రవ్వు

  • కలహమునకు పిలుచు. తిరస్కరించు.
  • "కరికుంభములమీద గాలు ద్రవ్వుట గాక, జక్కవకవతోడ వక్కరించు." విక్ర. 8. 44.
  • "శేషదర్పము చిన్వి శీతాంశురుచి నవ్వి, పాలమున్నీటిపై గాలు ద్రవ్వు." కళా. 1. 76.

కాలు ద్రొక్కు

  • 1. వివాహ మాడు.
  • "నాకాలు ద్రొక్కితి నన్ను మన్నించి, నాకోర్కి దీర్చుట న్యాయంబు నీకు." ద్విప. మధు. 8.
  • చూ. కాలు త్రొక్కి కంకణం కట్టు.
  • ప్రవేశించు.
  • "పూసపాటి మహాస్థానభూమియందు, గాలు ద్రొక్కక నోడు జండాలు డైన." సూరకవిచాటువు. వావిళ్ల.

కాలు నిలువదు

  • స్థిరంగా ఒక చోట ఉండ లేడు (దు) అనుట.
  • "వాడికి ఒక చోట కాలు నిలువదు. వా డేం పని చేస్తాడు?" వా.

కాలు నేల గీరుతూ

  • సిగ్గుతో అనుట.
  • "వాళ్ల బావ రాగానే ఆ అమ్మాయి కాలు నేల గీరుతూ నిల్చున్నది." వా.

కాలు నేల దింపకుండా

  • హాయిగా.
  • "లీల మెయి బల్లకీలోని కాలు నేల బెట్టక చెలంగుసంపద...." శ్రవ. 1. 37.

కాలు పురుగు తొలుచు

  • ప్రయాణేచ్ఛ విపరీతంగా కలుగు.
  • "వాడు ఒక చోటని నిలబడతాడా? వాడికా లెప్పుడూ పురుగు తొలుస్తూనే ఉంటుంది." వా.

కాలు పెట్టిన వేళ

  • కాపురానికి వచ్చినవేళ. ఒక్కొక్క సమయాన్ని బట్టీ బాగోగులు కలుగుతాయన్న జ్యోతిశ్శాస్త్ర సంప్రదాయంపై యేర్పడిన పలుకుబడి.
  • "ఆపిల్ల కాలుపెట్టినవేళ ఇంటికి పదిళ్లయ్యాయి. మన పిల్ల కాలు పెట్టినవేళ యెలాంటిదో కాని ఇల్లు గుల్లయి పోయింది." వా.

కాలు పెట్టే సందిస్తే...

  • ఏ కొంచెం అవకాశం ఇచ్చినా.
  • "వాడికి కాలు పెట్టే సందిస్తే ఇక మనలని ఇక్కడ ఉండనీయడు." వా.

కాలు పొడుచు

  • కా లూను. కాలు____కాలు 461 కాలు____కాలు
  • "ఒక్కయెడం గాలు వొడిచి..." పాండు. 4. 237.

కాలు బట్టి తీయు

  • క్రింద పడద్రోయు.
  • "ఓరి! మిమ్ము దా కాలు బట్టి తీతుమో." హేమ. పు. 84.

కాలుబలము

  • పదాతిబలము.
  • "చదిసె గాలుబలము." భార. భీష్మ. 2. 165.
  • రూ. కాల్బలము.

కాలు బైట పెట్టకుండా

  • ఏమాత్రం శ్రమ పడకుండా.
  • "వాడి కేం? కాలు బైట పెట్టకుండా జరుగుతుంది." వా.
  • చూ. కాలు కింద పెట్టకుండా.

కాలుమడి

  • చూ. కాల్మడి.

కాలు మడుచు

  • మూత్రవిసర్జనము చేయు.
  • ఇది కొన్ని వర్గాలలో నేటికీ వాడుకలో ఉన్నది.
  • "కాలు మడిచి కాళ్లు కడుక్కొని వస్తా ఉండండి." వా.

కాలు రాపడ తిరుగు

  • కాళ్లు అరిగిపోవునట్లు తిరుగు.
  • "చొరనిబిలంబులున్ వెడల జూడని క్రంతలు గాలు రాపడం, దిరుగని త్రోవలున్." ఉ. హరి. 1. 131.
  • వాడుకలో రూపం: కాళ్ళు అరిగేట్టు తిరుగు.
  • "నెలనుంచీ కాళ్లు అరిగేట్టు వాళ్లింటికి తిరుగుతున్నాను. కాని యిప్పటికీ ఆ పుస్తకం అతడు తిరిగీ యివ్వడు." వా.

కాలువ క్రంత

  • దొరువూ డొంకా. జం.
  • "తోట దొడ్డి యనెడు మాట లేకుండంగ, గాలువ క్రంతలక్రం దడంగ." సుదక్షి. 4. 69.

కాలువకు పోవు

  • బహిర్భూమికి వెళ్లు.
  • ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో ఉంటుంది. కాలువ లున్న ప్రాంతాల్లో కాలువ కనీ, యే ర్లున్నప్రాంతాల్లో యేటికనీ, వంక కనీ, దొడ్లున్న చోట దొడ్డి కనీ, ఏమీ లేని చోట చెంబు పట్టుకొని అనీ, బహిర్భూమికనీ, యిలా రకరకాలుగా యీ పలుకుబడి మారుతూ ఉంటుంది.

కాలువలు గట్టు

  • ప్రవహించు; ఏకధారగా వెడలు.
  • "ఇట్లు మధుసూదనుం డేయుసాయకంబులు గాలువలు గట్టి మెయిమఱువులు నించియు." ఉ. హరి. 1. 148.

కాలు సాచు

  • ఆశించు; సిద్ధ మగు.
  • "ఎవ్వండు నీచిత్త మెరియించు చున్నాడు, కైవల్యపదవికై కాలు సాచి." హర. 3. 43.
  • "ఆ ముసలాయన కాటికి కాళ్లు చాచుకొని ఉన్నాడు." వా. కాలు____కాల్గ 462 కాల్చ____కాల్దో

కాలుసేతులు కట్టించి తెచ్చు</big

  • నిర్బంధముగా కొనివచ్చు. వాడుకలోనూ: నీవు రాకపోతే కాళ్లు చేతులు కట్టించి తీసుకు పోతాను' అంటారు.
  • "శిష్యులచే గాలుసేతులు గట్టించి తెచ్చి పద్యము జెప్ప దెమలకుండి." హంస. 3. 141.

కాలూదు

  • స్థిరముగా నిలుచు.
  • "...అందు నల్దిక్కులం, గనుపింప న్వెడ గుండెకాయ లదరం గాలూద లేకున్నెడన్." శుక. 2. 268.

కాలెత్తు

  • వ్యభిచరించు.
  • సురతక్రీడాసూచకంగా కాలెత్తుట ప్రయుక్తం.
  • "కన్న వాడికీ కాలెత్తే పాడుబుద్ధి దానిది." వా.

కాల్గఱ్ఱ గొను

  • పాదధూళి తీసుకొను.
  • "కఱకంఠు భక్తుల గన్నంత నవ్వు, సఱణార్థి సఱణార్థి సఱణార్థి యనుచు, గర మర్థి వారిచే గాల్గఱ్ఱ గొనుచు." పండితా. ప్రథ. దీక్షా. పుట. 118.
  • కాల్గఱ్ఱ లంటే పాదుకలని పూర్వకోశాలు. కానీ కాల్గఱ్ఱ కొను అన్న ప్పు డా అర్థం తప్పని తెలుస్తూనే ఉంది. సందర్భాన్నిబట్టి కూడా పాదధూళి తీసుకొను అనుట సరి అనిపిస్తున్నది.

కాల్చనా?

  • ఎందుకు? వ్యర్థ మనుట. నా. మా. 13.

కాల్పువడు

  • దెబ్బ తిను, ఓడిపోవు.
  • "పెనుం,గరిగొన గాల్పువడ్డజము కంటెను బెద్దలె?" కుమా. 4. 76.

కాల్బలం

  • పదాతిసైన్యం.
  • "కాల్బలముల గీ టడంచి." మార్కం. 8. 104.
  • చూ. కాలుబలము.

కాల్మడి

  • మూత్రము.
  • "కాళ్ళుచేతులు నెన్నడు గడుగు కొనడు, విడుచు గాల్మడి నిలుచుండి నడచి నడచి." మల్హ. 3. 6. హరి. పూ. 6. 5.
  • రూ. కాలుమడి.

కాల్వురు

  • కాల్బలం, పదాతిదళం.
  • "ఎదురం గాల్కొని నిల్వ నుక్కణగి వెన్ని గాల్వురు." కుమా. 11. 35,

కాల్కొని నిల్చు

  • గట్టిగా ఎదిరించి నిలబడు. కాలూని నిలుచు.
  • "ఎదురం గాల్కొని నిల్వ నుక్కణగి." కుమా. 11. 35.

కాల్దోమి కడుగు

  • కాళ్లు బాగా రుద్దుకొని కడుగుకొను.
  • పండితా. ప్రథ. పురా. పుట. 298. కావ____కావ 463 కావ____కావు

<bigకావడించు

  • కావడివలె కాళ్లు చేతులు కట్టి కఱ్ఱ కటూ ఇటూ వ్రేలాడ దీసి కఱ్ఱ కావడివలె చేయు.
  • "కాలు జేయు బడియ గావడించి." కుమా. 2. 86.

కావడిపాటు పడు

  • నీళ్లు మోయు.
  • "ఉదర, పోషణంబునకై యూరిపొంత దోస,తోట గావించె గావడిపాటు పడుచు." శుక. 3. 373.
  • 2. క్రింద మీద పడు.
  • కావడికుండలు స్థిరముగా ఒకటిగా ఉండక, కిందికీ మీదికి వాలుటనుబట్టి వచ్చిన పలుకుబడి.కావరము పట్టు
  • పొగ రెక్కు.
  • "సురతకేళుల నలరింప సుఖము మరిగి, తిరిగె దనయత్తకన్న గావరముపట్టి." హంస. 5. 176.
  • "వాడి కెంత కావరం పట్టిం దని. పిలిస్తే తలెత్తైనా చూడడే?" వా.

కావలసినంత (మంది)

  • సమృద్ధిగా.
  • "వాడిదగ్గఱ కావలసినంత డబ్బుంది. వాడి కేం లోటు?" వా.
  • "నీవు కాస్త సాయం చేస్తే కావలసినంత పని చేయవచ్చు." వా.
  • "ఈ ఊళ్లో కూలి కేం? కావలసినంత మంది వస్తారు." వా.

కావలసినదే

  • వాడి కా శాస్తి జరగవలసినదే.
  • "వానికి మొన్న గుర్రప్పందేలలో పదివేలు పోయా యట. కావలసిందే వెధవకు." వా.

కావలసినవాడు

  • ఆప్తుడు, ఇష్టుడు.
  • "మనకు ఇతను చాలా కావలసినవాడు. ఏదో పనిమీద మీ దగ్గరకు వచ్చాడు. అది కాస్తా చేసి పెట్టండి." వా.
  • చూ. అయినవాడు.

కావలి పెట్టుకొని యుండు

  • రక్షణకు ఏర్పాటు చేసి యుండు.
  • "మణిపర్వతంబునం బురంబు చేసి కావలి పెట్టుకొని యుండె." ఉ. హరి. 1. 84.

కావించి చెప్పు

  • లేనిపోనివి కల్పించి చెప్పు; చాడీలు చెప్పు.
  • "అది నామీద ఏవేవో కావించి చెప్పి నా మొగునికి నాకూ కాకుండా చేసింది." వా.

కావు కా వని యేడ్చు

  • ధ్వన్యనుకరణము.
  • 'పిల్లలవిషయంలో నేడు ఉపయోగిస్తారు. కావు కావు మని యేడుస్తున్నాడు.'
  • "నీ వంతలో గావు కావంచు నేడ్పుల్ దలిర్పన్." పారి. 3. 37. కావు____కాసి 464 కాసు____కాసు
  • "ఎఱుక చెడి కావు కావున నేడ్చు బ్రాశి." కవిక. 5. 103.

కావు పట్టు

  • మాగవేయు అనగా లక్షణయా బాగా చితక తన్ను. మాగ గొట్టు అని ఇదే అర్థంలో నేటికీ అంటారు.
  • "కావరంబున గన్ను గానవు జముడు, కావు పట్టక నిను గానడు సుమ్ము." నవ. 1. 48. పు. 25.

కావు వచ్చు

  • మాగి పండ్లకు మంచి రంగు వచ్చు.
  • "మొన్న కావు వేసిన పం డ్లప్పుడే కావు వచ్చినవి." వా.
  • వావిళ్ళ.

కావు వేయు

  • పండుటకై కాయలపై గడ్డి కప్పు.
  • "నిన్న వేయి మామిడికాయలు కావు వేసినాము." వావిళ్ళ.

కావేరిగుఱ్ఱములు

  • ఉత్తమాశ్వములు.
  • "తేరు లన్నియు గూరాటితేరులుగను గుఱ్ఱముల నెల్ల గావేరి గుఱ్ఱములుగ..." మొల్ల. సుం. 172.

కాసావాడు

  • జమీందార్ల, రాజుల దగ్గర ఉండే దాసీపుత్రుడు.

కాసింత

  • కొంచెము.
  • "సున్నం వుంటే కాసింత పెట్టు." వా.

కాసు కప్పర

  • కాసు వీసం. జం.
  • "అంగడి యంగడిం దిరుగులాడుటకుం బలంవిత్తు విష్టతిం, బొంగుచు గాసు గప్పరకు బోవుచు బెక్కు పదార్థముల్ గ్రహిం, పం గొఱ గాక..." బహులా. 1. 11.

కాసుకు కాక పోవు

  • పనికి రాక పోవు.
  • "కపురంపు జిగి మించు కరి నెక్కి యూరేగు, క్రమ మొక్క కాసుకు గాకపోయె." వ్యాఖ్యా. చాటు-తె. జా.

కాసుకు గొనక

  • లక్ష్య పెట్టక.
  • "సురుగక చొచ్చి కాసుకు నన్ను గొనక." గౌ. హరి. ప్రథ. పంక్తి. 1104.
  • కాసు పూర్వకాలంలో చాలా చిన్న నాణెం. ఆ మాత్రం విలువకూడా యివ్వక అనుట. అందుపై వచ్చిన పలుకుబడి.

కాసు చేయని

  • పనికి రాని.
  • "కాసు సేయనిపనికి గాసి బడె బ్రాణి." తాళ్ల. సం. 5. 101.

కాసును గీసు దూసికొను

  • తృణమో పణమో సంపాదించుకొను.
  • ఇలాంటి అర్థంలోనే కాసో వీసమో రాల్చుకొను వంటివి ఉన్నవి. కాసు___కాళు 465 కాళ్ల___కాళ్ల
  • "....తనుమర్దన మాచరించుచున్, గాసును గీసు దూసికొను గాని విడం డత డేమి చెప్పుదున్?" శుక. 2. 362.

కాసువీసములు

  • ఏ కొంతో డబ్బు. జం.
  • "ఎన్నడు గాసువీస మొక టిచ్చిన వాడవు గావు." విప్ర. 4. 27.

కాసె నిలుకడ

  • మల్ల బంధములలో ఒకటి. హంస. 1. 206.

కాసె యులి

  • ఒక రకమైన ఉలి. వావిళ్ళ.

కాసె వోయు

  • గోచిగా కట్టు.
  • "ఆవిడ కాసె వోసి చీర కడుతుంది." వా.

కాస్తా కూస్తా

  • కొంచెమా నంచెమా? జం.
  • "కాస్తా కూస్తా? పదివేల రూపాయలు పోతే యెవరికి మాత్రం కష్టంగా ఉండదు?" వా.

కాహళులు పట్టించు

  • బాకా లూదు.
  • "తూర్యంబులు గొట్టించియు గాహళులు వట్టించియు." మను. 4. 37.

కాళుల దోవతి యగు

  • అడ్డ మగు.
  • నడచునప్పుడు అడ్డపడుతుంది కాబట్టే దోవతిని ఎగ జెక్కు కోవడం అలవాటు కదా!
  • "కావిరి వావిరిం దగిలి కాళుల దోవతి యయ్యె." పాండు. 2. 217.

కాళ్ల(క)కాడ బ్రదుకు

  • ఆశ్రయము.
  • "మా దేముంది నాయనా ! మీ కాళ్ల కాడ బ్రతుకు, మీరు కా దంటే మేము ఎక్కడికి పోతాం?" వా.

కాళ్లకింద గోతులు తీయు

  • మంచిగానే ఉండి ద్రోహము చేయు.
  • "వాడు పైకి మంచిగానే కనిపించినా కాళ్లకింద గోతులు తీసే రకం. జాగ్రత్త." వా.

కాళ్లకు నీళ్ళిచ్చు

  • అతిథిసత్కారము చేయు. ఎవ రైనా వచ్చినప్పుడు ముందు కాళ్లకు నీళ్లివ్వడం, కూర్చొన్న తర్వాత దాహం ఇవ్వడం మన ఆచారం.
  • "ఎవ రైనా యింటికి వచ్చినప్పుడు కాళ్లకు నీళ్లయినా యివ్వక పోతే యెట్లా?" వా.

కాళ్లకు పసుపు రాయు

  • శుభకార్యాదులలో సత్కారము చేయు.
  • "వాళ్లింటికి పెండ్లికి పోతే ఏ మైనా పెద్ద ముత్తైదువును కదా కాళ్ళకు కాస్త పసు పైనా రాయ లేదు." వా.

కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగు

  • కాళ్ళరిగేట్టు తిరుగు.
  • చూ. కాలికి బలపం కట్టుకొని తిరుగు. కాళ్ల____కాళ్ల 466 కాళ్లా____కాళ్లు

కాళ్ల జెఱ్ఱి

  • కాళ్ళు చాలా ఉండే జెఱ్ఱి.
  • "ఈ మధ్య ఎక్కడ బట్టినా కాళ్ళ జెఱ్ఱులు కనిపిస్తున్నాయి. కాస్త జాగర్త రా బాబూ! అవి చెవిలో దూరుతాయట." వా.

కాళ్ల పెనగు

  • కాళ్ళమీద పడు.
  • "కలికి నెఱివేణి చెలువంబు గాళ్ల బెనగ." విజయ. 2. 116.

కాళ్ల బేరమునకు వచ్చు

  • లొంగి వచ్చు.
  • కాళ్లు పట్టుకొనుటకు సిద్ధపడు.
  • "గట్టిగా నిలబడితే వాడే కాళ్లబేరానికి వస్తాడు." వా.

కాళ్లమీద గంజి పోసికొను

  • వెంటనే తొందరగా పోవాలని త్వరపడు.
  • "వీడు ఎప్పుడు వచ్చినా కాళ్లమీద గంజి పోసుకొని వస్తాడు." వా.

కాళ్ల మీద పడు

  • ఆశ్రయించు, ప్రాధేయపడు.
  • "వాడు ఎలాగైనా యీచిక్కు తప్పించ వలసిం దని నా కాళ్ళమీద పడ్డాడు. ఏం చేస్తాం?" వా.

కాళ్ల రిగిపోవు

  • ఎక్కువ తిరుగుటను సూచించేపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "ఆ పుస్తకంకోసం వాడిచుట్టూ తిరిగి కాళ్లరిగి పోయాయి." వా.
  • "ఆ పుస్తకంకోసమని వాళ్లింటిచుట్టూ కాళ్లరిగి పోయేటట్టు తిరిగాను." వా.

కా ళ్లాడ లేదు

  • 1. ఏమీ తోచ లేదు.
  • "ఉన్నట్లుండి ఈ మాట తెలిసేసరికి నాకు కాళ్ళాడ లేదు." వా.
  • 2. పోవుటకు మన సొప్ప లేదు.
  • "ఈ అమ్మాయిని వదిలిపెట్టి పోవడానికి నాకు కాళ్లాడడం లేదు. పసిపిల్ల. కొత్తతావు." వా.

కాళ్లా వేళ్లా పడు

  • బ్రతిమలాడు.
  • "నే నెంత కాళ్లా వేళ్లా పడినా వాడు సాయంత్రందాకా ఉండ మన్నా ఉన్నాడు కాదు." వా.

కాళ్లు అరిగేటట్టు తిరుగు

  • ఎక్కువగా తిరుగు.
  • "కా ళ్ళరిగేటట్టు తిరిగినా ఒక్క కవళం కూడా దొరక లేదు." వా.

కాళ్లు కట్టివేయు

  • ఏమీ చేయనీయక పోవు.
  • "వాడు నన్ను కాళ్లు కట్టివేసి మూల్లో కూర్చో బెట్టాడు." వా.

కాళ్లు కట్టివేసినట్లుగా

  • నిర్బంధములో ఉన్నట్లుగా.
  • "అక్కడ పొలాల్లో చెడతిరిగేవాణ్ణి. ఈ పట్నానికి వస్తే కాళ్లు కట్టివేసినట్లుగా ఉంది." వా.

కాళ్లు కడిగి నీళ్ళు తాగు

  • ఎంతో భక్తిగౌరవాలతో చూచుకొంటాను అను సంద కాళ్లు____కాళ్లు 467 కాళ్లు____కాళ్లు
  • ర్భంలో ఉపయోగించే పలుకుబడి.
  • "వా డేమీ చేయ నక్కర లేదు. కాస్త యింటిముందు కూర్చుంటే చాలు, కాళ్లు కడిగి నీళ్లు తాగుతా. కానీ వాడు వింటేనా. దేశాలవెంబడి తిరుగుతా నంటాడు." వా.

కాళ్లు కడిగి కన్యాదానం చేయు

  • విధివిహితంగా పిల్ల నిచ్చు. వివాహంలో అల్లుని కాళ్లు కడిగి మామ పిల్ల నిస్తా నని చెప్పడం, అట్లా ఇవ్వడం ఆచారం.
  • "వాణ్ణి ఇంట్లో పెట్టుకొని కాళ్లు కడిగి కన్యాదానం చేస్తే వా డిట్లు చేయవచ్చునా?" వా.

కాళ్లు కడుపులు పట్టుకొను

  • బ్రతిమలాడు.
  • "ఏదో నలుగురి కాళ్లూ కడుపులూ పట్టుకొని కొడుకును చదివించుకొని బ్రతుకుతున్నాను." వా.

కాళ్లు కాయలు కాచు

  • ఎక్కువ నడచినప్పుడు కాళ్లకు కాయలు కాయడం సహజం. అలాంటిపట్ల ఉపయోగిస్తారు.
  • "ఊరంతా తిరిగి తిరిగి కాళ్లు కాయలు కాచినవి గాని వా డేమో కనిపించ లేదు." వా.

కాళ్లు కొట్టుకొంటూ

  • చాలా కష్ట పడి నడుచుకొంటూ.
  • "వాడు పొరుగూరు వెళ్ళా డనేసరికి ఆ నాలుగు మైళ్ళూ కాళ్లు కొట్టు కొంటూ వెళ్లవలసి వచ్చింది." వా.

కాళ్లు గట్టు

  • కాళ్ళను కదలకుండా చేయు; విడిచిపోకుండా చేయు.
  • "నీ కామ శాస్త్రముల్ బిడ్డ, కన్గట్టి కాళ్ళను గట్టింప నెట్లు, విచ్చేయు." పండితా. ప్రథ. పురా. పుట. 362.

కాళ్లు చల్లబడు

  • నిరాశ కలుగు. శీతం ముంచుకొన్నంత పని అయిన దనుట.
  • "వాడు ఆమాట చెప్పేసరికి నాకు కాళ్లు చల్లబడ్డాయి. వా డేదో ఇస్తాడు కదా అని అంత ఆశతో వెళ్లాను." వా.

కాళ్లు చాచుకొని కూర్చుండు

  • పనీ పాటా లేక కూర్చుండు.
  • "చేయవలసినపని యింత ఉంటే నువ్వేమో కాళ్లు చాపుకొని కూర్చున్నావు." వా.

కాళ్లుతీపులు

  • కాళ్ల నొప్పులు.
  • "తల నొప్పి కడుపు కుట్టుం, బలు గురుపుం గాళ్లు తీపు పాటించుచు నె,చ్చెలి." శుక. 2. 205.
  • కాళ్లు, చేతుల విషయంలోనే కాళ్ల తీపులు, చేతుల తీపులు అని వాడుక. కాళ్లు తీపు అన్న రూపంలో మాత్రం నేడు వాడుకలో లేదు.
  • చూ. చేతులతీపులు. కాళ్లు____కాళ్లు 468 కాళ్లు____కాళ్లు

కాళ్లు తేలిపోవు

  • నీరసించి పోవు; నీళ్లలో అడుగందక కాళ్లు పైకి లేచిపోవు.
  • "పొద్దున్నుంచీ తిండి లేక నడవాలంటే కాళ్లు తేలిపోతున్నాయి." వా.
  • "ఏదో తక్కువ నీళ్లున్నా యని నడవబోతే కాళ్లు తేలిపోయాయి." వా.

కాళ్లు నిలవవు

  • స్థిరత్వము లేదు అనుట.
  • "వానికి ఒక్కచోట కూడా కాళ్లు నిలవవు. ఎప్పు డెక్కడ ఉంటాడో దేవునికే తెలియాలి." వా.

కాళ్లు పట్టుకొను

  • ప్రాధేయపడు.
  • "ముట్టకు చాలు జాలుగడు మోహపు దేవుల కాళ్లు పట్టుకో, నెట్టును జెల్లు గాక." కళా. 7. 234.
  • "నీ కాళ్లు పట్టుకొంటాను నాయనా ! మావాణ్ణి ఎలాగైనా ఈ ఆపదలోనుంచి తప్పించు." వా.

కాళ్లు పడిపోవు

  • 1. ఎక్కువ నడచుట వగైరాలతో కాళ్ళు నొప్పి పెట్టు.
  • "పొద్దున్నుంచీ తిరిగి తిరిగి కాళ్లు పడిపోయాయి. ఇంక నే నెక్కడికి రాలేను." వా.
  • 2. పక్షపాతము తగిలి కాళ్ళు స్వాధీనము తప్పు.
  • "వాడికి పక్షపాతం వచ్చి కాళ్ళు పడిపోయినాయి." వా.

కాళ్లు పార జాపు

  • ఇక నాతో కా దని చేతులు వెల్లకిల వేయు.
  • చూ. కాలు చాపు.

కాళ్లుమొగములు వాచి

  • వానికై విపరీతమైన ఆసపడి. గర్భిణిస్త్రీలకు కోరి కే దైనా ఉంటే, కాళ్లు మొగము దద్దరించు నని వాడుక. తర్వాత అది సర్వత్రా ఉపయోగించే పలుకుబడి అయినది.
  • "నీవరపు ళ్లెల్ల...దొంటి రాజాన్నముల్ దలచి, వడి గాళ్లు మొగములు వాచి వచ్చుడును..." పండితా. ప్రథ. పురా. పుట. 287.
  • చూ. కాళ్ళూ మొగం వాచు.

కాళ్లు రాక పోవు

  • కాళ్లాడక పోవు.
  • "చాలక భీతు డై జలజాస్తసుతుడు, వడి చెడి పాఱిపోవను గాళ్లు రాక." సుగ్రీ. పు. 28.
  • "ఆ కిరాతకుల ఇంట్లో పిల్లను వదలి రావాలంటే నాకు కాళ్లు రాలేదు." వా.

కాళ్లు రెండూ ఒక చోట పెట్ట లేదు

  • ఏమాత్రం విశ్రాంతి తీసుకో లేదు.
  • "పొద్దున్నుంచీ ఒకే పని. కాళ్లు రెండూ ఒక చోట పెట్ట లేదు." వా.

కాళ్లు వచ్చు

  • 1. వయసు వచ్చు. కాళ్లు____కాళ్లూ 469 కింక____కించ
  • కాస్త అటూ ఇటూ పారాడే వయసు వచ్చిన దనుట.
  • "వా డేదో నాకు ముసలితనంలో ఆదరువుగా ఉంటా డని చాకి సంతరించాను. కాస్త కాళ్లు రాగానే వాడు ఉడాయించాడు." వా.
  • 2. నడక వచ్చు.
  • "మా వాడికి సంవత్సరం కూడా నిండక ముందే కాళ్ళు వచ్చాయి." వా.

కాళ్లు విఱుగ గొట్టుకొను

  • తొందరపడు.
  • "ఎప్పటి కయ్యేది అప్పటి కవుతుంది. ఊరికే కాళ్లు విఱగగొట్టుకుంటే పనులవుతాయా?" వా.

కాళ్లూ చేతులూ ఆడడం లేదు

  • ఏమి చేయుటకూ తోచుట లేదు.
  • ఏమి చేయుట కైనా కాళ్లూ చేతులూ ఆడితేనే కదా! అవి ఆడక పోవుట ఏమీ చేయలేక పోవుటగా ఏర్పడినది.
  • "ఉన్నట్టుండి ఆ అమ్మాయి పడక వేసే సరికి నాకు కాళ్లూ చేతులూ ఆడడం లేదు." వా.

కాళ్లూ మొగం వాచు

  • ఎంతో ఆశపడు.
  • గర్భిణీస్త్రీలకు ఏవేవో ఆశ లుంటాయని. ఆ ఆశలు తీరక పోతే కాళ్లూ మొహం వాస్తుందని ఒక ప్రతీతి. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "నే నేం కాళ్లూ మొగం వాచి ఉన్నా ననుకొన్నావా?" వా.
  • చూ. కాళ్లు మొగములు వాచి.

కింకర అగు

  • "ఏదో పీడ తగులు.
  • ముఖ్యంగా చంటి పిల్లలకు జబ్బు చేసినప్పు డంటారు.
  • "ఈ పిల్లవాడికి ఏదో కింకర అయినట్టుంది. వీరాచారిదగ్గర యంత్రం కట్టించే పని చూడాలి." వా.

కింకిరి చేయు

  • మలవిసర్జన మొనర్చు.
  • "అప్పుడు నందను డా యోగివరుని, చీరపై గింకిరి చేయ." నవ. 4.

కింకిరిపడు

  • విసుగుకొను; అసహ్యించుకొను.
  • "అతిథి నిను గోరె నేనియు, మతి గింకిరి పడక యోల మాసగొనక నీ, వతనికి బ్రియంబు సల్పుము..." భార. అను. 1. 68.
  • "అడరుదుర్గం ధాన కణుమాత్ర మైన, గింకిరిపడక శంకింపక ధైర్య, మింకక చండాలూ నింటికి నేగి." గౌర. హరి. ఉ. 1584.

కింకిరిపాటు

  • అసహ్యం. కోపం.
  • "నగుమొగంబుల గాని నాతి నీదెస నెప్డు, బతులకు గింకిరిపాటు లేదు." భార. అర. 5. 291.

కించపడు

  • సంకోచించు.
  • "న న్నన్ని మాట లన్నాడా? నే నిం కింద___కిందా 470 కిందా___కికు
  • దులో సాయం చేశా నని తెలిసి అతను చాలా కించపడ్డాడు." వా.

కింద పడినా పైచేయి నాదే

  • ఎంత దెబ్బ తిన్నా పౌరుషాలు నరికేవారి విషయంలో ఉపయోగించే పలుకుబడి.
  • "వాణ్ణి నానామాటలూ అని పంపించారు. అయినా వీడికి పొగరు తగ్గ లేదు. కింద పడినా పై చేయి నాదే అనే రకం." వా.
  • చూ. కిందపడినా మీసం మన్ను కాలేదు అన్నట్లు.

కిందపడినా మీసం మన్ను కాలేదు అన్నట్లు

  • తాను దెబ్బ తిన్నా - ఓడి పోయినా ఒప్పుకొనక పోయే వాని విషయంలో అనుమాట.
  • కుస్తీలో ఓడినా మన్ను వీపుకే అయింది కానీ మీసాలకు కాలేదు కదా అని సంతృప్తి పడేరకం అనుట.
  • చూ. కింద పడినా పైచేయి నాదే.

కిందాకు మీదాకు వాసి యగు

  • ఏదో కాస్త ఇంచుమించుగా అగు.
  • "చచ్చిపోయిన వారికై చాల వగల, దు:ఖపడుదురు మఱునాడు దొడరి చనరొ, తాము బ్రదుకుట కేది తథ్యంబు తడవ, వనిత కిందాకు మీదాకు వాసి గాదె." కుచే. 1. 80.
  • ఆకులు కాలిపోవునప్పుడు మీదాకు ముందు రాలి పోయినా కిందాకు వెను వెంటనే మీదా కై రాలి పోవలసినదే కదా!

కిందా మీదా పడు

  • ఏదో అవస్థపడు. ఒకప్పుడు తగ్గిపోతూ బాధ పడుతూ, మరొకప్పుడు తేరుకొని పైకి లేస్తూ అనుట.
  • "ఆ యింత ఆస్తిలోనే వాడు కిందా మీదా పడి కొడుకును బి. ఏ. దాకా చదివించాడు." వా.

కిందుపడు

  • ప్రాధేయపడు; లొంగు.
  • "ఏల కిందుపడి మొక్కే వేమి బాతినే నీకు." తాళ్ల. సం. 4. 168.

కింవదంతి

  • జనశ్రుతి; పుకారు.
  • "త్వరలోనే ఈ పల్లెకు పోస్టాఫీసు వస్తుందని కింవదంతిగా ఉంది." వా.

కికాకిక నగు

  • ధ్వన్యనుకరణము.
  • "మిగుల రొదగా గికాకిక నగుచు రతుల, యామములు పోక నెద్దియే నాడుకొనుచు." కళా. 1. 147. కళా. 8. 177.
  • రూ. కికకిక నగు.

కికురు పొడుచు

  • త్రోసివేయు.
  • "త్రుళ్లుచు గికురుపొడుచు." భాగ. 8. 208.
  • చూ. కికురు వొడుచు.

కికురువెట్టు

  • 1. మోసగించు.
  • "అతనిచేత నున్న యమృతకుంభము కికు____కిక్కు 471 కిక్కు____కిట
  • సూచి, కెరలు వొడిచి సురల గికురు వెట్టి, పుచ్చుకొనిరి...." భాగ. 8. 295.
  • 2. త్రోసి పుచ్చు.
  • "ఏ నొక బ్రాహ్మణకన్యక,నై నరపతి గికురు వెట్టి..." దశ. 9. 62.
  • "కికురు వెట్టి సుమంతు బాదుకలు గొంచు." సారం. 3. 134.

కికురు వొడుచు

  • మోసగించు. భాగ. 10. స్క. 431.
  • చూ. కికురుపొడుచు.

కిక్కు మనకుండ

  • ఏ మనకుండ.
  • "కిక్కు మనకుండ నేరికి జిక్కు వడక." రాధా. 4. 89.
  • "పెండ్లాం ఏమన్నా వాడు కిక్కు మనకుండా ఉంటాడు. మన మంటేనే ఇంత రాద్ధాంతం చేస్తాడు." వా.

కిక్కు ముక్కురు మనక

  • నో రెత్తక. బ్రౌన్.
  • చూ. కిక్కురు మనక.

కిక్కురు మనక

  • నో రెత్తక; ఏమాత్రం వ్యతిరేకించక.
  • ఇ దిలా 'అనక' అన్న వ్యతిరేకార్థంలోనే కాని కిక్కురుమను అన్న ట్లుండదు. అలా కొన్ని పూర్వాకోశా లిచ్చిన రూపం సరి కాదు.
  • " కిక్కురు మన కమృతంబుం, గ్రుక్కలు వెట్టుదురు సురలు." హరి 6. 122.

కిక్కురువెట్టు

  • వంచించు.
  • "శూలిన్, గిక్కురువెట్టి పోయె లతికా స్తోమాంతరాళంబులన్." విష్ణు. నా. 4. 253.

కిచకొట్టు

  • 1. కిచకిచ నవ్వు.
  • ధ్వన్యనుకరణము.
  • "పూవు గుత్తుల వంటి పూపచన్నులు గోళ్ల, నదిమిన గిచకొట్టునట్టి వేళ." శుక. 1. 300.
  • 2. కిచకిచలాడు.
  • "కిచకొట్టు ఒకదారి కివకివల్ చెవి గుల్కి, కుదురుగుబ్బ లురంబు గదియ జేర్చి." శుక. 1. 303.

కిటకిటని

  • జవజవలాడు.
  • "కిటకిటనికౌ నొకింత చలింపన్." విజయ. 3. 79.

కిటకిట పండ్లు కొఱుకు

  • పండ్లు కొఱుకుటలో ధ్వన్యనుకరణము.
  • "జటిలుండు గిటకిటం బండ్లు గొఱికి హుమ్మని కటమ్ము లదుర ముకుబుటమ్ములు నటింప." మను. 5. 19.

కిటకిట మను

  • కిటకిట ధ్వని చేయు.
  • "కిటకిట మన రదనపంక్తి గీటుచు బలికెన్." పార్వ. 4. 124.

కిటకిటలాడు

  • క్రిక్కిరియు.
  • "వీధంతా జనం కిటకిట లాడుతున్నారు." వా. కిటు____కిను 472 కిను____కిమ్మ

కిటుకగు

  • వివాద మేర్పడు.
  • "తా ము న్నేసితి నటంచు దమలో గిటు కై." కా. మా. 4. 184.

కిటుకులు పెట్టు

  • కష్టపెట్టు, చిక్కులు పెట్టు.
  • "కపటనాటకు డైనకౌశికు డాత్మ గృప మాలి నిను బట్టి కిటుకులు పెట్టి." హరిశ్చ. పు. 177.

కిటుకు వట్టు

  • తప్పు పట్టు.
  • "ఏ నటు చిఱ్ఱుము ఱ్ఱనుచు నించుక కోపము తాళలేమి నా,పై నొకలాగునం గిటుకు వట్టిన దోసము కాదు." విప్ర. 4. 72.

కితా బిచ్చు

  • బిరుదిచ్చు, మెచ్చుకొను.
  • అస లర్థం బిరు దిచ్చు అయినా తర్వాత మెచ్చుకో లయినది.
  • "మెచ్చి పాచ్ఛా కితాబిచ్చుటచే వజా,రత విజయానంద రంగరాయ, లనగ బౌరుష నామధేయముల వెలసి." ఆనంద. పీఠి. 68.
  • "ఆపోనీద్దూ, అతగాడు కితా బిస్తాడా? అంత ఒదిగి ఉండడానికి." వా.

కినుక చల్లారు

  • కోపము తగ్గు.
  • కినుక అగ్నివంటి దనీ, అది యింకా ఆఱ లేదనీ ధ్వని.
  • "గుండియలు గ్రుళ్ల దన్నిన గ్రుక్కు మిక్కు, రనక యాతని కినుక చల్లాఱ నిచ్చి." శుక. 3. 627.
  • చూ. కోపము చల్లారు.

కినువడు

  • కోపపడు.
  • "అధిపతి నిన్ను నే,జన్నియ విడిచె రణముతఱి, మిన్నక కినువడక పొమ్ము మీ గృహమునకున్." భార. విరా. 4. 218.

కిన్నరకంఠి

  • మంచి కంఠస్వరముగల స్త్రీ.
  • "మేల్కిన్నర జెంత జేరి యొక కిన్నరకంఠి యొసంగ......" చంద్రికా. 2. 95.

కిన్నెరవీణె

  • ఒక విధమైన వీణ.
  • "పసిడి కిన్నెరవీణె బలికించు నెల నాగ." భీమ. 1. 4.

కిమన్నాస్తి

  • ఏమీ లేదు. మాటా. 97.

కిమ్మనకుండా

  • ఏమి అని ప్రశ్నించకుండా.
  • "అన్నిమాట లా పెండ్లాం అంటుంటే మా అన్న కిమ్మనకుండా కూర్చున్నాడు." వా.

కిమ్మన నీదు

  • నోరు మెదప నీదు.
  • "ఇందుబింబమున్, గిమ్మన నీదు మోము గిరిక్రేపులు మూపులు కౌను గాన రా, దమ్మక చెల్ల!" మను. 3. 6.
  • వాడుకలో: వాడు కిమ్మనకుండా కూర్చున్నాడు. సంస్కృతంలో కిం అంటే ఏమి అని కిరా____కిఱ్ఱు 473 కిఱ్ఱు____కిలా
  • ప్రశ్నార్థకం. ఏమి అనకుండ అనుట.
  • చూ. కిమ్మనకుండా.

కిరాణాకొట్టు

  • చిల్లరదినుసుల అంగడి.

కిరీటం పెట్టు

  • ఎక్కువ గౌరవించు, లాభము చేకూర్చు.
  • "ఆ! వా డేదో దారిలో కనబడితే మాట్లాడ్డం తప్పితే నాకు పెట్టినకిరీటం ఏముంది?" వా.

కిరీటిపచ్చ

  • గరుడపచ్చ. విజ. 3. 26.

కిఱుకుచెప్పులు

  • కిఱ్ఱుచెప్పులు.
  • చూ. కిఱుచెప్పులు.

కిఱుచెప్పులు

  • కిఱు కిఱు మని శబ్దం చేసే చెప్పులు.
  • "కిఱుచె,ప్పులు పిల్లనగ్రోవి యమర బొలము దిరుగుచున్." చెన్న. 3. 31.

కిఱుదుకట్లు

  • కుండలమీద చేసే ఒక విధమైన నగిషీపని. హం. 5. 13,

కిఱ్ఱుచెప్పులు

  • కిఱ్ఱు కిఱ్ఱు మని ధ్వనించే చెప్పులు.
  • "పొందవు కిఱ్ఱుచెప్పులును బొల్పెసగన్ ధనదత్తు డెంతయున్." హంస. 1. 172.

కిఱ్ఱుబాగాలు

  • కిఱ్ఱు పావుకోళ్ళు. వైజ. 2. 45.

కిలకిల ధ్వనులు

  • ధ్వన్యనుకరణము.
  • "తరు లెక్కి కిలకిల ధ్వనులు సేయుటయు." ద్విప. జగ. 177.

కిలకిల నవ్వు

  • ధ్వన్యనుకరణము.
  • "కిలకిల నవ్వుమోవి పలుగెంటుల దీటు గుచంబు లోరగా." హంస. 1. 217.

కిలకిల లాడు

  • కిలకిల మను.
  • "సారె సారెకున్, గిలకిలలాడుచున్ మిగుల గేకలు కొట్టుదు రంతె కాని." నీలా. 2. 81.

కిలాకిల నవ్వు

  • కిలకిల నవ్వు.
  • ధ్వన్యనుకరణము.
  • "రంభ నగున్ గిలాకిలన్." కువల. 1. 85.

కిలాడి'

  • నంగనాచి, మాయలమారి - ఇత్యాది ఛాయలలో స్త్రీ పుం భేదం లేకుండా ఉపయోగించే పలుకుబడి.
  • "వా డమ్మా కిలాడీ, నమ్మితే మనం నాశనం కావలసిందే." వా.
  • "అది వట్టి కిలాడీ. దాన్ని యింటికి రానిస్తే యిక అయినట్టే." వా.
  • రూ. కిల్లాడి. కిలా____కిస 474 కిస____కిష్కిం

కిలాదారు

  • ఖిల్లాదార్, దుర్గాధిపతి.
  • ఆనంద పీఠి. 112.

కిల్మాడుకొను

  • గీచుకొని తీసుకొని పోవు. దొంగిలించుకొని పోవు.
  • "ఆబాల యవయవముల, చెలువు గిల్మాడుకొనిరి గావలయు నేడు." కుమా. 5. 121.

కిల్లాకు

  • చీటి; ఫర్మానా.
  • ఖిల్లా అంటే కోట. తద్వారా రాజాజ్ఞా పత్రం అన్నట్లు ఏర్పడినది.
  • "ముల్లోకంబుల నేలుదు, బల్లిదుడను గింకరులు సుపర్వులు నాకుం, గిల్లాకు పంపు సేయం, బల్లవలవకృద్విలాస పద పద కమలా!" రామాభ్యు. 5. 177.
  • "ఇదియు నూరక యుంటి గాకేల నీకు, మాకతల్ విన బంటు కిల్లాకు పోవ, దొత్తుకొడుకులు వోలె దోడ్తో దిగంత, భూమిపతు లంపుచున్నారు కామితములు." కళాపూ. 7. 267.
  • "తనవచోదోషము క్షమింపు మనెడు వాడె, యే మనిన లేని వాతప్పు లెంచ సాగె, వినుము మహికాంత కొండంత పనికి నైన, బలుకు లేటికి కిల్లాకు పనుప సాగె." కువల. 2. 24.

కిల్లాడి

  • చూ. కిలాడి.

కిసరు తగులు

  • దృష్టి తగులు. నేటికీ దృష్టి దోషం తగిలి జబ్బుపడితే కిసరు తగిలిం దనే రాయలసీమలో విశేషంగా అంటారు.
  • "పిల్లకు కిసరు తగిలిన ట్లుందమ్మా. నాలుగు ఉప్పురాళ్లు చుట్టి వెయ్యి." వా.

కిసరుపడు

  • దృష్టిదోషమునకు అగ్గ మగు. వావిళ్ళ ని. కోపపడు అని అర్థం చెప్పింది. కాని కిసరు కున్న సహజార్థమే ప్రయోగంలో సరిపడుతున్నది.
  • "....పసిమి గలకిసలయమ్ములు కొసగ మెసంగి, కిసరు పడక కసరు సెడి... మించి కరాళించు కోయిలల మొత్తంబులును." భాగ. 8. 447.

కిసుక్కున తుమ్ము

  • తుమ్ముటలో ధ్వన్యనుకరణము.
  • పండితా. ప్రథ. పురా. పుట. 496.

కిసురు తీయు

  • పిల్లల పీడానివారణార్థం మంత్రతంత్రాదులతో దిగ దీయు.
  • "నెలసందు. కిసరు తగిలినట్లుంది. మునెమ్మను పిలిచి కిసురు తీసి వేయించండి." వా.

కిస్తీ బంది

  • వాయిదాల ఏర్పాటు. వావిళ్ళ. ని.

కిష్కింధంగా ఉండు

  • ఇరుకుగా ఉండు. కిష్కిం____కీడా 475 కీడు____కీర్తి
  • "ఆ యింట్లో అన్నీ ఉన్నా మరీ కిష్కింధంగా ఉంటుంది. ఇంతమందీ యెలా ఉండగలం." వా.

కిష్కింధాపురవాసులు

  • కోతులలాంటి వారు.
  • "ఆ కిష్కింధాపురవాసుల్లో పడితే మన మేం బయటి కొస్తాం? నానా కంగాళీ పట్టించి పంపిస్తారు." వా.

కీచుబిళ్ల

  • దిండు; తలగడ. శ. ర.
  • చూ. కీచుబుఱ్ఱ.

కీచుబుఱ్ఱ

  • 1. దిండు; తలగడ.
  • "గిలకల మంచమున్ విరులు నించిన సెజ్జయు గీచు బుఱ్ఱయున్." రాధికా. 1. 10.
  • చూ. కీచుబిళ్ల.
  • 2. బాలక్రీడావిశేషం. హంస. 3.

కీచు మని పోవు

  • చిక్కి పోవు.
  • "వా డీమధ్య మలేరియా వచ్చి మరీ కీచు మని పోయాడు." వా.

కీజుపోరు

  • ఊరక పోరు.
  • "కీలుగం టిది యేల పోలగా నును గొప్పు, గీల్కొప్పు కొమ్మంచు గీజు పోరు." శుక. 2. 457.

కీటడగించు

  • పొగ రణచు. కుమా. 11. 151.

కీడాడు

  • దుర్భాష లాడు; నిందించు.
  • "నను....నీ విట్టులు కీడాడంగ నర్హుండవే." భార. కర్ణ. 3. 86.

కీడుపఱుచు

  • చెఱుచు.
  • "ధర్మంబు గీడుపఱిచి." భార. భీష్మ. 1. 60.

కీడు పుట్టు

  • 1. హాని కలుగు.
  • "దాన గీ డెంత వుట్టిన దగిలె నాకు, ననుభవింపక పోవునే." ఉ. హరి. 4. 54.
  • 2. చెడు కలుగు.
  • "లావున రాక వేఱొక తలంపున వచ్చిన గీడు పుట్టదే." ఉ. హరి. 1. 67.

కీడ్పఱుచు

  • అధ:కరించు; క్రిందుపఱుచు.
  • "బయలు దామరల గీడ్పఱుచుపాదములు." గౌ. హరి. ప్రథ. పంక్తి. 805.

కీర్తిముఖము

  • ముఖాన నుదుటిపై కట్టుకునే తెల్లటిరేకు.
  • ఇప్పటికీ రాయలసీమ వీధి నాటకాల వేషాలలో ఇది కట్టుకుంటారు. కీర్తిముఖమనే అంటారు. కోశాలలోని కిది ఎక్కినట్లు లేదు.
  • పండితా. ద్వితీ. పర్వ. పుట. 312.

కీర్తిశేషు డగు

  • చనిపోవు.
  • "శ్రీవారు కీర్తిశేషు లయిరి." వా. కీర్తి____కీలు 476 కీలు____కీలు

కీర్తి సేయు

  • కీర్తించు, పొగడు, స్తుతించు. పండితా. ప్రథ. పురా. పుట. 123.

కీలన చేయు

  • కీలించు, తగిలించుకొను.
  • "చిలుకపోగులను వ్రేల్చెవుల గీలన చేసి." హంస. 5. 55.

కీలరము సేయు

  • మంద వేయు.
  • "సురధేనుసమితి గీలరము సేసె." కుమా. 4. 11.

కీలరువాడు

  • గొల్ల.

కీలారితనము

  • పశుపాలన. భార. విరా. 1. 100.

కీలుకొను

  • ఉండు, నిలుచు.
  • "కృత్తికాతారకంబుల గీలుకొన్న." భీమ. 6. 85.
  • "మెఱుగుందూపులు...కీలుకొనం జేసి." శివ. 1. 86.

కీలుకొప్పు

  • వెండ్రుకలు దువ్వుకొని కొనాన మాత్రం ముడి వేసుకున్నవిధం. కీలుముడి అని నేటి వాడుక.
  • పండితా. ద్వితీ. పర్వ. పుట. 317.
  • "తలకు పోసుకున్నావు. చిక్కు దీసుకొని కీలుముడి వేసుకోవే." వా.

కీలుకొలుపు

  • ఉంచు.
  • "కీలుకొలుపుదు నొసలిపై గేలు దోయి." భీమ. 1. 7.

కీలుకొల్పు

  • చేర్చు.
  • "కేలుదోయి ఫాలంబున గీలు కొల్పి." హర. 2. 101.

కీలుగంటు

  • కీలుముడి.
  • "కేశపా,శము తడియొత్తుకొంచు గటి సంధి నటింపగ గీలుగంటు లం,దముగ నటింప." కాళ. 4. 118.
  • చూ. కీలుకొప్పు.

కీలు గలిగిన

  • కీలకము తెలిసిన.
  • "కీలు గల్గిన యొక నీలనీలవేణి." పాండు. 5. 304.

కీలుజడ

  • వదులు వదులుగా వేసుకున్న జడ. శుక. 2. 232.

కీలు ప్రిదిలు

  • రెంటికీ అనుసంధించిన అతుకు వదలిపోవు.
  • "కీలు ప్రిదిలి తటిల్లత నేల బడిన, బరవసంబున." కుమా. 5. 57.

కీలుబొమ్మ

  • 1. చేతులూ కాళ్ళూ ఆడించ గలబొమ్మ.
  • "కులుకుశృంగారరసములు చిలుక గీలు, బొమ్మవలె నీటు గలదాన వమ్మ నీవు." హంస. 1. 91. కీలు____కీలె 477 కీల్కొ___కీ. శే.
  • 2. చెప్పిన ట్లాడువాడు.
  • నేటివాడుకలో కీలు గల బొమ్మ అన్న అర్థంపై వాడి చేతిలో కీలుబొమ్మ అనగా చెప్పినట్లు ఆడువాడు అన్న అర్థంలోనే ఎక్కువగా విన వస్తుంది.
  • "ఆ సరు కంతా రెడ్డిగారిచేతిలో కీలు బొమ్మలే. అందుకే అత నేదన్నా సరే అంటారు." వా.

కీలు మలగు

  • వెనుకకు తిరుగు. సాంబో. 3. 29.

కీలుముడి

  • కీలుకొప్పు.
  • చూ. కీలుకొప్పు.

కీలుసంకెళ్లు

  • బేడీలు.
  • "కీలుసంకెల నేల గీలించి వీపు వ్రీలంగ గొట్టుదు..." గౌర. హరి. ద్వి. 884, 885.

కీలూడగా తన్ను

  • కీళ్లు ఊడునట్లు కొట్టు.
  • "బండి రాకాసి గీలూడగా దన్నియున్." పారి. 3. 37.
  • ఇచ్చట శ్లేష.

కీ లెడలిన జంత్రము

  • బిస చెడిన యంత్రము. కవిక. 2. 197.

కీలెఱుగు

  • కిటుకు తెలియు.
  • "లోకంబున నాకీటం, బాకైటభవైరి యెల్ల యాత్మలకు నభీ,ష్టాకాంక్ష యొక్క చందమ,యీకి లెఱుగంగ వలదె హృదయములోనన్." శృం. నైష. 3.

కీల్కొనజేయు

  • లగ్నము చేయు.
  • "హనుమంతు మాట యందు గీల్కొన జేయు." వర. రా. కిష్కి. పు. 476. పం. 5.

కీల్కొలుపు

  • లగ్నము చేయు.
  • "పాదపద్మముల్ మనములయందు గీల్కొలిపి." భాగ. స్క. 3. 542.
  • రూ. కీల్కొల్పు.

కీల్గంటు

  • చూ. కీలుగంటు.

కీల్బొమ్మ

  • చూ. కీలుబొమ్మ.

కీల్బొమ్మరము

  • మరతో తిరిగేబంగరము.

కీల్ముడి

  • చూ. కీలుముడి.

కీ. శే.

  • చనిపోయిన అన్న అర్థంలో మృతు లైనవారి పేరు నుదహరించే ముందు వ్రాసే పొడి అక్షరాలు.
  • కీర్తిశేషు లనుమాటకు సంక్షిప్తసంకేతరూపం.
  • "కీ. శే. రామమూర్తిగారు...." వా. కుంటె____కుండ 480 కుండ____కుండ
  • న్నీలాలకభ్రాంతి గుం,టెన పొమ్మంటినొ." కాళ. శ. 16.
  • చూ. కుంటెనలు వహించు.

కుంటెన ముడి

  • తాటాకుల కట్ట కట్టే తాటిముడి. శ. ర.

కుంటెనలు వహించు

  • తార్చు.
  • ఒక నాయికదగ్గఱకు గానీ, ఒక నాయకునిదగ్గఱకు గానీ అందులో ఒకరి పక్షంగా వెళ్లి దౌత్యము నడుపు.
  • "తనసరి బాలెత ల్తనకు దాపుగ వారల కెల్ల దాను గుం,టెనలు వహించు కొంచు నెఱటెక్కులు నిండు." శుక. 3. 109.
  • చూ. కుంటెనకత్తె.

కుంటెన వుచ్చు

  • తార్చుటకై పంపు. పండితా. మహిమ.

కుండ కర్ర చేతి కిచ్చు

  • చిప్ప చేతి కిచ్చు వంటిది.
  • "కలుషము ఘటించు గుండయు గర్రయు దన, చేతి కొనగూర్చు నది గాన జెప్ప నగునె." శ్రవ. 2. 54.

కుండకూల్చిన భంగి

  • కుంభవృష్టిగా, కుండపోతగా.
  • "కుండగూల్చినభంగి, వారక వర్షంబు వఱుగొని కురియ." పండితా. ప్రథ. దీక్షా. పుట. 146.
  • చూ. కుండపోత, కుంభవృష్టి, తాడిపోత.

కుండగోకరి

  • వంటవాడు; కుండలు కడిగేవాడు.
  • "కుండగోకరి జేసి కువలయేశులకు, వండి పెట్టగ జేసి వాని నీరీతి, చీకాకుపడ మాయ సేయక యున్న, నాకేశ! వినుము నే నలునికి బంట." నలచ. 2. 700.

కుండజల జనించు

  • ఆర్ద్రత కలుగు; నీరూరు.
  • "మనసు దీరగ నొక్క మాఱు చూచిన గండ,శిలల కైనను గుండజల జనించు." పాణి. 2. 71.

కుండ పగుల గొట్టినట్లు

  • ఖరాఖండిగా.
  • "వా డేంం మాట్లాడినా కుండ పగల గొట్టినట్లు మాట్లాడతాడు." వా.
  • చూ. కుండ పగుల వేసినట్లు.

కుండ పగుల వేసినట్లు

  • వాడుకలో ఇది కుండ పగలేసినట్లు అన్నట్లు వినబడుతుంది.
  • చూ. కుండ పగుల గొట్టినట్లు.

కుండ పట్టే వాళ్లు

  • కర్మ చేసే వాళ్లు.
  • 'తల కొరివి పెట్టే దిక్కు', 'కొరివి పెట్టేవాళ్లు ఇత్యాదుల' వంటిది. అంత్యక్రియలలో పీనుగుతో పాటు ఒక కొత్త కుండలో నిప్పులు వేసుకుని కుండ____కుండ 481 కుండ____కుంద
  • పెద్ద కొడుకో, మరొక కర్మాధికారో కూడా వెళ్లడం అలవాటు. అందుపై యేర్పడినది.
  • "అంత సంపాయించి యేం లాభం? ఆఖరికి కుండ పట్టేవా ళ్లయినా లేరు." వా.

కుండపోతగా

  • ఎక్కువగా. వానవిషయంలోనే దీన్ని ఉపయోగిస్తారు.
  • "రెండు రోజులనుండీ మా ఊళ్లో కుండపోతగా వర్షం కురుస్తూ ఉంది. ఇంకా వెలియ లేదు." వా.
  • చూ. కుంభవృష్టి.

కుండమార్పు

  • ఒక టిచ్చి మరొకటి తీసుకొనుట.
  • "చండాంశు సుతుపోల్కి గుండ మార్పులు గాక." నరసభూ. 5. తె.జా.

కుండలలో గుఱ్ఱాలు తోలు

  • పని లేక పోవు. పనికి మాలిన పని చేయు.
  • నిష్ప్రయోజన మైనపని చేతుటపై వచ్చినపలుకుబడి.
  • "వాడు చేసే దేముంది? కుండలలో గుఱ్ఱాలు తోలుతూ కూర్చుంటాడు." వా.

కుండలలో దేవుకొని తిను

  • నీచపుతిండికి పాల్పడు.
  • కుండలు ఖాళీ చేసి నీళ్లు పోయగా అందులో మెతుకుల కోసం దేవుకొనడం నీచ మనుటపై యేర్పడినది.
  • "వాని కేం? కుండలలో దేవుకుని తినే రకం. ఏలాగో బతుకుతాడు." వా.

కుండలు గోకు

  • అర్హ మైనపని చేయక నీచమైన పనికి పాల్పడు. పనిమాలి యుండు.
  • "వా డంత చదువూ చదువుకొని కుండలు గోకుతూ కూర్చున్నాడు." వా.

కుండలు తొంగుంటాయి

  • తిండికి లేక పోతుంది.
  • కుండలలో ఏమీ లేకపోవడం తిండికి లేక పోవడం. ఇది కొన్ని వర్గాలలోనే వినిపించే పలుకుబడి.
  • "పొద్దున పనికి పోక పోతే కుండలు తొంగుంటాయి." వా.

కుండలు నాకు

  • నీచానికి పాల్పడు.
  • "వాడి కేం? పనా పాటా? కుండలు నాకుతూ బతుకుతున్నాడు." వా.

కుంతలము లొత్తు

  • వెండ్రుకలు సరి చేసుకొను.
  • "తరుణి నుదుట బైకొన్న కుంతలము లొత్తి." ఉ. హరి. 1. 170.

కుందనపుకమ్మి దిగిచిన యందమున

  • కమ్మి తీసినట్లు; మనోజ్ఞ రూపంతో.
  • సమానత మొదట అర్థ మై కుందా____కుందె 482 కుందె____కుంప
  • తరువాత మనోజ్ఞతకు కూడా పర్యాయ మైనది.
  • బంగారు కమ్మిని కమ్మెచ్చులో తీసినపుడు తొలి నుంచీ తుదిదాకా ఒకే తీరులో ఉంటుంది. దానిమీద వచ్చిన పలుకుబడి.
  • "కుందనపు గమ్మి దిగిచిన, యందమున." కళా. 2. 33.
  • చూ. కమ్మెచ్చున తీసినట్లు.

కుందార్చు

  • దు:ఖము తీర్చు.
  • "అరసి దు:ఖాక్రాంత యైనరుక్మిణిని, గర మర్థి గుందార్చె గమలలోచనుడు." ద్విప. కల్యా. 130.

కుందికట్టు

  • ఒక పిల్లల ఆట. యయా. 3. 55.

కుంది కుట్టాడు

  • ఉన్న చోటు వదలక పడిఉండు.
  • "ఇంటిలోనే రాత్రింబవళ్ళు కుంది కుట్టాడు దేల?" తె. జా.

కుందెటికొమ్ము

  • అసంభవ మైనది.
  • కుం దేలుకు కొమ్ముండదు గనుక అలా ఏర్పడినది.
  • "వసుధన్ గుందెటికొమ్ము తెచ్చుకొనగా వచ్చున్ బ్రయత్నంబునన్." మల్లభూ. నీతి. 5.
  • చూ. కుందేటికొమ్ము.

కుందెనగిఱి

  • పిల్లల ఆట.

కుందెనగుడి

  • ఒక పిల్లల ఆట. కాళ. 3. 33.

కుందేటికొమ్ము

  • అసంభవము, అసత్యము.
  • కుందేటికి కొమ్ము లుండవు కనుక, సంస్కృతంలో దీనినే శశవిషాణం అంటారు. వంధ్యాపుత్రుడు. గగన పుష్పము ఇత్యాదుల వంటిది.

'*"తిరిగి కుందేటికొమ్ము సాధింప వచ్చు, జేరి మూర్ఖునిమనసు రంజింప రాదు." భర్తృ. సు. నీతి.

  • చూ. కుందెటికొమ్ము.

కుంపటి పెట్టు

  • తగాదా పెట్టు, ఏదో ఒక అనాహూతము తెచ్చి పెట్టు.
  • "వా ణ్ణేదో మాటసామెతకు ఇంటికి రమ్మంటే నే నక్కడ చేసిన వన్నీ నా భార్యతో చెప్పి కుంపటి పెట్టి పోయాడు." వా.

కుంపటిలో తామర మొలిచినట్లు

  • తగనితావున ఉన్న మంచి వస్తువు పట్ల అనే పలుకుబడి. కుంపటిలో పెట్టిన మొక్కలకు బాగా నీరు పోసి ఎరువు వేసి పెంచుతారు. అందుకే అవి చాలా ఏపుగా కుంప____కుంభ 483 కుంభ____కుంభ
  • పెరుగుతాయి. కానీ తామర నీళ్ళలోనే తప్ప కుంపట్లో మొలవదు.
  • అందుపై ఏర్పడినది.
  • ఈ 'అట్లు'కు బదులు ఏ ఉపమా వాచకం అయినా ప్రయుక్తం కావచ్చును.
  • "నీ మగనితేజమున ను, ద్దామశమ సమగ్రు డనగ దగి కుంపటిలో, దామర మొలచినక్రియ ద,న్వీ! ముని విభు డైనసుతుడు నీ కుదయించున్." నృసిం. 3. 127.
  • "కలిగెగదా కుంపటిలో,పల దామర వోలె నిట్టి పాషండపురిన్, జలజాక్షు ప్రతిమ భాగ్యము, గలవారికి నెచట నైన గల నభిమతముల్." పరమ. 5. 84. కాశీయా. 43.
  • చూ. కుంపటిలో తామరలవలె.

కుంపటిలో తామరలవలె

  • అనర్హస్థానంలో ఉన్న ఉత్తమవస్తువువలె.
  • ఈ 'వలె' కు బదులు ఏ ఉపమావాచకంతో నయినా ఇది ఉపయుక్త మవుతుంది.
  • "సామంతున కిడిన చలువచప్పరములు త,న్పై మేదిని గుంపటిలో, దామరలుంబోలె నట్టితఱి నొప్పారెన్." ఆము. 2. 69.
  • చూ. కుంపటిలో తామర మొలిచినట్లు.

కుంభకర్ణనిద్ర

  • మొద్దునిద్ర.
  • కుంభకర్ణుడు ఏటా ఆరు నెలలు నిద్రపోయేవా డన్నకథపై వచ్చిన పలుకుబడి.
  • "వాడిది కుంభకర్ణనిద్ర. ఏనుగులు తొక్కినా లేవడు." వా.

కుంభకోణం

  • మోసం.
  • "ఇందులో యేదో కుంభకోణం ఉందని నా అనుమానం. నే నిందులో దిగను." వా.

కుంభద్రోణముగా

  • కుండపోతగా (వాన కురియు.)
  • "కుంభద్రోణముగా గురిసెన్." విప్ర. 3. 61.

కుంభముమీది పొట్టేలువలె

  • క్రొ వ్వెక్కి.
  • జాతర్లలో అన్నం వండి అమ్మవారిముందు రాశి పోస్తారు. దాన్నే కుంభం అంటారు.
  • అక్కడ దేవతకై వదిలిపెట్టి ఉండిన పొట్టేలును బలి యివ్వడానికి నిల్పుతారు. ఆ పొట్టేలు బాగా తిని క్రొవ్వి ఉంటుంది. అందుపై వచ్చిన దేవరపోతు లాంటి పలుకుబడి. అది తనకు కలుగ నున్న

ఆపదను (బలి యివ్వ నున్నారన్న) గమనించక నిర్విచారంగా ఉంటుంది. దానివలె ననుట.

  • "తెగిచి యిటు వండి పెట్టిన, బొగులవు కుంభంబుమీది పొట్టేలుక్రియన్." శుక. 3. 276. కుంభ____కుక్క 484 కుక్క____కుక్క
  • ఇట వలెకు బదులు ఏ ఉపమావాచక మయినా ప్రయుక్తం కావచ్చును.

కుంభవర్షము

  • కుండపోతవాన. కుండలతో గ్రుమ్మరించినట్లు - ఎక్కువగా కురియు వాన.
  • "కుంభవర్షం బయ్యె గుంభినియందు." పల. పు. 14.
  • చూ. కుండపోత.

కుక్కకాటుకు చెప్పుదెబ్బ

  • చెడుగుకు బదులు చెడుగే చేయాలి అనుపట్ల అంటారు.
  • "వా డన్నదానికి సరీగా బదులు చెప్పావు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ." వా.
  • చూ. కుక్క కాటు చెప్పు టేటు.

కుక్కకాటు చెప్పుటేటు

  • చూ. కుక్క కాటుకు చెప్పుదెబ్బ.
  • తాళ్ల. సం. 11. 3 భా. 77.

కుక్కకు గతుకునీళ్లే

  • వాడి అనుభవం అంతే అనే నిరసనార్థంలో ఉపయోగిస్తారు.
  • నీళ్లు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కుక్క నాలుకతో అద్ది గతుకుతూనే తాగుతుంది. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "వాడు ఎంత సంపాదిస్తే నేం? ఎంత చేస్తే నేం? మిరప్పొడి మెతుకులు తప్ప ఇం కేం తినడు. ఎన్ని వానలు వచ్చినా కుక్కకు గతుకునీళ్లే." వా.

కుక్కకు నై వేద్యమా

  • నిష్ప్రయోజనము, అనర్హము అనుట. వేంకటేశ. 74.

కుక్కకూతురా!

  • ఒక తిట్టు.
  • "కుక్క కూతుర మెడ గోసి పో గలవు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 881.
  • "కుక్కకూతుర వల దంచు వెక్కిరించు." శుక. 2. 458.
  • చూ. గాడిదకొడుకు.

కుక్కగొడుగులు

  • పుట్టగొడుగులు.
  • క్షణికములు.
  • ఎక్కువగా పుట్టుకొని వచ్చునవి అనే అర్థంలో ఉపయోగించే పలుకుబడి.
  • వాన వచ్చినప్పుడు ఈ పుట్టగొడుగులు విపరీతంగా మొలుస్తాయి. త్వరలో పోతాయి కూడ. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "ఈ కుక్కగొడుగుల పార్టీల కేమి లే. లక్ష పుడతాయి, పోతాయి." వా.

కుక్కచ్చు వేయు

  • శిక్షించు.
  • అపరాధులకు తత్సూచకంగా రాజులు కుక్క ముద్ర వేసి విడిచేవారు; ఇదొక శిక్ష.
  • "తల గొఱిగి ప,దంపడి కుక్కచ్చు వేసి దండింప దగున్." విజ్ఞానే. ప్రా. కాండ. 64.
  • చూ. కుక్కయచ్చు. కుక్క____కుక్క 485 కుక్క____కుక్క

కుక్కజట్టీలు

  • పెనగులాటలు.

కుక్కతోక

  • వక్ర మైనది.
  • ఆ వక్రాన్ని తీర్చుటకు వీలు లేనిది.
  • ఎంత చక్కగా నిలుపుదామని ప్రయత్నించినా కుక్కతోక వంకర పోతూనే ఉండటం అలవాటు. దానిపై వచ్చినపలుకుబడి.
  • "వాడి బుద్ధి ఒట్టి కుక్కతోక లాంటిది. ఎంత చెప్పి ఎంత చేసినా మరీ అంతే." వా.

కుక్కతోకను గొట్టము చేర్చు

  • అసాధ్య కార్యమునకు పూనుకొను.
  • గొట్టములో పెట్టినప్పుడు చక్కగా కనిపించినా, అది తీయగానే యథాప్రకారం వంకరగా తిరుగుతుంది.

కుక్కను కొట్టినట్లు

  • చావదన్ని అనుట.
  • "వెఱ్ఱి,కుక్క లోబడ బట్టి కొట్టిన రీతి." గౌర. హరి. ద్వి. 1111.

కుక్కనోటి ప్రాత

  • భ్రష్ట మయినది.
  • సంపంగిమన్న. 22.

కుక్కనోట్లో కట్టె పెట్టినట్లు

  • అనవసరంగా కోపపడి కసురు కొంటాడు అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • ముందే నోటిదురుసు కలవాణ్ణి అనవసరంగా గిల్లుకొని రెచ్చగొట్టిన ట్లనుట.
  • కుక్కనోట్లో కట్టె పెడితే 'బౌ' మంటుంది.
  • "వాడితో వాదించడం కుక్కనోట్లో కట్టె పెట్టినట్లే." వా.
  • "వాడు ఏం మాట్లాడినా కుక్కనోట్లో కట్టె పెట్టినట్లుగా మాట్లాడతాడు." వా.
  • "వాడితో మాట్లాడితే కుక్క నోట్లో కట్టె పెట్టినట్లే." వా.

కుక్కబుద్ధి

  • నీచబుద్ధి.
  • "నీ కుక్కబుద్ధి నువ్వు మానవు కదా." వా.

కుక్క ముట్టిన కుండ

  • మైల పడినది.
  • కుక్క ముట్టితే ఆ కుండ ఇక వంటకు పనికి రా దనీ పారవేయవలె ననీ అంటారు.
  • "...వాయుసూనుని సుతు డింత సేయకున్న, పొలతి శశిరేఖ వ్యర్థ మై పోవు నమ్మ, కుక్క ముట్టినకుండ యై కుందరదన." శశి. (అప్ప) 4. 75.
  • "ఆ కుక్క ముట్టినకుండలాంటి పిల్ల నెవరు చేసుకుంటార్రా?" వా.

కుక్కమురికి సంతానము

  • కుచేలసంతానము.
  • నారాయణదాసు సావిత్రీచరిత్ర. కుక్క____కుక్క 486 కుక్క____కుక్కి

కుక్కమూతి పిందెలు

  • చెట్టు కాపు ఉడిగినప్పుడు ఏవో చిన్న చిన్న పిందెలు పుడతాయి. వాటినే కుక్క మూతిపిందె లంటారు. అవి పుడితే ఇక కా పుడిగిం దన్న మాటే.
  • "చెట్టు చెడుకాలానికి కుక్కమూతి పిందెలు." సా.

కుక్క యచ్చు

  • చూ. కుక్కచ్చు.

కుక్క యిల్లు చొచ్చినట్లు

  • దొంగగా.
  • "ఎఱుగకుండగ కుక్క యిలు జొచ్చినట్లు, ఘనుల నిక్కడ దెచ్చి కవ్వించినావు." మైరా. పు. 66.

కుక్కల కట్టు

  • దొంగసాధానాలలో ఒకటి.
  • "కత్తియు నీలిచీరయును...కుక్కల కట్టును." చెన్న. 3. 294.

కుక్కలవలె కాటులాడు

  • నీచముగా కీచులాడు. వాడుకలో కాటులాడు కాట్లాడుగా మారినది.
  • "కుక్కలభంగి దమలోన గాటులాడి." భార. శాంతి. 1. 45.

కుక్కలే శునకాలు కుండలే భాండములు

  • ఎంత మరుగుగా చెప్పినా ఆ నీచ మైనది నీచ మైనదే అనుపట్ల ఉపయోగిస్తారు.
  • శునక మని అర్థం కాని సంస్కృతం పేరు చెప్పినా అది కుక్కే కదా అనుట.
  • "నీ వెంత సర్ది ఎన్ని చెప్పినా వాని దుర్మార్గాల నేమాత్రం దాచ లేవు. కాదన లేవు. దుర్మార్గుడు దుర్మార్గుడే. కుక్క లే శునకాలు కుండలే భాండములు - అన్నారు." వా.

కుక్క సంతకు వెళ్ళినట్లు

  • నిష్ప్రయోజన మైన పని చేసినప్పుడు ఉపయోగించే పలుకుబడి.
  • కుక్క సంతకు పోయి తూనిక కట్టెల దెబ్బలు తిని వచ్చిన దన్న సామెతపై వచ్చిన సామ్యం.
  • "ఏదో ఆ ఊరికి వెళ్లాను కానీ నా ప్రయాణం అంతా కుక్క సంతకు వెళ్లినట్లు అయింది." వా.

కుక్కిన పేనులాగ

  • గుక్కు మిక్కు మనకుండా, పేనును కుక్కితే అదలా చప్పున చచ్చి ఊరుకుంటుంది.
  • "వాడు వచ్చా డంటే వీడు కుక్కిన పేనులాగా పడి ఉంటాడు." వా.

కుక్కిమంచము

  • నులక వదు లై గుంత పడిపోయిన పాత నులకమంచము.
  • "ఆ మూల కుక్కిమంచంలో ఉంటుందా ముసలవ్వ." వా.

కుక్కివడు

  • మంచం కుక్కి అయిపోవు కుక్కు____కుక్షి 487 కుచ్చ____కుచే
  • "కుక్కి వడిన మిగుల గొంగోడు వోయిన, గుఱుచ యైన...నుల్కమంచ మొప్ప దండ్రు." వి. పు. 4. 215.
  • చూ. కుక్కిమంచము.

కుక్కురో కుఱ్ఱను

  • కోడి అరుచుటలో ధ్వన్యనుకరణము.
  • "కుక్కురో కుఱ్ఱని కూసె గల్కోడి." పండితా. మహిమ. 197. పు.

కుక్షింభరుడు

  • 1. తన పొట్ట నింపుకొనుటే లక్ష్యముగా కలవాడు - స్వార్థపరుడు.
  • "వాడు వట్టి కుక్షింభరుడు. ఏది ఏ మయినా తన పొట్ట గడిస్తే చాలు." వా.
  • 2. కడుపులో ఉంచుకొను వాడు.
  • "రక్షార్థంబు భరింప రాదె యభవున్ ద్రైలోక్యకుక్షింభరున్.: భీమ. 4. 105.

కుక్షి ప్రోచుకొను

  • పొట్ట పోసుకొను.
  • "ఎందైన గా,నీ భైక్షంబున గుక్షి బ్రోచుకొని దీనిం దీర్చి నే వత్తు." కా. మా. 3. 165.
  • వాడుకలో 'వాడు కూలో నాలో చేసుకొని పొట్ట పోసు కొంటున్నాడు.'
  • జనంలో ఉన్న దిదే. దీనిని పర్యాయపదాలలో ధూర్జటి మార్చినాడు.
  • చూ. పొట్ట పోసుకొను.

కుచ్చలి గంత

  • యోగుల బొంత. రాజ. చ. 2. 94.

కుచ్చలి బొంత పరమ. 1. 185.

  • చూ. కుచ్చలి గంత.

కుచ్చిటప్పాలు

  • డంబాచారపు మాటలు, జొల్లుకబుర్లు.
  • "పొద్దున్నుంచీ సాయంత్రం వరకూ కుచ్చిటప్పాలు తప్పితే వాడు చేసే దేముంది?" వా.

కుచ్చుమీసములు

  • కడపట ఒత్తుగా ఉండే మీసాలు.
  • "ఆ తలపాగా, ఆ కుచ్చు మీసాలు, ఆ పెద్ద కన్నులూ, మనిషి బహుగంభీరంగా ఉంటాడు." వా.

కుచ్చెళ్లలో పాము

  • అతిప్రమాదకారి, దాపుననే ఉన్న ఆపద.
  • చీర కుచ్చెళ్ళలోనో, పంచె కుచ్చెళ్ళలోనో ఉన్న పాము ఏ నిమిష మైనా కాటు వేయ వచ్చును కదా.
  • "కుతుకం బంతయు గూలద్రోసెదవు గా కుచ్చెళ్లలో బామ వై." పాండ. విజ. 79.

కుచేలసంతానము

  • గంపెడుపిల్లలు.
  • ఇందులో పేదతనంలో చాక కుటి____కుట్టి 488 కుట్టు____కుట్టు
  • లేనంత మంది పిల్ల లున్నా రనీ సూచన ఉన్నది.
  • "వాడు ముసలితనంలో ఉద్యోగం లేక ఆ కుచేలసంతానంతో నానా బాధా పడుతున్నాడు." వా.

కుటిలత్వము కూడుగా కుడుచు

  • కౌటిల్యమే ప్రథాన మగు. అతికుటిలు రనుట.
  • "అటు గాన నెన్ని భంగుల, గుటిలత్వమును కూడు గాగ గుడుతురు మగనా, రెటువంటివారి మదిలో, నెటుగా నమ్ముదురు సతులు హితు లని పతులన్." విక్ర. 7. 131.
  • చూ. కూడుగా కుడుచు.

కుటిలపఱచు

  • కౌటిల్యమునకు పాత్రముగా చేయు, కుటిలత్వము చూపు, నెఱపు.
  • "కుండు పెట్టక యేన్నాళ్ళు కుటిల పఱచి." భీమ. 4. 12.

కుట్టి చూచుటకు దోసకాయలా?

  • తెలుసుకో లేము వాని ఆంతర్యం అనుపట్ల అంటారు.
  • "....ఎదిరి కోర్కి యెఱుంగుట యెట్టు కుట్టియా, చూడగ దోసకాయలె? విశుద్ధయశోధన యన్య చిత్తముల్." హర. 2. 63.

కుట్టితే తేలు కుట్టకుంటే కుమ్మర పురుగు

  • తన శక్తి చూసినప్పుడే సమర్థు డనీ, లేనిపట్ల చేత కాని వా డనీ అంటారు అన్న భావాన్ని తెలియ జేసే పలుకుబడి. ఇదే గ్రాంథిక రూపంలో -
  • "కుట్ట దేలు కుట్టకున్న గుమ్మర బూచి, తోసిరా జటంచు దోచె జెలియ, దాని వ్రేలు దీసి దాని కన్ను బొడిచి, నటుల సేయకున్న నగునె పలుక." రాధ. 3.
  • "వా డన్ని రకాలుగా వేధిస్తుంటే శాంతంగా నే నూరకుంటే న న్నేదో చేత గానివా డనుకుంటారు. కుట్టితే తేలు కుట్టకుంటే కుమ్మరపురుగు!" వా.

కుట్టుకాడ

  • కుట్టుపోగు. శ. ర.

కుట్టుచేడు

  • తప్పుపనులకు ప్రేరేచువాడు.
  • "గురుసతి గూడురట్టునకు గొంకని మోడు వియోగినీసము, త్కరముల కీడు చూచుటకు దర్పకు రే పెడుకుట్టు చేడు." వరాహ. 4. 24.
  • కొరడా అని సూ. ని; దుర్మార్గుడు అని వావిళ్ళ ని. - రెండూ సందిగ్థ మనే వ్రాసినవి.
  • పై అర్థం సందర్భాన్ని బట్టి వ్రాసినదే. ప్రయోగాంత రాలున్నట్లు లేవు.

కుట్టుటాకు

  • విస్తరి.
  • విడియాకులు కుట్టగా ఏర్పడినది. కుట్టు____కుడి 489 కుడి___కుడి

కుట్టుతేలు

  • దుష్టుడు. ఆం. భా.

కుట్టుపోగులు

  • మొదట చెవి కుట్టినప్పుడు వేసే వట్టి బంగారుకాడతో చేసిన పోగులు.

కుట్టుపోయు

  • కుట్టు వేయు.

కుట్రపువాడు

  • దర్జీ. బ్రౌన్.

కుడిచి కూర్చుండు

  • 1. అందుకనే కాచుకొని యుండు.
  • 'అందుకు' అనునప్పుడు ఏదో ఒక చెడుపనికై అని కూడా.
  • 2. తన కేమీ అవసరం లేక పోయినా కల్పించుకొను.
  • "కుడిచి కూర్చుండి మీ రేల కొఱత యైన, కుమ్ము లాడెద రోయన్నదమ్ము లారా!" భీమే. 4. 53.
  • "కుడిచి కూర్చుండి రాజ్యంబు విడిచి పోవ." జైమి. 2. 108.
  • "కుడిచి కూర్చుండి వెత దెచ్చుకొంటి మొకటి." ప్రభా. 4. 16.
  • "కుడిచి కూర్చుండి యే గ్రొవ్వి, యివ్వేషంబు బూనిన యవివేకమునకు దోడు...." విప్ర. 3. 56.
  • "వాడు కుడిచి కూర్చొని ఊళ్లో వాళ్లందరిమీదా లేనిపోని అపవాదులు వేస్తుంటాడు." వా.
  • "కుడిచి కూర్చొని ఇదేం పనిరా?" వా.
  • తిని ఉండబట్టలేక అన్న పలుకుబడివంటిదే ఇది.
  • "తిని కుడిచి తిమ్మణ్ణి పాడెను." సా.

కుడితిలో పడ్డ యెలుక

  • అతి సంకటావస్థలో పడిన వ్యక్తి.
  • చూ. కుడితిలో బల్లి.

కుడితిలో పిల్లి

  • చూ. కుడితిలో బల్లి.

కుడితిలో బల్లి

  • అతిసంకటావస్థలో తగులుకొన్న సందర్భంలో ఉపయోగించే పలుకుబడి.
  • "వాడు కుడితిలో బల్లిలాగా నానా అవస్థా పడుతున్నాడు." వా.

కుడినీరు

  • మంచినీరు.
  • "పడమటి పన్నీరు కుడినీరు రాయంచ, గిండులు చెంగట గీలుకొల్పి." దశా. 7. 1.

కుడిబుజము

  • ప్రధానమైన అండ.
  • "కుడిబుజ మై రమ్ము గొబ్బున నెను బోతు, కానుక సేతు నూకాల తల్లి." కవిచకోర.
  • "వాడు రెడ్డికీ కరణానికి కుడిభుజం. వాడు లేందే ఏం జరుగుతుంది?" వా.

కుడిమివాడు

  • విషవైద్యుడు. బ్రౌన్. కుడి____కుడి 490 కుడు____కుడు

కుడిముట్టు

  • అన్నం తినే - నీళ్ళు త్రాగే - పాత్ర.
  • "తొడవులు చినికిన యెమ్ములు, గుడిముట్టు కపాల మిల్లు గుడి ముడి యెద్దె,క్కుడు గట్టువలుపు దో లగు, బడరున కై నవయ నేమి ప్రళయము వచ్చెన్." కుమా. 7. 39.

కుడియెడమగా

  • కొద్దిపాటి భేదముతో.
  • "ఆ ప్రాచీనవిగ్రహానికి ఇతను కుడి యెడమగా ప్రతిరూపం చేశా డంటే నమ్ము." వా.
  • "కాస్త కుడి యెడమగా ఉంటా రా అన్నదమ్ములు." వా.

కుడి యెడమ యెఱుగని

  • మంచీ చెడ్డా తెలియని.
  • "జడివాన కురిసినట్లే, విడువక వాదింతు రాత్మ వేత్తల మనుచున్, కుడి యెడ మెఱుగని మాటల, జడమతు లగు కొంద ఱన్న సంపగిమన్నా!" సంపగిమ. శ. 56.
  • "వాడికి కుడీ యెడమా తెలీదు. అందరినీ అలా గే కసురుకుంటాడు." వా.

కుడియెడమల దిరుగు

  • అటు ఇటు తిరుగు.
  • "ఎడనెడ దలవడుచో వడి,గుడి యెడమల దిరుగు నేనుగులపిఱుదులు నే,ర్పడునట్టి క్షణములోనన." కళా. 8. 86.

కుడి యెడమ లేక

  • అటూ యిటూ కూడా అనుట.
  • ఇటు వేయాలి అటుకాదు అన్న భేదం లేకుండా ఎటుపడితే అటు. ముందూ వెనుకా చూడకుండా అనుట వంటిది.
  • "వెడవిల్తుడు శిరముల బా,రిడి నను గుడి యెడమ లేక యేయం దొడగెన్." శ్రవ. 3. 45.

కుడుపకూటి ప్రాయమువాడు

  • బాలుడు.
  • అన్నము పెట్టి తినిపించవలసిన వయసులో ఉన్నవాడు అనుట.
  • తక్కువ అన్నం తినేవాడని కూడా భావార్థం.
  • "ఇసుమంత గాని లే డీ, పసిబాలుడు కుడుపకూటి ప్రాయమువాడు." పాండు. 4. 180.

కుడుపు దక్కు

  • ఒక్కప్రొ ద్దుండు, ఆహారం లేకుండు.
  • "కుల్యయందు ద్రిరాత్రంబు గుడుపు దక్కి, శౌచియై యఘమర్షణజపము చేసి, యశ్వమేధఫలము నందు ననఘ వరుడు." భార. అను. 2. 87.

కుడుపు వెట్టు

  • భోజనము పెట్టు - నై వేద్యము పెట్టు.
  • "చమురు చిప్పిలం గాల్చినకమ్మకఱ కుట్లం జట్రాతిపయి గాట్రేనికం గుడుపు వెట్టి."

కుడుముల వ్రేట్లాటలు కావు

  • సులభకార్యములు కావు. కుడు____కుడు 491 కుడు____కుతి
  • "కుడుముల వ్రేట్లాటలు గా, వుడు రాజానన రణంబు లూహించిన..." ప్రభా. 5. 195.

కుడువ గట్టను దొడుగను ముడువ కలదు

  • అనుభవించుటకు తగిన వన్నీ ఉన్నవి.
  • వాడుకలో తినడానికీ, కుడవడానికీ - తినడానికీ, తొడగ డానికీ - ఉం దని అంటారు.
  • "కుడువ గట్టను దొడుగను ముడువ బుడమి, నెంత గలిగిన..." హంస. 3. 206.

కుడువ గూడును గట్టుకో గోక లేక

  • తిన తిండి, కట్ట బట్ట లేక అని వాడుక.
  • "కుడువ గూడును గట్టుకో గోక లేక, యితని కిల్లాలి నై యుండ నేల యనుచు." శుక. 2. 365.

కుడువ నిచ్చు

  • భోజనం పెట్టుటకు ఒప్పు కొను
  • "....తనబానసంబు వానిం బిలిచి యే నొక్క బ్రాహ్మణునకుం గుడువ నిచ్చి మఱచి యుండితిం జెచ్చెఱ నవ్విప్రునకు మాంసంబుతో గుడువంబెట్టు మని పంచిన." భార. ఆది. 7. 115.

కుడువబెట్టి కంచ మాఱడి గొను

  • నోటిముందరి అన్నము తీయు. అన్నం పెట్టి కంచం తీసి వేయుట అంతే కదా.
  • "అతడు మంత్రశక్తి నసిబోయె గాక కా,కున్న మృత్యుబాధ నొందకున్నె, కాన గుడువ బెట్టి కంచ మాఱడి గొను, కంటె మిగుల బాతకంబు లేదు." భోజ. 6. 182.

కుడువబెట్టు

  • విం దిచ్చు.
  • "అవ్విప్రునకు మాంసముతో గుడువ బెట్టు మని పంచిన." భార. ఆది. 7. 115.

కుతకుతలాడు

  • 1. ఉడుకు.
  • "అన్నం కుతకుతలాడుతూ ఉంది." వా.
  • 2. కోపించు.
  • "అత నే మలా కుతకుతలాడు తున్నాడు?" వా.
  • 3. కళవళపడు.
  • "నా మనసు కుతకుతలాడుతూ ఉంది." వా.

కుతికంటు

  • కంటె.
  • "కుతికంటు సరిపెణ గుండ్లపేరు." హంస. 2. 190.

కుతికిలపడు

  • కూలబడు. మను. 4. 27.

కుతిల కుడుచు

  • కుతిలపడు; దు:ఖపడు.
  • "కొండల తిమ్మని జూచి లోలో కుతిల కుడుప నేటికే." తాళ్ల. సం. 12. 82.
  • "ఊళ్ళ వెంబడి దేవర, గుళ్ళపంచల జేరి గుతిల కుడిచి." హరి. 4. 191. కుతి____కుత్తు 492 కుత్తు____కుది

కుతిలగొను

  • బాధపడు.
  • "దైత్య రాజతనయ, దొడరి దేవయాని ద్రోపించె వలువీక, క్రుంగి నూతిలోన గుతిలగొనగ." భాగ. 9 స్కం. 523.

కుతిలపడు

  • దు:ఖపడు.
  • "కుష్ఠామయంబున గుతిలపడగ." శివ. 4. 78.
  • "కుతిలపడు నతండు గువ్వకుత్తుక తోడన్." పాండు. 3. 20.

కుతిలపఱుచు

  • ఇక్కట్టు పెట్టు; బాధ పెట్టు.
  • "కుతిలపఱుపరె నృపుబంట్లు గుదెల వారు." కాశీ. 5. 289.

కుతిలపాటు

  • బాధ.

కుతిల పెట్టు

  • బాధ పెట్టు.
  • "...అరాజకత్వ, దోషజాత మైన దురితబాహుళ్యంబు, కుతిలవెట్టి భూమి యతలమునకు, బోవ." భార. శాం. 2. 89.
  • రూ. కుతిలవెట్టు.

కుత్తుకంటు

  • కంటె. రా. వి. 1. 62.

కుత్తుకబంటి నీరు

  • కుత్తుక మునుగు దాక ఉన్న నీరు. నీటిలోతు చెప్పుటలో - మోకాలి బంటి (లోతు) మొలబంటి (లోతు) అంటారు.
  • "నిండు మనంబుతో విజితనీరధి గుత్తుకబంటి నీటితో, నుండి." కా. మా. 1. 131.

కుత్తుక విసము, నాలుక బెల్లము

  • గోముఖవ్యాఘ్రము లాంటి పలుకుబడి.
  • "కైరవాప్తకళంకంబు పేర విషము, లోన జీర్ణించి యుండ బైపైని చంద్రి,కలు వెలిగించెదవు కుత్తుకను విసంబు, నాలుకను బెల్లమును గాదె పాలసునకు." కవిరా. 3.

కుత్స సేయు

  • అసహ్యించుకొను, నిందించు.
  • "జీవితేశ్వరుడు డించిన యోగిరంబులు కుత్స సేయక భుక్తి గొనుట తగవు." కాశీ. 2. 75.

కుదికిలబడు

  • చదికిల బడు.

కుదిమట్టంగా

  • లావుకు తగినయెత్తు కలిగి.
  • "ఆ పిల్ల అంత పొడుగూ కాదు. అంత పొట్టీ కాదు. కుదిమట్టంగా ఉంటుంది." వా.
  • చూ. కుఱుమట్టము.

కుదియ గట్టు

  • ఒకటిగా కట్టు.
    కూటశాల్మలులందు గుదియ గట్టగ లేదు." రుక్మాం. 2. 22.

కుదియ బట్టు

  • గట్టిగా పట్టు; వెనుకకు లాగి పట్టు.
  • "వాహకుల్, పరిపరిలాగులం గుదియ బట్టుచు రా." జైమి. 2. 15.
  • "పగ్గముల్ కుదియబట్టి." జైమి. 3. 111. కుది____కుదు 493 కుదు____కుదు

కుదియబడు

  • వెనుకంజ వేయు; కృశించు.
  • "చిందముల కోలాహలములకు గుదియ బడక." భార. విరా. 4. 62.
  • "దేహంబు.....కుదియబడగ." దశా. 2. 139.

కుదిలపడు

  • చూ. కుతిలపడు.

కుదిలపఱుచు

  • బాధ పెట్టు, నొప్పించు.
  • "కూలికై న న్నిట్లు కుదిలపఱుచు చున్నారు." పరమ. 5. 48.

కుదుకనగోలు గైకొను

  • చెల్లు వేసికొను.
  • "ఇక నైన,కుదుకనగోలు గైకొనక నా ధనము, వదులుము." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1285.
  • వంచించు అని వావిళ్ళ. ని.

కుదుటపడు

  • ఊరట చెందు; ఒక స్థిమితమునకు వచ్చు.
  • "ఎన్ని కష్టాలు పడ్డా వాళ్ల కుటుంబం ఈనాటికి కొంత కుదుటపడింది." వా.

కుదురుకొను

  • 1. నెలకొను కవిక. 2. 61.
  • 2. స్థిరపడు.
  • "శివుడు చటులవిషాగ్నిం, గుదురుకొన గంఠబిలమున, బదిలంబుగ నిలిపె." భాగ. 8. 245.
  • "ఆ ఊళ్లో వా డింకా కుదురుకో లేదు." వా.

కుదురుకొల్పు

  • నెలకొల్పు.
  • "....గుబ్బ చన్నుల మీద గుదురు కొల్పి." క్రీడా. పు. 45.
  • స్థిరముగా నిలుపు.
  • "కురుకులంబున సత్కీర్తి గుదురు కొల్పు." జైమి. 1. 61.
  • ఇది 'పాదుకొలుపు' వంటిది.
  • కుదురు = పాదు.

కుదురుగా కూర్చుండు

  • స్థిరముగా కూర్చొను.
  • "నిశ్చలతం,గడు గుదు రై కూర్చుండుట, పుడమిన్ వీరాసనాఖ్య బొలుచు మహాత్మా!" కళా. 5. 162.

కుదురు చేయు

  • పాది చేయు, ఆలవాలమును ఒనర్చు.
  • "తాన కుదురు చేసి, వలయుబీజము లెల్ల మొలవ బెట్టి..." కుమా. 7. 19.

కుదురుపట్టు

  • పంటికుదుళ్లు.
  • "కుదురుప ట్టెడలి లివలివం గదలురదన పంక్తులును." కవిక. 5. 110.

కుదురుపడు

  • నెలకొను; స్థిరపడు; నిలుచు.
  • "మత్పాదభక్తి యాత్మను జనించిన మాత్ర జ్ఞానంబు గుదురుపడును." దశా. 1. 222.

కుదురు పఱుచు

  • కుదురుపడునట్లు చేయు.
  • "కీలుగొప్పున బైడి గేదంగిఱేకులు, గొనలు గానంగ రా గుదురుపఱచి." శృం. నైష. 8. 112. కుదు____కుప్ప 494 కుప్ప___కుప్ప

కుదురుపాటు

  • స్థిరత.
  • "వాని తండ్రికిం, బట్టము గట్టి యా కుదురుపా టవునంతకు నిల్చి." రాధ. 3. 52.

కుదువ పెట్టు

  • తాకట్టు పెట్టు.
  • ఇది రాయలసీమలో నేటికీ వినవచ్చే పలుకుబడి.
  • "విత్తంబు చాలని విభవంబు కొఱ గాదు, కుదువపెట్టగ రాదు కుందనంబు." రామలిం. 46.
  • "అప్పటి కిప్పుడు అల్లు డొచ్చా డని కంటె కుదువబెట్టి ఇరవై రూపాయలు తెస్తిని." వా.

కునికిపాట్లు పడు

  • తూగు, పని లేక ఉండు.
  • "ఆఫీసులో కూర్చునే వాడు కునికిపాట్లు పడుతూంటాడు." వా.

కునుకు పట్టు

  • నిద్ర పట్టు.
  • "కునుకు పట్టిన జుట్టుకొను దవాగ్ని." రామలిం.
  • "రాత్రంతా దోమలతో కునుకు పట్ట లేదు." వా.

కుప్ప కూలు

  • కుప్పగా కూలిపోవు.
  • "నిలువున కుప్ప లై కూలినట్లును." కవిక. 2. 197.

కుప్పకోలుగొను

  • ఎక్కు వగు.
  • "ఆర్తరవంబులు కుప్ప కోలుకొన." హరి. 3. 61. బ్రౌన్.

కుప్పగూరగా

  • 1. ఛిన్నాభిన్నముగా.
  • "ఎడగని యబ్బలంబు గడు నేడ్తెఱ గిట్టి మహాస్త్రశస్త్రముల్, గడు వడి గుప్పగూరగ జలంబున బై దొరగింప..." భార. ద్రోణ. 3. 152.
  • 2. కుప్పలుకుప్పలుగా.
  • "మదీయబాణంబుల గుప్ప గూర బఱపి." భార. భీష్మ. 3. 335. భోజ. 7.
  • రూ. కుప్పనగూరలుగా.

కుప్పగూరగా పడు

  • కుప్ప గూలబడు.
  • "కోపించినన్ గుప్పగూరగా బడియె, నా పాపమతి భస్మ మై." వర. రా. అర. పు. 38. పంక్తి. 9.

కుప్ప గూల్చు

  • కుప్పలుగా పడగొట్టు.
  • "కుప్ప గూల్చె నిశాచరకోటి నపుడు." భాస్క. రా. యు. 1965.

కుప్ప చిచ్చిడి పేలాలు కొఱకు

  • కొద్దిపాటి స్వలాభం కోసం ఇతరులకు అనంతంగా నష్టము కలిగించు.
  • తనకు కావలసినవి నాలుగు పేలాల గింజలు. వానికోసమై ధాన్యం కుప్ప కే నిప్పు పెట్టేవా డనుట.
  • పరమనీచు డనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • పేలాలకోస మని వామికే నిప్పు పెట్టేవా డంతే కదా! కుప్ప____కుప్ప 495 కుప్ప____కుప్ప
  • "తలచు బ్రహ్మస్వదేవస్వములకు నెగ్గు, కుప్ప జిచ్చిడి పేలాలు కొఱుక దివురు, గ్రహణకాలంబునందు మున్గడు జలముల, సెబ్ర చెంచడ మా బ్రాహ్మణ బ్రువుండు." పాండు. 4. 196.
  • చూ. గడ్డం కాలుతూంటే చుట్ట ముట్టించు కొన్నట్టు.

కుప్పతెప్పలుగా

  • సమృద్ధిగా, ధారాళంగా.
  • "కప్పురపు గంది వనిలోన గలయ మెలగు, గప్పురపు టింటి బోదెల నుప్పతిల్లి, కుప్పతెప్పలుగా రాలు కప్పురంబు." మృ. వి. 2. 15.
  • "ఆ ఊళ్లో వంకాయలు కుప్ప తెప్పలుగా దొరుకుతాయి." వా.
  • చూ. కుప్పలు తెప్పలుగా.
  • రూ. కుప్పతిప్పలుగా.

కుప్పనగూర

  • చూ. కుప్పగూరగా.

కుప్పన గూరు

  • కుప్పగా కూలు.
  • ధ్వన్యనుకరణము.
  • "కయిసేయు తెఱం గయథాతథంబుగా, గుప్పన గూరి యొండొరుల గూడక." పారి. 3. 11.

కుప్పనూర్పులు

  • మహసూలు, పంట రాల్చుకునే కాలం.
  • "కుప్పనూర్పిళ్ల కాలంలో కూలీలకు మహా గిరాకీ." వా.

కుప్పలు గట్టు

  • కుప్పలు పడు.
  • "కుండల చారు మస్తములు కుప్పలు గట్టె పురంబువీథులన్." కేయూర. 2. 116.

కుప్పలుగా గురియు

  • ఎక్కువగా కురియు.
  • "హృదయము జిల్లని కుప్పలుగా గురిసీ జెమ్మటా." తాళ్ల. సం. 4. 179.

కుప్పలు గొను

  • కుప్పలు పడు.
  • "కుప్పలు గొన జల్లు పుప్పొడి యెరువుగా, బొరిబొరి విరహాగ్ని బొగుల జొచ్చె." ద్వాద. 5. 130.
  • "కుప్పలు గొను విక్రమార్కు గుణములకొఱకై." సంహా. 1. 31.

కుప్పలు తెప్పలుగా

  • చూ. కుప్ప తెప్పలుగా.

కుప్పలు పడు

  • గుంపులుగా చేరు; కుప్పలుగా పడు.
  • "ఏమిటికి నిక నిచటన్, గుప్పలు వడి నిలువగ." వరాహ. 10. 34.

కుప్పలో మాణిక్యము

  • చెడు పరిసరాల్లో ఉన్న మంచి వస్తువునో, మనిషినో గూర్చి చెప్పేటప్పుడు అనే మాట.
  • "ఆ పాడుకొంపలో అంతా రాక్షసులే. కుప్పలో మాణిక్యంలో ఆ పిల్ల ఒకటీ పుట్టింది." వా.

కుప్పవడు

  • కూలబడు; రాసులు పడు.
  • "కాళ్ళు కుప్పవడగ గదల జాలక." దశా. 4. 45.
  • "ధర బ్రేగులు గుప్పవడగ." చంద్రా. 2. 94. కుప్పి____కుమ్మ 496 కుమ్మ____కుమ్మి

కుప్పిగంతులు

  • చిన్న చిన్న గంతులు.
  • "ఇది తగు దగ దనక కళా, విదులకు నీసమ్ముఖమున విద్యల యెఱుకం, బొద వెట్టుట హనుమంతుని, యెదుర వెసం గుప్పిగంతు లెగయుట చుమ్మీ!" ద్వా. 2. 49.

కుప్పెకోల

  • ఒక రకమైన బాణము. భార. భీష్మ. 2. 393.

కుబుసములో చే మగుడ్చు చందమున

  • జేబులో నుండి డబ్బు తీసుకొన్నట్టుగా.
  • మీ రెప్పు డైనా నా బాకీని వసూలు చేసుకోవచ్చు ననుట.
  • "కుబుసంబులో జేమగుడ్చుచందమున నచ్చుగా దీర్తు మీ యప్పని కొన్ని, యచ్చిక బుచ్చిక లాడి." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 634-36.
  • 'మీ జేబులో ఉన్నట్లే అనుకోండి' అనడం నేటి వాడుక.

కుమ్మక్కు చేయు

  • ప్రోత్సహించు; వత్తాసివచ్చు.
  • "ఆ దొంగకు వీడు కుమ్మక్కు చేస్తేనే ఇంత పని అయింది." వా.
  • రూ. కుమ్మకు...

కుమ్మరావమున రాగి ముంత లేరు

  • లేని చోట ఆ వస్తువుకై వెదకు. వ్యర్థశ్రమ అనుట.
  • "మీ వంశమందు దా కోర్వ జాలు, వారి జూపుము కుమ్మరావమున రాగి, ముంత లేఱంగ గలవె." ఉ. హరి. 3. 48.

కుమ్మరి కొకయేడు గుది కొక పెట్టు

  • నిర్మించుటకు పట్టినంత కాలము ధ్వంసము చేయుటకు పట్టదు - అనుట.
  • "ఇది పెక్కేడులు పట్టెన్, సదనంబులు గట్టి నాకు శంభునికొఱకున్, దుది గుమ్మరి కొక యేడును, గుదికొక పెట్టన్నమాటకున్ సరి వచ్చెన్." కా. మా. 2. 100.

కుమ్మరిగుంట

  • బురదగుంట. సుమతి. 12.

కుమ్మరిసారె యగు

  • గిరగిర తిరుగు.
  • "....చేతము కుమ్మరిసారె యయ్యెడున్." ముద్రా. 67.

కుమ్మఱించు

  • నీరు పారబోసినట్లు, తొలగించి వేయు-తెగనాడు, విడనాడు అని భావార్థం.
  • "గురుభక్తదేవుని గ్రుమ్మఱించితివొ." పండితా. ద్వితీ. మహి. పుట. 215.

కుమ్మి కూరాకు సేయు

  • నురుమాడు.
  • పట్టి పాలార్చు వంటిది.
  • కూరాకు (కూర) వలె మెత్తగా మెదుపు. కుమ్ము____కుమ్ము 497 కుమ్ము____కుయి
  • కూర అనే అర్థంలో 'కూరాకు' అనడం రాయలసీమలో నేటికీ కొన్నివర్గాలలో విశేషంగా వినవస్తుంది.
  • "పులుల జట్టలు చీరి దుప్పులను లేళ్ల, నేకలమ్ముల గ్రుమ్మి కూరాకు సేసి, యమర జమరుల బట్టి పాలార్తు మిపుడు, సామి! చూడుము నీ బంట్ల సత్తు వనుచు." సారం. 1. 90.

కుమ్ము గాచు

  • పిడకల మంటలో చలి కాచుకొను.
  • "అత్తయును గోడలును గుమ్ములాడు గుమ్ము, గాచు చోటికి మకర సంక్రాంతివేళ." శివరా. 4. 27.

కుమ్ము నెత్తిమీదికి తెచ్చుకొను

  • అనవసరంగా కొట్లాట తెచ్చుకొను.
  • "అనవసరంగా దానిలో సాక్ష్యం వేసి ఆ కుమ్మును నెత్తిమీదికి తెచ్చుకొన్నాను." వా.

కుమ్ములాడు

  • కలహించు, వాదించు.
  • ఎద్దులు క్రుమ్ములాడుటపై వచ్చిన పలుకుబడి.
  • సంఘర్షణపడు అని తాత్పర్యం.
  • "....క్రమ్మఱం, గ్రమ్మలు మూయు మన్మథవికారము ధైర్యము గ్రుమ్ము లాడగన్." కళా. 2. 22.

కుమ్ముసుద్ది.

  • గుట్టు. బ్రౌన్.

కుమ్ముసుద్దులకు దిగు

  • వారిమీదా వీరిమీదా ఏదో కబుర్లు చెప్పుకొను.
  • "తునితగవుకు వారితోడను మఱేమి, కుమ్ముసుద్దుల దిగక యీకొమ్ము పొమ్ము." నందక. 71. పు.

కుమ్మెలు వోవు

  • గంట్లుపడు, నలుగు.
  • "కుమ్మెలువోవ నొక్కి చెలి క్రోలిన తేనియ కావిమోవితో." తారా. 4. 169.
  • "బిగువు కౌగిళ్ళచే బ్రియు బాహు పురు లొత్తి, కుమ్మెలు వోయినకుచ తటములు." ప్రభా. 5. 62.

కుయిపోవు

  • ఆర్తరక్షణకై పోవు.
  • కుయ్యి ఇడగా పోవు అనుట.
  • "పసులకై కుయి వోయి." రుక్మాం. 2. 101.
  • "కురు నాథుండు...ఉత్తరంబునం బసులం బట్టిన నతండు బృహన్నల సారథింగా గైకొని యొక్కరుండ కుయివోవుట విని..." భార. విరా. 5. 233.
  • రూ. కుయివోవు.

కుయి రేగు

  • అఱచు, గుంపు కూడు.
  • "నెలకొన సురియలు గొని చని, పొలియునొ? యూర గుయి రేగి పొడుచునొ? చెపుమా!" ఆము. 3. 43.

కుయివెట్టు

  • మొఱపెట్టు.
  • "కుయి వెట్టన్ వెళ్లు శూన్యోరుకూప వితానం బన." ఆము. 2. 48.
  • చూ. కుయ్యిడు. కుయి____కురు 498 కురు____కుఱు

కుయి వోవు

  • ఆర్తరక్షణకై పోవు; విడిపింప బోవు.
  • "చేరి తమ వూరి వారి చెఱపట్టుకొని పోతే, కోరి కుయివోయి తెచ్చు కొన్నట్టు." తాళ్ల. సం. 6. 5.
  • చూ. కుయిపోవు.

కుయ్యిడు.

  • మొఱ లిడు.
  • చూ. కుయివెట్టు.

కుయ్యో మొఱ్ఱో అను

  • మొఱపెట్టు, కొట్టుకొను.
  • "ఇయ్యసురులచే జిక్కితి, మెయ్యది తెరు వెందు జొత్తు మిటు వొలయ గదే, అయ్యా దేవ జనార్దన, కుయ్యో మొఱ్ఱో యటంచు గుయ్యిడి రమరుల్." భాగ. 8. 338.

కురుక్షేత్ర మగు

  • రణరంగ మగు; కలహరంగ మగు.
  • "వాడూ వీడూ చేరగానే ఆ యిల్లు కురుక్షేత్ర మయి పోయింది." వా.

కురులు కూకటి తోడ కూడని ప్రాయము

  • బాల్యము.
  • "కురులు కూకటితోడం గూడియు గూడని చిన్నారి పొన్నారి ప్రాయంబునన్." రాజగో. 1. 13.
  • వెండ్రుకలు ముడి వేసుకొనుటకో, జడ వేసుకొనుటకో తగినంత పెరగని వయ స్సనుట.

కురులు కూడనినాడు

  • చిన్న తనములో.
  • "కురులు గూడనినాడె మరులుకొన్న దాని, సరగ కౌగిట జేర్చి చక్కెర మోవి యాని." హేమా. పు. 51.

కురులు తీర్చు

  • తల దువ్వుకొని ముడి వేసుకొను; జడ వేసుకొను.
  • "కమ్మనూనియ మెఱు గెక్క గలయ దువ్వి, కురులు దీర్పకయును గచభరము లింత, పొలుచునే." కుమా. 6. 52.

కురువులు వారు

  • క్రే ళ్లుఱుకు.
  • "....గౌరి ముందరన్, గురువులు వారు వ్రేగడుపు కుర్రడు మాకు బ్రసన్ను డయ్యెడున్." వీర. 1. 5.

కుఱకుఱ.....

  • చిన్న చిన్న.
  • "కుఱకుఱ వేలుపుదెఱవల, జెఱవట్టిన యటులె." అచ్చ. సుం. 5. 0.
  • "పఱ తెంచి వనము వెఱుకుట, కుఱకుఱ రక్కసుల నొక్క కొందఱ గేలన్, విఱుచుట." రామా. 6. 234.

కుఱుకుఱు గొను

  • ప్రో గగు.
  • "గొడుగుల పఱయలు గుఱుకుఱు గొనుటన్." భార. స్త్రీ. 2. 3.

కుఱుకులు గట్టు

  • రాశిపడు (?)
  • "కుఱుకుల్ గట్టె భటాంగముల్...." భార. ద్రో. 4. 83.

కుఱుచ కావించు

  • కించపఱచు. కుఱు____కుఱు 499 కుఱు____కుల
  • "వింతే యీబుడు తెంత న న్గుఱుచ గావింపం దను న్మెత్తురే?" ఆము. 7. 45.

కుఱుచ చేయు

  • అవమానించు; కించపఱచు.
  • "నను గుఱుచగ జేసె నరనాథు డనిన." రంగ. రా. ఉత్త. 132 పు.

కుఱుచ పఱుచు

  • చిన్న బఱచు, తక్కువ చేయు.
  • "బుధోక్తి గుఱుచపఱిచెదే." కాళిం. 6. 93.
  • చూ. కొంచెపఱచు.

కుఱుచలు ద్రొక్కు

  • చలించు, ఆడు.
  • "హారముల్, గుఱుచలు ద్రొక్క ముంగురులు క్రొంజెమటన్ బద నెక్క వేలుపుం, దెఱవ యొకర్తు..." వసు. 5. 75.

కుఱుచ సేయు

  • కించపఱచు.
  • "నీవును నా పలుకులు కుఱుచ సేయక...." భార. విరా. 4. 29.
  • చూ. కుఱుచ కావించు.

కుఱుబోడతల

  • అక్కడక్కడ వెంట్రుక లుండి మిగతభాగం నున్నగా ఉన్న బట్టతల.
  • "పై, బుతపుత మంచు నున్న కుఱు బోడతలన్ ధరియింప నోడియున్." పాండు. 2. 64.
  • చూ. కుఱుమాసిన గడ్డం. కుఱుమాపు చేల.

కుఱుమట్టము

  • కుదిమట్టము.
  • "కుఱుమట్టం బైనతోకం గొని...." వరాహ. 12. 32.
  • కుదిమట్ట మనే నేటి వాడుకలో రూపం.
  • చూ. కుదిమట్టము.

కుఱుమాపు

  • కొంచెముగా మాసినది.
  • కుఱుమాపు చేల, కుఱుమాపు గడ్డము ఇత్యాదులు దీనిమీది ఏర్పడినవే.
  • "మాసిన దీర్ఘ వేణి కుఱుమాపిన చేల చెఱం గలంక్రియా, వాసము గాని మేను వసివాడిన ముద్దు మొగంబు గాంచి." శుక. 1. 214.
  • "కుఱుమాపు దడిమంపు గోకలో దొలకెడు, కంపమాననితంబ కాంతి సొంపు." కళా. 4. 108.
  • చూ. కుఱుమాపుడు.
  • కుట్ట్రు - తమి.
  • కుఱుచ - తెలుగు.

కుఱుమాపుడు

  • కొద్దిగా మాసినది.
  • "కుఱుమాపుడు పుట్టం బలవడ గట్టి." భార. విరా. 1. 291. నైష. 7. 141.
  • చూ. కుఱుమాపు.

కుల కుల కూయు

  • గోడు గోడున నేడ్చు.
  • ధ్వన్యనుకరణము.
  • "కుల కుల కూసిరి కుతిలపడిరి." హర. 3. 10.

కులకులలాడు

  • పురుగులు వగైరా నిండుగా ఉండు. కుల____కుల 500 కుల____కుసం
  • "పేలు కులకులలాడుతున్నవి." వావిళ్ళ ని.

కులతప్పు

  • కులాచారవిరుద్ధ మైనపని. అందుకై విధించిన శిక్ష.
  • "వాళ్లింటికి కులతప్పు వేశారు. అందుకని కులస్థు లెవ్వరూ వెళ్లడం లేదు." వా.

కులపతి

  • ఆశ్రమవాసి యై శిష్యులకు తానే తిండి పెట్టి చదువు నేర్పే ఋషి. ఆ శిష్యులు పదివేలమంది ఉండవలెను.

కులపర్వతం

  • ఏడు ప్రధానపర్వతా లున్నవని పురాణాలు. అవే కులపర్వతాలు.

కులముకట్టు

  • కులాచారనిబంధనలు.
  • "ఎఱికలవాళ్లకు కులంకట్టు చాలా ముఖ్యం." వా.

కులము లేని

  • కులము గోల్పోయిన; చెడిన.
  • "వా డంత మంచికులంలో పుట్టి ఆకులం లేనిదాన్ని పెళ్లి చేసుకొని పాడయి పోయాడు." వా.

కులవిద్య

  • అనూచానంగా వస్తున్న కులవృత్తి.
  • "కులవిద్యకు దీటు లేదు గువ్వల చెన్నా!" గువ్వలచెన్న. 10.

కులస్థులు

  • ఒక కులానికి చెందినవారు.
  • "నలుగురు కులస్థులు ఉన్న ఊళ్లో ఉంటే శుభ మైనా అశుభ మైనా బాధ ఉండదు." వా.

కులిరుగొను

  • చల్ల వడు.
  • కన్నడం : కుళిర్.
  • "కొలవేళులు నెల దూడులు, దలిరులు నీహారవారి దడిపి నయమునన్, గులిరుగొన మేన నొత్తిరి, లలనలు పార్వతికి శీతలక్రియ లలరన్." కుమా. 5. 149.

కులుకుప్రాయము

  • యౌవనము.
  • "కులుకు బ్రాయంపు నూనూగు గొదమయెండ." కాశీ. 1. 123.
  • "అమ్మకు కులుకుప్రాయము, అయ్యకు వణుకుప్రాయము." సా.

కులుకులాడి

  • వగలాడి.
  • "వలపు గులికెడు సింగార మొలుక ముద్దు, జిలుకకడ నిల్చె గోమటి కులుకులాడి." శుక. 1. 237.
  • రూ. కుల్కులాడి.

కువలువడు

  • కుప్ప కూలు.
  • "వా, సవి వాని రథంబు రథ్య సారథుల మహిన్, గువలువడ నేసె." భార. ఆది. 6. 83.

కుసంది

  • ఇఱుకు. కాశీయా. పు. 25. కుసి___కూక 501 కూక___కూక

కుసిగుంపు ఒనరించు

  • బాధించు. (?)
  • "రుసివంటి దాన న న్నీ, కుసిగుం పొనరించి యేమి గుడిచెదు." వేం. పంచ. 1. 252.

కుసిగుంపు నడకలు

  • వగల నడకలు.
  • "కుసిగుంపు నడకల కోడె బాపతలు, అసమానగతి వచ్చి..." అమ. క. 5. 232 పుట.

కుసుమ వెట్టు

  • ఎఱ్ఱపడ జేయు.
  • "కొదమ తుమ్మెద కడఱెక్క గుసుమ వెట్టి." శృం. నైష. 8. 5.
  • కుసుంభమీద వచ్చినకుసుమ.

కుళ్లు కువాడము

  • కౌటిల్యము.
  • "వా డేమాత్రం కుళ్ళూ కువాడం లేని మనిషి." వా.
  • రూ. కుళ్ళూ కువ్వాడం.

కుళ్లుకొను

  • ఒకరి మేలు చూచి ఏడ్చు.
  • "నీ వేదో బాగున్నా వని వాడు కుళ్ళుకుంటున్నాడు." వా.

కుళ్లుబోతు

  • అసూయాపరుడు.
  • "ఆ కుళ్లుబోతు వెధవ ఎవరి కేం మేలు కలిగినా చూడ లేడు." వా.
  • దు:ఖశీలుడు అని... బ్రౌన్; శ. ర.

కూకటిదుంపలతో

  • సమూలముగా.
  • "నీ, కుదురు నశింప జేయు జుమి కూకటిదుంపలతోడ మూర్ఖుడా!" శతా. 40.
  • చూ. కూకటివేళ్లతో పెఱుకు.

కూకటివేరు

  • ఆధారభూతము.
  • చెట్లకు పొడుగాటిపెద్ద వేరు కాక, చిన్న చిన్న వేరులు కుచ్చుగా ఉంటాయి. కూకటి (వెంట్రుకలు) వలె ఉండుటనుబట్టే, ఆ పేరు పెట్టిరి కావచ్చును. కూకటివేళ్ళతో పెళ్ళగించు అన్నప్పుడు పూర్తిగా అని అర్థం.
  • "...వరుప్రసన్నత యాలవాలం బనంగ బొనరు పర్వత పూర్వపుణ్య దేహంబు...కూకటి వేరుగాగ." పండితా. ద్వితీ. పర్వ. పుట. 236.
  • "కూకటి,వే ళ్లుండన్ ముసిడికొనలు విఱుచుట గాదే." ప్రబోధ. 4. 3.

కూకటివేళ్లతో పెఱుకు

  • సమూలముగా నిర్మూలించు.
  • "కాక నెదిర్చి సంగర ముఖంబున హెచ్చిన రాజవంశమున్, గూకటి వేళ్లతో బెఱికి." జైమి. 1. 64.
  • చూ. కూకటిదుంపలతో.

కూకటుల్ కొలుచు

  • ఈడు జోడు చూచు.
  • "యౌవనమందుయజ్వయుధ నాఢ్యుడు నై కమనీయకౌతుక, శ్రీవిధి గూకటుల్ గొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌ,ఖ్యావహ యై భజింప...." మను. 1. 53. కూక____కూకు 502 కూగె____కూచి

కూక పెట్టు

  • కూతవేటుదూరం.
  • "దాని, చెట్టులకు నెల్ల నర గూకపెట్టు పొడువు." వరాహ. 10. 126.

కూక లిడు

  • 1. తిట్టు.
  • "పాంథజనుల, గూక లిడె నన గోకిలల్ కూత లిడియె." శ్రవ. 2. 64.
  • 2. కూత వేయు.
  • "తలిరుబోడుల డెందముల్ తల్లడిల్ల, గూక లిడుకొంచు నంతయు గోఱలేక, యాగడంబున బురి విచ్చి యాడె దేమి." నీలా. 3. 27.
  • 3. అల్లరి చేయు.
  • "నా కొడుకును నా కోడలు, నేకతమున బెనగ బాము నీతడు వైనం, గోక లెఱుంగక పాఱిన, గూకలిడెన్ నీ సుతుండు గుణమె గుణాఢ్యా!" భాగ. స్కం. 10. పూ. 325.

కూకలు వెట్టు

  • కూత వేయు.

కూకలు వేయు

  • అఱచు; తిట్టు, దండించు.
  • "ఆ! వా డన్నదానికి ఇంత గొడవెందుకు? నేను పిలిచి కూకలు వేసి పంపిస్తాను." వా.

కూకవెట్టు

  • ఒకరకమైన పాము. వావిళ్ళ ని.

కూకులు వత్తులు నగు

  • నలిగి నల్లే రగు.
  • ఎక్కువ కలత చందు అనుట.
  • "అక్కొండొకబ్రహ్మచారి మది గూకులు వత్తులు నై యసద్గతిన్." పాండు. 5. 244.
  • "రోమపుంగుమ్మెల బార్శ్వభూజములు కూకులువత్తులుగా." వేం. పంచ. 2. 105.
  • "చిలువదళవాయు లప్పుడు...కూ,కులువత్తులు నై మొనతల, నిలువక శేషాహికడకు నెఱి చెడి పాఱన్." జైమి. 7. 102.
  • కూకుడువత్తులు అని బ్రౌను గ్రహించిగాలిలో తేలియాడు సాలెపురుగు నేసిన దారాలు అన్న అర్థం చెప్పి అతితేలిక యగు అన్న భావార్థం చెప్పాడు. ఇది యింకా ఏ మూల నైనా వాడుకలో ఉన్న దేమో పరిశీలించవలసి ఉన్నది. ఏమయినా 'వాడి వత్తలగు' లాంటి పద మని భావార్థం చెప్పుకోవడం కంటె యిలాంటి పద మొకటి ఉండనే ఉంటే మెఱు గని వేఱే చెప్ప నవసరం లేదు.

కూగెంట

  • కూతవేటు దూరమున కొకచోట.
  • "కూగెంట నొక్కొక్క కూటంబు గలదు." పండితా. ద్వితీ. పర్వ. పుట. 480.
  • చూ. చేతెంట.

కూచి సేయు

  • దండెత్తు. కూచీ____కూటి 503 కూటి____కూటి
  • "కూచి సేయింపగా జూచె నందమొ యేల, చైద్యు డెఱుంగడే శార్జ్గ తిలక." చంద్ర. 5. 125.

కూచీ చేయు

  • దండెత్తు.
  • "ఆ రాజు కూ,చీ చేయించి సమంచి తాత్మ బలవత్సేనా సమేతంబుగా." రంగా. 2. 59.

కూటసాక్ష్యం

  • తప్పుడుసాక్ష్యం.
  • "కూట సాక్ష్యాలు చెప్తే అందరూ అలాగే బతకొచ్చు." వా.

కూటికుండల చేటు

  • తిండి చేటు. నా. మా. 87.

కూటిచవి తేల్చు

  • అన్నము పెట్టు, అన్నము రుచి చూపు.
  • "తరిగొండ వెన్నుపై దాల్చి వేల్పుల గూటి, చవి దేల్చినట్టి కచ్ఛపమ వీవ." పారి. 1. 49.

కూటినీళ్లు

  • అన్నం కొద్దిగా వేసి ఉంచిన నీళ్లు.
  • "కూటినీళ్లు తాగి వెడితే మధ్యాహ్నం దాకా కూలీలు పని చేస్తారు." వా.

కూటిపేద

  • నిఱుపేద, కూటికి లేనివాడు.
  • "పడమర వెట్టు నయ్యుడుకు ప్రాశన మొల్లక కూటి పేద వై, బడలిక నుండు..." ఆ ము. 2. 49.

కూటిపేద తోడు తప్పినట్లు

  • కూటిపేద మఱొక పేదవాని తోడును సహించ లేడు. యాచకునికి యాచకుడు శత్రువు కదా! అలా జత వదలినట్లు.
  • "అనుడు నొకింత నవ్వి థరామరుండు, కువలయాధీశ! చాల్చాలు గూటిపేద, తోడు దప్పినజాడ సిద్ధుండు చనిన, గాన గాచినవెన్నెల గాదె బ్రదుకు." సుదక్షి. 2. 74.

కూటి ప్రొద్దు

  • భోజనవేళ.
  • ఇట్లా యేర్పడినవే అంబటి ప్రొద్దు, అంబళ్లప్రొద్దు - ఇది మధ్యాహ్నభోజనవేళకే వర్తిస్తుంది.
  • "దిటమున రెడ్డి పాటుబడి తెచ్చి యిడం గను గూటిప్రొద్దు సం,కటి తఱి వెన్న మజ్జిగలు కంకటిపై బవలింటి నిద్రలున్...." శుక. 2. 333.

కూటిప్రొద్దు సంకటి

  • వేళకు భోజనం.
  • "దిటమున రెడ్డి పాటుపడి తెచ్చి యిడం గను గూటిప్రొద్దు సంకటి..." శుక. 2. 333.
  • వాడుకలో వేళకు భోజనం అన్న రూపంలో ఉంటుంది.
  • "వాని కేం? అత్తవారి పుణ్యమా అని వేళకు భోజనం అమరుతూ ఉంది."
  • చూ. వేళకు భోజనం.

కూటిబీద

  • నిఱుపేద. కూటి____కూటు 504 కూటు___కూడ
  • కూటికి కూడ లేని వాడనుట.
  • "జారో,పాంతముల జేర్ప నాత డ, నంతవ్యథ గూటిబీద యై నెవ్వ గలన్." శుక. 3. 352.
  • దరిద్రుడు, అన్నాతురుడు. పాండు. 4. 158.
  • చూ. కూటిపేద.

కూటిలో మట్టి పోయు

  • జీవనాధారము పోగొట్టు. కూడు ప్రధానం గనుక అదే జీవనానికి సంకేత మయినది. అందులో మన్ను పోయడం అనుభవదూరం చేయడమే.
  • "నా కూటిలో మట్టి పోస్తే నీ కేం వస్తుంది? లేనిపోని వన్నీ కల్పించి నామీద అధికార్లతో చెబుతున్నా వని విని నీ దగ్గిరికి వచ్చాను." వా.

కూటివెచ్చము

  • తిండిఖర్చు.
  • "కూడినధన మెల్ల గూటివెచ్చంబు." గౌర. హరి. ప్రథ. పంక్తి. 1499.

కూటువమూక కూర్చు

  • వీరులను ఏరి కాక దొరికిన వారి నందరినీ సైన్యముగా ప్రోగు చేయు.
  • మందవేయు అనుట వంటిది.
  • "అడవుల గొండలం బడి మహాపద రూపఱి చన్నవారి ని,ప్పుడు కొనివచ్చి కృష్ణు డొకప్రోవుగ గూటువమూక గూర్చినన్..." భార. ఉద్యో. 2.

కూటువలు గూడు

  • గుంపు గూడు. రసిక. 6. 198.
  • చూ. కూటువలు గొను.

కూటువలు గొను

  • గుంపు కూడు.

'*"వీట గలచేడె లెల్లను....కూటువలు గొనుచు జూచిరి." భాగ. 10. పూ. 1248. కూటువసరులు

  • మాయముత్యాలు వగైరాల హారము.
  • "కాటుక చెదఱి కన్గవ నీరు జాఱ, గూటువ సరుల జిక్కువడ హారములు." పద్మ. 3. 21. బ్రౌన్.

కూడగట్టుకొను

  • తనతో వచ్చునట్లు చేసుకొను.
  • "ఊరిలోని పెద్ద లందఱినీ కూడగట్టుకుంటే కానీ, ఈ సత్రం మనం కట్టడం సాధ్యం కాదు." వా.
  • చూ. కూడదీసుకొను

కూడదీసుకొను

  • తమ కనుకూలముగా చేసుకొను.
  • చూ. కూడగట్టుకొను.

కూడ దెచ్చుకొను

  • కూడదీసుకొను; కుదుట పరచుకొను.
  • "వెండియున్, జిత్తము గూడ దెచ్చుకొను జెప్పక పో దని నిర్ణయించి డ,గ్గుత్తిక వెట్టి లక్ష్మణుడు...." నిర్వ. 7. 12. కూడ____కూడ 505 కూడ____కూడి

కూడ పోయు

  • కూడబెట్టు; రాశి పోయు.
  • "గోవిందనామ మొకటి కూడ పోసె బుణ్యములు." తాళ్ల. సం. 9. 8.

కూడబడు

  • కలిసికొను.
  • "ఏకాంత స్థలంబున దా రేవురును ద్రౌపదియును గూడబడునట్టి తెఱంగు సంఘటించి..." భార. విరా. 5. 305.
  • "తైజససృష్టికి, బరమాణుచయంబు గూడబడుచందమునన్." పాండు. 4. 30.

కూడ బలుకుకొను

  • ఒక్కమాటకు వచ్చు.
  • "మీ రిద్దరూ కూడబలుకుకొని వచ్చారా యేమిటి? ఒకే మాట మాట్లాడుతున్నారు." వా.

కూడబాఱు

  • కూడు.

కూడ బెట్టు

  • 1. దాచు; ధనం కూడబెట్టు.
  • "కట్టక కుడువక యొరులకు, బెట్టక తమ తండ్రి కూడబెట్టిన సిరి..." విక్ర. 2. 163.
  • 2. కలుపు.
  • "అని తనవంగడం బగుధ రాధిపమంత్రి పదాతివర్గముం, బనివడి గూడ బెట్టు." ఉత్త. హరి. 3. 5.
  • "ఈలుపు మాటవాసియుం, జుట్టఱికంబు బుణ్యమును సున్నగ మిన్నల గూడ బెట్టుచో." విప్ర. 3. 13.

కూడ ముట్టు

  • వెన్నంటు.
  • "తఱగని తూణముల్ ధనువు దాల్చి వరాహము గూడ ముట్టి." కా. మా. 4. 180.

కూడలిదారి

  • చౌకు. బ్రౌన్.

కూడలిపట్టు

  • రచ్చపట్టు. బ్రౌన్.

కూడలిఱాయి

  • హద్దురాయి. శ. ర.

కూడలివాయి

  • రెండుపంచలు కలిసిన మూలలో ఏర్పరచినట్టి దారి. శ. ర.

కూడా మాడా

  • కలిసి మెలిసి.
  • చూ. కూడిమూడి.

కూడి మాడి

  • కలసి మెలసి. జం.
  • "కొలిచెదము నిన్ను మే మెల్ల గూడి మాడి." హర. 2. 139.
  • నేటికీ వాడుకలో వాడూ నేనూ కూడా మాడా కలిసి తిరిగినాము అంటారు.
  • "తాను గుమార జంగమ సుధాకర మౌళియు గూడి మాడి యిం,పైన రతి ప్రసంగముల." కా. మా. 1. 42.
  • "ఇంట్లో ఎదిగినపిల్ల ఉంటే కూడా మాడా పని చేస్తుంది." వా. కూడి____కూడు 506 కూడు____కూడు

కూడిమాడి మెలగు

  • కలసి మెలసి తిరుగు.
  • "ఇన్నాళ్లు గూడిమాడి మెలంగన్." విప్ర. 4. 68.

కూడి యాడు

  • కలసి మెలసి తిరుగు.
  • "మం,దుల తాయెత్తులు గట్టినన్ శబర పుత్రుల్ గూడియాడన్ బురిన్." కా. మా. 3. 32.

కూడి వచ్చు

  • కలిసి వచ్చు.
  • "వాడు నాతో కూడి రాడు."
  • "పదివేలదాకా ఆ కంట్రాక్టులో వానికి కూడి వచ్చినవి." వావిళ్ళ ని.

కూడుకొను

  • కలిసికొను; సంభోగించు.
  • "విహీనుల గూడుకొంట...వలదు పతికి." ఆము. 4. 252.

....కూడుగా కుడుచు

  • అదే తిండిగా జీవించు.
  • ఇందులోని 'అది' పాపము, కౌటిల్యము ఇత్యాదు లేవయినా కావచ్చును.
  • "అటు గాన నెన్నిభంగుల, గుటిలత్వమ కూడు గాగ గుడుతురు మగవా, రిటువంటివారి మదిలో, నెటుగా నమ్ముదురు సతులు హితు లని పతులన్." విక్ర. 7. 131.
  • "ఉడుగక కపట మె కూడుగ, గుడువం దొడరి యునికి గలుకులు మగలు నెదం, జెడి విశ్వాస మ్మొరు లొరు, లెడ స్వైరవిహారసరణికే డిగిరి హరీ!" ఆశ్వినమా. 1. ఆ.

కూడు గుడుచు

  • నీచస్థితిని అనుభవించు.
  • "బిడ్డలకు బుద్ధి సెప్పని, గ్రుడ్డికి బిండంబు వండి కొని పొం డిదె పై బడ్డా డని భీముం డొఱ, గొడ్డెము లాడంగ గూడు గుడిచెద వధిపా!" భాగ. 1. స్కం.

కూడు గుడ్డకు రాని

  • ఎందుకూ పనికి రాని. రామచం. 69.

కూడు గుడ్డకు కొదవ లేదు

  • బాగానే ఉన్నవా డనుట.
  • "వాని కేం లక్షణంగా ఉన్నాడు. కూడు గుడ్డకు కొదవ లేదు. పిల్ల నిస్తే సుఖపడుతుంది." వా.

కూడుగూటిప్రాయము

  • చిన్న తనము.
  • "ఇసు మంత గాని లే డీ, పసిబాలుడు కూడుగూటిప్రాయమువా డి, ట్లెసరి బహుభక్ష్యరాసులు, మెసగెడి విసు వడు ప్రతుష్టి మేకొనడు గదే." పాండు. 4. 180.
  • పాఠాంతరం: చూ. కుడువకూటి...

కూడు గోకయును లేక

  • తిండికీ బట్టకూ లేక.
  • "ఇట్లు వర్తించియును నాత డేమి యందు, గళవళము జెందె గూడు గోకయును లేక." శుక. 3. 372.

కూడుగోకలు

  • అన్న వస్త్రాలు.
  • "కఱవు కాలంబున మఱపు సొచ్చిన వార్కి, కూడుగోక లొసంగినా డితండు." సానం. 1. 152. కూడు____కూత 507 కూతు____కూన

కూ డుగ్గబట్టు

  • అన్నము తినక ఉపవాసము లుండు.
  • "లేకున్న విడుతు బ్రాణము, నీ కై కూ డుగ్గ బట్టి నీలగ్రీవా!" కా. మా. 3. 101.

కూడు చీర యిచ్చు

  • తిండీ బట్టా పెట్టి పోషించు.
  • "....కూడుం జీర నిడి సాకతంబు సేసిన జాలున్." భార. విరా. 1. 219.
  • చూ. కూడు సీరకు.

కూడునీరు

  • కూటినీళ్లు, గంజి. శుక. 3. 103,

కూడును బాడి

  • 'పాడి పంట' వంటిపదం. జం. క్రీడా. పు. 83.

కూడు సీరకు

  • పోషణకు, తిండికీ బట్టలూ అనుట.
  • "వినుము గుణవంతు డొకరుడు, ధనవంతుం డైన యొక్క ధరణీనాథుం, దనకూడు సీరకై కాం, చన మడిగి." భార. శాం. 3. 165.

కూతవేటు దూరము

  • కొంచెము దగ్గఱలో.
  • కూత వేస్తే వినబడునంత దూరము.
  • దూరాన్ని కొలవడానికి యిలాంటి వేవో పూర్వం కొన్ని ఉండేవి. ధను: ప్రమాణము, రాతివేటు దూరము, పగ్గంపట్టు మొదలయినవి యిలాంటివే.
  • "విను మిచ్చటికి గూతవేటు దూరంబున, గల దొక్క హ్రదము నిర్మలము జలము." హరిశ్చం. 3. 65.
  • చూ. కూక పట్టు.

కూతుం గతులు సను

  • కూతు నడుగుటకై వెళ్లు, పెత్తనము పోవు.
  • "హిమవంతంబునకు గూతుంగతులు సనినమునిగణంబు." కుమా. 8. 2.
  • (కూతంగతులు అన్న పాఠం సరి కాదు.)

కూనగుంత

  • ఏతము బావిదగ్గర మాను నిలుచుటకు పాతిన కంబానికి వెనుక ఉన్న గుంత.
  • "మ్రాను మీటుగ నెగయ గోమాయు వప్పు, డేకతాళప్రమాణ మ ట్లెగసి కూన, గుంతలో బడి గ్రుడ్లు వెల్కుఱుక నాల్క, నడుము కఱచుక నఱచుచు బెడిసి మడిసె." హంస. 1. 193.

కూనరాగము

  • చిన్న రాగము, కూని రాగము.
  • "వాడు కూనరాగాలు తీస్తున్నాడు." వా.

కూనరోగము

  • కంటి రోగము.
  • కళ్ళలో కూనలు - దుర్మాంసం - పెరిగినప్పు డంటారు. కూన___కూప 508 కూప___కూయి

కూనలమ్మ చీర

  • పాతకాలంలో చీరల రకాలలో ఒకటి. శుక. 2. 411.

కూనలమ్మ పటము

  • చూ. కూనలమ్మ చీర.

కూనలమ్మ పాటలు

  • కూనిరాగాలు.
  • చూ. కూనలమ్మ సంకీర్తనలు.

కూనలమ్మ సంకీర్తనలు

  • కూనిరాగాలు.
  • "నేరని గురుబోధలు సం,సారము లై కూనలమ్మ సంకీర్తన లై, దూరము నై ముక్తికి ని,స్సారము లై పోవు నన్న సంపగిమన్నా!" సంపగిమ. శ. 34.
  • చూ. కూనలమ్మ పాటలు.

కూనిరాగాలు

  • చూ. కూనరాగం.

కూపకూర్మము వలె

  • ప్రపంచజ్ఞానం లేక తనకు తెలిసినదే లోక మను కుంటూ. గీర. 12.
  • చూ. కూపస్థమండూకము వలె.

కూపమండూకము వలె

  • కూపకూర్మము వలె.
  • "బోధ మల్పంబు గర్వ మభ్యున్నతంబు, శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము, కూపమండూకములు బోలె గొంచె మెఱిగి, పండితమ్మన్యు లైన వైతండికులకు." భీమ. 1. 13.
  • "సర్వదోచ్చిష్టపంక సంచయనము లగు, కూపమండూకముల కెట్లు కోర వచ్చు, భట్టపాదకుమారిల పండితేంద్ర, వాగ్ఘరీ జృంభణవిలాసవైభవంబు." శంకరవిజ. 1. 65.
  • చూ. కూపస్థమండూకము వలె.

కూపస్థమండూకము వలె

  • తా నున్నదే సర్వమూ అనుకొను అజ్ఞానభావం కలవారి పట్ల ఉపయోగించే పలుకుబడి.
  • బావిలో పుట్టి అక్కడే పెరిగిన కప్ప అదే లోక మని భావిస్తుంది అనుటపై యేర్పడినది.
  • "...ఈ నాలుగింట నొక్కడే నెవ్వానికి లేకుండు, వాడు కూపస్థ మండూకంబుబోలె దనముక్కునకు జిక్కటి మీదిదె యాకాశంబు తన గొందియ లోకం బని యెంచి...." నీతి. చం. పే. 55. పం. 13.
  • చూ. కూపకర్మము వలె; కూప మండూకము వలె.

కూపెట్టు

  • పిలుచు, కూతపెట్టు; కుయ్యో మొఱ్ఱో అను.
  • "తలుపు సడలింపు మనుచుం, గుల భామను మాంత్రికుండు కూ పెట్టినచో." హంస. 3. 105.
  • "కూపెట్టంగ మహీసుపర్వుల మెడల్ గోసెన్." వరాహ. 2. 98.
  • "విపన్నుల్ కూపెట్టిన విని తీర్పుము." ఆము. 4. 204.

కూయిగా

  • రక్షకుడుగా. కూయి____కూర 509 కూర____కూర
  • "అసమున మీ దెఱుంగక మహాగ్రహ వృత్తి గడంగి చెచ్చెరం, బసులకు గూయిగా చనియె బాపడు." భార. విరా. 5. 234.

కూయి చెప్పు

  • ఎవరి నైనా సాయమునకు ఎలుగెత్తి పిలుచు.
  • "ఇక్కడ గూయి చెప్పుటకు నెంతయు దూరపుజొప్పు మార్చి పో." కా. మా. 4. 66.

కూయిడు

  • పిలుచు.
  • దూరంలో ఉన్న వారిని పిలుచుటలో కూత వేయు అలవాటుపై వచ్చినపలుకుబడి.
  • "వా యెత్తి యఱచుచు వారివారికిని, గూయిడుచును." పండితా. ద్వితీ. మహి. పుట. 14.
  • "ఆ యెడ సఖు లొక డొక్కడు, కూయిడి జతగూడ కెడసి...." హంస. 4. 222.

కూయి వచ్చు

  • పిలుపు వచ్చు.
  • "కూయి వచ్చినన్, నీ వటు దండకో లగుచు నిల్చిన జాలు." జైమి. 1. 100.

కూరకా ఉప్పుకా ?

  • నిష్ప్రయోజన మనుట.
  • "...ఒసంగినను గూరకా యుప్పుకా?" పండిత. 6.
  • చూ. ఉప్పుకు వస్తుందా ఊరగాయకు వస్తుందా?

కూరగాయ కవిత్వము

  • స్వల్పలాభానికై పొగడుతూ చెప్పే కవిత్వం.
  • "ఘన మగునుతి గనక కూరగాయ కవిత్వం, బనక కృపామతి గైకొను." సంపగిమ. శ. 3.

కూరగాయకవులు

  • కూరగాయ కవిత్వం చెప్పే వారు.
  • "...మ్రోత లె,ల్లం గనుకూరగాయ కవులన్ సర కించుక, సేతురే కవుల్?" బహులా. 1. 11.
  • చూ. కూరగాయ కవిత్వము.

కూరగాయవైద్యము

  • చిల్లర వైద్యము, నాటు వైద్యము.
  • కాస్త నిరసనగా అనుమాట. పల్లెలో నాటువైద్యులు వంకాయలకూ, టెంకాయలకూ చేసేవైద్యము అనుటపై వచ్చినది.
  • "ఈ కూరగాయవైద్య మెవరి క్కావాలోయ్? సూది వేస్తేగానీ నా జబ్బు తగ్గదు." వా.

కూరనార

  • కూరగాయలు; శాకపాకాదులు. జం.
  • "ఆ ఊళ్లో కూరానారా బాగా దొరుకుతుందా?" వా.

కూరముక్కు

  • చేపలలో ఒక రకం.
  • "మోరపక్కెర దొండును గూర కూర____కూర్కి 510 కూర్కు____కూర్చు
  • ముక్కు...ఆది యగు మీలబట్టు నతడు." హంస. 4. 187.

కూరలు నారలు

  • శాకపాకాదులు. జం.
  • "కూరలు నారలు చాలవె, పూరింపన్ మృష్ట మేల పొట్టకు..." పంచ. (వేం) 2 ఆ.

కూర వండి కస వేర గోరు

  • సిద్ధాన్న ముండగా గడ్డికోసం వేకారు.
  • తగనిపని అనుట. తాళ్ల. సం. 8. 175.

కూరా కగు

  • కుమిలి పోవు; కూరవలె ఉడికి పోవు.
  • "ఈరీతి గడుపునొప్పిం, గూరా కై ....యుడికెన్." వేం. పంచ. 4. 260.

కూరాకు కోసి తిను

  • ఆకూ అలమూ తిను.
  • "అడవులకున్, మరలం బోయెద నచటం, దిరిగెద గూరాకు గోసి తినియెద." భార. భీష్మ. 2. 8.

కూరాకు చేయు

  • నలిపి వేయు, బాధించు. పప్పుకూర మెదిపినట్లు మెదుపు అనుటపై వచ్చిన పలుకుబడి.
  • "గుదిగుది గావించి కూరాకు చేసి." గౌర. హరి. ద్వి. 1263.
  • చూ. కూరా కగు.

కూర్కిడు

  • నిద్రించు.
  • "కూర్కిడు నంతలోపలన్....ఒక కల గంటి." బిల్హ. 2. 36-37.

కూర్కుపాటు

  • తూగుట.
  • "కూర్కు పాటుల దూగి కూఱువారు." వరాహ. 11. 126.

కూర్కొని కూర్కొని చెవుల బోయు

  • నూఱిపోయు.
  • "...ఏను శంతనుసుతుండు, గురుడును విదురుండు గూర్కొని కూర్కొని, చెవుల బోయమె సవిశేష కార్య..." భార. స్త్రీ. 1. 142.

కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు

  • అనవసరంగా తప్పు పట్టువారి పట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "అతనిదగ్గర మనం పని చేయ లేము. కూర్చుంటే తప్పు లేస్తే తప్పు." వా.

కూర్చుకొను

  • సమకూర్చుకొను.
  • "తద్బలంబులన్, శ్రీ విలసిల్ల గూర్చుకొని." రుక్మాం. 3. 212.

కూర్చుగుమ్మలు

  • కూర్చు స్త్రీలు,. అనగా తనపై కూర్మి గలవారు - మిత్రులు.
  • "చెలువ దనచెల్మికత్తెల బిలిచి నాకు, గూర్చుగుమ్మ లెవ్వార లీ కొమ్మలందు." కుమా. 6. 27.
  • ఈలూర్చు 'ఇష్ట మైన' 'ప్రియ కూర్చు____కూలి 511 కూలి____కూళ
  • మైన' అనే అర్థంలో ఏ పదం తో నైనా కలుస్తుంది.
  • "కూర్చు మనుమండు." భార. ద్రో. 2. 236.
  • చూ. కూర్చు చుట్టము.

కూర్చు చుట్టము

  • ప్రియబంధువు.
  • "కూర్చుచుట్టంబుగా భావించి." పాండు. 3. 68.

కూర్చొని కుంప ట్లమ్మ

  • తాను కదలకనే వారికీ వీరికీ తగాదులు పెట్టు.
  • "దాని కింక ప నేముంది? కూర్చొని కుంప ట్లమ్ముతూ ఉంటుంది." వా.

కూలంకష మైన

  • సమగ్ర మైన.
  • నది బాగా నిండినప్పుడే కూలములను (ఒడ్డులను) ఒరసుకొంటూ పాఱుతుంది. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "ఆయనకు ఆ భాషలో కూలంకషమైన పాండిత్యం ఉంది." వా.

కూలబడు

  • చతికిలబడు.
  • చూ. చదికిలబడు.

కూలికి

  • అయిష్టముగా.
  • కేవలం డబ్బు వస్తుం దని మాత్రమే.
  • "కూలికి నూనె లంటి." శుక. 2. 363.
  • "వాడు కూలికి చేస్తున్నాడు." వా.
  • "కూలికి ఏడ్చేవాళ్లతో ఏం పని అవుతుంది?" వా.

కూలి నాలి

  • కూలిపని. జం.
  • "కూలినాలికిన్ వ్యయ మొనరించి." గుంటూ. వూ. పు. 14.
  • "కూలికీ నాలికీ పోయి ఆవిడ బతుకుతూ ఉంది." వా.

కూలిపాటు

  • కూలిపని.
  • "ఈ, యమరుల కెట్లు జీవనము లందలి వారల నాశ్రయించి ని,త్యము గను గూలిపాటు బడి తారు చరించెదరు..." పార్వ. 2. 93.

కూలి పుట్టు

  • పని దొరకు.
  • "ఈ ఊళ్లో కూలి పుట్టడం లేదు. అందుకనే పడమటికి వెళ్లి పోతున్నాను." వా.

కూలియాలు

  • వేశ్య, వెలయాలు, డబ్బునకు వచ్చు ఆడది.
  • "రొక్క మీ గలుగువాడె మనోజుడు గూలియాలికిన్." కుమా. 8. 143.

కూళతనము

  • కక్కుర్తి; దైన్యం.
  • "ప్రాతబట్టకై, కూళతనంబునం బ్రభులకుం దనుమర్దన మాచరించియున్." శుక. 2. 363.

కూళమారి

  • కూళ; దుష్టుడు. కృత____కృత 512 కృతి____కృప
  • "కూళమారి విధాత చేకూర్చె నిటుల." ప్రబంధ. 655.

కృతపడు

  • 1. కడచు.
  • "కృతపడినకార్యంబు గ్రమ్మఱం బొడమునే...." భార. కర్ణ. 1. 226.
  • 2. మరణించు
  • "పనిచి కృతపడిన గాంగేయునిదెస." భార. ద్రోణ. 1. 6.
  • 3. వే ఱగు.
  • "సురకరి యీయద్రి జరియించు నేనిక, కొదమల గృతపడ్డకొదమ యొక్కొ." మార్క. 1. 97.

కృతపడ్డ తప్పు కాదు

  • వెనకటి తప్పులను మాఫీచేయు - మన్నించు.
  • "కృతపడ్డ తప్పు గాచితి నేడు." జైమి. 8. 94.

కృతపఱుచు

  • గడపు.
  • "...దినంబులు కడంద్రోచి....ఋతువులు కృతపఱచి..." సాంబో. 1. 173.

కృత మెఱుగు

  • చేసినమేలు జ్ఞప్తి కుంచుకొను.
  • "కృత మెఱుగుదు రుపకార,వ్రతమున వర్తింతురు...." భార. విరా. 3. 64.

కృతయుగపుమాటలు

  • సత్య కాలపు మాటలు. తాతలనాటి సంగతులు.
  • "....కృతయుగపు మాట లిపు డేల." నందక. 29.

కృతి యిచ్చు

  • గ్రంథం అంకిత మిచ్చు.
  • "కృతు లిచ్చినసుకవుల." రుక్మాం. 3. 66.

కృత్యాద్యవస్థ పడు

  • మిక్కిలి కష్టముతో కూడినట్టి. ప్రారంభదశలోని ఇబ్బందులు పడు.
  • కావ్యరచనలో ప్రారంభం చాలా క్లిష్టం అనుటపై యేర్పడిన పలుకుబడి.
  • "అతగాడు వేలమీద పెట్టుబడి పెట్టాడు. ఎప్పుడో బాగానే వస్తుంది. ఇప్పు డేదో కృత్యాద్యవస్థ పడుతున్నా డంతే." వా.

కృప ఉట్టిపడగా

  • దయారసము వెల్లివిరియగా.
  • "ఆ బాలుర గృప, యుట్టి పడగ జూచి నృపతి యొయ్యన నగుచున్." కళా. 6. 160.

కృప చేయు

  • అనుగ్రహించి యిచ్చు.
  • "నీవు కృప చేసిన వీ రథచాపతూణముల్." జైమి. 4. 25.

కృపవాడు

  • అనుగ్రహపాత్రుడు.
  • "ఎవ్వడు తేజరిల్లు నత డెప్పుడు నీ కృప వాడు భార్గవీ!" వి.పు. 1. 203.

కృప సేయు

  • అనుగ్రహించు; ఇచ్చు.
  • "వి వేక పరిపాటియునుం గృప సేసె." హర. పీఠిక. 30.

కృష్టపచ్యము

  • దున్నిననేలలో విత్తి పండించే ధాన్యం.
  • ధాన్యం రెండు రకాలు-కృష్టపచ్యము; అకృష్టపచ్యము= తా నంతట పండే గడ్డిగింజల వంటివి.

కృష్ణా అనుకొను

  • చచ్చిపోవు.
  • "ఆ ముసలిది కాస్తా కృష్ణా అనుకొంటే ఆ ఆస్తి అంతా వీడిదే." వా.

కృష్ణార్పణ మగు

  • తనది కాకుండా ఇతరులకు దత్త మై పోవు.
  • "ఏ దయినా దానంగా యిచ్చినప్పుడు కృష్ణార్పణం అనీ, రామార్పణం అనీ దైవప్రీతిగా యిచ్చే అలవాటు కలదు. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "వాడు చదివి తెచ్చిస్తాను అంటే పుస్తకం ఇచ్చాను. అది కృష్ణార్పణం అయి పోయింది." వా.

కృష్ణాష్టమి

  • శ్రావణ బహుళ అష్టమి. ఇదే గోకులాష్టమి. కృష్ణుడు పుట్టిన రోజు.
  • "కృష్ణాష్టమినాడు గౌడీయమఠలో బ్రహ్మాండంగా చేస్తారు." వా.

క్లప్తంగా

  • సంక్షిప్తంగా.
  • "మీరు చెప్పే దేదో కలుప్తంగా చెప్తే మంచింది." వా.

కెం పగు

  • ఎఱ్ఱ నయిన.
  • అనగా కోపోద్రిక్త మయిన.
  • "కెం పగుకన్నుదోయితో." జైమి. 2. 53.

కెం పగుచూడ్కి

  • కోపదృష్టి.
  • "జనపరంపర కెం పగుమాడ్కి జూచి." పాండు. 3. 95.

కెంపు దేఱు

  • ఎఱు పెక్కు.
  • "కన్నుదోయి, తుది గెంపుదేఱు నిద్దుర మంపుతోడ." వర. రా. సుం. పు. 67. పంక్తి. 8.

కెంబసుపు

  • కుంకుమ.
  • "నునుపుగా దువ్వి తీర్చిన కెంపు బాలేందు, పస మీఱు నొసటి కెంబసుపు బొట్టు." శుక. 2. 425.

కెక్కరలు కొట్టు

  • ఆశ్చర్యమును ప్రకటించు. 'గెగ్గరలు కొట్టు' అని నేడు వినబడదు.
  • ధ్వన్యనుకరణము.
  • కుక్కు. 52.
  • "ఆ పిల్ల అత్త నలా అన్నిమాట లంటుంటే అంతా కెక్కరలు కొడుతూ విన్నారు." వా. కెక్క____కెడ్బె 514 కెర_____కెల

కెక్కరించి

  • కోడిలా అటూ ఇటూ చెలికి.
  • "వాడు కోడి కెక్కరించినట్టు కెక్కరించి రెండు మెతుకులు తిన్నాడు." వావిళ్ల ని.

కెడగూడు

  • 1. గుమికూడు. కాశీ. 3. 138.
  • 2. కలిసి యుండు.
  • "నెఱి లేక నీతోడినీడ యై గెడగూడి, పరగినన న్నింత."
  • 3. భోగించు.
  • "మగనికి వెఱవక యింటికి, దగ దానే కర్త యగుచు దత్పరవృత్తిన్, వగ గల దై వెలి దిరిగెడు, మగువం గెడ గూడువాడు మదనుడు గాడే." మల్ల. 2. 173.

కెడ్బెరయు

  • అడ్డదిడ్డముగా పడి యుండు, కలగాపులగ మగు.
  • "మృగంబుల యెలుంగుల తోడం గెడ్బెరసి." కాశీ. 1. 93.
  • "సొంపు మిగులంగ జోదుల యంప పొదుల, దీప్తులును లేతనవ్వుల దీధితులును హారిరశ్ములు గెడ్బెర సగుచు వెలుగ, దేరు లరిగె నుద్దామత గౌరవేంద్ర!" భార. శల్య. 1. 104.
  • చూ. కెడ్బెర సగు.

కెడ్బెరసు అగు

  • అటూ ఇటూ చెల్లా చెదరుగా అడ్డదిడ్డంగా పడు.
  • "కె, డ్బెర సై పీనుగులు పడువు బ్రేకయు బడియెన్." కుమా. 11. 127.

కెరలి పడు

  • త్వరపడు.
  • "కెరలిపడి జనని దూఱుట, ధరణీపతి ననుట వెఱ్ఱితనము." సారం. 3. 32.

కెరలి యాడు

  • ఆనందముతో తాండవించు.
  • "బాణాసురుండు దనుజసుందరీసహితు డై....కెరలి యాడుచు మధుపాన కేళి దేలి." ఉత్త. హరి. 5. 47.

కెరలుకొను

  • తేరుకొను; ఏపుగా పెరుగు.
  • "వాడక వ్రాలక తెవుళుల, గూడక తగ నల్ల గెరలు కొని నవకము లై... వీడెన్ సస్యంబు లిడుమ వీడెన్ బ్రజకున్." భాగ. 10. పూ. 757.

కెరలు వొడుచు

  • కెరలుకొను.
  • "అతనిచేత నున్న యమృతకుంభము సూచి, కెరలువొడిచి సురల గికురువెట్టి, పుచ్చుకొనిరి యసురపుంగవు లెల్లను." భాగ. 8. 295.

కెరలెత్తు

  • చూ. కెరలుకొను.

కెర్లుకొను

  • కలవరించు; కేకలు వేయు.
  • "పిల్లవాడు నిద్రలో కెర్లుకొని లేచాడు." వా.
  • "మేలును దెల్పుచు గేక లిడుచు గెర్లు కొనుచును వచ్చె.....డు బుడక్కి వాడు." హంస. 2. 27.

కెలవాడి

  • కిలాడి, టక్కరి. కెల్లు____కేకి 515 కేడీ____కేల
  • "రసికు డగు కెలవాడి, అప్ప డగు కెలవాడి." తాళ్ల. సం. 12. 14.

కెల్లు రేగు

  • విజృంభించు.
  • "కెల్లు రేగె దేహ మందే కిమ్ముల చుట్టిరి." తాళ్ల. సం. 7. 256.

కేకట కెమ్మట లాడు

  • పరిహాసము లాడు.
  • కేకే యని అఱచుచు పరియాచకము లాడు అని వావిళ్ళ ని.
  • " గిరిజేశు గ్రేకట గెమ్మట లాడి, యును సరసము సేసియును గేలి సేసియును." పండితా. ద్వితీ. మహి. పుట. 111.

కేకలు వేయు

  • కోపించు.
  • "చేకొని యొనరుతు మనుచున్, గేకలు వేసెడిని సమర కేళీరతి యై." దేవీ. 12. 138.

కేకసలాడు

  • నవ్వుతూ చప్పట్లు కొట్టు
  • చూ. కేకిసలు కొట్టు.

కేకిసలు కొట్టు

  • కేరింతలు కొట్టు.
  • ధ్వన్యనుకరణము.
  • "నాట గెలిచి పోనీక పట్టుచు గేకిసలు గొట్టుచు నొకరొకరి జీరుచు..." కళా. 6. 225.
  • "చే,కొని హరి జూచె గేకిసలు గొట్టుచు బోటులు దాని నవ్వగన్." పారి. 3. 16.
  • చూ. కేకసలాడు.

కేడీలాడు

  • చాడీలు చెప్పు. రమా. 13.

కేరడము లాడు

  • వక్రోక్తులాడు; హాస్యమాడు.
  • "కేరడము లాడుసతి మధ్య ధీర." నరస. 2. 29.
  • "కేరడము లాడుచుండిరేని, గవియు పాండవబాణాగ్ని గాదు సువ్వె,తమ్ము తమ లోభ మనుచిచ్చు దరికొనంగ, దెగినవా రయి పోదు రింతియ తలంప." భార. ఉద్యో. 1. 353.

కేరియలు వాఱు

  • కెక్కర్లు కొట్టు.
  • "జీఱిక కల్లు ద్రావి మదసింధుర గామిను లన్ని కేఱియల్, వారుచు గౌడు గీతములు వాడుచు." కుమా. 6. 45.

కేల కపోలము లూదు

  • చెక్కిట చేయి చేర్చు. చింతా సూచక మైన అంగ విక్రియ.
  • "ఎన్నిభవంబులన్ గలుగు నిక్షుశరాసనసాయకవ్యధా, ఖిన్నత వాడివత్తలయి కేల గపోలము లూది." మను. 2. 57.

కేల నోరు మూసికొను

  • ఏ దైనా అలా చేయతగదు సుమా అని చెప్పునపుడు ఆడవాళ్ళు నోరు మూసుకొనుటపై వచ్చిన పలుకుబడి.
  • "అనుచు నొయ్య బలుకుచును జూపె బ్రియు నొక్క, ముగుద కేల నోరు మూసికొనుచు." కళా. 7. 146. కేలు____కేలొ 516 కేల్కే____కేళి

కే లుట్టిపడు

  • చేతు లదరు.
  • ఒకపని చేయుటకై తహతహ పడుటను సూచించు అంగ విక్రియ.
  • "...రాజసుతుడు చరమాంబునిధిన్, మునుగ రవి నెఱయు చీకటి, గ్నుగొని కే లుట్టిపడగ గట్టాయిత మై." శుక. 2. 219.

కేలుదండ

  • కైదండ, చేయూత. దశా. 7. 28.

కేలు మోడ్చు

  • నమస్కరించు.

కేలు మోడ్పు

  • నమస్కారము.

కేలు విడుచు

  • చేయి ఊపి ఆరంభించు డని సూచించు.
  • "పోర నొండొకంటి బొడుచుట కవ నీశ, విబుధరిపులు కేలు విడుచుటయును." కవిక. 2. 151.

కేలు సాచు

  • చేయి సాచు; అర్థించు.
  • "శ్రీకాంత దా నయ్యు బ్రియు నిరోధింపదు, క్రిం దై విరోధికి గేలు సాపదు." వసు. 1. 65.

కేలొసగు

  • నమస్కరించు.
  • "వ్యాఘ్రపురస్థలియందు మహాబాహు స్వామికి గేలొసగె దహితముగ." హంస. 4. 213.

కేల్కేల దట్టించు

  • చేయి పట్టుకొను; చప్పట్లు కొట్టు.
  • "క్రేవల్ కన్పడజేయు నెచ్చెలియతో గేల్కేల దట్టించి వా, చావైచిత్రిని ముచ్చటాడుసకి...." హంస. 1. 32.

కేల్మోడ్చు

  • చూ. కేలు మోడ్చు.

కేశాకేశి

  • జుట్లు జుట్లు పట్టుకొని.
  • "కేశా కేశి బెనంగుచు." కుమా. 12. 168.

కేళిక సేయు

  • పొగడు, స్తుతించు, ఒకా నొక కవిత్వము సేయు.
  • బొమ్మలాటలో నేటికీ కేళిక చేస్తారు. ఎవరో బహుమతి ఇస్తే ఆ మాట చెప్పి వారిని పొగుడుతారు.
  • ఇట్లే - కేళిక యొనర్చు, కేళిక సలుపు మొ.
  • "....సెంబళి కోల, నలి దూసికొని కేళికలు సేయువారు." పండితా. ప్రథ. దీక్షా. పుట. 160.
  • "వఱలుచు బాలుని వామపాదంబు, గిఱగిట గాబట్టి కేళికల్ సేయు." పండితా. ప్రథ. పురా. పుట. 481.
  • "జక్కిణిరవండి మేళముల గేళిక సల్పిరి." రామా.
  • "కేళిక జోకయు లీల నటింప." బస. 7. 154. కైంక____కైకొ 517 కైకొ____కైచె


కైంకర్యము చేయు

  • కాజేయు; సేవ చేయు.
  • సేవ చేయు అసలు అర్థం అయినా వ్యంగ్యంగా కాజేయు అనే అర్థంలోనే ఉపయోగిస్తారు. వైష్ణవులలో మాత్రం మంచి అర్థంలోనే ఇది అలవాటులో ఉంది.
  • "వాడు ఇంట్లో ఉన్నట్టే ఉండి, పెట్టెలో నాలుగు రూపాయలూ కైంకర్యం చేశాడు." వా.

కై కానుక చేయు

  • కానుక లిచ్చు.
  • "జవాదిపిల్లులు మొదల్గా గానలో వాని గుం, పులు గైకానుక చేసి.." యయా. 1. 104.
  • చూ. కైకాన్క సేయు.

కైకాన్క సేయు

  • బహుమతి యిచ్చు.
  • "గుండ్ల పేరును కైకాన్క కోరి సేతు." హంస. 2. 37.
  • చూ.కైకానుక చేయు.

కైకూలి వడు

  • దినకూలి చేసుకొని బ్రతుకు; కూలి నాలి చేసుకొను.
  • "కొడవలి గడియించుకొనుచు గై కూలి, వడి రాజనములకు నొడ బాటు చేసి." బస. 4. 117.

కై కొను

  • 1. గ్రహించు.
  • "జగత్త్రయంబు గావం బ్రోవం, గైకొన్ననీవు." ఉత్త. హరి. 4. 96.
  • 2. లక్ష్యపెట్టు.
  • "కైకో డతండు సురల." హర. 3. 8.
  • 3. పెండ్లి చేసుకొను.
  • "జయలక్ష్మీసతితో ననంగవతి నిచ్చం గైకొనం గోరి..." విక్ర. 4. 54.
  • 4. పట్టు, అనుసరించు.
  • "చరమాశాంతరవీధి గైకొని." విక్ర. 2. 115.
  • ఇలాంటి ఇతర చ్ఛాయలలోనూ ప్రయుక్తం. అవన్నీ వీనిలోనే చేరనూ చేరును.

కై కొలుపు

  • ఒప్పించు; ధైర్యము గొల్పు.

కై కొల్పు

  • పురికొల్పు. భాగ. 10. ఉ. 300.

కై కోలు

  • ప్రతిజ్ఞ; సమ్మతి; అనుమతి.
  • "నా కై,కో లిదె రెం డాడగ నా, నాలుక మీకులము వారి నాలుక లటులే?" సింహా. 5. 198.

కై చాపు

  • నమస్కరించు.

కై చెఱ యిచ్చు.

  • తనంత పట్టుబడు, వశ మగు.
  • "ఏచిన తన నిడువాలు వి,లోచనముల చెలువమునకు లొంగి జలజముల్, కై చెఱ యిచ్చె ననం గే, లీచాలితనళిన మా కలికి ధరియించున్." వరాహ. 11. 50. కైజా___కైదు 518 కైప___కైవ

కై జా చేయు

  • గుఱ్ఱం కళ్ళెం బిగించు.
  • "విభుండు హయము డిగి హుసా, రై కైజా చేసి మహా, నోకహతలమున నిలిచి." చంద్రా. 2. 111.

కై జీతగాడు

  • జీతాని కున్న సైనికుడు. భార. ఆశ్ర. 1. 73.

కై జీతములవారు

  • కై జీతగాండ్రు. కువ. 2. 143.
  • చూ. కై జీతగాడు.

కై తప్పుగా పడు

  • చేయి జాఱి పడిపోవు; తప్పి పోవు.
  • "కంగు కంగున నేల గైతప్పుగా బడు, వేటమ్ము లేఱక దాటి దాటి." మను. 4. 103.
  • "దేవ నిన్న కై తప్పున జేరె నీ హయము." జైమి. 5. 168.

కై దండ యొసగు

  • చేయూత నిచ్చు.
  • "ఱవిక కట్టడపు దోరపు నిగ్గుజంటీలు, తనుల తాద్యుతికి గైదండ యొసగ." శుక. 1. 289.
  • "ఆదరమున శతమన్యుడు, కైదండ యొసంగ." పారి. 3. 23.

కై దువు పెట్టినవాడు

  • ఆయుధమును వదలినవాడు.
  • "జోడు వుచ్చినవానిని గైదువు బెట్టిన వానిని." భార. భీష్మ. 3. 303.

కై పదము

  • సమస్య.
  • "కైపద మిచ్చువారలును గ్రక్కున బద్యము చెప్పువారలున్." భోజ. 2. 50.

కై పెక్కు

  • పొగ రెక్కు; మత్తెక్కి తూలు.

కైపు మిగులు

  • కై పెక్కు.

కై మోడుపు

  • నమస్కారము.

కై లా గిచ్చు

  • చేయూత నిచ్చు.
  • "తన పాణిపల్లవము కైలా గిచ్చి." విప్ర. 4. 86.
  • "పరి, జనములు కైలా గొసంగ స్నానోన్ముఖు డై." విజయ. 1. 55.

కై లా గొసగు

  • చేయూత నిచ్చు.
  • "చిగురాకు వంటి కెంగేలు, గారము మీఱంగ గైలా గొసంగి." వర. రా. అయో. పు. 286. పంక్తి. 15.

కై వశముగా నుంచు

  • అధీనములో నుంచు.
  • "రఘుపతి తనచేతి విల్లు, వరుణుని యందు గైవశముగా నుంచి." వర. రా. బా. పు. 237. పంక్తి. 10.

కై వస మగు

  • లోబడు, వశ మగు.
  • "దానవైఖరిన్, హేమనగేంద్ర మొ కైవ్రా___కొంక 519 కొంకి___కొంకు
  • క్కనిక యిత్తురు కైవస మై చెలంగినన్." విప్ర. 2. 10.

కై వ్రాల బండు

  • వాలి పోవునట్లు నిండుగా పండు.
  • "కైవ్రాల బండె కలమవనంబుల్." కుమా. 6. 119.

కై వ్రాలు

  • వాలిపోవు; పడు.
  • వాలడం మీది పొద్దు వాలినటుగా అన్న అర్థంలో వయసును పోల్చుట అలవాటు కూడా ఉన్నది. 'నేను పెద్దవా ణ్ణయి పోయాను. సాయంత్రం కావచ్చింది.'
  • "ప్రాయ మింతకు మిగుల గైవ్రాల కుండ." కాశీ. 1. 7.

కై సేయు

  • అలంకరించు, అర్చించు.
  • "ఆ సమయమున గుమారిం గై సేసి..." విక్ర. 4. 192.
  • "ఏ, మును పూజించితి బిమ్మటన్ హరియు నంభోజాతగర్భుండునున్, గని కై సేసిరి." భీమ. 4. 203.

కొంకనక్క

  • ఒకరక మైన నక్క.
  • "చీమలు గాకులుం గ్రిములు జింకలు నక్కలు గొంకనక్కలున్." భార. అశ్వ. 2. 117.

కొంకరలు పోవు

  • చలితో సొట్టలు పోవు.
  • "కొంకరలు పోయిన నీ మెయి చక్క నొక్కి." రామా. 7. 258.
  • "అబ్బ! ఈ చలితో వేళ్ళు కొంకరలు పోతున్నవి." వా.

కొంకి కొంకక

  • జంకు కొంకులు లేక.
  • "వల చంగునను దాటివడి నేగు నొక లేటి, గొంకి కొంకక త్రొక్కి కూల్చె నొకడు." శుక. 1. 263.
  • చూ. కొంకికొను.

కొంకికొను

  • సంకోచించు.
  • "అనుమానముతో నొక కొంత కొంకి కొంచు." హంస. 1. 89.

కొంకి తెంచి ముడి గొంటే కుఱుచ

  • చెడిపోయి, సరి చేసికొంటూ కూర్చుంటే ఉన్నది తక్కువై పోతుంది అనుట.
  • దారాన్ని తెంచి తెంచి ముడి వేసిన ట్లెల్ల కురు చై పోతుంది కదా! తాళ్ల. సం. 8. 175.

కొంకు కొసరు

  • సంకోచము. జం.
  • "తొడలపై నిద్ర వోయెడు దుష్ట మృగము, గొంకు కొసరు లే కిటు లేల గూల ద్రోవు. విక్ర. 3. 97.
  • "కొంకు కొస రించుకయు లేక కూల దాచె." విరా. 2. 128.

కొంకుపడు

  • సంకోచించు. బ్రౌన్. కొంకు____కొంగ 520 కొంగ____కొంగు

కొంకుపాటు

  • సంకోచము.

కొంకు పెట్టు

  • సంకోచించు.
  • "కొంకు పెట్టక పెనుగద బెట్టు వ్రేయ." భార. సౌప్తి. 1. 169.

కొంకు వోవు

  • కొంకరలు వోవు.
  • "ఆపదం, బొరయక యుండ్ జేయుము ప్రభూతపు సీతున గొంకు వోయెడున్." భార. శాం. 3. 313.

కొంగకాళ్లు

  • పొడుగాటికాళ్ళున్న మనుష్యులను వెక్కిరింపుగా అనే మాట.
  • "ఆ కొంగకాళ్లకు పిల్ల నెవ్వ రిస్తారు రా?" వా.

కొంగజపం

  • ఒకధ్యానం.
  • పైకి మహాసాధువుగా నటిస్తూ లోన కుట్రలు పన్ను వారి యెడ ఉపయోగిస్తారు.
  • పంచతంత్రంలోని కొంగ - చేపల కథపై యేర్పడిన పలుకుబడి.
  • "వాడి దంతా కొంగజపం. ఆ యింట్లో కాస్త చనువు చిక్కితే ఆపిల్ల నెప్పుడో లేపుకొని పోతాడు." వా.

కొంగని బొడిచి వంగని వ్రాలంగ దివియు

  • గొప్పవానిని తగ్గించి తక్కువ వాని నెక్కువ చేయు అని కావచ్చు నేమో? సరిగా తేల లేదు.
  • "పోలంగ గొంగని బొడిచి వంగనిని, వ్రాలంగ దిగిచితి రేల బింకంబు." బస. 7. 185.

కొంగమెడ

  • పొడ వైన మెడ.
  • కాస్త నిరసనగానే అంటారు.
  • "ఆ! ఏ మందం? ఆ కొంగమెడా అదీ!" వా.

కొంగల మల్లయ్య

  • వట్టి డాబు మనిషి.

కొంగవాలు

  • ఒక రకమైన కత్తి.

కొంగవాల్నఱకులు

  • కత్తితో పడిన గాయములు. కొంగవా లనగా ఒక రకమైన కత్తి.
  • "కొంగ వాల్నఱకు లంగుళుల బట్టుచు జబ్బ, లంట గుట్టిడ వెజ్జు నరయు వారు." ఆము. 7. 21.

కొంగు ఈడ్చు

  • బట్ట పట్టి నిలవేయు. ఒంటిమిట్ట. 84.

కొంగు జారు

  • పైట జారు. తాళ్ల. సం. 6. 156.

కొంగుధనము

  • కొంగుబంగారము వంటిమాట.
  • "కోరి భజించు వారలకు గొంగుధనం బయి." పాండు. 2. 93. కొంగు____కొంగు 521 కొంగు____కొంగు

కొంగున కట్టుకొని తిరుగు

  • తన వశవర్తినిగా, తన వెనువెంటనే ఉంచుకొను.
  • ఇది ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో ప్రయుక్త మవుతుంది.
  • "ఆ పిల్ల మొగుణ్ణి కొంగున కట్టుకొని తిరుగుతూ ఉంటుంది. వాడు బయటికేం వస్తాడు?" వా.

కొంగున నగ్ని దాచినట్లు

  • దాచగూడని దానిని దాచగూడనిచోట దాచినట్లు.
  • ఆత్మ వ్యాఘాత మొనర్చు కొనె ననుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "మమ్ము నందఱ నెవ్వని మహితశక్తి, యెక్కు డై సంగరంబున జిక్కు పఱిచె, నట్టి కర్ణుని గొంగున నగ్ని డాచి, నట్టు లెమ్మెయి దాచితో యమ్మ చెపుమ!" భార. స్త్రీ. 2. 178.

కొంగున నున్న చిచ్చు

  • వినాశ కారి.
  • ఒడిలోని అగ్ని కాల్చి తీరును కదా!
  • "సురలకు గుండెతల్లడము, నూరుల డెందములోని కొఱ్ఱు, ఖే,చరతతి కంటిలో నలుసు, సాధ్యుల కొంగున నున్న చిచ్చు, భూ,సురులకు నెల్లనాడు మెడ జుట్టినపాము..." భాస్క. యుద్ధ.

కొంగున ముడిచిన మణి

  • అందుబాటులో నుండు అపూర్వవస్తువు; మనోరథ పూరకము.
  • "నొడువుల పడతుక మగనికి, బొడ చూపని తనదురూపు పొడగనిపించెన్, జడినిధిశయనుడు కొంగున ముడిచిన మణి గాదె భక్తముఖ్యుల కెల్లన్." పాండు. 2. 48.
  • చూ. కొంగుబంగారము.

కొంగు పట్టు

  • దేహి అను.
  • "ఎవ రెంత మాట రానిచ్చిన గొంగు వట్టితి మునీశ్వరులార!" పాండవో. 51.
  • "నే నెన్ని కష్టాలువచ్చినా ఒకరిముందు కొంగుపట్టి యెరగ నమ్మా తల్లీ." వా.

కొంగు పట్టుకొని తిరుగు

  • విధేయు డై ఆజ్ఞానువర్తి యై యుండు.
  • "వా డెప్పుడూ పెళ్లాం కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు." వా.

కొంగు పట్టుకొని నిలుచు

  • భిక్ష అడుగు, యాచించు.
  • "ఆవిడ ఒకరిముం దెన్నడూ కొంగు పట్టుకొని నిలిచి యెరుగదు. ముసలి తనంలో యాచిస్తూ ఉంది." వా.

కొంగు పఱచికొని

  • కోపమును, దు:ఖమును సూచిస్తూ పైట క్రింద పఱచికొని (పరుండు.)
  • పడక వేసుకొనకుండా పైట చెఱగునే పఱచుకొనుట సహజంగా కోపాన్ని సూచిస్తుంది. కొంగు____కొంగు 522 కొంగు____కొంగు
  • "గుబ్బకవమీది పయ్యెదకొంగు పఱచి, నేల బవళించు మగువ కన్నీరు దొరగ." శుక. 3. 483.

కొంగు పఱచు

  • 1. వ్యభిచరించు.'
  • దొంగచాటుగా వ్యభిచరించు వారు సామాన్యంగా ఎక్కడో ఒకచోట మంచాలూ, పరుపులూ లేకుండా కొంగునే పరుచుకొని పడుకొంటా రనుటపై వచ్చిన పలుకుబడి.
  • "వార లెల్లను బంగారువంటి నిన్ను, బాసి పలుగాకులకు గొంగుపఱచు చెలుల, నంటి..." శుక. 2. 120.
  • చూ. కాలెత్తు.
  • 2. కొంగు పట్టు.
  • ఏ దైనా భిక్షకు పాత్రకు బదులు కొంగు పట్టుట కూడా అలవాటు. అందుపై వచ్చిన అర్థం.
  • "కొంగు పఱచిరి నృపతు లాకూటి కొఱకు." రామలి. 23.
  • ఈ అర్థంలో ఈమాట వాడుకలో లేదు. వాడుకలో దీని రూపం కొంగు పట్టు.
  • చూ. కొంగు పట్టు.

కొంగుపసిడి

  • అందుబాటులో ఉన్న అమూల్య వస్తువు; సులభ లభ్యము.
  • "కోప మొకింత లేదు బుధకోటికి గొంగుబసిండి." విజ. 1. 88.
  • చూ. కొంగుబంగారము.

కొంగుపైడి

  • అందుబాటు లోనిది, కొంగు బంగారము.
  • "కోరి నుతించినవారి కొంగుపైడి." తాళ్ల. సం. 6. 173.
  • "కొలిచినవారల కొంగుపై డితడు." తాళ్ల. సం. 9. 130.

కొంగుపైడి యగు

  • అందుబాటులోని దగు.
  • "కోరినవరాలే కొంగుపైడి గాదా." తాళ్ల. సం. 7. 233.

కొంగుబంగార మగు

  • సులభలభ్య మగు.
  • అందుబాటులో నుండి ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించు కొన వీలయిన ధనము వంటి దగు.
  • కొంగునందు కట్టుకొన్న బంగారము అంతే కదా.
  • "రామానుజయ్య దాన, ప్రామాణిక ముద్ర కొంగుబంగార మగున్." పాండు. 1. 65.
  • చూ. కొంగుపసిడి; కొంగుపైడి.

కొంగుబత్తెము

  • కూలి గింజలు.
  • సామాన్యంగా కూలి గింజలను కూలీలు కొంగులో కొంగు____కొంగు 523 కొంగు____కొంగొ
  • పోసుకునే ఇళ్ళకు వెడతారు, అందుపై వచ్చినది.
  • "నిలిచిన కుప్ప కావలికి నిల్పుదు రప్పురి గొంగు బత్తెపుం, గొలువున కీయకొల్పి హలికుల్ బికిరంబు పొసంగు వేలుపున్." చంద్రా. 1. 25.

కొంగు మాయు

  • ము ట్టగు. బ్రౌన్.
  • చూ. చెఱగు మాయు.

కొంగుముడి

  • 1. వశవర్తిని అయినది.
  • "అంగన నాకు గొంగుముడి యై తగు నీ విపు డిచ్చునీవి..." రామా. 4. 162.
  • 2. ఇష్ట మైనది.
  • అందుబాటులో నుండునది.
  • ".......శుభప్రసంగ మంగనకు నొసంగ గొంగుముడి గాదె భవద్వచనంబు..." వసు. 3. 43.

కొంగుముడి వేసికొను

  • తప్పక అవుతుంది అన్న నమ్మకంతో ఉండు.
  • "మది తహతహ విడిచి యికన్, ముదమున సతులార~ కొంగుముడి వేసికొనుం, డిదె నేటి మాపటికి గూ,ర్చెద వాలాయముగ నేను బ్రియులను మిమ్మున్." ప్రభా. 5. 85.

కొంగుముడులు

  • పుణ్యతీర్థాలలో స్నానాదులు నిర్వర్తించేటప్పుడు భార్యా భర్తలు కొంగుముళ్లు వేసుకోవడం ఆచారం. అతని పంచకొనకూ, ఆవిడ చీరకొంగుకూ వేసే ముడులు కొంగుముడులు.
  • ఇ దెప్పుడూ బహువచనంలోనే ఉంటుంది.
  • "తిరుమల కంచి పుష్పగిరి తీర్థములుం జని కొంగుముళ్లతో, వరములు దంపతుల్ వడయ..." హంస. 2. 85.

కొంగురొక్కము

  • ధనము; ఈవలసిన డబ్బు. మామూలుగా పూర్వం డబ్బును కొంగున కట్టుకొనే వారు. అందుపై వచ్చినది.
  • "కొలది పుణ్యపాపాలే కొంగురొక్కములు వెట్టి, వెల దెంచి బేర మాడ వేగిరమె రారో!" తాళ్ల. సం. 8. 170.

కొంగొంగు రను

  • కొంగలు అలా అఱచు.
  • ధ్వన్యనుకరణము.
  • "కొంగలు చెలగి కొంగొంగు రనగ." హర. 5. 16.

కొంగొడ్డు

  • కొంగు పఱచు; సంభోగ సుఖ మిచ్చు.
  • ఇది కా లెత్తు అన్నట్లు నీచమునకు లోబడు అనే అర్థం లోనే ఉపయుక్త మవుతుంది.
  • "ఆడుపుట్టువు లోకంబునందు గష్ట, మందు గాసువీసములకై యబ్బినట్టి, పురుషులకు నెల్ల గొంగొడ్డి పొట్టపోసి, కొనెడి వెలయాలి బ్రదు కిట్టి దనగ నేల?" పరమ. 3. 207.
  • చూ. కొంగుపఱచు. కొంగో____కొంచు 524 కొంచె____కొంచె

కొంగోడు వడు

  • ఒఱిగిపోవు, ఒడ్డిగిల్లు.
  • "కులపర్వతములు కొంగోడు వడియె." మైరా. 2. 33.

కొంగోడు వోవు

  • ఒక మచంకోడు వదలిన దగు; ఒఱిగి పోవు.
  • "కుక్కి వడిన మిగుల గొంగోడు వోయిన...నుల్కమంచ మొప్పదండ్రు." వి. పు. 3. 215.

కొంచపడు

  • అల్పత చెందు; న్యూనపడు.
  • "కొంచపడితి నొక కొన్నాళ్లు, ఇంచు కంచు కిపు డెఱిగితినే." తాళ్ల. సం. 11. 2. భా. 17.
  • చూ. కొంచెపడు.

కొంచపఱుచు

  • కించపఱచు.
  • "తను గొంచ పఱతురె తరుణుల లోన." వర. రా. కిష్కి. పు. 357. పం. 17.
  • చూ. కొంచెపఱచు.

కొంచపాఱు

  • సంశయించు. బ్రౌన్.

కొంచియము చేయు

  • కించపఱచు, న్యూనతపఱచు; తక్కువ పఱచు.
  • "శ్యామోదయము కొంచియము చేయ నేతెంచి, శ్యామోదయము హెచ్చగ దనర్చె." చంద్రి. 4. 45.

కొంచుబోవు

  • తీసికొని పోవు.
  • "కూర్మినందన నింటికి గొంచు బోయె." హర. 3. 83.
  • వైదికులలో - ముఖ్యంగా పెద్దవారిలో ఈ రూపం నేటికీ అలవాటులో ఉంది.
  • అయితే ఈ 'చు' 'చ' గా మారడం కద్దు.
  • "వారసీ, మంతిని కీయనో వెలకు మార్చనొ యేటికి గొంచు బోయె ద,త్యంతరయాన..." హంస. 5. 233.
  • "ఈ ఆర్ఘ్యపాత్ర కొంచబోరా." వా.

కొంచెకత్తె

  • సామాన్యురాలు.
  • "ఉవిద నీ వెంత కొంచెకత్తెవె జయం తు, గాపు జేసినగరితవు కావె నీవు." కువల. 4. 173.
  • ఇదే అర్థంలో నేడు 'నీ వేం తక్కువ దానివా? - 'నీ వేం సామాన్యురాలివా' అంటారు. శ. ర. చెప్పిన 'సామాన్యురాలు' సరికాదని వావిళ్ళ ని. అమాయకురా లనుట సరికాదు.

కొంచెకాడు

  • సామాన్యుడు.
  • "కొంచెకాడవె, యన్నన్న నఖాగ్ర నిర్జితారివి గాదే." శుక. 3. 285.
  • వాడుకలో రూపం:
  • "నీ వేం సామాన్యుడవా? దేశాలుజయించినవాడివి." వా.
  • "వా డేం తక్కువవాడా? దేశం తిరిగిన వాడు." వా.
  • చూ. కొంచెకత్తె.

కొంచెపడు

  • 1. కిందపడు, న్యూనపడు.
  • "ఒరు నొద్ద కేగి హైన్యము, పరికింపంగ వేడి కొంచెపడియెడుకన్నన్, మరణం బుత్కృష్టము..." శివధ. 5. 94.
  • 2. అసంపూర్ణ మగు.
  • "తరుణి నీచేత మదనతంత్రంబు లెఱుగ, గోరి యున్నాడునాయాస కొంచెపడక, యుండ సురతసుఖాంబుధి నోల లార్చి, యింపు సొంపార నన్ను మన్నింప వలయు." వి.పు. 2. 217.
  • 3. తక్కు వగు.
  • "తండ్రీ నీ ప్రాసాదంబున నన్నియు సమకూరెడుం గాక కొంచెపడి యెడునే." భోజ. 6. 191.

కొంచెపఱుచు

  • న్యూనపఱచు.
  • "వాసి గను మమ్మ కులశీలవర్తనములు, కొంచెపఱుపక..." వరాహ. 2. 124.

కొంచెపు కవులు

  • కుకవులు. అల్పు లనుట.
  • "వంచకు లగు కొంచెపుంగవుల రవళి యదలించి." పాండు. 1. 16.

కొంచెపునరుడు

  • అల్పుడు. సుమతి. 40.

కొంచెపువాడు

  • అల్పుడు.
  • "పరిమార్తు గొంచెపువా రై యున్నెడన..." భార. ఉద్యో. 1. 14.

కొంచె మగు

  • తక్కు వగు.
  • "ది,క్సీమాగోళము నంతకంతకును గొంచెం బయ్యె లేజీకటిన్." జైమి. 5. 155.

కొంచెమా

  • సామాన్యమా.
  • "అమ్మానినితో పొందు కొంచెమా." శుక. 4. 16.

కొంచెమా నంచెమా?

  • అదేం తక్కువా? జం.
  • "పోతే పోయిందనుకోడాని కదేం కొంచెమా నంచెమా? పదివేల రూపాయలే!" వా.
  • రూ. కొంచెం నంచెమా?

కొంచెము గొప్ప

  • ఏ కొంచెమో.
  • "కొంచెము గొప్ప సంతసము గొల్పిన." పాణి. 1. 15.
  • చూ. కొంచెమో గొప్పో.

కొంచెమో గొప్పో

  • ఏ కొంచెమో.
  • "కొంచెమో గొప్పో ఒకరికి సాయపడితే వారూ మనకు సాయం చేస్తారు." వా.
  • చూ. కొంచెము గొప్ప.

కొంటెకోణంగి

  • కొంటెవాడు.
  • "వాడు ఒట్టి కొంటెకోణంగి." వా.
  • చూ. కొంటెకోణాలు.

కొంటెకోణాలు

  • చూ. కొంటెకోణంగి.

కొంటెపాడి కట్ట

  • ధూర్తుడు, దుష్టుడు. బ్రౌన్. కొంటెభాగోతులు
  • కొంటెకోణంగులు. కుక్కు. 22.

కొండ !

  • అదే గొప్ప, ఘనకార్యం.
  • "రండల కొడుకులు యాచక, తండంబుల కేమి త్రవ్వి తల కెత్తేరా, రెండాకు లొక్క పోకయు, గొండ సుమీ దానశర్వ కోమటి గుర్వా!" - చాటువు.
  • "కొండధరించుట నాకొక కొండా ?" హరి. పూ. 7. 179.

కొండంత.....

  • ఎక్కు వైన; గొప్ప అయిన.
  • "కొడుకు పుట్టెడు నని కొండంత యాసతో, నుండంగ దుది గూతు రుద్భవించె." భోజ. 3. 140.

కొండంత కనకము పోకకు వెలా

  • అసంభవ మనుట, పోక కంత వెలా? తాళ్ల. సం. 9. 285.

కొండంతటి దేవర

  • గొప్ప దైవము. సారం. 1. 16.

కొండంత దేవరకు కొండంత పత్రి పెట్ట గలమా ?

  • గొప్పవారిని అంత గొప్పగానూ గౌరవించ లే మనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "కొండికలము మన కెంతటి, దండి గలుగు నధికవస్తుతతి హరి కొసగన్, గొండంత దేవునకు మఱి, కొండంతయు బత్రి యిడెడు కుశలులు గలరే?" కుచే. 1. 110.

కొండంత పని

  • పెద్ద పని.
  • "అకట ! మోసంబు లేదు కొండంత పనికి, నైన బతిమాలి నీవు పొ మ్మన్న వెడలి." శుక. 2. 376.
  • కొండంత అన్నది గొప్ప అనే అర్థంలో చాలా రూపాలలో కానవస్తుంది.
  • చూ. కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టగలమా? సా.
  • "కొండంత రెడ్డి వచ్చి కొంగు పట్టుకొంటే ఊ అనగుడీనా (గూడునా?) ఆ అనగుడీనా? (గూడునా?)" సా.

కొండకోతి

  • 1. కొంటె కోణంగి.
  • "దానితో నేం లే. అది వట్టి కొండకోతి. అలాగే వెక్కిరిస్తుంది." వా.
  • 2. ఒక పిల్లల ఆట.
  • "దాగిలిమూతలు...గురిగింజ కొండకోతి." హంస. 3. 146.
  • ఇలా కొండతో చేరి అక్కడి - కొండలోని - అనే అర్థంలో చాలా పదా లున్నవి. కొండ కంది, కొండకాకి, కొండగుమ్ముడు, కొండగొఱ్ఱె...ఇత్యాదులు. ప్రత్యేకించి విశేషార్థ మున్న వే ఇట ఉట్టంకి తాలు. మిగతవి ఊహ్యములు.

కొండగా గను

  • గొప్పగా భావించు.
  • "అణుమాత్ర మైన యొక కానుక దెచ్చినఁ గొండగాఁ గనున్. విజయ. 1. 33.
  • "ఆ కొడుకునే కొండగా చూసు కుంటూ బతుకుతున్న దా తల్లి." వా.

కొండగా తలచు

  • గొప్పగా భావించు.
  • "తా నెఱింగియు నీ జాతి గాని దాని, మాట లెల్లను గొండగా మదిఁ దలంచి." విప్ర. 4. 77

కొండ చేయు.

  • గొప్ప చేయు.
  • "గట్టి చన్గవ చేత ముట్టి చూచెద మన్నఁ జెలి యది యొక కొండఁ జేసుకొనెదు." సారంగ. 2. 224.
  • "ఈ కొండమణి కాంచనాకారరుచిఁ గాంచెఁ గొండ లెల్లను దనుఁ గొండ చేయ." విక్ర. 2. 15.

కొండ దాకు

  • అధిక మగు.
  • "నిండువేడుక మిన్నంది కొండ దాఁకె." విజయ. 2. 20.

కొండదాసరి

  • దాసరులలో ఒకభేదం. తర్వాత దాసరికంటె తక్కువైన నీచభిక్షుకుడుగా మారినది.
  • చూ. కొండదాసరితనము.

కొండదాసరితనము

  • నీచభిక్షావృత్తి.
  • "తనదు చెల్లెలి దొడ్డభూధవున కిచ్చి, యతనివలనను సిరి గాంచు నంతకంటె, సార మై తోఁచుఁ గొండదాసరితనంబు." రామలిం. 78.
  • వివరం. చూ. కొండదాసరి.

కొండనాలుక

  • చిఱునాలుక, కిఱునాలుక.
  • "ఎచ్చోట ముచ్చిచ్చు నేడేసి నాల్కలు, కొండనాల్కల దాఁకఁ గోఁతవడియె." భీమ. 3. 37.

కొండను తగరు డీకొన్నట్లు

  • అల్పుడు అధికునిపై విజృంభించేపట్ల ఉపయోగించే పలుకుబడి. పొట్టేలు కొండను డీకొన్నట్లనుట.
  • "గాంఢీవధన్వు నాహవ, పాండిత్యము దలఁప నతని భండనమున మా,ర్కొండు నని యొకఁడు గడఁగుట, కొండం గని తగరుఁ దాఁకఁ గోరుట గాదే." భార. ఉద్యో. 1. 237.

కొండను తవ్వి యెలుకను పట్టు

  • ఎంతో పని చేసి స్వల్ప లాభము పొందు.
  • "ఎంత దవ్వులనుండియో యేఁగుదెంచి, కడెడు మెతుకులకై యింత కష్టపడెడు, కటకటా! యమ్మహీసురాగ్రణి విధంబు, కొండ ద్రవ్వియు నెలుకను గొనుట యయ్యె." కుచే. 2. 112.

కొండ పట్టు

  • దేశాంతరగతు డగు.
  • "గద్దియ డిగ్గి కౌశికుఁడు గాదిలి నూనుఁడు కొండ పట్టినన్." కాశీ. 6. 21.
  • చూ. కొండలు పట్టు.

కొండ పిండి గావించు

  • కొండలను పిండి కొట్టు; అసాధ్య కార్యాలు నిర్వర్తించు.
  • "పిండి గావింతుమో వెండికొండ." కా. మా. 2. 24.
  • ఎట్టి దుష్కరకార్య మైనను చేయుటకు మేము సిద్ధ మనుటను సూచించును. ఇది కొన్ని భిన్నరూపాలలో కనబడుతుంది.
  • "కొండ లన్ని పిండి గొట్ట వచ్చు." వేమన.

కొండపిండి కూరు

  • ఒకానొక చెట్టుపూత దూదికి బదులు పరుపుల్లో దిండ్లలో పెడతారు. ఆ పని చేయు.
  • "బూరుగుదూది కాదు కొండపిండి దిండ్లలో కూరారు." వా.

కొండపొడవు

  • అత్యధికముగా ; రాసులుగా.
  • "కొండపొడవు దెచ్చి వైచిరి." విజయ. 2. 90.

కొండమంగలి క్షౌరం

  • సగం సగం చేసిన పని; ఎగుడు దిగుడుగా చేసినపని.
  • తిరుపతికొండ - తిరుమలపై వెంట్రుక లిచ్చేవా రెక్కువ. అక్కడి మంగళ్ళు బేరం పోకుండా ఒకొకరికి కొంచెం కొంచెం క్షౌరం చేసి కూచుండ పెడతా రని ఒక ప్రతీతి. ఆ జనం ఎక్కువ గనుక ఎగుడు దిగుడుగా నాలుగు బరుకులు బరికి వదిలి పెడతా రన్నది మరొకటి. ఇలాంటివానిపై ఏర్పడిన పలుకుబడి.

కొండమనిషి

  • అనాగరకుడు.
  • "అత నేం కొండమనిషిలా ఆడాళ్ళు కనబడితే అలా నోరు తెరుచుకొని చూస్తా డేం ?" వా.

కొండమల్ల య్య

  • శ్రీశైలమల్లి కార్జునుడు.
  • "కొండమల్లయ్యచే నుండు నందురు గాని, జింకను గాన మే వంక నైన." యయా. 1. 105.

కొండమీద కోతి దిగి వచ్చు

  • ఎలాంటి దైనా అందుబాటులోనికి వచ్చు.
  • "చేతిలో డబ్బు ఉంటే కొండమీద కోతి దిగి వస్తుంది." వా.

కొండముచ్చు

  • కొండముచ్చువలె మూతి ముడుచుకొని ఏమీ అనకుండా ఉండేవారి నంటారు.
  • "ఆపిల్ల కొండముచ్చులా కూచుంటుంది." వా. కొండముసవ
  • మూతి ముడుచుకొని ఏమీ తెలియనట్లు నటించే మనిషి.
  • "అదా అమ్మా కొండముసవ. లోపల కావలసినన్ని బుద్దు లున్నాయి గానీ." వా.

కొండ యెంత వజ్ర మెంత ?

  • చురు కైనది చిన్న దైనా చాలును అనుట.
  • "కొండ పెద్ద దైనా వజ్రం చిన్న దైనా భేదిస్తుంది. నారాయణదాసు భీష్మచరిత్ర.

కొండ యెక్కు

  • 1. గొప్పకు పోవు; విఱ్ఱవీగు.
  • "కొండ యెక్కెదు బతిమాలుకొనిన కొలఁది" సిం. నార. 17
  • "వానిదగ్గరికి పదే పదే వెళ్ళి అడిగామంటే కొండెక్కు తాడు." వా.
  • రూ. కొండెక్కు.
  • 2. దీపం అరిపోవు.
  • "దీపం కొండ యెక్కుతూందిరా. కాస్త ఎగదొయ్యి." వా.

కొండల కేగు

  • అడవుల బట్టు; అనాథ మగు.
  • "కొండల కేఁగెను సత్యము." తాళ్ల. సం. 5. 63.
  • చూ. అడవుల బట్టు.

కొండల నునుపులు

  • పైపై మెఱుగులు; తాళ్ల. సం. 5. 24

కొండలు కోటలు చేసి చెప్పు

  • గోరంతలు కొండంతలు చేసి చెప్పు. తక్కువ వానిని ఎక్కువ చేసి చెప్పు.
  • ".......నీ యపకారకృత్యముల్, గుఱి గడవం బ్రియంబుతమిఁ గొండలు కోటలు చేసి చెప్పితిన్." పంచ. (వేం) 4. 147.

కొండలు దొంతి పేర్చ నేర్చు

  • కొండలను ఒకటిపై ఒకటి పేర్చ నేర్చు.
  • అసాధ్య కార్యములను చేయగల నేర్పరు లని నిరసనగా అనుటలో ఏర్పడిన పలుకుబడి. పండితా. ప్రథ. పురా. పుట. 359.

కొండలు పట్టు

  • దిక్కు కొక రై చెదరిపోవు. దేశాలపా లయి పోవు.
  • "ఆ ఆఢ్యుడు కాస్తా పోయేసరికి యావత్ కుటంబమూ కొండలు పట్టి పోయింది." వా.
  • చూ. కొండపట్టు.

కొండలు పెరుగు

  • ఎక్కు వగు; కొండలుగా పెరుగు.
  • "కోరేటి కోర్కెలు కొండలు పెరుగు." తాళ్ల. సం. 8. 50.

కొండ లేర్లు పండు

  • ఎక్కువగా పండు.
  • కొండలూ, ఏర్లూ పంటకు అనువు గానివి కనుక అవికూడా పండుట సహజంగా సర్వసిద్ధిసూచకం కదా! "కోరినసస్యముల్ కొండలేర్లును బండు." రుక్మాం. 1. 136.
  • ముద్రిత పాఠమున ;కొండ వేలును బండు' అని యున్నది. అది సరి యయిన దనిపించదు.

కొండవీటి చేంతాడు

  • సుదీర్ఘ మని యెత్తి పొడుపుగా అనుమాట.
  • "ఈ ఉపన్యాసం కొండవీటి చేంతాడులా ఉంది. తొమ్మి దైనా ముగిసేట్టు లేదు." వా.
  • నీళ్లు దొరకని ఊళ్ళలో బావులు లోతుగా ఉండడం, సహజంగా అక్కడి చేంతాళ్లు పొడవుగా ఉండడం పురస్కరించుకొని కొండవీటికి బదులు అక్కడక్కడి వారు ఆ యా ఊళ్లను చేర్చి ఈ చేంతాడు నుపయోగించడం కూడా ఆయా ప్రాంతాలలో కానవస్తుంది.
  • రామలింగాయపల్లె చేంతాడు; కొల్లేటి చేంతాడు.

కొండవేలును పండు

  • సమృద్ధిగా పండు.
  • "కోరిన సస్యముల్ కొండవేలును బండు, నెల్లకాలము ఫలియించుఁ దరులు." రుక్మాం. 1. 14.
  • ఈ పాఠం సరికా దనిపిస్తుంది. అర్థం ఎలా వచ్చిందో కుదరదు. వివరానికి...
  • చూ. కొండ లేర్లు పండు.

కొండాటముగా

  • ప్రోత్సాహకముగా.
  • "గండారన్ మదసౌరభంబునకు బింకం బెక్కఁ గ్రోధాగ్నికిన్, గొండాటంబుగ దానసంపదకు నా ఘోషంబుగా..." కుమా. 1. 86.
  • కొండాట. కొండాటము = స్తుతి, వ్యాసంగము, కలహము, కలహశీలము అను అర్థములలో కోశములు ప్రయోగము లిచ్చినవి. ఇక్కడ ఇది విభిన్నార్థద్యోతక మై పైన యిచ్చిన తీరున ఉన్నది.

కొండాటము సేయు

  • పొగడు.
  • "కుచ్చితకాం డ్రన్నఁ గొండాటములు సేయు." మల్హ. 3. 4.

కొండాడు

  • గొప్పగా స్తుతించు. 'కొండ అని ఆడు' అనురీతిగా ఏర్పడి ఉండవచ్చును.
  • "చేడియ యీ నృపాలకుల శేఖరు ... కొండాడఁగ వేయినోళ్లు వలె..." రాజ. చ. 3. 132.

కొండికవాడు

  • చిన్నవాడు, బాలుడు.
  • "ఇప్పు డీ, కొండికవాని నమ్మి పగ గో లిది కార్యమె?" కుమా. 10. 162.

కొండుకవాడు

  • చిన్న వాడు.
  • "వానికిం గొండుకవాని విచిత్రవీర్యు రాజ్యాభిషిక్తుం జేసి..." భార. ఆది. 4. 113.
  • "పరశురాముడు ....దండితాహితుండు గొండుక యయ్యును, దద్ద గుణము లందుఁ బెద్ద యయ్యె." భార. ఆది. 3. 70.

కొండెకత్తె

  • కొండెములు చెప్పునది.

కొండెకాడు

  • కొండెములు చెప్పేవాడు.

కొండెకు నీ రెక్కు

  • పొగ రెక్కు.
  • "వీడి కీ ఊరు నీళ్లు తాగేటప్పటికి కొండెకు నీ రెక్కింది. వీ డింక మనమాట వింటాడా?" వా.

కొండెక్కి కూర్చుండు

  • కలిసి రాక ఉండు. గర్వించి పైన కూర్చొను.
  • "ఏదో నలుగురం కలిసి ఈ వ్యవహారం పరిష్కరించి వేద్దా మనుకుంటే వాడు కొండెక్కి కూర్చుంటున్నాడు." వా.
  • "పిల్ల నిస్తామని మనం వెళ్లే కొద్దీ వాళ్లు కొండెక్కి కూర్చుంటున్నారు." వా.
  • చూ. కొఱ్ఱెక్కి కూర్చుండు; కొండ యెక్కు; కొండెక్కు.

కొండెక్కు

  • తా నేదో మరీ గొప్పవాని వలె పై కెక్కి కూర్చొను.
  • "కొండ యెక్కెదు బ్రతిమాలుకొనిన కొలఁది." సింహాద్రి. శత. 17.
  • "వాని వెనకబడేకొద్దీ వాడు కొండెక్కు తున్నాడు." వా.
  • చూ. కొండ యెక్కు.

కొండెము లల్లు

  • చాడీలు చెప్పు.
  • "వాడిమీదా వీడిమీద కొండేలు అల్లుతూ ఉండడమే వీడిపని." వా.

కొండెములు చెప్పు

  • చాడీలు చెప్పు.
  • "కొండెముల్ చెప్పక యుండ విరాట భూ,వరుని వాకిటి చనవరుల కిచ్చి." శుక. 4. 111.

కొండొక

  • ఒకానొక; చిన్నని... కాస్త...
  • కొండొకడు, కొండొక ప్రొద్దు, కొండొక తొలంగి... ఇత్యాదుల్లో విభిన్న చ్ఛాయలలో ఈ మాట కలిసి వినిపిస్తుంది ఆ యా సందర్భాల బట్టి ఊహించుకొనవలెను.

కొండొక నవ్వు

  • చిఱునవ్వు అని నిఘంటువులు. ఒకనొక విలక్షణ మైన నవ్వు కావచ్చును.
  • "అనినఁ గొండొక న వ్వొలయంగఁ జూచి." భార. విరా. 5. 114.

కొండొక ప్రొద్దు

  • కాసేపు; కొంత సేపు. బస. 5. 127.

కొండొకవాడు

  • చిన్న వాడు.
  • "వీఁడు కొండొకవాఁడు విపినభూములకుఁ, గనికరింపక పంపఁగా నెట్లు వచ్చు ?" గౌర. హరి. ఉ. భా. పం. 1861 - 1862 పం.

కొండ్ర చేయు

  • వ్యవసాయము చేయు. బ్రౌన్.

కొండ్రపోతు

  • ఎలుగుబంటి. బ్రౌన్.

కొంతముకాడు

  • బల్లెం ధరించిన యుద్ధంలోని సైనికుడు. కుమా. 11. 40.
  • చూ. సవడికాడు.

కొందలపడు

  • కలత చెందు.
  • "మనంబు గొందలపడఁగా." భార. ద్రో. 2. 292.

కొందలపఱచు

  • కలత చెందించు.
  • "ఇట్లను వగలు మిగిలి కొందలపఱుపన్." భార. విరా. 1. 97.

కొందలపాటు

  • కలత.

కొందల పెట్టు

  • కలత పెట్టు.
  • "దైత్యుఁడు మమ్ము నింక నే, కొలఁదుల సైఁచునే కరము కొందల పెట్టక." హరి. 4. 22.

కొంపకు నిప్పు పెట్టు

  • కొంప ముట్టించు.
  • "వాడు ఉన్నన్ని నాళ్లూ ఉండి ఆ కొంపకు నిప్పు పెట్టి పోయాడు. మగని మీద పెండ్లానికీ, పెండ్లాంమీద మగనికీ నూరి పోశాడు వెధవ." వా.
  • చూ. కొంపలు ముట్టించు.

కొంప కూల్చు

  • కొంప ముంచు, పాడు చేయు.
  • "...నీవగ లెల్లఁ గంటి మిటు నేర్చితివా యతివా కుమారుఁడున్, నీవును గొంప గూల్చితిరి నేర్పరికూఁతలు చాలుఁజాలు..." సానందో. 5. 179. పు.
  • చూ. కొంప చెఱచు.

కొంప గుండ మగు

  • కొంప గుల్ల యగు; సర్వస్వం నాశ మగు.
  • "తినఁగాఁ గొంపయు గుండ మై దొసగు ప్రాప్తించెం గదే జూదమా ?" వ్యస. నాట. 29.

కొంప గుల్ల చేయు

  • కొంప కూల్చు.
  • "ఎన్ని కొంపలో, గుల్లలు చేసి..." పాణి. 2. 19.
  • చూ. ఇల్లు గుల్ల చేయు.

కొంప చెఱుచు

  • సర్వనాశనము చేయు.
  • "అని వారు తన్నుఁ దునుమం, బనుచుటయును వారికొంప చెఱచుటకై దే,వుని వెనుక నుండి..." శుక. 3. 95.
  • "ఆవిడ డబ్బంతా ఆ కంపెనీలో పెట్టించి వాడు కొంప చెఱిచాడు." వా.
  • చూ. కొంప కూల్చు. కొంప లార్పు, కొంప తీయు. కొంపచెఱుపు
  • ధూర్తుడు, దుష్టుడు.
  • "కొంటె కసుమాలమును దూబ కొంప చెఱుపు." హంస. 5. 113.

కొంప తీయు

  • పాడు చేయు.
  • "ఆవిధి యేమి సేయును మహా ముని ముఖ్యుల మంచుఁ గొంద ఱీ, జీవుల కొంప దీయఁ గడుఁ జిక్కుగ వ్రాసిరి..." కవిమాయ. 4. 73.
  • "తియ్యగా మాటలు చెప్పి నమ్మించి ఆ పిల్ల కొంప తీశా డా వెధవ." వా.
  • చూ. కొంపలు తీయు.

కొంప దీసి.....!

  • ఒక వేళ అలాంటి అనాహూతం జరగ లేదు కదా ! అనుపట్ల ఉపస్కారకపదంగా వినవచ్చే పలుకుబడి.
  • "మనం అన్న మాటలు కొంపదీసి వాడు వినలేదు కదా!" వా.

కొంప నట్టేటిలో గట్టు

  • కూడనిపని చేయు. వ్యసన. నాట. 4.

కొంపమీద పడి తిను

  • ఒకరి యింట చేరి వారి తిండితో బతుకు. అలా తినుటకు అధికారం లేనివారి యెడనే ఉపయోగిస్తారు.
  • "వాళ్లంతా ఆ పిల్ల కొంపమీద పడి తింటున్నారు. ఇంక అ దేం ముందు కొస్తుంది ?" వా.

కొంప ముంచు

  • సర్వనాశనం చేయు.
  • "అన్న కదా అని ఆవిడ ఆస్తి అంతా తీసుక వస్తే, వీడు ఆవిడ కొంప ముంచాడు." వా.
  • చూ. కొంప తీయు.

కొంప మునిగిపోవు

  • అనిష్టము సంప్రాప్త మగు.
  • "ఇం కేముంది? కొంప మునిగి పోయింది. మనవాడు వెళ్లి వాళ్లపక్షాన సాక్ష్యమిస్తా నన్నాట్ట." వా.

కొంప మునుగు

  • అనిష్టము సంప్రాప్తించు.
  • "ఏదో కొంప మునిగినట్లు అర్ధరాత్రి పరుగెత్తు కొచ్చాడు. చేబదులు కావాలట చేబదులు!" వా.

కొంపమ్ముకొను

  • ఉన్న ఆస్తి పాస్తులను పాడు చేసుకొను.
  • "సుందరిని గూడి కొంపమ్ముకొనఁగ లేదొ." శ్రవ. 2. 60.
  • వాడుకలో రూపం: 'కొంపమ్ముకొని పోయాడు' అన్నట్లు ఆత్మ నేపదంగానే ఈ క్రియ వినవస్తుంది.

కొంప లంటుకొను

  • అనాహూతము దాపురించు. విపరీత మైన నష్టమో, ఆపదో వచ్చిన దని చెప్పే పట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "నీవు ఏమో ఒకమాట అని వచ్చావు. అక్కడ కొంపలు అంటుకొన్నాయి." వా.
  • "ఇంత అర్ధరాత్రిలో వెళ్లడం ఎందుకురా? ఏం కొంప లంటుకొన్నాయని?" వా.
  • "వాణ్ణి అలా స్వేచ్ఛగా వదిలేశా వంటే కొంప లంటుకుంటాయి. జాగ్రత్త." వా.

కొంప లార్పు

  • కొంపలు తీయు; ఇతరులను నమ్మించి వారిని పాడు చేయు.
  • "వాడు వట్టి కొంపలార్పే రకం. అట్లా వానితో నీకు స్నేహం ఏమిటి ?" వా.
  • చూ. కొంప తీయు; కొంప చెఱుచు.

కొంపలు కాల్చు

  • చూ. కొంప లార్పు.

కొంపలు తీయు

  • కొంపలు నాశనము చేయు.
  • "వాడు ఇప్పటికి ఎన్ని కొంపలు తీశాడో? ఇప్పుడు ఈయిల్లు చేరాడు." వా.
  • చూ. కొంప లార్పు.

కొంపలు ముంచు

  • ఇతరులను నమ్మించి సర్వనాశనము చేయు.
  • "వాడు ఈపాటికి ఎన్ని కొంపలు ముంచాడో? ఇక్కడ తయారయ్యాడూ." వా.
  • చూ. కొంపలు తీయు, కొంప లార్పు.

కొంపలు ముట్టించే కొఱివి

  • తగాదాలు పెట్టే రకం.
  • "అది ఒట్టి కొంపలు ముట్టించే కొఱివి. అ అన్నదమ్ము లిద్దరూ వే ఱయి పోవడానికి ఇదే కారణం." వా.

కొంపా గోడీ లేదు

  • ఆస్తిపాస్తు ల్లేవు. జం.
  • ఈ గోడీ గోరీ కావచ్చును. బతికినప్పుడు కొంప ఎలాగో, చచ్చినప్పుడు గోరీ అలాగు. అది కూడా లే దనుట.
  • "వాడికి కొంపా గోడీ లేదు. ఏమి చూచి పిల్ల నివ్వ మంటావో తెలీదు." వా.

కొంపోవు

  • తీసికొనిపోవు.
  • "చయ్యనఁ గొంపోయి." రుక్మాం. 5. 80.
  • "చంపినను జంపు నన్నటు, గొంపో కుండినను జాలు." ప్రభా. 3. 143.

కొకిబికి

  • కొక్కిరి బిక్కిరి.
  • "కొకిబికి యంగమున." రాధా. 6. 107.

కొక్కిరి బిక్కిరి

  • అస్తవ్యస్త మయిన.
  • "చెప్పఁగాఁ దొడఁగెఁ గొక్కిరి బిక్కిరి పద్యపుంజముల్." గుంటూ. పూ. పు. 17.

కొక్కురోకో అను

  • కోడి కూయు. ధ్వన్యనుకరణము.
  • "అప్సర స్త్రీనికేతనాభ్యంతరములఁ, గొక్కురోకో యటంచును గోళ్ళు కూసె." హర. 7. 137.

కొక్కొక్కో అను

  • కోడి కూయు. ధ్వన్యనుకరణము.
  • "కొక్కొక్కో యనుచుఁ గోడి కూయఁ దొడంగెన్." వరాహ. 4. 164.

కొక్కొరొకో అను

  • కోడి కూయు. ధన్యనుకరణము.
  • "కొక్కొరొకో యని కుక్కుటంబులు కూసె." కాశీ. 3. 235.

కొక్కొరోకో యను

  • కోడి కూయు. ధ్వన్యనుకరణము.
  • "కొక్కొరో, కోయనికూయఁ డే యతఁడు." నైష. 8. 79.

కొక్కోకో

  • కోడి కూయు. ధ్వన్యనుకరణము.
  • "కొక్కొకో యని కుక్కుటచ్ఛట లెలుంగుల్ రెచ్చె నల్దిక్కులన్." బహు. 3. 94

కొట్టకొన

  • చిట్టచివర.
  • "ఆ చెట్టు కొట్టకొనాన ఒక పండు వేలాడుతూ ఉంది." వా.

కొట్టరువు

  • ధాన్య ముంచుకునే కొట్టు.
  • "కొట్టరువునఁ బళ్ళు గొలిపించు చుండ." బస. 6. 168 పు.

కొట్టికత్తె

  • పనికత్తె.
  • "గుత్తులయెడ చిగుళ్లు...కొట్టికత్తెలు పిడికిన..." కేయూర. 4. 50.

కొట్టికాడు

  • పనివాడు, నౌకరు.
  • "హరిణాజినోత్తరీయుఁడు, నిరాయుధుఁడు నగుచు నతని నెల వగునడవిన్, జొరఁ గొట్టికాండ్రు డెక్కెముఁ, బరికించి యెఱింగి కలయఁబడి కూఁత లిడన్." ఆము. 3. 26.
  • రూ. కొటికాడు.

కొట్టి కోలాహలంగా

  • ఎక్కితొక్కి; పూర్తిగా, బాగా.
  • ఎట్లైనా చాలును అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "శేరు బియ్యం అయితే మన అందరికీ కొట్టి కోలాహలంగా సరిపోతుంది." వా.
  • "మూడుసేర్ల బియ్యం వేస్తే వారందరికీ కొట్టి కోలాహలంగా సరిపోతుంది." వా.

కొట్టి కోలాహలము చేయు

  • పాడు చేయు.
  • "కొట్టి కోలాహలము చేసి కూలఁ గ్రుమ్మి, చెండి చెకపికలాడమా యుండె నేని." సారం. 1. 74.

కొట్టినపిండి

  • బాగా తెలియును.
  • "కోమలి నాకు నెట్టి యెడఁ గొట్టినపిండి సమస్తలోకముల్..." కళా. 6. 37.
  • వాడుకలో కూడా ఉంది:
  • "వాడికి వ్యాకరణశాస్త్రం కొట్టిన పిండి." వా.

కొట్టివేయు

  • 1. దొంగిలించు.
  • "వాడు నా పుస్తకం కొట్టివేసినాడు." వా.
  • 2. త్రోసివేయు.
  • "కోర్టులో వాడి కేసును కొట్టివేశారు. ఆనాటినుండీ వాడు మనిషి మనిషి గా ఉండడం లేదు." వా.
  • 3. లెఖ్ఖ తీసివేయు.
  • "ఈ డబ్బు తీసుకొని నా లెఖ్ఖ కొట్టివేయండి." వా.
  • 4. పడగొట్టించు.
  • "దళ వాయితోడ గోడకు, వెలుపటి యిల్లిల్లు గొట్టివేయించి." కువలా. 3. 3

కొట్టుకాడు

  • 1. కొట్టుకొను.
  • "ఇట్టటు బెట్టుగఁ గొట్టుకాడుచున్." రాధి. 2. 89.
  • 2. కొట్టునట్టివాడు.
  • "ఉలుకును గొట్టుకాడు నగు." రాధి. 1. 128.

కొట్టుకొను

  • తన్నుకొను; ఏడ్చు; గట్టిగా చెప్పు.
  • "కడుపు నొప్పితో వాడు కొట్టు కుంటున్నాడు." వా.
  • "పిల్లడు పోయా డని ఆమె కొట్టు కొంటూ ఉంది." వా.
  • "వద్దో ఆవ్యాపారం అని కొట్టుకున్నాను. విన్నాడు కాదు." వా.

కొట్టు చీకుడు గుడ్డలు

  • అంగట్లో నిల్వ వుండిపోయి చీకు పట్టిపోయిన గుడ్డలు. క్రొత్త. 20.

కొట్టుడుబిళ్ళలు

  • గోళీకాయలు.<.big> బ్రౌన్.

కొట్టుపడు

  • దెబ్బ తిను.
  • "కొట్టువడి యటకు మును పే, తిట్టుంబడి." మను. 4. 86.
  • రూ. కొట్టువడు.
  • ఇందుకు దగ్గఱి భావచ్ఛాయలన్నీ ఈ అర్థంతోనే సరిపెట్టు కొనవచ్చును.

కొట్టు మిట్టాడు

  • చెల రేగు, కలతపడు, తన్ను కొను.
  • "రక్కసులు వేడబంబుల, మిక్కిలి నాముకొని కొట్టుమిట్టాడంగా..." యయాతి. 2.
  • "నట్టడవిలోన న న్నిట్టు నట్టు పఱచి, కొట్టుమిట్టాడ నేటికిఁ బట్టభద్ర, పుట్టునకు మున్న లేమకు బొట్టు గట్టి, చెట్ట వట్టుట కొకరుండు పుట్టెఁ జూవె." శకుం. (కృష్ణ) 2. 74.

కొట్టిమిట్టిపడు

  • ఎగిరి పడు.

కొట్ణము దంచు

  • ధాన్యము దంచు.
  • "అప్పుడమివేల్పు జవరాండ్రు కట్ణంబులకై కొట్ణంబు దంచుచు నమ్మహోత్సవాల యాంగణంబున..." హేమా. పు. 81.

కొట్నాలు దంచు

  • ధాన్యము దంచు.
  • "కూరిమి విషయముల కొట్నాలు దంచేము." తాళ్ల. సం. 9. 198.

కొట్లాడు

  • జగడ మాడు, పోట్లాడు.
  • "చుట్టములతోడ నొప్పమి పుట్టినప్పు, డడ్డపడి వారితోడఁ గొట్లాడి యైన, దాని నుడుపంగఁ జొరకున్న వానిఁ గ్రూర,కర్ముఁ డని చెప్పుదురు కర్మ కాండవిదులు." భార. ఉద్యో. 3. 242.

కొడి గట్టు

  • దీపం వత్తి కాలి నల్లవడు.
  • "దీపం కొడిగట్టి వెలుగు తగ్గింది." వా.

కొడిదిపూస

  • మొలతాడులో బిళ్ల. వేం. పంచ. 1. 598.

కొడిమెలాడు

  • నిందలు మోపువాడు.

కొడిమెలు గట్టు

  • అపనిందలు మోపు.
  • "జడముడి జాహ్నవీతటనిశాకర పోతముఁ జూచి యెవ్వ రీ, కొడిమెలు గట్టి పెండ్లికొడుకున్ గడియారము మోవఁ జేసిరి." జైమి. 1. 2.

కొడివడు

  • కదలు.
  • "పన్ని నిలిచెఁ గాయ్వుతో దానవఁ, కుల బలంబు నేల కొడివడంగ." కుమా. 11. 79.

కొడివాఱు

  • దీపం కొనసాగు.
  • "శ్రీకమల గృహము మోము వి, లోకింపఁగ దీపకళికలు కనుంగవ యౌ, నా కొడి వాఱిన సన్న పు, రేకలు నాబొమలు సుందరికిఁ జెలువొందున్." శకుం. 2. 179.

కొడి సాగు

  • కొనలు తేరు.
  • "ఉడుగని వెలుపటి యుద్యోగము వలె కొడి సాగెడి మితి కోరికలు." తాళ్ల. సం. 11. 78.

కొడి స్తంభము

  • ధ్వజ స్తంభము. బ్రౌన్.

కొడుకులు కొమ్మలు

  • సంతానము. జం.
  • "కొడుకులఁ గొమ్మలం బడసి కొండొక కాలము ధాత్రి యేలి." బుద్ధ. 2. 28.
  • "వాని కేం కొడుకులా కొమ్మలా ? అదంతా ఎవరికో పోవలసిందే." వా.

కొడుకైనా కూతురైనా

  • ఉన్న దల్లా ఆ పిల్లే అనుట.
  • "కొడు కైనా కూతు రైనా నా కున్న దల్లా ఆ పిల్లే. ఈ అవస్థంతా దాని కోసం కాకపోతే ఇం కెందుకు?" వా.

కొడుగురు వోవు

  • చలితో కొంకెర్లు వోవు.
  • "సీతునం, గొడుగురు వోయి యున్న సఖుఁ గ్రోతిఁ గనుంగొని." కేయూర. 3. 270.

కొడ్దిపూస

  • కొడిదిపూస
  • చూ. కొడిదిపూస.

కొణుజెక్కు

  • పిడుదులు పశువులకు పట్టు.
  • "ఎరువు తిప్పులు గొని యెల్ల మందలు గొణుజెక్కు." హరి. పూ. 6. 5.

కొతుకుపడు

  • జంకుగొంకులతో సంకోచించు.
  • "లేమిం గొతుకుపడినభర్తను." కాశీ. 2. 79.

కొత్తగా మాట్లాడు

  • నీ మాటలు మామూలుగా లేవు అనుపట్ల 'ఏమిటే! కొత్తగా మాట్లాడుతున్నవే' అంటారు. ఈ ధోరణి యేమిటి? కొత్తగా ఉందే అని భావము.
  • "ఏ నీ కెపుడుఁ బ్రసన్నుఁడ, గానే తరళాక్షి ! క్రొత్తగా నిటు పలుకం,గా నేల?" మార్కం. 5. 205.

కొత్తనీరు వచ్చి పాతనీరు కొట్టుకొని పోయినట్లు

  • ఎవరో - ఏదో - వచ్చి, ఉన్నవారిని - వానిని - తొలగించుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • కొత్తవానితో పాతవి వెనుకబడి పోయినప్పుడు దీనిని ఉపయోగిస్తారు.
  • "కొత్తనీరు వచ్చి పాతనీరు కొట్టుకు పోయినట్లుగా యీ ఇంగ్లీషు చదువులు వచ్చి వేదాలు శాస్త్రాలు మన చదువులన్నీ మూల బడ్డాయి." వా.

కొత్తా పాతా లేదు

  • చాలా కలగలుపు మనిషి.
  • "ఆ అమ్మాయికి కొత్తా పాతా లేదు. అందరితోనూ చాలా హాయిగా కాలం గడుపుతుంది." వా.

కొత్తిమీద కూడు

  • (?)

కొత్తెమ్మసాని

  • యోగిని. విప్ర. 2. 14.

కొదల పొందని

  • అపార మయిన, కొఱత లేని అనుట.
  • "కొదలం బొందనిబహుసంపదలన్." నిరంకు. 2. 85.

కొదలు పడు

  • కొఱతపడు.

కొదల్పడు

  • కొఱతపడు.
  • "నా, తమ్ముని ముద్దుమాటలు గొదల్పడఁ బల్కెడుచిల్కబోద." నిర్వ. 5. 105.

కొదవ కార్యము చూచికొనగ వచ్చు

  • తక్కినపని నెఱవేర్చుకో వచ్చు.
  • "కడప కడ్డము గాఁగఁ బడి సివమాడుము, కొదవకార్యము చూచి కొనఁగ వచ్చు." శుక. 2. 350.
  • వాడుకలో రూపం:
  • "నీ వక్కడికి వెళ్లు. మిగతా పని నేను చూచుకొంటాను." వా.
  • "నీ వతనికి కనబడి రా. మిగతపని నేను చూచుకొంటాను." వా.

కొదవ చేయు

  • తక్కువపఱచు, కించపఱచు.
  • "హితంబుఁ, గోరిక నన్నింత కొదవ చేసితివి!" వర. రా. అర. పు. 215. పం. 15.
  • "పంపఁ దగ దంపినచో మఱి నిన్నుఁ గొదవ సేసినతెఱఁ గగు." విప్ర. 4. 73.
  • "నీ కేం కొదవ చేసినా నని అలా మూతి ముడుచు క్కూ చున్నా వే కోడలా?" వా.

కొదవడు

  • ఆగిపోవు, పని కాక మిగిలి పోవు; తగ్గు.
  • "యాగము కొదవడకుండఁగ, సాగింపుఁడు." శకుం. 3. 106
  • "జనసత్త్వమంచుఁ గొదవడుఁ జూపుల్." సుద. 2. 136.

కొదవపడు

  • తక్కు వగు, లోపము జరుగు.
  • "ఏ మైనఁ గొదవ పడెనొ." విప్ర. 4. 38.
  • "కొదవపడియెఁ బని యనుచున్." వేం. పంచ. 1. 96.

కొదవపఱచు

  • తగ్గించు.
  • "ఎవ్వనియశంబు జగ మెల్ల నెనసి చుట్టు, కొండ యవ్వలి తమ మెల్లఁ గొదవ పఱుచు." కాళిం. 1. 35.

కొదవలు తడవు

  • లోపము లెన్ను.
  • "నేను మీదాన నగుట మీ గానకథలు, వడిన నవ్వేళఁ గొదవలు దడవ రేమొ." కళా. 2. 45.

కొదవ లేదు

  • సమృద్ధిగా ఉన్న దనుట. లోటు లేదు.
  • "ముదిత! మేలు మేలు కొదవ లే దెందు." కళా. 2. 35.
  • నేటికీ వాడుకలో :
  • "వా ళ్లింట్లో పెట్టుపోతల కేమీ కొదవ లేదు." వా.
  • "నీవు మంచి యింట్లో పడ్డావు. నీ కేం కొదవమ్మా కూతురా !" వా.
  • "వాడికి కొడుకులు చేతి కెదిగి వచ్చారు. వాడి కేం కొదవ?" వా.

కొదుకుకొను

  • భయపడు; జంకు.
  • "గోలయును బోలె నొదుగుచుఁ గొదికి కొనుచు." విప్ర. 3. 3.

కొద్దిపడు

  • కొంచెపడు.

కొద్దిపఱచు

  • హీనపఱుచు.
  • "తిట్టె నేనిఁ గొట్టె నేనిఁ గొట్టినఁ గొట్టును, గొట్టె నేని యముడు కొద్ది పఱుచు." వేమన.

కొన కెక్కు

  • పరాకాష్ఠ నందు.
  • "గోవిందుఁడు మన్నించితే కొంచెము దొడ్డున్నదా, కోవరపుసిరు లంది కొన కెక్కుఁ గాక." తాళ్ల. సం. 9. 134.

కొనకొన కోడి

  • నీటికోడి. క్రీడా. 52.

కొనగోర దిద్దు

  • గోటితో వెంట్రుకలను సవరించుకొను.
  • "చెలు వెడఁగోఁ జన్న నిలువుటద్దముఁ జూచి, కొనగోర నటు దిద్దుఁ గురులు విరులు." కళా. 7. 102. కొన మునిగించు
  • పూర్తిగా ముంచు.
  • "కినిసి పల్కితి వారిఁ బిశా చులార పొం,డని యిటు లన్న మాత్రనె మహా శనిపాతమువోలె వారలం, గొన మునిగించె నాపలుకు కుత్సితరూపులు గాఁగఁ జేయుచున్." ఉద్ధ. 1. 188.

కొనల కెక్కు

  • పై కెక్కు; ఉన్నతి నందు. వర. రా. అయో. పు. 269. పం. 4.

కొనలు నిగుడు

  • పెరుగు, వర్ధిల్లు.
  • "కుశల మడిగి ప్రియము కొనలు నిగుడ." భార. అర. 5. 29.
  • చూ. కొనలు సాగు.

కొనలు వాఱు

  • వర్ధిల్లు. ప్రభా. 2. 105.

కొనలు సాగు

  • వృద్ధి చెందు.
  • ఇది తీగలు మొదలగునవి పెరుగుటలో కొనలు సాగుటను బట్టి వచ్చిన పలుకుబడి. ఇలాంటివే కొనలు నిగుడు, తీగ సాగు ఇత్యాదులు.
  • "అనవుడుఁ గనుంగొనల గొనలు సాగు, కనలున..." కా. మా. 1. 57.
  • "శబరకాంతాఘనస్తనశాతకుంభ, కుంభ యుగములఁ గరికరి కొనలు సాఁగె." కా. మా. 3. 12.
  • "లోన దండెమ్ముల లోమలు చుట్టుగాఁ, బెనఁగొని మీఁదికిఁ గొనలు సాఁగి." రాజగో. 1. 96.

కొనలొత్తు

  • వర్ధిలు.
  • "వేడ్కలు కొనలొత్తునపుడు." రంగ. రా. బాల. 25 పుట.

కొనసాగు

  • 1. వర్ధిల్లు.
  • "ఇంకఁ గొనసాఁగుఁ జుమీ కుశలంబు మాదెసన్." పాండు. 4. 53.
  • "రాజీవనయనకు రాగంబు కొనసాఁగె." రాధా. 1. 128.
  • 2. బాగా జరుగు.
  • "శర్వుల చిత్తవృత్తి కొనసాఁగుచు నుండుట." హర. 4. 45.
  • "ఈ విధంగానే ఎన్నాళ్లు కొనసాగుతుం దనుకుంటున్నావు?" వా.

కొనాకులు మేయు

  • పైపైన రుచి చూచు.
  • సమగ్రము, కూలంకషము కాని దనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "....నేను మాత్రము భావికార్యము నెడ కొనాకులు మేయఁబోను..." ధర్మజ. 65 పు. 8 పం. తె. జా.

కొనితెచ్చి పెట్టుకొన్న తద్దినం

  • అనవసరంగా కల్పించుకొన్న చిక్కు.
  • "వా ణ్ణేదో బుద్ధి చాలక ఇంట్లో ఉండమన్నాను. వా డింత పని చేశాడు. ఇదంతా కొని తెచ్చిపెట్టుకొన్న తద్దినంలాగా తయా రయింది." వా. కొని తెచ్చుకొను
  • బుద్ధిపూర్వకముగా చిక్కులను తెచ్చి పెట్టుకొను.
  • "అనవసరంగా వాణ్ణి మాట్లాడించి తగాదా కొనితెచ్చుకొన్న ట్లయింది." వా.

కొనియాడు

  • 1. పొగడు.
  • "హరుఁ జెడనాడి వీరిఁ గొనియాడెదు." కుమా. 2. 31.
  • 2. గౌరవించు.
  • "కుంతీమహాదేవి కోడండ్రలోపల, నగ్గలంబుగఁ గొనియాడఁ బరఁగి." భార. విరా. 2. 216.
  • 3. స్తుతించు.
  • "కొనియాడిన నాపై కోప మేల?" త్యాగయ్య.
  • 4. ప్రోచు.
  • "అతని పుత్రకులు దాని, నెంగిళులు వెట్టి కొనియాడ నెలమిఁ బెరిఁగి." భార. కర్ణ. 2. 54.
  • 5. పెద్దగా ఎంచుకొను.
  • "విధివశమున వచ్చిన కీ, డధములు గొనియాడి వ్రేఁగు లై విపులభవాం,బుధి మునుఁగుదురు." భార. ఆను. 1. 9.

కొనుకొను

  • వెలకు పుచ్చుకొను.
  • "బ్రదుకు గలిగె, నేని యర్థంబు లీరాని విచ్చి యైనఁ, బొందు గొనుకొందు నెట్లరవిందనయన." ఉద్భ. 2. 168.

కొనుగోలు

  • అమ్మకం.
  • "ఆ భూమి వాని కప్పుడే కొనుగోలయి పోయిం దట." వా.

కొనుబడి

  • విక్రయం.

కొనుమొదలు

  • సంచకరువు (?)
  • కొనుట కిచ్చిన సొమ్ము అని... బ్రౌన్: శ. ర.

కొన్న, అంగడిలోనే మాఱు బేరమా

  • కూడనిపని అనుట.
  • "నిన్నుం డేమానిసి యే, ని న్నేలిం జేయఁ బూనె నెలఁత బలారే, కొన్నం గడి లోపలనే, యన్నవలా మారుబేర మగునే చెలియా?" రాధి. 3.

కొప్పు పట్టి ఈడ్చు

  • ఆడవాళ్లను శిక్షించుటలో కొప్పు పట్టి లాగుట ఒకటి.
  • "నా యిగురుఁబోడి కొప్పు పట్టి తివం బోవ..." కళా. 3. 127.

కొప్పువల

  • తల వెండ్రుకల బంధించు ముత్యాలసరము. బ్రౌన్.

కొ ప్పెక్కించు

  • పై కెత్తు, గౌరవించు.
  • "లలిఁ గొప్పెక్కించితి మధు, పుల శుకులకు నడుగుపఱచి పుష్పాస్త్రా!" చంద్రా. 5. 91.
  • ఇక్కడ కొప్పు ఇంటికొప్పు.

కొప్పెత్తు

  • పరాజిత మై పాఱిపోవ నుంకించు.
  • కోడిపందెములలో ఓడిపోయిన కోడి కొ ప్పెత్తడం, అలా యెత్తిన వెంటనే పారిపోవడం కనబడుతుంది. మెడమీది ఈకలు పైకి లేవడాన్ని కొప్పెత్తడ మంటారు. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "అదేమిట్రా? అన్ని మాట్లాడి అతను రాగానే కొప్పెత్తావు." వా.
  • "ఆ కోడి కొప్పెత్తింది." వా.
  • "నా కోడికి కత్తికట్టగానే నీ కోడి కొప్పెత్తుతుందో లేదో చూడు." వా.
  • చూ. ఎత్తి పోవు.

కొమరాలు

  • 1. యువతి.
  • "కొమరాలి సిబ్బెంపు గుబ్బ పొందమ్మి మొగ్గలు." శకుం. 2. 87.
  • 2. సుందరి.
  • "అట్టి కొమరాలు భాగ్యోదయమున, వచ్చి కామింప నొల్లని వాఁడు గలఁడె." భాగ. 3. 787.
  • 3. ఆడుది.
  • "తమ్మి కొమరాలు పద్మనేత్రములు ముడిచె." వేం. పంచ. 4. 234.

కొమరునాడు

  • యౌవనం.
  • "కొమరునాఁడే చెల్లె మావైఖరుల్." కకు. 4. 26.

కొమరుబాయము

  • యౌవనము. కళా. 4. 46.

కొమరు మిగులు

  • అంద మగు.
  • "కువలయానందకరలక్ష్మిఁ గొమరు మిగిలి." జైమి. 1. 27.
  • "పులుఁగుల గమికాఁడు పలు దెఱంగుల దాఁటు, గుఱ్ఱంబు బంటు నై కొమరు మిగులు." రుక్మాం. 1. 125.

కొమరు మెఱయు

  • అందముగా నుండు. పాండు. 3. 32.

కొమరేఱు

  • స్వామిపుష్కరిణి.
  • "కొమరేఱు కల్యాణకమలషండంబుల." భీమ. 2. 62.

కొమరొందు

  • అంద మగు.
  • "కొండిక మచ్చయును బోలెఁ గొమరొందు." పాండు. 2. 60.

కొమ్మ నాటు

  • చెట్లు వేయు. కొన్ని మొక్కలను విత్తనం అవసరం లేకుండా కొమ్మలు తెగ నఱికి నాటితే చెట్లవుతాయి. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "కొమ్మ నాఁటంగ దగునెడఁ గొమ్మనాఁటు..." కళా. 4. 79.

కొమ్మలు వోవు

  • కొనలు దేరు, వర్ధిల్లు.
  • "రతి కోర్కులు కొమ్మలు వోవ." నిర్వ. 8. 73.

కొమ్ము కాచు

  • సహాయముగా ఉండు. నీపక్షం నే నుంటాను లే అనుపట్ల ఉపయోగిస్తారు.
  • "నీ కెందుకు? నువ్వు ముందు నడు. నేను కొమ్ము కాస్తాను." వా.

కొమ్ము కొట్టే గుణం

  • ఇతరులను వెనుక అవహేళన చేసేగుణము.
  • ఎద్దులు కొన్నిటికి కొమ్ముకొట్టే గుణం ఉంటుంది. రాత్రిలో తడవ తడవకూ కొమ్ము గాడిపాటి రాతికో కంబానికో వేసి కొట్టుకుంటుంటాయి. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "వా డంతా మంచివాడే కాని వెనకల ఎత్తివేస్తూ ఉంటాడు. ఆ కొమ్ము కొట్టే గుణం ఒకటి లేకపోతే..." వా.

కొమ్ముతీరు

  • పశువుల విషయంలో గణించ వలసిన లక్షణం.
  • కొమ్ముతీరూ, నడకతీరూ చూచి ఎద్దును కొనా లంటారు.
  • "ఈ కోడెకు కొమ్ముతీరు బాగా ఉంది." వా.
  • కొమ్ము పూర్వపదంగా కొమ్ము కాకర, కొమ్ముచేప, కొమ్ముటుడుము, కొమ్ము టేనుగు, కొమ్ము తేజి, కొమ్ము పెసర - ఇలాంటి పదాలు చాలా చాలా ఉన్నవి. కాని విశేషార్థస్ఫూర్తి, విభిన్నార్థస్ఫూర్తి ఉన్న కొన్నే ఇట ఇవ్వబడినవి. మిగతవి ఊహ్యములు.

కొమ్ము మాచకమ్మ

  • స్తనా లున్న మాచకమ్మ. బ్రౌన్.
  • మాచకమ్మ అంటే సమర్త కాకుండా ఉండే స్త్రీ.
  • "మాచికమ్మ సమర్త మఖైతే నేం పుబ్బ అయితే నేం?" సా.

కొమ్ములాడు

  • పంది ; కొమ్మువాడు.
  • "లాఁచి తప్పిన జాగిలము రొట్టు కొట్టునఁ, గూడినపిడిఁ గూల్చెఁ గొమ్ము లాఁడు." కకు. 4. 77.

కొమ్ములు చివ్వు

  • పౌరుషము లెక్కించు.
  • "పరుల,కొమ్ములు చివ్వినఁ గొంక నేరుతునె." వర. రా. యు. 59 పు. పం. 7.

కొమ్ములు చూపి గేదె బేరమాడు

  • విషయం అంతటిని బయట పెట్టకనే వ్యవహారం సాగించడానికి పూనుకొన్న ప్పుడు అనే మాట.
  • "అసలు ను వ్వేం రాశావో యేమిటో చూపకుండానే పత్రికలో వేసుకుంటారా లేదా అంటే యేం చెప్పను? వా.
  • "నీ వ్యవహారం చూస్తే కొమ్ములు చూపి గేదె బేర మాడినట్లుగా ఉంది." వా. కొమ్ములు తిరిగిన
  • గొప్పపేరు గడించిన.
  • "ప్రపంచమునఁ గొమ్ములు తిరిగిన విద్వాంసు లున్నారు." సాక్షి. 320.
  • చూ. కొమ్ములు మొలుచు; కొమ్ములు వచ్చు.

కొమ్ములు మొలుచు

  • అంత గొప్పవాడా? కొమ్ములు వచ్చినవా? అనుట.
  • "వాడి కేం కొమ్ములు మొలిచాయా? వాడు తప్ప మరెవడూ పనికి రా డంటావు?" వా.
  • చూ. కొమ్ములు వచ్చు; కొమ్ములు తిరుగు.

కొమ్ములు వచ్చు

  • గొప్పవా డగు; ఆధిక్యం కలుగు. సాక్షి. 47.
  • "పోనీ. వాడే రానీ. వాని కేం కొమ్ము లొచ్చాయా?" వా.
  • చూ. కొమ్ములు మొలుచు.

కొమ్ములు సూపు

  • బెదరించు.
  • ఆధిక్యము కనబఱచు. ఇక్కడ శ్లేషలో ఈ అర్థం ఉన్నది.
  • "అబల నీయెలుఁగు పికారావ మని నీకుఁ, జూతమ్ముఁ గొమ్ములు సూప వెఱచు." కుమా. 5. 165.
  • "కుంభోదకముఁ బోసి యంభోజముఖి పెంపఁ, జూతంబు కొమ్ములు సూపఁ దొడఁగె." విక్ర. 1. 156.

కొమ్మెక్కి కూర్చుండు

  • ప్రాధేయపడు కొలది బిగువు సూపు.
  • "అయ్యా మీరు చెప్పినట్లే చేస్తా మని మనం లొంగేకొద్దీ అతను మరీ కొమ్మెక్కి కూర్చుంటున్నాడు." వా.
  • చూ. కొఱ్ఱెక్కి కూర్చుండు.

కొయ్య

  • విరసుడు. సరసుడు కాని వాడు.
  • "ఆలుబిడ్డ లేని యట్టి త్రిమ్మరి యగు, కొయ్య గాక కుదుట గూడు వెట్టి, కుడుచువార లిట్టి క్రొవ్విదంబులు సేయఁ, జొచ్చు టిచ్చగించి చూతురయ్య." భార. ఉద్యో. 2. 9.

కొయ్యకాటుక

  • ఒక రకమైన కాటుక. వివరం తెలియదు. 'దళముగా నలఁదిన కాటుక.' అని వావిళ్ళ ని.
  • "కుటిలంపుఁ జూపులుఁ గొయ్యకాటుకలు." పండితా. పర్వ. 341 పు.

కొయ్యకాలు

  • సజ్జ జొన్న వరి ఇలాంటి పైరు కోయగా నేలపై మిగిలిన మొక్క.
  • "చేలపంటల కొయ్యకాలె తెలుపు." రామలిం.
  • నేడు 'కొయ్య' లనే వీని నంటారు. కొయ్యకూర
  • తోటకూర.

కొయ్యతోటకూర

  • ఒక విధమైన కూర.

కొయ్యతనములు

  • 1. దుడుకుపనులు
  • "నీవు దర్పమునఁ జేయు కొయ్యతనములు వీక్షించి." కాశీ. 4. 94.
  • 2. శఠత్వం.
  • "కొయ్యతనమునఁ గోపించుఁ గొంత తడవు." వరాహ. 11. 76.
  • 3. పారుష్యం.
  • "సురశాఖ యయ్యుఁ, గొయ్యతనమున వర్తింపఁ గోరఁ డెచట." ఉద్ధ. 3. 333.

కొయ్యనగాడు

  • మూర్ఖుడు; దుష్టుడు.
  • "కొఱగాని జఱభులఁ గొయ్యనగాండ్ర, గొఱియల వార్తలు గూడునే త్రవ్వ." బస. 5. 91.

కొయ్య పొడ్వనా

  • ఎందుకు? కాల్చనా? అనే అర్థంలోనే ఉన్నమాట.
  • "...భక్తి విహీనులబ్రదుకు, గొయ్య బొడ్వన దానిఁ గొనిపోయి గాల్ప." పండి. పర్వ. ద్వితీ. 418. పు.

కొయ్యల గోపి

  • కోతివెధవ.
  • "వాడు ఒట్టి కొయ్యల గోపి, వాడి దగ్గరికి వెళ్లా వంటే నీపని అసలు కాదు." వా.

కొరకచ్చు

  • కొఱివి కట్టె. ఒక తిట్టు.
  • "అగ్గిరాములు కొరకచ్చు లక్కు పక్షులు." ప్రభా. నాట. 5.

కొరకరాని కొయ్య

  • 1. ఏమాత్రం ఎవరిమాటా వినని మనిషి.
  • "వాడా? కొరకరానికొయ్య. ఎవ డేం చెప్పినా వినడు." వా.
  • 2. అవగాహనకు అతీత మయినది.
  • "నైషధం కొఱకరాని కొయ్య. అర్థం కావడం కష్టం." వా.

కొర కొర మను

  • చెలరేగు.
  • "అందుల కసూయ గొరకొర మంచు మిగుల." సారం. 3. 127.

కొర కొర లాడు

  • కోపముతో చిరచిరలాడు.
  • "ఆ పిల్ల పొద్దున్నుంచీ యేమో కొర కొర లాడుతూ ఉంది. ఏ మంటే యేమో అని నేనూ నోరు మూసుకొని కూర్చున్నాను." వా.

కొరగాని

  • పనికి రాని; అల్పము లైన.
  • "పాప నీ రెన నీర్బలి ప్రాచిపురువు, లాది కొరగానిజంతువు లన్ని విడిచి." హంస. 4. 186.

కొరమాలు

  • పనికి మాలు.
  • "విరసపుఁ బాపముల వినికిచే దీనులెల్లా, గొరమాలె." తాళ్ల. సం. 6. 61. కొఱకరాని కొయ్య
  • దుస్సాధ్యుడు.
  • "వాడు కొఱకరాని కొయ్య. వాడి దగ్గరికి ఎవరూ పోలేరు." వా.

కొఱక వచ్చు

  • కసురుకొను.
  • "వాడు మాట్లాడితే చాలు కొఱక వస్తాడు."
  • చూ. కఱవ వచ్చు.

కొఱకుల తెరువుల పట్టించు

  • అడవులపాలు చేయు, తఱిమి వేయు ; కొఱకు = బీడు.
  • పచ్చికబీళ్లు పట్టించు - దిక్కులు పట్టించె ననుట వంటిదే.
  • "పురములు గైకొని కొఱఁకుల, తెరువులఁ బట్టించె నన్ను దిక్పాలకులన్." ఉ. హరి. 1. 129.

కొఱకొఱ చూచు

  • కోపముతో చూచు.
  • "వా డెందుకో ఈ మధ్య నేనంటే కొఱకొఱ చూస్తున్నాడు." వా.

కొఱకొఱలాడు

  • రుసరుసలాడు. రసిక. 5. 163.

కొఱ గల

  • పనికి వచ్చునట్టి.
  • "తఱి చనుదేర నాతని కుక్షివలనఁ, గొఱ గల యొక మంచి కొడుకు జనించె." ద్వి. భాగ. 8. శ. ర.

కొఱగాడు

  • పనికి రాడు, సరిపడని వాడు.
  • "ఏలినవానిన్, గొఱగాఁ డని కైకొన కిం,దఱఁ దెచ్చితి వీర లీశుదాసులు గారే?" కుమా. 2. 25.
  • వాడుకలో: సరిపడని వా డనుటలో ఎక్కువగా ఉన్నది. రెండవది లేక పోలేదు.
  • "వానికి నన్ను చూస్తే కొఱగాదు." వా.
  • "వాడు దమ్మిడీకి కొఱగాడు." వా.

కొఱగాని

  • పనికి రాని, కూడని.
  • "పతి నే మేనియు నాడుట, సతికిం గొఱ గాదు." రుక్మాం. 4. 27.

కొఱగామి

  • చెడుగు.
  • "పార్థుఁడు తండ్రి బిడ్డలం, గలిపిన మేల కాక కొఱగామియుఁ గీడును నెద్ది పేర్కొనన్." జైమి. 1. 93.

కొఱడు కొట్ర

  • కఱ్ఱా కంపా. జం. బస. 3. 65.

కొఱడుపాఱు

  • కొయ్యబాఱు. బ్రౌన్.

కొఱడువడు

  • కొయ్యబాఱు. అప్ప. 2. 196.

కొఱత పడు

  • న్యూనత పడు, లోపించు.
  • "కొంత దివ్యులలోపలఁ గొఱఁత పడఁగఁ." నిరంకు. 4. 37.

కొఱత పల్కు

  • నీచముగా మాటలాడు, ఉదాసీనముగా మాటలాడు.
  • "పందనుం గొఱఁత పల్కఁడు శూరతఁ దాను మించియున్." ఆము. 2. 40.

కొఱత పెట్టు

  • దాచు, వదలు, మిగుల్చు.
  • "వజ్రనాభు రాజ్యావసాన సామీప్యంబు స్వామికి నేమియుం గొఱంత పెట్టక విన్నవింపుము." ప్రభా. 1. 117.

కొఱ తలచు

  • చెడు తలచు, తప్పని భావించు.
  • "నిరపరాధులమీఁద గొఱ తలంచి..." సానం. 2. 86.

కొఱతవడు

  • లోపము కలుగు; మిగులు.
  • "....గురువులు శిక్షింపఁ గొఱత వడునె." భాగ. 8. 647.
  • "తద్వృత్త మొకటి కొఱఁతపడకుండఁ బ్రత్యక్షపరిచితం బైనది గాదె." హరి. పూ. 1. 48.

కొఱత వెట్టు

  • చూ. కొఱత పెట్టు.

కొఱత వేయించు

  • ఉరి తీయించు.
  • శిక్షగా -
  • "కొఱఁత వేయింతుఁ గను దీనికొఱకు దాని." నిరంకు. 4. 37.

కొఱత వోవు

  • తక్కు వగు. శుక. 2. 166.

కొఱనవ్వు

  • చిఱునవ్వు.

కొఱనెల

  • క్రొన్నెల, బాలచంద్రుడు.
  • "కొఱనెల సుధారసంబునఁ, గఱవోవఁగ నొఱసి కడిగి..." కుమా. 3. 63.

కొఱప్రాణముతో తన్నుకొను

  • అవసానదశలో ఉండు.
  • "ఊర్వుల్, పఱవ మిడిగ్రుడ్ల వణఁకుచుఁ, గొఱప్రాణముతోడఁ దన్నుకొనునమ్మొదవున్." ఆము. 3. 23.

కొఱమాలు

  • పనికి మాలు.
  • "మనచేతఁ, గొఱమాలి చెవులు ముక్కును బోవ నాడు, జంత." వర. రా. అర. పు. 224. పం. 23.

కొఱముట్టు

  • పనిముట్టు.

కొఱలుకొను

  • ఒప్పు.

కొఱవి

  • కఠినుడు, కలహశీలుడు.
  • "వాడు ఒట్టి కొరివి. ఎక్కడికి పోయినా ఏదో తగాదా తెస్తాడు." వా.

కొఱవి చేత పట్టుకొని వచ్చు

  • మండుతూ వచ్చు.
  • "కొఱవి చేతఁ బట్టుకొని చంద్రుఁ డదె వచ్చె." కళా. 6. 269.

కొఱవితో తల గోకునట్లు

  • బాధోపశమనార్థ మై పోయి మరింత బాధ తెచ్చు కొన్నట్లు అనుట.
  • తల నవ్వ పెట్టినప్పుడు చేతితో కాక కొఱవితో గోక్కుంటే నవ్వమాట దేవు డెఱుగును ముందు తలా కాలి పోతుంది కదా!
  • "కొఱవి గొని వెఱ్ఱినే తల గోకి కొనఁగ." భార. అర. 5.
  • "ఎఱిఁగి యెఱిఁగి తన యౌఁదల, కొఱవిం గొని గోకఁ దివురు కుమతియుఁ గలఁడే." పాండు. 5. 254.
  • "ఇట్టి చలపాది నౌట న న్నెఱిఁగి యెఱిఁగి, యెట్లు గైకొనె దమయంతి నీ నలుండు, కొఱవి చేఁ బూని తల గోకుకొనఁ దలంచెఁ, గటకటా గర్వమున మీఁదు గానఁ డయ్యె." నలచ. 4. 252.

కొఱవిదయ్యము

  • బగ్గుబగ్గు మని మండుతూ చీకటిలో కనిపించే నేలమీది మంట లాంటిది.
  • అది దయ్యం కాకున్నా దయ్య మని పాతనమ్మకం.

కొఱవి వీచినభంగి

  • కొఱవి త్రిప్పినట్లు.
  • గిరగిర తిరుగుతూ మిఱుమిట్లు గొల్పుతూ అనుట.
  • "అంగుళీయకఖచితో,ర్వను సమవర రత్నోజ్వల, వినుతద్యుతు లెసఁ గెఁ గొఱవి వీచినభంగిన్." కుమా. 12. 158.

కొఱసంది

  • ఆయువుపట్టు.
  • "పఱతెంచి కరిమదము నే డ్తెఱ దొండం బెత్తి వ్రేయ దెప్పఱికమునన్, గొఱసంది దాకి నేలకు, నొఱిగిన..." నిర్వ. 10. 29.

కొఱుకుకు పోవ బడిగల్లు వడు

  • ఆశపడి పోగా అనర్థము కలుగు అని భావము.
  • మేతకు పోగా కాలికి బండ తగులుకొన్నట్లు.
  • దొంగమేత మరిగిన పశువులకు మెడకు మెడకొయ్య వేయడం, కాలికి ఒక గుదిబండను గొలుసుతో కట్టివేయడం అలవాటు. అది మరీ తిరగకుండా ఉండుటకై ఈ శిక్ష.
  • "చింత యెఱుఁగక యేఁగుదెంచితిఁ గొఱుకుడుఁ, బోవ బడిగల్లు వడియె నో పొలతి యనియె." కళా. 3. 105.

కొఱుకుడు పడని

  • అవగాహన కాని. అతిగహన మైన.
  • "అధివాస్తవికకవిత్వం అందరికీ కొఱుకుడు పడదు." వా.

కొఱుకునకు లేక

  • తిండికి లేక.
  • "కొఱుకునకు లేక మూషికకోటి చేర, కునికి మార్జాలజాల మాతని నికాయ, సీమ వీక్షింపఁగా..." శుక. 3. 242.
  • చూ. పంటి కిందికి లేదు, చాలదు.

కొఱుత నుఱుకు

  • ఎంత సాహస మైనా చేయు.
  • "కొఱుత నుఱుకుఁ గాని కొడు కెన్నఁడును గార్య, తంత్రమునకుఁ జొరఁడు." భార. స్త్రీ. 1. 17.
  • 2. క్రూరుడు, దుష్టుడు.
  • "చెలువ మగని దిక్కు చేసన్నఁ జూపి యీ, కొఱుత నుఱుకు ముక్కు గోసె ననియె." విక్ర. 7. 160.
  • "వారలు (కౌరవులు) కదా మీఁదెఱుం గక కొఱుత నుఱుకు లై చెడు తెరువునం బోయెడువారు." భార. ఉద్యో. 1. 343.
  • 3. సాహసి.
  • "చుఱుకు చూపునఁ గాలిన కొఱుత నుఱుకు." కాళ. 3. 71.

కొఱ్ఱు ఇంటికంబము సేయు

  • చిన్న దానిని పెద్ద కార్యమునకు ఉపయోగించు.
  • కంబమువలె కొఱ్ఱు ఇంటికి ఆధారము కా జాలదు కదా!
  • "విన మింతకు ము న్నెన్నఁడుఁ, గని కని కొ ఱ్ఱెవ్వఁ డింటికంబము సేసెన్." ఉ. హరి. 1. 94.

కొఱ్ఱుల బెట్టు

  • కొఱత వేయు
  • పూర్వం శిక్షలలో ఒకటి - ఒక యినుపకొఱ్ఱు నాటి కొఱత వేసేవారు.
  • "వివేకశూన్యులను గొఱ్ఱులఁ బెట్టఁగ లేదు." రుక్మాం. 2. 29.
  • రూ. కొఱ్ఱుల విడు.

కొఱ్ఱెక్కి కూర్చొను

  • అడిగిన కొలదీ దిగి రాక మరింత పైకి పోవు.
  • "ఏదో పిల్ల నిస్తాను చేసుకోరా అని బతిమాలేకొద్దీ వాడు కొఱ్ఱెక్కి కూర్చొంటున్నాడు." వా.

కొలకుండ

  • 1. కొలుచునట్టి కుండ. ధాన్యాదులను బానలతో - కాగులతో కొలవడం నేటికీ ఉన్నది.
  • 2. నేల తవ్వుతున్నప్పుడు ఇంత లోతు తవ్వినా మని తెలియడానికై కొంత భాగం నడుమ తవ్వకుండా వదిలి పెడతారు. క్రింది ప్రయోగంలో ఈ అర్థం సరిపడుతుంది. కొలకొండ్ర అనగా కొలతకై వదిలివేసిన కొండ్ర = నేల - కొలకుండ అయినది.
  • "కుతలంబు నడుకొనఁ గొలకుండ గా నిల్పి, శరనిధిఁ గ్రొచ్చిరి సగరసుతులు." కుమా. 1. 52.

కొలకొల కూయు '*కల కల మని ధ్వని చేయు. ధ్వన్యనుకరణము.

  • "కొలకొలఁ గూయుఁ బై నొఱగుఁ గుత్తుకఁ గుత్తుకఁ జుట్టుఁ బాఱు చి,ల్వల క్రియ." మను. 3. 62.

కొలకొల మని

  • బిలబిల మని. ధ్వన్యనుకరణము.
  • "కొలకొల మంచు మేఁతలకు గూఁడులు వెల్వడు పక్షిరావముల్, కలమృదు వాక్యవైఖరులుగా." పారి. 2. 70. కొలకొల మను
  • కలకలము చేయు. ధ్వన్యనుకరణము.
  • "సందడించుచు దశాక్షౌహిణీ సైన్యంబు, లనిశంబుఁ గొలకొల మనుచు నుండు." జైమి. 1. 84.

కొలకోల

  • కొలత కఱ్ఱ.
  • "ఈ వార్ధి విస్తార మింత యౌ నని నల్వ, కొల్చి తివ్వని కొలకోల యనఁగ..." సుద. 1. 102.

కొల గట్టుకొను

  • హత్యాపాతకమును కట్టు కొను.
  • "కొలగట్టుకొనె వియోగుల వేచి మరుఁడు." వర. రా. కిష్కి. పు. 395. పం. 18.

కొలగాడు

  • ధాన్యాదులు కొల్చువాడు. శ. ర.

కొలగారము

  • ధాన్యం కొలిచినందుకు ఇచ్చే కూలి. బ్రౌన్.

కొలదికి మించు

  • అపరిమిత మగు.
  • "కొలఁదికి మించు కెంజిగురు గుత్తుల మొగ్గలఁ బుష్పగుచ్ఛకం,బులఁ బువుఁ దేనెఁ బుప్పొడుల..." కళా. 1. 118.

కొలదికి మీఱు

  • అధిక మగు.
  • "తలఁపు గొలఁదికి మీఱెన్." భార. ద్రోణ. 2. 229.

కొలది గడచు

  • గడువు ముగించు.
  • "తలఁపఁగ రిపులకు నిమ్మగు, కొలఁదిఁ గడచి వచ్చితిమి." భార. విరా. 4. 93.

కొలది మిగులు

  • అపరిమిత మగు; అధికాధిక మగు.
  • "జగము లెల్ల నిమ్ము సాలక మల్లడి, గొనియె గుహుబలంబు గొలఁది మిగిలి." కుమా. 11. 12.

కొలది మీఱు

  • అపరిమిత మగు.
  • "కొలఁది మీఱు కుడుపుఁ గుడువ మియును." భార. ఆను. 5. 263.

కొలది యిడరాని

  • అపరిమిత మైన.
  • "కొలఁది యిడ రాని యొక వింత చెలువు గలిగి." పారి. 1. 78.

కొలది వెట్టు

  • 1. ఇంతా అని చెప్పు.
  • "...జలనిధులుం, బరఁగిన దీవులు వర్షము, లరయంగాఁ గొలఁది వెట్ట నలవియె ?" భాగ. 5. 211.
  • 2. క్రిందుపఱచు.
  • "పొడవుల సడి సన్న యొడళుల టెక్కియ, మ్ముల పెంపు గగనంబుఁ గొలఁది వెట్ట." భార. విరా. 3. 167.

కొలదివేరు

  • వట్టివేరు. కుమా. 5. 139.

కొలనాడు

  • స్నానము చేయు.
  • "కైసేసి కొలనాడఁ గదలుభంగి." కాశీ. 2. 86.

కొలనికి కాపుండు

  • నిష్ప్రయోజన మగుకార్యము చేయు. గువ్వలచెన్న. 13.

కొలపగ

  • కులవిరోధం.
  • "తీరని కొలపగయుంబలె, నీ రమణికి నాకు నెనయదు." వేం. పంచ. 3. 195.

కొలపగతురు

  • జాతివైరులు.
  • "కొలపగతురు గారె యాచకులు లోభులకున్." వేం. పంచ. 2. 141.

కొల పెట్టు

  • కొలుచు. వరాహ. 12. 43.

కొలముసాములు

  • కులస్థులు, ఒకే జాతివారు. అనగా చుట్టము లనుట.
  • "కొలము సాము లటంచుఁ గూడి రాకుండను, బాదాంగదమ్ములఁ బరిహరింపు." రాజగో. 2. 14.

కొల యొనర్చు

  • హత్య చేయు. కొలై - (తమి) కొలె (కన్న) హత్య అని అర్థము.
  • "నీ వేమొ కొల యొనర్చితి, వీవగ నది సోకు డగుచు నేచఁ దొడంగెన్." శుక. 1. 324.

కొలవేరు

  • వట్టివేరు. కుమా. 5. 149.

కొలసామి

  • జాతిపెద్ద. కేయూర. 3. 150.

కొలారుబండి

  • పై కప్పున్న బండి. శుక. 1. 271.
  • చూ. కొల్లారుబండి.

కొలికికి వచ్చు

  • ఒక రూపమునకు వచ్చు.
  • "కార్యంబును గొలికికి వచ్చినది." వీర. 3. 54.
  • "చిలుకల కొలికిం గనుఁగొన్న నొక్క కొలికికి వచ్చున్." విప్ర. 2. 44.
  • "వాడి మేనమామ వచ్చిన తరవాత గాని యీ వ్యవహారం ఒక కొలికికి రాదు." వా.
  • ఇట్లే : కొలికికి తెచ్చు.

కొలికిపూస

  • ప్రధాన మైనది, ముఖ్యము.
  • "ఇందులో ఈ పద్యం కొలికిపూస."
  • రూ. కొల్కిపూస.

కొలు వగు

  • కొలువు తీరు.
  • "ధవళాక్షుల్ భజియింప నిండు కొలు వై." పాండు. 1. 21.

కొలు విచ్చు

  • దర్శన మిచ్చు.
  • "కొలు విమ్ము రాజన్యకోటికి నెల్ల." వర. రా. అయో. పు. 307. పం. 20. కొలువుండు
  • కొలువు తీరు.
  • "ఆస్థానమ్మునఁ గొలువుండి." జైమి. 3. 5.

కొలువుగొను

  • 1. కొలుచు.
  • "నన్నుం గొలువు గొని మీ రిందు నిలుచుట." దశ. 11. 58.
  • 2. కొలువు తీర్చు.
  • "ప్రజ గొలువుగొనన్." సాంబో. 2. 37.

కొలువు చాలించు

  • సభ చాలించు.
  • "కొలువు చాలించి శచీకంతుఁ డంత:పురంబున కరిగె." నిరంకు. 4. 48.

కొలువు పట్టు

  • సేవించు.
  • "వలదు సీత నిచ్చి నలినాప్తకులనాథు, కొలువు వట్టి యిల్లు నిలుపుకొనుము." రామా. 7. 74.

కొలువు సింగార మగు

  • సభకు తగిన యలంకరణము చేసికొను.
  • "ఈదారి రాజగోపాలశౌరి చెలువు పొంగార కొలువు సింగార మై పదాఱు వన్నె బంగారు కొలువుకూటంబునకు వచ్చి..." హేమా. పు. 5.

కొలువు సింగారము చేసికొను

  • సభకు వెళ్లుటకు తగినట్లుగా అలంకరించుకొను.
  • ఒక్కొక్క సమయానికి తగిన వేష ధారణము సహజము. అందులో రాజాస్థానాలకు వెళ్లునప్పుడు ప్రత్యేకమయిన - నిర్దిష్ట మైనవేషం ఉంటుంది.
  • "కలభాషిణియు...వేగంబు కొలువు సింగారంబు సంఘటించుకొని కృష్ణ నగరి కరిగె." కళా. 1. 208.

కొలువు సేయు

  • సభ చేయు. పాండు. 1. 181.

కొలువు సేసికొను

  • నౌకరీ సంపాదించుకొను.
  • "కని కొలువు సేసికొని మా, లిని నాఁజని..." భార. విరా. 1. 106.

కొలు వొసగు

  • దర్శన మిచ్చు.
  • "ఒక వేళ యవన చోళ కళింగ శక వంగ, గూర్జరు ల్గొలువంగఁ గొలు వొసంగు." శుక. 1. 355.

కొల్పుడు చేతులు

  • నమస్కారములు. హంస. 4. 212.

కొల్ల కొల్ల

  • చాలినంత.
  • "...నుడువు లపుడు, చెల్ల వో యేమి చెప్పుదుఁ గొల్ల కొల్ల." రాధి. 2. 140.
  • "పది రూపాయ లయితే సంత ఖర్చుకు మనకు కొల్ల కొల్ల." వా.

కొల్ల పెట్టు

  • 1. కొల్లగొట్టు. కాశీయా. 244.
  • 2. కొల్లగొను.
  • "అఖిల తీర్థంబులును నాడి యవని సురుఁడు, కోర్కి మైఁ బుణ్యలక్ష్ములఁ గొల్లవెట్టె." కాశీ. 3. 91.
  • 3. ముఖ్యంగా రాయల సీమలో దీనినే పాడు చేయు అనే అర్థంలో ఉపయోగిస్తారు.
  • "ఇంట్లో ఆస్తంతా కొల్లపెట్టినాడు." వా.
  • "కోడలు అత్త చచ్చిన నాలుగునాళ్ల కే తనవాళ్ల కంతా ఇల్లు కొల్ల పెట్టింది." వా.
  • 3. ఏదో ఏడ్చు. విసుగూ, అసంతృప్తిని సూచిస్తూ వంట ఏం చేయాలి అని కోడలు అడిగినప్పుడు అత్త అంటుంది.
  • "ఏదో ఒకటి కొల్ల పెట్టమ్మా? నన్నెందుకు చంపుతావు." వా.

కొల్ల బోవు

  • పా డగు.
  • "నా తపము భక్తిం బాడు గాకున్నె యే,ల విచారింపఁగ నెల్లయున్ వ్రతము కొల్లంబోయినం జూచెదన్."

కొల్ల లాడించు

  • కొల్ల గొట్టించు.
  • "గోవిందు బీరంబుఁ గొల్ల లాడింతు." గౌర. హరి. ప్రథ. పంక్తి. 1146.

కొల్లలాడు/

  • కొల్ల గొట్టు.
  • "భావజుపక్ష మై మిగుల బాలిక తాలిమిఁ గొల్లలాడెడిన్." కళా. 6. 248.
  • "పరిజనంబులు పరిపక్వఫల సుగంధ, కుసుమరసపల్లవంబులఁ గొల్లలాడి." శుక. 1. 375.

కొల్ల లిడు

  • కొల్ల పెట్టు. బ్రౌన్.

కొల్లలు కొమ్ములు పోవు

  • ఎక్కువ యగు.
  • "...ఐహిక భూరి సుఖంబు గొల్లలుం, గొమ్ములు వోవఁగా బనిచె గోమినిశక్తి కుమారుఁ డర్థితోన్." దశకు. 10. 111.

కొల్లలు మీఱు

  • ఎక్కు వగు.
  • "కురవకమునఁ గలుగఁ జేసెఁ గొల్లలు మీఱన్." రుక్మాం. 3. 129.

కొల్ల వట్టు

  • కొల్ల గొట్టు.
  • "గుట్టునఁ గోరిక లెల్లం గొల్ల వట్టె." తాళ్ల. సం. 3. 256.

కొల్ల విడుచు

  • చూఱ విడుచు, విస్తారముగా నొసగు.
  • "కుమ్మ రావంబు కడవలు కొల్ల విడుచు." శివ. 2. 40.
  • "ఉన్న ధనముఁ, గొల్లవిడిచిన బ్రాహ్మణు లెల్లఁ దనిసి." జైమి. 1. 73.
  • చూ. చూఱ విడుచు.

కొల్ల వెట్టు

  • దోచుకొను.
  • "వేల్పు లుద్ధతిఁ బాఱి రాజనివాసముం గొల్లపెట్టి సమస్తవిత్తముఁ గ్రూరతం గొని పోవఁగా." భాగ. 7. 225. కొల్లాడు
  • కొల్ల గొట్టు, తనివి దీర అనుభవించు.
  • "కొ, ల్లాడిరి కైవల్యలక్ష్మి నమరులు మునులున్." కాశీ. 2. 37.

కొల్లాయ (యి) గుడ్డ

  • షష్ఠి పంచ. చిన్న పలుచని తుండు.

కొల్లాయ (యి) పంచ

  • చూ. కొల్లాయగుడ్డ.

కొల్లారుబండి

  • కప్పున్న బండి.
  • "పావ లటు మీటి కొల్లారు బండి యెక్కి, దురదురన రంభ యింటికి నరిగి." కువల. 4. 213.
  • రూ. కొల్లార్బండి.

కొల్లేటి చేంతాడు

  • సుదీర్ఘ మైనది.
  • చూ. కొండవీటి చేం తాడు.

కొల్లేటి మడుగు

  • పెద్దది, అంతము లేనిది.

కొల్లేటి వ్యవసాయం

  • లాభము లేనిది, వ్యర్థము.
  • "అదంతా కొల్లేటి వ్యవసాయం. దాని వల్ల లాభం యే ముంది?" వా.

కొల్చి పోయు

  • వెచ్చించు.
  • "కాలగతులను, పొరి నాయుష్యముఁ గొల్చి పోయుచున్నా రయ్యా !" తాళ్ల. సం. 7. 33.

కొల్వుండు

  • కొలువు దీఱు, సభ తీరి యుండు.
  • "ఉభయవాదులను గొల్వుండి పిల్పించి." పండితా. ద్వితీ. మహి. పుట. 128. నిరంకు. 1.7.
  • రూ. కొలువుండు.

కొల్వు విచ్చు

  • సభ చాలించు.
  • "గుండె జల్లనఁ జేతికులిశంబు వైచి, పండెఁ బొమ్మని దేవపతి కొల్వు విచ్చె." గౌ. హరి. ప్రథ. పం 318-19.

'కొశ్చన్‌మార్కు' మొగం పెట్టు

  • ప్రశ్నార్థకంగా చూచు. చాలా ఇటీవలి పలుకుబడి.

కొళ్ళు కొళ్ళున దగ్గు ధ్వన్యనుకరణము.

  • "కొళ్ళు కొళ్ళున దగ్గుచో..." విప్ర. 4. 19.

కోక చాకియింట వేసి కొక్కిరాలవెంట పోవు

  • ఒకచోట పడవేసి మరొక చోట వెదకు.
  • వ్యర్థప్రయత్న మనుట. తాళ్ల. సం. 8. 175.

కోక వాక

  • బట్ట, పాత. జం.
  • "మునుమున్న తెలిసి యీముది వరాటమునకై, కొంచురా లే నైతిఁ గోక వాక." నిరం. 2. 123.
  • రూ. కోకా వాకా. కోకా వాకా జం.
  • బట్టా బాతా.
  • రూ. కోక వాక.

కోచవాఱు

  • భయపడు.
  • "వేల్పు, రాచవారలు నా కత్తిఁ గోఁచ వాఱ, నితఁ డనఁగ నెంత." చంద్రా. 3. 33.
  • నేటికీ రాయలసీమలో 'కోచ నాయాలు' పిఱికిపంద అనే అర్థంలో ఉపయోగిస్తారు.

కోటకొమ్మ

  • దుర్గప్రాకారం పైభాగము. ఆము. 2. 5.

కోట బలసికొను

  • కోట కావలి కాయు, దుర్గ సంరక్షణ చేయు.
  • "లెక్కకు నెక్కు డగుచు విక్రమాటోపంబునఁ గోట బలసికొనుటయు..." కళా. 8. 75.

కోటరము చేయు

  • అత్తవారింట కాపురము చేయు.
  • కోడంట్రికము చేయు.
  • "అరయమిఁ జేసె నమ్మహా, పురుషుని పాలికిన్ బతులు వోవఁగ వీరలతోన యేను జె, చ్చెరఁ జని కోటరంబు దగఁ జేయుదునో." భార. ఉద్యో. 3. 112.

కోటలో కొల్ల వంకదారలో పోయినట్లు

  • ఒకచోట వచ్చిన లాభం మఱొక చోట పోవుపట్ల ఉపయోగించే పలుకుబడి. కోటలో కష్టపడి దొంగతనం చేసి తెచ్చిన సొమ్మంతా వంకలో కొట్టుకొని పోయినట్లు.
  • "ఇంత చెప్పినచో దమయంతి నిచ్చు, టెంత ఘన మిఁకఁ జెప్పఁగా నేల నీతి, కుశలతను జూడుఁ గోటలోఁ గొల్ల వంక, దారలోఁ బోయినట్టి విధంబు గాదె." నలచ. 4. 68.

కోటలో పాగా వేయు

  • రాజానుగ్రహము సంపాదించు; కార్యానుకూలతను సాధించు.
  • ఏ దైనా విశిష్ట మైన కార్యం నిర్వహించినప్పుడు రాజాస్థానాల్లో పండితులకు శాలువా వలె పాగా నొకదానిని ఇచ్చే వా రనీ, దానిని పాగా వేయుట అనడం కల దనీ, ఇలాంటి అలవాటు మొన్న మొన్నటిదాకా బొబ్బిలి ఆస్థానంలో ఉండే దనీ అక్కడి మిత్రు లొకరు చెప్పినారు.
  • శత్రులు కోట లగ్గపట్టినప్పుడు ఉడుముతోకకు పాగా కట్టి
  • కోటపైకి విసరివేసి ఆ పాగాను పట్టుకొని పైకి వెళ్లి పోవుట కలదు. దానిద్వారా వచ్చిన పలుకుబడి అయినా కావచ్చును.
  • "వాడు కోటలో పాగా వేశాడు. ఇంక వాడి ప్రభ వెలుగుతుంది అన్న మాటే." వా.

కోటానకోట్లు

  • 1. విపరీతముగా, అసంఖ్యాకముగా.
  • "లక్షోపలక్షలు శాఖోపశాఖలుఁ గోటానకోటులు సంఖ్యాతిసంఖ్యలుగా నడుచుసమయంబున." హంస. 3. 29.
  • ".....పూతాతిథి శ్రోతంబులగు బ్రాహ్మణ గృహవాటికలు దాఁటి కోటానగోటు లై కోటకొమ్మల యందు...." కళా. 2. 150.

కోటా పేటాగా ఉండు

  • ఆనుకొని, కలిసి ఉండు. పూర్వం కోటలు, వాని ప్రక్కనే పౌరు లుండే పేటలూ ఉండేవి.
  • "సికింద్రాబాదూ హైదరాబాదూ కోటా పేటాగా ఉంటాయి." వా.

కోటికి పడగెత్తి టాటాలు గుణించు

  • కోటిని కోటానుకోట్లుగా చేయు.
  • "కోటికిఁ బడగెత్తి టాటాలు గుణియింప, నే నేర్తు." విప్ర. 4. 28.

కోటికి పడగెత్తినవాడు

  • కోటీశ్వరుడు. కోటి సంపాదించగనే తచ్చిహ్నంగా ఒక ధ్వజ మెత్తు ఆచారం ఉండి ఉంటుంది. అట్లా వచ్చిన పలుకుబడి.
  • "కోటికి పడగెత్తిన వానిఁ బదివేల కాప వై బ్రదుకు మన్నట్టు." బస. 1. 5.
  • "అన నిట్టి పలువయఱపుల, కును గోటికిఁ బడగ యెత్తి గుఱి యగుపెద్దన్, నిను నమ్మరాదు గా క, ట్లొనరించితె యిట్టి లంచ మొసఁగ నె నీకున్." కళా. 7. 27.

కోటి కొండలుగ

  • ఎక్కువగా, అత్యధికంగా.
  • "నృపుల పదహలరేఖల కెల్ల మా భు,జాగ్రహల రేఖలే మూల మనుచుఁ గోటి, కొండలుగ ధాన్యరాసులు పండ వీట, సుజనభజనైకవిఖ్యాతి శూద్రజాతి." ఆము. 2. 27.

కోటిపడగలు

  • కోటిధనం ఉన్నవా డెల్లా ఒక ధ్వజం కట్టేవాడు పూర్వం. అదే కోటికి పడ గెత్తుట. ఆ ధ్వజాలే కోటి పడగలు.
  • "నలిఁ గోటి కోటిపడగలు, గలిగొనఁ గట్టినను వానిఁ గా దని మదిలోఁ, దలఁపరసంఖ్యార్థ ధ్వజ,ములు గట్టినవారు వైశ్యముఖ్యు లనేకుల్." కుమా. 7. 118.

కోటి సేయు

  • అమూల్య మగు.
  • "సాటి లేనినగళ్లు కోటి సేయ." విజయ. 1. 23.

కోటేరుముక్కు

  • చక్కని ముక్కు.
  • సేద్యంలో కోటేరు వేసినప్పుడు ఎప్పుడూ చాలు తిన్నగా ఉంటుంది. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "ఆవిడ చాలా అంద మైనది. చేరెడు కండ్లు, కోటేరు ముక్కూ, నిమ్మపండు రంగు." వా.

కోటేరు వెట్టు ముక్కు

  • చక్కని ముక్కు.
  • "కోటేరు వెట్టు చెన్ను మీఱిన ముక్కు." వర. రా. అయో. పు. 252. పంక్తి. 3.
  • చూ. కోటేరు ముక్కు.

కోట్యంతరాలుగా

  • కోట్లకొలదిగా. కాశీయా. 276.

కోడంగి యాటలు

  • కోణంగిఆటలు.
  • ఆనందోత్సాహంతో ఎటు పడితే అటు ఆడుతూ ఎగురుతూ ఉన్నా రనుట ఇట ప్రస్తుతము:
  • పండితా. ద్వితీ. పర్వ. పుట. 434.

కోడాడు

  • కుమ్మి కోరాడు.
  • "అమ్మౌని శూలంబు చే, కొని నారాయణప్రాణముల్ రణములోఁ గోడాడఁ జూడన్." ఉత్త. హరి. 6. 45.
  • "అ వ్వేదండంబులు... కోడాడు చుండ." నృసిం. 4. 47.

కోడికునుకు

  • అరనిద్ర.
  • కోడి సగం కండ్లు మూసి నిద్రిస్తుంది.
  • "వాడిది కోడికునుకు. ఎప్పుడు పడితే అప్పుడే మేలుకుంటాడు." వా.
  • చూ. కోడినిద్ర.

కోడి కూసినదాక

  • తెల్ల వారేదాక.
  • "కోడి కూసిన దాకా నిద్ర పట్టలేదు." వా.

కోడి కూసే పల్లె

  • ప్రతి పల్లె.
  • "అంగ రంగ వైభవములు నుం, దిర మగును దేవళంబులఁ, బరఁగఁగ నొక కోడి గూయుపల్లియు నైనన్." విప్ర. 1. 60.
  • "కోడి గూసేపల్లె ఉందంటే కోమటి ఉన్నా డన్నమాటే." సా.

కోడి గ్రుడ్డంత

  • కొంచెము.
  • "కోడిగ్రుడ్డంత యన్నమ్ము కొసరె నొకఁడు." గుంటూ. ఉత్త. 15.

కోడిగ్రుడ్డుకు తంటసమా

  • ఈ మాత్రానికి అంత అవస్థ పడవలెనా?
  • కోడిగుడ్డు పట్టుకొనుటకు తంటసము కావలెనా అనుట.
  • తంటసము అంటే ముక్కులోని వెండ్రుకలు లాగుటకై
  • మంగలి ఉపయోగించే పనిముట్టు. వెండ్రుకవంటి అతి సూక్ష్మ మయినదానిని పట్టుకొనుటకే తంటసం కావాలి కానీ ఇంత లావాటిదానికి ఎందుకు?

కోడినిద్ర

  • అరగన్ను మూతతో నిద్రించే నిద్ర.
  • "వాడి దెప్పుడూ కోడినిద్ర. కండ్లు చూస్తే నిద్ర పోతున్నాడో మేలుకున్నాడో తెలీదు." వా.
  • ఎప్పటి కప్పుడు మేలుకొంటూ జాగ్రత్తగా ఉంటా డనే సందర్భంలో కూడా ఉపయోగిస్తారు.
  • చూ. కోడికునుకు.

కోడిఱెప్ప పెరుగు

  • కనుఱెప్పపై దుర్మాంసం పెరిగే నేత్రరోగము వచ్చు." బస. 3. 74. పుట.

కోడెకాడు

  • యువకుడు.

కోడెగాడ్పు

  • మందమారుతము.

కోడెత్రాచు

  • వయసులో ఉన్న త్రాచు పాము.
  • "కోడెత్రాచును ముద్దు లాడినట్లు." వేణు.

కోడె లమ్మెడు పాటి పరికరము కలదా?

  • ఆ మాత్రం పశుసంపద కలదా? అనుట. ఆ రోజులలో పశువులు కూడా ప్రధాన మైన ధనమే.
  • "పరికరము కోడె లమ్మెడు పాటి గలదె." ఉ. హరి. 4. 308.

కోడెవయసు

  • పడుచుప్రాయము.
  • "...కోడెవయసు, పాక ముఱ్ఱూఁత లూఁగెడు భార్యమీఁద, మనసు చాలించి..." హంస. 5. 115.

కోడెవిటులు

  • పడుచు విటులు. హంస. 1. 212.

కోడెవెధవ

  • పడుచు వితంతువు.
  • "కామాంధల్ వెలనాటి కోడె విధవల్." క్రీడా. 209.

కోణంగిచేష్టలు

  • కోతిచేష్టలు.

కోణంగి యాట లాడు

  • కోతి చేష్టలు చేయు, కొంటె చేష్టలు చేయు.
  • "నటులు చూపిన విద్య నటులఁ గా దంచుఁ దా, నడ్డ మై కోణంగియాట లాడు." రాజగో. 5. 45.
  • కోణంగి - వీధి భాగవతాలలో హాస్యగాడు. దాని మీద వచ్చిన పలుకుబడి. కోణాలగొంది
  • ఒక మూల.
  • "మఠాంతరాళ విశాల వేదులయందుఁ గోణాలగొందిఁ దపంబు సల్పు జనంబు." పాండు. 5. 296.

కోత కోయు

  • చీట్లాటలో మిగతవారు వేసిన రంగుముక్క లేనప్పుడు తన దగ్గర ఉన్న తురుపుముక్క వేస్తే అది కోత కోయడం అవుతుంది. ఆ పట్టు వానికే పోతుంది.
  • చూ. పైకోత కోయు.

కోతలరాయడు

  • డంబాచారి. మాటా. 65.

కోతలు కోయు

  • డంబాచారములు పలుకు. గొప్పలు చెప్పుకొను. సాక్షి. 13 పు.

కోతికి కొబ్బరికాయ అబ్బినట్లు

  • ఎంత అమూల్య మైనా ఉపయోగించుకునే యోగ్యత లేనప్పుడు దొరికీ ఏం లాభం? - అనుపట్ల ఉపయోగిస్తారు.
  • "ఆ ఆడంగుల వెధవకు అంత అందమైన పిల్ల నిచ్చి చేశారు. కోతికి కొబ్బరికాయ అబ్బినట్లుగా ఉంది వాడి పని." వా.
  • చూ. కోతిచేతి కొబ్బరికాయ.

కోతికి కొబ్బరికాయ చిక్కినట్లు

  • అనుపభోగ్య మనుట. కోతికి కొబ్బరికాయ దొరికినా అది అనుభవించ లేదు కదా ! అది యెట్లా పగలకొట్టి తినాలో దాని కేం తెలుసు?
  • చూ. కోతికి కొబ్బరికాయ అబ్బినట్లు.

కోతికి స్త్రీ వేషము

  • అతకనిది. కోతి వికార మైనది. దాని కెంత స్త్రీ వేషం వేసినా కుదరదు అనుట. గువ్వలచెన్న. 75.

కోతికుళ్లాయి

  • చలి తగలకుండా వేసుకొనే ఉన్ని తలటోపీ.

కోతికొమ్మచ్చు లాడు

  • పెద్ద వారితో పరియాచక మాడు; ఒక ఆట ఆడు. కోతి కొమ్మచ్చు లనేది ఒక విధ మైన పిల్ల లాడుకొనే ఆట. చెట్ల మీదనే దొంగకు అందకుండా తప్పించుకొంటూ చెట్టు మొదలు పట్టుకోవాలి. వేసవికాలంలో నేటికీ యీ ఆట పల్లెలలో పిల్ల లాడుతూ ఉంటారు.
  • "నీ అంత స్తెక్కడ? నా అంతస్తెక్కడ? నాతో కోతికొమ్మచ్చు లాడుతున్నా వేమిటిరా?" వా. కోతిచేతి అద్దము
  • చూ. కోతిచేతి కొబ్బరికాయ.

కోతిచేతి కొబ్బరికాయ

  • ఉపయోగించుకో లేనివానికి అమూల్యవస్తువు లభించినప్పుడు అనే మాట. కోతికి కొబ్బరికాయ దొరికితే దాన్ని పగలగొట్టి తినడం తెలియదు కదా !
  • "ఆ వెధవకు అంత మంచి పిల్ల దొరికి మాత్రం ఏం లాభం? కోతిచేతి కొబ్బరికాయ." వా.

కోతిచేతి పూలమాల

  • ఉపయోగం తెలియని వారికి చిక్కిన అమూల్యవస్తువు.
  • "కటకటా! మూర్ఖ మర్కటకరతలస్థ, కల్పతరు నూనమాలికా కల్పుఁ డగుచు." శుక. 1. 364.
  • చూ. కోతిచేతి కొబ్బరికాయ, కోతిచేతి అద్దము.

కోతిచేష్టలు

  • పిచ్చి చేష్టలు.
  • "ఏమిట్రా ! ఆ కోతిచేష్టలు. ఇంత పెద్దవాడ వైనా యింకా మట్టూ మర్యాదా తెలియక పోతే యెలా ?" వా.

కోతిని బ్రహ్మరాక్షసుని చేయు

  • అల్పులను అధికులుగా పొగడు.
  • "వీరధర్మ మిట్లు విడిచి విభీషణ, రాజు నెదుట దాశరథులఁ బొగడఁ, బాడి యగునె క్రోఁతి బ్రహ్మరాక్షసుఁ జేయ, వచ్చినాఁడ వెంతవారు వారు." భాస్క. యుద్ధ. 119.

కోతిపుండు బ్రహ్మరాక్షసి

  • చిన్న దానిని అనవసరంగా పెద్ద దగునట్లు చేయుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • పుండును కెలికి కెలికి కోతులు పెద్దవి చేసుకుంటా యని ప్రతీతి.
  • "ఆ చిన్న వాగ్వాదం కాస్తా కోతిపుండు బ్రహ్మరాక్ష సై హైకోర్టు దాకా వెళ్లింది." వా.

కోతిపుల్లలు

  • మగ్గం దారాలను మీదికి తగిలించే పుల్లలు. బ్రౌన్.

కోనకావలి

  • వ్యర్థము.
  • కోనకు కావలి కాయడం ఎందుకు అనుటపై వచ్చినది. శవజాగరణం లాంటిది.

కోనచీకటి

  • చిమ్మచీకటి.
  • "కోనచీఁకటిలోని కొనరఁ జొచ్చి." కళా. 4. 121.

కోన్ కిస్కా

  • వీఁ డెవడు ? య: కశ్చన.
  • "క్రుద్ధుం డగు భీష్ముముందు కోంకిస్క గజశ్రద్ధుండు కర్ణుఁ డే మగు." గీర. గురు. 45.
  • చూ. కశ్శనగాళ్ళు. కోపకత్తె
  • కోపిష్ఠి.
  • "సుక్షత్రియ కులంబు నిక్షత్రముగఁ జేయు, కొడుకుఁ గాంచినయట్టి కోపకత్తె." క్రీడా. 129.

కోపగాడు

  • కోపిష్ఠి.
  • "అన్న మీ తండ్రి కోపగాఁ డౌనొ కాదొ." కాశీ. 4. 90.

కోపదారి

  • కోపిష్ఠి.
  • "బావ ప్రతికూలుఁడు నాథుఁడు కోపదారి." చెన్న. బస. 4. 277.
  • "మా తమ్ముడు చాలా కోపదారి. నాతో ఏమన్నా అందువు గానీ ఈ మాట వానితో అనేవు. భద్రం!" వా.
  • కోపదారి అను పాఠము సరి కాదు.

కోపము ఆఱు

  • కోపము తీఱు. కోపమును అగ్నితో సమానముగా భావించుటతో వచ్చిన పలుకుబడి.
  • "దీని మ్రింగక వృథా వసియించినఁ గోప మాఱునే." కా. మా. 2. 101
  • చూ. కోపము చల్లాఱు.

కోపము చేసుకొను

  • కోపించు.
  • "వాడు నామీద చాలా కోపం చేసుకున్నాడు." వా.

కోపము పట్టలేక పోవు

  • కోపమును అణుచుకొన లేక పోవు.
  • "ఎంత వద్దన్నా కోపం పట్ట లేక వాడు నాలుగూ అనేశాడు." వా.

కోపము పుట్టు

  • కోపము కలుగు.
  • "పురభేదికిఁ గోపము పుట్టి వీఁడు న న్నించుకయేనియుం దెలియఁడు..." కా. మా. 4. 186.

కోప మెత్తు

  • కోపించు, కోపము వహించు.
  • "కౌరవులు సేయు నవమతికారణముగఁ, గోప మెత్తు." భార. శాంతి. 1. 13.
  • "పెండ్లివారలఁ జూడ నా పిన్న తనము, గూల నింతటిలో వట్టి కోప మెత్తి, తలుపు బిగియించె మగఁడు." శుక. 2. 131.

కోపమే కూడుగా కుడుచు

  • అతికోపిష్ఠి యగు.
  • "కోపమే కూడుగాఁ గుడిచిన యీ బుద్ధి, కోపము విడువు మంటే గుణ మేల మాను." తాళ్ల. సం. 10.18.

కోపిష్ఠి

  • చూ. కోపదారి.

కోపుదారుడు

  • సరుకు బైటనుండి తెచ్చి అమ్మువాడు. శ. ర.

కోపు మీఱు

  • ముందంజ వేయు.
  • "ఏలికలు వెంట వెస నంట నేపు రేఁగి, కోపు మీఱి జవోద్వృత్తిఁ గూడఁ బఱచి." శుక. 1. 259.

కోపులు కల్పించుకొను

  • రకరకాల అంగ భంగిమలు చూపు.
  • "నట్టువకాని యందము గాక వింతగాఁ, గోపులు గల్పించుకొనుచు నాడు." శుక. 3. 14.

కోపు లెత్తు

  • దండెత్తు.
  • "భటరోషశిఖిశిఖప్రభల మ్రింగి బలారి, కులిశధారలమీఁద గోపు లెత్త." సాంబో. 5. 203.

కోమటినిజము

  • అసంభవము. వ్యాపారస్తుడు నిజం చెప్పడం ఎలా సంభవమనుట పై వచ్చినది.
  • చూ. కోమటిసత్యము.

కోమటిమాటలు

  • అటూ యిటూ తేల్చకుండా మాట్లాడే మాటలు.
  • "నువ్వు యిస్తావా లేదా? స్పష్టంగా చెప్పు. ఈ కోమటిమాట లన్నీ యెందుకు?" వా.

కోమటిమైత్రి

  • నమ్మరానిది.
  • వ్యాపారి ఎప్పుడూ తనలాభం చూచుకుంటా డనుటపై వచ్చినది. గువ్వల చెన్న. 67.

కోమటిరహస్యం

  • వాడు రహస్యం అనుకున్నా ఇతరులకు స్పష్టంగా తెలియునది.
  • 'కొండమీద కొట్లాట ఏమిటిరా అంటే కోమట్లు రహస్యం మాట్లాడుకొంటున్నారు అన్నాడట.' సా.
  • "నీ వేదో రహస్యం రహస్యం అని చెప్పావు. నేను వెళ్లేసరికి ఊ రంతా అదే చెప్పుకుంటున్నారు. ఇదంతా కోమటిరహస్యంగా ఉందే." వా.

కోమటివిశ్వాసము

  • నమ్మ రానిది.
  • చూ. కోమటి మైత్రి.

కోమటిసత్యము

  • అసంభవము.
  • కోమటి వర్తకంలో సత్యంగా యిది యింతే నని చెప్పినా అది నిజ మై ఉండదు. రాధి. 4. 79.
  • చూ. కోమటినిజము.

కోమటిసాక్ష్యం

  • అటూ యిటూ కాకుండా చెప్పే సాక్ష్యం.
  • ఒక గుఱ్ఱం ఎవరిది అన్న తగాదా వచ్చి యిద్దరు రాజుగారి దగ్గరకు వెళ్లారు. అందులో సాక్ష్యంగా వచ్చిన ఒక వైశ్యుడు ముందువైపు చూస్తే రంగన్నది వలెనే ఉన్న దనీ, వెనక వైపు చూస్తే రామన్నది లాగే ఉన్న దనీ చెప్పా డని ఒక కథ. అలా వచ్చిన పలుకుబడి.
  • "నీవు ఏదో ఒకటి తెగ జెప్తా వని వస్తే కోమటిసాక్ష్యం చెప్తా వేమిటి?" వా. కో యని యార్చు
  • 1. కూత వేయు. ధ్వన్యనుకరణము.
  • "కో యని యార్చినం దెసలఁ గుంజరముల్ సెదరెన్." కా. మా. 2. 35.
  • 2. అఱచు.
  • "గురుతర లీల పద్య మది కో యని యార్చుచు నుండె." గుంటూ. ఉత్త. 30.
  • అఱచుటలో ధ్వన్యనుకరణము.
  • "నింగి కయి కుంచె యెత్తి వె,సం గో యని యార్వ." మను. 4. 59.

కోరకొండె

  • వంపుగా ముడివేసిన సిగ. శ. ర.

కోరకొప్పు

  • ముడి వేసి ఒక ప్రక్కగా వెండ్రుకలలో దూర్చి ఓరగా పెట్టిన కొప్పు. కుమా. 8. 143.

కోరకొమ్ము

  • వంపుగా వాడిగా ఉన్న కొమ్ము.
  • "హోమకుండముల పై కుఱికి కొంకర, కోరకొమ్ములఁ గోరాడుఁ గొంత తడవు." వరాహ. 11. 76.

కోరగొను

  • కొంకరలు పోవు.
  • "కాళ్లు నేలపైఁ ద్రొక్కఁగ రాక కోరగొని తొట్రుపడంగ." పద్మ. 3. 79.

కోరచూపు

  • క్రూర మైన చూపు.
  • "కోరచూపుల యెఱ్ఱ చేరు గ్రుడ్డుల వాఁడు." వరాహ. 2. 45.

కోరదౌడ

  • చప్పిదౌడ. భార. మౌ. 25.

కోరపాగ

  • వాలుగా చుట్టిన పాగా.

కోరమీస

  • చూ. కోరమీసములు.

కోరమీసము

  • చూ. కోరమీసములు.

కోరమీసములు

  • పొడుగాటి మీసాలు.
  • "మనుజ రక్త సిక్త తనువును గోరమీ, సములు..." భార. అశ్వ. 3. 87.

కోరలు తీసిన పాము

  • ఏమీ చేయ లేనివాడు - లేనిది - తన శక్తిని చూపగల సాధనమును కోలుపోయిన వారి పట్ల ఉపయోగించే సామ్యం.
  • "వెడగొడ్డుఁ బులి నాకి విడిచిన ట్లైన, జడిసి తొల్లిటి తన జంజాట మెల్ల, నుడిగి కోఱలు లేనియురగంబుఁ బోలె, వడి చెడి...." గౌ. హరి. 2. భా. 973.
  • "ఉద్యోగం ఉన్నన్నినాళ్లూ మహా విజృంభించాడు. అది పోయేసరికి కోరలు తీసిన పాములాగా మూల బడి ఉన్నాడు." వా. కోరలు పెఱికి వేయు
  • పొగ రణచు.
  • కోరలు పీకివేస్తే పాము ఏ చేయగల దనుటపై వచ్చినది. మాటా. 52.

కోరలు లేని ఉరగము

  • ఏమీ చేయలేని దనుట. గౌ. హరి. ద్వి. 975.
  • చూ. కోరలు లేని పాము.

కోరవాఱు

  • క్రూర మగు. వరాహ. 3. 20.

కోరవోవు

  • కొంకరవోవు. పక్షవాతంతో పడిపోవు. హరి. పూ. 7. 171.

కోరసిగ

  • ఓరగా వేసుకొన్నముడి.
  • "కోరసిగ వేయుచోటనే కొమ్ము పుట్టి." రామా. 2. 110.

కోరాబంగారు

  • తగ్గుబంగారు.

కోరిక లిగురొత్తు

  • కోరికలు కలుగు.
  • "నారథుఁడు పుణ్యక వ్రత, మారూఢిగ నెఱుఁగఁ జెప్ప నవహితమతి యై, కోరిక లిగురొత్తఁగ." పారి. 5. 63.

కోరిక లీడేరు

  • కోరికలు తీరు.
  • "నా కోరిక లీడేరఁగఁ, గైకొనవలె నీవు." కా. మా. 2. 14.

కోరిక లీరిక లెత్తు

  • కోరికలు కలుగు.
  • "ఎలమితోఁ గోరిక లీరిక లెత్తిన, సరణి మేఁ బులకలు జాదుకొనఁగ." విక్ర. 1. 122.
  • చూ. కోరికలు గంతులు వేయు.

కోరికలు గంతులు వేయు

  • కోరిక లధిక మగు.
  • ".....మనంబులోపలం, గంతులు గోరి కోరికలు గంతులు వైవఁ గృషీవ లాజ్ఞ...." శుక. 2. 455.
  • చూ. కోరిక లీరిక లెత్తు.

కోరికిపడు

  • మోజుపడు.
  • "విని వీక్షించినదాఁక ముచ్చటపడున్ వీక్షించి గాఢోపగూ,హనలాభం బగు దాఁకఁ గోరికిపడున్." మల్లభూ. శ్ర్. 22.

కోరువెట్టు

  • బలి యిచ్చు.
  • "అరులకుఁ గోరు వెట్టితి కదా నినుఁ దమ్ముఁడ..." రామా. 8. 38.

కోర్కుల నంద గను

  • మనోరథము లీడేర్చుకొన గలుగు.
  • "పారిజాతంబు నామ్రోలఁ బండి యుండ, నందఁ గంటి నాకోర్కుల నందఁ గంటి." ఉ. హరి. 2. 176.

కోర్కుల పంట

  • మనోరథసిద్ధి.
  • "ముం, గొంగుపసిండి భక్తులకుఁ గోర్కుల పంట, జగంబులందు మా..." అని. 1. 42. కోర్కులు నిండించు
  • కోరికలు తీర్చు.
  • "కోర్కులు నిండించు కూరిమి తనయుఁడు." గౌ. హరి. ప్రథ. పం. 61.

కోర్టు కీడ్చు

  • రచ్చ కీడ్చు ; వ్యాజ్యం వేయు.
  • "కోర్టు కీడ్తురొ యేమొ నా కొంపదీసి." గుంటూ. ఉత్త. 119.
  • "పాపం దేవుడా అని మూల ఉన్న వాణ్ణి వాడు కోర్టు కీడ్చాడు." వా.

కోర్టు కెక్కు

  • వ్యాజ్యాలపా లగు.
  • "వాళ్ల నాన్న చనిపోయి యింకా రెండు నెల్లయినా అయిందో లేదో ఆ అన్నదమ్ము లంతా కోర్టు కెక్కారు." వా.

కోఱకొమ్ము

  • వాడి గల కొమ్ము.

కోఱడ మాడు

  • హాస్య మాడు. కుమా. 6. 45.

కోఱపల్లు

  • కోఱ.

కోఱలు తీసిన పాము

  • చూ. కోరలు తీసిన పాము.

కోఱలు దీటు

  • పండ్లు కొఱుకు. పాండు. 4. 294.

కోలం గొట్టిన తెఱగున

  • అతి సంభ్రమంతో.
  • ఎవరో వెనుక కఱ్ఱను తీసుకొని తఱుముకొని వస్తున్నట్లు.
  • "కత్తులు గట్టి కోలం గొట్టిన తెఱంగున.... తత్ప్రదేశంబు వెడలి..." హర. 2. 28.
  • "నిల్వక వెల్వడెఁ గ్ర,క్కున సైన్యము లెల్లఁ గోలఁ గొట్టినభంగిన్." జైమి. 4. 108.

కోలకు తెచ్చు

  • విధేయముగా నొనర్చు. కోలకు - కోపుకు తెచ్చుట అనగా ఎద్దులు మొదలయిన వానిని కాడి కట్టి విధేయముగా నొనర్చుట.
  • "కడలిఁ గోలకుఁ దెచ్చినగబ్బి వీవ." పారి. 1. 49.
  • చూ. కాడికి తెచ్చు.

కోలక్రోతులు

  • కోతి కొమ్మచ్చి. ఒక పిల్లల ఆట.

కోలగగ్గెర ద్రోయు

  • కూలద్రోయు.
  • "అసియుఁ బాత్రయుఁ దేఁ బంచి యాంత్రవల్లిఁ, గోలగగ్గెర ద్రోయఁ దత్కుజముతోడ, నొరగి." ఆము. 6. 27.

కోలదివియ

  • దివిటీకి మారుగా కాల్చి పట్టుకునే వెలుతురు కట్టెల కట్ట. ఈ వెలుతురుకట్టెనే కొరిమిపాల అంటారు.
  • "కోల దివియల వెలుఁగు దిక్కులకు నిగిడి." దశ. 5. 90.
  • "తలవరులు, కోలదివ్వెలవారిఁ గొంచు నవ్వీధి." గౌర. హరి. ఉ. 2319.
  • "ఆలీలఁ గొరవి దయ్యంబుల దివ్వె, గోలలవారిఁగాఁ గొని గస్తు దిరిగి." గౌ. హరి. ఉ. 1668.

కోల మెఱుపు

  • నిలువు మెఱుపు.
  • "శివు దిక్కునందు వేకువఁ గోల మెఱుఁగులు, మెఱసె..." హరి. పూ. 7. 160.

కోలలవారు

  • వేత్రహస్తులు.

కోలాట గొడియలు

  • కోలాట మాడు కఱ్ఱలు, చిన్న చిన్న కర్రలకు బచ్చెన పూసి కోలాటంలో ఉపయోగిస్తారు. పండితా. ప్రథ. వాద. పుట. 703.
  • చూ. కోలాటము.

కోలాటము

  • కోలాట మనే ఆట.
  • చూ. కోలాటలు.

కోలాటలు

  • చిన్న కోలాటం కఱ్ఱలతో చుట్టూ నిలిచి ఆడే ఆట. కోలాటం పాటలు కూడా మనకు చాలా ఉన్నవి.
  • చూ. కోలాటము.
  • పండితా. ద్వితీ. మహి. పుట. 179.

కోలాస

  • అడియాస; పేరాస.
  • "కోలాస లేల పై కొసరఁ గుంచంబు, గూలఁబడ్డ ట్లగు." బస. 7. 198.

కోలాసకత్తె

  • దురాశ గలది.
  • "పుట్టినప్పుడె నేర్చు బుద్దుల పోక, కోలాసకత్తియ." పండితా. పురా. పు. 122.

కోలుకాడు

  • కావలివాడు; బంటు. విక్ర. 8. 25. హంస. 2. 48.

కోలుకొను

  • 1. తేఱుకొను.
  • "కోల్కొన నీ, కనిశముఁ బోఁద్రోలు చుండు నమరగణంబున్." కుమా. 4. 13.
  • "నరసూను నపుడు కర్ణజుఁ, డిరు మూడు శిలీముఖంబు లెద నించిన నొ,చ్చి రయంబునఁ గోల్కొని రా,నరదముఁ దునిమెన్ సకేతుహయసూతముగన్." జైమి. 7.
  • "దీప మడఁగఁ జీకటియును, గోప మడఁగ శాంతిగుణము గోల్కొను క్రియ." పాండు. 4.
  • ఇక్కడ వర్ధిల్లు అని అర్థ చెప్పినారు కోశకారులు. శ. ర.
  • కాని అవసరం లేదు. తేఱు కొను అనుటే చాలు.
  • 2. జబ్బుపడి గాని. మరే దెబ్బతిని గాని తిరిగీ తొలి స్థితికి వచ్చు.
  • "కొంత మాత్రపు టీవిగా కింతలేసి, తలము తప్పిన యీవులు తగునె యియ్య, నిచ్చి మఱి కోలుకొన లేక యేపుదఱిఁగి,పోవఁ దెగడరె జనులు దుర్బుద్ధి యనుచు." హరిశ్చ. 4. 83.
  • "వ్యాపారంలో బాగా నష్టపోయి ఇప్పుడిప్పుడే అతను కోలుకొంటున్నాడు." వా.
  • 3. ఉత్సహించు.
  • "వధించుటకుఁ గోల్కొన కున్నది బుద్ధి." భార. ఉద్యో. 4.

కోలుకొలుపు

  • పురి కొల్పు, ప్రేరేపించు, ప్రోత్సాహపఱుచు, ఒప్పించు.
  • "రవిఁ దెత్తుమే నీకు రమణుండుగా నల,కూబరుఁ దెత్తుమే కోలుకొలిపి." కుమా. 6. 17.

కోలుకోలన్నలు

  • కోలాటం. - ఒక ఆట. హంస. 5. 155.

కోలుతల సేయు

  • యుద్ధసన్నాహము చేయు. యుద్ధమునకు బ్రోత్సహించు.
  • "తన కెలంకులఁ గోలుతల సేసి తఱుమంగ." భార. భీష్మ. 1. 268.
  • "ఉన్నచోటన కదలక యున్న ద్రోణ, భీష్ములును గోలుతల సేయఁ బెరిఁగి సేన, చంద్రుఁ డుదయింపఁ బెరిఁగిన శరధి యట్లు, తోడుతోడుతఁ బొంగారి చూడ నొప్పె." భార. భీష్మ. 2. 117.

కోలుపడు

  • 1. దొంగలపా లగు.
  • "హరి భార్యలు బోయలచేఁ, బరిభవమును బొంది కోలుపడిరి." వి. పు. 8. 283.
  • 2. పోగొట్టుకొను.
  • "తమ సగపాలుఁ గోలుపడి దానిన యిప్పుడు గోరువారికిన్, సముచిత వృత్తి నిచ్చి." భార. ఉద్యో. 1. 19.

కోలుపాటు

  • కోలుపోవుట.

కోలు పుచ్చు

  • కోలుపోవునట్లు చేయు.

కోలుపులి

  • పెద్ద పులి.

కోలుపోవు

  • పోగొట్టుకొను. భీమ. 4. 99.

కోలుమసగు

  • 1. విజృంభించు.
  • "కోపనశాపనవ్యశిఖి గోల్మసఁగంగ సుగంది." పాండు. 2. 57.
  • "కుపితయుగాంత రుద్రగతిఁ గోలు మసంగినవాఁడు భీష్ముఁడు." భార. భీష్మ. 1. 138.
  • "కోలుమసంగెడుకోర్కుల వెను వెంట." భార. విరా. 2. 315. ఈ పేజి వ్రాయబడి ఉన్నది. ఈ పేజి వ్రాయబడి ఉన్నది.
  • 2. సంహరించు.
  • "తండ్రి యధ్వర విఘాతకు బారి సమరిన కొడుకు శంఖనఖాఖ్యుఁ గోలు మసఁగి." కకు. 2. 118.

కోలు ముందు

  • మొట్టమొదట.
  • మునుముందు.
  • "అయ్యబలమీఁద, నలిననాభుండు కను వేసినాఁడు గానఁ, గోలు ముందుగ నీవ చేకొనఁగ వలయు." వరాహ. 11. 52.

కోలువడు

  • కోల్పోవు, పోగొట్టుకొను.
  • "దక్షప్రజాపతి దలఁ గోలువడఁడె." పండితా. ప్రథ. వాద. పుట. 685.

కోలెముక

  • వెన్నెముక.

కోలెమ్ము

  • వెన్నెముక.

కోలెమ్ముక

  • వెన్నెముక.

కోల్కొను

  • తేఱుకొను.
  • చూ. కోలుకొను.

కోల్తల సేయు

  • చూ. కోలుతల సేయు.

కోల్పడిపోవు

  • పోగొట్టుకొను.
  • "నిన్ను నమ్మి నా,గుట్టును దేజమున్ మిగులఁ గోల్పడి పోయితి." పారి. 1. 127.

కోల్పడు

  • చూ. కోలుపడు.

కోల్మసగు

  • చూ. కోలుమసగు.

కోల్మొడుచు

  • ఇనుపపుల్లకు చెక్కు. మాంసం ముక్కలను ఇనుప ముక్కలకు చెక్కు తారు - కఱకు ట్లంటారు వానినే. కుమా. 11. 193.

కోవలు వడ వ్రాయు

  • అందముగా వ్రాయు. ముత్తెముల కోవవలె అనుట. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "కోవలు వడ వ్రాసి చిత్రగుప్తుఁడు దాఁచెన్." పాండు. 5. 74.

కోవుర ముండు

  • కావలి యుండు.
  • "ఉదయగిరిమీఁదఁ గోపురం బుండి నిగుడు, నహితరవిరశ్మిచే బద్ధుఁ డగుచు..." మను. 3. 54.

కోసకోడి

  • ఓడి పాఱిపోయే కోడి. కోడి పందెములలో వాడక మున్న మాట.
  • "నా జన్మలో కోసకోడి పట్టింది లేదు." వా.

కోసి కుప్పలు పెట్టు

  • కోయు.
  • "తలలు కోసి కుప్పలు పెట్టుచు." వీర. 4. 206. కోసుక తిను
  • గట్టిగా దండించు. కోపోద్రిక్తు డైనప్పుడు ఉపయోగించే పలుకుబడి.
  • "సం, త్రాసము చెంద నీగళము రాట్నమునం బిగియించి యొంతునో, కోసుక తిందునో యనినఁ గోమలి నిశ్చలధైర్యధుర్య యై." శుక. 2. 373.

కోసెత్తు

  • గొడ్డుపోవు; దాసోహ మను. ఓడిపోయి పారిపోయే కోడిని కోడి పందెములలో కోస కోడి అంటారు.
  • "దేశంబు కోసెత్తెనే?" గీర. విగ్ర. 15.

కౌగిట గ్రుచ్చి యెత్తు

  • బిగియూర కౌగిలించుకొను.
  • "పొలఁతుల్ గౌఁగిటఁ గ్రుచ్చి యెత్తి తలఁబ్రా ల్వోయించునవ్వేళ." పారి. 1. 2.

కౌగిట చేర్చు

  • కౌగిలించు.
  • "నీరజనాభుఁడు నిండుఁ గౌఁగిటం జేరిచి బుజ్జగించి." పారి. 1. 134.

కౌగిట తేలుచు

  • కౌగిలింతచే సంతోషపెట్టు.
  • "నీలశిరోజనేత్రముల నీళ్ల నె కాళులుఁ గడ్గి కౌఁగిటం, దేలిచి యింటిలోపలికిఁ దిన్నగఁ దోడ్కొని వచ్చె." హంస. 3. 106.

కౌగిట బిగించు

  • గాఢంగా కౌగిలించుకొను.
  • "సతి నతఁ డపుడు విడక కౌఁగిట బిగించె." కళా. 4. 104.

కౌగి లిచ్చు

  • ఆలింగనసౌఖ్యము నందించు.
  • "భూసుపర్వున కొకనాఁడు పోయి కౌఁగి, లిచ్చి రమ్మని పంపినాఁ డింతె కాని." నిరం. 4. 24.

కౌచుముచ్చు

  • మాంసాహారి; రాక్షసుడు. బ్రౌన్.

కౌడు పెట్టు

  • మోసగించు; కపటంతో ప్రవర్తించు.
  • "అతిమత్సరతన్, బెనఁ గెడు వారలను గౌడు పెట్టి పఱచి కై, కొనియెద నీ వస్తువుల..." షోడ. 2. 40.

కౌడు లేని మనిషి.

  • నిష్కపటి, కుళ్ళూ కువ్వాడం లేని వ్యక్తి.
  • "అత నేమాత్రం కౌడు లేని మనిషి. ఏ మన్నా మన మంచికే అంటాడు." వా.

కౌపీనసంరక్షణార్థం....

  • అంత చిన్న దానికై ఇంత లంపటమా.
  • పుట్టగోచికోసం సంసారమే కట్టుకున్న సన్యాసి కథపై వచ్చినది.

క్రందుకయ్యము

  • దొమ్మియుద్ధం. క్రందుకొను
  • వ్యాపించు.
  • ఇది ప్రకటిత మగు. ఎక్కువగు, పూర్ణ మగు అన్నట్టి, అందుకు దగ్గరగా నున్నట్టి చాలా అర్థాలలో కాన వస్తుంది.
  • "మంగళ భూషణద్యుతుల్, క్రందు కొనంగ." జైమి. 4. 120.

క్రందుపడు

  • పైన పడు, గుంపుకట్టు. భాస్క. రా. ఆర. 1. 248; మార్కం. 1. 225.

క్రందుపఱచు

  • క్రందుపడ జేయు.

క్రందుపాటు

  • క్రందుపడుట.

క్రక్కువడు.

  • చిక్కువడు.
  • "ఆక్రోశపరి దేవనాక్షర వ్రాతంబు, కంఠగద్గదికచేఁ గ్రక్కుపడఁగ." హరి. 3. 92.

.....క్రక్కించు

  • ప్రతీకారము చేయుపట్ల, ఎదుటివాడు దేనిని అపహరించెనో దానిని క్రక్కింతును అని అంటారు.
  • "కలఁచి నా యల్లునిఁ గ్రక్కింతు ననుచు." ద్విప. మధు. పు. 53.
  • "నా చేతికి దొరకనీ వాడు. ఆ నూరు రూపాయలూ కక్కించి వదలి పెడతాను." వా.

క్రగ్గుపడు

  • వెల్వడలేక పోవు, క్రుంగిపోవు.
  • "కంఠగద్గదికచేఁ గ్రగ్గుపడఁగ." హర. 3. 92.

క్రచ్చుకొను

  • డగ్గఱు.
  • "చెలులఁ గ్రచ్చుకొని యడుగ నిట్లను నచ్చేడియ." వసు. 4.

క్రమ్ముకొను

  • క్రమ్ము. ప్రభా. 2. 41.

క్రమ్ము దెంచు

  • క్రమ్ము, పొంగు, ప్రవహించు.

క్రమ్మువడు

  • మూతపడు.
  • "ఘనుఁడు గృహమేధి పెరటిలోఁ గ్రంతఁ జూచి, క్రమ్మువడ మంచి దొక రేఁగుకొమ్మ వేయు, మనుచు భృత్యునిఁ బలుకంగ." గంధ. 66.

క్రయ పెట్టు

  • అమ్ము.
  • "పొరుగూళ్లఁ గలమాన్యభూముల ధాన్యంబు, గ్రయ పెట్టి విడుచుఁ బర శ్శతంబు." నిరంకు. 2. 26.

క్రయ్యబడు

  • బలాత్కరించు.
  • "కన్యకఁ, గ్రయ్యంబడి చేసికొనిన రాక్షస మయ్యెన్." విజ్ఞా. ఆచా. 100.
  • 2. కలియు, కలియబడు.
  • "వెయ్యేం డ్లయ్యెను నీతోఁ, గ్రయ్యం బడియున్నవాఁడఁ గామసుఖములన్." భాగ. 9. 577.

క్రయ్యబాఱు

  • కలిసి పారు.

క్రల్ల వడు

  • పా డగు, దగ్ధ మగు.
  • "తరు లెల్లఁ గ్రల్లవడఁగా, విరళము లై వీను లున్న విధ మొప్పె నహ, స్కర రుచులతోడఁ దలపడి, యరుదుగఁ బోరాడి తుమురు లై పడినక్రియన్." హరి. పూర్వ. 6. 37.

క్రాగిపోవు

  • నీళ్ల వలె క్రాగి ఆవిరియి పోవు. అనగా నశించి పోవు.
  • "కంధరకు నోడి యెచటనో క్రాఁగిపోవ." పాండు. 4. 40.

క్రాలుకన్ను

  • వంకరకన్ను; వాలుకన్ను. పండితా. ద్వితీ. మహి. పుట. 108. వరాహ. 4. 8.

క్రాలుకొను

  • నెలకొను. కవిక. 2. 61.

క్రాసి యుమియు

  • కారి ఉమ్మి వేయు అని నేటి వాడుక.
  • "కౌముదీచ్ఛాయలఁ గ్రాసి యుమియ." కాశీ. 4. 269.

క్రింగొడ ళ్ళూరుచు

  • శరీరమును కుంచించుకొను.
  • "తొడ లూఁదికొనుచును ద్రోపు ద్రొక్కిళ్ళు, వాఱుచు క్రింగొడళ్ళూరుచు." పండితా. ద్వితీ. పర్వ. పుట. 362.

క్రిందట గాలిగా కేడించు

  • గాలివేగముతో నడిపించు, గాలి క్రిం దగునట్లు అనుట.
  • "ఆపైఁడి మృగము, మనకు లోఁబడు నట్టి మతముఁ జింతించి, క్రిందట గాలిగాఁ గేడించి రథము, నందు పాటుగఁ దోలు మనుచు." గౌ. హరి. ప్రథ. పం. 599-602.

క్రింద మీద పెట్టు

  • ఎలాగో ఒకలాగు తగాదా పెట్టు.
  • "....ఎవ్వరికేని మీఁదికిం గ్రిందికిఁ బెట్టి పోరు పొసగింపన చూచెద..." పాండవో. 50.

క్రిందు చేయు

  • అధ:కరించు.
  • "సమస్తముఁ గ్రిందు చేసి మించినబలు వేల్పు." పాండు. 1. 152.
  • రూ. క్రిందు సేయు.

క్రిందుపడు

  • 1. తక్కువ యగు.
  • "పెనఁకువ నెందున్, గ్రిందు పడకుండ." హర. 7. 179.
  • 2. ఓడిపోవు.
  • "పాండునృపకుమారునకుఁ గ్రిందు పడినావు." నిరంకు. 3. 29.
  • 3. అధ:కృత మగు.
  • "...పక్షిపతి...తగ్గి య, చ్చరణము లంది క్రిందు పడె సమ్మతి నెప్పుడు వీఁపుఁ జూపుచున్." రాధి. 2. 46. క్రిందు పఱుచు
  • తక్కువపఱుచు.
  • "నునుకందు పైఁ జెందు నని యిందురుచి గ్రిందు, పఱపఁగాఁ జాలు నబ్బాల మోము." హంస. 2. 20.

క్రిందు మీ దగు

  • తలక్రిందు లగు.
  • "నాతిమృదుగతి చపలేక్షణముల కలికి, క్రిందుమీఁ దయ్యెఁ గాదె పూర్ణేందు వదన." హంస. 2. 141.
  • "కొండలు క్రిందుమీఁదుగను గూల..." హంస. 4. 20.

క్రిక్కించు

  • గిలిగింతతో నవ్వునట్లు చేయు. ధ్వన్యనుకరణము.
  • కిచకిచ నవ్వు మొదలైన వానిలో వలెనే.
  • "క్రిక్కించుఁ జక్కిలి గిలగిలయనుచు." పండితా. ప్రథ. పురా. పుట. 457.

క్రిక్కిరియు

  • 1. గుంపుగా చేరు.
  • "క్రిక్కిరిసి తేఁటిగము లక్కమలరాజిపయి." రాజశే. 1. 141.
  • 2. నిండు.
  • "గుత్తుల్ క్రిక్కిరియఁ జేసి." రుక్మాం. 3. 129.
  • "జనం క్రిక్కిరిసి ఉన్నారు." వా.

క్రిక్కిఱియు

  • దట్టముగా ఒక దానిపై నొకటి పడు.
  • "క్రిక్కిఱిసినశవములలో." కుమా. 11. 177.

క్రియగొను

  • కార్యరూపము చెందు.
  • "ఉడుగక మే మహితముఁ బలి,కెడి వారము నీవు హితవు క్రియగొనఁగాఁ బ,ల్కెడువాఁడవు." భార. ఆది. 8. 40.

క్రియలో....

  • కార్యరూపంలో.
  • "వాడు మాటల్లో దానపరుడే కానీ క్రియలో మాత్రం కాదు." వా.
  • "ప్రేమంటే మాటల్లో కాదు. క్రియలో కనిపించాలి." వా.

క్రియలో మాట

  • అసలు కీలకం, అసలు మాట.
  • "ఇంత కథ అంతా యెందుకు? క్రియలో మా టేమిటి? వా.
  • చూ. క్రియలో ముక్క.

క్రియలో ముక్క

  • చూ. క్రియలో మాట.

క్రియ్యూట

  • చిన్న ఊట.
  • కొండలలో అక్క డక్కడా నీరు ఊటగా బయలు దేరి పారుతూ ఉంటుంది. అదే క్రియ్యూట.
  • "ఇందలి క్రియ్యూట లీప్సి తార్థంబు, లందించు రసరసాయన సుధా ధారలు." పండితా. పర్వ. ద్వితీ. 241 పు.

క్రీగంట చూచు

  • కటాక్షించు; ఓరగా చూచు.
  • "మమ్మల్ను కాస్త క్రీగంట చూస్తూ ఉండు." వా. క్రీగడుపు
  • పొత్తికడుపు.
  • క్రిందిది అనుట.

క్రీగాడ్పు

  • అపానవాయువు.

క్రీగోరు

  • కాలిగోరు.

క్రీదొడ

  • తొడ క్రిందిభాగము.

క్రీనీరు నేల

  • ఊటతో చెమ్మగిల్లిన నేల.

క్రీయూట

  • చూ. క్రియ్యూట.

క్రుంకువెట్టు

  • మునుగు, నిమగ్ను డగు.
  • "విపులాంభోనిధిఁ గ్రుంకువెట్టి." నిరంకు. 3. 49.

క్రుంగబడు

  • క్రుంగిపోవు.
  • "ధర గ్రుంగఁబడఁగ." భాస్క. రా. కిష్కి. 431.

క్రుంగిల బడు

  • క్రుంగిపోవు.
  • "పాన్పుమీఁదటఁ గ్రుంగిలఁబడఁగఁ దిగిచి, ప్రథమసురతంబు గావించు ప్రౌఢ వౌర." రాజగో. 56.

క్రుచ్చి యెత్తు

  • కౌగిలించు.
  • "పే, రక్కునఁ గ్రుచ్చి యెత్తుకొని." కవిక. 3. 167.

క్రుమ్మి కూరాకు సేయు

  • చిందర వందర చేయు.
  • "పులులు జట్టలు చీరి దుప్పులను లేళ్ల, నేకలమ్ములఁ గ్రుమ్మి కూరాకు సేసి, యమరఁ జమరులఁ బట్టి పాలార్తు మిపుడు, సామి! చూడుము నీ బంట్ల సత్తు వనుచు." సారం 1. 90.

క్రుమ్ములాడు

  • పోట్లాడు; దెబ్బలాడు.
  • పశువులు కొమ్ములతో క్రుమ్ములాడుటపై వచ్చినది.
  • "వీనిఁ బడవైచె నాతఁడా వీరుఁ డనుచుఁ, గా దనుచుఁ గ్రుమ్ములాడు నక్తంచరాళి." కువల. 2. 151.

క్రుమ్మెసలాడు

  • పోట్లాడు. రంగా. 3. 218.

క్రుయ్యక డయ్యక

  • చులాగ్గా.
  • "అయ్యంగరాజుతోడం, గయ్యము సేయుచును దుర్ముఖప్రాణంబుల్, సయ్యనఁ దొమ్మిది యమ్ములఁ, గ్రుయ్యక డయ్యక యతండు గొనియె నరేంద్రా!" భార. ద్రో. 4. 198.

క్రుయ్యబాఱు

  • కృశించు.

క్రుళ్లి గుల్లగు

  • కుళ్లి కృశించు.
  • "....కవులు చెడనాడ వగన్, గ్రుళ్లి తనలోనె గు ల్లై, పెల్లుగ శంఖంబు మొర్రపెట్టుచు నుండున్." రాధా. 1. 154. క్రుళ్లుపోతు
  • కుళ్లుబోతు.
  • "వాడు వట్టి కుళ్లుబోతు వెధవ. ఎవరు పచ్చగా ఉన్నా చూడ లేడు." వా.

క్రేగాలి

  • చిఱుగాలి.

క్రేటుకొను

  • గొంతు సవరించుకొను.

క్రేడి సేయు

  • అపహసించు.

క్రేణి వట్టు

  • సంపాదించు. కాశీ. 3. 90.

క్రేణి సేయు

  • పరిహసించు.
  • "ఆ సమయం బభ్యర్ణ పూర్ణ చంద్రోదయ ఘూర్ణమానార్ణవంబునుం గ్రేణి సేయుచుండె." పారి. 5. 75.

క్రేదొట్టు

  • గట్టు లొరయు.

క్రేళ్లు చూచు

  • చిలిపిగా చూచు.

క్రేళ్లు చూపు

  • చిలిపి చూపు.

క్రేళ్లు త్రుళ్లు

  • ఎగిరి పడు. కువల. 4. 81.

క్రేళ్లు దాటు

  • గంతులు వేయు.
  • "అడ్డంబు నిడుపు నాపడ్డలగతి మనుఁ బీళ్లు డొంకలనుండి క్రేళ్లు దాఁట." మను. 2. 7.
  • 2. ఎగిరెగిరి పడు.
  • "చే వెడ దోఁపుచుం బలికెఁ జెందొవ చూపులు క్రేళ్లు దాఁటగన్." పారి. 4. 58.
  • "మెఱుఁగులు పైకిఁ గ్రేళ్లుఱికెడు గబ్బి గు,బ్బలమీఁద." విప్ర. 3. 3.
  • చూ. క్రేళ్లుఱుకు.

క్రేళ్లు దోలు

  • పరువు లెత్తించు.
  • "తేరు క్రేళ్ళు దోలి పాంచాలబలంబులపై నడరె." భార. భీష్మ. 3. 368.

క్రేళ్లు ద్రిప్పు

  • చూ. క్రేళ్ళు దోలు.

క్రేళ్లుబ్బు

  • ఉబుకు. నరస. 5. 102.

క్రేళ్లు మలగు

  • వెనుదీయు.

క్రేళ్లు మసలు

  • చలించు.

క్రేళ్లుఱుకు

  • ఎగిరి పడు.

క్రేళ్ళెగయు

  • క్రేళ్ళు సను.

క్రేళ్లు వాఱు

  • గంతులు వేయు.

క్రేళ్ళు సను

  • ఎగిరి పడు. క్రొత్త
  • వింత.
  • "క్రొత్త దాని వృత్తం బెల్లన్." పాండు. 2. 142.
  • వాడుకలో - 'ఆ విషయం నాకు కొత్త.' 'దాని ప్రవర్తన అంతా చాలా కొత్తగా ఉంటుంది.' 'ఏమిటోయ్! ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు.'
  • 'ఇన్నిరోజులు లేదు. ఈ రోజేదో నువ్వు కొత్తగా చెప్పొస్తున్నావు.
  • ఇలాంటి దగ్గరి భావచ్ఛాయలలో మరికొన్ని తావుల కూడా కనబడుతుంది.

క్రొత్త చేయు

  • నూతనత్వము కల్పించు.
  • "సత్యభామ మేనఁ గుసుమ శృంగారముల కెల్లఁ గ్రొత్త సేయ." ఉ. హరి. 1. 151.
  • 2. పునరుపస్థితము చేయు.
  • "సమంత్రక ముష్టిక స్థానక విజ్ఞానంబుగాఁ గ్రొత్త సేసికొనుట మేలు." భార. ద్రోణ. 2. 361.

క్రొత్తముట్టు

  • నూలిపోగు.

క్రొత్త వఱచు

  • మెఱు గెక్కించు. భార. భీష్మ. 1. 105.

క్రొ వ్వడగించు

  • పొగ రడగించు.
  • "నీదు క్రొ వ్వడఁగింతున్." కళా. 6. 23.

క్రొవ్వుగొను

  • కొవ్వెక్కు.
  • "పరువంపుఁ జినుకుల పస గ్రొవ్వుగొని తేల, గిలఁ బడువానకోయిలల యొప్పు." హరి. పూ. 9. 72.

క్రొవ్వు పట్టు

  • పొగ రెక్కు.

క్రొవ్వులు వలుకు

  • దుర్భాష లాడు.
  • "ఈ చపలకుత్సిత విప్రుఁడు వచ్చి నోరఁ గ్రొ,వ్వులు వలుకంగ మీరును చెవుల్ సొర వించు సహించి..." కుమా. 7. 55.

క్రొవ్వెక్కు

  • కొవ్వు పట్టు.
  • "క్రిక్కిఱి చన్నుదోయి యిరుక్రేవల కాంతియుఁ బంచబాణుఁ గ్రొ,వ్వెక్కఁగఁ జేయ." నైష. 7. 194.

క్రొవ్వెద

  • కొప్పు.
  • "చెం, గలువలు క్రొవ్వెదకు వేఱొకర్తు ఘటించెన్." ఆము. 6. 129.

క్లేశపడు

  • కష్టపడు.
  • "అత నా కరువులో పిల్లలతో చాలా క్లేశపడ్డాడు." వా.

క్షణభంగురము

  • అనిత్యము.
  • నీటిబుడగవంటి దను పలుకుబడి. 'ఈ దేహం క్షణభంగురము' అని నేటికీ వాడుక. పండితా. ప్రథ. వాద. పుట. 550.

క్షణ మే డగు

  • కాలము త్వరగా సాగక పోవు.
  • "రాఁ డయ్యెన్ హృదయేశుఁ డీ హృదయభారం బెట్లు సైతున్ క్షణం, బే డై యున్నది." ప్రభా. 4. 146.

క్షణియించు

  • పూజించు, అర్చించు.
  • "కల్లరి లోకుల క్షణియించఁ దగునె." బస. 7. 204.

క్షితిని నహి ప్రతిల్లె

  • లోకంలో లేదు. అపూర్వ మనుట.
  • "క్షితిని నహి ప్రతిల్లె యని చెప్పుదు రాతనిభాగ్య మెట్టిదో?" శ్రవ. 1. 75.

క్షీరోదకన్యాయము

  • పాలును నీళ్లును కలిసినట్లు కలగలసి పోయిన దనుట. పెరుగును వడ్లును కలిసినట్లనునది దీనికి వ్యతిరేకము. పండితా. ప్రథ. పురా. పుట. 278.

క్షుణ్ణంగా

  • కూలంకషంగా.
  • "వాడు భాష్యాంతం క్షుణ్ణంగా చదువుకొన్నాడు. వానితో తగాదా పడితే ఏం లాభం ?" వా.

క్షూణత పరచు

  • న్యూనపరచు, కించపరచు.
  • "చుట్టం చూపుల కని వాళ్లింటికి పోతే క్షూణతపరిచి పంపించాడు." వా.

క్షేత్రపాలుడు

  • క్షేత్రాధిదేవత. సింహా. 4. 35.

క్షేమతండులములు

  • ప్రయాణ మై పోతూ వట్టి చేతులతో పోక ఏవో యిన్ని బియ్యం కట్టుకొని పోవా లని ఆచారం. ఆ బియ్యం -
  • "శాలి చేమతండులములు." ఆము. 2. 97.

క్షేమలాభములు

  • జంటపదం.
  • దీనిమీద వచ్చినదే - క్షేమంగా పోయి లాభంగా రా - అన్న పలుకుబడి. ప్రయాణ మై పోవునప్పుడు పెద్దలు చేసే దీవన యిది.
  • "....నాకు శో,భనములు గోరఁగాఁ గద యపాయము చెందక క్షేమలాభముల్, గని యిలు చేరు టంచును...." శుక. 2. 234.
  • చూ. యోగ క్షేమములు.

క్షేమలాభా లడుగు

  • కుశల ప్రశ్న చేయు.

ఖంగు ఖంగు మను

  • శబ్దించు. ధ్వన్యనుకరణము. ఖంగురింగులు
  • ధ్వన్యనుకరణము.

ఖండితంగా

  • తప్పక.
  • "ఈ రోజు వాడు ఖండితంగా వస్తా నన్నాడు. మ రేమయిందో యేమో!" వా.

ఖండింపు చేయు

  • (బేరం) ఫైసలా చేయు.

ఖచిక్కున

  • కొఱుకుట వంటి వానిలో ధ్వన్యనుకరణము.
  • "ఖచిక్కున ముక్కునఁ బక్వదాడిమీ, ఫలయుగళంబు నొక్కు." శకుం. 2. 33.

ఖడ్గాఖడ్గి వాదించు

  • కత్తులతో పోరాడు.
  • "కలు ద్రావం బని పూని యాదవులు ఖడ్గాఖడ్గి వాదింతురే." ఉ. హరి. 4. 132.

ఖణీలున ఱంకె వేయు ధ్వన్యనుకరణము.

  • "ఖణీలున ఱంకె వేయ కెఱుఁగన్ సమకూడదు." కా. మా. 4. 153.

ఖతం చేయు

  • ముగించు, చంపు. మాటా. 85.

ఖరాఖండిగా

  • కుండ బద్దలు కొట్టినట్లుగా.
  • "వాడు చాలా ఖరాఖండిగా మాట్లాడే మనిషి." వా.

ఖరాబు చేయు

  • పాడు చేయు.
  • "కాగితాలు ఖరాబు చేయడం తప్పితే కొన్ని రాతలవల్ల యే మైనా లాభం ఉందా?" వా.

ఖరారు చేయు

  • ఏర్పాటు చేయు.
  • "నెలకు పదిరూపాయ లివ్వా లని ఖరారు చేసి పెద్దమనుష్యులు వెళ్ళారు." వా.

ఖరారునామా

  • ఒప్పందం.
  • "వా ళ్లిద్దరూ భాగపరిష్కారాలు చేసుకొని ఖరారునామా వ్రాసుకొన్నారు." వా.

ఖరారు మదారు

  • ఒడంబడిక. కాశీయా. 62.

ఖరీదు కట్టు

  • వెల కట్టు.
  • "ఘర్మజలానికి, ఖరీదు కట్టే షరాబు లేడోయ్." మహా. ప్ర.

ఖరీదు చేయు

  • కొను.
  • "ఆ ఊళ్లో నాలుగు పుట్ల ధాన్యం ఖరీదు చేసి వచ్చాను." వా.

ఖసూచిగాడు

  • ఎప్పు డేది అడిగినా ఆకాశం చూచేవాడు.
  • అంటే లౌక్యం, బుద్ధి లే దనుటను సూచించేమాట.
  • "వాడి కేం తెలుసు? వట్టి ఖసూచి గాడు." వా.

ఖాతరు చేయు

  • లెక్క చేయు.
  • "వాడు బ్రహ్మదేవుణ్ణి కూడా ఖాతరు చేసేవాడు కాదు." వా.

ఖాయ మగు

  • పర్మనెంటు లగు; నిశ్చయ మగు.
  • "వాని ఉద్యోగం ఖాయ మయింది." వా.
  • "వాడు వచ్చేది ఖాయ మయినట్లే." వా.

ఖాయిదా చేయు

  • కట్టుదిట్టము చేయు.
  • "అడవిలోకి పశువులు వెళ్లకూడ దని పంచాయతీ ప్రెసిడెంటు ఖాయిదా చేశాడు." వా.

ఖావ(మ)౦దు

  • యజమాని.

గంగడోలు

  • ఎద్దులకూ ఆవులకూ మెడ క్రింద వ్రేలేభాగం.

గంగనమ్మ

  • గ్రామ దేవత.

గంగనురుగులు

  • ఒక పిండివంట.

గంగపా లగు

  • నశించు.
  • "నేను చేసినమే లంతా గంగపా లయి పోయింది." వా.

గంగమయిలావు

  • నల్లనిది. బ్రౌన్.
  • నలుపు పసుపు కలిసిన రంగుది. శ. ర.

గంగ ముట్టు

  • నీరు త్రాగు.
  • "నీ విన్నిమాట లన్నావు. నీ యింట్లో ఇక గంగ ముట్టను? వా.

గంగలో కలుపు

  • వ్యర్థము చేయు, పాడు చేయు.
  • "అట్లు కావున నీ కార్య మనఁగ నెంత, నీదుప్రాపున నవ్విప్రు నియతి మాన్పి, దిటము దప్పించి యజ్జటి దేవు తపము, గంగలోఁ గల్పెదను నొక్క గడియలోన." వేంకటే. 2. 29.

గంగలో దిగు

  • నీ యిష్టం వచ్చినట్టు పో, నా కేమీ సంబంధం లేదు అని విసుగుతో అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "వాణ్ణి వెళ్లి గంగలో దిగ మను. నా కక్కఱ లేదు. నాకు కొడుకు లే డను కొంటాను." వా.

గంగలో దోలు

  • వదలి వేయు.
  • "వాడు ఆచారం గీచారం ఎప్పుడో గంగలో దోలి వేశాడు." వా.

గంగవెఱ్ఱు లెత్తు.

  • అత్యావేశపూరితు డగు.
  • "అత డభూతకల్పన లన్నీ ఏవో చెప్తూంటే మన మే మైనా అన్నమా ఇక గంగ వెఱ్ఱు లెత్తి పోతాడు." వా.

గంగాధరుడు

  • నీళ్లు మోయువాడు.
  • నారాయణదాసు రుక్మిణీకళ్యాణము.

గంగాభాగీరథీ సమానురాలు

  • వితంతువులను ప్రస్తావించు పట్ల, వారికి ఉత్తరాలు వ్రాయుపట్ల పేరుకు ముందు ఉపయోగించే పలుకుబడి. గంగవలె పవిత్రురా లనుట.
  • "గంగా భాగీరథీసమానురా లయిన సుబ్బమ్మత్తగారికి మీ అల్లుడు..." వా.

గంగిగోవు

  • పవిత్ర మైన ఆవు; సాధువు.
  • "అతనా ! గంగిగోవు." వా.

గంగిగోవు వంటి సాదు.

  • గోవు సాధు వైన మృగముగా మన యెన్నిక.
  • "గంగిగోవు వంటి సాదుబాపనిన్ నినుం జనునె పలువ యనంగ." కళా. 7. 30.

గంగిరెద్దు

  • చూ. గంగెద్దు.

గంగిరెద్దు వేషము

  • ఆడంబర మైన వేషము.
  • "ఇదేమిటి? ఈ గంగిరెద్దు వేషం. కొత్త మనుషులు చూస్తే పల్లెటూరి గబ్బిళాయి అనుకుంటారు." వా.

గంగిరెద్దు సొమ్ములు

  • ఆడంబరసూచకములు. కుక్కు. 59.

గంగెద్దు

  • అన్నిటికీ తల ఊచేవాడు, పల్లెటూరిమనిషి, వట్టివేషాడంబరం కలవాడు.
  • "వాడు ఒట్టి గంగెద్దు. వాళ్లమామ చెప్పినదే వేదం." వా.
  • "వాడు ఒట్టి గంగెద్దు లాగా ఉన్నాడు. ఈ పట్ణంలో ఎలా నెట్టుకు వస్తాడు?" వా.
  • "ఏమిట్రా! ఆ గంగెద్దువేషం." వా.

గంజిగుల్ల

  • బొబ్బ.

గంజితరక

  • గంజిమీది మీగడవంటి పదార్థం. బ్రౌన్.

గంజి త్రాగేవాడికి మీసాలు ఎగ బెట్టేవా డొకడా !

  • ఈ చిన్న పనికి మరొకరిసాయం కూడా యెందుకు అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "నువ్వు చేశే యీ ఘనకార్యానికి యింత మంది యెందుకురా? గంజి త్రాగేవానికి మీసాలు ఎగబెట్టేవా డొకడా?" వా.

గంజిలోకి ఉప్పు లేదు

  • నిరుపేద అనుట.
  • "వాడికి గంజిలోకి ఉప్పు లేదు. ఇక మీ కిచ్చే దే ముంది?" వా. గంజో అంబలో
  • "వేళకు ఏ దయితే నేం? గంజో అంబలో?" వా.
  • చూ. కలో అంబలో.

గంట కొట్టు

  • ముగియు.
  • చనిపోయినప్పుడు గంట కొట్టుట, శంఖం పూరించుట దక్షిణాదిలో నేటికీ అలవాటు. దానిపై వచ్చిన పలుకుబడి.
  • "వాడిపని గంట కొట్టినది. ఇక వాడు చేసే దే ముంది?" వా.

గంట వాయించు

  • గంట కొట్టు.
  • "పటుఫలాదులు వోయె బతిమాలువారి కే, మీయక గంట వాయించి రహహ." సింహాద్రి. నార. శ. 27.

గంట వ్రేయు

  • గంటలు కొట్టు.
  • "రెండవజాము గంట వ్రేయం బడె." కాశీ. 5. 307. కాశీ. 4. 102.

గంటిపడు

  • కాటుపడు.

గంటిపఱచు

  • గంటు పడునట్లు చేయు.
  • చూ. గంటివేయు.

గంటివెట్టు

  • చూ. గంటిపఱచు.

గంటి సేయు

  • కాటు పడునట్లు చేయు.
  • "నాథుని, యధరబింబము గంటి సేయంగ నెంచు." దశా. 3. 17.

గండం గడిచి పిండం బయట పడితే....

  • ఈ ఆపద తప్పితే అనుట.
  • పూర్వం కాన్పు అతి భయం కరంగానూ, ప్రాణాపాయ కరంగానూ ఉండినది. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "ఈ గండం గడిచి పిండం బయట పడితే తరవాత చూద్దాం." వా.

గండకట్టెలు

  • వంట చెఱకులు. బ్రౌన్.

గండకత్తెర

  • గొంతుక నుత్తరించు ఆయుధ విశేషము.
  • "శీలము దొరఁగిన పిమ్మట, నేలా కాయంబు దీని నెడ సేయుటయే, మేలని హృదయాబ్జంబునఁ, గాలాంతకు నిల్పి గండకత్తెర గొనఁగాన్." చెన్న. 4. 217. కళా. 3. 10.
  • తద్వారా అడకొ త్తిలో చిక్కుకొన్నట్టు వలెనే గండ కత్తెరలో తగులు కొనుట సంకటావస్థాసూచక మయినది.
  • "వీ ళ్లిద్దరిమధ్యా పడ లేక నేను గండ కత్తెరలో చిక్కు కొన్నాను." వా.

గం డడగించు

  • పొగరు అణచు.
  • "....తోమరశక్తిప్రముఖంబు లగు వివిధాయుధంబుల నొండొరుల గండడం గించుసమయంబున." ఉ. హరి. 1. 27.

గండదీప మెత్తు

  • మ్రొక్కుబడి చెల్లించుటకై గోధుమపిండితో గానీ అన్నముతో గానీ దిమ్మవలె చేసి, అందులో గుంత చేసి, నెయ్యి పోసి, వత్తిని వెలిగించి, ఆ దీపము నెత్తుకొని దేవుని దగ్గఱకు పోతారు. దీనినే గండదీప మెత్తుట అంటారు.
  • "ఆ నాతిఁ జూచి తలవరు, లేనెలఁతయొ గండదీప మెత్తఁగ వచ్చెన్." శుక. 2. 496.
  • చూ. మూపుగండ లిచ్చు.

గండపాళిక కెంగేలు కదియ జేర్చు

  • చెక్కిట చేయి జేర్చు. చింతించు.
  • "గండపాళికఁ గెంగేలు గదియఁ జేర్చి." శివ. 2. 26.
  • చూ. చెక్కిట చేయి జేర్చు.

గండపెండరము

  • 1. వీరులు, కవులు, పండితులు మొదలగువారు కాలిలో వేసుకునే బిరుదు టందె.
  • "డాకాల గండపెండర మమర్చి." అచ్చ. యు. 203.
  • 2. ఒక ఆభరణము.
  • పై దానినే ఆభరణంగానూ ధరించేవారు కావచ్చును.
  • "పెద్ద పీతాంబరము గండపెండరంపుఁ గటక కటినూత్ర కేయూర కంకణాది, దివ్యభూషణజాలంబు...." దశా. 7. అవ. 1. 248.

గండ పెండారము

  • చూ. గండ పెండరము.

గండ పెండెము

  • చూ. గండ పెండరము.

గండ పెండెరము

  • చూ. గండపెండరము.

గండ పెండేరము

  • చూ. గండ పెండరము.

గండబేటము

  • ప్రేమ.
  • పురుషునికి పురుషునిపై గల్గు మోహము అని టిప్పణి కారు లన్నారు. కాని ఎందుకో చెప్ప లేదు.
  • "మగలు గరము ప్రీతి దగిలి గండ బేటంచుగొని...." కుమా. 4. 36.

గండమాల

  • గొంతు చుట్టూ గడ్డలు లేచే రోగము.
  • "మును గండమాలమీఁదను, మొన కుఱుపుం బుట్టె నన్న మోసం బాయెన్." ద్వా. 10. 54.
  • రూ. గండమాలము.

గండమృగము

  • ఖడ్గమృగము.
  • గండామృగం అని తమిళులు నేటికీ అంటారు.
  • "గండ మృగములు భేరుండతండములు." బస. 3. 83. పుట.

గండము గడుచు

  • తాత్కాలిక మైన ఆపద తొలగిపోవు.
  • "ఇప్పటికి ఈ గండం గడిస్తే తరవాత చూచుకో వచ్చు." వా.

గండము దప్పు

  • ప్రాణాపాయము తప్పు.
  • "అప్పటప్పటికి మ మ్మరసి గండములు, దప్పించి రక్షించె దానవారాతి." ద్విప. మధు. పు. 32.

గండముపై పిండకము

  • ముందే గండం, అందులో ప్రసవసమయం.
  • అనగా అతి ప్రమాదకారి అనుట. ముద్రా. 79.
  • జనంలో 'గండంలో పిండం' అని వినవస్తుంది.

గండర గండడు

  • ఒక బిరుదు.
  • గొప్ప వీరుడు.
  • రాజులకు బిరుదుగా శాసనాదుల్లో కానవస్తుంది. కన్నడంలో గండ అనగా మగడు. మగటిమి కలవాడు. గండలకు గండడు = మేటి మగడు అనుట.

గండరించు

  • మలుచు; రాయివంటి వానిలో రూపమును చెక్కు.
  • "పండితలోచనాబ్జంబులయంద, గండరించిన యట్టి గతి..." పండితా. ప్రథ. దీక్షా. పుట. 174.

గండాగొండి చేయు

  • తగాదా పెట్టు; మొండి తగాదా పెట్టు.
  • "గండాగొండి యొనర్తు నేమొ యని." వ్యస. నాట. 13.

గండాగొండితనము

  • మొండితనము.
  • రూ. గండాగుండితనము.
  • చూ. గండాగొండి చేయు.

గండాడు

  • కలియు, సంగమించు.
  • "చండాలితో ద్విజుం డొగి, గండాడిన వక్షమున భగము వ్రాసి తగన్, దండువు గొని దేశంబున, నుండక యుండంగ నడచు టుచితము పతికిన్." విజ్ఞా. ప్రా. 126.

గండాన వచ్చు

  • ప్రమాదకర మగు.
  • "వాడిఁక సుగ్రీవుమేలు వాలికి గండాన వచ్చు." తాళ్ల. 6. 8.

గండారపు బొమ్మ

  • రాతిలో చెక్కిన బొమ్మ; గండరించిన బొమ్మ అనుట.
  • "అ,చ్చేరువకంబముం గదిసి చిత్తరువో కరువో యనంగ గం,డారపు బొమ్మ వోలె నచటం గద లించుక లేక యుండఁగన్." ఉత్త. హరి. 1. 6. గండికా డగు
  • నేర్పరి యగు; దొంగ యగు.
  • "గండికాఁ డై తనమాయ గాన నీఁడు గాక." తాళ్ల. సం. 9. 283.

గండిదొంగ

  • కన్నపుదొంగ.

గండు మిగులు

  • విజృంభించు.
  • "మొగ్గరంబులు రెండును గండు మిగిలి తలపడియె." భార. భీష్మ. 2. 351.

గండుఱాయి

  • వజ్రము. ఉత్త. హరిశ్చ. 3. 131.

గండోలిగాడు

  • హాస్యగాడు. బొమ్మలాటల్లో వీని నిప్పుడు గంధోలిగా డంటారు.

గండ్రచీమ

  • పెద్ద నల్ల చీమ.

గండ్రపురి

  • బాగా పెట్టినపురి.

గండ్రలు సేయు

  • ముక్కలు చేయు.
  • "ఛేదించి గండ్రలు సేయునత్తఱిని." పండితా. ప్రథ. పురా. పుట. 323.

గంతకు తగిన బొంత

  • దేనికి తగినది అది అనుట.
  • "గంతకుఁ దగినట్టి బొంత లోకము నందుఁ, గల్పించె మొదటనే కమల భవుఁడు." శశి. (అప్ప.) 2. 27. పు.
  • "మావాడికీ గంతకు తగిన బొంత ఏదో ఉండనే ఉంటుంది. మీ పిల్లే కావలా లే." వా.

గంతు గొను

  • దుముకు; చచ్చు.

గందపట్టియ

  • ద్వారబంధము పైనున్న పట్టె.

గందపట్టె

  • గందపట్టియ.

గందరగోళ మగు

  • చాలా అల్లరి అగు.
  • "పక్క ఊళ్లో కలరా వచ్చిం దనే సరికి ఊరంతా గందరగోళం అయిపోయింది." వా.

గందవొడిలో బూరుగు పట్టినట్టు

  • మంచిలో చెడు జరిగినట్లు.
  • "సరసనయాను భావమునఁ జక్కని చక్కెరబొమ్మలాగుగా, దొరకె నటంచు నమ్మితిని దోడన యింటిమగం డసూయఁ బ, ల్గొఱుకుచు వచ్చె గంద వొడిలోపల బూరుగు పట్టినట్టు లి,ద్దఱ కొక సౌఖ్య మబ్బినను దైవముకంటికిఁ గంటగించెనో." తారా. 4. 58.

గంధము చిటులు

  • తడి యాఱిన పిదప గంధము పేటులు రేగు.
  • "చిటిలినగంధముం దళుకుచెంపను వ్రేలు రుమాలు జాఱుదు,ప్పటియును." శుక. 1. 515.

గంధర్వనగరం

  • వట్టిది; మిథ్య. ఎండమావుల వంటి మాట.
  • వావిళ్ళ ని. లో గంధర్వుల పట్టణం అని ఒకటో అర్థం చెప్పి భాగవతంలో ప్రయోగమే ఇచ్చారు. అక్కడ మాయ,మిథ్య అన్న దే సరిపోతుంది.
  • "మఱియు నీ గృహస్థమార్గంబునం దెల్ల,విషయములను బొంది విశ్వ మెల్లఁ గడఁకతోడ నిట్లు గంధర్వనగరంబు, గాఁదలంచి మిగుల మోద మందు." భాగ. 5. 1. 166.

గంధామలకము పెట్టు

  • స్నానం చేయుటకు ముందు ఉసిరిక కాయలను దంచి తల మీద పెడతారు. అది ఉష్ణ నివారక మని ప్రసిద్ధి.
  • "తెలిగొజ్జఁగినీ రెడఁ జల్లి చల్లి గం,ధా మలకంబు పెట్టె నొక యంగన కాళియనాగభేదికిన్." పారి. 2. 10.

గంధోళిగాడు

  • చవట, వెఱ్ఱివాడు, మూఢుడు, హాస్యపాత్రుడు ఇత్యాదులఛాయ లన్నీ కలమాట. బొమ్మలాటలో హాస్యంకోస మని సృష్టించిన 'గంధోళిగాడు' అన్న పాత్రపై యేర్పడిన పలుకుబడి. వీనినే కొన్ని ప్రాంతాల్లో జుట్టుపోలిగాడు అంటారు.
  • "వా డేమంటే మన కేమిట్రా. వాడు వట్టి గంధోళిగాడు." వా.
  • చూ. గండోలిగాడు; జుట్టుపోలిగాడు.

గంపంత బలగము

  • ఊరంత బలగము ఎడ్వ. నాట. 32.
  • "వాళ్ల కేం? గంపంత బలగం ఉంది." వా.

గంపకొప్పు

  • లావాటి కొప్పు.
  • "చెంపల లప్పలు నిండం బెరిఁగిన, కప్పు రపుం గంపకొప్పుల సతుల ఘనుం డాతండు." తాళ్ల. సం. 3. 5.

గంపచాకిరీ

  • అఱవచాకిరీ; లాభం లేని చాకిరీ.
  • "ఈ గంపచాకిరీతోనే సరిపోయింది." వా.

గంపతిరుగుడు

  • డొంకతిరుగుడు. తె. జా.
  • మహాభారత రహస్య విమర్శనము.

గంప నమ్ము

  • బయలుపెట్టు, రట్టు చేయు.
  • "చంప వచ్చిన కర్మసంగ్రహం బగు బుద్ధి, గంప నమ్మక తన్నుఁ గాచెనా." తాళ్ల. సం. 5. 129.

గంప మోపు కోరికల కాలము

  • యౌవనము.
  • "గంప మోపు కోరికల కాలము." తాళ్ల. సం. 8. 32.

గంపల నమ్మ వచ్చు

  • డబ్బిచ్చినవారి కల్లా అమ్ము.
  • "వలపు గంపల నమ్మ వచ్చితినా నేను." తాళ్ల. సం. 3. 515. గంపెడాశ
  • ఎక్కువ ఆశ.
  • "మా అల్లుడు పండగకు వస్తాడు గదా అని గంపెడాశతో ఉంటే సెలవు దొరక లేదని రాశాడు. మా అమ్మాయి మొహం ముడుచుకొని కూర్చుంది." వా.

గంపెడు పిల్లలు

  • ఎక్కువమంది సంతానం. పుట్టెడు దు:ఖం వంటిదే ఇది.
  • "గంపెడు పిల్లలతో ఈ మండిపోయే ధరల్లో ఎలా బ్రతకాలో తోచకుండా ఉంది." వా.

గగనంబు చించులీల

  • ప్రయాణ సంరంభాన్ని సూచిస్తూ వారి కోలాహలం, ఆకాశాన్ని కూడా తూట్లు పడ జేయుచున్నది అనగా అత్యధికముగా ఉన్నది అన్న అర్థంలో ప్రయుక్త మయ్యే పలుకుబడి. ఇలా యేర్పడిన మాటలు - మిన్ను ముట్టు, ఆకస మంటు, గగనము పగుల నార్చు, ఆకసము చీల్చు ఇత్యాదులు.
  • "తలవరు లింత నంత వెడదాఁటులతో గగనంబు చించులీ,లల విలసిల్లి వెంటఁ బదిలంబుగ రా..." శుక. 2. 220.

గగనకుసుమము

  • శూన్యము; అసంభవము.
  • "ఎన్నంగ నీదు సముఖము, క్రొన్నెల పొడ వయ్యె గగనకుసుమం బయ్యెన్." రాధా. 1. 7. పు.

గగనప్రసూనవాదము.

  • శూన్యవాదము.
  • "గగనప్రసూనవాదము, జగతిం బ్రత్యక్షమునకు సరి యనఁ దగునే?" కాళ. 3. 169.

గగన మగు

  • ఎంతో కష్ట మగు.
  • "వాణ్ణి పెండ్లికి ఒప్పించేసరికి గగనమయింది." వా.

గగనమా?

  • అరుదా ? అబ్బురమా ? అసాధ్యమా ?
  • "వాడి కా పుస్తకం రాయడం ఏం గగనమా?" వా.
  • "వానితో మాట్లాడ్డం ఏం గగనమా ? అన్నిసార్లు చెప్పుకొంటున్నాడు." వా.

గగనము చేసికొను

  • గొప్ప చేసుకొను.
  • "పసిగౌను పిడికిటఁ బట్టి చూచెద నన్నఁ, జెలి యది గగనంబు చేసి కొనెదు." సారం. 2. 224.
  • చూ. గగనమా?

గగనానికి యిలకు....

  • చాలా దూర మనుట.
  • 'గగనానికీ యిలకూ బహు దూరం బనినారు' అన్న త్యాగరాజు కీర్తన భాగంపై వచ్చిన పలుకుబడి.
  • "వాల్మీకిరామాయణానికీ యీ రామాయణానికీ పోలిక యేమిటి? గగనానికీ యిలకూ..."

గగురు పొడుచు

  • జలదరించు. కాశీ. 5. 130.

గగ్గులకా డగు

  • చెల్లాచెద రగు; కలతపడు.
  • "గుఱ్ఱంపుపౌజు గగ్గులకా డై చెదరంగ." కా. మా. 2. 41.

గగ్గులకాడు చేయు

  • పాడు చేయు
  • "కలఁచి తెరలించి గగ్గులకాడు సేసి, సకలబలముల దెసలకు సరఁగఁ దెచ్చె." శ్రీరాధా. 5. 70.

గగ్గులకాడున గలుపు

  • పాడు చేయు.
  • "డగ్గఱి యెవ్వఁడో కటకటా శివలింగము మీఁది రత్నముల్, గగ్గులకాటఁ గల్పి ములుకంపలు తీవలు వెట్టె నేఁడు." కాళ. 2. 110.

గగ్గోడుపడు

  • కలగి పోవు. హర. 6. 47.

గగ్గోలగు

  • గందరగోళ మగు; గోల అగు. రసిక. 1. 108.

గగ్గోలుపడు

  • గందరగోళ మగు.

గగ్గోలు పుట్టు

  • గోల అగు.
  • "గొల్లవాడల నెల్ల గగ్గోలు పుట్టు." నీలా. 3. 55.

గచ్చకాయల కుండ

  • వాగుడుకాయ, గయ్యాళి. కుండలో గచ్చ కాయలు పోసి నప్పుడు కదిలిస్తే విపరీతంగా శబ్దం చేస్తాయి.
  • "ఆ గచ్చకాయలకుండ జోలికి ఎందుకు పోయావు రా? ఇక మూడు రాత్రులూ మూడు పగుళ్ళూ విడిచి పెట్టఫు." వా.

గచ్చకాయలు

  • గోలీలాటవలె గచ్చకాయ లాట.
  • "గచ్చకాయలు కిఱ్ఱుగానుగ త్రిప్పుళ్లు." హంస. 3. 146.

గచ్చులాడి

  • మాయలాడి; విలాసిని.
  • "ఇటు వచ్చిన యచ్చర గచ్చుటాండ్రలో, నేరుచిరాంగి చక్కనిది." అహ. 1. 72.

గచ్చు విచ్చగు

  • చెల్లాచెద రగు.
  • "చెదరి బెదరి కలంగి కన్ బెదరి తొలఁగి, గచ్చువి చ్చయ్యెఁ బారశీక, వజ్రంబు." కృష్ణరా. 3. 59. జ్ఞానప్రసూనాంబికా. 20.

గచ్ఛంతి చెప్పు

  • పోవు.
  • వైదికుల పరిభాష.
  • "మే మింక గచ్ఛంతి చెప్తాము." వా.

గజకర్ణములు.

  • చంచలములు.
  • ఏనుగు చెవులు ఒక క్షణం ఆగకుండా ఎప్పుడూ అటూ
  • యిటూ ఆడుతుంటాయి. దానిపై వచ్చిన పలుకుబడి
  • చూ. గతాగతద్విరదకర్ణములు.

గజగజలాడు

  • భయపడి పోవు.
  • "వాడు తండ్రికి గజగజ లాడుతాడు." వా.

గజినిమీలిక

  • నిద్ర పోతున్నట్టు కనిపించినా అతిజాగరూకతతో నుండుట. ఏనుగనిద్ర అలా ఉంటుం దనుటపై ఏర్పడినది.

గజబొంకు బొంకు

  • పచ్చిఅబద్ద మాడు.
  • "చేరిక వీరబాహుని భజించుటచే గజబొంకు బొంకుటన్, సారము దూలె ము న్నని..." సాంబో. 1. 19.

గజ యీతగాడు

  • గొప్ప యీతగాడు.

గజరు గజరులు పోవు

  • గగుర్పాటు చెందు.
  • "జవరా లగుకాపాలిని, కవుఁగిటఁ దన మేను గజరు గజరులు వోఁగా." ప్రబోధ. 3. 46.

గజశ్రద్ధు

  • మందకొడి.
  • "క్రుద్ధుం డగు భీష్ము ముందు 'కోన్కిస్క' గజశ్రద్ధుండు కర్ణుఁ డే మగు." గీర. గురు. 45.

గజస్నానము

  • వ్యర్థము.
  • ఏనుగు బాగా నీళ్లలో మునిగినా పైకి వచ్చి తిరిగి దుమ్ము ఒళ్లంతా చల్లు కొంటుంది. అందుపై యేర్పడిన పలుకుబడి.
  • "ఉదకము నళినీ పత్రము, గదిసియు నెర వైనయట్లు కలయవు నీమా, హృదయములు గజస్నానము, తుది మఱి నీ తోడిపొందు దుష్టచరిత్రా!" భాస్క. యుద్ధ. 138.

గజిబిజి యగు

  • కలవరపడు.
  • "గజిబిజి యైరి సభాస్థలిఁ, బ్రజ లెల్లను బొట్టి వడుగు బాఁపని రాకన్." భాగ. 8. స్కంధము. 534.

గజిబిజి చేయు

  • గందరగోళము చేయు. కాశీ. 6. 179.

గజిబిజి పడు

  • కలగు.
  • "గుజగుజలు వోవు వారును, గజిబిజి పడువారు." భాగ. 8. స్కం. 534.

గజిబిజి పుట్టు

  • గందరగోళ మగు.
  • "కల్యాణమున భక్తి గజిబిజి పుట్ట." పండితా. ద్వితీ. మహి. పుట. 198.

గజ్జి పట్టు

  • గజ్జి కురుపులు లేచు.
  • "ఈ కుక్కకు గజ్జి పట్టింది. దగ్గఱకు రానీకండి." వా.

గజ్జు గెలయు

  • పొగరు పట్టు.
  • "చిలుక జవరాలు తమి గజ్జు గెలసి మరుని, మర్మ ముద్ఘాటనము సేసి మలయుచోట." సాంబో. 1. 177.

గజ్జు పట్టు

  • పొగరు పట్టు. ప్రభులిం. 4. 135. పుట.

గజ్జులాడు

  • గర్విష్ఠి.

గుజ్జు రేగు

  • విజృంభించు.
  • "కాలకంధరవాహంబు గజ్జు రేఁగె." పాండు. 4. 37.

గజ్జెకట్టు

  • సభలో నిలబడు.
  • పూర్వం దేవదాసీలు సభలో గజ్జెకట్టి నాట్యం చేయడం ద్వారా యేర్పడినపలుకుబడి.
  • "నే నీరోజు భాషాసమితిలో గజ్జె కట్టాలి." వా.

గట్టిగా

  • దృఢంగా.
  • "వాడు రా డని గట్టిగా చెప్పగలను." వా.

గట్టి చేయు

  • దృఢపఱుచు. బ్రౌన్.

గట్టిపాఱు

  • గట్టిపడు.
  • "కాఁకలను దేఱి గడిమీఱి గట్టి పాఱి." హంస. 5. 110.

గట్టి పెట్టు

  • పూర్వం కఱ్ఱపలకకు పసరులో కొన్నిటిని మెదిపి పట్టించేవారు. దానిపై వ్రాసే వారు. ఆ పట్టించుటచే గట్టి పెట్టుట.
  • "అనువుగ మి న్ననుం గడితపాళెఁ దమంబున గట్టిపెట్టి శో,భనతరచంద్ర దీధితుల పంక్తి జమాఖరుచుల్ గణించి..." హంస. 1. 142.

గట్టిముడి

  • సులభంగా విడువకుండా రెండుసార్లు వేయు ముడి. దీనికి వ్యతిరేకం 'దూముడి.'
  • "గట్టి ముడి వేశాక ఇక యిది విప్పడం ఆలస్యం కా కే మువుతుంది?" వా.

గట్టి యిడు

  • గట్టి పెట్టు.
  • "ఇక్కడితంబు గట్టి యిడినట్టుల యున్నది కప్పు దేఱుచున్." పాండు. 5. 80.
  • చూ. గట్టిపెట్టు.

గట్టివరహాలు

  • నగదు, రొఖ్ఖం.
  • "కుమార్తె వివాహంలో చదివించిన పదివేల గట్టి వరహాలు." వా.

గట్టివా

  • మాటకారి, ధూర్తురాలు.

గట్టివాడు

  • బాగా ఎఱిగిన వాడు; లోబడని వాడు.
  • "వాడు వ్యాకరణశాస్త్రంలో గట్టి వాడు." వా.
  • "వా డలా మాటలకు బేలిపోయేవాడు కాదు - గట్టివాడు మఱి." వా. గట్టివాయి
  • గయ్యాళి.

గట్టివాలు

  • సైరంధ్రి. ఇతరుల ఇళ్ళలో గంధ పుష్పాద్యలంకారాదులు చూచే స్త్రీ; గంధ పుష్పాదు లమ్మే స్త్రీ.

గట్టి వైసు

  • ప్రౌఢవయస్సు.

గట్టు చేరినంత పుట్టివానికి బొమ్మ గట్టినట్టు.

  • 'అక్కఱ తీరినతర్వాత అక్క మొగుడు కుక్క' వంటి పలుకుబడి.
  • "గట్టు చేరినంతఁ బుట్టివానికి బొమ్మ, గట్టుసామ్య మాయెఁ గదవె చెలియ!" రాధి. 3.

గట్టెక్కు

  • కష్టమునుండి బయటపడు.
  • "సమరంబున నరి నేలమట్టి కార్యంబు గట్టెక్కించు కొనువాఁడను." ధర్మజ. 53. పు.

గడ కట్టు

  • తెగించి కూర్చుండు.
  • పదుగురిలో పడుటకు సంకోచించక పోవు.
  • దొమ్మరిది గడకట్టి దాని మీద నిలిచి ఆడడంపై వచ్చిన పలుకుబడి.

గడకు గట్టిన పాత

  • చంచలము. తాళ్ల. సం. 11. 3. భా. 125.

గడగట్టి

  • గట్టిగా; బాహాటంగా.
  • "రామమూర్తికిన్, రెంటవసాటి దైవమిఁక లేఁ డనుచున్ గడగట్టి... చాటెదను." దాశ. శత. 34.

గడగడ పడు

  • భయపడు.

గడగడ పఱచు

  • భయపెట్టు.

గడగడలాడు

  • భయపడు.
  • "వాని పే రెత్తితే ఊరంతా గడగడలాడి పోతారు." వా.

గడప తొక్కు

  • ఇంటికి వచ్చు.
  • "ఇకమీద నీ గడప తొక్కితే నన్నడుగు." వా.

గడప దాటు

  • ఇల్లు దాటి బయటికి వెళ్లు.
  • "పదేళ్లయింది కాపరానికి వచ్చి. ఆవిడ గడప దాటి యెఱగదు." వా.

గడప దిగి...

  • ముందు బయటికి వెళ్లి - తరవాత మాట్లాడు అనే అర్థంలో కోపావేశంతో అనుమాట.
  • "ముందు గడప దిగి మాట్లాడు." వా.

గడపలో కాలు పెట్టు

  • ఇంటిలో అడుగు పెట్టు, గృహ
  • ప్రవేశము చేయు, కాపురమునకు వచ్చు.
  • "ఆ పిల్ల యేవేళప్పుడు గడపలో కాలు పెట్టిందో యేమో! అన్నీ కష్టాలే. అన్నీ నష్టాలే." వా.

గడబడ

  • అల్లరి.

గడబిడ

  • అల్లరి.

గడబిడ అగు

  • గందరగోళ మగు.
  • "దొంగలు పడ్డా రని ఊ రంతా గడబిడ అయింది." వా.
  • చూ. గడబిడ చేయు.

గడబిడ చేయు

  • అల్లరి చేయు.
  • "పోలీసులు దిగి ఆ ఊ రంతా గడబిడ చేసి పోయారు." వా.

గడవ నీద వశ మె?

  • దాట సాధ్యమా ?
  • "...బీము గడవ నీఁద వశమె." భార. ఉద్యో. 2. 190.
  • అతనిని మించి పోగలమా ? అనుట.

గడి కట్టు

  • తెగించి బజారున పడు.
  • దొమ్మర గడిమీద నిలబడి సాము చేయుట సిగ్గుమాలి తెగించుటగా భావిత మై తద్ద్వారా యేర్పడిన పలుకుబడి.
  • "గడి కట్టి కూర్చుంది రా అది. దాని నోటికి పోతే మన మానమే పోతుంది." వా.

గడిచీటి యిచ్చు

  • విడుదలపత్ర మిచ్చు.
  • "కర్మపు కోట్లకు గడిచీ టిచ్చెను, నిర్మలమతులకు నేఁ డిపుడే." తాళ్ల. సం. 11. 2 భా. 43.

గడికాళ్ళు వేయు

  • పశువుల కాళ్ళకు బందాలు వేయు. శ. ర.

గడితపడు

  • గట్టిపడు.

గడితలవాడు

  • ఒకవిధ మైన ఆయుధం ధరించిన సైనికుడు. కుమా. 11. 40.
  • చూ. ఈటెకాడు.

గడిదేఱు

  • ఆఱితేరు.
  • "వెడవెడ దుర్వ్యవహారపు, నడవడి గడిదేఱి..." పాండు. 3. 14.
  • "అ,క్కాంతుని మన్ననలవలన గడిదేఱి వెసన్." శుక. 1. 301.
  • "మిక్కిలిన్, దెగువరి కంతుకేళి గడిదేఱినజాణ." నిరం. 2. 35.

గడిపోతు

  • ఆబోతు; దున్న పోతు.
  • "గడిపోతువలె మేనికండలు పెంచి." గౌర. హరి. ద్వి. 558. గడిమీఱు
  • గడిసాములు చేసి తయారగుట పై వచ్చిన పలుకుబడి. ఆరితేరిన అనుట.
  • "కాకలను దేఱి గడిమీఱి గట్టిపారి." హంస. 5. 110.
  • చూ. గడిదేరు.

గడియకుడుక

  • గడియలు తెలిసేందుకై చిల్లి పొడిచి నీళ్ళబానలో ఉంచిన గిన్నె. అదొక్కసారి మునుగగా ఒక గడియ అని లెక్ఖ కట్టేవారు.
  • "గడియకుడుక మునుంగుట గని గురుండు, తెల్ల వాఱెడు నని పఱతెంచి పలుక." కువల. 2. 125.
  • చూ. గడెకుడుక.

గడియదూరము వెడల్పు (నది)

  • దాటుటకు ఒక గడియ కాలము పట్టు వెడల్పు గల (నది). కాశీయా. పు. 7.

గడియ యొక్కయుగముగా తోచు

  • క్షణ మొక యేడుగా తోచు. మనసులోని ఆవేదనను తెలిపే పలుకుబడి.
  • "తుంటవిల్తుఁడు వాఁడితూపుల నేయంగ, గడియ యొక్కయుగంబు గాఁగఁ దోఁచె." ఉషా. 1. 67.

గడియారము

  • గంటలు తెలిపే యంత్రం.
  • "ఆనలినాయతాక్షు గడియారమునం దభిసారికాజిఘాం,సానిరత ప్రసూన శరచాపగుడధ్వనులో యనంగ ఘం,టా నినదంబు లయ్యెడ వినంబడియెన్." పారి. 2. 50.

గడిరాజు

  • వీరుడు. తాళ్ల. సం. 11. 3 భా. 125.

గడుసరి

  • గడు సైనవాడు, గడు సైనది.

గడుసువడు

  • మొండి కెత్తు, గట్టిపడు, బండబాఱు.
  • "గురుజనము శిక్షింపన్, గడుసువడి." పాండు. 3. 14.

గడుసుపిండం

  • చాలా గడుసరి.
  • "వా డెక్కడ? గడుసుపిండం. నీలాంటివాళ్లచేతికి దొరుకుతాడా?" వా.

గడుసు బుఱ్ఱ

  • మంచి తెలివైన.

గడుసురాలు

  • గట్టి ఆడుది.

గడె కుడుక

  • గడియను కొలుచు గిన్నె. పూర్వం గడియారపుబానలో నీళ్లు పోసి ఉంచేవారు. గడియలు కొలుచుటకు చిల్లి గిన్నెను అందులో ఉంచే వారు. నీ రందులో నిండి
  • అది మునిగి పోగానే ఒక గడియ అయిన దన్న మాట.
  • "అంచల సూర్యచంద్రు లనె గడె కుడుకుల, ముంచి కొలిచి పోసీని మునుకొని కాలము." తాళ్ల. సం. 6. 172.
  • చూ. గడియకుడుక.

గడె గడెకు

  • మాటిమాటికి, గడియ గడియకు.
  • "గడెగడెకును బెట్టె నిడియున్న గడి తంపుఁ, జలువలు గట్టును జెలువు దనర." హంస. 3. 77.

గడేకారితనము

  • నోటి పెద్దతనము.
  • "ఔర! ధీరుల రై గడేకారిపదవి, కాస చేసితి రే మందు మయ్య మిమ్ము." గీర. 101.

గడ్డం కింద చెయి పెట్టుకొను

  • విచారమును సూచించు చేష్ట.
  • "ఏమిటోయి! గడ్డంకింద చెయి పెట్టుకొని కూర్చున్నావు? మీ ఆవిడ ఇప్పు డప్పుడే రా నని రాసిం దేమిటి?" వా.

గడ్డం గోకుకొను

  • సంధిగ్ధావస్థలో పడు.
  • "వా డేమీ తోచక గడ్డం గోక్కుంటూ కూర్చున్నాడు." వా.

గడ్డతీరు తీయు

  • మాగాణిలో ఎత్తుగా ఉన్న నేలను త్రవ్వి నీరు పారుటకు వీలుగా చేయు.

గడ్డపాఱ మ్రింగినట్లు ఉండు

  • బిఱ్ఱ బిగుసుకొని ఉండు. గడ్డపాఱను మ్రింగినప్పుడు అది వంగదు కనుక బిఱ్ఱ బిగుసుకొని కూర్చుండు ననుటపై యేర్పడినది.
  • "గడ్డపాఱయు మ్రింగిన గతిని బిఱ్ఱ, బిగిసి కూర్చుండుటలు లేక పెద్దమనము, గలదె." కళా. 7. 29.

గడ్డపొయ్యి

  • గడ్డలతో ఏర్పఱచిన పొయ్యి. శ. ర.

గడ్డము పట్టుకొను

  • ప్రాధేయపడు; బ్రతిమాలు.
  • "తన కంఠంబును గౌఁగిలించి యొక చేతన్ గడ్డముం బట్టి..." కళా. 5. 67.

గడ్డము మాయు

  • గడ్డము పెరుగు.
  • "గడ్డము మాసింది. ఈరోజైనా క్షవరం చేసుకోవాలి." వా.

గడ్డి కఱచు

  • చూ. గడ్డి తిను.

గడ్డి తిను

  • నీచమునకు లోబడు.
  • "వాడు ఏమిటి కైనా గడ్డి తినేరకం."
  • చూ. గడ్డి కఱచు.

గడ్డి పరకవంటి

  • అల్ప మైన.
  • "వాడు కేవలం గడ్డిపరక వంటివాడు." వా. గడ్డి పెట్టు
  • బుద్ధి చెప్పు.
  • "వాడికి నీవయినా కాస్త గడ్డి పెట్టు." వా.
  • "నీ వీపని చేసి అక్కడికి వెళ్లా వంటే గడ్డి పెట్టి పంపిస్తారు." వా.

గడ్డిపోచతో సమానము

  • లెక్క లే దనుట.
  • "వాడికి నే నంటే గడ్డిపోచతో సమానం." వా.
  • రూ. గడ్డిపరకతో సమానం.

గడ్డిబొద్దు

  • వరిగడ్డితో చుట్టిన చుట్ట కుదురు; గడ్డిమోపు.
  • "గడ్డిబొద్దునువలె మేను గానిపింప." చంద్ర. వి. 1. 69.

గడ్డుకొను

  • ఎక్కు వగు; అతిశయించు.

గడ్డుగా

  • క్లిష్టముగా.
  • "ఈ జ్వరం ఏమిటో గడ్డుగా తయారయింది. నాలుగునెల లయినా నెమ్మదించడం లేదు." వా.

గడ్డురుకు

  • ఎగురు.
  • "హృదయంబుల చలువలం ద్రోవ యడ్డగించి గడ్డుఱికి యాక్రమించెనో." ప్రభా. 5. 57.

గడ్డురోజులు

  • గడచుట కష్ట మైన రోజులు.
  • "ఈ గడ్డురోజుల్లో పదిమందిని పెట్టుకొని మన మేం పోషిస్తాం?" వా.
  • "ఆనలినాయతాక్షు గడియారమునం దభిసారికాజిఘాం,సానిరత ప్రసూన శరచాపగుడధ్వనులో యనంగ ఘం,టా నినదంబు లయ్యెడ వినంబడియెన్." పారి. 2. 50.

గడిరాజు

  • వీరుడు. తాళ్ల. సం. 11. 3 భా. 125

గడుసరి

  • గడు సైనవాడు, గడు సైనది.

గడుసువడు

  • మొండి కెత్తు, గట్టిపడు, బండబాఱు.
  • "గురుజనము శిక్షింపన్, గడుసువడి." పాండు. 3. 14.

గడుసుపిండం

  • చాలా గడుసరి.
  • "వా డెక్కడ? గడుసుపిండం. నీలాంటివాళ్లచేతికి దొరుకుతాడా?" వా.

గడుసుబుఱ్ఱ

  • మంచి తెలివైన.

గడుసురాలు

  • గట్టి ఆడుది.

గడె కుడుక

  • గడియను కొలుచు గిన్నె. పూర్వం గడియారపుబానలో నీళ్లు పోసి ఉంచేవారు. గడియలు కొలుచుటకు చిల్లి గిన్నెను అందులో ఉంచే వారు. నీ రందులో నిండి
  • హవామహే' అని ఘంటానాదం చేయుట అలవాటు. దానిమీద వచ్చిన పలుకుబడి.

గణికు లొప్పిన గవ్వలు

  • చెల్లుబడి గలవి.
  • గవ్వలు ఒకప్పుడు నాణ్యాలుగా ఉండేవి. అయితే గణికులు ఒప్పినవాటికే మారకపు విలువ.
  • శంఖంలో పోసింది తీర్థం అనుట వంటిది. వేమన. 49.

గతజల సేతుబంధనము

  • వ్యర్థము.
  • "ఇంక నమ్మాట లాడుట గతజల సేతు బంధనంబు. దానిం జాలింపుము." భార. భీష్మ. 3, 84.
  • చూ. గతోదకబంధనము.

గత పడు

  • కడచు; మరణించు.
  • "హతశేషు లగురాక్షసావలి చెప్ప, గతపడ్డ యమ్మహాకాయునిఁ దలఁచి." రంగ. రా. యు. 378.

గత మగు

  • చనిపోవు.
  • "ఖరదూషణాదులు గత మైనచోట." పల. పు. 19.

గతము సేయు

  • చంపు. పండితా. పర్వ. 521. పు.

గతాగతద్విరదకర్ణములు

  • చపలములు, నిలకడ లేనివి.
  • ఏనుగు చెవులు ఎప్పుడూ అటూ ఇటూ అల్లాడుతూ నిలకడగా ఉండ వనుటపై వచ్చినది. పండితా. ద్వితీ. పర్వ. పుట. 418.

గతానుగతికము

  • గొఱ్ఱెదాటుగా పోవునది.
  • "తిర్యక్తతి తా గతానుగతికం బౌఁ గా కుఠారీ హరీ?" ఆము. 4. 25.

గతానుగతికో లోక:...

  • జనం గొఱ్ఱెదాటు రకం.
  • "గతానుగతికో లోకో,న లోక:పార మార్థిక:" నీత్యుక్తి.

గతి చెడ్డ చెడుగు

  • గతి మాలినవాడు.
  • "గతి చెడ్డ చెడుగు తెక్కలి బొక్కలాఁడు." గౌ. హరి. ద్వితీ. పం. 2034.
  • పై ప్రయోగములో శ్లేష గుఱుతింప దగును.

గతి పడు

  • ప్రాప్త మగు.

గతిమాలిన

  • దిక్కుమాలిన.
  • "ఎక్కడి గతి మాలినపిశాచికవొ నీ మాటల్." కళా. 3. 204.

గతిమాలిన చేతలు

  • దిక్కుమాలిన పనులు.
  • "గతిమాలిన చేఁతలు." సింహా. 7. 3.

గతి మాలు

  • దిక్కు మాలు.
  • "తిరువేంకటేశుఁ జేరక... మిగుల గతి
  • మాలెఁ బ్రాణి." తాళ్ల. సం. 5. 101.

గతి లేక

  • మరొక మార్గము లేక.
  • "గతి లేక పోయి రాఘవు మఱుఁగుఁ జొచ్చె రవి, సుతుఁడు నా కేమిటికి సుదతి యీరోఁత." సుగ్రీ. పు. 27.
  • "గతి లేక నీ కొంపకు వచ్చాను." వా.

గతి సేయు

  • కాపాడు. ద్వా. 5. 76.

గతోదకబంధనము

  • వ్యర్థము.
  • "ఇంక నీ వేమి పల్కిన నృపవరేణ్య! పనికి రాదు గతోదకబంధనంబు." హరి. 4. 134.
  • చూ. గతోదకసేతువు. గతజలసేతుబంధనము.

గతోదకసేతువు

  • గలజలసేతుబంధనము.
  • పారిన నీటికి అడ్డు వేయుట వంటి నిష్ప్రయోజన మైన పని.
  • "ఎచటనుండి వచ్చు నీగతోదకసేతు, వులఁ బ్రయోజనంబు గలదె తండ్రి." భోజ. 5. 64.
  • చూ. గతోదకబంధనము.

గత్తరపడు

  • బెదరిపోవు. బ్రౌన్.

గదుముకొని పోవు.

  • తరుముకొని పోవు.

గదురుకొను

  • తిట్టు; కసురుకొను.

గద్దగోరు

  • దొంగల సాధనాలలో ఒకటి.

గద్దముక్కు

  • గద్దముక్కువంటి ముక్కు. వాడి గలది, వంక రైనది అనుట.
  • "ఆ గద్దముక్కు ఆసామిని చూచేసరికి నాకు ఎక్కడ లేని భయం వేస్తుంది." వా.
  • చూ. గరుడముక్కు.

గద్దఱికాడు

  • దిట్టతనము కలవాడు.

గద్దెపొంకము చెప్పు

  • పెద్ద సుద్దులాడు.
  • "కలవి లేనివి కొన్ని కొలువునఁ గూర్చుండి, గద్దెపొంకము చెప్పఁ గలరు గాక." చంద్రా. 2. 49.

గద్దె యెక్కి కూర్చొను

  • గొప్పలకు పోవు. కొత్త. 181.

గనగన మండు

  • గనగన లాడు. ధ్వన్యనుకరణము.

గనగన లాడు

  • మండు.

గనికట్టు

  • గడ్డకట్టు.

గనికె కుంద

  • ఒక ఆట.

గన్నేఱు కాదారి ప్రొద్దు

  • నిశీథము.
  • "...అప్పురమునం, గన్నేరుకాఁదారి ప్రొ,ద్దున భీమేశుడు సానివాడఁ దిరుగున్ ధూర్తప్రకారంబునన్." భీమ. 1. 111.

గప్పాలు కొట్టు

  • డంబాలు పలుకు, ఊసుకోలు కబుర్లు చెప్పు.

గబగబా

  • త్వరగా.
  • "ఎంత గబగబా నడిచి వచ్చినా సమయానికి చేరుకో లేక పోయినాను." వా.

గబ్బిదేఱు

  • అతిశయించు.
  • గబ్బిగుబ్బలలోని గబ్బివంటిది ఇక్కడి గబ్బి.
  • "మెఱుపు లై మిట్ట లై మిక్కిలి బటువు లై, క్రాలుకన్నుల చెన్ను గబ్బిదేఱ." పాండు. 2. 91.

గమగమలాడు

  • పరిమళములు వెదచల్లు.

గమికత్తె

  • చెలికత్తె

గమ గమ వలచు

  • గమ గమ వాసన వేయు.
  • "కసటు వో బీఱెండఁ గరఁగి కఱ్ఱల నంటి, గమ గమ వలచు చొక్కపు జవాజి." మను. 2. 55.

గమికాడు

  • అధిపతి

గమి గూడు

  • గుంపు గూడు.
  • "సాంధ్యరాగధారాళరుచుల్, గమి గూడె." నిరంకు. 2. 108.

గములు గట్టు

  • గుంపులు గట్టు, గుములు కట్టు, గుమి కూడు.
  • "నానాదేశముల కప్పడీలు... గముల్ గట్టి యే తేర." పండితా. ద్వితీ. పర్వ. పుట. 374.

గములు గూడు

  • గుంపులుగా చేరు.
  • "పాడుచు నొసఁగులు వీడుచు గములు, గూడుచు నలిరేఁగి యాడుచు." పండితా. ద్వితీ. మహి. పుట. 33.

గమ్మత్తు చిమ్ము

  • వేడుక కల్పించు.
  • "గమ్మత్తు చిమ్మ నొక కథఁ గ్రమ్మఱఁ దెల్పెదను..." హంస. 2. 6.
  • దీనికి దగ్గఱగా ఉన్న అనేకార్థచ్ఛాయలలో ఈపదం వాడుకలో వినిపిస్తుంది.
  • "ఆపాట బలే గమ్మత్తుగా ఉంది." వా.
  • "అక్కడో గమ్మత్తు జరిగింది." వా.

గయ్యాల గచ్చలు

  • గయ్యాళిగంపలు. పండితా. ప్రథ. పురా. పుట. 343.
  • చూ. గయ్యాళిగంప.

గయ్యాళిగంప

  • నోటిదురుసు కలది, జగడాలమారి.
  • "ఆ గయ్యాళిగంప నోటి కెవరు పోతారు?" వా. గయ్యాళిభూమి
  • సేద్యానికి పనికి రాక బీడుగా ఉన్న భూమి.
  • దీనినే 'గయ్యాళు' అన్న రూపంలో శ. ర. బ్రౌను పేర్కొన్నవి. నేడు వ్యవహారంలో 'గయ్యాళి' అన్న రూపంలో వినబడుతుంది.

గరగడ

  • గళాయి. నూనె లాంటి వానిని వేరే పాత్రలోనికి వంచేప్పుడు పెట్టే పెద్దమూతి చిన్నక్రోవి గలది

గరగరగా కడుగుకొను

  • శుభ్రముగా కడుగుకొను. మామూలుగా చేతులు కడుగుకొనునప్పుడు, ఇతరులు చేతులమీద నీళ్లు పోస్తుండగా రెండు చేతులనూ ఒక దానితో నొకటి కలిపి రుద్దుకొనునప్పుడు, గరగర మని శబ్ద మగుట యీపలుకుబడికి మూలము కావచ్చును. పాండు. 3. 31.

గరహర నగు

  • ఇష్టపడు; మనసులో ఉత్సాహం చిప్పిల్లు.
  • "మగువలు గరగర నై తగు, మగవానిం జూచి వీఁడు మగఁ డైనఁ గదా, తెగు దు:ఖం బనుకొంచున్." శుక. 3. 516.
  • "మిక్కిలి, గరగర, నగు నేఱు ప్రాల కలమాన్నంబుల్." జైమి. 8. 198.

గరగర లాడు

  • క్రొత్త దైన. కొత్తబట్టలు గరగర లాడుట సహజము.
  • ధ్వన్యనుకరణము.
  • "గరగర లాడుగాగర..." బుద్ధ. 2. 47.

గరవడు

  • గడ్డకట్టు.

గరిగొను

  • అతిశయించు.

గరిడి కెక్కు

  • ఆరి తేఱు.
  • "హరునిభక్తుల యాజ్ఞ శిరమునఁ దాల్చి, గరిడి కెక్కినయంకకాఁడునుబోలె." పండితా. వాద. 176.

గరిడి ముచ్చుదనముతో

  • ఆరితేరిన నంగనాచితనంతో.
  • "సంయమియు.... గానకళ లెల్ల గరిడిముచ్చుఁ, దనముతో నేర్చితివి గద! యనుచు బలికి." కళా. 2. 47.

గరివడు

  • నిలిచిపోవు; గడ్డకట్టు.
  • "తెలిసియుఁ దెలియను తెగ దీచిక్కేమిటా!, కలకాల మిందుననే గరివడె బ్రదుకు." తాళ్ల. సం. 9. 109.

గరివడెము

  • ఒకరకమైన వడియము. గరిసెబావి
  • త్రవ్విన గరిసె దించిన చిన్న బావి.

గరుపారు

  • గరు కెక్కు.
  • "చన్నుగ్రేవలు గరుపార." రాధా. 4. 56.

గరుపాఱు

  • గగుర్పాటు చెందు.
  • "గరుపాఱఁగ మేను ప్రకంపమునన్." భార. స్త్రీ. 1. 45.

గరుడముక్కు

  • పొడువుగా ఉండి వంగిన ముక్కు.
  • "వాడి గరుడముక్కు చూస్తేనే కోపిష్ఠి అనిపిస్తుంది." వా.

గరుదాల్చు

  • గగుర్పాటు చెందు. శివ. 4. 20.

గర్రన త్రేన్చు

  • త్రేన్పులో ధ్వన్యనుకరణము. రాధా. 5. 125.

గర్భగుడి

  • చూ. గర్భాలయము.

గర్భగృహము

  • చూ. గర్భగుడి.

గర్భయాచకులు

  • గర్భదరిద్రులు.
  • "వెన్బడితిమి గర్భయాచకులభంగి." హర. 3. 15.

గర్భాలయము

  • దేవాలయంలో మూలవిరాట్టుండే గది.

గర్వగ్రంథి

  • చాలా గర్విష్ఠి.
  • "వాడు వట్టి గర్వగ్రంథి. ఎవణ్ణీ లెక్క పెట్టడు." వా.

గఱి గట్టు

  • అరివోయు.

గఱు వ్రాల్పు.

  • గగురుపాటు చెందు. కాశీ. 2. 149.

గలగల మ్రోయు

  • ధ్వన్యనుకరణము.
  • "గలగల మ్రోయునందెలుసు..." కళా. 6. 200.

గలిబిలి చేయు

  • అల్లరి పెట్టు.
  • "గలిబిలి చేసి రవ్వ లిడఁగా." రాధి. 4. 15.

గవిచికొను

  • కప్పుకొను.
  • "పచ్చని కంబలి గవిచి కొన్న విధంబున." కుమా. 6. 100.

గవిసెన పుచ్చు

  • ముసుగు తీసివేయు.
  • వీణె, కుంచె, ఇలాంటివానికి తిత్తి కుట్టి అందులో వాని నుంచుతారు. నేడు గౌసెన అని వీణెలాంటివానిపై తిత్తు>
  • లకు ముసుగులకు వాడుతారు.
  • "గవిసెన వుచ్చిన, కుసుమబాణునీలి కుంచి వోలె." కుమా. 7. 78.

గవుదలగంగమ్మ

  • గవుదలు వాచే ఒక వ్యాధి.

గవ్వకు చేయి సాచు

  • నీచానికి పాల్పడు.
  • "క్రమముగ నాఁడునాఁటికిని గవ్వకు నేనియుఁ జేయి సాచు రా..." శతా. 82.

గస్తు దిరుగు

  • గస్తీ తిరుగు.
  • "కోలలవారిగాఁ గొని గస్తు దిరిగి." గౌ. హరి. ద్వితీ. పం. 1665.

గళస్య కంఠస్యగా ఉండు

  • పేచీ యేర్పడు.
  • "వాడితో గళస్య కంఠస్యగా ఉంది." వా.
  • "వీడికీ నాకూ గళస్య కంఠస్యగా ఉంది." వా.

గళ్లు బాళ్లు చిక్కు

  • పూర్తిగా చిక్కు.
  • "ఆకర్ణింపుము మత్సమాగమనకార్యం బష్టదిక్పాలకీ, లోకంబుల్ విదళించి వచ్చితివి గళ్లుంబాళ్లు చిక్కంగ నా, లోకంబుల్ మనుపోలె నుండ..." వరాహ. 3. 67.

గాండ్రు గాండ్రు మను

  • పులి అఱచు.
  • ధ్వన్యనుకరణము.

గాండ్రు పెట్టు

  • గాండ్రు మని అఱచు.
  • "మండ్రాటముగ నిఱ్ఱి మాంసంబు మెసవి, గాండ్రు పెట్టెడు పెద్ద గండు మెకాలు." ద్విప. సారం. 2. 80. పు.

గాజు గడపినట్లు దినము గడుపు

  • మిక్కిలి జాగ్రత్తగా దినము గడుపు.
  • గాజువస్తువులను జాగ్రత్తగా పట్టుకొనక పోతే కిందపడి పగిలిపోతాయికదా ! దానిపై వచ్చిన పలుకుబడి.
  • "పరనారీజనుల కమ్మి యాతఁడు, గాజు గడపినట్లు దినము గడపుచు నుండెన్." శుక. 3. 243.

గాజుపడు

  • ఛిన్నా భిన్న మగు.
  • "ఆజగదేకవీరుఁ డగునర్జునుఁడు... పదు నార్వుర నొక్క పెట్టునం, గాజు పడంగఁ గూల్చె." చిత్రభా. 3. 121.

గాజుపాఱు

  • 1. రంగు మాఱు.
  • "కందపు గాజుపాఱవు వికారము నొందవు... జంతుదేహముల్." కాశీ. 3. 105.
  • "నెఱయ నర్మిలి నెనయు నీ నె మ్మొగంబు, ఘనభుజంగవిషవ్యాప్తి గాజువాఱి." మార్క. 1. 254. హరిశ్చ. 4. 39.
  • 2. ఎఱ్ఱబడు.
  • "పదతలంబులు గాజువాఱవు నిప్పుఁ జెద లంటు నే." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1831.
  • చూ. గాజువాఱు. గాజుపూసకు బంగారు పొదుగు
  • అయోగ్యుని గౌరవించు. అది తగ దనుట. బాలనీతి. 57.

గాజుబన్నరులు

  • గాజుబొమ్మలు.
  • "తరుణులు చిల్క బొమ్మలును దంతపు బొమ్మలు మేలిగాజు బ,న్నరులును మ్రానిచొప్పికలు నల్గడ నోలిన పేర్చి." కుమా. 3. 36.

గాజులను తొడవుగా కల్పించు

  • పౌరుషహీనులను చేసి ఇంట కూర్చుండ బెట్టు; గాజులు తొడుగు.
  • "కలరా యింతకు మున్ను యాదవులచేఁ గప్పంబు దెప్పింపఁగాఁ, గల రారాజులు గాజులం దొడవుగాఁ గల్పించి రా కాకులం, గలకంఠంబులఁ జేసెనా?" ఉ. హరి. 4. 157.

గాజుల పేర్లు రోకలి దాకినట్లు

  • శక్తిహీనులు శక్తిమంతుని ఎదుర్కొనుటలో సామ్యం; తగరు కొండను తాకినట్లు వంటిమాట.
  • "గాజుల పేర్లు రోఁకలి దాఁకుగతి దోఁప, ముంజేత నంగముల్ మోఁది మోఁది." భాస్క. యుద్ధ. 675.

గాజులలంక దున్న

  • సోమరి; స్వేచ్ఛాచారి.

గాజులవాని మర్యాద

  • తనకు తానే చేసుకొను మర్యాద.
  • గాజులవాడు ఎక్కడికి వెళ్ళినా కంబళి కూడా తీసుకొని వెడతాడు. అది వేసుకొని కానీ తాను కూర్చోడు.
  • "ఇదేమిటోయ్ బావా! నిన్ను నీవే పొగుడుకుంటున్నావ్ - గాజులవాని మర్యాదగా ఉందే." వా.

గాజులు తొడుగు/

  • పౌరుషహీనుని చేయు. మగవాని విషయంలో ఉపయోగించే మాట.
  • "వాళ్లందరూ కలిసి వీణ్ణి గాజులు తొడిగి కూర్చో బెట్టారు." వా.

గాజులు తొడుగుకొని కూర్చుండు

  • ఏమీ చేత కాక మూల కూర్చుండు. పౌరుషహీనముగా ఉండు.
  • మగవానివిషయంలోనే దీన్ని ఉపయోగిస్తారు.
  • "వాళ్లంతా నానా హంగామా చేస్తుంటే నువ్వు గాజులు తొడుగుకొని కూర్చుంటే లాభ మే ముంది?"
  • "ఇక్కడ ఎవరూ గాజులు తొడుగుకొని కూర్చో లేదు." వా.

గాడి కట్టు

  • పాదుకొను.
  • "కాంతకు నీకు వలపు గాడి గట్టేని." తాళ్ల. సం. 3. 139.

గాడిదకు గంత గట్టినట్లు

  • అనర్హునికి అప్పగించిన పని యెడల ఉపయోగించే సామ్యం.
  • గాడిద గుఱ్ఱమువలె సవారికి పనికి రాదు గదా!
  • "వీడికి ఆ స్కూలుపని అప్పగించడం గాడిదకు గంత గట్టినట్లే." వా.
  • ఇక్కడ గంత = జీను.

గాడిదగత్తర

  • 1. గందరగోళము.
  • "గాడిదగత్తర వ్రాఁతలు." గుంటూ. పూ. పు. 43.
  • 2. అల్లరి.
  • "....ఇంత మాదిగమంచ మగునప్పుడు శ్లోకము కీర్తనము గాఁగ నెంత గాడిద గత్తర యగునో శ్లోకములోని శబ్దములకు..." సాక్షి. 285 పు. 20.

గాడిదగుడ్డు

  • వట్టిది.
  • "...కోటలో నే మున్నదిరా గాడిదగుడ్డు. నోటిలో నుండవలయునురా..." సాక్షి. 176. పు.

గాడిదచాకిరి

  • ఎక్కువ చాకిరి.
  • "వాడు వాళ్లింట్లో గాడిద చాకిరీ చేయ లేక ఛస్తున్నాడు." వా.

గాడిదచావు చచ్చు

  • దిక్కులేనంత చాకిరీ చేసి దిక్కుమాలిన చావు చచ్చు.
  • "వాళ్లింట్లో పనంతా నెత్తిన వేసుకొని చేశాడు. కడకు ఒక మంచి మాట లేకుండా గాడిదచావు చచ్చాడు." వా.
  • చూ. కుక్క చావు చచ్చు.

గాడిదపిల్ల కోమలికం

  • త్వరలోనే మాసిపోవు కోమలత్వం.
  • "ఆ యింటి పిల్లల దంతా గాడిదపిల్ల కోమలికం. ఈడు వచ్చేసరికి దమ్మిడీకి పనికి రాకుండా తయా రవుతారు." వా.
  • రూ. గాడిదపిల్ల కోమలం.

గాడిపొయ్యి

  • ఎక్కువ పాత్రలలో వంట చేయుటకు వీలుగా నేలపై ఒక గాడిని త్రవ్వి యేర్పరచిన పొయ్యి.
  • పెండ్లిండ్లు వగైరాలలో నేటికీ గాడిపొవ్వులు త్రవ్వడం అలవా టున్నది.
  • "ఇంతమందికీ భోజనా లమరా లంటే యింకో గాడిపొయ్యి తవ్వాలిసిందే." వా.

గాతు గావించు

  • ప్రేల్చు.
  • "...పిరంగు, లొక్క మొగి గాతు గావింప నుక్కు మెఱసి, గుండ్ల గుంపులు బడివాన గురిసినట్లు." రంగా. 3. 66.

గాదములోని కాయవలె

  • మాటుపడి, నిక్షేపంలా.
  • "గాదమున మాటు పడియున్న కాయ వోలె." విక్ర. 4. 60.

గాదములోని దోసకాయవలె

  • మాటుపడి, నిరుపద్రవంగా.
  • "అలఘుబలాఢ్యుఁ డయ్యును దయాళువు గావున శాంతచిత్తుఁ డై, నిలిచిన
  • తండ్రి కాలమున నెమ్మది గాదములోని దోసకా,యలువలె నున్న రాజులు..." వరా. 3. 24.

గాదియ కొలుచు

  • ఇంటిగాదెలో నున్న ధాన్యం వలె అందుబాటులో నుండునది.
  • "గాదియ కొలుచౌనొ నీ దొరతనము." పండితా. ప్రథ. పురా. పుట. 360.

గాదెల కొలుచు

  • అందు బాటులో నున్న అపూర్వభాగ్యం.
  • కొంగుబంగారం వంటిమాట.
  • "అమృతమథను మహి మదె మాగాదెల కొలుచు." తాళ్ల. సం. 10. 51.
  • చూ. గాదియ కొలుచు.

గాదెల బోయు

  • కూడబెట్టు.
  • "తిన్నని కర్మములు గాదెలఁ బోసే రయ్యా." తాళ్ల. సం. 7. 32.

గానరస మాను

  • పాట విని ఆనందించు.
  • "రసికులు మీగానరస మాన వచ్చిరి, పాడరే శివభక్తి పాడుగాను." కా. మా. 4. 35.

గానుగ ఎద్దు

  • ఇతర ప్రపంచం తెలియకుండా అందులోనే పడి కొట్టుకొనువాడు.
  • "వాడు గానుగెద్దులా ఆ సంసారంలో పడి తన్నుకుంటున్నాడు." వా.
  • గానుగెద్దు గానుగు చుట్టూనే ఎప్పుడూ చుట్టి చుట్టి తిరగడంపై వచ్చిన పలుకుబడి.

గానుగమొద్దు

  • ఎద్దు మొద్దు స్వరూపం అనుట వంటిది. శరభాంక. 45.

గానుగాడు

  • నూనె తీయు.
  • "నువ్వులు రేపు గానుగాడించాలి." వా.

గానువున బెట్టి యార్చు

  • శిక్షించు. గానుగలో పెట్టి తిప్పి నులిమి వేయు.
  • "అతని వంశం బెల్లన్, గానువునఁ బెట్టి యార్చిన నేనియుఁ జాలదు." కుమా. 2. 96.

గాభరా పడిపోవు

  • భయభ్రాంతి యేర్పడు.
  • "జేబు తడివి చూచుకొంటే పర్సు కనిపించకపోయే సరికి గాభరా పడి పోయాను." వా.

గామిడికత్తె

  • దుష్టురాలు.

గామిడికాడు

  • దుష్టుడు.

గాముల మోచిన గంప

  • ప్రమాదకరము. తాళ్ల. సం. 4. 122.

గాములువారు

  • చీకటిపడు, కాలహరణ మగు.
  • "గాములు వారెడి పొద్దు కావలి కాండ్లాల (ర)" తాళ్ల. సం. 10. 166.

గారడీసంసారము

  • ఏమీ లేకున్నా, ఉన్నట్లు ఆడంబరంగా కనిపించే సంసారము. రామరామ శత. 12.

గార ద్రావిన మీనువలె

  • ఆలీ జాలితో.
  • ఆవాలు నూరి త్రాగినట్లు అనుట వంటిది.
  • "గార ద్రావిన మీను సంగతి మనోజ, వేదన నతండు పొరల..." వైజ. 2. 140.

గారము చేయు

  • బుజ్జగించు; సరస మాడు.
  • "సకియ నీ యింటికి సారంగధరుఁడు, ఒక పావురము వెంట నుఱికి రాలేదె, రాఁగానె నీవు గారము చేయ లేదె." ద్విప. సారం. 3. 104. పు.

గాలము వేయు

  • ఎత్తు వేయు; ఎక్కు పెట్టు.
  • "వా డప్పుడే ఆ ఆస్తికి గాలం వేస్తున్నాడు. పిన్నమ్మను విడిచి ఒక క్షణం ఉండడం లేదు." వా.

గాలికబుర్లు

  • వట్టి మాటలు.
  • "ఆఁ, ఈ గాలికబుర్ల కేం లే. అసలు సంగతి ఎవరికీ తెలియదు." వా.

గాలికి

  • 1. వట్టినే, అనవసరంగా.
  • "గాలికి వాడి మాట విని వెయ్యి రూపాయలు పోగొట్టుకొన్నాను." వా.
  • 2. స్వేచ్ఛగా; అప్రయత్నంగా.
  • "వాడు గాలికి తిరుగుతున్నాడు." వా.
  • "వాడి కేదో గాలికి ఆ ఆస్తి వచ్చి పడింది." వా.

గాలికి పుట్టు

  • నిందార్థంలో ఎవడికి పుట్టెనో తెలియదు అనుపట్ల ఉపయోగిస్తారు.
  • "వా డేదో గాలికి పుట్టి గాలికి పెరిగాడు. వాడికి నీతులూ నియమాలూ ఎట్లా వస్తాయి?" వా.

గాలికి పెరుగు

  • ఇతరుల పోషణ లేకయే పెరుగు.
  • "వాడికి పాపం ఎవరున్నారు? గాలికి పెరిగాడు." వా.

గాలికి ఫొయిన పేలపిండి కృష్ణార్పణం

  • ఎలాగూ తనకు రాని దని తెలిసి, తన కిష్టం లేక వదిలి వేసినట్లుగా నటించినప్పుడు ఉపయోగించే పలుకుబడి.
  • "ఆ ఉద్యోగం కోసం వాడు నానా యాతనా పడ్డాడా? అది రాకపోయే సరికి ఇప్పుడు అందులో ఏ మంచి అవకాశమూ లే దంటూ మొదలెట్టాడు. పైగా తన వాడికే దొరికిం దని సంతోషంగా ఉం దంటాడు. గాలికి పోయే పిండి కృష్ణార్పణం." వా.

గాలికి పోయే ఒగుడాకు వలె

  • మరీ పల్చగా ఉన్నా రనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "గాలిఁ బోయెడి యొగుడాకు గతి." కుచేలో. 2. 7.
  • "ఆ పిల్లేమమ్మా అలా గాలికి పోయే ఒగుడాకులా ఉంది?" వా.
  • ఒగుడాకు అంటే జొన్న సజ్జ వగైరా దంట్లపై నున్న ఆకు.

గాలికుంటు

  • పశువులకు గెట్టెలు పుండు పడే వ్యాధి.

గాలికొమ్ము

  • వాద్యవిశేషం.

గాలి కైనా చొరగూడని చోటు

  • దుష్కరప్రవేశ మైనస్థలము.
  • "తిరిగితిమి గాలి కైనం, జొరఁగూడని చోటు లెల్ల నూర్యమరీచుల్..." ఉ. హరి. 5. 313.
  • చూ. పోతుటీగకు చొరరాని.

గాలిగంగమ్మవలె తిరుగు

  • స్వేచ్ఛగా నిష్ప్రయోజనంగా తిరుగు.
  • "వాడికి పొద్దున్నుంచీ గాలిగంగమ్మ లాగా తిరగడంతోనే సరిపోతుంది." వా.
  • "వాడు పెళ్లీ పెటాకులూ లేక గాలిగంగమ్మలా తిరుగుతున్నాడు. వా.

గాలిగంగలు

  • గాలిగంగమ్మలు, క్షుద్రదేవతలు.
  • గాలిగంగమ్మ ఒక దేవత.
  • "జాతర సాటించె... గాలిగంగల కెల్లన్." పాండు. 3. 73.

గాలిగంటి (టు+ఇ) డగల

  • గాలిని మూట గట్టగల - అసాధ్య కార్యములను చేయగల - ఏమైనా చేయగల జాణ అను నిరసనార్థంలో. కుమా. 8. 135.

గాలిగుడి

  • సూర్య చంద్రుల చుట్టూ ఏర్పడే పరివేషం.

గాలిగొను

  • ఎండిపోవు.
  • "తిత్తొలిచి గాలి గొన వైచిన కుక్క కలిమంబు గనుంగొని." భార. శాం. 3. 285.

గాలిగోపురము

  • చాలా ఎత్తై దేవాలయముల ముందుండే గోపురం.

గాలిగ్రుడ్డు

  • చెడిన గ్రుడ్డు. తె. జా.

గాలిచీర

  • తెఱచాప.

గాలి తిరుగు.

  • మునుపటి స్థితి మారిపోవు.
  • "మూడు నెలలుగా నానా అవస్థా పడిపోయాను. ఈ రోజే ఒక మంచి వార్త విన్నాను. గాలి తిరిగింది కదా అని కొంచెం ఉత్సాహంగా ఉంది."
  • "వా డేదో యీ మధ్య కాస్త ప్రసన్నంగా కనిపిస్తున్నాడు. గాలి తిరక్క ముందే మన పని చేసుకోవడం మంచిది." వా. గాలిదుమారము రేగు
  • వాదప్రతివాదాలు చెలరేగు.
  • "ఆ రోజుల్లో వ్యావహారికభాష పనికి రా దని పెద్ద గాలిదుమారం రేగింది." వా.

గాలిపంట

  • గట్టిగా వస్తుందో రాదో చెప్పలేనిపంట. శ. ర.

గాలిపటము

  • చూ. గాలిపడగ.

గాలిపడగ

  • గాలిపటము, ధ్వజము.
  • "పటుగతిఁ జను గాలిపడగలతోడన, కడువేగమున పెందగడియ లెగసె." కుమా. 11. 51.

గాలిపాట

  • శాస్త్రీయంగా నేర్చుకొనక విని అనుకరించే సంగీతం. శ్రుతపాండిత్యం వంటిది.
  • "వాడి దేదో గాలిపాట తప్పితే నేర్చుకొన్న సంగీతం కాదు." వా.

గాలిపిశాచము

  • దయ్యము.

గాలి పోయు

  • పశువులకు పారుడురోగము వచ్చు.
  • "ఊళ్లో పశువు లన్నిటికీ గాలి పోస్తూ ఉంది. మన గిత్తలను అక్కగారి ఊరికి తోలిస్తేనే మంచిది." వా.

గాలిబిళ్లలు

  • గవుదలు వాచు వ్యాధి.

గాలిబుచ్చు

  • వ్యర్థం చేయు.
  • "ఏకాంత మిక్కానలో, గాలిం బుచ్చెడు పౌరుషం బిది." దశ. 6. 6.

గాలి బోవు

  • వ్యర్థ మగు, తొలగు.
  • "కలిగినముద మెల్ల గాలిఁబోయిని కలశితి విదె." తాళ్ల. సం. 3. 34
  • "ఎలమి గరుడధ్వజుపై నెక్కు నా విషములు, కరగి నీరై పారి గాలిఁ బోవుఁ గాక." తాళ్ల. సం. 8. 1.

గాలిమందలు

  • స్వేచ్ఛగా తిరిగి మేయు పశువుల మందలు. కాశీయా. 358. పు.

గాలిమాట

  • వట్టిమాట, జనశ్రుతి.
  • "మలయమారుత మైన మెలఁత దెచ్చు నటన్నఁ, గానరా దదియును గాలి మాట." తపతీ. 2. 79.

గాలి ముడి గట్టు

  • గాలి మూట గట్టు.
  • "గాలి ముడి గట్టినట్టు కాయము మోచితిమి." తాళ్ల. సం. 9. 267.

గాలిమూట చిక్కు

  • శరీరధారి యగు. శరీరాన్ని గాలిమూట అని వేదాంతు లంటారు.
  • "గాలిమూటఁ జిక్కితిమి కన్నచోటే తొక్కితిమి." తాళ్ల. సం. 9. 243.

గాలిమెకము

  • లేడి. గాలిమేడలు కట్టుకొను
  • మంచిని ఊహించుకొని సంతోషించు.
  • "వాస్తవదృష్టితో చూడాలి గాని వట్టి గాలిమేడలు కట్టుకొని సంతోషిస్తే లాభ మే ముంది?" వా.

గాలిమేతకు పోవు

  • వాహ్యాళి వెడలు

గాలి మేసి రావడానికి

  • షికారుకు. ఇటీవల ఉరుదూద్వారా వచ్చిన పలుకుబడి.
  • "అలా గాలి మేసి రావడానికి పోయి వద్దాం. రారాదా?" వా.

గాలిలో దీపము పెట్టి దేవుడా నీమహిమ అను

  • దుష్ఫలితము తప్ప దని తెలిసి కూడా ఆ పని చేసి దేవును మీద వేయు. అది నిష్ప్రయోజన మనుట.
  • "గాలిలో, దీపము వెట్టి నీ మహిమ దేవుఁడ! యం చన." మానిని. 6.

గాలిలో పెట్టిన దీపము

  • ప్రమాదపరిస్థితిలో ఉన్నది. గాలిలో పెట్టినదీపం ఆరిపోక తప్ప దనుటపై యేర్పడిన పలుకుబడి.
  • "వాడి బతుకు గాలిలో పెట్టిన దీపం లాగా ఉంది." వా.

గాలివార్త

  • కింవదంతి.
  • "ఈ కలెక్టరు మారిపోతా డని యేదో గాలివార్తగా తెలిసింది." వా.

గాలిసవారీ పోవు

  • అనవసరంగా తిరుగు.
  • "ఆ. వాడి కేం పని? గాలి సవారీ పోవడం తప్పిస్తే." వా.

గాలి సోకు

  • దయ్యము పట్టు. భూత ప్రేత పిశాచాదులు శరీరము లేనివిగా భావించి వానిని గాలి అనుట అలవాటయినది.
  • "...దాని పిఱుందం, జని వీరుఁ డతని యాకృతిఁ, గని త్రోవం గాలి సోఁకెఁ గావలె ననుచున్." శుక. 2. 540.
  • "ఆవిడ కేదో గాలి సోకినట్లుగా ఉంది. ఎన్ని మందు లిచ్చినా రోగం కుదర లేదు." వా.

గావుకేక పెట్టు.

  • పొలికేక పెట్టు.
  • "గావుకేక పెట్టి ఆవిడ కింద పడిపోయింది." వా.

గావుగొను

  • బలిగొను. వీథి. 41.

గావు పట్టు

  • 1. చంపు.
  • "హోమకుండములు నిర్ధూమధామంబులు, గావించి పశువుల గావు వట్టి." వరా. 5. 115.
  • 2. నాశము చేయు.
  • "పొదవెడు పురుషార్థముల గావు పట్టి,
  • మదము మాత్సర్యంబు మట్టి మల్లాడి." విష్ణు. పూ. 3.

గావు వెట్టు

  • బలి యిచ్చు.
  • "గొప్ప చింబోతు కదుపులఁ గూర్చి నీకు, గావు వెట్టింతుఁ జుమ్మ యోగంగ నమ్మ !" నీలా. 1. 113.

గాసట బీసట

  • సంస్కారము పొందనిది.
  • "గాసట బీసటే చదివి గాథలు ద్రవ్వు తెనుంగువారికిన్." నృసింహ. 1. 9.

గాసర కూస రగు

  • గాసట బీసట యగు.
  • "గాసర కూస రయ్యె నని గాని వచింపరు మేలిమాట." గీర. 28.

గాసి చేయు

  • బాధ పెట్టు.
  • "నఖంబుల గీఱుచు గాసి సేయుచు." భాగ. స్క. 5. 106.
  • రూ. గాసి సేయు.

గాసిపఱచు

  • కష్టపెట్టు.

గాసిపఱుచు

  • చూ. గాసిపఱచు.

గాసి బెట్టు

  • కష్టపెట్టు.
  • "దేశాధిపోదగ్రులన్, గాసిం బెట్టి విశాపుఁ జేసె నృగునిం గంసారి సామాన్యుఁడే." ఉ. హరి. 2. 65.

గాసివెట్టు

  • కష్టపెట్టు.
  • "గాఢ యౌవనమున గాసి వెట్టుటె కాక." నిరంకు. 2. 33.

గాళు చేయు

  • పాడు చేయు.
  • "ఆట తిప్పలు వుచ్చి పాట బండులు గూల్చి, కట్టువ లన్నియు గాళు చేసి." అచ్చ. రా. సుం. 95.

గింజ గిట్ర

  • ధాన్యము. జం.
  • "కొంచము గొంచు రం డతనిఁ గొల్పి భుజించెను గింజగిట్రలున్." (పద్య) బసవ. పు. 2. 21.

గింజుకొను

  • తన్నుకొను.
  • తదనుగత అర్థచ్ఛాయలలోనూ కానవస్తుంది.

గిజ గిజ కుడుచు

  • కలవరపడు.
  • "కదిలించి యెత్తఁగాఁ గడు నశక్తుఁడయి, గిజ గిజ కుడిచె నక్కేక యుండు."

గిజగిజ తన్నుకొను

  • విలవిల లాడు.
  • "గిజగిజం దన్నుకొనుచు ధరణిం బడి పొరలువారును." రాధా. 5. 88.

గిజగిజ పడు

  • కలవరపడు.

గిజగిజ లాడు

  • తన్నుకొను.
  • "వాడు వానిచేతిలో దొరికి గిజగిజ లాడుతున్నాడు." వా.

గిజిగిజి యగు

  • గిజగిజ లాడు, తన్ను కొను.
  • "క్రిందటి కూర్మము గిజిగిజి గాఁగ." బస. 3. 68.
  • చూ. గిజగిజ లాడు.

గిజిబిజిగా

  • నమలుటలో ధ్వన్యనుకరణము.
  • "గిజిబిజిఁ బిప్పిగా నమలు గిత్త..." కకు. 5. 72.

గిటకకాయ

  • పొట్టివాడు.

గిటగిటన

  • పొట్టిది.
  • "హేమకూటంబు గిటగిటన." కాశీ. 1. 100.
  • 'గిటక కాయ' అన్న రూపం పొట్టివాడు అన్న అర్థంలో వాడుకలో ఉంది.

గిటగిట నగు

  • దుర్బలముగా నుండు.
  • "గిటగిట నైన యీ కీరవాణికిని." గౌ. హరి. ద్వితీ. పం. 917.

గిటగిట మను

  • కదలు; చలించు.
  • "చనుఁగవవ్రేఁగున గిట గిట మను నెన్నడుము." ప్రభా. 2. 83.

గిట్ట కఱచు

  • పళ్లు తీయ వీలు లేక కఱచుకొని పోవు.

గిట్టిపట్టు

  • గట్టిగా పట్టుకొను. కుమా. 1. 102.

గిట్టుబా టగు

  • లాభము వచ్చు.
  • "ఈమాత్రం అమ్మితే పది రూపాయలు గిట్టుబా టవుతుంది." వా.

గిడసబారు

  • పొట్టిగానే ఉండిపోవు.
  • "వీ డేమిటిలా గిడసబారిపోతున్నాడు." వా.
  • "పొట్లకాయ లన్నీ గిడసబారినవి." వా.

గిన్నెబొట్టు

  • మంగళసూత్రము. తాళిబొట్లు రెండు రకాలు. ఒకటి మగడు కట్టేది. అది గుండ్రముగా కానివలె ఉండి, మధ్యలో చిన్న ఉబ్బు ఉంటుంది. గిన్నె బొట్టు గిన్నెవలె గుండ్రంగా ఉంటుంది. ఇదే చిట్టిబొట్టు కావచ్చు. ఇది పుట్టినింటివాళ్లు ఇస్తారు.

గిరవుంచు

  • కుదువ ఉంచు. పూటగా నుంచు.
  • "భవనాహృత శేషిత రత్నరక్షక, భగతరుసంతతిం బ్రథమభార్యఁ బురిన్ గిరవుంచె వార్ధి నాన్." ఆము. 1. 54.

గిరవు వెట్టు

  • 1. కుదువ బెట్టు.
  • "గిరికుచము లివిగో కృష్ణరాయ, గిరవు వెట్టకుం డాన కృష్ణరాయ." తాళ్ల. సం. 3. 174.
  • "కనుదోయి మెఱుఁగులు కంతుతూపుల కడ,గిరవుగాఁ బెట్టితే హరిణనయన." విక్ర. 7.62.
  • 2. కానుక యిచ్చు. వరాహ. 2. 113.

గిరికీలు కొట్టు

  • పల్టీలు కొట్టు.

గిరికొను

  • వ్యాప్త మగు.
  • "తఱచుగఁ గూలినకరులున్, గిఱికొనియెన్ సమరమేదినీతల మెల్లన్." భార. భీష్మ. 2. 136.

గిరుక్కున (మరలు)

  • ధ్వన్యనుకరణము.
  • "హేమావతి వినోదకేళిగతి గిరుక్కున మరలి వచ్చి యాకథ వినియెద..." హంస. 1. 200.
  • చూ. గిరుక్కున మళ్లు.

గిరుక్కున మళ్లు

  • గిర్రున వెనుతిరుగు.
  • "అటు గిరుక్కున మళ్లి..." రాధి. 1. 124.

గిరుల తాతలు

  • కొండలకంటె పెద్దవి.
  • "తత్పరిసరవర్తు లై గిరులతాత లనం గపియూధనాథులు..." భాస్క. యుద్ధ. 319.

గిఱికొను

  • 1. క్రమ్ముకొను.
  • "గిఱికొన్న మనోజవికారవేదనన్." జైమి. 4. 119.
  • 2. నిలుచు. కాశీ. 5. 284.
  • ఇందుకు దగ్గఱగా ఉన్న భావచ్ఛాయలలో ఇది ఉపయుక్త మవుతుంది.

గిఱికొలుపు

  • పాదుకొనునట్లు చేయు.
  • "మఱియును శరశతకము మెయి, గిఱికొలిపిన వృష్ణి వరుఁడు గినియఁగ లేక..." భార. ద్రోణ. 3. 271.

గిఱిగొను

  • కుదురుకొను.
  • "అఱిగ్రమ్మి మఱియు నిట్లనిరి నరేంద్ర, గిఱిగొన్న ప్రేమ భోగినులఁ గామంబుఁ." గౌ. హరి. ప్రథ. పంక్తి. 966.

గిఱిపిల్లాడి

  • పిల్లెండ్లు. శ. ర.
  • ఆడవాళ్లు కాలిలో చిటికెన వ్రేలి ప్రక్క వేలికి వేసుకొనే మెట్టెలవంటి వానిని పిల్లెండ్లు పిల్లాండ్లు అని నే డంటారు.

గిఱ్ఱున

  • తిరుగుటలో ధ్వన్యనుకరణము.

గిఱ్ఱుపురుగు

  • చెట్లలో గిఱ్ఱు మని అరుస్తూ ఉండే పురుగు. శ. ర.

గిలకకు నీరెక్కు

  • చూ. కొండెకు నీ రెక్కు. గిలకొట్టు
  • 1. చేతితో చిలుకు. జిలకొట్టు - గిలకరించు అని కూడా వాడుక. పెరుగు విషయంలో నేడు బాగా ఉపయోగిస్తారు.
  • "కెరలించి యమృతంబు గిలకొట్టఁగా రాదె, ముద్దు చూపెడి వీరిమోవులందు." పాండు. 1. 117.
  • 2. ముద్దుగా పుణుకు.
  • "గిలకొట్టి యట్టె చక్కిలిగిలి యని పెట్టి..." చంద్రా. 2. 5.
  • 3. గిలగిల మనిపించు.
  • "గళదనర్గళగళ దళదుద్ధత ధ్వను, ల్గిల కొట్టి మండూకములు చెలంగ." శుక. 1. 276.

గిలగిల లాడు

  • బాధపడు, తన్నుకొను.
  • "అతను కడుపునొప్పితో గిలగిల లాడు తున్నాడు." వా.
  • రూ. గిలగిల లాడిపోవు.

గిలవకాయ

  • ఒకానొక ధమని.

గిలిగింతలు

  • చక్కిలిగిలి. పాండు. 2. 38.

గిలిగింతలు పెట్టు

  • చక్కిలిగింత పెట్టు.
  • ఒకరిని నవ్వించుటకై చక్కిలి గిలి పెడతారు.
  • "కేరఁగ రాదు నవ్వి గిలిగింతలు వెట్టఁగ రాదు చెక్కులం, జీరఁగ రాదు." హంస. 1. 94.

గిలిగింత వోవు

  • చక్కిలిగిలి పెట్టిన ట్లగు.
  • "ఎదుట జలకేళి గావింపఁ దదఖిలాంగ, ములు నిరీక్షించి గిలిగింత వోవు మనసు, నిలుపలేని కతంబున నిర్గమించెఁ జరమ ధాతువు శైలనిర్ఘరమువోలె." వరా. 11. 81.
  • రూ. గిలిగిలి వోవు.

గిలిగిలింతలు పుచ్చు

  • చక్కిలిగిలి పెట్టు. హరి. పూ. 5. 190.

గిలిగిళ్లు

  • చక్కిలిగింతలు.

గిలుక్కు మను

  • ధ్వన్యనుకరణము.

గిలుపాడు

  • 1. కొద్దికొద్దిగా అపహరించు. బంగారము లాంటివానిని కొద్దికొద్దిగా గీచి రాచి తీసుకొనుటపై వచ్చినపలుకుబడి.
  • "గిలుబాడు తల్లిపైఁ గలపసిండి." పాండు. 3. 16.
  • 2. వంచించు.
  • "తన ప్రాణనాథుఁ దోడ్తేర, వనజాక్షి యొక్కతె మనసుఁ బంపుడును... తను గిలుపాడెఁ గదా మనం బనుచు..." పండితా. ప్రథ. దీక్షా. పుట. 226.

గిలుబుకొను

  • దొంగిలించు. మను. 3. 84. గిలుబు చేయు
  • "తలిదండ్రులకు సమ్మతంబుగా నతిథి స,త్క్రియ యటంచు నొకింత గిలుబు సేయ." నిరం. 2. 26.
  • చూ. గిలుబాడు.

గిల్కు మను

  • ధ్వన్యనుకరణము.

గిల్గింత

  • గిలిగింత.

గిల్బాడు

  • చూ. గిలుబాడు.

గిల్లకన్ను

  • మెల్ల కన్ను. కాశీ. 2. 80.

గిల్లచూపు

  • మెల్ల చూపు.

గిల్లికజ్జా పెట్టుకొను

  • ఊరికే ఉన్న వానిని కలహానికి లాగు.
  • గిల్లి పెట్టి కయ్యమునకు లాగుట అన్న వాచ్యార్థముపై వచ్చిన పలుకుబడి. స్వల్ప విషయాలపై తగాదా రేపుట కూడా యిందులో సూచితము.
  • "వాడికి గిల్లికజ్జా పెట్టుకోవడ మంటే మహా సరదా." వా.

గిల్లిన పాలు కారు

  • 1. మిక్కిలి సుకుమార మయిన. శ్రవ. 3. 61.
  • 2. శైశవావస్థలో నున్న.
  • "గిల్లినను బాలు గారెడుపల్ల వోష్ఠి." లక్ష. 3. 80.

గీజుపోరు

  • ఒకే వేధింపు వేధించు, పోరు.
  • "కీలుగం టిది యేల పోలఁగా నునుఁ గొప్పు, గీల్కొల్పుకొ మ్మంచు గీజుపోరు." శుక. 2. 456.
  • "శిశువులు...చిఱుతిండి గని యిది తె మ్మటంచు, గీజుపోరుట కెద పెల్ల గిల్లఁ బొగిలి, పొలఁతి యూరార్ప నతఁడు కాఁపురము సేయు." శుక. 3. 224.
  • చూ. గీదుపోరు.

గీటడగించు

  • చంపు.
  • "బావిలోఁ, గెడపితి వట్టి ని న్నపుడు గీటడఁగింపక పోవ నిత్తు నే." జైమి. 3. 109.
  • రూ. గీటణగించు.

గీటడచు

  • రూపుమాపు.
  • "సోదరయుతు దశాస్యుని గీటడంచి." రంగ. రా. బాల. పు. 19. పంక్తి. 11.
  • రూ. గీటణచు.

గీటున బుచ్చు

  • 1. కొట్టివేయు. ఏదైనా వ్రాసినప్పుడు వ్రాసినదానిలో దేని నైనా తొలగించి వేయ దలచుకొంటే దానిమీద గీత పెట్టడం అలవాటు. దానిపై వచ్చిన పలుకుబడి. గీత, గీటు ఒకటే.
  • "....అని తలంచుచుఁ గీచకుని మాటలు గీటునం బుచ్చి యొండుపలుకులు జరపిన." భార. విరా. 2. 42.
  • 2. వ్యర్థపఱచు; తిరస్కరించు.
  • "వీఁడు సంయమి వనుమాట గీటునం బుచ్చి తన వలసినయట్లు చేయువాఁ డయ్యె." భార. సౌ. 2.
  • "విని విననివాని చందం,బున గీటునఁ బుచ్చి." జైమి. 8. 39.

గీట్లబ్రద్ద

  • రూళ్ళ కర్ర.

గీతకట్టె

  • వడ్రంగులు గీతలు గీసేందుకు ఉపయోగించే పనిముట్టు.

గీతకత్తి

  • కల్లు గీసే కత్తి.

గీత బయటపడు

  • అదృష్టము కలుగు. కొత్త. 319.

గీదు పోరు

  • ఒకే వేధింపు వేధించు. విప్ర. 3. 14.
  • చూ. గీజుపోరు.

గీపెట్టు

  • 1. శబ్దించు.
  • "అదుకు వడక గీపెట్టక, పదను దివిసి రాగిదేరి పలుకక యున్నన్." పాండు. 3. 182.
  • 2. అఱచు.
  • "వా డెంత గీపెట్టినా వీడు ఆ వస్తువును ససేమిరా యివ్వ నన్నాడు." వా.

గీర

  • గర్వము, పొగరు.
  • "వాడికి కాస్త గీర యెక్కువ." వా.

గీరనగింజలు

  • ఒకరక మైన పిల్లల ఆట. కళా. 6. 202.

గీర్వాణం

  • గర్వము, అతిశయం.
  • "దానికి మహా గీర్వాణం లే." వా.

గీఱుగాజులు

  • ఒక రకమైన గాజులు.

గీఱునామము

  • గోటితో గీటువలె పెట్టుకొనే బొట్టు.

గీఱుబొట్టు

  • గీఱునామము.
  • రూ. గీర్బొట్టు.

గీఱెత్తు

  • దిమ్మ తిరుగు.
  • "ఎండ తగిలి తల గీఱెత్తినది." వా. వావిళ్ళ.

గుంజా లేదు గూటము లేదు

  • ఏమీ లే దనుట.
  • రైతులద్వారా వచ్చిన పలుకుబడి. పశువులు కట్టివేయుటకు గుంజ, పత్తిగింజలు దంచుటకు గూటము కూడా లే దనుట.
  • "వాడింట్లో గుంజా లేదు గూటమూ లేదు." వా.

గుంజిలి పెట్టు

  • గుంజిళ్ళు పెట్టు; చెప్పిన పనులన్నీ చేయు.
  • వావిళ్ళ ని. లో దాచు అని అర్థమిచ్చి ఇచ్చిన ప్రయోగం ఇది.
  • "కావర మెత్తి యిట్టు తను గాఱియ పెట్టుచునున్న దాని ని,చ్ఛావతిఁ జూచి లేచి రభసంబున రెడ్డన పల్కె నోసి నీ, చేవ యెఱింగి కాదె మును చెప్పక గుంజిలి పెట్టి యున్కి నీ, వే వల దన్న వేఁడు కొనవే మఱి యే నయి చెప్పినాఁడనే." వెంక. పంచ. 4. 469.

గుంజిళ్ళు తీయు

  • గుంజిళ్ళు పెట్టు.

గుంజిళ్ళు పెట్టు

  • గుంజిళ్ళు తీయు.

గుంజుకొను

  • లాగుకొను - బలవంతంగా. రాయలసీమలో బాగా వాడుకలో ఉన్న మాట.

గుంజు గునుకు

  • హాస్యం చేయు. బ్రౌన్.

గుంటక గుజ్జులు

  • గుంటకు ఉన్న గుజ్జు లనే భాగాలు.

గుంటక పాయు

  • గుంటకతో పొలం దున్ను.

గుంటక్రోవ

  • ఒక రకమైన ఫిరంగి.
  • రూ. గుంటక్రోవి.

గుంట గూలు

  • కూలిపోవు.
  • "కొంత గుఱ్ఱ మెక్కితేనే గుంటఁ గూలిపోదురు." తాళ్ల. సం. 8. 186.

గుంట గూల్చు

  • నాశనము చేయు. ఈ పలుకుబడి నేటికీ రాయలసీమలో నున్నది. 'వాణ్ణి నమ్మితే వాడు నన్ను గుంట గూల్చాడు.' గుంటలో పడవేయు యౌగికార్థం.
  • "ఎవ్వండు వీర మహేశ్వరాహితుల, క్రొ వ్వడంగఁగ గుంట గూల్పంగ నోపు." పండితా. ద్వితీ. మహి. పుట. 208.

గుంటచాళ్ళు

  • ఒక రకమైన పిల్లల ఆట.

గుంటచిక్కులు

  • అనంతంగా మధ్యలో వచ్చే చిక్కులు.
  • "ధనసంపాదనమునందలి గుంటచిక్కు లెక్కువగఁ దెలిసినవాఁడు." నందక. 116. సాక్షి. 406.

గుంటచిక్కులు పెట్టు

  • నానారకా లయిన చిక్కులు పెట్టు.
  • "తీసుకున్న పది రూపాయలూ యివ్వడానికి వా డెన్నో గుంటచిక్కులు పెడుతున్నాడు." వా.

గుంటదూలము

  • 'గృహ విశేషములయందు కడయొత్తులమీద నుండి
  • గుజ్జుల నడిమికి జొప్పించెడి చిన్నదూలము. శ. ర.

గుంటనక్క

  • కపటి; కుయుక్తిశాలి. కుతంత్రాలు పన్నువాడు.
  • "వాడు గుంటనక్క. వాణ్ణి నమ్ముకొని మాత్రం ఈ వ్యవహారంలో దిగొద్దు." వా.

గుంట బెట్టి గంట వాయించు

  • మోసగించు; పాడు చేయు
  • "ఔరౌర! వారల నిసర్గాభినయ ప్రభావ మెట్టిదియొ కాని మార్గగుల నట్టె కాలు గట్టి నిలువఁబెట్టి పయనంబును నది గుంటఁ బెట్టి గంట వాయించు నట్టుల గనుకట్టు చేయఁగలరా." ధర్మజ. 49. 3. తె. జా.

గుంట బెట్టు

  • రూపు మాపు.
  • "తొంటి చాకచక్యం బెల్ల గుంటఁ బెట్టె." నందక. 17 పు.

గుంట యోనమాలు

  • తొలి అక్షరాలు.
  • నేలమీద కానీ, చెక్కమీద కానీ అక్షరక్రమాన్ని తొలిచి ఉంచేవారు. పిల్లలు తొలుత వానిలోనే వ్రేలు రుద్దుకొని నేర్చుకొనేవారు.
  • "తాను సర్వవిద్యా పారంగతుం డై యుండియు మనకు గుంట యోనమాలైన నేర్పినాఁడా." సాక్షి. 47 పు.

గుంటుకాడు

  • యుద్ధసైనికులలో ఒక విధమైన ఆయుధం ధరించేవాడు. కుమా. 11. 40.
  • చూ. కుంతంబువాడు.

గుండగొయ్య

  • దుర్మార్గుడు; మూర్ఖుడు. బ్రౌన్; శ. ర.

గుండాడు

  • నులిచి వేయు.
  • "దుండగంబునఁ బూల గుండాడ వికలిత,వృత్తిఁ గల్పకవాటి వీటిఁబోయె." వరాహ. 10. 15.

గుండాన పడిపోవు

  • గంగలో కలియు వంటి పలుకుబడి. కొత్త. 142.

గుండా పిండి యగు

  • ధ్వంస మగు. పిండిపిండి యగు అనుట.

గుండియ గూడు వట్టు

  • హృదయము చిక్కబట్టుకొను, నిబ్బరముతో ననుట.
  • "ఏవగ నుండినాఁడొ హృదయేశుఁడు గుండియ గూడు వట్టి తా, దేవుఁడు గానఁ గొంత కడతేఱె మనోభవుఢాక కన్యుఁడే..." బహులా. 4. 60.

గుండియ యదురు

  • భయపడు.
  • "ఆన విని గుండియ యదరన్, మనుజేశ్వరుఁ డాప్తు లైనమంత్రులతో ని,ట్లను." శుక. 1. 458. గుండియలు క్రుళ్ల దన్ను
  • బాగుగా తన్ను.
  • "గుండియలు గ్రుళ్ళఁ దన్నిన గ్రుక్కు మిక్కు, రనక యాతని కినుక చల్లాఱ నిచ్చి." శుక. 3. 627.
  • వాడుకలో - గుండెలు కుళ్లేట్లు తంతాను.

గుండుకొను

  • గుంపు కట్టు.
  • "గుండుకొని చూచుమానిసి, తండముఁ దొలఁగంగఁ ద్రోచి తత్కరివెస నా, చండాలుఁ దెచ్చి తత్కరి..." వాసి. 4. 103.

గుండుగల్లు దాచిన పెండ్లి చెడునె

  • వివాహ సందర్భంలోనే సన్నికల్లు త్రొక్కిస్తారు. ఒక వేళ ఆ గుండ్రాయి దాచి పెట్టినంతమాత్రంతో పెండ్లి ఆగుతుందా? ఆగ దనుట. ఇలాంటిదే "అయ్యవారు లేక పోతే అమావాస్య నిలుస్తుందా?"
  • "మును గుండుగల్లు డాఁచినఁ బెండ్లి సెడునె, చెనసి బిచ్చమ్ము మాన్చిన భక్తి సెడునె." పండితా. ప్రథ. పురా. పుట. 383.
  • చూ. గుండ్రా డాచిన...

గుండుగిలు

  • చాపచుట్టగా పడు.

గుండుగుత్త

  • సర్వహక్కులతో ఇచ్చేగుత్త. బ్రౌన్.

గుండు గూడు

  • గుంపుకట్టు; కలిసి ప్రయత్నించు.

గుండు గూలగ గొట్టు

  • పొడిపొడి చేయు. రుక్మాం. 3. 10.

గుండుజల్ల

  • పెద్ద జల్ల.

గుండులు నీరుగా

  • రాళ్లు కరిగేటట్లు.
  • "చాండాలికన్ మీటుచున్, గుండుల్ నీరుగ నెండ గాలి పసి తాకుం జూడ కాప్రాహ్ణమున్." ఆము. 6. 7.

గుండు వేయు

  • ఫిరంగో, తుపాకో పేల్చు.

గుండు వేస్తే అందకుండా వెళ్ళు

  • కనిపించకుండా పోవు.
  • "గుండు వేస్తే అందకుండా వెళ్ళావు - ఏ మయ్యావు రా ఇన్నాళ్లు." వా.

గుండుసున్న అగు

  • పని చెడిపోవు.

గుండుసూది

  • తలపై పూజగా ఉన్న సూది.

గుండె ఆగి పోయింది

  • అత్యాందోళనను తెలిపే పలుకుబడి.
  • "అతను వస్తాడు వస్తా డని ఆరునెల్ల నుంచీ కాచిపెట్టుకొని ఉన్నానా? రానని తంతి వచ్చేసరికి నా గుండె ఆగి పోయింది." వా. గుండెకు రోమాలు మొలిచిన వాడు.
  • ధైర్యశాలి, ధీరుడు.
  • "ఈ ఊళ్లో గుండెకు రోమాలు మొలిచినవాడు ఒక్కడు ఉన్నట్టు లేడు." వా.

గుండె గతుక్కు మను

  • భీతి కలుగు.
  • "అకస్మాత్తుగా ఆవిడ పోయిం దనే సరికి గుండె గతుక్కు మన్నది." వా.

గుండె గుబ్బు మను

  • గుండె జల్లు మను. ధ్వన్యనుకరణము.
  • "దానిన గుండె గుబ్బు మన దా నెరియన్ విడిచెన్." కళా. 4. 21.

గుండె గూడు దిగు

  • గుండెమీది బరువు తొలగిపోవు. దిగులు తీరు. అనగా నిర్భయస్థితి యేర్పడు.
  • "నదులకు గుండెగూడు దిగె నాగకులంబులు నిద్ర వోయె ని,ర్జరులును మిన్ను దన్నిరి..." కాశీ. 2. 61.

గుండె గూడు పట్టు

  • ఎంత బాధ లున్నా గుండె బిగ బట్టుకొను, బాధ కోర్చు కొను.
  • "....యేవగ నుండినాఁడొ హృదయేశుఁడు గుండియ గూడు వట్టి తా, దేవుఁడు, గానఁ గొంత కడతేఱె మనోభవుఢాకకు..." బహులా. 4. 60.
  • "...చూడ దాడ దొక సుద్దియు గుండియ గూడు పట్టి నాఁ, డెట్టు భరించినాఁడొ హృదయేశ్వరుఁ డవ్వ లరా హళహళిన్." పాంచా. 3.
  • రూ. గుండియ గూడు పట్టు.

గుండె గొంతుకలో కొట్లాడు

  • మాట పెగలనీయనంత భావోద్రేకము కలుగు.
  • "గుండె గొంతుకలోన కొట్లాడుతాది, కూకుండ నీదు రా కూసింతసేపు." ఎంకిపాటలు.

గుండె చిక్కబట్టుకొను

  • గుండెదిటవు కల్పించుకొను.
  • "పాపం ! ఆవిడ ఎన్ని అవస్థ లొచ్చినా గుండె చిక్కబట్టుకొని ఎలానో కొడుకును చదివిస్తూంది." వా.

గుండె చెక్క లగు

  • హృదయవిదారక మగు.
  • "ఆవిడ గుండె చెక్క లయ్యేటట్లుగా యేడ్చింది." వా.

గుండె చెదరు

  • "ఆ పిల్లను ఆ స్థితిలో చూచేసరికి గుండె చెదిరి పోయింది." వా.

ఉండె చెఱువు చేసికొను

  • భయపడు.
  • "ఆ గొల్ల కుఱ్ఱడు కాసంత కనులెఱ్ఱ చేసినంతన యింతగా బెండువడి గుండె చెఱువు చేసికొనవచ్చునా?" ధర్మజ. 76. పు. 16.

గుండె జల్లు మను

  • భయపడు. ధ్వన్యనుకరణము.
  • "వసుధ వసియింపు మని బసుమంబు సల్ల గుండె జల్లు మని కల్లువడి..." మను. 5. 19.
  • "తొలుదొల్త వానిఁ గన్నులఁ గాంచి నప్పుడ, పల్లవాధర గుండె జల్లు మనియె." మను. 3. 91.

గుండె ఝల్లను

  • బెదరు, బెంగగొను, దిగులు పడు.
  • ధ్వన్యనుకరణము.
  • "ఝల్లన గుండె గుభుల్లన నవసి." పండితా. ప్రథ. పురా. పుట. 467.

గుండెతల

  • వక్షస్థ్సలము.
  • "గుండెతల బిట్టు దన్నినఁ గూలుటయును." దశ. 6. 153.

గుండెతల్లడము

  • భయకారణము.
  • "కోకములకు గుండెతల్లడము కైరవ మిత్రుఁడు దోఁచెఁ దూర్పునన్." పారి. 2. 41.

గుండెదిగులు

  • భయంకరము. విరోధి.
  • రూ. గుండెదివులు.

గుండెదివులు

  • భయంకరము.
  • "భరతంపుటయగారి గుండెదివులు." శుక. 3. 20.
  • చూ. గుండెదిగులు.

గుండెధైర్యము

  • ధైర్యము.
  • "వాడికి గుండెధైర్యం లేదు." వా.

గుండె నీ రగు

  • భయభ్రాంతి కలుగు.
  • "చారులచే గాండీవి మ,హారథికుల తోడ వచ్చె నని విని గుండెల్, నీ రై సైంధవతనయుఁడు, పేరోలగ ముండి బిట్టు పిఱువడి చచ్చెన్." జైమి. 8. 156.

గుండె పగుల బొడుచు

  • గట్టిగా చావుపోటు పొడుచు.
  • "ఉరువడి పోరాడి యొగి కైటభారి, భల్లూకపతి గుండెఁ బగులంగఁ బొడువ." ద్విప. కల్యా. పు. 97.

గుండె పగులు

  • భయము కలుగు.
  • "నవమాసంబులు నిండె గుండె వగిలెన్ నా కంతలోఁ గొంత లో,క వినోదంబుల కీ ఫలంబు చవి దక్కం జేసి రక్షింపవే." ఉ. హరి. 2. 15.
  • "వాడు వచ్చా డనేటప్పటికి నా గుండె పగిలి పోయింది." వా.

గుండె పటుక్కనన్

  • ధ్వన్యనుకరణము.
  • "గుండె పటుక్కన వచ్చె వి,భుం డిఁక నె ట్లనుచు మల్ల పుంగవుఁ బథికుం...." శుక. 3. 215.

గుండె పట్టుకొను

  • 1. గుండెనొప్పి కలుగు.
  • "ఉన్నట్టుండి మంచినీళ్లు తాగేసరికి గుండె పట్టుకొనింది." వా.
  • 2. ధైర్యము తెచ్చుకొను. ప్రబోధ. 3. 40.

గుండెపై చేయిడి నిద్ర పోవు

  • ఆదమఱచి నిద్రపోవు.
  • "మా అమ్మ ఉన్నంతదాకా నా కేం భయం లేదు. గుండెమీద చేయి వేసుకొని నిద్ర పోవచ్చు." వా. గుండెబలం
  • ధైర్యం, స్థైర్యం.
  • వాడికి గుండెబలం ఎక్కువ. కాబట్టే యెన్ని వచ్చినా తొణకకుండా బెణక కుండా ఉండగలుగు తున్నాడు." వా.

గుండెబెదురు

  • హృదయశల్యం వంటిది. ఆ పేరెత్తితే హడలు పుట్టిస్తుందను పలుకుబడి వంటిదే.
  • "కర్మవాదుల గుండెబెదురు." పండితా. ప్రథ. వాద. పుట. 511.
  • చూ. హృదయశల్యం.

గుండె భగ్గు మను

  • దిగులు కలుగు.
  • "గుండె భగ్గు మని తల్లడపా టొదవంగ." సారం. 2. 270.

గుండె భగ్గు రను

  • "గుండె భగ్గు రనుచు నుండ దెట్లు." కవిక. 4. 112.

గుండె రాయి చేసుకొను

  • ఏదో విధంగా - అతి కష్టంపై గుండెదిటవు కల్పించుకొను.
  • "ను వ్వెన్ని కష్టాలు పడుతున్నా పిల్లలను చూసైనా గుండె రాయి చేసుకొని తిరుగాడాలి." వా.

గుండెలపై కుంపటి

  • అతి సన్ని హిత మై యెల్ల వేళలా వేచు దిగులు - భారము.
  • "చిన్నతనంలోనే పసుపు కుంకుమ నోచుకోని యీ పిల్లను ఎదాన వేసుకొని యెలా యీడ్చుకొస్తున్నానో దైవానికి తెలుసు. ఈ గుండెలపై కుంపటిని ఎన్నాళ్లు మోసుకొని తిర గాలో? ఎప్పుడు ఆ దైవం పిలుస్తాడో?" వా.

గుండెలపై బండగా తయా రగు

  • భారంగా, బాధాకరంగా పరిణమించు.
  • "ఏదో సహాయంగా ఉంటా డని వీణ్ణి యింట్లో ఉంచుకుంటే గుండెలమీద బండగా తయా రయ్యాడు. పోయిన చో టంతా రంపులు తెస్తున్నాడు." వా.

గుండెలమీద బరువు దించు

  • దిగులును తగ్గించు. ఇలా అనే పట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "ఎలాగో మా అమ్మాయికి కాస్త మంచి సంబంధం ఒకటి చూచిపెట్టి నా గుండెలమీద బరువు దించండి. మిమ్మ ల్నెప్పుడూ తలచుకొంటూ ఉంటాను." వా.

గుండెలు కొట్టుకొను

  • భయం కలుగు. భయాందోళనలను సూచించే పలుకుబడి.
  • "ఆవిడ పేరు చెప్పితే నాకు గుండెలు కొట్టుకొంటాయి. గయ్యాళిగంప ఆవిడ." వా.

గుండెలు క్రుళ్లు

  • దిగులుపడు.
  • "అయ్యున్కిఁ గనుఁగొని గుండె లెల్లఁ, గుళ్లుచుండంగ వదినెలు కుంది కుంది." భోజ. 6. గుండెలు జాఱిపోవు
  • ధైర్యము సడలు ; దిగులు కలుగు.
  • "ఆ పిల్లను ఆ స్థితిలో చూచేసరికి గుండెలు జాఱిపోయాయి." వా.

గుండెలు తీసిన బంటు

  • ధీరుడు.
  • గుండె ఉంటే భయపడే అవకాశ మైనా ఉంటుంది. అది కూడ లే దనుట.
  • "వాడు గుండెలు తీసిన బంటు. ఇరవై మంది కాదు. ముప్పై మంది వచ్చినా ఆప గలడు." వా.
  • "వాడు గుండెలు తీసిన బంటు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడ గలడు." వా.
  • "వాడు గుండెలు తీసిన బంటు. పది మంది వచ్చినా జవాబు చెప్పగలడు." వా.

గుండెలు పగిలిపోవు

  • ఎక్కువ భయాందోళనలు కలుగు.
  • "నేను స్నేహితులతో చీట్లపేక ఆడుతున్నానా, అప్పుడు మా నాన్న వచ్చాడని నా స్నేహితు డొకడు వచ్చి చెప్పేసరికి నా గుండెలు పగిలిపోయా యంటే నమ్ము." వా.

గుండెలు బాదుకొను

  • దు:ఖావేశమును తెలుపు చేష్ట.
  • "ఆ ఉత్తరం వచ్చేసరికి ఆవిడ గుండెలు బాదుకొంటూ బయలుదేరింది." వా.

గుండె లేనివాడు

  • భీరువు.
  • "వా డేమాత్రం గుండె లేనివాడు." వా.

గుండెలో గాలము

  • హృదయశల్యము, భయ కారణము.
  • "అనిమిషుల గుండెలో గాల మఖిల లోక, నేత్రమున నాఁటి వేధించు నెరసు గాలి." ఉ. రా. 1. 149.

గుండెలో రాయి పడు

  • నిరాశ కలుగు.
  • "వస్తుంది వస్తుంది అని ఆ ఉద్యోగం కోసం కాచుకు కూర్చున్నాను. అది కాస్తా వాడు తన్నుకుపోయా డనేసరికి నాకు గుండెల్లో రాయి పడింది." వా.

గుండేల్లో రైళ్లు పరుగెత్తు

  • అత్యాకుల మనస్కతను సూచించు పలుకుబడి. ఇది ఇటీవల విపరీతంగా కథలలో కానవస్తుంది.
  • "తా నెంతగానో ప్రేమించినవాని పెండ్లిపత్రిక వచ్చేసరికి ఆవిడకి గుండెల్లో రైళ్లు పరుగెత్తినాయి." వా.

గుండా, చెరువా ?

  • అంత ధైర్యమా ? అంత సాహసమా ? అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "మిమ్మలిని అంత మాట అనడానికి వాని దేం గుండా? చెరువా?" వా.

గుండ్రా డాచిన పెండ్లి యాగునా?

  • స్వల్ప మైనది లేకున్నంత
  • మాత్రాన పని ఆగిపోవునా అనుటలో వాడు పలుకుబడి. పెండ్లిలో వంట వార్పులకు ఏ కొంతో ఉపయోగపడే గుండ్రాతిని దాచిపెట్టినంత మాత్రంతో పెండ్లి ఆగు తుందా?
  • పెండ్లిలో సన్నె కల్లును పెండ్లి కూతిరిచేత త్రొక్కించుట అలవాటు. కనుక ఈగుండ్రాయికి సన్నెకల్లు అని కొందఱు అర్థం చెబుతారు. కాని అది కూడా వివాహకర్మలో విడ దీయరాని ఒక భాగం. అది లేక వివాహం ఆగినా ఆగ వచ్చును కనుక ఇక్కడ గుండ్రాయి గుండ్రాయే. సన్నికల్లు కా దేమో?
  • "గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కున్ గష్టముష్టింపచా!" మను. 5. 17.

గుండ్లు గూల్చిన భంగిన్

  • (పై నుండీ) గుండ్లు దొర లించినట్లు.
  • "కురిసె మహావృష్టి గుండ్లు గూల్చిన భంగిన్." కుమా. 6. 105.

గుండ్లు తేలి బెండ్లు మునిగినట్లు

  • అస్యవ్యస్త మయినట్లు. పరిస్థితి తలక్రిందు లయినప్పుడు ఉపయోగించే పలుకుబడి.
  • "పొదిలిన యగ్గురు ప్రాపున భవదీయ సైనికులు గొంద ఱాకృష్ణులం జేరి పరాక్రమించుట గుండ్లు దేలి బెండ్లు మునింగిన ట్లయ్యె." భార. ద్రో. 3. 67.
  • చూ. బెండ్లు మునిగి గుండ్లు తేలు.

గుండ్లు దేలి బెండ్లు మునుగు

  • చూ. గుండ్లు తేలి బెండ్లు మునిగినట్లు.

గుండ్లు బెండ్లాడు

  • కదిలించివేయు.
  • "వాయువు లొగి లోకపంక్తు లన్నియు గుండ్లు బెండ్లాడంగఁ దొణఁగె." రంగ. రా. ఉత్త. 11. పుట.

గుంతకండ్లు

  • లోతుకండ్లు.
  • "ఆ గుంతకండ్ల పిల్లను ఎవడు చేసుకుంటాడు?" వా.

గుంపిడు

  • గుంపు గట్టు, గుంపుగా చేరు.
  • "గుంపిడి జనులు...." పండితా. ప్రథ. పురా. పుట. 444.

గుంపు గూడు

  • గుంపు చేరు.
  • "తదీయ నగరావనకో,విదు లగు ననేక పావకు లదరి, బెదరి గుంపు గూడి యందఱుఁ దమలోన్." ఉషా. 4. 29.
  • "తండోపతండము లై గుంపు గూడి." రాధా. 4. 103.

గుంపు దీర్చు

  • వెంట్రుకలు మొదలైనవానిని చేర్చి సవరించు.
  • "పెన్నెఱుల్, మెల్లన గుంపు దీర్చి." కాళిందీ. 2. 63. గుంపులు కట్టు
  • గుంపు గూడు.
  • "అక్కడ నిక్కడన్ నిలిచి రత్తఱి గుంపులు గట్టి వానరుల్." భా. రా. యు. 919.

గుంపులో గోవింద

  • ఏదో గందరగోళం జరగగా ఆ సందున తన ప్రయోజనమును సాధించుకొను.
  • చూ. సందట్లో సమారాధన.

గుంపెనలాడు

  • గునిసియాడు.
  • "ఊరకుండవుగా ఓసి మాయ నిన్నుఁ జేరఁ బిలువము గుంపెన లా డేవు." తాళ్ల. సం. 11. 3. భా. 41.

గుం పెఱుగు

  • విజృంభణము తెలియు, రీతి నెఱుగు. (సరిగా చెప్ప వీలు లేకున్నది.)
  • "తారాకాసురుండు...మహా యుద్ధంబు సేయుచున్నం గని వాని గుంపెఱింగి నగుచున్." కుమా. 12. 178.

గుక్క పట్టు

  • ఊపిరి తిరగకుండా బిగపట్టు. ఇది యేడ్చుటలో ముఖ్యంగా వినవస్తుంది. కుమార. శత. 27.

గుక్కు మిక్కనక

  • పలుకక, నో రెత్తకుండ.
  • "అడరుభయమున గుక్కు మిక్కనక వెనుక, వెనుక కొదిగెడు తన ప్రాణ విభునిఁ జేరి." శుక. 3. 275.

గుక్కుమిక్కను

  • ఆకలిచే నకనకలాడు.
  • "అంత నొక్క బక్క నక్క గుక్కు మిక్కనుచు డొక్కం బిక్కటిల్లిన క్షుధానలంబున దందహ్య మానం బై డస్సి..." హంస. 1. 188.

గుక్కుమిక్కు మనకుండా

  • కా దనకుండా.
  • "అది ఏం తిట్టినా వాడు గుక్కు మిక్కు మనకుండా వెళ్లిపోతాడు." వా.

గుజ గుంపులు

  • హడావిడి; గుసగుసలు.

గుజగుజ యగు

  • గిజగిజ లాడు.
  • "గజము మద ముడిగి తిరుగుచు, గుజగుజ యై గేఁక వెట్ట." భాగ. 5. స్కం. 407.

గుజగుజరేకులు

  • ఒక పిల్లల ఆట.

గుజగుజలాడు

  • గుసగుసలాడు; గోప్యముగా, మెల్లగా మాటలాడు.
  • "నిఖిలసన్మునులు, గుజగుజలాడఁ గన్గొని సభవారి." గౌ. హరి. ప్రథ. పంక్త్ల్. 131.

గుజగుజలు వోవు

  • రహస్యముగా మాటలాడు.
  • "పెక్కువిధంబులం దలపోసి గుజగుజలు వోవుచుండుదురు." భార. విరా. 2. 201.
  • "వారివారికి నెఱింగి గుజగుజ వోవుచు." హర. 5. 57. గుజరాను పఱచు
  • అర్పించు; కాన్క యిచ్చు.
  • "...హైదరుజంగు గాంచి నజరు గుజరాను పఱచి." రంగా. 2. 85.

గుజ్జుబ్రాలు

  • ధాన్యవిశేషం. బ్రౌన్.

గుజ్జుమామిడి

  • ఒక రకమైన మామిడి.

గుజ్జెనగూళ్లు

  • పిల్లలు బొమ్మలాట ఆడుకొనేటప్పుడు చిన్న గురిగెలలో వండుకొను అన్నము. ఒక విధమైన పిల్లల ఆట.

గుటకలు మ్రింగు

  • ఏదో ఒకదానిని ఆశించి, అది యెప్పుడు మనకు వస్తుందా అని వేచి యుండు.
  • "...పటుతయుఁ దోఁప మ్రొక్కి నిజ వాస్తవమున్ స్తవమాదిగా ననెన్, గుటకలు మ్రింగుచుం ద్రిదశకోటిగతుం డిటు తాటకాంతకా?" రామకథా. ఉ. భా. 6. 219.

గుటకలు వేయు

  • ఎంతో ఆశించు.
  • "వీధిలో పొయ్యే అమ్మాయిలను వీడు గుటకలు వేస్తూ చూస్తుంటాడు." వా.
  • చూ. గుటకలు మ్రింగు.

గుటకాయ స్వాహా చేయు

  • అపహరించు. కొత్త. 435.

గుటగుట మను

  • సంకోచము కలుగు.
  • "మనమున గుటగుట మను." శ్రవ. 3. 86.

గుటగుట యను ధ్వన్యనుకరణము.

  • "ఉల్ల మగలంగ నయ్యుగ్రభల్లుకంబు, గుట గుట యటంచు రొప్పి యక్కుటిలుఁ గదిసి." శుక. 1. 500.

గుటిక మ్రింగిన సిద్ధు డగు

  • నిశ్చలు డై యుండు.
  • "గుటిక మ్రింగినసిద్ధుఁ డగుచుఁ దరలఁడు." వర. రా. అయో. పు. 330. పంక్తి. 23.

గుటుకు మనుచు మ్రింగు

  • గుటుక్కున మ్రింగు. ధ్వన్యనుకరణము.
  • "క్రోఁతిమూఁకల మ్రింగెద గుటుకు మనుచు." బాల. 159.

గుటుక్కను

  • చచ్చు.

గుటుక్కు మను

  • చనిపోవు.
  • "వాడు కాస్తా గుటుక్కు మంటే అప్పుడు తెలుస్తుంది అయ్యసంగతి." వా.

గుట్టీక

  • మనసులోని బాధ నితరులకు తెలియ నీక.
  • "గుట్టీక నలంగియు నత్తమామల చిత్తంబు వచ్చునట్లు భక్తి శక్తులు మెఱసి పాటులంబడుమఱందలి." పాండు. 3. 24. గుట్టుకీడు
  • రహస్యశత్రువు. ఆము. 4. 250.

గుట్టు కోల్పడు

  • బయట పడిపోవు, కొంచె పడు.
  • "నిన్ను నమ్మి నా, గుట్టును దేజము న్మి గులఁ గోల్పడి పోయితి నేమి సేయుదున్." పారి. 1. 127.

గుట్టు గలయది

  • రహస్యమును మనసులోనే పెట్టుకొనగలది - పెట్టుకొన గలవాడు, మర్మిష్ఠి.
  • "మండోదరితో, నంతయును దెలిపి క్మమ్మఱి, కాంతునికడ నుండె గుట్టు గలయది వోలెన్." శుక. 3. 273.

గుట్టు గైకొను

  • రహస్యము నెఱుగు.
  • "ఎట్ట కేలకు నాదు గుట్టు గైకొని." పాణి. 3. 32.

గుట్టు చప్పుడు కాకుండా

  • రహస్యముగా, ఎవరికీ తెలియకుండా.
  • "వాడు ఊళ్లో నలుగురిదగ్గరా అప్పులు చేసి, గుట్టు చప్పుడు కాకుండా లేచి పోయినాడు." వా.

గుట్టు చెడు

  • రహస్యభంగ మగు.
  • "ఎట్ట కేలకు గుట్టు చెడి." శ్రవ. 1. 85.

గుట్టున పోనిచ్చు

  • ఊరకే అల్లరి లేకుండా వదలి పెట్టు.
  • "మౌనముఁ దాల్చిన గుట్టునఁ బోనీఁడు నిరంకుశుండు." నిరం. 3. 15.

గుట్టుపట్టు

  • గుండె. వావిళ్ళ.

గుట్టు బిట్టాడు

  • క్రక్కదలు.
  • "చిందరవంద రయి గుట్టుబిట్టాడంగన్." సారం. 3. 15.

గుట్టు మట్టు

  • రహస్యము, ఆంతర్యము. జం.
  • "మీ బండాలము కొండల కెగఁబ్రాకు చున్నను మీలోని గుట్టుమట్టు నే గట్టిగాఁ గనిపెట్టినాఁడను." ధర్మజ. 63. పు. 11. పం.

గుట్టు వీడు

  • బయల్పడు. మనసులో నున్నది వెలనాడు.
  • "చెలఁగన్ మున్నుగ గుట్టు వీడుటకు నై చింతింతు రన్యోన్యమున్." రాజగో. 2. 68.

గుట్టు సాకిరి

  • 'వాది తన వ్యవహారము గెల్చుటకొఱకు రప్పింపగా వచ్చి దాగియుండి ప్రతివాది యొక్క మాట లన్ని యు జక్కగా విన్న సాక్షి.' శ. ర.

గుడగుడ ధ్వన్యనుకరణము.

  • "గుడగుడ నుడికెడి యుదకము." సింహా. 8. 188. గుడార మెత్తు
  • వెళ్లి పోవు.
  • "వా డా ఊరునుండి గుడార మెత్తేసి చాలాకాల మయింది." వా.

గుడి కట్టు

  • గ్రామం ఎల్లల యేర్పాటు. బ్రౌన్.

గుడికి ముద్ర వేసుకొను

  • దేవదాసీత్వము నవలంబించుస్త్రీ పెళ్ళి లేకుండా ఉండిపోవు.
  • "గుడికి ముద్ర వేసికొని కులమున వన్నె, వాసిఁ గాంచి మాట వాసిఁ బెరిఁగి, సాని మగువలందు జాణ వై మగనాలి, పాటు కోర్చి తెట్లు పద్మనయన." ప్రబంధరాజ. 654.
  • చూ. గుడిముద్ర వైచికొను.

గుడికొను

  • జొత్తిల్లు.
  • "గుడికొనుకన్నీరు గ్రుక్కికొనుచున్." సారం. 3. 163.

గుడి గుండ మనక

  • ఇదీ అదీ అనకుండా ఎల్ల చోటులా అనుట.
  • "గుడి గుండ మనక పల్లియ, పడుసర నా కరయుఁ జెఱచి పఱచిన శిష్యున్." పంచ. వేం. 1. 25.

గుడిగుడి కన్నీరు

  • జిటజిట రాలు కన్నీరు.

గుడి గుడి గుంజంబులాట

  • ఒక బాల్యక్రీడ. 'గుడి గుడి గుంజం గుంటానాదం పాం పట్టుకో పక్కచెవ్‌' అంటూ ఆడుతారు. పండితా. ప్రథ. పురా. పుట. 460.

గుడి గుడీ

  • హుక్కా.

గుడిగొను

  • వ్యాపించు.
  • "గుడిగొన్నయే ఱెంత కొంకర వంకర లైనా, పుడమికి లోఁ గొనక పోవు నటయ్యా!" తాళ్ల. సం. 7. 273.

గుడిచాటుకాడు

  • పని చేయనివాడు. గుడినీడ చల్లగా ఉంటుం దని అక్కడే పడిఉండు వాడు. సోమరి అనుట.
  • "కఱపుల గుడిచాటుకాఁడ వై యిట్లు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1706. 7.

గుడిచుట్టు

  • గిర్రున తిరుగు; పరివేషము.

గుడి త్రిప్పు

  • గుడి తిరుగు.

గుడి దిరుగు

  • ప్రదక్షిణము చేయు.
  • "ఒకమా, టకుటిలమతి గుడిఁ దిరిగిన." భీమ. 3. 169.
  • రూ. గుడి దిరుగుకొను. గుడినుండి గుడిత్రాళ్లు గోయు
  • ఒకరి ఆశ్రయంలో ఉంటూ వారికే అపకారం తలపెట్టు.
  • "గుడినుండియె గుడిత్రాళ్లె,క్కుడుగాఁ గోయుట సగోత్రగుణములు సుమ్మీ." పాంచా. 4.
  • చూ. గుడినుండి గుడిరాళ్లు తీయు.

గుడి నుండి గుడిరాళ్లు తీయు

  • కృతఘ్ను డగు. ఉపకారికే ద్రోహము చేయు. తిన్న యింటి వాసాలు లెక్క పెట్టుటవంటి పలుకుబడి.
  • "గుడి నుండి గుడిరాళ్లు తీయుకరణి." పాండు. 3. 68.

గుడి, పాడు చిక్కు

  • సర్వశూన్య మగు, పా డయి పోవు.
  • "అంగళ్లయందు మిట్టాడ మానిసి లేక, గుడియుఁ భాడును జిక్కఁ జెడియె..." కాశీ. 5. 267.

గుడి మింగువానికి నంది పిండి వడియము

  • అంత పెద్దపనే చేసేవానికి మిగతపని ఒక లెక్కా అనుపట్ల ఉపయోగించే సామ్యము.
  • "అంతలేసి మహాత్ముల నింత సేయు, మాకు నిను సంహరించుట మాత్ర మెంత, యెందు గుడి మ్రింగువారికి నంది పిండి, వడియ మనుప ల్కెఱుం గవే పుడమిలోన." విక్ర. 2. 238.
  • చూ. గుడి మ్రింగువానికి తలుపు లప్పడములు.

గుడి మింగేవానికి లింగ మెంత?

  • చూ. గుడి మింగువానికి నంది పిండి వడియము.

గుడిముద్ర వైచికొను

  • దేవదాసిగా నుండు, బసివిగా నుండు.
  • వైష్ణవంలోనూ, శైవంలో కూడా కొందఱు ఆడపిల్లలను దేవునికి సమర్పించేవారు. వైష్ణవంలో దేవదాసీ లనీ, శైవంలో బసువులు లేక బసువురాండ్రు అనీ వీరికి పేరు. వీరు అలా బ్రహ్మ చారిణులుగా ఉండేవారు. కడకు వీరే వేశ్య లయినారు. ఏదో ఒక ఆలయానికి వీరిని సమర్పించేవారు గనుక ఆ గుడిముద్ర వీరిపై పడినట్లు. అట్లే దేవునికి వదలిన ఆబోతులను - అచ్చుపోసిన ఆబోతు లని అంటారు.
  • "జననము నందినం బురుషజన్మము కావలెఁ గాక యాఁడు దై,నను గుడిముద్ర వైచికొనినం దగు లేక కులాంగ నాస్థితిన్..." శుక. 2. 507.
  • చూ. గుడికి ముద్ర వేసుకొను. గుడిమేళము కాదు నగిరి మేళము
  • ఇది కొంత కష్టసాధ్య మనుట.
  • పూర్వం దేవదాసీలు నాట్యం చేసేవారు. గుడిలో నాట్యం చేయడం సులభం. కాని రాచనగరిలో మేళం కట్టి మెప్పించడం కష్టం అనుట పై వచ్చిన పలుకుబడి.
  • "కరణమయ్యతో కంటు కట్టుకుంటే నీ కథ తెలిసొస్తుంది. గుడిమేళం కాదు. ఇది నగిరిమేళం." వా.
  • ఏమీ తెలియని రైతులను ఏడిపించినట్టు కాదు అనుట.

గుడి మ్రింగువానికి తలుపు లప్పడములు

  • ఘోరమైన పని చేయగల వానికి అల్పాపకారములు చేయుట ఒక లెక్కలోనిది కా దనుట.
  • మొత్తం గుడినే మ్రింగే వానికి తలుపులు అప్పడాలతో సమానం కదా !
  • "అలమి గుడి మ్రింగువానికిఁ దలుపు లప్పడములు గాకుండునే. " పాండు. 5. 229.
  • చూ. గుడి మ్రింగువానికి నంది పిండి వడియము.

గుడి వడు

  • గుండ్ర మగు.

గుడిసెవాటు

  • గుడిచేటు.

గుడిసెవేటు

  • గుడిచేటుది; కులట.
  • చూ. గుడిసెవాటు.

గుడిసె వైచు

  • వ్యభిచారము చేయు. తక్కువ రకము కులటలు గుడిసె వేసికొని ఉంటారు. దానిమీద వచ్చిన పలుకుబడి. ఇప్పటికీ రాయలసీమలో హాస్యంగా 'నీ బిడ్డ కేం గుడిసె వేస్తావా? పెండ్లి చేయకుండా' అంటారు. దీనిమీద వచ్చినదే గుడిసె వ్రేటు - గుడిసేటు, గుడిశేటిది.
  • "నీ వపుడు వీఁడు వాఁ డని, భావింపక గుడిసె వైచి పరులం బొందన్." శుక. 2. 46.

గుడుగుడుక్కున మ్రింగు

  • గ్రుక్కిళ్ళు మ్రింగుటలో ధ్వన్యనుకరణము.
  • "గుడుగుడుక్కున మ్రింగు గ్రుక్కిళ్ళ తోడ." ద్విప. నల. 5. 101 పం.

గుడు గుడు గుంచము లాడు

  • పిల్లల ఆటపై వచ్చిన పలుకుబడి.
  • అక్కడక్కడే తిరుగు.
  • "ఒకభార్య నంట గట్టుకొని లొడి తెడు సంసారములో గుడుగుడు గుంచంబు లాడుట కిష్టపడక బ్రహ్మ చారి యై లోకముమీఁద విఱుచుకొని పడి..." సాక్షి. 109.

గుడుగుడు ప్రాణంగా

  • వచ్చే పొయ్యే ప్రాణంగా.
  • "వాడిపరిస్థితి గుడు గుడు ప్రాణంగా ఉంది." వా.

గుడుగుడు మని నడచు

  • గునగున నడచు.
  • "అడుగులు పుడమిని వడి నిడి, గుడు గుడు మని నడచి." పార్వ. 4. 163.

గుడుసు పఱచు

  • తక్కువ చేయు; హీనము చేయు.

గుడుసువడు

  • శూన్య మగు; హీన మగు.
  • "గుడుసువడెఁ జదువు." తాళ్ల. సం. 11. 3 భా. 103.

గుడ్డవృత్తులు

  • ఇనాము భూములు.
  • గుడ్డము - ఊరవాకిలి. ఊర గవిని.
  • పశ్చిమాంధ్ర ప్రాంతంలో నేటికీ ఊరగవిని అనే అర్థంలో 'గుడ్డం' అని ఉపయోగిస్తారు. గూడెమునకు ఈ గుడ్డమునకు సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. గుడ్డవృత్తు లనగా గ్రామం సమష్టిమీద ఆయగాళ్ళు మొదల్గువారికి ఇచ్చే యినాము భూములు కావచ్చును.
  • "గుడ్డవృత్తులు వృత్తులు గొలుచు గుత్త చేలు..." పాండు. 3. 16.

గుడ్డిగవ్వ చేయదు - (డు)

  • బొత్తిగా పనికి రానిది, విలువ లేనిది.
  • ఒకానొక కాలంలో గవ్వలు అతి తక్కువైన కనీసపు నాణ్యాలుగా ఉండేవి. అందులో గుడ్డిగవ్వ మరింత తక్కువ.
  • "వాడి పాండిత్య మంతా ఆ ఊళ్లో గుడ్డిగవ్వ చేయదు." వా.
  • "వాణ్ణి తిప్పి తిప్పి వేలం వేసినా గుడ్డిగవ్వ చేయడు." వా.

గుడ్డిగా

  • విచక్షణ లేక, ముందుచూపు లేక.
  • "ఆవెధవసావాసం పట్టాడు. అప్పటి నుండీ గుడ్డిగా వాడు చెప్పిన ట్లల్లా వినడం తప్ప స్వబుద్ధితో ఏమీ చేయడం లేదు." వా.

గుడ్డి గుఱ్ఱపు తాపు

  • తాకితే తాకుతుంది, తప్పితే తప్పుతుంది. గట్టిగా తగులు నని కూడ.
  • నారాయణ దాసు రుక్మిణీకల్యాణము.

గుడ్డిదర్బారు

  • విచక్షణ లేని పెత్తనం.
  • "వాడి దంతా గుడ్డి దర్బారు. మంచి అంటే మంచి. చెడ్డ అంటే చెడ్డ." వా. గుడ్డిదీపం
  • ఎక్కువ ప్రకాశం లేని దీపం.
  • "ఆ గుడ్డిదీపం వెలుగులో ఏమీ కనపడ లేదు." వా.

గుడ్డినమ్మకం

  • అంధవిశ్వాసం.
  • "శకునా లన్నా, గౌళి శాస్త్రం అన్నా వాడికో గుడ్డినమ్మకం." వా.

గుడ్డిలో మెల్ల

  • కొంత మేలు.
  • "వాళ్లంతా వట్టి కఠినులు. ఈ అబ్బాయే వాళ్లల్లో కల్లా కాస్త గుడ్డిలో మెల్ల." వా.

గుడ్డివడు

  • అంధకారబంధుర మగు.
  • "కొన్ని దేశంబు లిరులచే గుడ్డివడియె." కాశీ. 1. 137.

గుడ్డెద్దు చేలో బడినట్లు

  • ఇష్టం వచ్చినట్లు, చాలూ మూలా లేకుండా.
  • గుడ్డెద్దు కేదీ కనబడదు కనుక దొరికిం దల్లా తింటూ, ఎటు పడితే అటు తొక్కుతూ నానాబీభత్సం చేస్తుంది అనుటపై వచ్చిన పలుకుబడి.
  • "గుడ్డెద్దు చేలో బడ్డట్లు పోలీసు లా నాడు జనంలో పడి దొరికినవాళ్ల నల్లా బాదారు." వా.

గుడ్లగూబ చూచినట్లు చూచు

  • క్రూరముగా, వికారముగా చూచు.
  • "వాడు చూడు. గుడ్లగూబ చూచినట్లు చూస్తున్నాడు." వా.

గుడ్లల్లో కూన

  • ఎత్తిపొడుపుగా మరీ చిన్న వాడు లే అనునప్పుడు అనే మాట.
  • "అవును పాపం! నీ కొడుకు గుడ్లల్లో కూన. ఏమీ తెలీదు." వా.
  • రూ. గ్రుడ్డులోపలి చిన్నకూన.

గుడ్లు అప్పగించి

  • ఏమీ చేయ లేక.
  • "నలుగురూ చేరి వాణ్ణి నలగ దంచుతూ ఉంటే వీడు గుడ్లు అప్పగించి నిలుచున్నాడు. వీ డేం మనిషి ?" వా.

గుడ్లు తేలవేయు

  • ఏమీ చేయలేక తన పని ముగిసినట్లు తెలియజేయు.
  • ప్రాణం పోవునప్పుడూ, మూర్ఛ పోవునప్పుడూ గుడ్లు తేల వేయుటపై వచ్చిన పలుకుబడి.
  • "తీరా వ్యవహారం వచ్చేసరికి వాడు గుడ్లు తేలవేశాడు." వా.

గుడ్లు వెళ్లుక వచ్చు

  • చనిపోవు.
  • కనుగ్రుడ్లు బయటికి వచ్చు. చంపినప్పుడు, చస్తున్న పుడు అలా జరుగుతుంది.

గుణ మిచ్చు

  • పని చేసి మేలు కలిగించు.
  • "ఆ మందు వేయగానే గుణ మిచ్చింది." వా. గుణము చేయు
  • గుణ మిచ్చు.
  • "ఆ మందుతో గుణం చేసింది." వా.

గుణము సారించు

  • ధనుష్టంకారము చేయు.
  • "శంఖంబు పూరించి గుణంబు సారించి." భార. ద్రోణ. 2. 60.

గుణమొలనూలు

  • మొలత్రాడు.

గుత్తకాడు

  • గుత్తకు తీసుకొన్నవాడు. శ. ర.

గుత్తకు తీసుకొన్నట్లు

  • ఇది అంతా నాదే నన్నట్లు.
  • "ఊరంతా గుత్తకు తీసుకొన్నట్లు మాట్లాడుతున్నావే?" వా.

గుత్తగట్టు

  • గుత్త కిచ్చు. నీలా. 1. 118.

గుత్తగా ఉంచుకొను

  • స్వంతంగా పెట్టుకొను. వేశ్యలు ప్రబలంగా ఉన్న రోజుల్లో, వారు ఎవరికీ చెందిన వారు కాక పోయినా, ఎవడో కొంత ధన మిచ్చి తన అధీనంలో ఉంచుకొనేవాడు.
  • "రంగసానిని రామయ్య గుత్తగా ఉంచుకొన్నాడు." వా.
  • చూ. గుత్తగొను.

గుత్తగొను

  • సొంతము చేసికొను.
  • భూముల విషయంలో గుత్తకు తీసుకొనడం అలవాటు. తద్వారా వచ్చిన పలుకుబడి.
  • "...ఇక్కలికి గుత్తగొనుఁ బో,తక్కక దివి నిమిష మున్న దైవతవిటులన్." కళా. 3. 79.
  • "గోపికావళిన్, బొక్కఁగఁజేసి తద్రు చిరభోగము గుత్తగ నీవ కైకొనన్." ఆము. 5. 68.
  • చూ. గుత్తగా ఉంచుకొను.

గుత్తచేలు

  • సంవత్సరానికి ఇంత డబ్బు అన్న ఒప్పందంపై సాగుకు తీసుకొన్న భూములు. పండిన ధాన్యంలో భాగానికి ఒప్పందం చేసుకుంటే అవి కోరు భూములు.
  • "గుడ్డవృత్తులు వృత్తులు గొలుచు గుత్త చేలు." పాండు. 3. 16.

గుత్తపుదాసి

  • ఉంపుడుకత్తె.
  • "...గుత్తపుదాసి దా రవికకుట్టు పుటుక్కున విచ్చె రంభకున్." శకుం. పీ. 80.

గుత్తవట్టు

  • గుత్తగొను.
  • "పచ్చిఱ్ఱితోల్బఱ్ఱె చుచ్చాలమె ట్లంది, కొను దాన యూ రెల్ల గుత్తవట్టు." ఆము. 6. 69.

గుత్తికవ్వము

  • కవ్వము.

గుత్తివడు

  • కష్టపడు.
  • "కొన్ని దేశంబు లిరులచే గుత్తి వడియె." కాశీ. 1. 137.

గుత్తగు త్తను

  • ప్రాణం బితబిత మను భయ భ్రాంతి కలుగు.
  • "ప్రాణములు గుత్తుగు త్తనంగ." హరి. పూ. 9. 132.

గుదగుదలు

  • అనుమానాలు.

గుదగుద మను

  • దిగులు కలుగు; మనసు ఎలాగో అగు.
  • "గుడి కేఁగ రామిని గుదగుద మనుచుఁ, గుడవక..." బస. 6. 180. పు.

గుదగుద లాడు

  • డగ్గుత్తికతో నేడ్చు. బ్రౌన్.

గుదికర్ర

  • జంజాటము.
  • పశువులమెడలకు గుదికర్ర కడతారు, అందుపై ఏర్పడినది.
  • "వృద్ధునకుఁ దన కీ గుదికర్ర యెందులకో." సుకన్య. 10.

గుదికాలు

  • మడమ.

గుదికుచ్చు

  • పేర్చు, కూర్చు.

గుదిగుంజలు

  • పసులదొడ్డి వాకిట పాతిన గుంజలు. బ్రౌన్.

గుదిగుంపులు చేయు

  • కలత పెట్టు
  • "దివిజవేశ్యల, సదనంబుల నున్న మౌని సంతతి తలఁపుల్, గుదిగుంపులు చేసి మథిం,పదె." నిరంకు. 2. 32.

గుదిగొను

  • ఎక్కువగు, చిక్క నగు ఇత్యాది భావచ్ఛాయలలో వినిపించే మాట.

గుది గ్రుచ్చి

  • వరుస పెట్టి.
  • "ముదిలంజవిధమున ము న్నిట్టికథలు, గుది గ్రుచ్చుకొని చెప్పికొని పోవ వలదు." ప్రభులిం. 7. 60.

గుదిగ్రుచ్చు

  • 1. ఒకచోట చేర్చు.
  • "గురుతర ద్రుమములు గుదిగ్రుచ్చు నట్లుగ." కళా. 6. 68.
  • 2. ఒక గుదెకు - సూదికి గ్రుచ్చు.
  • "గుదిగ్రుచ్చెఁ గొందరఁ గూల్చెఁ గొందరిని." పల. పు. 113.
  • "ఆ పూల నన్నిటినీ గుదిగుచ్చి మాల కట్టు." వా.

గుదిత్రాడు

  • దూడకాలికి కట్టే త్రాడు. బ్రౌన్.

గుదిత్రోయు

  • గుదికట్టి త్రోయు.

గుదియకఱ్ఱలు

  • గుదికఱ్ఱలు. గుదివడు
  • కట్టుబడు. కాశీ. 2. 141.

గుదివెట్టు

  • గుదికట్టు.

గుదులుకొను

  • నాటు; కూలబడు.

గుదులుపట్టు

  • తిమ్మిరి పట్టు.

గుదెలవాడు

  • రక్షకుడు.

....ద్ద చుట్టురా అప్పులు

  • ఎటు చూచినా అప్పులే.

గుద్దలిగొను

  • కుళ్ళగించు, పెళ్ళగించు.
  • "కులమున కెల్లను గుద్దలి గొనియె." పండితా. ప్రథ. దీక్షా. పుట. 125.

గునగున నడుచు

  • గునుకుపరువులతో నడచు.

గునిసి నడచు

  • కులుకుచు నడచు.
  • "నేల జీరక యుండఁ గేలఁ గుచ్చెలఁ బూను,కొని యూడిగపుఁజెలు ల్గునిసి నడువ." శుక. 3. 314.

గునిసియాడు

  • చిందులు తొక్కుతూ ఆడు. కుణుసు (కన్న.)
  • "నిలువ కేతెంచి వేఁటకుక్కలు కుమార!, చుట్టుక గునిసి యాడంగఁ జూడ వేమి." కా. మా. 3. 75.

గునుకుపరువున వచ్చు

  • గునగున పరుగెత్తుకొని వచ్చు.
  • "మనవుల కని చెలుల్ గునుకు పర్వున వచ్చి, మొగ తెఱ కట్టుతో ముచ్చ టాడ." హంస. 5. 85.

గునుకెత్తు

  • పరువెత్తు.
  • "గునుకెత్తుచున్న గాడిద, గనుఁగొని." వేంక. పంచ. 4. 521.

గున్న గచ్చకాయల కరణి

  • బాగా తిని నునుపుదేరిన యెడ అను సామ్యం.
  • "....దాదుల్ దినదినము మిసిమి యిడఁగాఁ, గనుపింతురు గున్న గచ్చకాయల కరణిన్." శుక. 2. 333.

గున్నేనుగు

  • పొట్టిగా లావుగా ఉన్న వాళ్లను వెక్కిరింపుగా అను మాట.
  • "వాడు ఒక గున్నేనుగు. వా డేం కొండెక్కుతాడు." వా.

గుప్పెట్లో పెట్టుకొను

  • తన వశములో ఉంచుకొను.
  • "ఆవిడ మొగుణ్ణి తన గుప్పిట్లో పెట్టుకుంది. ఎంత చెప్తే అంతే." వా.

గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొను

  • ప్రాణభీతితో నుండు.
  • "ఈ దుర్మార్గుని కొంపలో గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాను." వా.

గుప్పుగుప్పను

  • ధ్వన్యనుకరణము.
  • కుమా. 11. 155. గుప్పుగుప్పున వైచు
  • ధ్వన్యనుకరణము.
  • "గుప్పుగుప్పున మోచికొని యున్న వలలతోఁ, బలలంపుఁ బొత్తరల్ పాఱవైచి." మను. 4. 103.

గుప్పు తెప్పున

  • గబగబ.
  • "అప్పుడు తద్వధూటి చలితాధర యైవరు గుప్పు తెప్పునం, జప్పుడుగా నదల్చి..." శుక. 1. 540.

గుప్పు మను

  • వాసన కొట్టు.
  • "గుప్పు గుప్పు మని యజ్ఞుల కేనియుఁ గొట్టు వాసనల్." గుంటూ. పూర్వ. 105.

గుబగుబ

  • ధ్వన్యనుకరణము.

గుబాదెబ

  • ధ్వన్యనుకరణము.
  • "వె,ల్పటికి హుషారునం జని గుబాదెబ వీధుల వెంట జంట లై." హంస. 5. 160.

గుబారు చేయు

  • కుట్ర పన్ను ; లేనిపోనివి కల్పించు ; కలత పెట్టు.
  • "మనలను జూడ లేక నడుమంత్రపు వారు గుబారు చేసి గొ,బ్బున నినువంటి దాని కెగఁబోసిరి నాతలఁ పొప్పకుండఁగన్." రాధా. 3. 78.

గుబాలున

  • ధ్వన్యనుకరణము.
  • "గుబాలునఁ గురిసెన్, నభమున సుమనో వర్షము." విజయ. 3. 229.

గుబులుకొను

  • వాసన లెగయు.

గుబ్బటిలు

  • గుబ్బతిల్లు.

గుబ్బతిలు

  • ఉబుకుకొని వచ్చు.
  • "గుబ్బ మెఱుంగుఁ జన్గవ గగుర్పొడువన్ మదిలోనఁ గోరికల్, గుబ్బతిలంగఁ జూచె." మను. 2. 28.
  • ఇది నీటివిషయంలో సామాన్య మైనా, లక్షణయా మిగత వానికీ ఉపయోగిస్తారు.

గుబ్బతిల్లు

  • చూ. గుబ్బతిలు.

గుబ్బలాడి

  • యువతి.

గుబ్బసరము

  • ఒకరకమైన హారము.

గుబ్బుగుబ్బు రను

  • ఘూర్ణిల్లు.
  • "పొరి నంభోనిధి గుబ్బుగుబ్బు రనుచున్." వీర. 3. 223.

గుభగుభలు

  • గడబిడలు.
  • "అంత రాయపుంగుభగుభ లేర్పడన్. గుంటూ. పూ. పు. 32.

గుభా లను

  • ధ్వన్యనుకరణము.

గుభులన వ్రేయించు

  • ధ్వన్యనుకరణము.
  • "డిండిమదుందుభుల్ గుభు లనన్ వ్రేయించి సైన్యంబు." ఉ. హరి. 4. 212. గుభు ల్లను
  • ధ్వన్యనుకరణము.
  • సారం. 3. 28.

గుభులు గుభు లను

  • ధ్వన్యనుకరణము.
  • "గుభులు గుభు ల్లను నాదండాల." వీర. 3. 226.

గుభేలు

  • ధ్వన్యనుకరణము.

గుభేలుదస్త్రం

  • పెద్ద కాగితాలకట్ట. కొంచెం వ్యంగ్యంగా అను మాట.
  • "ఈ గుభేలుదస్త్రం యేమిట్రా ?" వా.

గుమగుమ వాసించు

  • గుబాళించు. విజయ. 3. 122.

గుమి గూడు

  • గుంపు గూడు.
  • "క్రొక్కాఱు మెఱుఁగు లన్నియు, నొక్కెడ గుమి గూడి పిల్చియున్న విధముగా." వేంకటాచల మాహాత్మ్యము. 1. 131.
  • "దైవనమస్కారంబులు దూరంబు చేసి పదుగు రైదుగురు గుమి గూడుకొని..." శుక. 2. 10.
  • గుమి గూడుకొను అని ఆత్మనే పదములో కూడ నిది ప్రయుక్తము. ఒకటిగా చేరు అని అర్థము.

గుమిగొను

  • గుమి గూడు.

గుమురుకట్టు

  • గుంపు కట్టు.

గుమురుకొను

  • దట్ట మగు.
  • "కుఱుచ లై గుమురు లై గొనబు లై లేఁబాఁప, కొమ్మఁ జుట్టిన జడల్ గుమురుకొనఁగ." పాండు. 2. 91.

గుముర్లు గట్టు

  • గుములు కట్టు.

గుములు గట్టు

  • గుంపులు కట్టు.

గుములు గూడు

  • గుములు కట్టు.

గుమ్మటంగా

  • 1. గుంభనగా, గోప్యంగా.
  • "తింటారో తినరో గాని వాళ్లింట్లో గుమ్మటంగా బతుకుతున్నారు." వా.
  • 2. దిట్టంగా.
  • వాడు గుమ్మటంగా ఉన్నాడు." వా.

గుమ్మడికాయంత

  • పెద్దది.
  • "గుమ్మడికాయ యంత యగు ముత్తెం బై మనం బేర్ప." ఆము. 4. 213.

గుమ్మడికాయంత ముత్తెము

  • పెద్దముత్తెము. తాళ్ల. సం. 3. 181.

గుమ్మిడికాయల దొంగ

  • ఎవరో ఏదో అనగా అది తనను గూర్చే అని భావించు వారియెడ ఉపయోగించే పలుకుబడి.

ఒక పిట్టకథ దీనికి మూలం. ఒక చోట గుమ్మిడికాయల దొంగతనం జరిగిం దట. అందరినీ చేర్చి రాజుగారు దొంగతనాలు చేస్తే చేశారు. బుజాలమీదే పెట్టుకోవలా అన్నా డట. అనగానే అసలు దొంగతనం చేసినవాడు బుజాలు తడిమి చూచు కున్నా డట.

  • "ఏదో మాటవరసకి నే నంటే నువ్వులికి పడతా వేం? గుమ్మిడికాయల దొంగలాగా." వా.
  • "గుమ్మిడికాయలదొంగ అంటే బుజాలు తడివి చూచుకున్నాడట." సా.
  • చూ. బుజాలు తడిమి చూచుకొను.

గుమ్మడికాయ లన్న బుజాలు పట్టి చూచుకొను తాళ్ల. సం. 3. 519.

  • చూ. గుమ్మడి.

గుమ్మడికాయలో ఆవగింజంత

  • ఏ కొద్దికూడా కాలేదను పట్ల ఉపయోగించే పలుకుబడి.
  • అత్యల్పము.
  • "కొలఁది మీఱఁ బెద్ద గుమ్మడికాయలో, నావగింజ యంత యైనఁ గలదె?" సావం. 2. 26.
  • "చేయవలసిన పని చాలా ఉంది. గుమ్మడికాయలో ఆవగింజం తైనా కాలేదు." వా.

గుమ్మడిగింజ నామము

  • గుమ్మడిగింజ ఆకారంతో పెట్టే బొట్టు.

గుమ్మడిమూట గట్టు

  • గుమ్మడికాయవలె ముడుచుకొని పోవునట్లు చేయు.
  • "ఇరుచంబడ గుమ్మడిమూట గట్టి వీ,పెక్కి దువాళి చేసి చలి యిక్కడ నక్కడఁ బెట్టు వేకువన్." క్రీడా. పు. 15.

గుమ్మడివిత్తు నామము

  • గుమ్మడిగింజ ఆకారంలో ఉన్న బొట్టు. ప్రభా. 4. 137.

గుమ్మ పడు

  • కుప్పగూలు.

గుమ్ము గుమ్మను

  • 1. చెవులు దిమ్మ వేసుకొనుట లోని ధ్వన్యనుకరణము.
  • "గుమ్ముగుమ్మని చెవుల్ దిమ్ముపడఁగ." రాధి. 2. 20.
  • 2. చిలుకటలో ధ్వన్యనుకరణము.
  • "కవ్వపుఁగొండ వార్ధిలోఁ, దేలుచు గుమ్ముగు మ్మనఁగ ద్రిప్పఁగఁ జొచ్చిరి." హర. 6. 74.

గుమ్మెతకాడు

  • గుమ్మెత అనే వాద్యం - ఘట వాద్యం వంటిది - వాయించు వాడు. హంస. 5. 136.

గురగుర మను

  • ధ్వన్యనుకరణము.
  • "పంది గురుగురు మంటుంది." వా.
  • "ప్రాణం గురగుర మంటున్నది." వా.

గురికట్లు నిలుచు

  • కట్టుబాటు నిలుచు.
  • "నాదు గురికట్లు నిలుచునా నళిన నయన." రాధి. 1. 113.

గురిగింజ సరి దూగు

  • చిన్న దగు. తాళ్ల. సం. 3. 585.

గురు డేకాదశమం దుండు

  • ఉచ్చస్థితిలో నుండు.
  • జాతకచక్రంలో గురువు ఏకా దశస్థానంలో అనగా లాభంలో ఉంటే బాగా సాగు నని జ్యోతిషం.
  • "అబ్బో! క్షురకుల కిప్పుడు గురుఁ డేకాదశమం దున్నాఁడు. ఎక్కడఁ జూచిన మామిడాకు తోరణములు, మంగళ్లవీరణములు." సాక్షి. 245 పు.

గురుపరంపర

  • వంశ పరంపరవలెనే గురువునకు గురువు, శిష్యునికి శిష్యుడు. ఇలా ఉన్న వరుస. పండితా. ద్వితీ. పర్వ. పుట. 522.

గురులువాఱు

  • గిరగిర త్రిప్పు.
  • "గురులు వా ఱెడు పెద్ద కొఱవిదయ్యములు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1642.

గురువుకు పంగనామాలు పెట్టు

  • గౌరవింప దగినవానినే మోసగించు.
  • "వాడా ! కిరాతకుడు. గురువుకు పంగనామాలు పెడతాడు." వా.

గురువుతో గుటగుటలు

  • గురువుతోనే వాగ్వాదము.
  • "...కుటిలాత్మా ! అటమటమ్మున విద్య గొనుటయుం గాక గుటగుటలు గురువుతో నా యని కటకటంబడి." మను. 5. 19.

గురువుదేఱు

  • చిప్పిలు, నురువులు గట్టు.
  • "త్రెవ్వెడు గంటులన్ గురువుదేఱుచు నెత్తురు రాక మున్న." భాస్క. రా. యు. 2. 145.

గురువునకు బొమ్మ వెట్టు

  • గురువునే అపహసించు.
  • "...ఇంతి కియ్యెడన్, గురువుకు బొమ్మ వెట్టితిరి క్రూరవిచారమ కీరవారమా!" కవిరా. 3.

గురువును మించిన శిష్యుడు

  • వాడికి మించిన చెడ్డ వాడనుపట్లనే వాడుక.
  • ఎత్తిపొడుపుగానే దీనిని ఉపయోగిస్తారు.

గురువులు వాఱు

  • 1. ఉఱుకు లెత్తు.
  • "గురుగభీరుం డయ్యు గురువులు వాఱుచు, నట్టిట్టుఁ బాతర లాడువాని." భాగ. స్క. 10 (పూ) 544.
  • 2. ఎక్కు వగు.
  • "పెనఁగు వేడ్క లుల్లంబులలో,గురువులు వాఱఁగ నిలిచిరి." భార. ద్రోణ. 1. 135.
  • 3. క్రొవ్వు పట్టు.
  • "విరుల గుత్తులమీఁద గురువులు వాఱుచు, ముద్దిచ్చు తేటుల మొరపములకు." మార్కం. 5.

గుఱక పెట్టు

  • చూ. గుఱక లిడు.

గుఱకపోతు

  • నిద్రపోతు.

గుఱక లిడు

  • గుఱక పెట్టు.
  • నిద్ర పోవు అని భావార్థము. నిద్రించునపుడు నోరు తెరిస్తే, నోటినుండి గాలి వచ్చి గుఱ్ఱు మని శబ్దమగును.
  • ధ్వన్యనుకరణము.
  • "సెలవుల వనదంశములు మూఁగి నెఱవెట్టఁ, గోల్పులుల్ పొదరిండ్ల గుఱక లిడఁగ." మను. 2. 7.

గుఱగుఱ యగు

  • దురద యగు, దురద కలది యగు. వరాహ. 10. 53.

గుఱి కట్టు

  • కట్టుబాటు.
  • "మారుసాములఁ జల పోరి పోరువేళ, నాదు గుఱికట్లు నిలుచునా." రాధికా. 1. 113.

గుఱికాడు

  • గుఱి తప్పకుండా కొట్టేవాడు.

గుఱికి బారెడుగా

  • కచ్చితంగా కాక - ఏదో ఉజ్జాయింపుగా.
  • గుఱి చూచి కొట్టవలసిన చోట గుఱి పెట్టిన తావుకు బారెడు దూరంలో తగులునట్లు అనుటపై వచ్చినది.
  • "అతడు చెప్పే అర్థం అంతా గుఱికి బారెడుగా ఉంటుంది." వా.

గుఱి కుదురు

  • గౌరవ మేర్పడు.
  • "ఆ వైద్యు డంటే వాళ్లకు గురి కుదిరింది. అందరూ అక్కడికే పోతారు." వా.

గుఱికొండి

  • 1. ఆయముపాటు, మర్మ స్థానము.
  • 2. త్రాళ్ళు.
  • 3. గుర్తు.
  • "అనర్ఘ రత్నసం, కలితపుఁ గుప్పె చామరము గాంచుటయే గుఱి కొండి యంచు న,బ్బలువగలాఁడు." కాళిందీ. 6.53.

గుఱికొను

  • లక్ష్యీకరించు. గుఱి చేయు
  • లక్ష్యీకరించు.
  • "మనుజనాయకుని మర్మంబులు గుఱిచేసి." రుక్మాం. 3. 147.
  • రూ. గుఱి సేయు.

గుఱి పడు

  • పేరు పడు.
  • "కొక్కో కమునఁ జాల గుఱి పడ్డ రౌతు, చక్కెర ఖాణంపు సామ్రాణి నెక్కి." రఘునా. 18 పుట.

గుఱి పఱచుకొను

  • ఏర్పాటు చేసుకొను.

గుఱిపెట్టు

  • బాణము మొదలగునవి గురి పెట్టు.
  • "వాడు గురిపెట్టి కాల్చా డంటే ఆకాశంలో ఎగిరిపోయే పక్షి అయినా కింద పడవలసిందే." వా.

గుఱి యగు

  • సమర్థ మగు.
  • "సంసారాబ్ధికిన్ నావయై, దరిఁ జేర్పన్ గుఱి యైనవాఁడు." కుచేల. 2. 51.

గుఱి వేయు

  • గుఱి చూచి కొట్టు; తన వశము చేసుకొను.
  • "పురుషుని నెచటికిఁ బోవంగ నీయక, వింతచేఁతల గుఱి వేయ వలయు." మల్హణ. 2. 22.

గుఱి వ్రాయు

  • గిరి గీయు.
  • "పోవనీ, కంగజుఁ డానపెట్టి కదియన్ గుఱి వ్రాసె ననంగ జాఱి సా,రంగ మదంబు లేఁజెమటఁ గ్రమ్మె." మను. 2. 32.

గుఱుతుపడు

  • గుర్తు తెలియు.
  • "క్రొత్త డాలు సెలంగ గుఱుతు పడక." నిరంకు. 1. 43.

గుఱుతుమాట

  • మంచిమాట.
  • నానుడి.
  • "ఎఱుక పిడికెడు ధన మన్న గుఱుతు మాట, తథ్య మౌఁ గాదె." కుచేల. 1. 46.

గుఱుతు వెట్టు

  • గణించు.
  • "కుంభినీరేణు కణములు గుఱుతు వెట్టు, వాఁడు నేరఁడు తక్కినవారి వశమె." భాగ. 8. 687.

గుఱుతెఱుగు

  • ఆనవాలు పట్టు.
  • "తుములమునను గుఱు తెఱుఁగక డా,సిన నీ పెమిమిటిఁ దునిమితి." ఉత్త. రా. 4. 104.

గుఱు పొడుచు

  • గుఱ్ఱు పెట్టు.
  • "వీచులతాకున నేచునర్ణవరవ మడఁగి పోవఁగ గుఱుపొడుచువారు..." భాస్క. యుద్ధ. 276.

గుఱువెట్టు

  • గుఱక పెట్టు.
  • "నిద్రించుచున్, గుఱు వెట్టఁ దొడఁగెన్." భాగ. స్క. 8. 713.

గుఱ్ఱం దిగకుండా

  • అత్యవసరంగా వెడుతున్నా ననునట్లుగా ప్రవర్తించే మనిషినిగురించి అనేమాట.
  • "వాడు గుఱ్ఱం దిగకుండానే సున్నం అడుగుతాడు." వా.
  • "వా డెప్పుడు వచ్చినా గుఱ్ఱం దిగకుండా వెళ్లి పోతా నంటాడు." వా.

గుఱ్ఱ మెక్కు

  • 1. గర్వించు.
  • "కొంత గుఱ్ఱ మెక్కి తేనే గుంటఁ గూలి పోదురు." తాళ్ల. సం. 8. 186.
  • 2. నేటివాడుకలో తాగి మైకంలో ఉన్నాడు అనే అర్థంలో కొన్నిప్రాంతాల్లో వినవస్తుంది.
  • "వాడు సాయంత్రం గుఱ్ఱ మెక్కి ఉంటాడు. కాస్త జాగ్రత్తగా మాట్లాడు." వా.

గుఱ్ఱుగా ఉండు

  • కోపంగా ఉండు.
  • "వా డీమథ్య నామీద గుఱ్ఱుగా ఉన్నాడు." వా.

గులకరములు గొను

  • అంకుర మెత్తు.
  • "నునుఁజెమటం దడంబడి గులకరములు గొన." భాగ. 8 స్కం. 396.

గులగుల నగు

  • 1. సళ్ళు వడు.
  • "గులగుల యయ్యె గబ్బి నునుగుబ్బలు ముద్దుమొగంబు వాడె." శుక. 1. 304.
  • 2. పొడిపొడి యగు.
  • "ధైర్యంబు హాటకాహార్యంబు నదలింప, గులగుల గాకున్నె కులధరములు." రాజగో. 1. 64.

గులగుల లగు

  • ముక్కలు ముక్క లగు. లక్షణయా నలిగిపోవు. పాండు. 4. 279.

గులగుల లయి పోవు

  • పొడిపొడి యగు.
  • "గ్రుద్దున్ గోత్రాచలంబుల్ గులగుల లయి పో గోతముల్ గ్రుద్దులీలన్." మను. 4. 8.

గుల గులలుగా నగల్చు

  • పిండి పిండి చేయు.
  • "నిజభుజాపరిఘంబున వజ్రకఠినం బగుతద్వక్షంబు గులగులలుగా నగల్చి గర్జించి..." ఉషా. 4. 62.

గుల్లకావి

  • కొంచెము నీలిరంగైన ఎఱుపు. బహు. 4. 141.

గుల్లకాసు

  • చిన్న కాసు.
  • "అటమటించినఁ గుంచెఁ డంతసాదము గాక, కాదేని యొక గుల్లకాసు గాక." విప్ర. 5. 19.

గుల్ల గట్టి తిను

  • కరగ దిను.
  • "కలిగిన సొ మ్మెల్ల గుల్ల గట్టి తినంగన్." విప్ర. 4. 26.
  • వాడుకలో గుల్ల చేయు, కరగ దిను అను మాటలు వినవస్తాయి. గుల్ల గుట్టగ తిను
  • కరగ దిను; పూర్తిగా ఖర్చు పెట్టు.
  • "మెల్లమెల్లన దాని చేతిసొ మ్మెల్ల నిట్లు గుల్లగుట్టంగఁ దిని తల్లడిల్లఁ జేయ." నిరం. 2. 115.

గుల్ల పఱుచు

  • నాశనము చేయు.
  • "నిను నేఁడు ముఖమున నెత్తురుఁ బ్రామి,కొని గుల్లపఱుపక కొలికికి రావు." హరిశ్చ. 2 భా. 165.

గుల్లపుటిక

  • చిన్న పుటిక. శ. ర.

గుల్ల యగు

  • నాశ మగు, పా డగు.
  • "ఇల్లాలు మెలఁగకున్నను, గుల్లే సౌఖ్యంబు." శేష. 1. 139.

గుల్ల సున్నము

  • గవ్వసున్నము.

గువ్వకరిగా

  • విడవకుండా ధ్వని చేస్తూ. విజృంభణ మని వావిళ్లాది కోశాలు. సరి అనిపించదు.
  • "ని,ర్భరగతి వ్రాలు నమ్మధుకరమ్ములు గువ్వకరిన్ నటింపఁగన్." భోజసుతా. 3. 26.
  • చూ. గువ్వకరి గొని' తిట్టు.

గువ్వకరి గొని తిట్టు

  • ఒక్కొక్క రొక్క మాటగా తిట్టు, గలగల మని తిట్టు.
  • గువ్వలగుంపు చేరినప్పుడు కిచ కిచ మని ఆపకుండా అరుచు చుండును. అందుపై వచ్చిన పలుకుబడి.
  • అతిశయించు అని వావిళ్లాదులు. గుఱికి బారెడుగా చెప్పిన అర్థ మనిపిస్తుంది.
  • "పుణ్యవాహిని నిటు వా,క్రుచ్చితి వనివడి నందఱు, గ్రచ్చ కదలినట్లు గువ్వ కరిగొని తిట్టన్." జైమి. 4. 72.
  • చూ. గువ్వకరి.

గువ్వకుత్తుకతో

  • "డగ్గుత్తికతో - ఎండిపోయిన గొంతుతో. నో రెండి అనుట. గువ్వ అన్నది దుర్బల మయినది. నీరసించి పోయినది అనే భావాల్లో ఉపయుక్త మవుతుంది ! "వాడు గువ్వలా అయి పోయాడు."
  • "కుతిలపడు నతండు గువ్వకుత్తుక తోడన్." పాండు. 3. 20.

గువ్వకుత్తుక పడు

  • నో రెండిపోవు - నీరసపడు.
  • "నెవ్వగఁ గుందుచు నీరసాన్నములఁ, గ్రొవ్వి బల్తురె గువ్వకుత్తుక పడక." గౌర. హరి. ఉ. 1280. పంక్తి.

గువ్వకొను

  • మంతనా లాడు, చేరు - గుమి గూడు. గువ్వకోలుగొను
  • మంతనము లాడు; పలకరించు.
  • "ఎక్కడి వివేకమున మంత్రు లెల్లఁ గదిసి, కువలయేంద్రునితో గువ్వకోలు గొనుచు." శుక. 1. 462.
  • "దివిజకామిను లీరీతిఁ దిరుగువాఱి, గువ్వకో ల్గొంచుఁ దమలోన నవ్వు కొంచు." మను. 3. 109.

గువ్వలు డేగ నెదిర్చినట్లు

  • అసాధ్యము, అసంభవము అయిన పనికి పూనుకొను. గువ్వలనే డేగలు కొట్టి తినుట అలవాటు. అవి డేగనే యెదిర్చినట్లు అనగా అసాధ్య మనుట.
  • "గువ్వల్ డేగ నెదిర్చి పేర్చినగతిన్." కా. మా. 2. 54.

గుసగుసల బోవు

  • గుసగుస లాడు.
  • "గుసగుసల బోయి రచ్చర లెల్లన్." విజయ. 3. 106.

గుసగుస లాడు

  • మంతనా లాడు, రహస్యంగా సంభాషించు.

గుసగుసలు వోవు

  • గుసగుస లాడు.

గుసిగుంపులు

  • కుసిలింపులు.
  • "కొసరు వగమాట లలుకలుఁ, గుసి గుంపులు తిట్లు మోరికొట్టులు జారుం, డసమసుఖంబుగఁ గైకొను." శుక. 1. 530.

గూట దీపం పెట్టేదిక్కు

  • ఔరసులు, వారసులు.
  • "వారికి ఎన్ని ఉంటే నేం ! గూట్లో దీపం పెట్టే దిక్కు లేక పొయ్యాక." వా.

గూటము కొట్టుకొని కూర్చుంటావా ?

  • నీ వేమి శాశ్వతంగా ఉండి పోగలవా అని యెత్తిపొడుపుగా అనుమాట.
  • "అంత ఆస్తి అంటే పడి చస్తున్నావు. నువ్వేమి గూటం కొట్టుకొని కూర్చుంటావా?" వా.

గూట వేయు

  • కుదుటపఱుచు.
  • "కోరి యంతలో గురుఁడు గూట వేసె మనసు." తాళ్ల. సం. 11. 40.

గూటిగువ్వ

  • ఱెక్కలు రాల్చిన పక్షి.

గూటిపఱుచు.

  • దాచు.
  • "ఆ కిఱుకు గూఁటిపఱచి గయ్యాళి తపసి." చంద్ర. 1. 134.

గూడకట్టు

  • గోచి పెట్టకుండా పంచ చుట్టుకొనుట; అడ్డకట్టు అనీ అంటారు.
  • "కౌపీన,ములు మీఁద గూడకట్టులు గానుపింప." పండితా. ద్వితీ. పర్వ. పుట. 308.
  • "గూడకట్టు కట్టుకున్నా వేరా అరవాడి లాగా." వా.

గూడకొంగ

  • ఒక రకమైన కొంగ. బ్రౌన్.

గూడబాతు

  • బాతుల్లో ఒక రకం.

గూడ వేయు

  • చేనికి గూడలలో నీరు పెట్టు. బ్రౌన్.

గూడుపుఠాణీ

  • కుతంత్రం, మోసం.
  • "ఇందులో యేదో గూడుపుఠాణీ ఉంది." వా.

గూడుపుఠాణీ చేయు

  • కుట్ర పన్ను. కొత్త. 190.

గూఢరతి

  • సంభోగములో ఒక భేదము. కుమా. 9. 152.

గూను గిల్ల బడు

  • వంగి పోవు.

గూను వోవు

  • గూని వడు.
  • "అనిశంబు వీఁడు వాఁ డనక యెక్కఁగ వేల్పు, టేనుఁగునకు...గూను వోయె." వరాహ. 10. 15.

గూబకండ్లు

  • భయంకరమైన, వికారమైన కండ్లు.
  • "దాని గూబకండ్లు చూస్తేనే నాకు భయం వేస్తుంది." వా.

గూబజం కెలు

  • వట్టి బెదరింపులు.
  • గుడ్లగూబ కూత యేపిశాచం అరచినట్లో భయంకరంగానే ఉంటుంది. కాని అది మనుష్యులను చేయగల దేమీ లేదు. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "నీ గూబజం కెలకు ను,ద్వేగపడన్." నిరంకు. 3.

గూబ లదరగొట్టు

  • బెదరించు, దండించు.
  • 'గూబ లదరగొట్టి వాడిదగ్గర ఉన్న నాలుగు కాసులూ లాకున్నాడు వీడు' అని వ్యవహారం.
  • 'గూబ లదరగొడతాను' అని ఒకతిట్టుగా కూడా వ్యవహారంలో ఉంది.
  • "నీవు అది యిదీ అన్నా వంటే నీగూబ లదరగొడతాను. జాగ్రత్త." వా.

గూబలు నల్పి వసూలు చేయు

  • బలాత్కారంగా వసూలు చేయు. చెవి నులిమి వసూలు చేయు.
  • "కోరటువార లప్పు నొగి గూబలు నల్పి వసూలు చేతు రె, వ్వారు." గీర. 33.

గూబలో పురుగు

  • నిరంతరము పోరునది. మదన. శత. 23. గృహకృత్యములు దీర్చు
  • ఇంటిపనులు నెఱవేర్చు.
  • "తనదు గృహకృత్యములు దీర్చుకొనుచు నుండె." హంస. 5. 365.

గృహచ్ఛిద్రాలు

  • ఇంటి యిబ్బందులు.
  • "ఈమధ్య చాలా గృహచ్ఛిద్రాలు వచ్చాయి. వాటితో నా మనస్సు ఏమీ బావుండ లేదు." వా.

గెంటస మాడు

  • హాస్య మాడు. న్యూనతపఱచుచు మాట లాడు.
  • "బ్రహ్మవారువముల, గెంటసం బాడు నడ గల్గుకిసలయోష్ఠి." పాండు. 3. 193.

గెంటు గుంటును లేక

  • గంటు గణుపు లేక.
  • అనగా నవురుగా సవురుగా. స్తంభాలకూ వానికీ ఉపయోగించే కఱ్ఱలో గంటూ గణుపులూ లేకుండా ఉన్నప్పుడే అది స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది.
  • "భవనఘటనకు మొదలికంబమును బోలె....నెట్టుకొనియె గెంటు గుంటును లేక." పాండు. 2. 55.

గెంటు గొంటును లేక

  • నవురుగా సవురుగా.
  • "నిట్ట నిలుచున్కిచేఁ గాదె నెట్టు కొనియె, గెంటు గొంటును లేక లక్ష్మీ కళత్ర !" పాండు. 2. 55.
  • ఇదో పాఠాంతరం.

గెంటుపడు

  • తప్పిపోవు; వైతొలగు.
  • చూ. గెంటువడు.

గెంటువడు

  • తప్పించుకొను. గెంటినప్పుడు మనిషి ఆవలి వైపుకు పోవును కనుక గెంటువడుట అనగా తప్పించుకొనుటగా మారినది.
  • "గదాహతి నొకఁడున్, గెంటు వడకుండఁ బీనుఁగుఁ, బెంటలు గావించె." జైమి. 3. 105.

గెడకత్తియ

  • ఆటది; తోటిది.
  • దొమ్మరివాడు గెడకట్టి ఆడడం ప్రసిద్ధం. గెడసాని కూడా ఇలా వచ్చిందే.
  • "తమతోడ నాడు గెడకత్తియ కాఁ గయిసేసి రామనిన్." కుమా. 9. 108.
  • రూ. గెడకత్తె.

గెడగూడు

  • కలగూడు.
  • "గెడగూడ దీని నతని యొడలిపయిం బెట్టి కాల్చు టుచితంబు." భార. విరా. 3. 12.
  • 2. కలియు - రత్యర్థ మై.
  • "ఉష్ణ శీతాన్న కబళము లొకఁడు సూపఁ బవలొ రాత్రియొ గెడగూడ నవసర మని, దాని కుత్తర మొకలతా తన్వి యిచ్చె, నధరబింబము విఱిచి సంధ్యాగమ మని." నైష. 9. 187. గెడగూడి పాఱు
  • పరువెత్తు - జతగా - పందెం వేసుకొని...
  • "మిన్ను దలఁబాఱె ఖగపతి, యన్నదియును బాఱఁదొడఁగె నవని యద్రువ నే, మున్నో తా మున్నో యని, పన్నిదమునకు గెడగూడి పాఱినభంగిన్." భోజ. 7. 42.

గెడసేయు

  • కలుపు ; జత చేయు.
  • "గెడసేయుము నన్నుఁ గార్తికేయుని తోడన్." ఉత్త. హరి. 5. 15.

గెర గట్టుకొను

  • కుదురు కట్టుకొను.
  • "గెర గట్టుకొని పుట్టు నెర పూప చనులతో." రాధి. 1. 53.

గెఱగొను

  • రూపొందు.
  • "క్రీగంటిచూపున గెఱగొన్న సన్న గేదంగి, ఱేకుల కన్నదమ్ము లగుచు." ఉత్త. హరి. 1. 131.

గెలుపుకంబము

  • విజయ స్తంభము. వరాహ. 1. 20.

గెలుపుకాడు

  • విజేత.

గెలుపుకొను

  • జయించు. విక్ర. 6. 26.

గెలుపోటములు

  • జయాపజయములు. శృంగా. శాకుం. 1. 164.

గెల్లువడు

  • విజృంభించు. పద్మ. 7. 238.

గేదగితేనె నాకించు

  • నోరు తీపు చేయు, కాస్త తడి చేయు.
  • "సానితల్లికి తిక్క చనుదెంచి నపుడెల్ల, గేదఁగితేనె నాకించవలయు." చింతా. 5. 47.

గేనము లేక

  • ప్రజ్ఞ లేక, మై మఱచి.
  • "గాంగేయుఁడుఁ దారకాసురుఁడు గేనము లే కని సేసిరి." కుమా. 12. 144.
  • వాడుక - "వంటిమీద ప్రజ్ఞ లేకుండా గుంపులో జొర బడ్డాడు."
  • కేనము అంటే కన్నడంలో సంకోచము అని కూడా అర్థం. ఎట్టి సంకోచము లేక అని కూడా దీనికి అర్థం చెప్పవచ్చును; కానీ సుదూరార్ధం.

గేలికొట్టు

  • పరిహసించు. పరమ. 1. 15. పుట.

గేలిగొను

  • గేలి సేయు. భార. శల్య. 2. 215

గేలి చేయు

  • హాస్యము చేయు.

గేలి పెట్టు

  • గేలి చేయు. గేలి సేయు
  • గేలి చేయు.

గొంజెగొడుగు

  • ఆతపత్రము.
  • "గొంజెగొడుగులే కొం డెల్లా." తాళ్ల. సం. 11. 3 భా. 53.

గొండ్లికొను

  • నాట్య మాడు. సుద. 3. 34.

గొంతు ఆరిపోవు

  • అఱపువల్ల గొంతు తడి ఆరు.
  • "అరగంట మాట్లాడేసరికి నా గొంతు ఆరిపోయింది." వా.

గొంతుక తడుపుకొను

  • దప్పి తీర్చుకొను, కడుపు నించుకొను. గువ్వలచెన్న. 3.

గొంతుకు ఉరి యగు

  • బాధాకరముగా పరిణమించు.
  • "వీడు నాకు గొంతుకు ఉరి అయి కూర్చున్నాడు." వా.

గొంతు కూచుండు

  • పట్టు పట్టు.
  • "వాడు ఈపని చేస్తేకాని అన్నం తిన నంటూ గొంతు కూచున్నాడు." వా.

గొంతు కూర్చొను

  • మోకాళ్లపై గొంతు మోయునట్లుగా కూర్చుండు.
  • "భోజనందగ్గర గొంతు కూర్చుంటూ వేమిట్రా!" వా.

గొంతు కొను

  • గొంతు కూర్చుండు.

గొంతు కోయు

  • ద్రోహము చేయు. నా. మా. 28.

గొంతు కోసినా....

  • ఏమి చేసినా అనుట.
  • "వాడు గొంతు కోసినా నిజం చెప్పేనా?" వా.

గొంతు చించుకొను

  • అఱచు.
  • నిరసనగా మాట్లాడేటప్పుడు ఉపయోగించే పలుకుబడి.
  • "ఎందుకు అంత గొంతు చించుకుంటావు రా? పిల్లవాళ్లు అల్లరిఒ చేయక పోతే మనం చేస్తామా?" వా.

గొంతు చిదుము పని

  • మెడ నులిమి చంపుట.
  • "కుఱుచవగ చిక్కటారిం, బరికింపక గొంతు చిదుముపనిఁ దలఁచి..." శుక. 1. 318.
  • చూ. గొంతు పిసుకు, మెడనులుము, తల దఱుగు ఇత్యాదులు.

గొంతు చేసికొను

  • అఱచు.
  • "ఇంతీ! యెవ్వరు లే రని, గొంతేటికిఁ జేసె దెవరు గొనిపోయెదరే?' హంస. 3. 222.

గొంతున బడు

  • గొంతులో తగుల్కొను, (మింగునపుడు) మింగుడు పడక పోవు.
  • "వెన్నెలముద్ద భుజింపఁ బోయి గొం,తునఁ బడవేసికొన్న హిమతోయ మొసంగిరి." నిరంకు. 2. 104. గొంతు నొక్కు
  • నోరు నొక్కు. నా. మా. 12.

గొంతు పట్టుకొను

  • 1. గొంతుమీదికి వచ్చు.
  • "అప్పు డేదో అన్నాను. ఇప్పు డది గొంతు పట్టుకొంది." వా.
  • 2. గొంతున కడ్డము వచ్చు.
  • "గొంతు పాట్టుకొం దేమో! మంచినీళ్లు తాగ రా ! అంత యెక్కిళ్లు పెడుతున్నావు." వా.

గొంతు పెగలకుండు

  • నోట మాట రాకపోవు.
  • "వా డింట్లో తెగ వాగుతాడు గానీ నలుగురిలోకి వస్తే గొంతు పెగలదు." వా.

గొంతుపోక

  • గొంతుముడి.
  • చూ. గొంతుముడి.

గొంతు బొంగురు పోవు

  • 1. గద్గద మగు.
  • "వాళ్లమ్మ కనిపించగానే భావాతిరేకం పట్ట లేక పోయాడు. వాని గొంతు బొంగురు పోయింది." వా.
  • 2. గొంతు రాచి పోవు.
  • "పురాణం చదివి చదివి వాడిగొంతు బొంగురు పోయింది." వా.

గొంతుమీద కూర్చొను

  • ఏదైనా యిప్పుడే కావా లని నిర్బంధించుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "ఇప్పుడే సొమ్మంతా కావా లని వాడు గొంతుమీద కూర్చున్నాడు." వా.

గొంతుమీదికి వచ్చు

  • ప్రమాదస్థితి ఏర్పడు; ప్రాణాలమీదికి వచ్చు.
  • "ఆ విషయం యిలా గొంతుమీదికి వస్తుందని నే ననుకో లేదు." వా.
  • "అక్కడా యిక్కడా అన్నమాటలే యీ రోజు గొంతుమీదికి వచ్చాయి. గమనించావా?" వా.
  • చూ. మెడమీదికి వచ్చు.

గొంతుముడి

  • గొంతుముందు కాయగా కనిపించే ఎముక.
  • చూ. గొంతుపోక.

గొంతు మూగవోవు

  • స్వరవిహీన మగు.
  • "నా గొంతు మూగవోయింది." వా.
  • రూ. గొంతుమూగపోవు.

గొంతులో గురక పుట్టు

  • అవసానదశ సమీపించు.
  • చనిపోవునప్పుడు గొంతులో కఫం క్రమ్ముకొని రావడంతో గురగుర మనుటపై వచ్చిన పలుకుబడి.
  • "ఆవిడకు గొంతులో గురక పుట్టింది. ఇక ఏం జరిగినా గంటలే." వా.

గొంతులో నీళ్లు దిగడం లేదు

  • చాలా జబ్బులో ఉన్నాడు. ఏమాత్రం త్రాణ లేదు అనుట.
  • "వాడికి రెండురోజులుగా గొంతులో నీళ్లు దిగడం లే దట." వా. గొంతులో నీళ్లు పోసే దిక్కు
  • దగ్గరివాళ్లు, ముఖ్యంగా రక్త బంధువులు.
  • "వాడికి గొంతులో నీళ్లు పోసే దిక్కు కూడా లేదు. పాపం! జబ్బుతో నానా బాధా పడుతున్నాడు." వా.

గొంతులో పచ్చి వెలగకాయ పడినట్ల గు

  • ఏమీ అనలేక పోయే చిక్కు పరిస్థితి యేర్పడు.
  • చూ. గొంతులో వెలగకాయ పడినట్లు.

గొంతులో ప్రాణ మున్నంత వఱకూ

  • ఎంతవఱ కైనా ఏ మైనా అనుట.
  • చూ. కంఠంలో ప్రాణం ఉన్నంత వఱకూ.

గొంతులో వెలగకాయ పడినట్లు అగు

  • ఎటూ తప్పుకొన వీలు లేని స్థితిలో పడు.
  • "వాడికీ వీడికీ తగాదాలు పెడుతూ వీడు తిరుగుతుండేవాడు. ఇద్దరూ ఎదట బడేసరికి వీడికి గొంతులో వెలగకాయ పడ్డట్టు అయింది." వా.

గొంతు విచ్చి

  • గొం తెత్తి.
  • "అతను గొంతు విచ్చి పాడితేనే బాగుంటుంది." వా.
  • చూ. గొంతెత్తి.

గొంతెత్తి

  • బిగ్గరగా.
  • "ఆవిడ గొంతెత్తి పిలిస్తే కానీ పలకదు." వా.

గొంతెమకోరికలు

  • ఏవేవో అసాధ్య మైన కోర్కెలు.
  • "చాలకుండిన నగుఁ జెట్టబాలుఁడితఁడు, కొసరి గొంతెమ కోరికల్ గోరెనేని, యిడక పోఁబోల దిడఁ బోలదు..." పాండు. 4. 166.
  • "వాడి వన్నీ వట్టి గొంతెమ్మ కోరికలు తీరేవా? పెట్టేవా?" వా.
  • రూ. గొంతెమ్మకోరిక.

గొందిపెట్టు

  • దాచు.

గొందులపెట్టు

  • దాచు. బ్రౌన్.

గొజ్జగనీరు

  • పన్నీరు.

గొజ్జగమంచు

  • పన్నీరు.

గొజ్జుబ్రాలు

  • ఒక ధాన్యం. హంస. 4. 128.

గొజ్జెగనీరు

  • పన్నీరు.

గొటగొట మను

  • ధ్వన్యనుకరణము.
  • "గొట గొట మని రొప్పు బలుసింగముల నైన." సారం. 1. 68.

గొట్టికంటి

  • ఒక రకం తినే గడ్డ. గొట్టు సేయు
  • 1. బాధ పెట్టు.
  • "ఇట్టు లారాచపట్టినిఁ బట్టి చాల, గొట్టు సేయుచు." సారం. 2. 108.
  • 2. బహిరంగ పఱచు.
  • "గొట్టు సేయక వీనిఁ జూపెట్టుకొనుచు, నిచ్చటికిఁ దెచ్చితిమి." శుక. 3. 586.

గొడవగొంట్లు

  • కలహశీలురు.
  • తిట్టుగా ప్రయుక్తం (స్త్రీల విషయంలో.) పండితా. ప్రథ. పురా. పుట. 343.

గొడుగుక్రింది రూపు

  • రాజు.
  • భూచక్రగొడుగు అనే రాజలాంఛన మైనఆతపత్రంక్రింద రాజే ఉంటాడు కదా.
  • "గొడుగు క్రింది రూపుఁ బొడిచి జయంబు నీ, కిత్తు నధిప నన్ను నింత నమ్ము." కుమా. 11. 37.

గొడుగు బల్ల

  • తలుపుమీది కుసుం తిరిగే పట్టె. శ. ర.

గొడుగు మెట్టెలు

  • ఉబ్బు మెట్టెలు.

గొడ్డలి పెట్టు

  • వ్యాఘాతము కలిగించునది.
  • "ఆనాడు ఉప్పుసత్యాగ్రహం బ్రిటిషు ప్రభుత్వానికి గొడ్డలిపెట్టుగా పని చేసింది." వా.

గొడ్డ వెట్టు

  • నిరోధించు, అడ్డగించు.
  • "గొడ్డ వెట్టకుఁ డంచుఁ గొఱ తేమి యంచు." పండితా. ద్వితీ. పర్వ. పుట. 289.

గొడ్డు

  • అజ్ఞాని; మూర్ఖుడు. తిట్టుగా, దూషణగా ఉపయోగించే మాట. గువ్వలచెన్న. 44. నా. మా. 35.

గొడ్డుకారం

  • వట్టి కారం.
  • "గొడ్డు కారంతోనే వాడు పావు బియ్యమన్నం తింటాడు." వా.

గొడ్డు పోయిందా? (కులం)

  • ఇం కెవరూ లేరా అనుట.
  • ఈ కులానికి బదులుగా ఊరు, దేశం, లోకం ఇత్యాదులు ఉపయోగించుట కలదు.
  • "ఆ పిల్లే కావా లని యేమిటి? కులం గొడ్డు పోయిందా?" వా.

గొడ్డు పోలేదు

  • నిస్సంతు కాలేదు.
  • మరొకరు ఎవరూ ఇలాంటి వారు లేరా అనుపట్టున ఉపయోగించు పలుకుబడి.
  • "వీడే నని యేమిటి? లోక మేమీ గొడ్డు పోలేదు." వా.
  • "ఈ పిల్లే నని యేమిటి? కులం గొడ్డు పోలేదు." వా. గొడ్డుబోతుకు కాయము కొట్టు
  • వ్యర్థప్రయత్నము చేయు.
  • బాలింతలకు పెట్టే కారాన్ని కాయం అంటారు. అలాంటిది గొడ్రాలి కెందుకు? అనుటపై వచ్చినది. మదన. శత. 6.

గొడ్డు వీగి కన్నబిడ్డ

  • ప్రథమసంతానము.
  • వానిమీద ప్రేమ యెక్కువ అనుట. లేక లేక కలిగిన కొడుకు. తొలి కడుపు పంట, గొడ్రాలి తనం పోగొట్టి కలిగిన కుమారుడు.
  • "గొడ్డు వీఁగి కన్నబిడ్డండు గావున." కాశీ. 4. 87.
  • "గొడ్డు వీఁగి కనిన కొడుకుగారాము." పండితా. ద్వితీ. మహి. పుట. 167.

గొడ్డు వీగు

  • సంతానవతి యగు.
  • "గొడ్డు వీఁగిన యట్టి కొమ్మల కెల్ల, బిడ్డలు లే రను పెనుచింత గాని." వర. రా. అయో. పు. 336. పంక్తి. 18.

గొడ్డు వోవు

  • వ్యర్థ మగు.
  • "కొంత కాలంబు శూన్య మై గొడ్డు వోయె." శివ. 1. 51.

గొడ్డే రగు

  • వ్యర్థ మగు./
  • గొడ్డు + ఏరు.
  • "ఏలా బిడ్డలు లేని యీబ్రదుకు గొడ్డే రయ్యెఁ జింతింపఁగన్." కవిక.

గొడ్డేరి తెచ్చు

  • ఒక నిర్దిష్టలక్ష్యముతో తెచ్చు.
  • "బొడ్డునఁ బుట్టినపాపనికే నిన్ను గొడ్డేరి తెస్తినే కోడలా!" తాళ్ల. సం. 12. 312.

గొడ్డేఱు

  • 1. గొడ్డువడు.
  • "ఒడ్డారించి విషంబున, కడ్డము చనుదెంచి కావ నధికులు లేమిన్, గొడ్డేఱి మ్రందిరి." భాగ. స్క. 8. 217.
  • 2. గుత్తకు తీసుకొను.
  • "బొడ్డుపల్లెను గొడ్డేఱి మోసపోతి." శ్రీనాథుని చాటువు.

గొడ్డేఱుగ

  • వ్యర్థముగా.
  • "నీ పడ్డపాటు గొడ్డేఱుగ జిడ్డు పఱుపం గలవారమె?" హర. 2. 132.

గొడ్రాలు

  • బిడ్డ పాప లేనిది. పాండు. 3. 128.
  • "గొడ్రాలి కేం తెలుసు బిడ్డకుట్లు?" సా.

గొద గొద

  • వైరము.
  • "ఆ రెంటి కేల గొదగొద వొడమెన్." వేం. పంచ. 3. 99.

గొద గొను

  • విజృంభించు, త్వరపడు ఇత్యాది భావచ్ఛాయలలో ప్రయుక్తం.

గొనకొను

  • నెలకొను.
  • వెడలు ఇత్యాదులలో ప్రయుక్తం. కొన్నిట ఉప స్కారకంగా వినవస్తుంది.
  • "గొనకొన్న ప్రేమమై కొలువు చాలించి." రంగ. రా. ఆర. 170. పు.
  • "గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు." భార. ఆర. 4. 105.
  • "వేఁట నెపమున గొనకొని కణ్వాశ్రమమునకున్ వచ్చి." భార. ఆది. 4. 74.

గొనకొల్పు

  • పురికొల్పు.

గొణగొణ లాడు

  • గొణుగు. ధ్వన్యనుకరణము.

గొప్ప చేయు

  • 1. పెద్ద చేయు.
  • "వాళ్ల యింటికి వెళ్లినప్పుడు అతడు న న్నెంతో గొప్ప చేసి గౌరవించాడు." వా.
  • 2. పెంచు.
  • "కోయకు జీతంబు గొప్ప చేయు." పార్వ. 1. 62.

గొప్ప చేసుకొను

  • స్వోత్కర్ష చెప్పుకొను.
  • "వా డేమో మహా గొప్ప చేసుకొంటున్నాడు. వాడి సంగతి ఎవడికి తెలియదు?" వా.

గొప్ప మనసు చేసికొను

  • ఎక్కువ ఔదార్యమును చూపు.
  • "నేనూ అంత ఉన్నవాణ్ణి కాదు. నా చేత నయిన మర్యాద లన్నీ చేశాను. మీ రేదో గొప్ప మనసు చేసుకొని యీ మూడుముళ్లూ పడ నిస్తే జన్మ జన్మాలకూ మీ మేలు మరిచి పోను." వా.

గొప్పు తవ్వి గొయ్యి తవ్వి సంపాదించు

  • నానా బాధపడి సంపాదించు.
  • "వా డేదో గొప్పు తవ్వి గొయ్యి తవ్వి నాలుగురాళ్లు సంపాయించుకొంటే కొడుకు అది కాస్తా కాజేస్తున్నాడు." వా.

గొబ్బిపదములు

  • గొబ్బి తట్టుతూ పాడుకునే పాటలు. పండితా. ప్రథ. వాద. పుట. 513.
  • చూ. ప్రభాతపదములు.

గొర్లపాలు సేయు

  • పార ద్రోలు - గొఱ్ఱెలను వోలె తోలు.
  • "నిశితఖడ్గాయుధాన్వితహస్తుఁ డగుచుఁ, బశువరించుచు గొర్లపాలు సేయుచును." బస. 6. 155.

గొర్ల మంద

  • అమాయకులూ, అజ్ఞానులూ అనుట.
  • "ఆ ఊళ్లో వాడు చెప్పింది వేదం. ఆ జన మంతా గొర్లమంద కాబట్టి సరి పోయింది. లేకుంటే వీడి ఆట సాగేదా?" వా.

గొఱక వేయు

  • ధ్వని చేయు.
  • "ఒక్కఁ డడుగెత్తి గొఱక వేయుచును డాచిఁన ట్టరిగి టెంకిఁ గని..." మను. 4. 48.

గొఱగయ్య (డు)

  • ఈశ్వరుడు.
  • శైవులలో నేటికీ ఒక వర్గం గొఱగయ్య లని జంగాలవలెనే ఉంటారు. వారి వేషం చిత్రంగా ఉంటుంది. వీరు జంగాలవలెనే తిరుగుతూ భిక్ష చేస్తారు. కుమా. 7. 38.

గొఱిగించు

  • 1. ఖర్చు పెట్టించు.
  • "ఆ దత్తపుత్రుణ్ణి గొఱిగిస్తూ వీడు మహా అట్టహాసంగా వెలిగి పోతున్నాడు." వా.
  • 2. క్షౌరము చేయించు.
  • "తల గొఱిగింపఁ బంచె." కాళ. 1. 48.

గొఱుగులు వడు

  • గొఱగ బడు.
  • "గొఱుగులు వడ్డ వెండ్రుకలు..." పద్మ. 2. 191.

గొఱుపడము

  • నల్ల కంబళి.
  • గొఱ్ఱె చర్మముపై వచ్చి, నల్లకంబళి అన్న అర్థంలో నిలిచింది.
  • "నెఱ నెన్నిమాఱులు నీళ్ల లోపలను, గొఱుపడం బుదికిన మఱి తెల్ల నగునె?" బస. 7. 207.

గొఱ్ఱె

  • ఒక తిట్టు. చవట, అజ్ఞాని అనుట.
  • "వాడు ఒట్టి గొఱ్ఱె. వాడికి ఏం చెప్పి తే ఏం లాభం?" వా.

గొఱ్ఱెతోకగా ఉండు

  • ఎదగనిదిగా ఉండు.
  • 'గొఱ్ఱెతోక బెత్తెడే' అన్న సామెతపై వచ్చిన పలుకుబడి. ఎదుగుబొదుగులు లేనిది. గొఱ్ఱెతోక పుట్టినప్పు డెంతో తరువాత కూడా ఎదుగుబొదుగులు లేకుండా అలాగే ఉండి పోతుంది.
  • "ఎంత చేసిన ఆ పని గొఱ్ఱెతోకగానే ఉంది." వా.

గొఱ్ఱెదాటు

  • ఒకరిని గుడ్డిగా అనుసరించి పదిమంది పోవుట. ముందున్న గొఱ్ఱె ఎటు పోతే మిగత మందంతా అటే పోతుం దనుటపై వచ్చిన పలుకుబడి.
  • "రెడ్డికొడుకు తెల్లజుబ్బాలు వేయడం మొదలెట్టేసరికి ఊరంతా అదే మొదలు పెట్టారు. అంతా గొఱ్ఱెదాటు." వా.

గొఱ్ఱెవలె వెఱ్ఱికూతలు కూయు

  • అజ్ఞానభాషితము లాడు.
  • "ఓరి! నైరృత ! గొఱ్ఱెవలె యేల వెఱ్ఱి కూతలు కూశేవురా." హేమా. 29 పు. గొలగొల లాడు
  • గోల చేయు.
  • "చిలుకలు గొరవంకలు గో,యిల లరిచలు నెమలిగములు నెడపక యెపుడున్, గొల గొల లాడుచు విరహుల, నిలువఁగ నిచ్చునె వనంబు నీకుం గొఱయే." శివలీ. 2. 76.

గొలుసుకట్టు

  • విడివిడిగా కాక కలిసికట్టుగా వ్రాసే వ్రాత.
  • చూ. గొలుసుమోడి, గొలుసువ్రాత.

గొలుసు కొను

  • ఒకదానితో నొకటి అంటి యుండు. కావ్యా. 6. 21.

గొలుసు దప్పిన కోతి

  • పట్టుకొనుట కసాధ్య మయిన వాడు; కట్టు తప్పిన కోతివంటి వా డనుట.
  • "దక్కిపోయిన వెంటఁ దగుల నా వశ మె?.... గొలుసు దప్పిన యట్టి క్రోఁతిచందమున." గౌర. హరి. ద్వి. 1506.

గొలుసుమోడి

  • గొలుసుకట్టువ్రాత
  • చూ. గొలుసుకట్టు; గొలుసువ్రాత.

గొలుసువ్రాత

  • ఒక అక్షరంలో ఇంకొక అక్షరం కలిసిపోవునట్లుగా వ్రాయువ్రాత.
  • పాతకాలం పత్రా లన్నీ గొలుసువ్రాతతో ఉంటాయి. అలవాటున్నవారు కానీ చదవలేరు.
  • చూ. జిలుగురాత.

గొల్లభామ

  • ఆకులలో ఉండి ఎగిరిపడే పురుగు. ఆకులో మిడత.

గొల్లని సాహిత్యవిద్య

  • అసంభవం.
  • గొల్లలకు చదువు రాదు అను పాతకాలపు ప్రథపై వచ్చినమాట.
  • సాతానిసామవేదం వంటి పలుకుబడి.
  • "అల్లుని మంచితనంబును, గొల్లని సాహిత్యవిద్య....లేవు." సుమతి.

గొల్ల సివాలు

  • గొల్ల పాటలు.
  • "గొల్లసివాలు పాడుకొనుచు." కువల. 2. 115.

గొల్ల సుద్దులు

  • ఒక రకమైన పాటలు.
  • గొల్లవాళ్లు వారి వారి కుల పెద్దలను గురించి కీర్తించే పాటలు.
  • "గ్రుక్కలు మింగుచున్ వెడగు గొల్లలసుద్దుల నెంత పాడినన్." గుంటూ. ఉత్త. 12.

గొల్లున కూయు

  • ధ్వన్యనుకరణము. గొల్లున నవ్వు
  • గట్టిగా నవ్వు.
  • ధ్వన్యనుకరణము.

గొల్లు మను

  • దు:ఖించు; ఏడ్చు.
  • ధ్వన్యనుకరణము.
  • మాటా. 127.

గొల్లెనబండి

  • గూటిబండి. వావిళ్ల. ని.

గొవరువోవు

  • కమిలి పోవు.
  • "కొన్ని దేశంబు లెండచే గొవరు వోయె." కాశీ. 1. 177.

గొహారు చేయు

  • తపింప జేయు.
  • "మంట మాని శంబరారిఁ గూడినన్, గోహారు సేయ నేల సారెకుం జలంబునన్." పాండు. 2. 180.

గోండ్రలు పెట్టు

  • గర్జించు. చాటు. 2. భా.

గోండ్రు పెట్టు

  • గర్జించు, ఱంకె వేయు. బ్రౌన్.

గోకుడుపాఱ

  • దోకుడుపార.

గోచారము

  • గ్రహసంచార ఫలితము. తత్ఫలితంగా జీవితంలో ఫలితం చెప్పుట జ్యోతిశ్శాస్త్ర ప్రక్రియ. ఫలితానికే పేరయినది.
  • "గోచారం బాగు లేదు - జాతకం ప్రకారం బాగుందే అనుకో." వా.

గోచికట్టు

  • బ్రహ్మచారి. పాండు. 5. 238.

గోచికా డగు

  • ఉన్న దంతా పోగొట్టుకొను.
  • "గోఁచికాఁ డై దానిఁ గొనుచు నేతెంచి." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1050.

గోచికాడు

  • బ్రహ్మచారి.

గోచి గట్టిన నాటగోలె

  • చిన్నప్పటినుండి.
  • "గోఁచి గట్టిననాఁటఁ గోలెఁ బీనుఁగుల, మోచి గడించినమూలధనంబు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 886-87.

గోచిగాని చేయు

  • గోచి మిగులునట్లు చేయు.
  • "పాయక పై నున్న బట్టఁ బోఁజేసి, గారించి యిల గోచిగానిఁ గావించి." నలచ. ద్వి. 2.693 పం.
  • చూ. గోచి చేతి కిచ్చు.

గోచి చేతి కిచ్చు

  • నిరుపేదనుగా చేయు. చిప్ప చేతి కిచ్చు వంటిది.
  • "నీ చేతి రాజ్యంబు నీదు పట్టంబు, గోఁచి చేతికి నిచ్చి కోరి కైకొనియె." వర. రా. అయో. పు. 373. పంక్తి. 14.
  • "ఏచి వల్లము దోఁచి గోచి చేతికి నిచ్చి, చిఱుతసన్యాసిఁ జేసినపిసాళి." (తె. జా.)

గోచిపాతరాయడు

  • సన్యాసి, దరిద్రుడు. చింతా. 2. 13.
  • "వాని కే ముంది? వట్టి గోచిపాతరాయడు." వా.

గోచిపాతరాయడు దొంగల మిండ డనుమాట

  • లేనివాడు దొంగలకు భయపడవలసిన పని లే దను మాట.
  • "రమణి గోచిపాఁతరాయఁడు దొంగల, మిండఁ డనెడుమాట మేలు దెలిసి." కుచే. 3. 47.

గోచి పెట్టక ముందునుంచే

  • చాలా చిన్నతనంనుంచే అనుట.
  • "వాడు సరీగా గోచి పెట్టక ముందు నుంచే నాకు తెలుసు."

గోచి పెట్టిన నాటినుంచీ

  • చిన్నతనంనుంచీ, బాల్యం నుంచీ.
  • "వాణ్ణి గోచి పెట్టిన నాటినుంచీ నాకు తెలుసు. నా కేం అతడు కొత్త గనకనా?" వా.
  • రూ. గోచి పెట్టడం రాకు ముందు నుంచే.

గోజాడు

  • పీడించి అడుగు. బ్రౌన్.

గోజులాడు

  • చూ. గోజాడు.

గోటితో పోవుపనికి గొడ్డలి యెందుకు?

  • సులువుగా నెరవేరుపనికి విశ్వప్రయత్న మెందుకు? ముందే జాగర్త పడితే సులువుగా అయ్యేపనికి ఆలస్యం చేస్తే మహాప్రయత్నం కావలసి వస్తుంది - అని కూడ.
  • ఏ చిన్న మొక్కగానో ఉండగా గోటితో తుంచి వేస్తే పోతుంది. అప్పుడు ఆపని చేయక మానుగా పెరగనిస్తే, గొడ్డలితో గానీ నరకడానికి వీ లుండదు. ఈ సత్యాన్ని తెలిపే పలుకుబడి.
  • "గొనకొన గోట నౌపనికి గొడ్డలి యేటి కటంచుఁ బల్కె." తారా. 4. 160.

గోడకాలు

  • కరగోడ.
  • "కమ్మతేనియ నీళ్ళు గట్టి పుప్పొడి మట్టి, గోడ కా ల్దీర్చినప్రోడతనము." రా. వి. 3. 81.

గోడకు చెవు లుంటాయి.

  • ఎవరైనా వినగలరు జాగ్రత్త అనుపట్ల ఉపయోగించే మాట.
  • "కాస్త మెల్లిగా మాట్లాడు. గోడకు చెవు లుంటాయి." వా. గోడకుర్చీ వేయించు
  • బడిలో పిల్ల వానిని గోడ కానుకొని కుర్చీలో కార్చున్నట్టుగా అడుగున ఏ ఆధారం లేకుండగా కూర్చుండ బెట్టి ఉపాధ్యాయుడు శిక్షించు.
  • పూర్వం వీధిబళ్లలో యిది అనుదినం కనిపించేది.

గోడ గడుగ పోతే కొనదాకా రొంపే

  • అసులుతోనే కట్టినగోడను ఎంత కడిగినా అసులే అవుతుంది.
  • గొంగడిలో వెండ్రుకలు ఏరినట్టు వంటి మాట. తాళ్ల. సం. 9. 279.

గోడగించు

  • 1. పాట పాడు.
  • "మగతుమ్మెద ప్రోడలు గోడగించు ఝుం,కారము కార మయ్యె." కవిక. 3. 87.
  • 2. మించు, పోటీపడు.
  • "మండు వేసవినాఁటి మార్తాండ బింబంబు, గోడగించు పసిండి గుబ్బ తోడ." కాశీ. 4. 294.

గోడచేర్పు

  • ఎప్పుడూ గోడకు చేర్లబడి ఉండేవాడు - సోమరి అనుట.
  • "మొండరి చల్లచప్పుడు గోడచేర్పు, చండిపో తనునట్టి జాడ నున్నాడు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1497-98.

గోడచేర్పు ప్రతిమ

  • పనికి రానివాడు. ఉత్సవవిగ్రహం వంటివా డనుట. తాళ్ల. సం. 3. 640.

గోడ దుమికే వయసు

  • యౌవనము.
  • గోడ దుముకుట వ్యభిచార సూచకము. దానిపై వచ్చిన పలుకుబడి.
  • "వా డిప్పుడు గోడ దుమికే వయస్సులో ఉన్నాడు. అలా చేయక ఎలా చేస్తాడు?" వా.
  • చూ. గోడలు దుముకు.

గో డనబోవు

  • మొఱబెట్టుకొన బోవు.
  • "కుబేరుఁ డేఁగె న,ద్దనుజుల నింత చేసిన విధాతకు గోడనఁ బోవుచాడ్పునన్." ఉ. హరి. 1. 42.

గోడ నిక్కి చూచు

  • కుతూహలంతో దారిని పోవు వారిని దొంగ చూపులు చూచు.
  • "గోడ నిక్కి చూచుఁ గొప్పు దీర్చు....బంధకీవధూటి." జైమి. 3. 29.

గోడపురువు

  • నల్లి.

గోడపెట్టు, చెంపపెట్టు

  • రెండువైపులా దెబ్బ తగులు.
  • "తలఁప నెదురుఁ దమ్ము దెలియని వానికిఁ జేరి గోడపెట్టు చెంపపెట్టు." హరిశ్చం. (వీర) 3. 76. పే.

గోడపై సున్నము

  • అశాశ్వతము. తాళ్ల. సం. 3. 546.

గోడబారు

  • అందుబాటులోనిది.
  • గోడకు చేరగిలబడుటకై పొడవుగా గుండ్రముగా కుట్టి యుంచిన దిండు.
  • "ముష్కరత్వము వాని ముంగొంగు బంగారు, కూహకత్వము వాని గోడబారు." రామలిం. 12.

గోడమీద పిల్లి

  • ఎటు గాలి వీచితే అటుతిరిగే రకం.
  • "వాడు గోడమీది పిల్లి. ఏ వైపు ఎప్పుడు మొగ్గుతాడో నమ్మడానికి వీలు లేదు." వా.

గోడమీది సున్నము

  • ఉపయోగించుకొన వీలు లేనిది. తాళ్ల. సం. 7. 34.
  • చూ. గోడపై సున్నము.

గోడలు దుముకు

  • వ్యభిచరించు, కట్టు తప్పి ప్రవర్తించు.
  • "మావాడి పెండ్లి ఏం తొందర వచ్చిందయ్యా ! అప్పుడే. గోడలు దుముకుతున్నాడా? తడకలు తోస్తున్నాడా?" వా.

గోడలు పైడి సేయు

  • ఎంతైనా సంపాదించ గలుగు. గోడలు కూడా బంగారువి కట్టించగలం అనుట.
  • ఇప్పటికీ వాడుకలో 'నేనూ ఆవిధంగానే సంపాదించి ఉంటే యీపాటికి బంగారు గోడలు కట్టించి ఉండనా?' - అని అనడం కలదు.
  • "ఊర నీవు నే, నును గడియింపఁ జొచ్చినఁ దనూభవ! గోడలు పైఁడి సేయమే?" శుక. 3. 76.
  • "నీవూ నేనూ సంపాదిస్తే బంగారు గోడలు కట్టించ లేమా?" వా.

గోడా గొట్టా లేకుండా మాట్లాడు

  • యథేచ్ఛగా మాట్లాడు.

గోడాడు

  • బాధ పడు, విలపించు.
  • "తలపోఁత బ్రాఁతె తలఁపులకుఁ దమ కొలఁ దెఱుంగని మతి గోడాడఁగా." తాళ్ల. సం. 5. 41.
  • "ఆడపిల్ల నిట్లా గోడాడించడం మంచిది కాదు." వా.

గోడిపట్టెలు

  • ఒక పిల్లల ఆట.
  • "గుళ్లు దాగిలిముచ్చులు గోడి పట్టెలు..." వి. పు. 7. 202.

గోడివడు

  • ఒరగడ్డంగా వాలు.
  • "గోగణము ముంగలిగ నేల గోడి వడఁగ, నడచు కౌరవరాజసైన్యంబుఁ గనియె." భార. విరా. 4. 250. గోడి వెట్టు
  • ఏటవాలుగా పెట్టు. శ. ర.

గోడు కుడుచు

  • గోడు పెట్టుకొను.
  • "జళుకు పుట్టించి నీ సకలరాజ్యంబు, గోడు గుడువఁ బుచ్చుకొని." గౌ. హరి. ప్రథ. పంక్తి. 1774-75.
  • "క్రేపునిదల్లు, లాస్థఁ దన్నంగ నమ్మహావస్థ చేత, గోడి గై పుట్టియును గోడు కుడువ వలసె." హంస. 4. 32.
  • చూ. గోడు పెట్టుకొను.
  • రూ. గోడు గుడుచు.

గోడు కుడుపు

  • కష్టపెట్టు. కాశీ. 7. 95.

గోడు గోడున నేడ్చు

  • ఎక్కువగా ఏడ్చు.
  • ధ్వన్యనుకరణము.
  • "ఆ మాయలాడి యపు డా, కోమలి మొగడు గని గోడుగోడున నేడ్వంఁగా మఱియు వెరవు దోఁపఁగ గ..." శుక. 2. 42.
  • రూ. గోలు గోలున నేడ్చు.

గోడు పెట్టుకొను

  • వేధించు. బాధించు.
  • "వాడు నా గోడు పెట్టుకొంటున్నాడు." వా.
  • చూ. గోడు పోసుకొను.

గోడు పోసుకొను

  • బాధించు, వేధించు.
  • "వా డెప్పుడూ ఊళ్లోవాళ్ల గోడు పోసుకొంటూ ఉంటాడు." వా.
  • చూ. గోడు పెట్టుకొను.

గోడు సేయు

  • ఓడగొట్టు.
  • "కోటిచంద్రుల డాలు గోడు సేయఁగఁ జాలు, మొగము కుంకుమచుక్క సొగసు గుల్క." వీధి. 9.

గోడ్రెప్ప కన్ను

  • ఱెప్పలు వాచిన కన్ను. పండితా. ద్వితీ. మహి. పు. 108.

గోతులు తీయు

  • 1. ద్రోహము తలచు.
  • "వాని కెప్పుడూ ఒకరిక్రింద గోతులు తీయడం అలవాటు." వా.
  • 2. శాస్తి చేయుటకు సిద్ధముగా ఉండు.
  • "తీసియె యుంచినార లటఁ వాని గోతులు." గీర. లోకా. 17.
  • "మీకోసం గోతులు తీసే ఉంచారు. వెళ్లండి." వా.

గోదావరి గలుపు

  • పరిత్యజించు, పాడు చేయు.
  • 'గంగలో గలుపు' వంటిది.
  • "కులము గోదావరిఁ గలిపి వేశ్యాసంగ, మాసచేఁ గావించితే సుపుత్ర." నిరంకు. 2. 83.
  • చూ. గంగ కలుపు.

గోనె బట్టిన బంక

  • వదలనిది. తాళ్ల. సం. 11. 3. భా. 125.

గోపాల మెత్తు

  • భిక్ష మెత్తు.
  • 'అమ్మా గోపాలం' 'తాయీ కవఖం' అంటూ బిచ్చ మెత్తు టపై వచ్చినది. మాదాకవళ మన్నట్లే సందగోపాల మనుటా అలవాటు.
  • "గోపాల మనుచు, వీధి నెవ్వారు నుడివిన వెక్కిరించు." విప్ర. 3. 15.

గోపిచందనం

  • ఒకజాతి సుద్దమన్ను. పచ్చగా ఉంటుంది. వైష్ణవులు బొట్టుగా ఉపయోగిస్తారు.

గోప్రవేశము

  • సాయం వేళ, గోధూళివేళ.

గోముఖవ్యాఘ్రము

  • పైకి మంచిగా ఉంటూ లోపల చెడుగుణము కలవాడు.
  • "తనకు నేల యమృతధామాఖ్య గోముఖ, వ్యాఘ్ర మనఁగ నిట్టివాఁడె సుమ్ము." కళా. 6. 268.

గోరం గడుతేరుపనికి గొడ్డలి యేల?

  • చిన్నదానికి పెద్ద ప్రయత్న మెందుకు?
  • "నేరుపు లేటికిఁ జూపను, గోరం గడతేరుపనికి గొడ్డలి యేలా?" రుక్మాం. 2. 127.
  • చూ. గోటితో పోవుపనికి గొడ్డలి...

గోరంత

  • కాసంత.
  • "వాడికి గోరం తైనా కనికరం లేదు." వా.

గోరంత ప్రొద్దు

  • 1. కాసేపు.
  • "వారును దాను నవారితశక్తి, గోరంత ప్రొద్దు మేకొని కట్టు బిగిచి." బసవ. 3. 65.
  • 2. కొద్దిగా ప్రొద్దున్న దనుట.
  • "గోరంత పొద్దైనా లేదు. మనం పోవలసినదూరం చాలా ఉంది." వా.

గోరంతలాట

  • ఒక బాలక్రీడ. పండితా. ప్రథ. పురా. పుట. 460.

గోరం జీరు

  • గోటితో గీరి సైగ చేయు.
  • "కంటికిం బ్రియం బైనవానిం గామించియు గోరం జీరియుఁ గొంత యాస తీర్చుకొని." శుక. 2. 10.

గోరంతలు కొండంతలు చేయు

  • చిన్న దానిని పెద్దగా చేయు.
  • "ఎంతకుఁ దెచ్చెనే సరసిజేక్షణ చెయ్దము లిందుమీఁద జ,న్మాంతరవర్తనంబు హృదయంబున కిత్తఱి నెచ్చరించి గో,రంతలు కొండ లంత లగునట్లుగఁ జేసితి మంచుఁ జేటికా,వాంత సతాళవృంత మృదువాతహిమాంబుకణాళిఁ జేర్చినన్." ఆము. 5. 77.
  • "వాని కెప్పుడూ గోరంతలు కొండంతలు చేసి చెప్పడం అలవాటు. వాడేదో మాటవరసకు పలకరిస్తే త నేదో మిత్రు డంటున్నా డేమిటి?" వా.

గోర దివియగా నే ఱై పాఱు

  • కొంచెము కల్పించుకొను టతో విపరీతముగా పరిణమించు.
  • గోటితో గీఱినంత మాత్రాన ఏ ఱై పాఱునంతటి ప్రవాహము వచ్చిన దనుట వాచ్యార్థము.
  • "ఇల నిట్టలి గోరఁ దివియ నేఱై పాఱున్." కళా. 5. 63.

గోరపడు

  • ఆశపడు.
  • "గోరపడి గడించేవి కోట్లకొలఁదులు, తారి తూరి నోటికిఁ దగ్గంత గాదు." తాళ్ల. సం. 9. 249.

గోర బోవుటకు గొడ్డలి తాళ్ల. సం. 9. 285.

  • చూ. గోటితో పోవుపనికి గొడ్డలి యెందుకు?

గోర బోవుపనికి గొడ్డలి యేల?

  • స్వల్పశ్రమతో సరిపడు దానికై పెద్ద ప్రయత్నము చేయు టెందుకు? కళా. 7. 267.
  • చూ. గోటితో పోవుపనికి గొడ్డలి యెందుకు?

గోరవోవు

  • మొక్క పోవు.
  • "నోరిమాటకుఁ దన కేమి గోర వోయె." భాగ. స్క. 4. 42.
  • వాడుకలో మొక్క పోవు అనుటే నేటి అలవాటు.
  • "ఏ మయిందే అదామాటంటే నీ కేం మొక్క పోయిందా?" వా.

గోరింపు బంతులు

  • ఒక పిల్లల ఆట.

గోరింపు లాడు

  • గోరాడు - కొట్టి కోరాడు.
  • "తొలి వేలుపుల మూక దురములో గోరింపు, లాడి తాండవ మాడునట్లు గాదు." నిరం. 3. 9.

గోరిడు

  • గిల్లు.
  • "మడిచి యందిచ్చునపుడు గో రిడుదుఁ గేల." నైష. 8. 84.

గోరీ కట్టించు

  • రూపు మాపు.
  • "గోరీ కట్టింపమె కాకవిప్రతతి కర్థిన్ నేఁడు హేలాపురిన్." నానా. 148.

గోరు గల్లు

  • గోళ్ళు తీసే మంగలిసాధనం.
  • "పదను గోరుగండ్లఁ బదరక కొందఱ, కండ్లు వెఱికి." సానందో. 3. 108.
  • రూ. గోరుగోలు.

గోరు గాలము

  • గోరులాంటి కొనగల గాలము.

గోరుగొండి

  • మొన వాడిగా పలుచగా తట్టి చేసిన ఇనుప కడ్డీ. నేడీ మాట గోళ్లు తీయుట కుపయోగించే మంగలి కొఱముట్టునకే ఉపయుక్త మవుతున్నది.
  • "గోరుగొండ్లును యామికులు కొని తేర." పండితా. ద్వితీ. మహి. పుట. 22.
  • రూ. గోరుగోలు.

గోరుచిక్కుడు

  • ఒకొక ప్రాంతంలో ఒకొక పేర పిలువబడు చిక్కుడులో ఒక జాతి.
  • మొటిక్కాయ, గోరు చిక్కుడు, సౌళేకాయ అని దీనికే పేళ్ళు,

గోరు చీరణము

  • ఒక రకమైన ఉలి. శ. ర.

గోరుచుట్టు

  • గోటి క్రింద వ్రేలికొసన లేచే కుఱుపు.

గోరుచుట్టుపై రోకటిపోటువలె

  • ముందే బాధ భరింప లేక ఉండగా దానిపై మరింత బాధ యేర్పడుపట్ల ఉపయోగించే సామ్యం. వలెకు బదులు ఉపమావాచకా లన్నీ ప్రయుక్త మవుతాయి.
  • "కాఁక నెదిర్చి సంగరముఖంబున హెచ్చిన రాజవంశమున్, గూఁకటి వ్రేళ్లతోఁ బెఱికి గోత్రవధంబును జేసి నట్టి యా,వ్రేఁకపుఁగీడు గాక ప్రజ వేచఁ దలంచిన గోరుచుట్టుపై, రోఁకటి పోటుచందముగ రోసి జనుల్ ననుఁ జూచి తిట్టరే?" జైమి. 1. 64.
  • చూ. గోరుచుట్టుమీద....

గోరుచుట్టుమీద రోకటిపోటు

  • రాధా. 2. 175.
  • చూ. గోరుచుట్టుపై....

గోరుపడము

  • నల్ల కంబళి.

గోరుపు లాడు

  • బంతి యాడు.
  • "గురుకుచ గుబ్బచన్నుఁగవ గోరుపు లాడును బుట్టచెండ్ల..." చంద్రా. 2. 122.

గోరుముద్దలు

  • చిన్నపిల్లలను మరిపించి తినిపించు ముద్దలు, తల్లి పిల్లనికి పెట్టే ముద్దలు.

గోరుముష్టి

  • గోజాడి అడుగుకొని తినుట. గోరు మునిగేదాకా పెట్ట మని పిల్లలు తోడిపిల్లలవద్ద ఉన్న తినుబండారాలను కొసరి కొసరి తీసికొనుటపై వచ్చినది.
  • చూ. గోర్ముష్టి.

గోరు మోపేంత స్థలం కూడా

  • చాలా కొద్ది స్థల మైనా (లేదు).
  • "వాళ్లింట్లో గోరు మోపేంత స్థలం కూడా లేదు. బంధుబలగం అంతా వచ్చి వాలింది." వా.

గోరు రాజనాలు

  • ఒక రకమైన ధాన్యం.

గోరువెచ్చ

  • నులివెచ్చ.
  • గోటికి వెచ్చగా కనిపించేంత అనుట.
  • కవోష్ణం.
  • "గోరువెచ్చ నీళ్లల్లో స్నానం చేయడం మంచిది." వా.

గోరొత్తులు

  • నఖక్షతములు.
  • "నెమ్మోవి పీడఁ జింతిలు పరాకునఁ బోలె, గోరొత్తులకుఁ జనుగుబ్బ లొసఁగి." కళా. 7. 166.

గోర్గొండి

  • గోరుగల్లు.
  • "వాడి గోర్గొండిఁ గన్నులు దోడియైన." భీమ. 6. 100.
  • చూ. గోరుగొండి.

గోర్పిళ్ళార్చు

  • చెండువలె ఎగుర జేయు. రామా. 6. 206.

గోర్ముష్టి

  • గోరుముష్టి.
  • "ధీ, యుతు లౌవారికి సైతమున్ గట కటా! యూరూర గోర్ముష్టి యే, గతి." నానా. 75.
  • చూ. గోరుముష్టి.

గోలతనము

  • అమాయకత్వము.
  • "పెన్, గోలతనంబునన్ మగఁడు కొట్టిన." పాండు. 4. 144.

గోవతనము

  • దుర్మార్గము.
  • "మీవీటిమ్రుచ్చు లేవురు, మావీటం గన్న పెట్టి మణిభూషణముల్, గోవతనంబునఁ దెచ్చిరి, నీ విటు సేయించు టెల్ల నేరమ కాదే." దశ. 4. 24.

గోవ మొలత్రాడు

  • మొలతాడు.
  • మగవాని మొలత్రా డని శ. ర. ఆడవాళ్ళకు మొలతాడు వేసుకునే ఆచారం అరుదు మఱి!

గోవాళ్ళు (ళులు)

  • యువకులు, విటులు.
  • "తిమిరంపు వయసు గుబ్బల, కొమరాలవు నీకుఁ దగినగోవాళ్ళ మహిన్, నెమకి గనరాదె ముఱిసిన, మముఁ జెనకిన నేమి గలదు మద మేమిటికిన్?" మను. 4. 83.

గోవావుల కోడెలు

  • పోట్లమారి కోడెదూడలు. గోవావు లనగా దుష్ట మగు గోవు లని వావిళ్ల. ని.
  • "తలపోఁతల్ దల లెత్తెఁ దాల్మి సడలెం దాపంబు దీపించె జేఁ,తలు డిందెన్ ధృతి వీడుకోలు గొనియెన్ దైవాఱెఁ కన్నీరు కో,ర్కులు గోవావుల కోడె లై నిగిడె సిగ్గుల్ దూర మై పోయె." విక్ర. 4. 154.

గోవింద కొట్టు

  • నిరసనగా చనిపోయె ననుపట్ల ఉపయోగించే మాట.
  • "తన మామ తన కేదో యిస్తా డని వీడు ఆదరా బాదరా పరిగెత్తాడు. ఈ లోగా వాడు గోవిందా కొట్టాడు. సరి పోయింది." వా.
  • "వాడు గోవింద కొట్టా డట. నీకు తెలుసా?" వా.

గోవిందా అనిపించు

  • ఇక చాలు రా అనిపించు.
  • "గో,విందా యనిపించుకవులు వేవేలు సుమీ." గీర. గురు. 20.

గోవువెంట తగులు కోడెభంగి

  • ఎప్పుడూ విడువక - వెన్నంటి అనుట.
  • కాస్త విద్యావంతులు సంభాషించుకొనునప్పుడు ఉపయోగించే పలుకుబడి.
  • ఇది భాఫవతంలోని ఒకా నొక పద్య భాగం.
  • "వా డెప్పుడూ ఆ అమ్మాయి చెరుగు వదిలేట్టు లేడు. గోవువెంట దగులుకోడె భంగి అన్నట్లుగా ఉంది వీడి వ్యవహారం." వా.

గోసడచు

  • నిందించు.
  • "మనలన్ ధూర్జటితోడ గోసడఁచి కామధ్వంసి పట్టీక పొం,డని చక్రాం కునిఁ జూపి..." నిర్వ. 2. 93.

గోసన వుచ్చు

  • చాటించు, ఘోషణ చేయించు, ఘోషించు.
  • "గోసనంబులు వుచ్చి సర్వస్వదాను లగుచుండిరి." కుమా. 11. 59.
  • "దాసియున్, గొఱగొఱ వీట నెల్లెడల గోసన పుచ్చిన." దశ. 10. 126.
  • "తనదుర్వారతరప్రతాపమునఁ జిత్త స్నేహముల్ గట్టి సే,యు నితం డెట్టి విదగ్ధుఁడో దలఁప నోహో యంచు లోకంబు గో,సనపుచ్చన్." దశ. 1. 7.
  • రూ. గోసన పుచ్చు.

గోస నాస ఉదయించు

  • ఘోషణ బయలుదేరు. ఊరంతా గుప్పు మను.
  • "శాఖోపశాఖల సాఁగుచున్నది రట్టు, గుఱి లేక యుదయించె గోస నాస." శివ. 3. 71.

గోళ్ల కుతికంటు

  • ఒకనగ.
  • "....గోళ్ల కుతికంటు నునిచె నొకతె." రాధి. 1. 93.

గోళ్లు గిల్లుకొను

  • ఏ పని పాటా లేక ఉండు.
  • "వాడు పొద్దస్తమానం గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే ఆవిడ మాత్రం ఏం చేస్తుంది?" వా.

గోళ్లు మీటు

  • గోళ్లు గిల్లుకొను. నిర్వ్యాపారిగా ఉండు.
  • "పనుల కొడ ల్వంగక కా,మిను లిద్దఱుఁ గూడి గోళ్లు మీటుచు దాదుల్...." శుక. 2. 333.
  • "వాడు పని లేక గోళ్లు గిల్లుకొంటూ కూర్చున్నాడు." వా.

గోళ్లు రాచు

  • కలబడు, రాపాడు.
  • "ఆ యెల ప్రాయమున్ భవదుదంచిత కీర్తియు గోళ్లు రాచఁగాఁ, గాయజుఁ డాకెపై నలిగి కత్తులు నూఱుచు..." కళా. 7. 35. గౌడుగీతములు
  • ఒక విధ మైన జానపదగీతములు.
  • నా డివి వానిలో ఒకవిధ మైన నిర్దిష్టవిభేదం కావచ్చును.
  • "గౌడుగీతములు వాడుచు." కుమా. 6. 45.

గౌతముని గోవు

  • తగిలితే చాలు పడి చచ్చి పాపము చుట్టుకొనునట్లు చేయునది. ఒక కథపై వచ్చిన పలుకుబడి.
  • "ఒండొకఁడ వైన నిపుడు నీపిండి యిడమె, బ్రాహ్మణుఁడ వౌట మా చేత బ్రదుకుఁ గంటి, తడవఁ బని లేదు నిన్ను గౌతముని గోవ, వనుచు వాదించి విడిచిన నాగ్రహించి." మను. 4. 90.

గౌదకట్టు

  • అట్లు కట్టిన కట్టు. ఆము. 6. 81.

గౌరి కుంకుమలు

  • ఒక రకమైన ధాన్యం. హంస. 4. 128.

గౌరుకాకి

  • బొంతకాకి. బ్రౌన్.

గౌళి పలుకు

  • బల్లి శకునం.
  • ఫలానా వారం ఫలానా దిక్కున పలికితే ఫలానా ఫల మని చెప్పే ఒక శకున శాస్త్రం.

గ్రక్కదలు

  • కదలి పోవు.

గ్రక్కిలువడు

  • సడలి పోవు.

గ్రక్కుమి క్కనక

  • కి మ్మనకుండా - ధ్వన్యనుకరణ మై ఉంటుంది. ఇలాంటి వింకా - కయ్ కుయ్ అనకుండా - కిమ్మనకుండా - ఆ ఊ అనకుండా - కిక్కురు మనకుండా...
  • "కదలక మెదలక గ్రక్కుమిక్కనక." పండితా. ప్రథ. పురా. పుట. 303.

గ్రక్కు మిక్కన లేక

  • ఏమీ అన లేక, కిక్కురు మనకుండా. ధ్వన్యనుకరణము.
  • "అక్కిళ్ళు వడి గ్రక్కు మిక్కన లేక, యున్న వారలఁ జూచి." బస. 6. 179.

గ్రగ్గులకా డగు

  • ఛిన్నా భిన్నత నొందినవారగు.
  • "తలలు వీడంగ విద్యాధరుల్ పఱచిరి, గ్రగ్గులకాం డ్రైరి ఖచరవరులు." పారి. 5. 37.

గ్రచ్చ కదిలినట్లు

  • గ్రచ్చపొద కదిలించినట్లు గలగల మని. గ్రచ్చపొద కదిలించినప్పుడు గలగల మని గచ్చ కాయలు రాలును. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "పుణ్యవాహిని నిటు వా,క్రుచ్చితి వని వడి నందఱు, గ్రచ్చ కదలినట్లు గువ్వ కరిగొని తిట్టన్." జైమి. 4. 72.

గ్రచ్చపొద కదలించినట్లు

  • గలగల మని.
  • "కుచ్చితురా లైన యచ్చపలలోచనం జూచి పౌరు లందఱు గచ్చుకొని గ్రచ్చపొద గదిలించినకైవడి విచ్చలవిడి నోరికి వచ్చినట్లు వెచ్చానికి వచ్చు వారును." సారం. 3. 217.
  • చూ. గ్రచ్చ కదలినట్లు.

గ్రద్దగోరు

  • దొంగల పనిముట్లలో ఒకటి.

గ్రహచారము

  • దురదృష్టము.
  • గ్రహబలము సరిగా లే దనుట.
  • గ్రహసంచారం బట్టి జీవితంలోని ఎగుడుదిగుడు లుంటాయన్న జ్యోతిశ్శాస్త్రం పై ఏర్పడినది. కాని చెడుగా ఉన్న దన్న అర్థంలోనే గ్రహచారం ఉపయుక్తం కావడం విశేషం.
  • "వాడి గ్రహచారం అలా ఉంది.అందుకే పా డయి పోయాడు." వా.

గ్రహచారము చాలని

  • గ్రహబలము చక్కగా లేని. దురదృష్టపుదినా లనుట. జ్యోతిశ్శాస్త్ర రీత్యా వచ్చిన పలుకుబడి. వీరనారాయణ శత. 20.
  • "గ్రచారం చాలనప్పుడు ఏం చేసినా వ్యతిరిక్తమే అవుతుంది." వా.

గ్రామాశ్వము

  • గాడిద.

గ్రామ్యకర్మము

  • మైథునము.

గ్రామ్యధర్మము

  • మైథునము.
  • "....ప్రాయంపు టింతులకును గ్రామ్య ధర్మంబు లేకున్నఁ గలుగు దు:ఖ మెం తని వచింప వచ్చునో." హంస. 3. 206.
  • చూ. గ్రామ్యసుఖము.

గ్రామ్యసుఖము

  • మైథునము.
  • చూ. గ్రామ్యధర్మము.

గ్రాసవాసములు

  • తిండీ, బట్టా.
  • "వచ్చు నాదాయములు గ్రాసవాసములకుఁ, గాఁగ దినములు గడపె..." హంస. 2. 152.

గ్రాసవాసోదైన్యం

  • తిండికీ బట్టకూ లేక పోవుట.

గ్రుక్కగొను

  • త్రాగి వేయు.
  • "అక్కజంబుగ నబ్ధి నాపోశనముగ, గ్రుక్క గొన్నట్టి యా కుంభజుఁ డుండ." హరిశ్చ. పూర్వ. 302. పం.

గ్రుక్కలు పెట్టు

  • త్రాగు.
  • "కిక్కరు మన కమృతంబును, గ్రుక్కలు పెట్టుదురు సురలు." హర. 6. 122.

గ్రుక్కలు మ్రింగు

  • గ్రుక్కిళ్లు మ్రింగు.
  • "గ్రుక్కలు మ్రింగుచున్ వెడగు గొల్లల సుద్దుల నెంత పాడినన్." గుంటూ. ఉత్త. 12.

గ్రుక్కి ళ్ల వియు

  • ఊపిరి యాడక పోవు.
  • "గ్రుక్కి ళ్లవియంగఁ జొచ్చెరవికిన్." కవిక. 2. 150.

గ్రుక్కిళ్లు మ్రింగు

  • 1. గుటకలు మ్రింగు.
  • "గ్రుక్కిళ్‌ మ్రింగఁగఁ గ్రొత్త నెత్తురుల వాగు ల్పాఱఁ గ్రవ్యాదులున్." కా. మా. 2. 52.
  • "గ్రుక్కిళ్లు మ్రింగుచు." రాధా. 4. 105.
  • 2. ఆశతో - గుటకలు వేయు.
  • "నాకబలి సంవిధానంబు లాచరించు వారలఁ గనుంగొని గ్రుక్కిళ్లు మ్రింగియు..." శుక. 2. 160.
  • "కోకిలవ్రాతంబు గ్రుక్కిళ్లు మ్రింగించు." హర. 3. 38.

గ్రుక్కుమి క్కనక

  • ఒక్క మాట పలుకక.
  • "నిర్ఝీవులుం బోలె గ్రుక్కు మిక్కనక పక్కెరలు పైఁ ద్రోచుకొనియును." పారి. 5. 13.

గ్రుక్కుమిక్కు రనక

  • ఒక్క మాట అనకుండ.
  • "గుండియలు గ్రుళ్లఁ దన్నిన గ్రుక్కు మిక్కు, రనక యాతని కినుక చల్లాఱ నిచ్చి." శుక. 3. 627.

గ్రుచ్చి కౌగిలించుకొను

  • గట్టిగా కౌగిలించుకొను.
  • "నీకంటె మోహంపుదేవు లెవ్వ రంచు సతిని గ్రుచ్చి కౌఁగొలించుకొని యెత్తి యక్కున...." కళా. 7. 235.

గ్రుచ్చి గ్రుచ్చి యడుగు

  • చెప్పు చెప్పు మని బలవంతము చేసి అడుగు
  • "....ఇంతకు మున్నిది యెన్నండును విన్న యది గా దిప్పు డెప్పగిది నొదవెఁ జెప్పు మని గ్రుచ్చి గ్రుచ్చి యడుగ..." కళా. 1. 202.

గ్రుచ్చెత్తు

  • అద్ది యెత్తు, ముంచు.
  • "గొజ్జంగినీరున గ్రుచ్చెత్తి కపురాన, రంగు మీఱ లోన రంగు వైచి." చమ. 1. 88.

గ్రుడ్డింగిలాయి

  • ఒక రకమైన చేప. శ. ర.

గ్రుడ్డికన్ను పాదుసా

  • కుబేరుడు.

గ్రుడ్డికామంచి

  • గొడుగుగడ్డి. శ.ర.