ఒళ్లు____ఓగు 317 ఓచె____ఓట

ఎక్కడ పెట్టావో తెలియకపోతే ఇంకేం చేస్తావు?" వా.

ఒళ్లు హూన మగు

  • శ్రమతో అలసిపోవు.
  • "పొద్దున్నుంచీ తిరిగి తిరిగీ ఒళ్లు హూన మై పోయింది." వా.

ఓం అను

  • అంగీకరించు.
  • "ఆమె యి రాయబారమున కత్యధిక క్రుధ బూని భాస్కరుం, డో మని భీమనాదరభసోచ్ఛ్రిత... భేదవాదవా, త్యామయ చక్ర చంక్రమతతంబుగ బోరంగ..." శంకర. విజ. 5. 60.

ఓంకార మాచరించు

  • అంగీకరించు.
  • "అభిలషింపంగ వోంకార మాచరించు." నైష. 2. 69.

ఓంప్రథమంలో

  • మొట్టమొదట.
  • "ఓంప్రథమంలోనే త ప్పుంటే యింక ఆ పుస్తకం సంగతి చెప్ప నక్కఱ లేదు." వా.

ఓ అంటే ఓ అను

  • పిలిస్తే పలుకు.
  • "ఓ యన్న నో యనంగల యాయ మయే యున్న..." వి.
  • "ఓ అంటే ఓ అనడానికి కైనా ఎవరో ఉండొద్దా?" వా.

ఓగులవాడు

  • నాయకుడు, ఆదర్శము.
  • "పిఱికి, వారి కెల్లను నోగులవాని గాగ, నురముపై జీడి నిఱ్ఱి యచ్చొత్తి విడిచె." కుమా. 4. 16.
  • వావిళ్ళలో అధమాధమ చిహ్నుడు. మిక్కిలి తక్కువవా డనుగుర్తు గలవాడు అని అర్థం చెప్పి ఈ పద్యమే ఇచ్చారు. మొత్తం పద్యం అర్థ మంతా చెప్తే కుదరదు. 'పిఱికి వారిలో ఓగులవాడుగా' అంటే చాలా చాలా పిఱికివాడు అని అర్థం వస్తుంది. ఓగు లవా డంటేనే అధమాధము డైతే పిఱికి వారిలో ఓగులవాడుగా అని ఎందు కనవలసి వస్తుంది?

ఓ చెల్ల!

  • అమ్మక చెల్లవలెనే ఆశ్చర్యారకం.
  • "పులిగూడు దిండిగొఱగం, గలిచియు వోచెల్ల! యింత గల్పించెదు శ్రీ, గల వాని దగినపురుషుం, గలిచిన నీ కన్ను బొమయె గను డరు దనుమా." కుమా. 7. 43.

ఓజుకు వచ్చు

  • దారికి వచ్చు.
  • "రథ్యము లోజకు వచ్చి మెచ్చగా." భాస్క. యుద్ధ. 640.

ఓటకండ

  • పిఱికికండ, భయము.
  • "అజశిరోదళను డన్న దరు లేదేనియు గాలారి యనునోటకండ లేక...పంచె నట్టియుగ్రుపై నిన్ను." కుమా. 4. 61.

ఓటకండ సెడి

  • భయము లేక. ఓటా____ఓడ 318 ఓడ____ఓడ
  • "ఏమేమీ మది నోటకండ సెడి దేవేంద్రాదు లుద్వృత్తులై, నామీదం జనుదెంచిరే." కుమా. 10. 138.

ఓటాఱు

  • ఓతువడు.
  • "మెఱుగు నారసముల గిఱి కొలిపిన నోటాఱి." భార. ద్రోణ. 5. 138.

ఓటినోరు

  • మాట దాగనినోరు, వాగుడుకాయనోరు. ఓటికుండలో నీరు కారిపోయినట్లు, చెప్పినమాట బయటికి చచ్చి వేయు ననుట.
  • "వాడితో ఏం చెప్పకండి. వాడిది వట్టి ఓటినోరు. ఎక్కడో అనేస్తాడు." వా.

ఓటుపఱచు

  • ఓడించు; అధ:కైంచు.
  • "కోటచే వలయాద్రి నోటుపఱచు." కవిక. 1. 2.
  • "పోరాట నోటుపఱచి." రాధా. 5. 5.

ఓడకుడు

  • భయపడవలదు. హర. 6. 65.

ఓడ గట్టినదూల మగు

  • ఓడకు కట్టినదూలము ఓడను అనుసరించే ఎల్లప్పుడూ పోవునట్లు - తదధీనగతి యగు. నిరంతర సంబంధము కల దగు.
  • "ఓడ గట్టిన దూల మై యుండవలయు, మీకు మాకును నెన రైన మిత్ర భావము." ఉద్భ. 2. 211.
  • "ఓడ గట్టినదూల మీడు లేనిశుభంబు, చేకొద్దికుంచ మ శేషభూతి." చంద్ర. 1. 57.
  • "ఈ లింగములో బ్రాణము, కాలము గడదాక నోడ గట్టినదూలం, బై లంకె నుండ జేసితి." కా. మా. 3. 80.
  • చూ. ఓడతో గట్టినయోడవలె.

ఓడతో గట్టిన యోడవలె

  • నిరంతరసంబంధము గలిగి, తదధీనగతి యై.
  • "నెట్టన ధర్మనందనుడు ని న్న వలంబము సేసి యోడతో, గట్టినయోడవోలె గతగౌరవు డై కడు దూలె." భార. సభా. ద్వితీ.

ఓడబేరము

  • నౌకావ్యాపారము.
  • "ఒకని పొత్తు గూడి యోడబేరము వోయె,దను సదాన్న దాన ధనము కొఱకు." కళా. 6.99.

ఓడపై బ్రతుకు

  • అపాయకరము. ఓడలపై పోతుండగా ఏ నిమిష మయినా పమాదము రావచ్చు ననుట. వేంకటేశ. 36.

ఓడలు బండ్ల వచ్చు బం డ్లోడల వచ్చును.

  • కాలదేశాదులను బట్టి ఆధారాధేయములు మారు ననుట. నేలపై ఓడలు బండ్లపై రాక ఓడ____ఓడ 319 ఓడి____ఓన

తప్పదు; నీటిపై బండ్లు ఓడలపై వెళ్ళక తప్పదు.

  • "సర్వదైవతకులాధిప! యోడలు బండ్ల వచ్చు బం, డ్లోడల వచ్చు నొండొరుల కొక్కొకచో..." ప్రభా. 1. 94.

ఓడ వచ్చు

  • ఓడిపోవుటకు సిద్ధ మగు.
  • "నీయాట యోడ వచ్చినది యనియె." కళా. 6. 117.

ఓడ విడిచి వద రిడు కొను

  • గట్టిప్రాపును వదలి అనుమానాస్పద మైనప్రాపును పట్టుకొనెడిపట్ల ఉపయోగించే పలుకుబడి. ఓడను వదలిపెట్టి సొరకాయను పట్టుకొనుట అట్టిదే కదా! తాళ్ల. సం. 11. 3. భా. 38.

ఓడ విడిచి వదరు పట్టు

  • సులభోపాయ ముండగా తెలిసి తెలిసి అనుమానాస్పద మైన సాధనమును గ్రహించు.
  • "సురత, క్రీడాసౌఖ్యంబు వెడలి క్లిష్ట వ్రతచ, ర్యాడంబరముల దగులుట, యోద విడిచి వదరు పట్టు టుర్వీనాథా!" రుక్మాం. 4. 65.
  • "శకవరేంద్ర చంర చరణాబ్జసం సేవ,విడిచి యావిదర్భవిభుని గలసి, వచ్చు టోడ విడిచి వదరు పట్టుట సుమీ, చెప్ప దగినమాట చెప్పినాడ." విక్ర. 4. 64.
  • వాడుకలో రూపం:
  • "ఓడను వదలిపెట్టి సొరకాయను పట్టు కొన్నట్లు."
  • "అంత పెద్దకంపెనీని వదలిపెట్టి వాడేదో పదెక్కు విస్తా డని ఆ చిన్న కొట్టులో చేరడ మేమిట్రా? ఓడ విడిచి వదరు పట్టినట్లు?" వా.
  • చూ. ఓడ విడిచి వదరిడుకొను.

ఓడికలు గట్టు

  • కాలువలు గట్టు.
  • "అశ్రువ్రజం బోడికల్, గట్టన్ చూపులు చిమ్మ రేగి దివి రోలంబాళి గల్పింపగా." మను. 4. 68.

ఓడికవాగు

  • ఏ దైనా చెఱువుకో, పెద్ద కాలువకో గండిపడి చిన్నగా పాఱువంక - వాగు.
  • "ఓడిపాఱె వరుణు డులుకుచు నోడిక, వాగువోలె." కుమా. 2. 69.
  • "సురసింధు తోయముల గూడిన యోడికవాగుకైవడిన్." జై. 1.99.

ఓడున పోసినయుదకములు

  • ఊఱకే వ్యర్థ మై పోవునవి. ఓటిపాత్రలో పోసిన నీళ్లు.
  • "ఆడంబరంపు దేవార్చన లెల్ల, నోడున బోసినయుదకంబులట్ల." పండితా. ప్రథ. దీక్షా. పుట. 200.

ఓనమాలు రావు

  • ఏమాత్రం చదువు రాదు.
  • "వాడికే ఓనమాలు రావు. వాడు నీ కేం చదువు చెప్తాడు?" వా. ఓప____ఓప్రొ 320 ఓమ____ఓర

ఓప ననక

  • చేయజాల ననక.
  • "ఏమి యమరింతు వన్ని నాయింట నిండి, యున్న విప్పుడ యమరింతు నోప ననక." శుక. 3. 188.

ఓపనిది

  • భరింపరానిది.
  • "ఓపనిదాని దాల్పగా, నావశ మయ్య భూరిభువనత్రయదుర్వహభారమమ్మహా, దేవు నవార్యవీర్యము." కుమా. 10. 15.

ఓపిక లేక

  • ఓరిమి లేక; త్రాణ లేక. ఏదైనా పని చేయుటకు తగిన ఓరిమి లే దన్నప్పుడే రాయలసీమలో ఓపిక లే దన్నమాట ఉపయోగిస్తారు. తీరప్రాంతాల్లో త్రాణ లేదు. తగినంత బలం లేదు అన్న అర్థంలో ఓపిక లేదు అంటారు. ఇక్కడ రెంటికీ సరిపోతుంది.
  • "నడువ నోపిక లేక నడుమ నడుమ." కా. మా. 3. 193.

ఓపినట్లు

  • చేత నయినంతవఱకు.
  • "ఒసగి క్రోలిరి మైరేయ మోపినట్లు." శుక. 3. 118.

ఓ (ఒక) ప్రొద్దున లేచు

  • అర్ధ రాత్రంలో లేచు.
  • "వా డోపొద్దున లేచి పొలానికి వెడతాడు." వా.

ఓ మన్యథా యను

  • అంగీకారమునూ, వ్యతిరేకతనూ తెలుపు.
  • "ఓ మన్యథా యంచు నొరయు విద్వాంసుల, గోష్ఠి కెన్నడు గడగుఱుతు లేదు." కళా. 7. 19.

ఓ యను

  • పిలిచిన పలుకు; సిద్ధ మగు.
  • "ఒక యెలమావిక్రింద మరు డో యనగా నరు డుండె నయ్యెడన్." విజయ. 1. 212.

ఓ యింత ప్రొద్దు

  • చాలసేపు.
  • "ఓయింతపొద్దు ఏమీ తోచక అట్లా ఉండిపోతిని." వా.
  • రాయలసీమలో ప్రచురం.

ఓరంతప్రొద్దు

  • 1. ఒకరో జంతా.
  • "ఓరంత ప్రొద్దున నుపవసించె." కాశీ. 4. 133.
  • "ఓరంతప్రొద్దున నుందు రుద్రుండ నే, నటు గాన రుద్రదేహాఖ్య యయ్యె." కాశీ. 5. 10.
  • 2. కాసేపు.
  • "రతిసుఖంబుల జొక్కు నోరంత ప్రొద్దు." కా. మా. 2. 18.

ఓరచూపు చూచు

  • 1. అనాదరముగా చూచు.
  • "ఓరచూపు జూచేది న్యాయమా?" త్యాగరాజు.
  • 2. కడగంటి చూపు చూచు.
  • శృంగారసూచకము.
  • "సొగసి సొగయించు నెఱ యోర చూపు చూచి." హంస. 3. 81. ఓర____ఓర 321 ఓల____ఓసి

ఓరజాఱు లేక

  • తొలగి పోక. జం.
  • తొణకక బెణకక వంటిది.
  • "ఒక కొంతవడి యోరజాఱు లేక..(సైన్యములు రెండును పోరెను.)" సుదక్షి. 5. 87.

ఓరపారలు దిద్దు

  • తప్పొప్పులు సరి చేయు.
  • "సత్కవీంద్రులు రచియించి చదువు పద్య, సమితియం దోరపారలు చక్కదిద్ది." కువల. 2. 9

ఓరమో మిడు

  • 1. మొగము ప్రక్కకు త్రిప్పుకొను.
  • "హా! శ్రీహరీ!, యంచున్ బ్రాహ్మణు డోరమో మిడి తదీయాం సద్వయం బంటి పొ,మ్మంచున్ ద్రోచె." మను. 2. 68.
  • 2. అయిష్టతను సూచించు.<.big>
  • "తమకు మ్రొక్కం దారు మ్రొక్క కొక్కొంచుక యోర మో మిడి." ఆము. 4. 35.

ఓరలు వాఱ చూచు

  • ఓరగా చూచు.
  • "అతని నోరలు వాఱగ జూచు." భార. ఆసు. 1. 281.

ఓరలు వోనాడు

  • వంకలు పెట్టి దూషించు.
  • పె,ద్దల భీష్మాదుల ధిక్కరింప దగ దెత్తం జాల రీకైదు వో,రలు వో నాడకు." ఉ. హరి. 3. 13.

వోరవోవు

  • ప్రక్కకు తొలగు.
  • "గుఱ్ఱంబుల కుఱికి బడు వడ నఱిముఱి విసరిన నోర వోయిన సురియం జెరివి యవలీలం గాలుబలంబులపై బడి." భార. భీష్మ. 2.71.

ఓలగందము

  • స్నానము చేయునపుడు పూసుకొనుగందవొడి.
  • "ఓల గందపు బసుపులు నూని వెలుగు." రాధా. 5. 210.

ఓల మానగొను

  • 1. విశ్రాంతి గోరు.
  • "అతిథి నిను గోరె నేనియు, మతి గింకిరిపడక యోలమాస గొనక నీ, వతనికి బ్రియంబు సల్పుము." భార. అను. 1. 68.
  • 2. ఏకాంతము నభిలషించు.
  • "...ఉభయ, బలము బోటు లాడె జమనున నొక్కింత, యోల మాస గొనక యోలి నార్చి." నిర్వ. 4. 60.
  • "పృథ్వీశతనయ,యవని కాంతరమున నోల మాస గొనియె." నైష. 4. 97.

ఓలలాడు

  • తేలియాడు.
  • "తడబడ నోలలాడుచు హళాహళిగా బడి నీదులాడెడిన్." జైమి. 1. 28.

ఓలాడు

  • ఓలలాడు.
  • "క్రమ్ముతావి నోలాడుచు..." కుమా. 9. 102.

ఓసి యన్న నో యనూత కైన

  • జవా బిచ్చుట కైన. వాడుకలో - 'పిలిస్తే పలికే దిక్కు లేదు' మొద' లైన ఓహ____ఔగా 322 ఔగా___ఔద

పలుకుబడులలోని భావమే ఇం దున్నది.

  • "ఒక తె రూపసి గాకున్న నోసి యన్న, నో యనెడుమాత్రమున కైన నుండ వలయు." శుక. 3. 342.

ఓహరిసాహరిగా

  • హోరాహోరిగా.
  • "ఓహరి సాహరి నుయ్యాల చేరుగా, వెనుకొంచు దెరలుచు బెనగు నెడలు." భార. విరా. 3. 165.
  • "యుద్ధము సేయజాలకయ యోహరి సాహరి నెంత చెప్పినన్." శివ. 4. 62.

ఔ గా దనక

  • ఏమీ అనక. ఔను, కాదు - అనకుండా "భూనయకు డిది యౌ గా దన కీయెడ." సారం. 2. 273.

ఔగా దనక యుండు

  • న్యాయా న్యాయ నిర్ణయం చేయక మౌనము వహించి యుండు.
  • "నాకు మొగ మోడి యౌ గా దనరు తపస్వులు." పాండు. 5. 243.
  • "నే నింతదూరం మీతో మొఱపెట్టు కుంటే మీరు ఔను కాదు అని చెప్ప కుండా కూర్చుంటే నే నింక యెక్కడికి పొయ్యేది?" వా.

ఔ గా దను

  • అడ్డు చెప్పు; విమర్శించు.
  • "యాదవసింహ ! నా తలపు నప్పుడు వారల పా టొకింత యౌ, గా దను దాక లేదు గలకం బడ జొచ్చె." ప్రభా. 1. 83.

ఔ గాములు

  • మంచిచెడ్డలు; సత్యాసత్యాలు.
  • "దీని యౌగాము లన్నియు దెలిసి శిక్ష...." పరమయోగి. 3. ఆ.
  • చూ. అవ్య్గాములు.

ఔడు గఱచు

  • కోపముతో పెదవి గఱచు. కోపము వచ్చినప్పుడు సహజముగా పెదవి బిగించడం, పండ్లు కొఱకడం అలాంటివి చేస్తారు. వానిమీద వచ్చిన పలుకుబడి.
  • "కన్ను లెఱ్ఱగా నెగాదిగ గన్గొని యౌడు గఱచి దీని నాటదాని..." శుక. 4. 39.
  • రూ. ఔడుకొట్టు.

ఔడు మాయు

  • ఖండిత మగు. పెదవి దాటివచ్చు అని వావిళ్లని.
  • "అగ్ని నాలుక లేడు నౌడు మాసిన యప్పు, డుడురాజు పొట్ట గుజ్జుఱికి నపుడు." భీమ. 6. 44.

ఔదల యంటి చూచుకొని

  • దెబ్బ తిని. ఏ దైనా శాస్తి జరిగినప్పుడు ఒళ్లు యథాస్థితిలో ఉన్నదా లేదా అని పట్టి చూచుకొన్నాడు అన్న వ్యంగ్యార్థంలో ఉపయోగించే పలుకుబడి.
  • "సల సల మను కలశజు వె, గ్గలపుం గినుక యను వెసట గలవడి వడి నౌ