పదబంధ పారిజాతము/ఉ
ఈవు____ఈను 192 ఈసొ___ఉంకు
ఈవులరతనము
- చింతామణి.
ఈశ్వరివేరు
- వశీకరణౌషధము, పొగరడచునది.
- ఈశ్వరివేరును కట్టుకుంటే పాములు తలవంచి వశ మగునన్న నమ్మకంపై వచ్చిన పలుకుబడి. లక్షణయా వశము చేసుకొనునది.
- "నాదగ్గర వేరే ఊశ్వరివేరు ఉందిలే. దాంతో వాడు లొంగిపోతాడు." వా.
ఈషణత్రయము
- దారేషణ, ధనేషణ, పుత్రేషణ: భార్యాపుత్ర ధనాలపై ఆశ.
ఈసడ చేయు
- ఈసడించు.
ఈస పిట్ట
- ఒక జాతిచేప.
ఈసురో మను
- కళాకాంతి విహీనముగా నుండు. బలహీనముగా నుండు.
- "ఈసురో మని మనుషు లుంటే, దేశమేగతి బాగుపడునోయ్." గురజాడ.
- "లంకంత యింట్లో చాలినంత మనుషులు లేక యీసురో మని ఉంది." వా.
- చూ. ఈదురో మను.
ఈసువడు
- నింద పొందు.
- "మోసపోయితి గులమునం దీసు వడితి." శివరా. 3. 129.
ఈ సొనరించు
- ఈర్ష్యపడు.
- "ఇంక వీరితో నీ సొనరించువీరవరు నెవ్వని గాన." భాస్క. యుద్ధ. 1063.
ఈళ్ళు క్రుక్కు
- ఈరు = చిన్న పేలు; వానిని చంపు. పేలను రెండు బొటనవ్రేళ్ళ సందులో నుంచి చిటుక్కు మని పొడుచుటయే పేలు క్రుక్కుట. ఈలు క్రుక్కుటా అంతే.
- "ఈళ్ళు క్రుక్కి." పాండు. 3. 30.
ఉంకుచెండువిధంబున
- విసరి వేసిన చెండువలె. చెండు వేసినప్పుడు నేల తగిలి మరొకతూరి పైకి వెళ్లి కిందికి పడి మరీ యెగురును. అనగా మకానులు కమానులుగా వెళ్లు ననుట. ఇట్టియెగురుటతో ఇచట సామ్యము.
- "ఉంకుచెండువిధంబున, నుత్తరించు తములపాకు నిక్కెడుక్రియ దాటు నిఱ్ఱి." ఉ. హరి. 4. 28.
ఉంకుటుంగరము
- వివాహనిశ్చయ సూచకంగా వధూవరులు మార్చుకొనే ఉంగరము.
- హంస; శ. ర. ఉంగ____ఉంచు 193 ఉంఛ____ఉండ
ఉంగరాలచేతి మొట్టికాయ
- ధనికుని దూషణ; దండన. అది తిట్టే అయినా ధనికుడన్నా డని సరిపెట్టుకొనువాని విషయంలో ఎత్తిపొడుపుగా అనుమాట.
- "నేను ఒకమాటంటే అంత కస్సు మని వచ్చావే? మఱి ఆరంగయ్య అన్నిమాట లంటే నోరు మూసుకొని కూర్చున్నావుగా. మఱి అది ఉంగరాల చేతి మొట్టికాయగదా. బాగానే ఉంటుంది." వా.
ఉంగిడిగొనినట్లు
- ఉంగిటిరోగము పొందినట్లు.ఉంగిడి సామాన్యంగా పశువు నాము తిన్నప్పుడు వచ్చే వ్యాధికే వాడుతారు. కాశీ. 2. 138.
ఉంగిడిగొను
- ఉంగిడి అను పశు వ్యాధి వచ్చు.
- "ఉంగిడిగొన్నభంగి." కాశీ. 2. 138.
ఉంగుంగ
- ధ్వన్యనుకరణము. శిశువు చిన్నప్పుడు అనుమాట.
- చూ. ఉంగే ఉంగే.
ఉంగే ఉంగే
- చూ. ఉంగుంగ.
ఉంచుకొను
- 1. పెట్టుకొను.
- "ఉపనిషత్కాంతల నుంచుకొనిరి గాని." పాణి. 5. 14.
- 2. తన అధీనములో ఒక పరస్త్రీని ఉంపుడుకత్తెగా ఉంచుకొను.
- "దానిని అత డుంచుకొన్నాడు." వా.
ఉంఛవృత్తి
- పొలాల్లో కళ్లాల్లో రాలిన గింజలను ఏరుకొని, వాటితోనే జీవించు జీవనము.
ఉంటకట్టు
- చాలకాల మైనప్పుడు పిండీ మొదలయినవి. ఉంట కట్టడం అలవాటు.
- "ఆగోధుమపిండి ఉంట కట్టింది." వా.
- చూ. ఉండకట్టు.
ఉంటగాలము
- సీసపుగుండు కట్టిన ఒక రకమయినగాలము. హంస. 4. 184.
ఉంటాను!
- ఎవరి నైనా సాగనంపుతున్నప్పుడు నేనిక సెలవు తీసుకొంటా నని గృహస్థు మొదలగువా రనుమాట.
- "మఱిక ఉంటాను. వెళ్ళగానే ఉత్తరం వ్రాయండి." వా.
- చూ. నిలుస్తాను.
ఉండకట్టు
- చూ. ఉంటకట్టు.
ఉండగ్రోవి
- పట్టుకొనుచోట ఉండగా ఉన్న చేతికఱ్ఱ. శ. ర. ఉండ____ఉండ 194 ఉండ____ఉంప
ఉండచీట్లు వేయు
- లాటరీ వేయు.
- "వా ళ్లిద్దరికీ సమానంగా ఓట్లు వచ్చేసరికి ఉండచీట్లు వేయవలసి వచ్చింది." వా.
ఉండ బట్టదా ?
- కాలక్షేపం కాలేదా, ఊరకే ఉండ లేవా ?
- "ఒక టంటె ఒక టాడి ఉండబట్టదొ కాని." తాళ్ల. సం. 3. 537.
- ఇలాంటి సందర్భంలో ఇది నేటికి రాయలసీమలో వినవస్తుంది.
- "ఏం ఉండబట్టదా సాపోడా! పడే సకం ఆడతావు." వా.
ఉండబట్ట లేక
- ఊరక ఉండ లేక; అనవసరముగా అనుట.
- "ఉండబట్టలేక వాళ్లింటి కెళ్లి అన్నిమాటలు అనిపించుకొన్నాను?" వా.
- "ఉండబట్ట లేక ఆ నాటక సమాజం అనిపెట్టి వాడు పాడై పోయాడు." వా.
- "ఉండబట్టలేక ఆమాట అని నెత్తిమీదికి తెచ్చుకొన్నాడు." వా.
ఉండలక్రోవి
- వడిసెల.
ఉండవిలు
- వడిసెల.
- చిన్న పంగలకఱ్ఱకు చర్మపు వారో తాడో కట్టి, దానిలో గట్టిగా ఎండబెట్టిన మట్టి ఉండలు పెట్టి పక్షులు మొదలైన వానిని కొడతారు నేటి దీని రూపం 'ఉండేలు'
- "నీదు తను వుండవిలు సేసి నెఱకువేయు, రతివరుడు హారగుళికల రాజ హంసు." నైష. 2. 97.
- "పిల్లకాకి కేం తెలుసు ఉండేలుదెబ్బ." సా.
ఉండసురియ
- ఒక విధ మైనకత్తి.
- "కొండగొఱియల నుండసురియల... చెండాడుచు." రా. వి. 3. 65.
ఉండుకొను
- ఉండు.
- "అవ్వనట దొలంగ జేయుటయు, వాస్తవ మై యిటు లుండుకోగ..." కాళిందీ. 2. 211.
- వైదిక వృద్ధులలో ఈమాట నేటికీ ఉన్నది.
- "వా డా ఊళ్లో ఉండుకొంటూ ఉన్నాడు" "ఉండుకొన్నవాడై." వా.
ఉండూరు
- స్వగ్రామము.
- "వానికి ఉండూళ్లో యిల్లు లేదు. పొరుగూళ్లో పొలము లేదు." వా.
ఉంపడము
- ఉంపుడు ఉంచుకొనుట; ఉంపుడుకత్తె.
- "ఆపిల్లను వాడు ఉంపడం ఉంచుకొన్నాడు." వా.
- "ఇది వాడికి ఉంపడం." వా.
- చూ. ఉంపుడుకత్తె. ఉంపు_____ఉక్క 195 ఉక్క____ఉక్కి
ఉంపుడుకత్తె
- ఉంచుకొన్న స్త్రీ.
ఉక్కడగు
- బలము కోలుపోవు.
- "ఉక్కడగెన్ మగధేశ సైన్యముల్." భార. సభా. 1. 213.
ఉక్కడచు
- చంపు, పొగ రడచు; బలహీన పఱుచు.
- "మార్కొను వీరయోధుల బెక్కండ్ర నుక్కడంప." జైమి. 6. 132.
ఉక్కడీడు
- బలశాలి.
- "ఉక్కడీ డయి యేతెంచె నుక్కు మిగిలి...మరుడు." నైష. 7. 41.
ఉక్కణగు
- బలము తఱిగిపోవు.
- చూ. ఉక్కడగు.
ఉక్కణచు
- పొగరడచు.
- "రక్కసు నాయోధనమున నుక్కణంచి." రుక్మాం. 575.
- చూ. ఉక్కడచు.
ఉక్కపట్టు
- చేమట పోయు; గాలి లేక వేడి యెక్కువై అనుట.
- "ఈరోజు చాలా ఉక్కపడుతూ ఉంది." వా.
- "అక్కడ ఉక్క పట్టుతూ ఉండడం చేత ఈ రోజు ఇక్కడ పండుకొన్నాను." వా.
- చూ. ఉక్క పెట్టు.
ఉక్కపెట్టు
- చెమట పట్టు.
- "ఈరోజంతా ఉక్క పెడుతూ ఉన్నది." వా.
- చూ. ఉక్కపట్టు.
ఉక్కపోయు
- చెమటపట్టు.
- చూ. ఉక్క పెట్టు.
ఉక్కబట్టు
- 1. ఉగ్గబట్టు; మూసివేయు.
- "ఒకవేళ వానల నుపహతి నొందించు నొకవేళ రంధ్రంబు లుక్కబట్టు." భాగ. 7. 199.
- 2. ఆహారాదులను విసర్జించు.
- "విడుతు బ్రాణము, నీకై కూ డుక్కబట్టి నీలగ్రీవా!" కాళ. 3. 101.
- చూ. ఉగ్గబట్టు.
ఉక్కఱు
- బలహీన పడు.
- "ఉక్కఱి యిట్లు మధ్యము మహోగ్ర శరంబుల దాక నోర్వక." భార. అర. 4. 12.
ఉక్కళ ముండు
- సైన్యము విడిసినచోట, బయటివారి రాకను కనిపెట్టుటకై కావలి యుండు.
- "కొండప్రక్కల నుక్కళ ముండు వేల్పు, తండముల జెండి యెక్కి యక్కొండయందు." దశా. 2. 57.
ఉక్కిరి బిక్కి రగు
- ఊపిరాడక విలవిలలాడు; తీరిక లేకపోవు.
- "ఈ రోజే ఇన్నిపనులూ చేయవలసి ఉక్కి____ఉక్కు 196 ఉక్కు____ఉక్కు
రావడం చేత ఉక్కిరిబిక్కిరైపోయింది."
- "ఈ పనితో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంది." వా.
ఉక్కివ మాడు
- మేల మాడు.
- "క్రొమ్మెఱుంగుతో నుక్కివ మాడు మేనిపస." క్రీడా. పు. 87.
ఉక్కీడు
- మూర్ఖుడు, దుష్టుడు.
- "ఉక్కీ లయి నేర్పులేక." నిర్వ. 3. 11.
- "ఉక్కీనిమనంబు కీడు పరికించునె." భార. విరా. 3. 7.
ఉక్కు గరచి చేయు
- ఉక్కుతో చేయు.
- అంత కఠిన మైన దనుట.
- "కౌసల్యహృదయ మక్కట, యుక్కు గరచి చేసినారొ?"
- వర. రా. అయో. పు. 420. పంక్తి. 17.
ఉక్కుతునక
- ఉక్కుముక్కవంటి బలిష్ఠుడు. ఉక్కు చాలా గట్టి లోహమనుట ప్రసిద్ధము.
- చూ. ఉక్కుతునియ.
ఉక్కుతున్క
- వీరుడు.
- "...గాళకు లాపురీభట శిఖామణు లెక్కటి యుక్కు తున్కలు..." విజ. 1. 75.
- చూ. ఉక్కుతునక.
ఉక్కుతునియ
- బలశాలి, శూరుడు.
- "ద్రౌపదేయుడు నాసుభద్రాసుతుండు నుక్కుతునియలు గారె." భార. ఉద్యో. 176.
- చూ. ఉక్కుతునక.
ఉక్కున పెనచిన ట్లుండు
- దిట్టముగా ఉండు. ఉక్కు గుండువలె అనుట.
- "ఉక్కున బెనచినట్లున్నాడు వీడు." గౌ. హరి. ద్వితీ. పంక్తి 1504.
ఉక్కునీరు
- ఉక్కు కరిగించగా ఏర్పడిన ద్రవము.
- "ఉక్కునీరు వోతురు." భాగ. 5. 2.
ఉక్కుపొడి రాల్చు
- నిప్పులు గ్రక్కు వంటిది. క్రోధాతిరేకమును సూచించే పలుకుబడి.
- "ఉక్కుపొడి రాల రోషంబు." విజయ. 3. 151.
ఉక్కు మడగు
- బలము చెడు.
- "ఉఱక విరోధి సైన్యముల నుక్కుమడంగంగ నుల్లసద్గతిం, బఱప..." భార. విరా. 5. 61.
ఉక్కుమడచు
- ఉక్కు మడగునట్లు చేయు.
ఉక్కుమడుగు
- పరాక్రమ ముడుగు
- "మడిసియు జడిసియు జిక్కువడియు నుక్కు మడిగియు." భార. ద్రోణ. 5. 92.
ఉక్కుమిగులు
- 1. చేవ గల్గు; అతిశయించు.
- "రెండు బలంబుల వారలు, నొండొరువులకంటె జాల నుక్కుమిగిలి యొం, ఉక్కు____ఉక్కో 197 ఉక్రో____ఉగ్గు
డొండ కడంగుచు నుజ్జ్వల, చండ స్థితి మొప్పి రపుడు జగతీనాథా." భార. భీష్మ 1. 138.
- 2. పరాక్రమించు.
- "అక్కిరీటి సైన్యంబు లెక్కగొనక యుక్కుమిగిలి యక్క జంబు గాక, జిక్కువడం బెక్కు నారసంబులు..."
- జైమి. 5. 20.
ఉక్కుమీఱు
- చేవమీఱు.
- భాగ. 6. స్కం. 260.
- చూ. ఉక్కుమిగులు.
ఉక్కుమెఱయు
- "అవ్విభుండు వాని నెల్ల వింటవడి బాఱ జడుపుచు లెక్క సేయకుండె నుక్కు మెఱసి."
- భాస్కర. ఆర. 1. 228.
- చూ. ఉక్కుమీఱు.
ఉక్కు మురిసినట్లు
- ఉక్కు కరగినట్లు.
- "చిక్కువడి యుక్కు మురిసినట్లు సమసిన." భార. ద్రోణ. 3. 394.
ఉక్కువడు
- దుర్బలు డగు; దీను డగు.
- "ఉక్కువడి యుండె బహుకాల మొప్పు దఱిగి, విగతలక్ష్మివిలాసుడై వేల్పుఱేడు." హర. 6. 30.
ఉక్కెక్కు
- గట్టిపడు.
- "పిక్క లుక్కెక్కగ ద్రొక్కి నిల్చి." కాళ. 4. 174.
ఉక్కోలుగా
- విపరీతంగా.
- "విసరె నుక్కోలుగా విషమవాయువులు." వర. రా. బా. పు. 229. పంక్తి 13.
ఉక్రోషం
- ఉడుకుబోతుతనము.
- "దాన్ని ఏమనకురా, అది వట్టి ఉక్రోషంమనిషి." వా.
ఉగాది
- సంవత్సరాది.
- "ఈ ఉగాదికి కొత్తబట్టలు కొనాలంటే కూడా డబ్బు లేదు." వా.
ఉగ్గగట్టు
- బిగించి కట్టు.
- "నెన్నడు ముగ్గంగట్టి." వి. పు. 7. 135.
ఉగ్గడు వగు
- ఎక్కు వగు, అధిక మగు.
- "ఉగ్గడు వగు తేజంబున." భార. ద్రోణ. 5. 195.
ఉగ్గబట్టు
- ఆహారాదులను విసర్జించు.
- "వాడు పదిరోజులుగా కూడూ నీరూ ఉగ్గవట్టాడు." వా.
- చూ. ఉక్కపట్టు.
ఉగ్రము వచ్చు
- 1. ఒడలు మరిచేటంత కోపమో ఆవేశమో వచ్చు.
- "వానికి ఆమాట వినేసరికి ఉగ్రం వచ్చింది." వా.
- 2. దేవుడో దయ్యమో ఆవేశించు.
- "వాడు పీ రెత్తుకొనేసరికి ఉగ్రం వస్తుంది." వా.
ఉగ్గుతో పెట్టినవిద్య
- చిన్నతనంనుంచీ వచ్చిన ఉగ్గు____ఉచ్చ 198 ఉచ్చ____ఉచ్చా
విద్య. ఉగ్గుపెట్టు నాటినుంచీ వచ్చిన దనుట.
- "వానికి నయంగా మాట్లాడి బుట్టలో వేసుకోవడం ఉగ్గుతో పెట్టిన విద్య." వా.
- చూ. వెన్నతో పెట్టినవిద్య.
ఉగ్గుపెట్టు
- చంటిపిల్లలకు చిట్టాముదము. చనుబాలు కలిపి రంగరించి అది చిక్కనిపాలవలె కాగా (అదే ఉగ్గు) దానిని పెట్టు.
- "వా పోయి వా పోయి పసివాడి యాకట, బెగడె గా యని యుగ్గువెట్టి వెట్టి." పాండు. 3. 156.
ఉగ్గువడు
- క్షీణించు.
- "తన ధృతి, యుగ్గువడన్ వేపితామహునికడ కరిగెన్." కకు. 1. 209.
ఉచు క్కను
- తిరస్కరించు.
- "ముఖాబ్జకాంతితో జుక్కలరాజునైనను నుచు క్కనువాడు." యామున. విజ. 4. 129.
ఉచ్చగిత్త
- స్త్రీలోలుడు.
- "వాడా వట్టి ఉచ్చగిత్త. చీరకొంగు కనబడితే చాలు వెంటపడతాడు." వా.
ఉచ్చచెలమ
- విరక్తి కల్గించుటకై జుగుప్సార్థంలో యోగులూ, జ్ఞానులూ యోనికి పెట్టిన పేరు.
- "ఉచ్చ చెలమ గోరి యున్నది జగమెల్ల." వేమన. 1029.
ఉచ్చ దివిటీగా వెలుగు
- బాగా మాట సాగు. వాని మాట కెదురు లేకుండా అధికారం చలాయిస్తున్నాడు అనుపట్ల ఉపయోగించేపలుకుబడి.
- "ఆ రెడ్డిపే రంటే ఆజిల్లా అంతా హడలు. వాని ఉచ్చ దివిటీగా వెలుగుతున్న దంటే నమ్ము." వా.
ఉచ్చనీచములు
- హెచ్చుతక్కువలు.
- "కుడువంజొచ్చును బ్రాహ్మణార్థములు పెక్కుల్ రాజకీయార్థముల్, నడుపం జూచును యాజ్ఞవల్క్యుండు ధరన్ నానోచ్చనీచంబులం, దెడ లేక న్నటి యించు గాలముకొలదిం బోవు..."
- తెలుగునాడు. పు. 41.
ఉచ్చపోయు
- మూత్రవిసర్జన చేయు.
ఉచ్చమల్లి
- ఒకతిట్టు; నగ్నస్త్రీ.
- "ఉచ్చమల్లి యయ్యింతితల్లి." శుక. 3. 18.
ఉచ్చరతి
- రతివిశేషములలో ఒకటి.
- కుమా. 9. 152.
ఉచ్చాటన
- స్థానభ్రంశము; తఱిమివేత. మంత్రపరిభాష. దయ్యాలను, భూతాలను మంత్రాలతో వెడలగొట్టుటపై వచ్చినపలుకుబడి. ఉచ్చి___ఉచ్చు 199 ఉచ్చు___ఉచ్ఛి
"ఆస్తి సొంతదారుడు రాగానే వీనికి ఉచ్చాటన తప్పదు." వా.
- "వాళ్లనాన్న రాగానే వీడికి ఆ యింటినుంచీ ఉచ్చాటన జరుగుతుంది." వా.
ఉచ్చిపాఱు
- దూసుకొని పోవు.
- "నెఱకుల నుచ్చిపాఱి." జైమి. 2. 37.
- "పై నొరంగి పొంకపు జన్మొన లుచ్చిపాఱ, గౌగిలి దయసేయ రాదొ." ఉ. రా. 4. 315.
ఉచ్చిపోవు
- "ఉరుము వడి దాకి వీపున నుచ్చిపోయె." భార. భీష్మ. 3. ఆ.
- చూ. ఉచ్చిపాఱు.
ఉచ్చుచ్చిరే
- కుక్కను పిల్చుటలో ధ్వన్యను కరణ మై వినవస్తుంది. నేటి వాడుకలో 'చ్చుచ్చుచొ' అని వినబడుతుంది.
- "ఉచ్చుచ్చిరే శంకరోచ్ఛిష్టభోగి." బస. 7. 133.
ఉచ్చులు తెంచుకొను
- నిర్బంధములను తొలగించుకొను.
- పరువెత్తుటలో అన్ని నిర్బంధాలనూ సడలించికొనె ననుటలో అలవాటై కడకు తెంచుకొని పరుగెత్తాడు. పాఱిపోయాడు అనే అర్థమాత్రద్యోతక మైంది. ఇలాంటిదే తీగలు తెంచుకొని పరుగెత్తు.
- ".....పులి మె,ల్లనె యవలికి జని వెస జం, గున నచ్చటిలతలు త్రెంచి కొనుచుం బాఱెన్." శుక. 2. 261.
- ఇది అతివేగంగా ముందూ వెనుకా చూడకుండా పరువెత్తేపట్ల ఉపయోగిస్తారు.
- "ఉచ్చులు త్రెంచుకొని పరువెత్తాడు." వా.
ఉచ్చులు పన్ను
- మోసగించుటకై ఎత్తులువేయు.
- "వచ్చే సంవత్సరం ఖాళీ కాబోయే ఉద్యోగానికి నేటినుంచే వాడు ఉచ్చులు పన్నుతున్నాడు." వా.
- చూ. ఉచ్చులు వేయు.
ఉచ్చులు వేయు
- ఎవరినో పట్టుకొనుటకూ, బోల్తా కొట్టించుటకూ మాయలు పన్ను.
- "ఆ ఆస్తి నంతా కబళించాలని వాడు ఉచ్చులు వేస్తున్నాడు." వా.
- "ఆ బంగారు పిచ్చుకను దొరకించుకోవా లని వాడు ఉచ్చులు వేస్తున్నాడు. వా.
- ఛూ. ఉచ్చులుపన్ను.
ఉచ్ఛిష్టపు లేమ
- ఒకతిట్టు.
- ఉచ్ఛిష్టం నీచం అనే అర్థంలో. ఇలా యేర్పడిన పలుకుబడులు ఉచ్ఛిష్టపు బ్రతుకు లాంటివి మరికొన్ని ఉన్నవి.
- "చేతితడార దుచ్ఛిష్టపు లేమ." గౌ. హరి. ద్వి. 890. ఉజ్జ____ఉట్టి 200 ఉట్టి____ఉట్టి
ఉజ్జగొను
- సరకు సేయు.
- ఇదెప్పుడు ఉజ్జగొనడు, సేయడు అన్నట్లు వ్యతిరేకార్థంలోనే వినవస్తుంది.
- "లజ్జాభిమానంబు లుజ్జగొనడు." రుక్మాం. 5. 146.
ఉజ్జన సేయు
- విడిచిపెట్టు.
- "సంధ్యాభివందనశ్రద్ధ యుజ్జన సేయ." కాశీ. 4. 81.
ఉజ్జాయింపుగా
- దాదాపుగా, రమారమిగా.
- "ఆ యిల్లు కట్టడానికి రెండువే లవుతుందని, ఉజ్జాయింపుగా చెబుతున్నాను." వా.
ఉట్టాడు
- ఉఱ్ఱ ట్లూగు; ఉర్సుకు డగు.
- "హరు బి ట్టోడింప నుట్టాడుచున్."
- పాండు 1. 189.
- చూ. ఉఱ్ఱట్లూగు.
ఉట్టి కట్టుకొని వ్రేలు
- తా నేదో చేయబో నున్నట్లు ఉఱ్ఱట్లూగు; ఎప్పుడెప్పుడా అని ఉత్సుకు డగు.
- "కులధర్మం బెడలించి శ్రీ గురునకుం గోపంబు పుట్టించి మి,త్రుల సౌభ్రాత్ర నివాసదేశముల నీతో బుట్టులం బాసి ని,శ్చలతన్ వ్రేలెద వుట్టి గట్టికొని దుస్సాధ్యంబు సుమ్మీ స్మర, జ్వలనజ్వాలిక సోక నీక నిలువన్ జ్ఞానామృత స్యందమున్." పాండు. 5. 211.
- "నీ వేదో పొడిచేస్తా నని ఉట్టిగట్టుకొని వ్రేలాడుతున్నావు. కానీ వాడురాగానే నీతోక కోసేస్తాడు జాగర్త!" వా.
- చూ. ఉట్టి గట్టుకొని ఊగు.
ఉట్టి కెక్కు
- మూలబడు. పనిఅయ్యాక వస్తువులను ఉట్టిపై ఉంచి వేస్తారు. అందుపై వచ్చిన పలుకుబడి.
- "ఉట్టి కెక్కు నీసిగ్గులు నోబావ." తాళ్ల. సం. 3. 172.
- చూ. ఉట్లెక్కు.
ఉట్టి గట్టు
- అపహాస్యము చేయు. తాటాకులు కట్టు వంటిది. ఉట్టి కట్టుకొని ఊరేగుతున్నాడు; వాణ్ణి ఉట్టి కట్టి ఊరేగిస్తాము అని వాడుక ఉన్నది. ఈ పలుకుబడి వాడుకలో నేడున్నట్టు లేదు.
- "..సరకు గొనండు...టక్కరి బలుమోపు మోచు నయగారితనం బది యుట్టిగట్టినన్." ఉత్త. హరి. 4.
ఉట్టి గట్టుక వ్రేలు
- "ఉట్టి గట్టుక వ్రేలుచున్నాడు." గౌ. హరి. ద్వితీ. పంక్తి 1758.
- చూ. ఉట్టిగట్టుకొని ఊగు.
ఉట్టి గట్టుకొని ఊగు.
- ఏదో అత్యాశతో ఉవ్విళ్లూరు.
- "గట్టిగా జావుకు గడు తెంపు జేసి, యుట్టి గట్టుక నూగుచున్నాడు దేవ." రంగనా. యుద్ధ. 357. పే.
- చూ. ఉట్టి గట్టుకొని ఊరేగు. ఉట్టి_____ఉట్టి 201 ఉట్టి_____ఉట్టి
ఉట్టి గట్టుకొని ఊరేగు
- ఎందుకోసమో ఉబలాటపడుతూ ఎప్పు డెప్పుడా అని ఉండు. వాడుమాత్రం అనుభవించే దేమున్నది. అన్న అర్థంలోనూ ఉపయోగించడం కలదు.
- "వా డేదో తానే పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు కాగల నని ఉట్టిగట్టుకొని ఊరేగుతున్నాడు. కానీ డిపాజిట్టు కూడా దక్కేట్టు లేదు." వా.
- "వా డేమి ఉట్టిగట్టుకొని ఊరేగబోతాడా?" వా.
- చూ. ఉట్టి గట్టుక వ్రేలు.
ఉట్టి గట్టుకొని వ్రేలు
- దేనికోసమో కాచుకొని ఉవ్విళ్లూరు.
- "నిశ్చలతన్ వ్రేలెద వుట్టిగట్టుకొని." పాండు. 5. 211.
- "ఎప్పుడో తనకు గుఱ్ఱపు పందాలలో తప్పక బహుమతి వస్తుంది అని వాడు ఉట్టిగట్టుకొని వ్రేలాడుతున్నాడు." వా.
- చూ. ఉట్టిగట్టుకొని ఊరేగు.
ఉట్టిచీల
- రెండుప్రక్కలా తల ఉన్న చీల. శ. ర.
ఉట్టిచేర్లు తెగు
- అధ:పతనము చెందు.
- "ఉట్టిచేర్లన్ని యుందెగె నుదిలపడుచు, డొంటి దర్పంపుటుయ్యెల దోగగలవొ, వ్యసనపర వయి నీకు నీవ యిక నాకు, భార్య వగుదువొ ప్రార్థించుపనియు లేదు." రామకథా. యుద్ధ. వూ. 4. 329.
ఉట్టిపడు
- పొంగిపొరలు, విస్పష్ట రూపంలో కానవచ్చు. ఇలాంటి కొన్ని అర్థాలలో వాడుకలో ఉన్నది.
- "వాని ముఖంలో బ్రహ్మ వర్చస్సు ఉట్టిపడుతూ ఉంటుంది." "ఆకావ్యంలో రసం ఉట్టిపడుతూ ఉంటుంది." "వీడి మొహం వాళ్ల నాన్న ఉట్టి పడ్డట్టే ఉంది." ఇత్యాదు లూహ్యములు.
- "బ్రహ్మతేజం బుట్టి పడునెమ్మొగము ఠీవి, రాకాశశాంకగౌరవము దెల్ప." పెద్దాడ. శకుం. 253.
- "ఆ బాలుర గృప యుట్టిపడగ జూచి." కళా. 6. 159.
ఉట్టిపాటుగా
- హఠాత్తుగా.
- "ఉట్టిపాటుగా ప్రయాణం కావలసి వచ్చింది." వా.
ఉట్టిపాటున
- హఠాత్తుగా.
- "ఉట్టిపాటున బయలుదేరాను." వా.
ఉట్టిపై చెరలాటము
- నిప్పుతో చెలగాటము వంటిది. ఉట్టిమీద నిలిచి ఏమాత్రం కదిలినా కింద పడతారు.
- తాళ్ల. సం. 11. 3 భా. 5.
ఉట్టి యుట్టి పడు
- ఎగి రెగిరిపడు. ఉట్టి____ఉట్ర 202 ఉట్ర____ఉడా
"ఉదక బిందు కలాప ముట్టియుట్టి పడంగ." కాశీ. 4. 69. ఉట్టిలో పెట్టినగుమ్మడికాయవలె
- కదలక మెదలక, దిట్టంగా.
- "అమ్మగువ కనుగొనియెన్, ముమ్మరముగ బట్టెనామములు మే నెల్లం, గ్రమ్మికొన నుట్టి బెట్టిన, గుమ్మడికాయయునుబోలె గూర్చున్నతఱిన్." వైజ. 2. 56.
ఉట్టి పడు
- అకస్మాత్తుగా వచ్చు.
- "హరి ఉట్టివడి కావకున్న నొచ్చెము దేహికి హరి." తాళ్ల. సం. 9. 80.
ఉట్రవడియము
- చిట్టి వడియము. ఈ వడియాలతో కూరచేయడం కూడా కలదు.
- "గుడి మ్రింగెడువానికి లో నడరెడువేల్పుట్రవడియ మగు." అచ్చ. రామా. సుం. 155.
- అన్నమూ, మసాలా దినుసులూ కలిపిన ఒక విధ మైన పలావు అని బ్రౌను. దక్షాణాదిన మసాలా దినుసులన్నీ వెల్లుల్లీ, లవంగాలు, గసాలు ఇత్యాదులు కలిపి దంచి ఉండలు చేసి ఆరబెడతారు. వానినే తుంచి తాలింపులలో, తిరగబోతలలో వాడతారు. అవే ఉట్రవడియాలు.
ఉట్రవడియముగా
- ఉన్న పళంగానే, వెంటనే.
- "ఇలా ఉట్రవడియంగా రమ్మంటే నేనెలా రాగలను?" వా.
- "వాడు ఉట్రవడియంగా వచ్చాడు." వా.
- అతి చులాగ్గా, అన్యాయంగా.
- "వానిసొమ్ము ఉట్రవడియంగా నోట్లో వేసుకొన్నాడు." వా.
ఉట్లెక్కు
- మూల బడు. నిత్యం ఉపయోగించని వానిని ఉట్టిపై పెట్టివేయడం అలవాటు. అందుపై వచ్చిన పలుకుబడి.
- "ము న్నహింసా పరమో ధర్మ యని పల్కు, చదువు లుట్లెక్కెనా సార్వభౌమ.: నలచ. 3. 67.
- చూ. ఉట్టి కెక్కు.
ఉడకవేసే దిక్కు లేదు
- ఆడదిక్కు లేదు.
- "వాళ్ళ తల్లిపోయినప్పటినుంచీ వాళ్ళింట్లో ఉడకేసేదిక్కు లేక మహా అల్లాడి పోతున్నారు." వా.
ఉడకాడించు
- క్షోభ పెట్టు, కలత పెట్టు. చిత్తూరు ప్రాంతంలో ప్రచురంగా ఉన్నది.
- "ఆ పిల్ల లంతా నన్ను ఊరికే ఉడకాడిస్తున్నారు." వా.
- చూ. ఉడ్డాడించు.
ఉడాములమీద వెళ్లు
- అంచెలమీద పోవు. ఉడి_____ఉడి 203 ఉడి_____ఉడు
ఉడికించు
- ఎత్తిపొడుపులతో నొప్పి కలిగించు; అపహసించు.
- "వాళ్లబావ నిమిషనిమిషానికీ దాన్ని ఉడికిస్తూ సంతోషిస్తున్నాడు." వా.
- చూ. ఉడికిలించు.
ఉడికినమెతుకు తిని ఉలికిపడు
- కలిగింది తిని హాయిగా ఉండక అనవసరంగా బాధపడు.
- "వాడి కన్నీ ఉన్నా యెప్పుడూ ఏడుపే. ఉడికినమెతుకు తిని ఉలికిపడుతూ ఉంటాడు." వా.
ఉడికిలించు
- చూ. ఉడికించు.
ఉడిగిపోవు
- కాల మై పోయి చెట్టుచేమలు కాయలు కాయడం మానివేయు; శక్తు లుడుగు.
- "ఉడిగిపోయిన ంరాకునుంబోలె బండ్లు డుల్లి." కవి. 4. 113
- "నే నింకేం చేయగలను? అన్నీ ఉడిగిపోయినవి." వా.
ఉడిగి మడుగు
- కాలం కాదని తగ్గి ఉండు. అణగి మణగు.
- "అనిన ధౌమ్యు డిట్టు లనియె నీవత్సర, మొకడు నెట్టు లయిన నుడిగి మడిగి, సంకటముల కోర్చి..."
- భార. విరా. 1. 142.
- "ఉపవసింతుము గాక నే డుడిగి మడిగి." కాశీ. 7. 153.
ఉడిపోవు
- తగ్గిపోవు.
- "వ్యాధు లుడివోయె నపమృత్యు వద టణంగె." రుక్మాం. 1. 136.
- "ఆసనాదులకు సమర్థమైన ప్రాయ ముడి పోవుటకు వెతపడుచు నుంటి..." కళా. 4. 149.
- "ఉడు కన్నిటిలోన నుండుటయు లేదు నీ, వుడిపోయి యం దుండ కుండుటయు లేదు." తాళ్ల. సం. 5. 173.
ఉడివుచ్చు
- పాడు చేయు.
- "మునుపటి పతివ్రతలు... మాన ముడి వుచ్చుకొని రటే." హంస. 1. 127.
ఉడి వోనిపంట
- శాశ్వత మైనది; ఉడిగిపోని దనుట.
- "తీరని మోహాల తెందేపలు, ఊరేటి చెలమలు, ఉడివోని పంటలు." తాళ్ల. సం. 11. 11.
ఉడివోవు
- ఉడిగి పోవు.
- "సంపద యుడివోయి." వర. రా. అయో. పు. 485. పంక్తి. 4.
- "పరిమళం బుడివోనివిరులు ముడిచి." పాండు. 2. 108.
- చూ. ఉడిగిపోవు; ఉడిపోవు.
ఉడుకారు
- చల్లారు, చల్లబడు.
- "ఉడుకారెడినంత నెంతయున్." దేవీ. 2. 220.
- "ఆ రాముని శ్రీపాదయుగము నూరటగా జూచి యుడుకారువాడ..."
- వర. రా. అయో. పు. 531. పంక్తి. 3.
- "ఈ దుస్ససేనుతను వింతలింతలు తుని ఉడు____ఉడు 204 ఉడు_____ఉడు
యలై... యుడుకాఱు గాక, యలుపాల బొనుపడునట్టి చిచ్చే యిది?" భార. ఉద్యో. ఉడుకుకొను
- ఒకరు ఎత్తిపొడిచి అపహసింపగా బాధపడు.
- "అంత ఉడుకుకొంటున్నా వేరా? ఏదో తమాషా కంటే." వా.
ఉడుకుఘటము
- ఘటికుడు, ఉగ్రుడు.
- రుద్రమ. 21 పు.
- చూ. ఉడుకుపిండము.
ఉడుకుపట్టు
- వే డెక్కు.
- "బడబాగ్ని బయోధి యుడుకుపట్టె ననంగన్." భాస్క. యుద్ధ. 965.
- "అన్నం ఉడుకు పట్టింది." వా.
- "ఉడుకుపట్టిన తర్వాత గానీ పులుసులో ఉప్పూ పులుసూ వేయరాదు." వా.
ఉడుకుపాలు
- యౌవనము, ఉద్రేకము.
- "ఉడుకుపాలు చిందు నో వెఱ్ఱి కూతురా." రుద్రమ. పు. 38.
- "వాడు మంచివాడే కానీ కాస్త ఉడుకుపా లెక్కువ." వా.
ఉడుకుపిండము
- అత్యుగ్రు డనుట.
- "వాడా ఉడుకుపిండం. ఒక్క మాటన్నా ఓర్చుకోడు." వా.
- చూ. ఉడుకుఘటము.
ఉడుకుబోతు
- ఏమన్నా ఉడుకుకొనునట్టి...
- "వాడు వట్టి ఉడుకుబోతు. తమాషాకన్నా ఏడ్చి చస్తాడు." వా.
ఉడుకుమోతుతనం
- ఏదైనా నవ్వులాట కన్నా నొచ్చుకొనుట.
- "అంత ఉడుకుమోతుతన మైతే ఎట్లాగే పిల్లా!" వా.
- చూ. ఉడుకుబోతుతనం.
ఉడుగోత
- కాపు ఉడిగిన తరువాత మిగిలినవాటిని కోసేకోత.
- "ఎప్పుడో ఈటుపోయిన చేలో ఇంకా ఉడుగోత ఏమిటి?" వా.
- చూ. ఉడుగోతపిందె.
ఉడుగోతపిందె
- కాపు ఉడిగినతరువాత చెదరుగా పుట్టే నిస్సార మైన పిందె.
- చూ. ఉడుగోత.
ఉడుతకు ఉడతాభక్తి అన్నట్లు
- ఏదో చేత నయినంత.
- "ఉడతకు ఉడతాభక్తి అన్నట్లు ఏదో తృణమో పణమో నేను ఇస్తాను." వా.
- చూ. ఉడుతభక్తిగా.
ఉడుతభక్తిగా
- చేత నయినంత. అతితక్కువైనాసరే ప్రేమతో చేస్తున్నా ననే అర్థంలో ఉపయోగిస్తారు.
- సేతునిర్మాణంలో శ్రీరామునికి ఉడుత సాయపడిన కథ సుప్రసిద్ధం. దానిని బట్టి వచ్చినపలుకుబడి. ఉడు______ఉడ్డ 205 ఉడ్డ______ఉడ్డ
వాడుకలో 'ఉడతాభక్తిగా.'
- "నేనూ ఏదో ఉడతాభక్తిగా నా చేతనైనసాయం చేస్తాను." వా.
- చూ. ఉడతాభక్తిగా.
ఉడుదేనె లగు
- మధుహీనము లగు; తేనె లుడుగు.
- "కడివోవ నళు లానగా రేకు లెడలి, యుడుదేనె లైన పర్యుషితపుష్పములు."
- పండితా. పురా. 89. పు.
ఉడుపకుక్క
- వేటకుక్క.
- "ఉడుపకుక్కలు కుందేళ్ళ నుందరువుల నుడుముల గ్రహింప." మను. 4. 51.
ఉడుబోతు
- విరక్తుడు.
- బ్రౌను.
ఉడుముపట్టు
- గట్టిపట్టు. ఉడుము నేల కరుచుకున్నదంటే గొలుసులువేసి లాగినా రాదు. అందుపై యేర్పడినది.
- "వాడిది ఉడుముపట్టు. చచ్చినా వదలడు." వా.
- చూ. భల్లూకపుపట్టు.
ఉడ్డతిత్తులు
- గచ్చకాయల తిత్తులు. మూడు గచ్చ కాయలను పొయిగుండ్లవలె పెట్టి, వానిమీద ఒక గచ్చకాయ పెట్టి వానిని మరొక గచ్చకాయతో కొట్టడం అలవాటు. ఇదే గచ్చకాయలాట అయినది. లక్షణయా ఉడ్డలు గచ్చకాయ లయినవి. ఆపెట్టు పద్ధతినిబట్టి వచ్చినదే ఉడ్డ = నాలుగు అన్న అర్థము. ఈ 'ఉడ్డతిత్తుల'కు అడ్డతిత్తు లని ముద్రితప్రతులలో ఇచ్చిన పాఠం సరి కాదు.
- "మెత్తగ నూఱినచుట్టుం, గత్తిర మధుకైటభోరు కంఠము లలనా, డొత్తిన హత్తిన చెన్నుం, దిత్తుల క్రియ దొడల నుడ్డతిత్తులువ్రేలన్." పాండు. 2. 33.
- చూ. ఉడ్డపొడలు.
ఉడ్డపల్లంచి
- ఆడపిల్లల ఆట.
ఉడ్డపొడలు
- గచ్చకాయ తిత్తులు.
- "పెరుగు నుడ్డపొడలున్." పాండు. 5. 56.
- చూ. ఉడ్డతిత్తులు.
ఉడ్డబుగడలు
- చెవి పై వేపు రంధ్రం వేసి పెట్టుకొనే ఆభరణం. నడుమ ఒక గొట్టం, పైనా క్రిందా నాలుగు పూజలను సమానంగా ఉంచి దానిపైన ఒక పూజను ఉంచి అతికి చేస్తారు. ఈ పూజల సంఖ్యను అలా పెంచుకొని పోవడం కూడాకద్దు. అడుగున ఎక్కువ సంఖ్యా, క్రమంగా తగ్గుతూ ఉడ్డా____ఉడ్డు 206 ఉడ్డు____ఉత్త
వచ్చి ఆఖరున ఒకేపూజ నిలిచి గోపురాకారంగా తయారవుతుంది. వీటిని నేటికీ రాయలసీమ పల్లెపట్టులలో కొందఱు ధరిస్తారు. బుగడలనే అంటారు. వావిళ్లలో చంపసరులు, నాలుగుపేటలు గల హారవిశేషం అనడం సరికాదు.
- ఉడ్డలవలె పూజలను ఉంచి అతుకుటతో ఉడ్డబుగడలైనవి.
- "ఉడ్డబుగడలు కట్లసరులు." గంస.
ఉడ్డాడించు
- క్షోభపెట్టు, కలతపెట్టు.
- "వాపోచున్ క్షుధ గుంది చాల సుతు లవ్వా! బువ్వ బువ్వంచు స,ల్లాపెన్ జీర్ణపటాపకర్షముల నుడ్డాడింపగా జూచి." మల్ల. భూ. వై. 21.
- చిత్తూరుప్రాంతంలో ఉడకాడించు అనేరూపంలో విశేషంగా వినవస్తుంది.
- "ఈ పిల్ల లంతా నన్ను ఊరికే ఉడకాడిస్తున్నారు." వా.
ఉడ్డాడు
- కలగు, క్షోభించు.
- చూ. ఉడ్డాడించు.
ఉడ్డు కుడుచు
- కళవళము చెందు.
- "ఉదవాసక్లేశంబున నుడ్డుకుడిచి వెలుపటికిం బుట మెగయుచు." పాండు. 3. 150.
- చూ. ఉడ్డు గుడుచు.
ఉడ్డుగుడుచు
- ఉక్కిరి బిక్కిరి యగు.
- "బేతాళములు నీళ్ళ వ్రేసి త్రొక్కగ బాసి, యుదు టెల్ల బెడబాసి యుడ్డుగుడిచె." దశా. 2. 409.
ఉతికి ఆరవేయు
- ఎదుటివాని లోపముల నన్నిటినీ యేకరువుపెట్టి విడుచు; చితకతన్ను.
- "వాడు రానీ చెప్తా, ఉతికి ఆరవేస్తాను." వా.
- "నాలుగు ఉతికి ఆరవేస్తే గానీ వాడు మాట వినడు." వా.
ఉత్తచేతుల మూరలు వేయు
- ఏమీ లేకనే గొప్పలకు పోవు. బట్టలు లేకనే మూరవేయడం, యోగ్యత లేకనే హెచ్చులకు పోవడంగా ఇట సూచన.
- "వాడు ఎప్పుడూ ఉత్తచేతులతో మూరలు వేస్తుంటాడు." వా.
ఉత్తపుణ్యానికి
- వృథాగా. కొత్త. 16.
- "ఉత్త పుణ్యానికి పదిరూపాయలు పోగొట్టుకున్నాను. వాడు జోస్యం చెప్పిందీ లేదు. అది అయ్యిందీ లేదు." వా. ఉత్త_____ఉత్త 207 ఉత్త_____ఉత్త
ఉత్తమరతి
- రతిభేదము. కుమా. 9. 152.
ఉత్తరకుమారప్రజ్ఞలు
- వట్టి డంబాలు. భారంలో ఉత్తరుడు తానే పశువులను మళ్లించెద నని వెళ్లి, తుదకు కౌరవసేనను చూడగనే వణకిపోయి వెనుకకు పారిపోవ జూచాడు అనుకథపై యేర్పడిన పలుకుబడి.
- "ఈ ఉత్తరకుమారప్రజ్ఞల కేం చాలానే చెప్పవచ్చు. అసలు పోలీసులు కనిపించగానే పారిపోయేవాడివి. నీకు సత్యాగ్రహ మేమిట్రా." వా.
ఉత్తరక్రియలు
- అపరక్రియలు. చనిపోయిన తరువాత చేసే కర్మకలాపం.
- "అతనంత బాగా బతికాడా! కడకు ఉత్తరక్రియలకు కొడుకు తిరిపె మెత్తవలసి వచ్చింది." వా.
ఉత్తరజందెము
- చూ. ఉత్తరజన్నిదము.
ఉత్తరజన్నిదము
- బ్రహ్మచారి మూడుపోగులతోడి ఒక ముడి, గృహస్థు అలాంటివి రెండు వేసుకోవా లని విధి. మూడవది ఉత్తరీయార్థం వేసుకుంటారు. అది ఉత్తరజందెం.
- "ఇభ కుంభమణు లెడనెడ గూర్చు గురివెంద, జమలియుత్తరజన్నిదములు దనర." రావి. 3. 34.
ఉత్తరడొక్కరము
- కుస్తీపట్లలో ఒకటి.
ఉత్తరమీమాంస
- మీమాంసాశాస్త్రం రెండుభాగాలు - పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. జైమినికృత మైన పూర్వమీమాంస కర్మజిజ్ఞాసకు చెందినది. వ్యాసకృత మైనఉత్తర మీమాంస బ్రహ్మజిజ్ఞాసకు చెందినది.
ఉత్తరవయస్సు
- వృద్ధాప్యం.
ఉత్తరవస్త్రం
- చూ. ఉత్తరవాసం.
ఉత్తరవాసం
- పైపంచ, అంగవస్త్రం.
- "వెలిపట్టు పుట్ట ముత్తరవాసముగ ధరించి." నైష. 8. 108.
- చూ. ఉత్తరవస్త్రం.
ఉత్తరాసంగము
- చూ. ఉత్తరవాసం.
ఉత్తరాషాడ పూర్వాషాడ అగు
- వాంతులు భేదులు అగు, ఎక్కువ భయము కలుగు, ఉత్త____ఉత్త 208 ఉత్త_____ఉద
పూర్వం, ఉత్తరం అన్న శబ్దసామ్యంతో యేర్పడినట్లు కనబడుతుంది. అటూ ఇటూ అనుట.
- "వాణ్ణి చూచేసరికి వీనికి ఉత్తరాషాడ పూర్వాషాడ అయింది." వా.
ఉత్తరించు తములపాకు నిక్కెడుక్రియ
- ఆకుతోటలో, బొటనవ్రేలి గోటికి ఒక ఇనుపగోటిని తగిలించుకొని తమలపాకులను ఠకీ మని కత్తిరిస్తారు. అప్పుడది యెగసి పడుతుంది.
- "ఉత్తరించు తములపాకు నిక్కెడుక్రియ దాటె నిఱ్ఱి." ఉ. హరి. 4. 28.
ఉత్తరీయము
- పైపంచ, అంగవస్త్రము.
- చూ. ఉత్తరవాసం.
ఉత్తరువు లిచ్చు
- ఆజ్ఞాపించు.
- "తరువు లాకసము కుత్తరువు లిచ్చు." యామున. విజ. 4. 229.
ఉత్తరోత్తరా
- ముందుముందుకు, కాలక్రమేణ.
- "ఇప్పడు రాజీ చేసుకోవడంవల్ల ఉత్తరోత్తరా మీకు చాలా లాభాలు ఉన్నవి."
- చూ. ఉత్తరోత్రా.
ఉత్తరోత్తరాభివృద్ధి
- క్రమాభివృద్ధి.
- "పొత్త మిటు సేయ నీ కుత్తరోత్తరాభివృద్ధియని..." ఆము. 17.
- "ఉత్తరోత్తర మభివృద్ధి నొందుచుండు." కాశీ. 2. 52.
ఉత్తరోత్రా
- వాడుకలో ఈ రూపం కనిపిస్తుంది.
- చూ.ఉత్తరోత్తరా.
ఉత్తలపడు
- తహతహపడు.
- "చిత్తం బుత్తలపడియెడు." సింహా. 1. 62.
ఉత్సవవిగ్రహము
- అలంకారవిద్యార్థి వంటిది. ఊరేగింపునకుమాత్రం పనికివచ్చేది; మూలవిరాట్టు కాదు.
- "వాడు వట్టి ఉత్సవవిగ్రహం; లోపల సత్తాసార మేం లేదు." వా.
ఉదకమాడు
- స్నానము చేయు.
- "ఒక్కప్రొద్దుండి సెలయేట నుదకమాడి." కాశీ. 3. 37.
- "మహారయమున గొలవ నుదక మాడగ బోవన్.: కా. మా. 3. 208
ఉదపానమండూకము
- నీటిలోని కప్ప.
- చూ. కూపస్థమండూకము.
ఉదయరాగపట్టులు
- వస్త్రభేదము.
- ద్వాద. 3. 206.
ఉదరపోషకులు
- పొట్ట నింపుకొనువారు. దూషణలోనే ఉపయుక్తం.
- పండితా. ప్రథ. పురా. పుట. 343. ఉద______ఉది 209 ఉది______ఉదు
- "ఉదరపోషకులా పొరుగున జేరి." త్యాగయ్య.
ఉదరము మాడు
- కడుపు మాడు. క్షుత్పీడ కలుగు.
- "బడబాగ్ని ఘనతరజ్వాలలు మండంగ నుదరంబు మాడె ననగ." కా. మా. 4. 63.
- చూ. కడుపుకాలు.
ఉదాత్తానుదాత్తస్వరితములు
- వేదపఠనంలోని స్వరభేదములు. "నమస్తే రుద్రమన్యవ" ఇక్కడ పై గీతలు ఉదాత్తమును, క్రింది గీతలు అనుదాత్తమును తెలుపును. స్వరితం పైన మఱింత ఆపి పలుకుతారు.
- బస. 7. 184.
ఉదిరిపడు
- అదరిపడు.
ఉదిరిమల
- మేరుపర్వతము.
- "ఉదిరిమలతోడ నొరయగ నెదిరిన దొర-" రాజవాహనవిజయము. 2. 79.
ఉదిలకొను
- అధైర్యపడు, సంభ్రమపడు, వ్యాపించు.
- "బెదర వజ్రాయుధు హృదయ, ముదిలకొనగ ద్రిదశగణము..." భార. ఆది. 2. 21.
- "కృష్ణు డొక్కింతవడి కోర్కి సుదిల కొనియె." హరి. పూ. 3. 252.
- "వారివాహవ్యూహంబులు కడ లవియ జదల మదిలకొనియె." హర. 6. 58.
- "మదనవికృతు లంతంతకు నుదిల కొనగ." కేయూర. 4. 7.
- దీనికి దగ్గఱగా ఉండే అర్థాలలో ఇది ప్రయుక్త మౌతూ ఉంటుంది.
ఉదిలగొను
- చూ. ఉదిలకొను.
ఉదుక చాలు
- క్షాళనము చేయగలుగు, పోగొట్ట జాలు.
- "మొదలియది పాపముల నెల్ల నుదుకజాలు." భీమ. 6. 17.
ఉదుటారు
- త్రుళ్లి పడు.
- "..గుబ్బ చను జక్కవలు...పైఠిణీ రవికలో నుదుటారగ..." కాళిందీ 2. 95.
ఉదుటు సూపు
- అతిశయించు.
- "ఱెక్కహొన్నంచుపక్కెర యుదుటు నూప." దశా. 2. 66.
ఉదుటెక్కు
- అతిశయించు.
- "దీని చూ పుదుటెక్కగానె కా సిరి పట్టి, కిని బోర బిరుదు డెక్కెంబు గలిగె-" ఆము. 6. 105.
ఉదురుమిడుకు
- ఒక తిట్టు. అదిరి అదిరి పడేవాడు, దుర్మార్గుడు. ఉద్ద______ఉద్ది 210 ఉద్ది_______ఉద్ధా
- "ఉద్ధతులు గొంట్లు పలుగాకు లుదురు మిడుకులు." హర. 5. 10.
- కకు. 5. 87.
ఉద్దండపిండము
- ఘటికుడు.
- "ఊరు వెడలె నందు రుద్దండపిండంబు నాగనార్యు డెందు డాగినాడొ." రుద్రమ. 70. పు.
- చూ. ఉక్కుపిండము.
ఉద్దండుడు
- ఘటికుడు.
- "వాడా? అబ్బా! ఉద్దండుడు." వా.
ఉద్దరకు వచ్చు
- తేరకు వచ్చు. రాయలసీమలో ప్రచురంగా వినవస్తుంది. ఉధార్ అన్న మాట తెనుగయిన దిక్కడ.
- "ఇదేమి ఉద్దరకు వచ్చిందా? పంచిపెట్టడానికి." వా.
ఉద్దిగొను
- జత గూడు. నేటికీ పిల్ల లాడుకొనేఆటలలో ఇద్దరిద్దరు ఒక్కొక్క ఉద్దిగా పరిగణించడం అలవా టుంది. ఇదే ఉజ్జీలు.
- "ఇద్దఱు ముద్దియ లుద్దిగొని వీణ లందుకొని..." భాగ. 10. పూ. 1082.
ఉద్ది చేయు
- జోడించు, కలుపు.
- "యూపములు నూత్రములతోడ నుద్దిచేసి." కాశీ. 7. 88.
ఉద్దియ చేయు
- ఉద్యమించు. ఈ 'ఉద్దియ' ఉద్యమములో కానవస్తుంది.
ఉద్ధతము లాడు
- గొప్పలు పలుకు.
- "ఈరీతి నతడు శస్త్రని, దారితభుజు డయ్యు నుద్ధతము లాడుచు రా,గా." జైమి. 5. 75.
ఉద్దరించాడు:
- వ్యంగ్యంగా ఎవరినిగూర్చి అయినా వాడు చేసిం దేముంది అనేఅర్థంలో ఉపయోగించే పలుకుబడి.
- "తా నేదో మహా పొడిచేస్తున్నట్లు తీరుబడి లేక రాలే నని వ్రాశాడు. ఉద్ధరించాడు!? వా.
- చూ. ఉద్ధారం చేశాడు.
ఉద్దరిస్తున్నాడు
- ఉంచుకొన్నాడు.
- "వాడు దానిని ఉద్ధరిస్తున్నా డట." వా.
ఉద్ధారం చేశాడు
- వాడు చేసిం దేమీ లేదు అనే అర్థంలో ఉపయోగించే పలుకుబడి.
- "ఇక్క డింత ఉద్ధారం చేశాడు. ఇక అక్కడ ఉద్ధారం చేస్తాడు! చూస్తూనే ఉంటాం గా." వా.
- చూ. ఉద్ధరించాడు.
ఉద్దారింపు
- తాను చేసిన ఘనకార్యం! ఉద్యా_____ఉద్వా 211 ఉద్వా_ఉన్న
- "వాడు చేసిన ఉద్ధారింపు ఏ ముంది." వా.
- చూ. ఉద్ధరించాడు.
ఉద్యాపన సేయు
- విసర్జించు. వ్రతాదులలో ఉద్యాపనపై వచ్చిన పలుకుబడి. వ్రతం ముగిశాక ఉద్యాపనం.
- "విప్రమార్గ ముద్యా,పన సేతురె నిన్ను వంటి బ్రాహ్మణకులజుల్." నిరంకు. 2. 130.
ఉద్యోగరాఘవుడు
- కార్యప్రవణుడు.
- "ఉద్యోగరాఘపుం డని, పద్యంబుల నూక గేరి పంచల జదువన్, విద్యాధికులకు వల్లము, చోద్యంబుగ విడిచి లంజ చూడగ నిచ్చున్." బహులా. 5. 83. పు.
ఉద్వాసన అగు
- స్థానభ్రంశ మగు.
- "వాడు ఆ ఊళ్ళోనూ దురుసుగా ప్రవర్తించా డట. అక్కడా ఉద్వాసన అయిం దని విన్నాను." వా.
- "వానికి ఆఫీసునుంచి ఉద్వాసన అయింది." వా.
- చూ. ఉద్వాసన చెప్పు.
ఉద్వాసన చెప్పు
- తొలగించు, స్థానభ్రష్ట మొనరించు. పూజాపునస్కారాలలో కలశాదులను ప్రతిష్ఠించుట, ఆపని తీరిన వెనుక ఉద్వాసనచేసి వాని నటనుంచి తొలగించుట ఆచారం. ఆ తొలగించుటనే ఉద్వాసనం అంటారు. అందుపై వచ్చినపలుకుబడి.
- "వీడి సంగతి నలుగురికి తెలిసేసరికి ఆ ఊరినుంచి ఉద్వాసన చెప్పారు." వా.
- చూ. ఉద్వాసన అగు.
ఉద్వాసన చేయు
- చూ. ఉద్వాసన చెప్పు.
ఉనికిపట్టు
- స్థానము.
- "విజయంబునకు నీత డునికిపట్టు." ఉ. రా. 5. 140; సుదం. 3. 194,
- చూ. ఉన్కిపట్టు.
ఉన్కిపట్టు
- నెలవు.
- పాండు. 1. 193.
- చూ. ఉనికిపట్టు.
ఉన్నట్టుండి
- హఠాత్తుగా.
- "వాడు ఉన్నట్టుండి అక్కడికి వచ్చాడు." వా.
- "ఉన్నట్టుండి వానికి జబ్బు చేసింది." వా.
ఉన్నది పుష్ఠి
- కలిమి మాత్రమే బలము.
- "ఉన్నది పుష్టు మానవుల కోయదుభూషణ యాలజాతికిన్, దిన్నది పుష్టి..." పాండవో. 8.
ఉన్న దున్నట్టుగా
- యథాతథముగా.
- "వచియించెద మున్నది యున్న రీతిగా." నానా. 18. ఉన్న______ఉన్న 212 ఉన్న______ఉన్నా
ఉన్నపట్టున ఊరక యుండు
- తనపాటికి తాను ఉండు. ఒకరిజోలికి పోకుండా అనుట. ఇది రాయలసీమలో ఇట్లాగే ఉపయోగిస్తారు. పట్టున 'పాట్న'గా మారుతుంది.
- "ఉన్నపట్టున నూరక యుండ వింటి పక్షపాతు లటంచును బల్క దగునె?" రాజగో. 2. 71.
- "ఉన్నపాట్న ఊరికే ఉండకుండా ఊరిసంగ తంతా నీ కెందుకోయ్?" వా.
ఉన్న యునికిన
- ఉన్న దున్నట్లుగా.
- "తన యింట రాత్రి నెమ్మది, నునికి గలిగె బిదప నున్నయునికిన యడగెన్." ఉ. హరి. 6. 5.
- చూ. ఉన్నయునికినె.
ఉన్న యునికినె
- ఉన్నట్లుండి, హఠాత్తుగా, ఉన్న పళాన్నే అని నేడు కోస్తాప్రాంతాలలో; రాయలసీమలో 'ఉన్న దున్నట్టుగా రావలసినదిగా కోరుతున్నాను' అని ఉత్తరాల్లో వ్రాస్తారు. తత్క్షణం అనుట.
- "ఉన్నయునికినె వెలువడ నుత్సహింప, దలచి తేనియు నిది తుది దాక నెట్లు, నెయిద నేరదు గాన నీ విందయుండి...సర్వేశు గొ;ఉపుము. బాల." కుమా. 6. 13.
- చూ. ఉన్నయునికిన.
ఉన్నరూపు
- కలరూపు. ఉన్న సంగతి, యథార్థము.
- "ఇంక నెన్నండు దయ బరమేశ్వరుండు, గన్ను దెఱచునొ యని తన కున్నరూపు నెఱయ జెప్పిన విని." కుమా. 7. 19.; కాశీ. 4. 100.
- చూ. కలరూపు.
ఉన్నవాడు
- సంపన్నుడు.
- "వాడు ఆ ఊళ్లో కాస్త ఉన్నవాడు." వా.
- చూ. కలవాడు.
ఉన్నవాడూ కాదు ఊడినవాడూ కాదు
- నిష్ప్రయోజకుడు. వాడు చచ్చినట్లూ కాక బతికినట్లూ కాక ఉన్నాడు అనుట.
- "వాడు ఉన్నవాడూ కాదు ఊడినవాడూ కాదు. తెచ్చి పెట్తే తింటాడు. లేకపోతే పైగా తిట్లూ దీవెనలూ." వా.
ఉన్నారె యనుమాట మాత్రకైన ఎడగలదె నీకు
- మా అస్తిత్వాన్నైనా అడిగే సావకాశం ఉన్నదా? లేదనుట. కనీసం ఆమాత్రమైనా పలుకరించడం లే దని.
- "మమ్ము నున్నారె యనుమాట మాత్రకైన, నెడగలదె నీకు మాకొలు విపుడు గాక." కళా. 7. 19.
- వాడుకలో 'మేమున్నా మని మాటమాత్ర మడిగేందుకు ఉప___ఉప 213 ఉప___ఉపే
తీరుబడి ఉందా?' ఇత్యాదిగా మారుతుంది.
- "మేము ఉన్నా మనైనా నీకు జ్ఞాపకం ఉందా? ఏమప్పా ఎట్లా ఉన్నారు? అని మాటవరుస కైనా అడిగేందుకు నీకు తీరుబాటు కాలేదే? ఇంత నీవు మమ్మల్ని ఏమి ఉద్ధరిస్తావు?" వా.
ఉపకార మెక్కించు
- ఉపకారము చేయు.
- "మీచేత వెళ్ల నాడించుకొని మీ కుపకారం బెక్కించి విడుచుటకు వచ్చినదని." ప్రభా. 4. 31.
ఉపగ్రామాలు
- శివారుగ్రామాలు.
- "బస్తీ దక్షిణము తిరువల్లిక్కేణి... మొదలయిన కొన్ని ఉపగ్రామాలు ఉన్నవి." కాశీయా. 372.
ఉపదర్శన మాచరించు
- పెత్తనము చేయు; ఏదైనా పనిని పర్యవేక్షించు.
- "త్రిపురాంతకు బిలిపింపక, యుపదర్శన మాచరించు టుచితమె హరికిన్." కాశీ. 7. 58.
ఉపదేశము చేయు
- మంత్రమును ఉపదేశించు, హితము చెప్పు.
- "స్వాములవారు అతనికి బాలాత్రిపురసుందరీ మంత్రం ఉపదేశం చేశారట!" వా.
- "నీ వేం ఉపదేశం చేసి పంపావో? కాస్త ఈమధ్య నీ అల్లుడు పొదుపుగా ఉంటున్నాడు." వా.
ఉపనయనము
- వడుగు. పంచదేశ సంస్కారాలలో ఒకటి.
ఉపనయనమునాటి మాట
- యాచన, భిక్ష మెత్తుట. ఉపనయనంలో 'భవతి భిక్షాం దేహి' అని మూడుసార్లు భిక్షం ఎత్తించుటపై యేర్పడినపలుకుబడి.
- "ఎవడూ అన్నం పెట్టక పోతే ఉపనయనమునాటి మాట ఉండనే ఉంది." వా.
ఉపరిరతి
- రతివిశేషములలో భేదము.
- కుమా. 9. 152.
ఉపవడ మగు
- మేలుకొను.
- "పువ్వారుబోణి మదిలో, నివ్వెఱపడి చూచుచుండ నృపు డుపవడ మై." శుక. 1. 313.
ఉపవాసము చేయు
- ఒక్కప్రొద్దు ఉండు.
- "ప్రతి శివరాత్రికీ అతను ఉపవాసం చేస్తాడు." వా.
ఉపాదాన మెత్తు
- బిచ్చ మెత్తు.
- "తలమీద మంత్రాక్షతము లుంచి కలకాపు, టిండ్ల నుపాదాన మెత్తి యెత్తి." హంస. 2. 152. పు.
ఉపేక్ష చేయు
- ఉదాసీనముగా చూచు.
- "ఈ సుకుమారదేహు డిపు డీవని నుండ నుపేక్ష చేసినం, దోసము వచ్చు..." శుక. 1. 282. ఉప్ప____ఉప్ప 214 ఉప్ప____ఉప్ప
- "ఇప్పుడు పిల్లవా డని ఉపేక్ష చేస్తే తర్వాత తర్వాత విచారింపవలసి వస్తుంది." వా.
ఉప్పకు చప్పకుగా చూచు
- అలక్ష్యముగా చూచు, సర్వ సామాన్యంగా చూచు.
- "ఒకతెవలె వాడి యాడిం, చుకొనుట నే యిరుగు పొరుగు చూ చెనొకో యు,ప్పకు జప్పకుగా నను జూ,చుక నడువగవలె." నిరంకు. 2. 59.
- చూ. ఉప్పచప్పగా ఉండు.
ఉప్పచప్పగా ఉండు
- అంత రుచిగా లేక సర్వసాధారణంగా ఉండు. పైది వాడుకలో ఉప్పచప్పగా, ఉప్పన చప్పగా అని మారింది. భావచ్ఛాయ కూడా మారింది. 'ఏదో చాలాసేపు పాడాడు కాని ఉప్పచప్పగా ఉంది' అంటే అంత ప్రత్యేకత లేదని భావం.
- "ఏదో ఉప్పచప్పగా ఉంది నాటకం." వా.
ఉప్పని చప్పని
- రుచి లేని; ఉప్ప చప్పగా ఉన్న.
- "ఊరును బేరు లేని యొక యుప్పని చప్పనికావ్య మల్లు." బుద్ధ. 1. 12.
- చూ. ఉప్పచప్పగా ఉండు.
ఉప్పనపట్టె లాడు, ఆడించు
- ఒకరక మైనఆట ఆడు. ఉప్పుపట్టీలు, ఉప్పరపట్టెలు ఇవే.
- "పడతి! నీచూపు లుప్పనపట్టె లాడించి చెలులవక్త్రముల బూజించు గాక." ఉ. హరి. 5. 141.
ఉప్పరగుళ్లు
- ఒక బాలక్రీడ.
- పండితా. ద్వితీ. మహి. పుట. 179.
ఉప్పరపట్టెలు
- చూ. ఉప్పనపట్టె లాడు.
ఉప్పరము దాటు
- ఆకాశ మంటు; వ్యాపించు.
- "అంటిన గందునో యను మేనినును గాంతి, యిరుగెలంకులకు నుప్పరము దాటు." విక్ర. 8. 101.
ఉప్పర మెగయు
- ముమ్మర మగు; మిన్ను ముట్టు.
- "అప్పలుకుల కలుకలు మది నుప్పర మెగయంగ." ఉ. హరి. 5. 220.
- చూ. ఉప్పరము దాటు.
ఉప్పరవట్టములు
- పైన వేసే మేలుకట్లు, చాందినీలు. అలంకారార్థం పట్టణాలలో దేవాద్యుత్సవాలలో అక్కడక్కడా చతురస్రంగా స్తంభాలు నాటి, వాటిపైన చాందినీలు కట్టి అలంకరిస్తారు. నగరము నలంకరించుటకు దారిప్రక్క నెత్తుగా కట్టు ఉప్ప____ఉప్ప 215 ఉప్పి____ఉప్పు
ధ్వజాదిక మని వావిళ్ళనిఘంటువు.
- పండితా. ద్వితీ. మహి. పుట. 179.
ఉప్పరవీది
- ఆకాశమార్గము.
- "తే రుప్పరవీది దోలుకొని." భార. భీష్మ. 2. 90.
ఉప్పరా లెగయు
- మీది కెగయు; మిన్ను ముట్టు; అతిశయించు.
- "గుప్పెడినిట్టూరుపుల గోమలి హారము లెల్ల, ఉప్పరా లెగయ జొచ్చె వోయమ్మా!" తాళ్ల. సం. 12. 327.
ఉప్పరిపెనమున నీరువలె
- కుతకుతలాడు. పెనంమీద నీరు వేడెక్కి కళపెళ ఉడికి పోతుంది.
- "వనరాసు లేడు నుప్పరి, పెనమున నీరమును బోలె బెల్లున నుడికెన్ (గెన్)..." కుమా. 6. 155.
ఉప్పరిసాహిత్యము
- గొల్లనిసాహిత్యవిద్య వంటిది. ఆకాలంలో ఉప్పరివాళ్ల కేం చదువొస్తుంది అనుకునేభావం పై ఏర్పడింది.</big
ఉప్పవడ మగు
- మేలుకొను.
- "పవడించి యంతను,ప్పవడమగుచు." పరమ. 3. 56.
- "ఉప్పవడము గావయ్యా ఉయ్యల మంచముమీద." తాళ్ల. 1. 62.
- చూ. ఉపవడ మగు.
ఉప్పిండి
- ఉప్పుపిండి. తమిళంలో ఉప్పుమావు.
ఉప్పిండి ఉపవాస ముండు
- ఉప్పుపిండి మాత్రమే తిని ఉపవాస ముండు.
- "ఓర్పుమై నుప్పిండి యుపవాసముండనీ, మగనాలి సరిపోల్ప దగదు విధవ." కాశీ. 2. 83.
ఉప్పిడి
- ఉపవాసము. ఉప్పిండి ఉపవాసములో ఇది మాత్రమే మిగిలి ఉపవాసం అనే అర్థం తెలుపునదిగా మారినపలుకుబడి.
- "పలుతెఱగుల నుప్పిడుల్ సలుప వలదు." అచ్చ. అయో. 54.
ఉప్పిడిపథ్యం
- ఉప్పులేని పథ్యం. కొన్ని రోగాలకు, కొన్ని మందులకు ఉప్పు పులుసు తినకూడ దని వైద్యులు పథ్యం పెడతారు. ఆయుర్వేదం ద్వారా వచ్చిన పలుకుబడి.
- చూ. చప్పిడి పథ్యం.
ఉప్పు ఉంటే ఊరగాయ ఉండదు
- బొత్తిగా లేనిసంసారం అనుట. ఉప్పు____ఉప్పు 216 ఉప్పు____ఉప్పు
- "వాళ్లింట్లో ఏముంది? ఉప్పు ఉంటే ఊరగాయ ఉండదు. ఊరగాయౌంటే ఉప్పు ఉండదు." వా.
ఉప్పుకు పత్రికి కాక పోవు
- దేనికీ పనికి రాక పోవు.
- "నేను చేసిం దంతా ఉప్పుకూ పత్రికి కాక పోయింది." వా.
- "వాడు ఉప్పుకూ పత్రికి కాకుండా పోయినాడు." వా.
ఉప్పుకు వస్తుందా ఊరగాయకు వస్తుందా
- దేనికీ పనికి రా దనుట.
- "ఈ లేనిపోని మాటలతో లాభ మేముంది? ఉప్పు కొస్తుందా? ఊరగాయ కొస్తుందా?" వా.
ఉప్పుగండలు
- ఉప్పులో ఊరవేసిన మాంసం ముక్కలు.
- "ఉప్పుగండ లెండబెట్టినవిధమున్." కుమా. 11. 175.
ఉప్పుగండలు చేయు
- ముక్కలు ముక్కలుగా నఱకు. ఉప్పులో ఊరవేయుటకై తగినంతచిన్నగా అనుట.
- "దుప్పుల బడనేసి యుప్పగండలు చేసి, చప్పరించుచు నుండు జవులుమఱచి." వాల్మీ. 2. 129.
ఉప్పుగల్లు వోలెbig>
- ఏకాకిగా; ఉప్పురాయివలె; లేక లేక ఒకడుగా.
- "సుతుల్స్ నేడ్వురను మ్రింగితిని తోడ్తో నిల్చెం, గడపట నొక డుప్పుగల్లువోలె." జైమి. 4. 78.
- "నా, కుప్పుగలువోలె గలిగిన, యిప్పాపని దీని కేడ యిచ్చితి మెసవన్." వేం. పంచ. 5. 25.
- రూ. ఉప్పుగలువోలె.
ఉప్పుగాయ
- ఊరగాయ.
- "మీ గడల్ పెరుగు లుప్పుల గాయలున్." అని. 1. 105.
- కన్నడం-ఉప్పుగాయ. ఉప్పిన గాయ. తమిళం-ఉప్పిక్కాయ్.
ఉప్పుగుండాలు
- పిల్లల ఆట.
ఉప్పు చిదిమి యినుమడి యగు
- పడిపోయి అధిక మగు. కొంత నష్ట మైనట్లు కనిపించినా, దానివల్ల మఱింత లాభము కలుగుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- "బ్రాహ్మణ్యంబె కాక భాగవతశ్రీయునుం గలిగి యుప్పు చింది యినుమడి యగు చందంబునం..." ఆము. 7. 24.
- చూ. ఉప్పొలికి ఇమ్మడి అయినట్లు.
ఉప్పుచేప
- ఉప్పులో ఊరవేసిన చేప. హంస. 4. 187,
ఉప్పుటుండలు
- ఆవిరితో చేసిన పిండివంట.
- శ్రీ. రం. మా. 6. 110. ఉప్పు____ఉప్పు 217 ఉప్పు____ఉప్పు
ఉప్పుడుబియ్యము
- వడ్లను ఉడకబెట్టి ఆరబోసి దంచినబియ్యము.
- "ఉప్పుడుబియ్య< అన్నం త్వరగా జీర్ణమవుతుంది." వా.
ఉప్పు తిని ముప్పు తలచు
- తిన్న యింటివాసాలు లెక్కించు.
- "అలాంటివాణ్ణి మనం చేరదీస్తే యేం లాభం? ఉప్పు తిని ముప్పు తలచే రకం." వా.
ఉప్పు తిను
- సొత్తు తిను, పోషింపబడు. ఉప్పు భోజనంలో ప్రధానమైనది కనుక అది భోజనానికే ప్రత్యామ్నాయ మైనది.
- "తొంటిజని వాని యుప్పటు, తింటి జుమీ యింతపాటు దెచ్చుకొనుటకై." శుక. 3. 411.
- "వాని ఉప్పు తిన్నాను. కష్టసుఖాల్లో వానితోనే ఉండడం న్యాయం." వా.
ఉప్పుతో తొమ్మిది
- అన్ని పదార్థాలూ.
- "ఉప్పుతో దొమ్మిదియును వెట్టి కృపణ రక్షణము గావించు నీగుణసముద్రుడు." రామా. 1. 107.
- "ఉప్పుతో తొమ్మిదీ వాళ్లింటికి అత్తవారింటినుండి రావలసిందే." వా.
ఉప్పుపట్టీలు
- చూ. ఉప్పనపట్టె లాడు.
ఉప్ప పట్టు
- ఉప్ప దనము అంతటా వ్యాపించు.
- "ముక్కలకు ఉప్పే పట్ట లేదే? ఇంకాసేపు ఉంచితే పోయేది." వా.
ఉప్పు పత్తిరి లేని
- ఎందుకూ పనికి రాని, ఏమీ లేని.
- "ఉప్పు పత్తిరి లేని యప్పు డవ్వారి శి,ష్యోపశిష్యులపోల్కె నుండవలయు." గీర. 30
ఉప్పు పత్రి
- అడ్డూ ఆగీ. జం.
- "ఆనోటికి ఉప్పూ పత్రీ లేదు." వా.
ఉప్పు పెఱిక
- ఉప్పుసంచి.
- "పోతుమీద నడ్డంబువడి యుప్పు పెఱికవోలె వెఱచె జముడు." కుమా. 2. 73.
ఉప్పున పాతఱ వేయు
- శిక్షించు. పూర్వం వేసే శిక్షలలో ఉప్పులో ఊరవేయడం కూడా ఒకటి. అందుపై వచ్చినపలుకుబడి.
- "చిత్రాంగిని తుదకు ఉప్పున పాతఱ వేశారు." వా.
ఉప్పుపఱ్ఱ
- చవిటి నేల.
ఉప్పు లేక ముప్పందుము త్రాగు
- వట్టి తిండిపోతురాము డగు. ఉప్పు లేనిదే రుచి యేమాత్రం ఉండదు. దానినే అంత త్రాగినప్పుడు రుచిగా ఉంటే యింక యెంత త్రాగునో! ఉప్పూ_____ఉప్పో 218 ఉబ_____ఉబ్బ
- "అద్దిరా! మీ యొడళ్లు మీ యొద్ద లేవు గదా! ఉప్పు లేక ముప్పందుము త్రాగుచు గద్దెపొంకములు చాల దిద్దగలరే?" ధర్మజ. 46. 14.
ఉప్పూ నిప్పూ
- సహజవిరోధ మనుట.
- "వాడికి వీడికి ఉప్పూ నిప్పూ. వాడూ వీడూ కలవడం ఎలా సాధ్యం?" వా.
ఉప్పెనబోవు
- గంగ గలియు, వరదపాలగు.
- "మ్రోల వచ్చినకల్పసాల ముప్పెన బోయె." కా. మా. 4. 111.
ఉప్పెనవలె
- హఠాత్తుగా. వరద హఠాత్తుగా వస్తుంది.
- "వాడు ఉప్పెనలా వచ్చాడు." వా.
ఉప్పొంగు
- పొంగు.
- "జలరాసు లేడు నుత్సవమున నుప్పొంగె." రుక్మాం. 1. 142.
ఉప్పొలికి ఇమ్మడి అయినట్లు
- ఉప్పు క్రింద పోయి రెండింత లయినట్లు. నష్టము కల్గునట్టి పని జరుగగా, అందువల్ల లాభమే అగు.
- పండి. ప్రథ. పురా. 387 పు.
- చూ. ఉప్పు చిదిమి యినుమడి యగు.
ఉప్పో ఊరగాయో
- ఉన్న దానిలో ఏదో ఒకటి. భోజనవిషయంలోనే ఉపయోగించే పలుకుబడి.
- "ఉప్పో ఊరగాయో యేదో ఒకటి వేసుకు తింటే పోతుంది. అంత శ్రమ యెవడు పడతాడు?" వా.
- "ఉప్పో ఊరగాయో మాకు కలిగింది లేదనకుండా పెడతాము. తినిపో నాయనా!" వా.
ఉబలాటపడు
- ఒక కార్యమునకై యెక్కువగా ఉత్సహించు.
- "వాడు ఆపిల్లను పెళ్ళి చేసుకోవా లని మహా ఉబలాట పడుతున్నాడు." వా.
ఉబుసుపుచ్చు
- కాలక్షేపము చేయు.
- "అతివ! యెపుడు నుబుసు పుత్తురు వివిధోపయోగ్యకళల." పారి. 2. 93.
ఉబుసుపోక
- కాలక్షేపము. కబురులు చెప్పుకొనుట.
- "ఉబుసుపోకకు నైన నొల్లపు చెవిజేర్ప, వైణికవల్లకీవాదనములు." వరాహ. 2. 56.
- "జలరుహేక్షణ లుబుసు పోకల వసించి." విప్ర. 2. 65.
- ఆముక్త 2. 74. మను. 4. 24.
ఉబుసుపోవు
- కాలక్షేప మగు.
- "ఉబుసుపోవంగ శివశర్మ యొయ్యం జేరె, నప్సరోలోకము." కాశీ. 3. 165.
ఉబ్బనీయకు
- వెలికి తెలియనీయ వద్దు.
- "ఈ కథయును నీకు నాతోడు సం మ్ముబ్బనీకు మనియె." కళా. 1. 194. ఉబ్బ_____ఉబ్బి 219 ఉబ్బు_____ఉభ
ఉబ్బనీరు
- ఉమ్మి.
ఉబ్బనెత్తు
- పై కెత్తు.
- "నీటిలో మునిగిననేలచేడియ గొమ్ము, కొన నుబ్బ నెత్తినఘోణి వీవ." పారి. 1. 49.
ఉబ్బర పోవు
- సంతోషించు. ఉబ్బిపోవడ మంటే సంబరపడడ మన్నది నేటికీ అలవాటులో ఉన్నది.
- "సూ,ర్యోదయ వేళ ముజ్జగము నుబ్బర పోవగ." కాశీ. 6. 17.
ఉబ్బరిక చేయు
- విజృంభించు, అతిశయించు.
- భాగ. 10. పు. 1345.
ఉబ్బవేయు
- పొగడు. అది హృదయపూర్వకం కాదన్నధ్వనీ ఇందులో ఉన్నది.
- "వాడు వాళ్ల అత్తను ఉబ్బవేసి తనపని గడుపుకొంటున్నాడు." వా.
ఉబ్బసపుచ్చు
- ఆయాసపడు.
- "నావుడు నుబ్బసపుచ్చును." ద్వాద. 2. 85.
ఉబ్బి తబ్బి బ్బగు
- సంతోషపరవశు డగు. సంతోషమో, భావోద్రేకమో కలిగినప్పుడు శరీరం ఉప్పొంగడం కవులు గుర్తించినసత్యం. వీరునికి భుజములుప్పొంగుట యిలాంటిదే. ఒకప్పుడు ఎత్తిపొడుపుగా కూడా ఈ పలుకుబడి ప్రయుక్తం కావడం కలదు. ఇతరుల పొగడ్తకు ఉబ్బి తబ్బి బ్బవుతాడు అని వ్యవహారం. ఉబ్బవేయు యిలాంటిదే.
- "దైవయోగంబువలన బ్రమాదం బని తలంపక రాజసన్మానంబునకు నుబ్బి తబ్బిబ్బుగా బచరించిన." శుక. 1. 186.
- "ఆయన కావ్యంనుండీ ఒక పద్యం ఉటంకించేసరికి ఉబ్బి తబ్బి బ్బయి పోయినాడు." వా.
ఉబ్బుకుడుము
- ఆవిరికుడుము.
ఉబ్బుసగ్గులు. జం.
- "ఉబ్బు సగ్గు లేనిచ్చలు బోటును బాటు." తాళ్ల. సం. 6. 56.
ఉభయం
- దైవపూజకు ఒక రోజు ఖర్చు భరించుట.
- "ఈ రోజు శివాలయంలో ఉభయం నారాయణసెట్టి గారిది." వా.
ఉభయాలు
- భోజనసామగ్రి. పొయ్యిమీదికీ, పొయ్యి కిందికి పనికి వచ్చునవి. ఉభ_____ఉమ్మె 220 ఉమ్మె_____ఉరి
ఉభయఖర్చులు
- పెండ్లిలో ఆడ పెండ్లి వారి, మొగపెండ్లివారి ఖర్చులు రెండూ.
- "ఉభయఖర్చులూ మేమేభరిస్తా మని చెప్పాం కదా!" వా.
ఉమేజువారి పని
- పై తనిఖీ చేయుపని.
- "ఉమేజువారీ పని చేయడాని కేం? ఎవరైనా చేస్తారు." వా.
ఉమ్మాయజగ్గాయలు
- య: కశ్చనలు. వాడూ, వీడూ; పే రెత్తి చెప్పదగినవారు కారు అనుట.
ఉమ్మాయముత్యము
- మాయముత్యము.
ఉమ్మెత్తకాయకు చిలుక పొంచి యున్నట్లు
- అనవసర మైనఆశతో వేచి ఉన్నట్లు. ఉమ్మెత్త విషఫలం. అది చిలుక తినుట కెలాగూ పనికి రాదు.
- "రాతికి సరి వచ్చురా వీని మనసు, కరగబో దుమ్మెత్తకాయకు జిలుక, పొరసినవిధ మాయె బో తనవలపు." సారం. 1. 551.
ఉమ్మెత్తకాయ తిన్న పొలుపు
- వెఱ్ఱి యెత్తినట్లు. ఉమ్మెత్తకాయలు తింటే పిచ్చిపట్టుతుం దని మనవారి నమ్మకం.
- "కంతుమాయల నుమ్మెత్తకాయ దిన్న, పొలుపు సారెకు దెల్పు న ప్పుడమి వేల్పు." శుక. 2. 459.
ఉమ్మెత్తకాయలు తిను
- వెఱ్ఱెత్తు. ఉమ్మెతకాయలు తింటే పిచ్చి పడుతుం దని అంటారు. అందుమీద వచ్చిన పలుకుబడి.
- "ఉమ్మెత్తకాయలు తిన్న యదియొ, మరులుకొన్నదియో మున్, మతి తప్పి నదియో." పండితా. దీక్షా. ప్రథమ. 115 పు.
ఉయ్యల లూగు
- సందిగ్ధావస్థలో ఉండు.
- "...భీతిచే నుయ్యెల లూగుప్రాణముల నోర్వక చీరెద వీట జూచితే..." హంస. 3. 45.
ఉయ్యాలో జంపాలో
- ఊచునప్పుడు అను ఊతపదం.
- "జోలల్ పాడిరి యమృతపు, జాలుం జోకొట్టజాలు సరసపు జూపుల్, డోలాయమానముగ ను,య్యాలో జంపాలో యనుచు నాలోలాక్షుల్." సారం. 1. 48.
ఉరిగోల
- ఉరివేయు కోల.
ఉరిగోల పులుగు
- ఉరిలో చిక్కినపక్షి. బాధ పడునది. ఉరి____ఉరి 221 ఉరి____ఉరు
- "విలసిల్లు నురిగోల వేదన బొందు పులుగు చందంబున బొరలుచుండితిమి." ద్విప. జగ. 210.
ఉరితీయు
- ఉరివేసి చంపవలె నని శిక్షవేయు.
- చూ. ఉరివేయు.
ఉరి పెట్టుకొ మ్మను
- నిరసనగా 'ఏమైనా చేసుకొమ్మను' అనుపట్ల అనేమాట. కొత్త. 13.
ఉరిపోసికొన్నట్లు
- ఎక్కువ యిబ్బందిగా.
- "నీతో ఉరిపోసికొన్న ట్లుంది." వా.
ఉరిపోసుకొను
- చూ. ఉరివోసుకొను.
ఉరియాడు
- డోలాందోళిత మగు.
- "మనం బురియాడన్." రుక్మాం. 4. 134.
ఉరివేయు
- కొఱతవేయు.
- చూ. ఉరితీయు.
ఉరివోసుకొను
- 1. మెడకు త్రాడువంటి దానిని తగిలించుకొని ఆత్మహత్య చేసికొను.
- 2. ఉరి పోసుకొన్నంత భాధపడు.
- "ఆ అమ్మాయి ఉరిపోసుకొని చనిపోయిం దట." వా.
- "వాడితో ఉరిపోసుకొన్నట్లుగా ఉంది." వా.
ఉరిసినపుండు కోల కెలకు
- బాధ పడుచున్న వానిని మఱింత బాధ పెట్టు. శకుం. 3. 171.
ఉరిసినపుండుపై ఉప్పు చల్లు
- అసలే బాధ పడుతుండగా మరింతబాధ కలిగించు. గోరుచుట్టుపై రోకటిపోటు వంటిది.
- "ఉరిసన పుండుపై నుప్పును జల్లి, కెరల జేసెదవు..." గౌర. హరి. ద్వి. 1255-1256.
- రూ. ఉరిసినపుండ్ల ఉప్పుపెట్టు.
- "అరులు మనమీద నురవడి నరుగుదేర నేము సిడిముడి పడుచుండ నిట్టు లనుట, యొప్ప దురసినపుండుల నుప్పు వెట్టె, దరయ దీనికి నిన్ను నే మందు బార్థ." భార. ద్రో. 5. 358.
ఉరుమనిపిడుగు లగు
- వజ్రప్రాయము లగు.
- "ఉరుమని పిడుగు లై యొడలు చిల్లులు వోవ, బడుమరుకోలల." రాధి. 2. 21.
ఉరురతి
- రతిలో ఒక భేదము. కుమా. 9. 152.
ఉరువులు
- వస్తువులు, శాల్తీలు.
- "మొత్తం ఉరువులు చిన్నవీ పెద్దవీ కలిసి ఇరవైనాలుగు. సరిగ్గా ఉన్నాయో లేవో చూచుకోండి." వా. ఉఱు____ఉఱ్ఱూ 222 ఉఱ్ఱూ____ఉలి
ఉఱుమనిపిడుగులు
- ఉఱుము లుఱుమకయే పడిన పిడుగులు. అనగా పూర్వ సూచన లేకయే అనుట. పండితా. ద్వితీ. మహి. పుట. 9.
ఉఱ్ఱకట్టు
- పశువులకు వేయు కాలి బందము.
ఉఱ్ఱట లూగు
- ఉఱ్ఱూత లూగు.
- "సి గ్గుఱ్ఱట లూగ..." కృష్ణ. శకుం. 2. 57.
ఉఱ్ఱట లూచు
- ఉఱ్ఱూత లూగునట్లు చేయు.
ఉఱ్ఱట్లూగు
- ఉఱ్ఱూత లూగు.
- "బ్రహ్మాండభాండ ముఱ్ఱట్లూగన్." శశాం. 5. 36.
- "వాడు పెండ్లి కావా లని ఉఱ్ఱట్లూగుతున్నాడు." వా.
- చూ. ఉఱ్ఱట లూగు.
ఉఱ్ఱట్లూచు
- చూ. ఉఱ్ఱట లూచు.
ఉఱ్ఱుతాడు
- పశువులు మొదలయినవాని కాళ్లకు వేసేబందం.
- "కుఱ్ఱల బట్టగ నుఱ్ఱుంద్రాళ్ళు వలదు, కుండ యొడ్డన బాలు నిండ గురియు." మై. రా. 1. 57.
ఉఱ్ఱూత లూగు
- ఉఱ్ఱట లూగు.
- "కోడెవయసుపాక ముఱ్ఱూత లూగెడు భార్యమీద,... మనసు చాలించి..." హంస. 5. 115.
ఉఱ్ఱూత లూపు
- కదలించు.
- "నిర్వక్రరథచక్ర నిష్ఠురగతు లనం తోరగస్వామి నుఱ్ఱూత లూప." రాధా. 5. 21.
ఉలఉల లాడు
- దురద పెట్టు.
- "దానికి ఎప్పుడూ నోరు ఉల ఉల లాడుతూ ఉంటుంది. ఏదో ఒకటి అనకుండా ఉండదు." వా.
ఉలారం గొడ్డు
- పొగరెక్కిన గొడ్డు.
ఉలికిపడు
- అదరిపడు. అకస్మాత్తుగా ఏదయినా విని నప్పుడో, కనినప్పుడో సంభ్రాంతి చెందు. విజయ. 3. 62..
ఉలికిపాటు
- అదిరిపాటు.
ఉలిపికట్టె
- పెడసరపు మనిషి.
- "ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెది ఇంకో దారి." సా.
ఉలిపిజంగెత
- ఉలిపికట్టె వంటిది.
- "ఉలిపి, జంగెత నీ వేల చనుదెంచి తిట్లు." పండితా. ప్రథ. దీక్షా. పుట. 149. ఉలి____ఉలు 223 ఉలు_____ఉల్ల
ఉలియాడు
- పోగరతో లోహములమీద, కఱ్ఱలమీద చిత్రములు చిత్రించు.
ఉలివాడు
- కదలు.
- "కొమరొందు నవవిలాసముల కంబొమ లులి, వాడు చూపుడు గోల లగుచు దనర..." కళా. 2. 172.
ఉలివాళుల వాడు
- సుండ్రుకొని పోవు.
- "మీసలు గడ్డము, నులివాళులు వాడుచుండు నొందినభీతిన్." కుమా. 10. 101.
- 'మీసాలు కాలిపోతాయి జాగ్రత్త' అని వాడుకలోనూ ఉంది.
ఉలివెచ్చ
- గోరువెచ్చ.
ఉలుకబాఱు
- వెలికి ప్రసరించు.
- "ఒడలి తాంతులు పట్టు లే కులుకబాఱు, సన్న వలిపంపు బయ్యెద చౌకళించి." భాగ. 8. 363.
ఉలుప నించినకై వడి
- కానుకగా వచ్చిన పదార్థములు ఉంచినట్లు; ప్రదర్శన ముంచినట్లు.
- "ఒలుపు బప్పు మొదల్గొని తెచ్చి యన్నియున్, వేఱుగ నింటిలో నులుప నించినకైవడి నుంచె." శుక. 3. 189.
ఉలుప పట్టు
- కానుక లిడు. పాండు. 5. 238.
ఉలుపా యొనగూర్చు
- నజరానా పెట్టు; బహుమతులు కానుకలు ఇచ్చు.
- "రాజురాక కులుపా యొనగూర్చిన యట్లు...." కళా. 6. 134.
ఉలుపా లొనరించు
- కానుక లిచ్చు. ఉల్ఫా అనే పదంనుండి వచ్చి యుండవచ్చును.
- "విశేషవస్తు సంభావన లెల్ల నిచ్చి యులుపా లొనరించి పురంబు జేరినన్." శుక. 1. 399.
ఉలువకట్టు
- ఉలవ లుడికించి చేసిన చారు.
- "నాలుగు రోజులు నీవు ఉలవకట్టు వేసుకొంటే నీశైత్యం వదలి పోతుంది." వా.
ఉల్లకుట్టుమాటలు
- ఎత్తిపొడుపు మాటలు.
- "సమరమునకు బురికొల్పుచు, మముదలచిన నుల్లకుట్టుమాటల దచ్చి,త్తము లుడికించుచు బాండవ, సమితిం గడగించువా రచట నెవ్వ రొకో!" భార. ఉద్యో. 2. 242.
- "ఈ ఉల్లకుట్టు మాటలతోనే ఆవిడ అందరినీ ద్వేషం చేసుకుంటుంది." వా.
- రూ. ఉల్లికుట్టుమాటలు.
ఉల్లము పల్లవించు
- సంతోషము కలుగు. ఉల్ల_____ఉల్లి 224 ఉల్లి_____ఉల్లి
- "వనరుహ నేత్రి దేల్చె యదువల్లభు డుల్లము పల్లవింపగన్." రాజగో. 2. 79.
ఉల్లము ఱాయి చేసికొను
- కాఠిన్యము వహించు.
- చూ. మనసు ఱాయి చేసికొను.
ఉల్లల నుడుకు
- గగ్గోలము, గందరగోళము అగు. కుతకుత ఉడుకు ధ్వన్యనుకరణము.
- "తన చిత్తమున, దనుకగ నుల్లల నుడుకును, విని శిఖిచో రాది ముఖ్య విషయా పదకున్." భార. శాంతి. 4. 34.
- "దనుజు లుల్లల నుడుకన్." కుమా. 12. 25.
- "ఓషధిప్రస్థ ముల్లల నుడుకుచుండ. హర. 5. 10.
ఉల్లస మాడు.
- పరిహసించు.
- "మొల్లల నుల్లసం బాడి యాణిముత్తియంబుల నుత్తరించి...పలువరుసయు." పాండు. 3. 179.
- చూ. ఉల్లసము లాడు.
ఉల్లసము లాడు
- పరిహాస మాడు.
- "ఒండొరువుల గరువంబుగ నుల్లసంబు లాడుచును." భార. భీష్మ. 1. 112.
ఉల్లి కుట్టుమాటలు
- ఎత్తిపొడుపు మాటలు.
- "సమరమునకు బురికొల్పుచు, మము దలచిన నుల్లికుట్టు మాటల దచ్చి,త్తము లుడికించుచు..." భార. ఉద్యో. 2. 242.
ఉలుప వట్టు
- కానుక లిడు. పాండు. 5. 238.
ఉలుపా యొనగూర్చు
- నజరానా పెట్టు; బహుమతులు కానుకలు ఇచ్చు.
- "రాజురాక కులుపా యొన గూర్చిన యట్లు...." కళా. 6. 134.
ఉలుపా లొనరించు
- కానుక లిచ్చు. ఉల్ఫా అనే పదంనుండి వచ్చి యుండవచ్చును.
- "విశేషవస్తు సంభావన లెల్ల నిచ్చి యులుపా లొనరించి పురంబు జేరినన్." శుక. 1. 399.
ఉలువకట్టు
- ఉలవ లుడికించి చేసిన చారు.
- "నాలుగు రోజులు నీవు ఉలవకట్టు వేసుకొంటే నీశైత్యం వదలి పోతుంది." వా.
ఉల్ల కుట్టుమాటలు
- ఎత్తిపొడుపు మాటలు.
- "సమరమునకు బురికొల్పుచు, మము దలచిన నుల్లకుట్టుమాటల దచ్చి,త్తము లుడికించుచు బాండవ, సమితిం గడగించువా రచట నెవ్వ రొకో!" భార. ఉద్యో. 2. 242.
- "ఈ ఉల్లకుట్టు మాటలతోనే ఆవిడ అందరినీ ద్వేషం చేసుకుంటుంది." వా.
- రూ. ఉల్లికుట్టుమాటలు.
ఉల్లము పల్లవించు
- సంతోషము కలుగు. ఉల్లి____ఉవ్వె 225 ఉవ్వి____ఉవ్వి
ఉల్లి పాషాణము
- ఒకరక మైన విషము.
ఉల్లిపొరవంటి
- మిక్కిలి పల్చ నైన.
- "వా డెప్పుడూ ఉల్లిపొరలాంటి మల్లు పంచలు కడతాడు." వా.
ఉల్టా సీదా
- పైన ఒకటి, లోపల ఒకటి అనుట. ఇది గుడ్డనేతద్వారా వచ్చిన పలుకుబడి. నేతలో పైన నున్నగా లోపల గరుకుగా ఉండునట్లు నేసేనేత ప్రసిద్ధము.
- "ఈ పని అంతా ఉల్టాసీదాగా ఉంది." వా.
- చూ. ఉల్టాసీదామనిషి.
ఉల్టాసీదా మనిషి
- వంచకుడు.
- "వాడు వట్టి ఉల్టాసీదామనిషి. అన్నదంతా నిజ మనుకోకు." వా.
- చూ. ఉల్టాసీదా.
ఉవ్వలపోటి
- బాలక్రీడావిశేషము.
ఉవ్వెత్తుగ
- 1. పూర్తిగా, సులువుగా.
- "నను నువ్వెత్తుగ బాఱ మీటితివి." వసు. 2.
- "ఆవ యువ్వెత్తుగ ద్రావినట్లు." పాండు. 5.
- "బలౌఘములన్ నుఱుమాడి వైచె నువ్వెత్తుగ." కళా. 8. 57.
- హఠాత్తుగా, ఒక్కుమ్మడిగా.
- "ఉవ్వెత్తుగ జుట్టుముట్టుకొని యీటెల డొంకెనలన్..." కళా. 8. 58.
- "కాని యువ్వెత్తుగా వీడగా దరంబె." దేవీ. 1. 487.
ఉవ్విళులూరు
- ఉవ్విళ్లూరు. ఎందుకోసమో అత్యుత్సుకతతో నుండు.
- "ఉవ్విళు లూరెడునెమ్మనంబులు." విరాట. 5. 393.
ఉవ్విళులూర్చు
- ఉవ్విళు లూరునట్లు చేయు.
ఉవ్విళ్ళుగొను
- ఉవ్విళ్లూరు.
- "కలహాశనమౌని చూడ్కు లువ్విళ్ళు గొనంగ జొచ్చె." కవిక. 2. 150.
ఉవ్విళ్ళు గొలుపు
- ఉవ్విళు లూరునట్లు చేయు. ప్రభా. 3. 66.
ఉవ్విళ్ళూరు
- మిక్కిలి ఆశపడు.
- "విను నీ రూపము సూచి మా నృపతి యువ్విళ్లూరు నే నెమ్మెయిన్, బని గొందున్." భార. విరా. 1. 321.
- "అత డువ్విళ్ళూరెడు." హరి. ఉత్త. 6. 116.
- "అత డువ్విళ్లూరెడు బలవన్మదోద్ధతి యడపన్." హరి. ఉ. 6. 116. పాండు. 5. 22.
- "వాడు పెళ్లి చేసుకోవా లని మహా ఉవ్విళ్లూరుతున్నాడు." వా. ఉవ్వి____ఉసి 226 ఉసు____ఉసు
ఉవ్విళ్ళూర్చు
- ఉవ్విళ్లూరునట్లు చేయు. కాశీ. 4. 150.
ఉసి ఆడు
- వీలు చిక్కు.
- "పదిరూపాయ లయినా యీనెలలో యిస్తా మనుకుంటే యేమీ ఉసి అడ్డం లేదు." వా.
- చూ. ఉసి చిక్కు, ఉసి దొరకు.
ఉసి కొల్పు
- కవ్వించు. కుక్కను ఉసికొల్పుట పై వచ్చినపలుకుబడి.
- "ఉసికొల్పి వంచించి దుసుకుల చనుదోయి చేనంట." రాధికా. 1. 124.
ఉసి చిక్కు
- ఏదో వీలు కలుగు.
- "ఏమి చేద్దా మన్నా ఆఫీసుపనితో ఉసి చిక్కడం లేదు." వా.
- చూ. ఉసి ఆడు.
ఉసి దొరకు
- చూ. ఉసి చిక్కు.
ఉసి యిచ్చు
- ప్రోత్సాహ మిచ్చు.
- "కాస్త ఉసి యిస్తే వా డెంత పనైనా చేస్తాడు." వా.
ఉసివోవు
- తప్పిపోవు.
- "ఏసినయే టుసివోయె బోయినన్, మానితి నిస్సిరో యనుచు." కకు. 4. 57.
ఉసు రను
- అలసి పడిఉండు.
- "ఉండ లేక నీవద్దనే వుసు రంటి గాక." తాళ్ల. సం. 3. 29.
ఉసురసు రను
- ఆపసోపాలు పడు.
- "తా నుసురసు రంచు ఖిన్న యయి యొయ్యన." హరి. 4. 113.
ఉసురుకొను
- కోలుకొను, బలపడు. కాశీ. 3. 23.
ఉసురు గలిగితే ఉప్పమ్ము క బ్రతుక వచ్చును
- ఊపిరి ఉంటే ఉప్పమ్ముకొని బ్రతుకవచ్చు. సా.
- "ఉసురు......పద పదండ్రా." హేమా. పు. 18.
ఉసురు తగులు
- ఎవరి నైనా బాధించగా ఆ పాపఫలితము చుట్టుకొను.
- "ఆ పిల్లను అంత వేధించాడు. ఆ ఉసురు తగిలే నాశన మై పోయాడు. వా.
- చూ. ఉసురు తాకు.
ఉసురు తాకు
- ఈ మనోవేదనవల్ల, ఆ వేదనకు కారణ మైనవానికి చెరుపు తప్పక కలుగును అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- "పాన్పు కెక్కించి తనప్రక్క బవ్వళింప, గోరి నే జూడ ఱేలు తా గుడిచి కట్టి, యూరకే యిల్లు వెడలు ఉసు_____ఉసు 227 ఉసు_____ఊక
నా యుసురు తాకి, దీపములు సైత మల్లాడు దెఱవలార!" శుక. 2. 63. పే.
- "ఆ భార్యను వాడు నానా బాధా పెట్టి హింసించాడు. ఆవిడ ఉసురు తాకి వీడు పుట్టగతులు లేకుండా పోయాడు." వా.
- చూ. ఉసురు తగులు.
ఉసురు పెట్టుకొను
- వేధించు, బాధించు.
- "వాడి ఉసురు ఎందుకురా పెట్టుకొంటావు." వా.
- చూ. ఉసురు పోసుకొను.
ఉసురు పోసుకొను
- చూ. ఉసురు పెట్టుకొను.
ఉసురు మను
- బాధపడు, దు:ఖించు.
- "ఆడది యుసురు మన్న, గొఱగాదు సుమీ." సా. 2. 123.
- "ఆడకూతురిని ఉసూరు మనిపిస్తావు దేనికి రా?" వా.
- "వాడు ఉసూరు మంటూ ఈ ఊరు వదిలిపెట్టి పోయాడు." వా.
- "వాడు ఉసూరు మంటూ వచ్చాడు." వా.
- చూ. ఉస్సు రను.
- రూ. ఉసూరు మను.
ఉసుల నిచ్చు
- కదల నిచ్చు; ఉసి దొరక నిచ్చు.
- "మొదల నీయరు... వసుల పాతర లై వీరు నుసుల నీయరు." సారం. 2. 127.
ఉసుఱుకొను
- కలకలలాడు; కోలుకొను.
- "పెసరుసుఱుకొనియె." కాశీ. 3. 23.
ఉసుళ్ల విధంబున
- అధికముగా. వాన వచ్చినప్పుడు ఉసుళ్లు విపరీతంగా చెలరేగుటమీద వచ్చినపలుకుబడి.
- "వెల్లి విరిసినచాడ్పున నుసుళ్ల విధంబున మిడుతలగమిలాగున..." హంస. 3. 29.
- ఇది నేటికీ వాడుకలో నున్నది.
- "ఉసుళ్ల పుట్ట పగిలినట్లుగా జనం వచ్చారు." వా.
ఉస్సు రని యూర్చు
- నిట్టూర్చు.
- "అడుగుల బుప్పొడు లంటి చుర్రడుచుచో, నుస్సురు మని వెస నూర్చి యూర్చి." కవిక. 3. 92.
ఉస్సు రను
- నిట్టూర్పు పుచ్చు-బడలికతో
- "అంతదూరం వచ్చి ఉస్సురు మంటూ కూలబడ్డాడు." వా.
- చూ. ఉసురు మను.
ఉస్సురస్సురు మను
- ఉస్సు రను, ధ్వన్యనుకరణము.
- "అతిశయిల్ల నుస్సురస్సు రనుచు." పరమ. 3. 148.
ఊకదంపు
- నిష్ప్రయోజనము. వట్టి ఊకను (పొట్టు) దంచినట్లనుట; తేలే దేమీ ఉండదు కదా.
- "వాని దంతా వట్టి ఊకదంపు ఉపన్యాసం." వా.
- చూ. ఊకదంపుపాట.