పదబంధ పారిజాతము/అంబ
అంపా_________అంబ 18 అంబ________అంశ
అంపాచారంపు వానలు
- జడివానలు.
- "అంపాచారంపు వానలప్పుడు కురిసె." వి. పు. 7. 67.
అంపించు
- పంపు.
- చూ. అంపబంపు.
అంపుదోళ్ల వెధవ
- ఒకతిట్టు. అసమర్థుడు.
అంబకళము
- అంబలి.
- ఈ అంబకళమే అంబలి అయి యుండవచ్చును.
- "అతని నగర గాచునంబకళంబు ప్రతి వచ్చునే." బస. 5. 152 పు.
అంబటిప్రొద్దు
- దాదాపు తొమ్మిదిగంటలవేళ, ఉదయము.
- అంబళ్లు తాగేప్రొద్దు అనుటపై ఏర్పడినది. రాయల సీమలో రైతులు, కార్మికులు ఇత్యాదులు ఉపయోగించే పలుకుబడి.
- "అంబళ్లప్రొ ద్దయింది. త్వరగా చేలోకి వెళ్లాలి." వా.
- "అంబటిప్రొద్దు కాగనె" పె. పా.
అంబ పలక లేదు
- డబ్బు చిక్క లేదు, పని కాలేదు అనుపట్ల ఉపయోగించేపలుకుబడి.
అంబళ్ళపొద్దు
- చూ. అంబటిప్రొద్దు.
అంబస్తు
- లోకజ్ఞానము లేనివాడు. ఆం. భా.
అంబాజీపేట ఆముదం
- పట్టుకొంటే వదలని.
- ఇది స్థానికంగా యేర్పడిన పలుకుబడి.
అంబూకృతి చేయు
- తూథూ అని మూయు, ఉమ్మి వేయు.
- "కెం పగుచూడ్కి జూచి యం, బూకృత మాచరించుటకు బుద్ధి దలంక."
- పాండు. 3. 95.
అంబేద
- దుర్బలుడు, అసమర్థుడు.
- "వేదుఱు బల్కి న న్నదర వేయగ జూచెదు ఇందు నంత నంబేదలు లేరు." పద్మ. 3.
- "వాడు ఒట్టి అంబేద. వాణ్ణి పంపించి ఏం లాభం?" వా.
అంబోదర గిడ్డడు
- బాన కడుపువాడు.
అంశ చక్రము
- జాతకంలో రాశిచక్రం కాక అంశ చక్రం ఒకటి ఉంటుంది. ఏ ఏ నవాంశలో యే గ్రహాలున్నదీ, లగ్నం ఏ నవాంశ అయినదీ తెలిపే చక్రం. అంశ________అక 19 అక_________అకా
అంశ పురుషుడు
- దశావంతుడు.
- "వాడు చాలా అంశ పురుషుడు. అడివిలోకి వెళ్ళినా వాడి కన్నీ అమరుతాయి." వా.
- చూ. అంశ మంచిది.
అంశ మంచిది
- దశావంతు డనుట.
- "వాడి అంశ చాలా మంచిది. చేసినా చేయక పోయినా దర్జాగా నడుస్తూ ఉంది."" వా.
అంశలో ...
- దశలో....
- జ్యోతిశ్శాస్త్రరీత్యా వచ్చిన పలుకుబడి. ఏ లగ్నంలోని యే అంశలో పుట్టాడు అన్న దానిపై ఫలితాలు చెప్పడం జ్యోతిశ్శాస్త్ర సంప్రదాయం.
- "వా డిప్పుడు మంచి అంశలో ఉన్నాడు. మనలాంటివాళ్లను పలకరిస్తాడాఆ?"
- "వాడు మంచి అంశలో పుట్టాడు. ఏం వచ్చినా వాణ్ణి ఏం చెయ్యదు." వా.
- చూ. అంశ మంచిది.
అకట(టా)వికటం అగు
- పరిహాసపాత్రమగు అస్తవ్యస్తమగు.
- "వాడు ఏది మాట్లాడినా అకటవికటమే."
- "ఆ పని అంతా అకటావికటం అయిపోయింది." వా.
అకటావికటపు మనిషి
- వక్రంగా మాట్లాడేవాడు.
అకటావికటపు రాజు అస్తవ్యస్తపు ప్రధాని అన్నట్లు
- ఎగుడుదిగుడుగా పాడుపాడుగా ఉన్న దనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- జానపద కథలలోనుండి వచ్చిన పలుకుబడి. ఆ పేరు గలరాజు, ప్రధాని ఒక ఊళ్లో ఉంటారు. వాళ్లు రాత్రి అంతా పని చేయా లని పగ లంతా నిద్ర పోవా లని శాసిస్తారు.
- "వాళ్లింటి వ్యవహారం అంతా అకటావికటపు రాజు అస్తవ్యస్తపుప్రధాని అన్నట్లుగా ఉంది." వా.
అకస్మాత్తుగా
- ఉన్నట్లుండి.
- "వాడు అకస్మాత్తుగా అక్కడికి వచ్చాడు." వా.
అకాండతాండవం
- అసందర్భప్రసంగం; అనవసర ఆవేశం.
- "వాడిది వట్టి అకాండతాండవం."
- "అనే దేదో వాడి యెదుట అనక యింట్లోకి వచ్చి అకాండతాండవం చేస్తా వేమిటి?" వా.
అకారతుగా
- అకారణంగా.
అకాలకూష్మాండం
- నిరర్థకజన్మ మనుట, నిష్ప్రయోజకు డనుట.
- "వాడు ఒట్టి అకాలకూష్మాండం." వా.