పండ్రెండు రాజుల కథలు/కృష్ణార్జునుల యమునాతీరవిహార కథ

1 కృష్ణార్జునుల యమునాతీర విహారకథ.

శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడును, నారాయణ శోడశకళాంశసంభూతుండును, జగన్నాటక సూత్రధారియు జగజ్జేగీయమానకోమలశ్యామలాకారుండును, యమ, నియ, మాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, నిష్ఠాగరిష్ఠుండును, స్థావరజంగమాద్యభికృదార్ధాంతర్యామియు, యోగిజనహృన్మండల మండితాంతర్వర్తియుఁ ద్రిమూర్త్యాత్మకదివ్యస్వరూపియు, భక్తజనాభయప్రదానశీలుడుసు, చిదానంద విగ్రహుండును, జ్ఞానప్రపూర్ణతేజోరాశియునగు శ్రీమన్నారాయణుండు, భూభారావతరణార్ధమై శ్రీకృష్ణ నామధారియై మానవయోని నుద్భవించి, భూలోకై కకైవల్యంబునాఁ బ్రసిద్ధంబైన ద్వారకాపురంబున సమస్తయాదవలోక చక్రవర్తియై లీలా వినోదంబులం దేలియుండుచుండ, నొక్కదినంబున, తద్దేవదేవుని జననీ జనకులగు దేవకీవసు దేవులు, కృష్ణవిలాసమందిరాభ్యంతరంబున కరు దెచి, తద్దేవ దేవునివలనను, అష్టమహిషీమండలమునలనను, స్కొ రోదిసన్మానములంబడసి సుఖాసీనులై యున్నంత. దేవకీ దేవి దరహ సీతాననాబ్జ యై నిజపుత రత్న ముందిలకించి, "కుమారా! కతిపయదినం బులకుఁ బూర్వము కుంతీసుత మధ్యముండును, నీమేనమబిందియునగు పార్ధుండు భూప్రదక్ష్మి ణమిషంబున రైవత కాద్రిసీమణ గొన్ని దినంబులు సన్యాసి వేషంబున, నివసించియుండుటయు. తత్పూజార్ధమై నీరున్న యగు బలభద్రునిచే నియమితయైన నీ చెలియలగు సుభద్రయచు చిత్తంబుహత్తించి, గాంధర్వవిధిం బరిణయం బాడి, యతిరహస్యంబుగ నాబాలంగొని, నిజనివాసంబున కరుగుటయు, నీకు సువేద్యంబులే యగుట వెండియుం బునరుక్తిగా వచింపంబని లేదు. అన్యోన్య ప్రణయ నిబద్దమానసులును, మేనత్త మేనమామబిడ్డలును నగు, సుభద్రార్జునుల వివాహమునకు మనమందఱమును నామోదించి వారల సన్మానించుటయే కర్జంబని, నీతండ్రిగారును, మనకులవృద్ధులును సయితము నిర్ణయించియున్నవారు; కావున నీవు కతీపయ సేనాసమేతుండవై —— శుభ వస్త్రాభరణాలంకారాదులంగాని యింద్రప్రస్థంబుసకరిగి, చెల్లెలిని,మేనమఱందిని సన్మానించిరమ్ము. ఇదినీకవశ్యాచరణీయం” బని యాజ్ఞ యొసంగ నయ్యాదవకిశోరుఁడు వల్లెయని మాతృశాసనఁబు నౌదల ధరించి, యింద్రప్రస్థంబున కరుగ నాయత్తుండయ్యె.

అనంతరము—— భగవానుండగు శ్రీకృష్ణుడు, ధారాధరోపమానంబులగు, దివ్యస్యందనములతోడను, దిగ్దంతావళతుల్యంబులగు దంతావళంబులతోడను, నువ్ఛైశ్రమసమంబులగు తురంగంబులతోడను, గంధర్వకాంతా తిలకింబుల నపహసించు సుందరదాసీజనసహ స్రంబుతోడను, నవరత్న ఘటితా మూల్యాభరణ చీనీ చీనాంబరంబుల తోడను, విచిత్రసాలభంజికలతోను, యనంతసుగంధ ద్రవ్యంబుల తోడను, భేరీ భాంకారాది మంగళవాద్యంబులతోడను, దివ్య స్యందనంబు నొండధిరోహించి, ద్వారాకాపురంబునువదలి యింద్రప్రస్థ నగరాభి ముఖుండై నిర్గమించుడరి నప్పురింగల, మత్తకాశివులు చిత్తజతూణీరా యత్తంబులగు చిత్తంబు లుత్తలపాటునొంద, చిత్తజ మోహనుండగు నప్పురుషోత్తముని వియోగంబునకుఁదాళజాలక, మగిడి యనతి కాలంబున నా దేవదేవుని దివ్యదర్శనముం దమకుఁగల్గించునిమిత్తము, పర మేశ్వరధ్యానంబుల నొనరింపసాగిరి.

అట్లు పయనంబైన మానవుం డనతి కాలంబున నింద్రప్రస్థంబునకుఁ జేసి, ముందుగాఁ దమరాకం బాండవ సహోదర పంచకంబున కెఱిఁ గింప, నప్పాండుసుతాగ్రజుండగు యుధిష్ఠిరుండు నిజసహోదర చతుష్టయంబుతోఁగదలి పుర బహిఃప్రదేశంబుననే, కేశవు నెదుర్కొని సన్మా నింప, నాగోపాల దేవుండు దర్మజునకు నమస్కరించి, భీముం గౌఁగిలించుకొని, పార్థుని నమస్కృతులనంది, కవల నాశీర్వదించి, యందఱితోఁగలసి మహానందంబున సరససల్లాపంబులనాడుచుఁ బుర ప్రవేశం బొనరించెను. అంత యుధిష్ఠిరుండు, శ్రీకృష్ణునకు తదనుగమ్యమానులగు పరిచార పరిచారికావర్గంబులకునుం దగిన విడుదులంజూపి, మార్గశ్రాంతిని, వాసి సుఖోపవిష్టుండై యున్న పిదప నాముకుందునిఁగాంచి సాధువచనంబుల "నో ఫురుషోత్తమా! అజరుద్రసురేంద్రాదులకైన నలభ్యంబగు నీ బాంధవంబు మముఁబోటి ప్రాకృతజనులకుఁ గల్గుట మాపురాకృత పుణ్యవిశేషంబ ——దాని నట్లుండనిమ్ము——మహా రాజాధిరాజులును, దివ్యర్షి చంద్రులును, బహువర్షఁబుల యుష్మన్మందిర ద్వారంబునఁ బడిగాపులువడియుండినను లభింపఁబోని తద్దిన్య దర్శన భాగ్యం బయాచితంబుగ మాకు నేడులభించుట కెద్దియో విశేష కారణంబుండక పోదు తత్కారణం బెట్టిదియో దయతో నెఱింగింపవే?” యని పలుక, నాజగన్నాధుండు, తానరు దెంచిన కారణంబు నామూలచూడముగా నెఱింగించి, పాండవులకు వేర్వేఱుగాఁ దాఁ గొనివచ్చిన వస్రాభరణాదులను సమర్పించి, రథగజతురగ సేనాసంచయంబును యుధిషిరుల కర్పణంబుఁ జేసి, యదనంతరంబు, సుభద్రాపాంచాల్యాద్యవ రోధజనంబుల యభ్యంతర మందిరంబులకరిగి, వారివారికి వేర్వేఱసారెలను, చీనిచీనాంబరాభరణాదులను పరిచారి కాజనంబులను నొసంగి, సహోదరీ మణులను శుభదృష్టి నాశీర్వదించి, ప్రత్యేకముగ సుభద్రకునీతులంగఱపి, వచ్చిన కార్యంబును సాకల్యంబుగ నెఱవేర్చుకొనిన పదంపడి, యుధిష్ఠిరాది పాండునందన ప్రార్థితుండై కొన్ని దినంబు లింద్రప్రస్థనగరంబున వసియించెను. తత్కాలంబునం దొక్కనాడు, ధనంజయుండు మధుసూదను నవలోకించి—— "నారాయణా! షడృతువులందును, వసంతంబు సంతస ప్రదంబై నదిగా నొప్పారు. ఇది యట్టి మహానందదాయకంబగు వసంతకాలముగావున, మnaమిరువురము నీఋతువునం గొన్ని దినంబులు, సుఖప్రదంబగు యమునా సైకత స్థలంబున విహరించి రాఁగుతూహలమయ్యెడు. నీకిదియభీష్టంబే?" యని సంప్రశ్నింప గోవిందుఁ డందుల కనుమతింప, నామఱుసటి దినంబుననే యన్నరనారాయణు లిరువులును, సమంచిత సన్నాహముతోఁ గదలి, యమునాతీరంబున కరిగిరి.

తన్నదీతీరంబునఁ బటకుటీరంబుల నేర్పఱచుకొని యాబావమఱందులు పగటివేళ, తత్ప్ర దేశస్థ ప్రశస్థనన సౌందర్యంబును గని యానం దించుచు, పరిమళమిశిత మృదు పుష్పభరిత లతానికుజంబుల, నుపవసించుచు, తన్మధురపరిమళమిళిత వాయువుల నాఘ్రాణించుచు సరసాలాపంబులఁతోడను, నిష్టలీలలతోడను, క్రీడావినోదంబులతోడనుఁ బ్రోద్దులుపుచ్చి, సాయంకాలమైన వెంటనే, పంచభక్షాయితంబగునో దనంబునుగుడిచి, యమునా సైకతస్థలంబులంజేరి, సంపూర్ణ చంద్రికా ప్రకాశంబున, నుపవిష్టులై మనోహర తాంబూల చర్వణముంగావిం చుచు, మందమందశీతల పవమానంబులకు బ్రమోదమానమానసులై యిష్టగోష్టిఁ గావించుచున్న సమయంబున శ్వేతవాహనుండు త్రివిక్రముం దిలకించి యిట్లనియె.

“మహానుభావా! యదునందన! పురుషోత్తమ! నినుబోటి మహాత్ముల సాన్నిధ్య భాగ్యంబు గల్గుట యనన్య దుర్లభంబు అట్టి యవకాశంబు తన భాగ్యవశంబునఁ గల్గినయెడ నద్దాని వ్యర్ధంబొనరించుకొనిన నరుండవివేకియగు. కావున, దివ్యచంద్రికా ప్రకాశంబువలనను,మనోజ్ఞమలయ మారుతంబులవలనను నిర్మలంబైన నాహృదయంబిప్పుడు కొంత జ్ఞానమార్గంబునుగఱచి కృతార్ధతనంద నభిలషించుచున్న యది; దేవమానవాదుల కెట్టిమార్గంబున పునర్జన్మరహితంబైన దివ్యమోక్ష సామ్రాజ్య పదంబు లభింపఁగలదో దయతో నెఱిఁగించి ననుంగృతార్ధునిఁగా నొనరింప వేడెద!"

ఇట్లప్రార్ధించి ముకుళితకరకమలుండైన విజయునిఁ గాంచి, త్రివిక్రముండు——"సవ్యసాచీ! నీవు కోఱిన సంప్రశ్నంబు నాహృదయంబున కత్యంతానందంబును ఘటింపఁ జేసె—— నీవు తొల్లి బదరికావన తాపసివగు నరుండవగుటం జేసియు తత్కాలంబున నీకుగల్గిన నారాయణ ఋషీంద్రుని సాహచర్యంబునం జేసియు, భగవదంశ నీయందుండుటం జేసియే నీకిట్టి ప్రశ్నంబొనరింపఁ జిత్తంబుగలిగెఁగాని, యన్యులకుఁ గలుగదు. నీవు ధన్యాత్ముండవు, విదేహంబగు కైవల్యమే 'మోక్షమనంబఱఁగు, అది శత్త్వకోవొదులగు వారలకు మాత్రమే లభ్యంబగు పదార్థము. తోల్లి, భరద్వాజ, కశ్యపాత్రి వసిష్ట వామ దేవగౌతమగా ర్గేయనారదకణ్వ విశ్వామిత్ర వ్యాసవాల్మీకి, కపిలశుకశౌనకాది దివ్యచంద్రులును, ప్రహ్లాదాంబరీష, ధృవ, రుక్మాంగద జనకాది రాజర్షులును, భగవ భక్తిభరితులై వేదాంత రహస్యంబు నామూలంబుగా నెఱింగి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి నొంది మోక్షముం గాంచిరి. బ్రహ్మజ్ఞానము చేతను వేదాంత పరిజ్ఞానమువలననే కాక, వేఱోండువిధంబున మోక్షంబునంద సాధ్యంబుగా నేరదు. మంత్రతంత్రాదులుసు, షణ్మతంబులును, సాకారధ్యానంబును, దారులో హశిలాద్యాకార సంపూజనంబును, త్రిగుణధ్యానమననాదు లును మోక్షమార్గంబులని మూఢులు విశ్వసింతురేకాని ప్రాజ్జులు తలంపఁబోవరు.తత్త్వమస్యాది మహావాక్యంబుల నెఱింగి, నిరాకార బ్రహ్మంబగు నాత్మను ధ్యానించుచు, అర్చనాది సత్కారంబులను సాకార సద్గురు బ్రహ్మంబునకు గావించుచు జన్మసాఫల్యతనొందుటయే మోక్షముంగాంచుట యని యెఱుంగుము.” అని యెఱింగించిన నర్జునుండు కృష్ణునకు సాష్టాంగ నమస్కారంబొనరించి —— "మహానుభావా! నాభాగ్యమూలంబున లభియించిన నీవే నాకు సద్గురుండవు. తమ రిప్పు డానతిచ్చిన వేదాంత రహస్యం బెన్ని విధంబులుగా గల్గి దేవ మాన వాదులకు తరణోపాయ మైయున్నదో క్రమంబుగ నెఱింగింప వేడెద!" నని యడుగ, కృష్ణుం డర్జునుం జూచి——

“యర్జునా ! సావధానుండవై యాకర్ణింపుము. వేదాంతమార్గంబు ద్వాదశవిధంబై —– సొంఖసూత్ర, ఛాయాపురుష, నాదానంద, పంచముద్ర, తారకమంత్ర, సచ్చిదానంద, సాకార, నిరాకార, అమనస్క, దర్పణ, యెఱుక, అచల పరిపూర్ణ, నామంబులం బఱగు చున్నది. ఈ ద్వాదశమార్గంబుల నెఱింగినవాఁడు మోక్షంబునొందుటకు సందేహము లేదు. కావున నిందలి ప్రథమోయంబగు, సాంఖ్య సూత్రంబును గుఱించిన పుణ్యకథ నొక్కదాని నెఱిఁగించెద—— నాకర్ణింపు" మని యిట్లు చెప్పదొడంగెను.