పండితారాధ్యచరిత్ర (గుజిలీప్రతి)/పీఠిక

శ్రీ సదాశివాయనమః

పండితచారిత్ర.

పీఠిక

అసంఖ్యాతనూతనపురాతనభక్తమాహేశ్వరపాదాభ్యాం నమః

శ్రీమచ్ఛైవరమావరున్ నియమితశ్రీచెన్నమల్లేశ్వరున్।
ధీమంతున్ న్నిగమాగమస్మృతిమతోద్గీతాఢ్యువేత్తన్ బుధ।
స్తోమస్తున్ ప్రభు నూర్ధ్వనేత్రు సుగుణాఢ్యున్ బండితారాధ్యులన్।
గావింతు న్నుతియింతు కొల్తు దలతున్ కామ్యార్థసంసిద్ధికిన్॥

మరియు బండితారాధ్యులచారుచరిత్రంబునందు గృతిపతినిరూపంబును భక్తప్రార్ధనయు కృతిఫలంబును గురుస్తోత్రంబును భక్తప్రశంశయు భక్తానుగ్రహణంబును కవీశ్వరనామంబును ప్రబంధకృత్యస్వీకారంబును నిజవీరవ్రతానుపాసనయు కావ్యకళానుక్రమిణకయు కవిత్వలక్షణంబును ఆరాధ్యగురుపరంపరయును ఆరాధ్యసముద్భవంబును వారు విప్రులతో వివాదంబునందు విభూతిరుద్రాక్షమహిమంబును ఊర్ధ్వపుండ్రశంఖచక్రధారణనిరసనంబును పాదోదకప్రసాదోదకధారణంబులును లింగార్చనమహిమయు లింగధారణంబును అర్హనర్హనైవేద్యనిశ్చయంబును షడ్విధనైవేద్యనిర్ణయంబును అధికారవిశేషంబును ప్రస్థాదరహితప్రాణాగ్నిహోత్రయజ్ఞకర్మనిరసనంబును పితృశేషదోషంబును అదీక్షితప్రసాదస్వీకారదోషంబును వ్యాసజెమినీసంవాదంబును అష్ఠమూర్తిసముద్భవంబును లింగానర్పితభాగదోషంబును విమిశ్రితదోషంబును విమిశ్రితప్రసాదస్థలంబును అందు యింద్రనారదసంవాదంబును ఘంటాకర్ణుండు సూర్యుం బరిభవించుటయు మునికుమారుకథయును దూర్వాసుండు విష్ణుని శపించుటయు సుకేశిచరితంబును మారమాంబక ధయును అందు విప్రదుర్మంత్రంబును శివుం డంత్యజులరూపుం బంపించిన వచ్చి యాయమ్మగృహంబున నారగించుటయు అందు విప్రవిజృంభణంబును తన్మందిరలక్షణంబును భక్తనిందాఫలంబును శివశాసనమహిమయు చెప్పుటయు మరియు నంత్యజుం డంతర్హితుండై గృహాంతరంబున నురులింగమై యవతరిల్లుటయు ఆప్రసంగవశంబున భోగిదేవయ్యకథయును సామవేదులకధయును అందును మానహితంబుగా నీశ్వరుం డంత్యజుండై వచ్చుటయు ఆవేషంబు భజించిన సామవేదికి పాదోదకప్రసాదోదకలింగోదకంబులు సంభవించుటయు ఆవాహనస్థాపన సన్నిధాపన సమ్ముఖీకరణ సన్నిరోధనమస్కారంబుల శివున కారగింపంబెట్టి పురాతననిందోస్తుతి జేయుటయు విధినిషేధధర్మకులనిరసనశుద్ధభక్తియు భక్తకథాకథనంబులు చెల్లుటయు తిరునాళ్లప్రోవకథయును కక్కయ్యకథయును గుడ్డవ్వకథయును శివనాగమయ్యకథయును జెప్పి సూరసానమ్మ మెరయుటయును యారాథ్యదేవరలింగార్చనోపక్రమంబును అందు పంచశుద్ధి సకలీకరణాభ్యాస యోగసోహమౌనస్నానధ్యానజపతప ఆవరణసింహాసన పూజానిరసనంబును తన్నిమిత్తోపకృత భక్తగుణోత్కర్షయు యారాథ్యదేవరలింగస్వరూపదర్శనవైభవంబును లింగంబునందు గాఢదృష్టిపటుత్వంబును దృష్ఠవిన్యాసంబును దృష్ఠివివీనంబును దృష్ఠినిర్వికారంబును దృష్ఠిసుభామృతంబు గ్రోలుటయు స్వర్శనసుఖంబున వ్రాయుటయు స్తోత్రపఠనోత్సవంబును తనుగుణవిలీనంబును అంగవిక్రియోపచారంబును సానురాగోపచారంబును లింగప్రార్ధనయు పండితేంద్రుగుణకీర్తనంబును అవస్థాంతరజనితమర్మవ్యాఖ్యానంబును పండితేంద్రుండు దనలింగంబులోన జంగమంబు గని మ్రొక్కుటయు లింగ మంతరీక్షంబున నుండుటయు జంగమంబు లింగమయంబుగా నిర్న్నయించుటయు యాయయ్యలింగంబునకు దోస్తలం బొగ్గిన భక్తిమహిమయు భక్తపూజావిశేషంబును ఉత్తమమధ్యమాధమపూజయు సమయానుష్ఠానంబును త్రివిధస్థలనిర్న్నయంబును భక్తసేవయు నుపన్యాసంబు చేసి శూలియందు సొచ్చి వర్తించుటయు తత్ప్రసంగజనితంబున బసవరాజుచరిత్రంబును అందు బసవసంభవంబును పూర్వకర్మనిరసంబును గంగమాంబాపరిగ్రహణంబును దం పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/8 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/9 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/10 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/11 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/12 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/13 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/14 బును సిద్ధవటమహత్వంబును నందిమండలమహత్వంబును అలంపురిమహత్వంబును కూడలి సంగమేశ్వరనివృత్తి సోమశిలమహత్వంబునుం గూడి శ్రీపర్వతంబు ముప్పదిరెండుయోజనంబులు నొక్కమాత్రలోన వివేకించి యాయ్యయ్యకు సర్వాంగాలింగితనమస్కృతుండై యమ్మహాత్ముననుమతంబున శ్రీశైలంబు డిగ్గి యంతవృత్తాంతంబు గురులింగజంగమంబునకు విన్నవించి తత్కపాసన్నిహితుం డగుటయు పండితేంద్రుండు తనకుమారులం కేదారదేవతనుభక్తపట్టంబు గట్టి సంసారమాయాసంభవంబున శివలింగదేవు గీర్తించి లింగకర్భంబు జొచ్చుటయు ననువృత్తాంతంబుల నొప్పి మూడువేలయాపదిద్విపదలం గలిగియుండు బర్వతప్రకరణంబును పంచప్రకరణంబులుంగూడ పదనకొండువేలయెన్మనూటపదకొండుద్విపదాబ్జంబులచేత పూజింపంబడు పంచప్రకరణంబులను పంచవక్త్రంబులతోడ నారాధ్యదేవుచరిత్రంబును లింగమూర్తి కనీభవించి శోభిల్లు నది యెట్లనిన.

శ్రీ శ్రీ శ్రీ॥


చాయాకాయా ద్వయోనాస్తి మాయావిద్యా ద్వయోన్సహి।
నిర్వికారం నిరాధారం నిష్కళం పరమామృతం॥


1.

నిర్గుణో నిష్క్రియోనిత్యో నిర్వికల్పోనిరంజన।
నిర్వికారో నిరాకారో నిశ్చబ్దో నిర్మలోచలం॥


2.

కోటిసూర్యప్రతీకాశం చంద్రకోటిశశీతలం।
స్వయంజ్యోతి పరబ్రహ్మ చిదాకాశమయం శివం॥


3.

వ్యోమాతీతం పరంవ్యోమం పరమార్ధం పరాత్పరం।
సత్యం సర్వగతం బ్రహ్మం సఏవ పరమం శివః।
ఆనందపరబ్రహ్మాయ చలంసంనదా।
శుద్ధబుద్ధమహార్లింగం సఏవ పరమం శివః॥


4.

బిందుమధ్యే జగత్సర్వం బిందుత్రైలోక్యదర్పణం।
బిందుమధ్యస్థతం బ్రహ్మం బిందువచలమవ్యయం॥


5.

విష్ణుయో యోనిసంయ్యుక్తం రుద్రాలింగమేవచ।
బ్రహ్మాణబిందుసంప్రోక్తం త్రిమూర్తి జగదోద్భవః॥


6.

అస్తిభాతి క్రియం రూపం నామచేతస్య పంచకం।
ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం ప్రకృతిద్వయం॥

శ్వాసలు నడిచే కాలనిర్నయము ద్విపదలో తెలిపెదము.