నేలతో నీడ అన్నది నను తాకరాదని

మంచి రోజులు వచ్చాయి (1972) సినిమా కోసం దేవులపల్లి కృష్ణ శాస్త్రి వ్రాసిన లలితగీతం


పల్లవి :
నేలతో నీడ అన్నది నను తాకరాదనీ
పగటితో రేయి అన్నది నను తాకరాదనీ
నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది
నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది ||| నేలతో |||

చరణం 1 :
వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా
చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురిసేనా
తల్లితండ్రి ఒకరి నొకరు తాకనిదే
నీవు లేవూ, నేను లేనూ, లోకమే లేదులే ||| నేలతో |||

చరణం 2 :
రవికిరణం తాకనిదే నవ కమలం విరిసేనా
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా
మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే
మమత లేదూ, మనిషి లేడూ, మనుగడయే లేదులే ||| నేలతో |||

చరణం 3 :
అంటరానితనము - ఒంటరితనము
అనాదిగా మీ జాతికి అదే మూలధనము
ఇక సమభావం, సమధర్మం సహజీవన మనివార్యం
తెలుసుకొనుట మీ ధర్మం, తెలియకుంటె మీ కర్మం ||| నేలతో |||