నేను సైతం
పరిచయం
మార్చుశ్రీశ్రీ రచించిన గీతాన్ని సుద్దాల అశోక్ తేజ ఠాగూర్ (సినిమా) చిత్రం కోసం పునర్లిఖించారు.
గీతం
మార్చునేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృశ్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువనఘోషకి వెర్రి గొంతుకమిచ్చి మ్రోశాను
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
అగ్ని నేత్ర మహోగ్ర జ్వాలా దాచినా ఓ రుద్రుడా
అగ్ని శిఖలను గుండెలోనా అణచినా ఓ సూర్యుడా
హరశ్వతమును చేతబూనిన పరశురాముని అంశవా
హింసనణచగ ధ్వంసరచనలు చేసినా ఆజాదువా
మన్నెంవీరుడు రామరాజు ధనుష్టంకారానివా
భగత్ సింగ్ కడసారి పల్కిన 'ఇంక్విలాబ్' శబ్దానివా
అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
కనులుగప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జయతెకే నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా
విశేషాలు
మార్చుఇదే గీతం రుద్రవీణ చిత్రం లో చెప్పాలని ఉంది గీతంగా చిత్రీకరించబడినది.