నీతిచంద్రిక/చిన్నయసూరి

శ్రీ పరవస్తు చిన్నయసూరి

కర్తః భాషోద్ధారక శ్రీవావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులు గారు

ఆంగ్లమునుండి అనువాదకులు: వాకాటి పెంచలరెడ్డి

సుప్రసిద్ధ సమకాలికులగు శ్రీకందుకూరి వీరేశలింగముపంతులు, మహామహోపాధ్యాయ శ్రీకొక్కొండ వేంకటరత్నముపంతులు, హైందవ వేదాంతోన్నత పాఠశాల సంస్థాపకులగు శ్రీ ఆర్. శివశంకర పాండ్యాజీలు శ్రీ పరవస్తు చిన్నయసూరిని ననుపమాధునికాంధ్రగద్యనిర్మాతగఁ బరిగణించిరి. శ్రీసూరి తనజీవితమున గౌరవనీయులగు శ్రీ గాజుల లక్ష్మీనరసింహులుశెట్టిగారు, సి. యస్. ఐ. మున్నగు మహనీయులప్రాపకమును బొందెను. శ్రీ చిన్నయసూరి రచనలన్నియు లభ్యము గాకుండుట మన దురదృష్టము. "హిందూచట్టము" ప్రచురణలో శ్రీసూరి, జాక్. డి. మెయెన్ గారికి దోహద మొసంగిరఁట; కాని శ్రీసూరి స్వయముగ వ్రాసిన గద్య నేఁ డలభ్యము. 1858 లో నయ్యది గ్రంథరూపము దాల్చినట్లు తెలిసికొంటిని. సూరిరచనలు బ్రిటిషు వస్తుప్రదర్శనశాల (మ్యూజియమ్) లో నున్నట్లు విద్వాంసులవలన దెలిసికొంటిని.

“తత్త్వబోధిని పత్రిక” ననుసరించి శ్రీసూరి 1866 లో మద్రాసు పాఠ్యపుస్తక నిర్ణయసంఘము, భాషాసమితి - అనువానికి నధ్యక్షుఁడుగ నిర్ణీతుఁడయ్యెను. ఆంధ్ర, మద్రాసు విశ్వకళాపరిషత్తువారి సౌజన్యమున పరిశోధకులు శ్రీసూరి రచనలఁ బరిశోధించి, ప్రచురించుటకు సావకాశము మెండుగాఁ గలదు. ఆంధ్రమున స్వయముగ వీరు నిఘంటువును గూర్చిరి. అతిరమ్య‘మైన వారిస్వహస్తలిఖితాక్షరములఁ గాంచు భాగ్యము నాకు లభించెను. నిఘంటు వసంపూర్ణముగ నిలిచిపోవుట మన యభా గ్యము. చెన్నపురి విశ్వకళాపరిషత్తునం దాంధ్రభాషకు మకుటాయమానులైన శ్రీనిడదవోలు వేంకటరావు, ఎమ్. ఏ. గారు తెలుఁగు విద్వత్సభవారి సంచికలోఁ బ్రచురించిన రచనలు, నారాయణవనం వకులాభరణము వ్రాసిన సంక్షిప్త సూరిజీవితము, నాస్మృతిపథమున నిలిచిన విషయముల నాధారముగ నేను వారిజీవితమును వ్రాయ సాహసించితిని. ఈ తెగువ కాంధ్రసాహితీపరులు నన్ను మన్నింతురుగాత.

జననము-విద్య

పందొమ్మిదవ శతాబ్దమున వన్నె కెక్కిన తెలుఁగువిద్వాంసులలో పరవస్తు చిన్నయసూరి ప్రథమగణ్యుఁడు. ఒక శతాబ్దమునుండి వీరి “బాలవ్యాకరణ”, “నీతిచంద్రిక”లు పాఠశాలలలోను కళాశాలలలోను నిర్బంధపాఠ్యగ్రంథము లగుటచే నీగ్రంథములను జదువని విద్యార్థు లుండరని చెప్పు టతిశయోక్తి కాఁజాలదు. ప్రాచీనయుగమునఁ బ్రధమ వ్యాకర్తగా, కవిగా నన్నయ వాసికెక్కెను. ఆధునికయుగమున చిన్నయసూరి ప్రఖ్యాతవ్యాకరణనిర్మాతగా నేకగ్రీవముగఁ బరిగణింపబడుచున్నాఁడు. బ్రిటిషు తూర్పుఇండియా కంపెనీవారు రాజధానిలో స్థిరనివాస మేర్పఱచికొనినపిమ్మట, ప్రభుత్వనిర్వహణమునకు వారికి పెక్కురు వ్రాయసకాండ్రు, పండితులు, ఉపాధ్యాయు లవసరమైరి. నాఁటి దేశకాలానుగుణ్యగద్యపద్యరచనకు చార్లెస్, ఫిలిప్, బ్రౌనుదొరవారు పునాది వేసిరి. ఇయ్యది చిన్నయసూరి, చదలవాడ సీతారామశాస్త్రులు, రావిపాటి గురుమూర్తిశాస్త్రి, మున్నగు పండితవరేణ్యుల కుత్సాహజనకమయ్యెను. కళాప్రపూర్ణ శ్రీవజ్ఝల చినసీతారామశాస్త్రిగారు ఆంధ్రవిశ్వకళాపరిషత్తువారు ప్రచురించిన, “ఆంధ్రవ్యాకరణసంహితాసర్వస్వ”మను గ్రంథములో, "చిన్నయసూరి బాలవ్యాకరణము వ్రాయనిచో, ప్రాచీనవాఙ్మయ మడుగంటిపోయి యుండెడిది" అని వ్రాసిరి.

చిన్నయసూరి చాత్తాద శ్రీవైష్ణవకులస్థుఁడు (సాతాని). వీరి పూర్వీకు లౌత్తరాహులు; బ్రాహ్మణులవలె శ్రీపరవస్తు మతానుయాయులు. వీరికి సూత్రగోత్రములు గలవు. సూరి యాపస్తంభసూత్రుఁడు; గార్గేయసగోత్రుఁడు. ఇతఁడు యజుర్వేది. సూరితండ్రి యుభయవేదాంత శ్రీ వేంకటరంగరామానుజాచార్యులు; శ్రీవైష్ణవమత ప్రచారకులు. మద్రాసునందలి తిరువళ్లిక్కేణి శ్రీరామానుజకూటములో నుసన్యసించుచుండెడివారు. వీరి వ్యాఖ్యానాదులకుఁ జకితులై, ప్రతివాదిభయంకరము శ్రీ శ్రీనివాసాచార్యులు, వీరిని శ్రీ రామానుజ జన్మస్థలమగు శ్రీపెరుంబుదూరునకుఁ గొంపోయిరి. దేవాలయార్చకులలో నొకరుగా నియమింపఁబడి, నిత్యము ద్రవిడదివ్యప్రబంధములను దేవతసమ్ముఖమునఁ బారాయణము చేయుచుండెను. ఇట్లు శ్రీ రామానుజాచార్యులు స్వీయకార్యములను దేవాలయములో నిర్వహింపుచుండ, గాఢమతాన్వేషులగు విద్యార్థిబృందము వారిని గలసికొనుట సంభవించుచుండెను. వీ రావిద్యార్థుల నందఱను శ్రీవైష్ణవులుగ మార్చుచుండిరి. శ్రీరామానుజాచార్యులు ద్రవిడవేదాంతమునందే కాక, సంస్కృతాంధ్రములలోఁ గడుసమర్థులు. విరామవేళలందు విద్యార్థులకుఁ బైభాషలను బోధించుచుండిరి. సూరి జన్మించుటకుముందు శ్రీ రామానుజాచార్యుల వారికి నొక్క పుత్త్రిక మాత్ర ముండెను. ఈమె బాల్యముననే భర్తను గోల్పోయెను. శ్రీ రామానుజాచార్యులు, తన భార్య — వీరిరువురు పుత్త్రసంతానాభిలాషులై, మిత్రుఁడు శ్రీ శ్రీనివాసాచార్యుల సలహానుసారము పుత్త్రకామేష్టి నాచరించిరి. యజ్ఞపాయసము పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/7 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/8 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/9 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/10 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/11 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/12 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/13