నిను ధ్యానించెద నోయమ్మా
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు
రాగం: దేశ్ తాళం: ఆది పల్లవి: నినుధ్యానించెద నోయమ్మా నను కాపాడుము మాయమ్మా నీ పదములు కెందామరలై నా యెద కొలనున విచ్చినవి నీ పదనఖరుచి వెన్నెలలై హృదయాంబరమున పర్వినది నా-హృదయాంబరమున పర్వినది నీ చిరునవ్వులు మల్లియలై నా యెదతోటను రాలినవి నీ కనుచూపులు దివ్వియలై హృదయ గృహమ్మున వెల్గినవి నా-హృదయగృహమ్మున వెల్గినవి నీ జ్యోతిస్సులు వెల్లువలై ఆహా! నను ముంచెత్తినవి నీ భావనలే శ్రీసచ్చిదా నందములై పురివిప్పినవి