నా కలం - నా గళం/"ఎవరీ తుర్లపాటి"
"ఎవరీ తుర్లపాటి"
"మీరు పత్రికా రచనారంగంలో 40 సంవత్సరాలు పూర్తిచేసిన సందర్భంలో మీకు నా అభినందనలు. గతంలోకి చూచుకుంటే మీరు ఆనందించండం సహజమే. కాని, ప్రఖ్యాత బ్రిటీషు జర్నలిస్టు బ్రౌనింగ్ అన్నట్టు, గతంలో కంటె భవిష్యత్తులోకి చూడటం అవసరం. మీరు జీవితంలో మరింత ఉన్నత విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను."
- ప్రధాని రాజీవ్ గాంధి
"గార్డియన్ ఆఫ్ తెలుగు"
- రాజాజీ
ఇండియా మాజీ గవర్నర్ జనరల్
"పత్రికా నిర్వహణలో కుటుంబరావు దిట్ట ; సభా నిర్వహణలో దక్షుడు ; జంకూ గొంకూ లేకుండ మాట్లాడే ఉపన్యాసకుడు."
- 'ఆంధక్రేసరి' టంగుటూరి ప్రకాశం
"ఆధునిక రాజకీయ జర్నలిస్టులలో అందెవేసిన చెయ్యి, యువతరానికి మార్గదర్శకుడు."
- మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి
- శ్రీ కోకా సుబ్బారావు
ఇండియా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
"రాజకీయ సంఘటనల చిత్రీకరణలోను, వర్ణనలోను శ్రీ తుర్లపాటిది ఒక ప్రత్యేక శైలి".
- డాక్టర్ పట్టాభి
కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు
"రచయితగా, మేధావిగా, శ్రీ తుర్లపాటి అంటే నాకు ఎనలేని గౌరవం, అభిమానం వున్నాయి. అనేక రంగాలలో ఆయన చేసిన సేవ యువకులకు ఉత్తేజం కల్పించగలదని ఆశిస్తున్నాను. మన జాతికి ఆయన ఉపయోగకరమైన సేవ చేయగలరని ఆకాంక్షిస్తున్నాను."
- శ్రీ పి.వి. నరసింహారావు
మాజీ ప్రధాని
- ఆచార్య రంగా
పార్లమెంటరీ కాంగ్రెసు పార్టీ డిప్యూటీ లీడర్
"తన పదునైన కలంతో, పరిశీలనాత్మక దృక్పథంతో శ్రీ తుర్లపాటి తన వృత్తిలో తన కొక స్థానాన్ని కల్పించుకున్నారు. ఆ రంగంలో ఆయన ఎన్నో ప్రశంసలు పొందారు."
- డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ
మాజీ రాష్ట్రపతి
"శ్రీ తుర్లపాటి గ్రంథాలలో కాని, రచనలలో కాని స్పృశించని రాష్ట్ర, జాతీయ సమస్యలు కాని, ఆయన పరిచయం చేయని రాజకీయ నాయకుడు గాని లేరనడం అత్యుక్తి కానేరదు. ఆయనకు ఏ బాధ్యతను అప్పగించినా, దాన్ని నిజాయితీతోను, సమర్థతతోను నిర్వహిస్తారు. జీవితంలోని ఎలాంటి ఆశలకు, ప్రలోభాలకు లొంగని దృఢ చిత్తుడు."
- శ్రీ తెన్నేటి విశ్వనాథం
ప్రఖ్యాత పార్లమెంటేరియన్
- డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి
ఉత్తర ప్రదేశ్ మాజీ గవర్నర్
"నేను ఏదైనా ఒక సమస్యకు పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తూ వుండగానే దానికి వెంటనే ఒక పరిష్కార మార్గాన్ని శ్రీ తుర్లపాటి లేఖ ద్వారా సూచించేవారు.
ప్రభుత్వ వ్యవహారాల పట్ల, ప్రభుత్వం ఎదుర్కొనే సమస్యల పట్ల ఆయనకున్న ఆసక్తి ఎందరికో వుండదు. ఆయన భాషా చాతుర్యంతోను, అపారమైన రాజకీయ పరిజ్ఞానం వల్లను, వాగ్ధాటివల్లను పార్లమెంటేరియన్‌గా ఎంతగానో రాణించగలరు."
- డాక్టర్ చెన్నారెడ్డి
మాజీ ముఖ్యమంత్రి
"ఉత్తమ అనువాదకుడు"
- శ్రీ మొరార్జీ దేశాయ్
ఇండియా మాజీ ప్రధాని
"సాహిత్య, సాంస్కృతిక, చలన చిత్ర, పత్రికా రచన రంగాలకు ఆయన ఎనలేని సేవ చేశారు. విజయవాడలో ఆయన లేకుండా ఏ సభ కాని, సమావేశం కాని సాధారణంగా జరగవంటే అత్యుక్తి కాదు."
- డాక్టర్ కె.ఎల్.రావు
కేంద్రప్రభుత్వ మాజీ మంత్రి
రాజకీయ పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేస్తున్న రాజకీయ జర్నలిస్టు శ్రీ తుర్లపాటి. మా వంటి రాజకీయ వేత్తలు ఆయనకు ఎంతో ఋణపడి వున్నారు"
- శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి
కాంగ్రెసు మాజీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి
"ప్రజాసేవారంగంలో వుంటే మాకంటే ఎక్కువగా రాణిస్తారు శ్రీ తుర్లపాటి."
- శ్రీ కె. రోశయ్య,
రాష్ట్ర ముఖ్యమంత్రి
"ప్రఖ్యాతి పొందిన అనేక పత్రికా రచయితలకు తెలుగుదేశం జన్మనిచ్చింది. శ్రీ కుటుంబరావు తెలుగు పత్రికారచయితలలో తమ కొక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు. మంచి రచయితగానే కాక, గొప్ప వక్తగా కూడా పేరు పొందారు. సభావేదిక ఎక్కితే, ఎంతటి ఉద్దండులైన ఉపన్యాసకులకైనా అచ్చెరువు కలిగించేటట్టు ఉపన్యసించగల వాక్చతురుడు. ఉపన్యాసాన్ని ఎత్తుకొనడంలోను, ముగించడంలోను తుర్లపాటికి తుర్లపాటే సాటి."
- శ్రీ జలగం వెంగళరావు
మాజీ ముఖ్యమంత్రి
"ప్రముఖ జర్నలిస్టుగా, ప్రసిద్ధ ఉపన్యాసకుడుగా, చరిత్రకారుడుగా శ్రీ తుర్లపాటి నాకు నలభై సంవత్సరాలుగా తెలుసు. అలాంటి ప్రత్యేకత కొద్ది మందికే లభిస్తుంది"
- శ్రీ ఎమ్.ఆర్. అప్పారావ్
ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్
- శ్రీ దామోదరం సంజీవయ్య
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
"సభ ఎంత చప్పగా నడుస్తున్నా, శ్రీ తుర్లపాటి మాట్లడ్డానికి లేచే సరికి దానికి నిండుతనం వస్తుంది. ఆయన మాట్లాడిన తరువాత మాట్లాడాలంటే, కొంచెం ఇబ్బంది గానే వుంటుంది. సభ జయప్రదం కావడానికి ఆయన చేసే దోహదం అపారం."
- "నటరత్న" ఎన్.టి. రామారావు
మాజీ ముఖ్యమంత్రి
"శ్రీ కుటుంబరావు జర్నలిస్టుగానే కాక, మహోపన్యాసకుడుగాను, మహా రచయితగాను నాకు చాలా కాలంగా తెలుసు. నేను ఉన్నతాభిప్రాయంతో గౌరవించే కొద్ది మందిలో ఆయన ఒకరు. జీవిత చరిత్రకారుడుగా ఆ రంగంలోని వారందరిని ఆయన అధిగమించారు. తెలుగు సాహిత్య రంగానికేకాక, తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ఆయన అమోఘమైన సేవ చేశారు."
- "నట సామాట్ర్" అక్కినేని నాగేశ్వరరావు
"ప్రెస్, పిక్చర్, ప్లాట్ ఫారం - ఈ మూడు తుర్లపాటి చేతిలోని పదునైన ఆయుధాలు. ఆయన ఇంతగా రాణించడానికి ఇవే కారణాలు."
- శ్రీ వందేమాతరం రామచంద్రరావు
అధికార భాషా సంఘం అధ్యక్షులు
- శ్రీ భాట్టం శ్రీరామమూర్తి
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల మాజీ మంత్రి
"జీవిత చరిత్రకారులలో నేనే అగ్రగణ్యుణ్ణి అనుకునేవాణ్ణి. కాని, ఈ రంగంలో శ్రీ తుర్లపాటి నన్ను మించి పోయినందుకు ఆయనను చూచి అసూయ పడుతున్నాను."
- "పండిత" గొర్రెపాటి వెంకట సుబ్బయ్య
"నాకు తెలుగు తెలియకపోయినా, నా ఇంగ్లీషు ఉపన్యాసానికి శ్రీ తుర్లపాటి చేసిన తెలుగు అనువాదానికి ప్రజల "రెస్పాన్స్" చూస్తుంటే, అసలు ఉపన్యాసం కంటే అనువాదమే బాగున్నదనిపిస్తున్నది".
- శ్రీ బి. శంకరానంద్
కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి
"సినిమా తారలకే అసూయ కలిగించే "గ్లామర్" వుంది తుర్లపాటి ఉపన్యాసంలో."
- 'పద్మభూషణ్' శ్రీ శివాజీ గణేశన్
"శ్రీ తుర్లపాటిని నేను ఇంతవరకు ఉత్తమ జర్నలిస్టుగానే ఎరుగుదును. కాని, నేను పాల్గొన్న ఒక సభకు ఆయన అధ్యక్షత వహించం తటస్థించింది. ఆయన మంచి జర్నలిస్టు మాత్రమే కాక, శ్రోతలను ఉర్రూత లూగించగల గొప్ప ఉపన్యాసకుడని కూడా తెలుసుకున్నాను. ఈ రెండు విశిష్టతలు ఒకే వ్యక్తిలో, అందులోను జర్నలిస్టులో వుండడం అరుదు."
- శ్రీ ఎమ్. చలపతిరావు
"నేషనల్ హెరాల్డ్" మాజీ ఎడిటర్
- శ్రీ దాశరథి
ఆంధ్రప్రదేశ్ మాజీ ఆస్థాన కవి
"ప్రసిద్ధ జీవిత చరిత్రకారులలో ఒకరైన శ్రీ తుర్లపాటి జర్నలిస్టుగా ఉజ్వల జీవితాన్ని సాగిస్తున్నారు. ఆయన ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల జీవిత చరిత్రలు వ్రాయడమే కాక, మన దేశానికి సంబంధించిన పెక్కు సాంస్కృతిక, సమకాలిక విషయాలపై ఎన్నో వ్యాసాలు వ్రాశారు. తెలుగులో ఆయన అపార రచనలు చేయడమే కాక, మంచి వక్త కూడా. అందువల్లనే ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ప్రసిద్ధ వ్యక్తి. ఆయన బహు గ్రంథ రచయిత. పత్రికా రచయిత మాత్రమే కాక రచయిత కూడా."
- శ్రీ జి. మురహరి
లోక్ సభ మాజీ డిప్యూటీ స్పీకర్
"పత్రికా రచన ఆయన ప్రథమ వ్యాసంగమైనా వక్తగా, అనువాదకుడుగా కూడా ఆయనది బహుముఖ వ్యక్తిత్వం."
- జనరల్ కె.వి. కృష్ణారావు
కాశ్మీర్, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్ గవర్నర్
"వక్తగా, రచయితగా శ్రీ కుటుంబరావు నిర్ణీత లక్ష్యాలు గల వ్యక్తి. ఆయన రచనలు శ్రీ వి.వి.గిరి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి వారి ప్రశంసలు పొందాయి. నేను రాష్ట్ర సమాచార మంత్రిగా వున్నప్పుడు చలన చిత్ర రంగాభివృద్ధికి అనేక అమూల్యమైన సలహాలు అందించారు."
- శ్రీ పిడతల రంగారెడ్డి
ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మాజీ మంత్రి
- శ్రీ పి. జగన్మోహనరెడ్డి
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
"శ్రీ తుర్లపాటి బ్రహ్మాండంగా రాస్తారు; బ్రహ్మాండంగా ఉపన్యసిస్తారు; బ్రహ్మాండంగా ప్రముఖుల ఉపన్యాసాలను అనువదిస్తారు."
- శ్రీ కోన ప్రభాకరరావు
మహారాష్ట్ర గవర్నర్
"శ్రీ తుర్లపాటి విజయవాడలో ప్రముఖ ఉపన్యాసకుడుగా ప్రసిద్ధులు. ఒకసారి ఆయన నా ఉపన్యాసాన్ని అభినందిస్తే, నేను కూడా ఉపన్యాసకుణ్ణి కాగలనని నాకు ఆనందం కలిగింది."
- శ్రీ రామోజీరావు "ఈనాడు" చీఫ్ ఎడిటర్
"తుర్లపాటి లేని సభ, తుర్ఫులేని పేకాట వుండవు."
- శ్రీ మండలి వెంకట కృష్ణారావు
మాజీ విద్యా మంత్రి, అంతర్జాతీయ తెలుగు సంస్థ మాజీ అధ్యక్షులు
"అపారమైన రాజకీయ పరిజ్ఞానంగల ఆధునిక పత్రికా రచయిత, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రముఖులు, సమస్యలను గురించి ఆయనకు బాగా తెలుసు. ప్రత్యేకాంధ్ర ఉద్యమం సందర్భంలో ఆయనతో ఒకసారి 75 నిమిషాల సేపు మాట్లాడే అవకాశం నాకు కలిగినప్పుడు రాష్ట్రాన్ని ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు గల పరిజ్ఞానాన్ని చూచి ఆశ్చర్యపడ్డాను. ఆయన సూచనలు, సలహాలు నాకెంతో ఉపయోగపడ్డాయి."
- శ్రీ హెచ్.సి. సరీన్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాజీ సలహాదారు
"ఆంధ్ర, తదితర మహానాయకుల జీవితాలను గురించి శ్రీ తుర్లపాటి కుటుంబరావు వ్రాసిన వ్యాసాలు మణిపూసలవంటివి. జీవితాంతం వ్యక్తులను, సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేయగలవారే ఇలాంటి ప్రయోజనకరమైన రచనలు చేయగలరు. అందువల్లనే శ్రీ తుర్లపాటి కుటుంబరావుకు మద్రాసు సాహిత్య కేంద్రం వారు "వ్యాస విద్యా విశారద" బిరుదు ప్రదానం చేస్తున్నారు. శ్రీ కుటుంబరావు రచనలు మరింతగా వ్యాప్తిలోకి రావడం అవసరం."
- మదాస్రు సాహిత్య కేందం
"జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలను లోతుగా పరిశోధించి, పరిశీలించి, ఆయా రాజకీయ వేత్తల మనస్తత్వాలను వాస్తవంగా బేరీజు వేయడంలో తుర్లపాటికి తుర్లపాటే సాటి".
- డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి
"తెలుగు వారికి గర్వకారకుడు తుర్లపాటి"
- శ్రీ నారా చంద్రబాబు నాయుడు
మాజీ ముఖ్యమంత్రి
- "పద్మభూషణ్" "జ్ఞాన పీఠ" అవార్డు గ్రహీత,
డాక్టర్ సి. నారాయణ రెడ్డి
"నేను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వున్నప్పుడు శ్రీ తుర్లపాటి నా ఉపన్యాసాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు. నేను అరగంట సేపు ఆపకుండా ఇంగ్లీషులో ఉపన్యసించిన తరువాత ఆయన నా ఉపన్యాస సారాంశాన్ని తెలుగులోకి 45నిమిషాల సేపు అనువదించారు ! నా సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని ఆయన ఎలా జ్ఞాపకం పెట్టుకుని, పునశ్చరణ చేయగలిగారా ? అని నాకు ఆశ్చర్యం కలిగింది."
- శ్రీ ఆర్.డి. భండారే
ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్
"తుర్లపాటి మనకు గర్వకారకుడు. తెలుగు వారిలో ఆయన మణిపూస వంటివాడు"
- శ్రీ జి.వి.జి. కృష్ణమూర్తి
ఇండియా మాజీ ఎలక్షన్ కమీషనర్
"ప్రధానికి ఇలాంటి సమర్థుడైన అనువాదకుడు అవసరం. ప్రధాని ఇందిరాగాంధి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో శ్రీ తుర్లపాటి అనువాదకుడుగా వుంటే ఆమె సంతోషిస్తారు."
- శ్రీ రాజేష్ పైలట్
కేంద్రమంత్రి
"ప్రొఫెసర్ ఆఫ్ ప్రొఫైల్స్"
- ఒక ప్రసిద్ధ జర్నలిస్టు
- శ్రీ గొట్టిపాటి బహ్మ్రయ్య
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షులు
ప్రధాని నెహ్రూ పశ్న్ర :
"ఎవరీ తుర్లపాటి?"
1952లో శ్రీ తుర్లపాటి ప్రధాని నెహ్రూకు వ్రాసిన రెండు లేఖలను చూచిన తరువాత ఆయన ఆనాటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఆంధ్రుడైన శ్రీ వి.వి. గిరిని "ఎవరీ తుర్లపాటి ?" అని ప్రశ్నించారట.
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రచారకులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ శ్రీ తుర్లపాటి ఉపన్యాసం విని ముగ్ధులై, శ్రీ తుర్లపాటిచే మైసూరు, విజయవాడ, ఢిల్లీ, బెంగుళారు, మద్రాసు మున్నగు నగరాలలో నూరుకు పైగా ఉపన్యాసాలు చేయించారు. "నల్ల (మంచి) స్పీకర్" అని ఆయన తమిళ శ్రోతలకు తుర్లపాటిని పరిచయం చేశారు.
తుర్లపాటి పెళ్ళి ఫొటో - కుటుంబ సభ్యులతో
***
"పద్మశ్రీ" అవార్డు పొందిన తొలి తెలుగు జర్నలిస్టు
"శ్రీ తుర్లపాటి కేవలం ప్రఖ్యాత జర్నలిస్టు మాత్రమే కాదు -
ఆయన మరెన్నో రంగాలలో ప్రతిభావంతుడు"
-రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్
విశ్వా టైప్ ఇనిస్టిట్యూట్, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్, గవర్నర్ పేట, విజయవాడ -2