నాట్యకళ మాసపత్రిక/సంపుటము 1/సంచిక 2/సారంగధర 'శకలము'
సారంగధర ' శకలము '
వేదము వేంకటరాయశాస్త్రి
[అస్మత్పితామహులు శ్రీ'కళాప్రపూర్ణ ' వేదము వేంకటరాయశాస్త్రులవారు తాము జీవితదశలో చేసిన వాజ్మయసేవకన్న పెక్కుమడుంగులు చేయ సంకల్పించియు జీవితములో గలిగిన ఒడుదుడుకులచే అందు కొంతమాత్రమే చేయగల్గిరనుట ఎల్లవారికిని తెలిసియేయున్నది. అట్లే పదునైదు స్వతంత్రనాటకములను వ్రాయ సంకల్పించుకొని యుండిరి. వానిలో సారంగధర నాటకమును సంపూర్ణవిషాదాంతముగా, చిత్రాంగివిషముత్రాగుట, సారంగుడుతల్లి దండ్రులయొడిలో మృతిచెందుట, అతనిని అగ్నిసాత్కరించి రాజును, రత్నాంగియు అసలు ప్రవేశమొనర్చుట లోనగు సన్నివేశములతోను, ప్రతాపరుద్రీయమునందు విద్యానాధునింబోలె నన్నయ నారాయణభట్టును ఇందు నెక్కొల్పి సరియంకములలో నత్మనాటకనిర్మాణ చాతురి కవధిగా వ్రాయ సంకల్పించి యుందిరి. కాని అట్లుజరుగలేదు. విధి విపరీరముగదా!
మా తాతగారిట్లు రచియింప సంకల్పించిన సారంగధర నాటకమున నొకకళకలం, వారేవ్రాసినది, ప్రాతకాగితములలో కనుపించింది. అది యానాటకమున కాయువుపట్టయిన చిత్రాంగిసలసంతను తెలుపు రసవంతమగు నొక 'దృశ్యము '.
దీని యునికిని నేను ప్రసంగవశమున చెప్పగా "నాట్యకళ" సంపాదకులు శ్రీ నీలంరాజు వేంకటశేషయ్యగారు విని తమ పత్రికలో దీనిని ర్పకటింపవలసినదిగా నన్నుం గోరిరి. వారి కోరికమెయి దీని నీ "నాట్యకళ" మూలముననే ఆంధ్రలోకమున కందజేయుచున్నాడను.
--వేదము వేంకటరాయన్]
చిత్రాంగి:-- ఒసే భామతీ నేనట్లు కుమిలిపోవలసినదే?
భామతి:- కలువ వెన్నలకు కమలము ఎండక్జు వాడెనందువు. నీ కేమి
లోపము? మగ డాంధ్రనాధుడు, నిన్నుగన్న కంటితో వేఱొకతెం గన
నొల్లడు. మీరు పూవుందావియంబోలె, మణియందేజమువోలె
ఏకమైయున్నారు. నీభాగ్యము ఇంద్రాణీకైన లేదు. పతి నిన్ను క్షణ
మయినంబాయడు.
చిత్రాంగి:- కలకమున కాలపాశమువలె తగుల్కొన్నాడు.
భామతి:- క్షణక్షణము నీమీది ప్రేమ హెచ్చుచున్నది.
చిత్రాంగి:- ఉరి బిగిసికొనుచున్నది. నాగతి యీముదుకని తెలిమీసాలకు
సంపెంగనూనెపూయుట యైనది. నాకు పటములో ఆమోహవమూర్తిం
జూపుటయేమి, యీవల్లకాటికొర్తికి నన్ను కట్టుటయేమి? ఈయన సాధువు, నెను సాధ్వినిగాను. దైవమున్నాడా? బలవంతునిదే ధర్మము, అబలది యేమనిన నధర్మమే. ముదుకని ముద్దుబానిసను, నా కేల యీభాగ్యము! తప్పించుకొని పోదునా, సాయపడుద్నా?
భామతి:- నిన్నుం గొలువనేని నేనేల? అయినను విను, నీరొదరయచేత నీవు
పట్టినదెల్ల బంగారము, తలచినదెల్ల సిద్ధము.
చిత్రాంగి:- బ్రదికినదెల్ల మృతి, ఆరగించినదెల్ల విషము. ఏం ప్రసజ్ంగము
చేసెదవు? మెడకు రాయిగట్టి అగడిదలోనైన త్రోయుము. లేదా ఆ
పటములోని యా నామనోనాయకుని సారంగధరుని తేనైనందెమ్ము.
ఈయెకయేడు ఒకయుగముగా గడిపితిని. ఈయంతిపురిభైదు తల్లి
కడుపులోవాసముకన్న ఘోరము, నిన్ను నమ్ముకొని ప్రాణములను
బిగబట్టుకొనియున్నాను.
భామతి:- అయ్యో! రెండిండ్లకు, రెండులోకములకుకాని యీబుద్ధి నీకేల
పుట్టినదమ్మా! నీబుద్ధి య్లిట్లగునని నేను తలవనైతిని. నీమాటల
నమ్మలేకున్నాను. నన్ను కంగించెదవా, రాజాంగనవే, రాజాధిరాజ
భార్యవే.
చిత్రాంగి:- ఏమి మరల వేదాంతమరంభిచితివి. వెంటనే రెంటనొకటి
తెమ్ము, ఆవిషమాయుధవిజయినేని, విషమునేని.
భామతి:- కూడదమ్మా అంత:పురములందు ఇట్టినడతకు ఏట్టిచిత్రవధ లగునో
ఎఱుగవు. దోమవిన్నను అపాయము కలుగును. నామాట విని
కుదురుగానుండి కీర్తిపొందుము.
చిత్రాంగి:- ఈబ్రదుకుకన్న ఆచిత్రవధయే మేలు. నాయాన చేసెదవాలేదా?
భామతి:- నేను చేయను, చేయజాలను. నీకొలువు మాని ఎటకేని పోయెదను.
చిత్రాంగి:- [స్వగతము] దీనికి నాపై ప్రాణము. కాని ఇది రాచది, కుల
గర్వముకలది. ఆబాల్యము నాతో పెరిగినదయినను నాకు ఈవిషయ
మున తోడ్పడదు. దీని పోనీగూడడు. పోనిచ్చిన బయటికి ఈవృత్తాం
తమును పోవును. కానీ [ప్రకాశము] ఓసీ, నాకు నెవు కూడపెరిగిన
ప్రాణప్రియనని గుట్టు చెప్పుకొన్నందులకు మొట్టసాగితిని. కానీ,
ఇందుకై నిన్నుగూడ కోల్పోవలయునా? నాకు నీవే శరణమని
తలంపకు. నీచేతగానియెడల నాప్రజ్ఞ చేత సాధింపలేనా. నీవే నన్ను
కడతేర్తువని నమ్ముమొనియుంటిని. స్నేహపాశములవలన మోసపోయితిని
భామతి:- మోసమనవలదు. ఈవృత్తాంతము నాతోచెప్పుట బావిలోవైచు
టయేయని నమ్ముము.
చిత్రాంగి:- చాలు. నీపని చూచుకో.
భామతి:- నీయాజ్ఞ [స్వగరము] ఏపుట్టలో ఏపామో! ఏకాలానికి ఏయుత్పా
తమో! (అని నిష్క్రమించును)
చిత్రాంగి:- ఇందిరా !
[అంతట ఇందిరయనుచేటి ప్రవేశించును.]
ఇందిర:- ఏమి అమ్మగారియాజ్ఞ ?
చిత్రాంగి:- అటైన నీతెలివిని మాకై ఏపాటి వినియోగించితివి?
ఇందిర:- నేను ముందే తెలుసుకొని చెప్పితినిగదా ఆయనకు పావురమువేట
ఇష్టమని. అతని పావురము మగది. అతని పావురాన్ని లాగడానికి
మనకు ఆడుపావురాన్ని తెచ్చినాను. మనపావురంరక్కలలో విప్పి
నప్పుడు కనబడేలాగ, అతని పావురముమీద అతనిపేరున్నట్టే అమ్మ
గారిపేరు చిత్రించినాడుగదా. ఇప్పుడు ఆయన ఆ వేటమీద ఈవీధిని
ఎల్లుండిమధ్యాహ్నము వచ్చునని తెలుసుకొంటిని. అప్పటికి అమ్మగారు
సిద్ధపడవలెను.
చిత్రాంగి:- నీవు ఆసమయాన మిటనాడు నాతని పావురమును మన
పావురముచేత నాకర్షింపవలయును.
ఇందిర:- అంతా అలాగే చేస్తాను. ఆపై ని అదృష్టము
చిత్రాంగి:- సరి, ఇంచుసేపు సంగీతశాలలో వినోదించెదం.
ఇందిర:- ఇటుఇటు అమ్మగారు
[అందరూ నిష్క్రమింతురు]