నాగర సర్వస్వం/యోని స్వరూపము - నాడీభేదములు

యోని స్వరూపము - నాడీభేదములు

స్త్రీయొక్క మహ్యావయవమునకే యోని అనిపేరు. "యౌతి శిశ్నేన ఇతి యోనిః" అనగా "శిశ్నముతో (పురుషాంగముతో) కూడుకొనునది" అని యోని శబ్దమునకు ఉత్పత్తి. కామభావము ఇక్కడ ఫలించుచుండుటచే దీనికి మదనమందిరము, మన్మధ గృహము మొదలగు పేర్గుకూడ యేర్పడ్డాయి.

స్త్రీయొక్క మదన మందిర ముఖద్వారమునందు ఒక సన్నని మెత్తని చర్మఖండము యేర్పడి ఉంటుంది. దీనికి మదనచ్ఛత్రము అని పేరు. ఛత్రము అనగా గొడుగు. మన్మధగృహద్వారమును కప్పియుంచునదగుటచే దీనికి మదనచ్ఛత్రము అను పేరేర్పడెను.

ఉ మదనచ్ఛత్రమునందు స్త్రీయొక్క శరీరములో కామభావమును జ్వలింపజేసే ఇరువది నాలుగు నాడులు సంగమిస్తున్నాయి. ఇన్ని మదనాడులకు కూడలియై యున్నదగుటచే ఈమదనచ్ఛత్రము ఆభ్యంతరరతి యందు స్త్రీయొక్క తృప్తిలో ప్రధానస్థానం ఆక్రమిస్తుంది.

ఆభ్యంతర రతిని ఉపక్రమిస్తూ పురుషుడు మొదట ఈ మదనచ్ఛత్రాన్ని తన చేతి వ్రేలితో కలచాలి. బాలను పదునారేండ్ల లోపువయసు కలది కలియునపుడే మదనచ్ఛత్రమును చేతివ్రేలి తోడనే కలచవలసి ఉంటుంది. కాని ప్రౌఢ అయిన వనితా విషయమున చేతి వ్రేలినే ఉపయోగించవలెనన్న నియమం లేదు. అచ్చట పురుషుడు తన పురుషాంగముతోడను లేదా తన చేతి వ్రేలితోడను కలచవచ్చును. ఇట్లు కలచుట వలన స్త్రీ యోనియందలి నాడీ సముదాయ మంతయు వింతగా కదిలి ఆమెలో పారవశ్యము యేర్పడుతుంది.

అభ్యంతర రతివేళ స్త్రీయొక్క సర్వశరీరము పురుషునిచే ఆక్రమింపబడుతుంది, స్త్రీయొక్క తృప్తికి హేతువైలైన నాడులు యోనియందేకాక శరీరమునందంతటను ఉన్నాయి. పురుషుడు వనితయందు రతికి వలసిన ఉత్కంఠను పెంపొందించి ఆమెలో పారవశ్యమును జనింపజేయుటకు కేవలము మదనచ్ఛత్రమునే కాక ఇతరనాడులనుకూడ కలచవలసివుంటుంది. అయితే ఆనాడులు స్థానాలు తెలియవలెనుకదా !

స్త్రీయొక్క రెండునేత్రములందు రెండునాడులున్నాయి. ముఖమందు (నుదుట) రెండునాడులున్నాయి. నోటియందొకనాడి ఉన్నది. కాలి బొటనవ్రేలి మొదటిభాగము నందొకనాడి ఉన్నవి.

పురుషుడు మదనచ్ఛత్రమును కలచువేళ ఈ నాడీ స్థానములయందు చుంబనాదులచే కదలిక కలిగించుట అవసరము. వనిత కాలిబొటనవ్రేలి మొదటనున్న నాడీస్థానమును పురుషుడు తనకాలి బొటనవ్రేలితో నొక్కుటవలన ఆనాడియందొక వింత కదలిక ఉదయిస్తుంది.

కొందరు రతిశాస్త్ర కోవిదులు ఈనాడులనేకాక వనితయొక్క తొడలను, చెవులను, ప్రక్కలను (పార్శ్వము) త్రికమును (వెన్నెముక తుదిభాగము) శిరస్సునుకూడ పురుషుడు తనచేతితో తాకుట అవసరమనియు, అట్లు తాకినగాని వనియలయందు అచ్చమైన పారవశ్యము ఉదయించదనియు చెప్పుచున్నారు. స్త్రీయొక్క యోనియందు ప్రధానములైన నాడులు ఆరు వున్నాయి. 1. సతీనాడి, 2. అసతీనాడి, 3. సుభగానాడి, 4. దుర్భగానాడి, 5. పుత్రీనాడి, 6. దుహిత్రిణీనాడి. అని వానిపేర్లు.

ఇందు సతీ - అసతీనాడులు స్త్రీయొక్క యోని పై చర్మమునందే ఉన్నాయి. సతీనాడి యోనికి ఎడమభాగమున అసతీనాడి కుడిభాగమున ఉంటాయి. "సుభగ, దుర్భగ " అనేనాడులు యోనియొక్క కొంత లోపలిభాగములో ఉన్నాయి. సుభగానాడి యోనిలో కుడివైపునవుంటుంది. ఇక పుత్రీ దుహిత్రిణీనాడులు యోనియొక్క మిక్కిలి లోపలిభాగంలో ఉంటాయి. పుత్రీనాడి యోనియొక్క మిక్కిలి లోపలిభాగంలో ఎడమవైపునవుంటే దుహిత్రీనాడి దానికి ఎదురుగా కుడివైపునవుంటుంది.

పురుషుడు తన పురుషాంగముతో ఈ నాడీస్థానములందు గాఢమైన స్పర్శ కలిగించాలి. సతీ అనే నాడీస్థానమునందు పురుషాంగ స్పర్శచే కులస్త్రీలు ఆనందిస్తారు. అసతీ అనేపేరుతో యోని యొక్క పైచర్మమున కుడిభాగమునందుండే నాడిని స్పృశించుట వలన వేశ్యలు, వ్యభిచారిణులు ఆనందిస్తారు. ఇది వ్యత్యస్తమైనపుడు అనగా కులస్త్రీయొక్క అసతీనాడికి, కులటయొక్క సతీనాడికి పురుషాంగముద్వారా ప్రేరణ కలిగినపుడు వారిలో రతికి సంబంధించిన ఉత్సాహము దీప్తము కాకపోవుటయేకాక వారాపురుషునియందు ద్వేషముకూడ వహిస్తారు.

స్త్రీ యోనియొక్క కొంత లోపలిభాగమునందు (ఎడమ - కుడిభాగములందు ఉండే సుభగా దుర్భగా నాడులలో పురుషుడు తనయొక్క అంగముచే సుభగానాడియందు మాత్రమే గాఢస్పర్శ కలిగించేవాడైనపుడు స్త్రీ మిక్కిలి తృప్తిని అనుభవించుటయే కాక, కాలంగడచే కొలది ఆమెశరీరం నునుపుదేరుతుంది. ఆమెశరీరంలో లావణ్యస్థానం ఏర్పరచుకొంటుంది, ఆమెయొక్క స్తనద్వంద్వం బలుస్తుంది. ఆమెలో యౌవనం స్థిరనివాసం ఏర్పరచుకొంటుంది. అందుచేపురుషుడు స్త్రీయోనిలో వామభాగమున నెలకొనివుండే సుభగా నాడిని దృష్టియందుంచుకొని దానియందు గాఢస్పర్శ ఏర్పడవలెనన్న సంకల్పముతో తనఅంగముతో యోనిలోని వామభాగమును కలచాలి.

అట్లుకాక పురుషుడు స్త్రీ యోనిలో సుభగా నాడికిఎదురుగా కుడివైపున ఉండే దుర్భగానాడి యందు ప్రేరణ కలిగించుటవలన కాలంగడచేకొలది ఆమెలోని లావణ్యం అంతరిస్తుంది. ఆమె శరీరం కర్కశంగా ఎండిన కట్టెలా తయారవుతుంది. ఆమె దేహచ్ఛాయ కూడ నశిస్తుంది. అకాలంలోనే వార్ధకం ఆమె శరీరంలోకి తొంగిచూస్తుంది. అంతేకాక ఆమె ఎల్లపుడు ఏదో ఒక రోగముతో బాధపడేదవుతుంది. అందుచే పురుషుడు దుర్భగానాడియందెన్నడును ప్రేరణ కలిగింపరాదు.

ఇకయోనియొక్క అధస్తలమందున్న పుత్రీ దుహిత్రిణీ నాడులలో పుత్రీనాడి యోనియందు ఎడమభాగమున దుహిత్రిణీనాడి కుడివైపున ఉన్నవని చెప్పబడెను కదా! ఈ పుత్రీనాడియందు పురుషుడు తన పురుషాంగము ద్వారా ప్రేరణ కలిగించినపుడు స్త్రీ గర్భమును ధరిస్తే పుత్రునే ప్రశవిస్తుంది. ఇక దుహిత్రిణీనాడి యందు పురుషాంగము ద్వారా ప్రేరణ కలిగినపుడు స్త్రీ గర్భమును ధరిస్తే 'దుహిత' అనగా కూతురు జన్మిస్తుంది. ఈ కారణముచే తనకు పుత్రులు జన్మింపవలెనని కోరువాడు తనభార్యతో కలసినపుడు రతివేళ తన అంగముద్వారా ఆమెయొక్క యోనికి లోతట్టున ఎడమవైపున మాత్రమే గాఢస్పర్శ కలిగించాలి. అట్లుకాక తనకుపుత్రిక జన్మింపవలెనని కోరువాడు భార్యయొక్క యోనిలో కుడిభాగమున ప్రేరణ కలిగించవలసి ఉంటుంది.

పద్మశ్రీయొక్క అభిప్రాయానుసారము ఈ చెప్పబడిన ఆరు నాడులకును యోనియే స్థానమైఉన్నది. కాని కొందరు దీనికి భిన్నముగా వీని స్థానములను పేర్కొనుచున్నారు. ఈ విషయమునుకూడ పద్మశ్రీ 'కొందరిట్లనుచున్నారని' తన గ్రంథమున మతాంతరమును పేర్కొనెను. ఆ కొందరి అభిప్రాయము ననుసరించి సతీనాడికి స్త్రీయొక్క స్తనములును, అసతీనాడికి చంకలును, సుభగానాడికి పెదవులును, దుర్భగానాడికి వెన్నుపూస తుదిభాగమును, పుత్రీనాడికినోరును, దుహిత్రిణీనాడికి నితంబమును (పిరుదులు) స్థానములై ఉన్నాయి.

ఈ మతము ననుసరించి పురుషుడు సతీనాడీచోదనము చేయదలచినపుడు భార్యయొక్క స్తనములను మర్దింపవలెను. అసతీనాడిని ప్రేరేచదలచినపుడు చంకలయందు నఖక్షత మాచరింపవలెను. (ఇట్లు ఆచరించినపుడు కులస్త్రీలకు, కులటలకు అధికానందము కలుగుతుందో వ్యత్యస్తమైనపుడు వారియందా ఆనందము కొంత లోపించునేకాని వారా పురుషుని ద్వేషించుట జరుగదని-ఈ మతమువారి అభిప్రాయముగా గ్రహింపవలెను.) సుభగానాడీచోదనము చేయదలచినపుడు పెదవులను ముద్దిడుకొనవలెను. దుర్భగానాడిని ప్రేరేచదలచినపుడు వెన్నుపూస తుదిభాగమును చేతితో మర్దింపవలెను. జిహ్వ ప్రవేశముచే పుత్రీనాడిని, పిరుదులను మర్దించుటచే దుహిత్రీనాడిని ప్రేరేచవలసిఉంటుంది. ఇది మతాంతరము.

వనితయొక్క యోనిలో అధోభాగమునందున్న పుత్రీ దుహిత్రిణీ నాడులకు రెండింటికి పురుషుడు తన పురుషాంగముచే ఏకకాలమున ప్రేరణ కలిగించుట జరిగి ఆ సమయమునందే స్త్రీ గర్భమును ధరించే స్థితి ఏర్పడితే ఆమెకు నపుంసకుడు జన్మిస్తాడు.

అయితే లోకంలో అందరకును ఈ నాడీభేదం అసగతం అయినందువల్లనే పుత్రులు లేక పుత్రికలు జన్మించడం జరుగుతూ ఉన్నదా? అన్న శంక అసహజం కాదు. ఈ నాడీభేదం తెలియకపోయినా స్త్రీ పురుషులు సంగమవేళ ఈనాడుల యందేదో ఒకదానికి మాత్రమే ప్రేరణ కలుగుట, గర్భధారణ జరుగుట, పుత్రుడో పుత్రికయో జనించుట జరుగుతూ ఉంటుంది. ఉభయనాడులకు ఒకే సమయంలో ప్రేరణ అనేది ఎప్పుడో, ఎక్కడనోకాని జరుగని కృత్యం. అట్టిది జరిగినను ఆ సమయంలో స్త్రీయందు గర్భోత్పత్తికి అనుకూలమైన స్థితి ఏర్పడక పోవచ్చును. ఇట్టిది అరుదుగా ఏర్పడి లోకమునందు సహజంగానే నపుంసకుల జననం అరుదుకావడానికి కారణమైఉంటుంది.

పైనచెప్పిన నాడిభేదమును గుర్తించి వర్తించే పురుషునకు పుత్రీ పుత్ర ప్రాప్తులేకాక స్త్రీకుడ వశవర్తిని అవుతుంది. ఆమె ఎంతగా వశవర్తిని అవుతుందంటే ఆమె ఎన్నడును పరపురుషుని వాంఛింపదు. ఈ నాడీభేదము నెరిగి తన్ను తృప్తిపరచిన భర్త కాలాంతరంలో శరీరములోని సత్తువ నశించి నపుంసక స్థితివంటి స్థితిని పొందినప్పటికి ఆమె హృదయ మాతనియందు మాత్రమే లగ్నమై అన్యపురుషుల యందు విరక్తమై ఉంటుంది. అందుచే ఈ నాడీ పరిజ్ఞానము సర్వులకు అవసరమై ఉన్నది.


★ ★ ★

ఈ పేజి వ్రాయబడి ఉన్నది.

గలడనుటలో సందేహము లేదు. అయితే స్త్రీ పురుషులు తమ శరీరములను ఏయే స్థితులయందుంచి రమించుటద్వారా ఎక్కువ ఆనందాన్ని పొందడానికి వీలుఉన్నదో అన్న విషయం ఈ ప్రకరణంలో చెప్పబడుతూ ఉన్నది.

సంభోగ సమయములో స్త్రీ పురుషుల శరీరములు (యోని పురుషాంగముతోసహా) పరస్పర సక్తములై ఉండే స్థితి భేదములనే 'సంభోగాసనములు, బంధములు, కరణములు' మొదలగు పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. భిన్నజాతి స్త్రీపురుషులు కలిసినపుడు బాధారహితంగా సుఖించుటకు, సమానజాతి స్త్రీపురుషుల రతియందు నవ్యతను కల్పించుట శాస్త్రములయం దీ కరణభేదములు (బంధభేదములు) చెప్పబడ్డాయి. రతివేళ స్త్రీయొక్క శరీరస్థితి ననుసరించి ఈ ఆసన భేదములు ప్రధానంగా ఐదు రకాలుగాఉన్నాయి. 1. ఉత్తానకరణము 2. తిర్యక్కరణము 3. ఆసీనకరణము (స్థితకరణము) 4. ఉత్థితకరణము 5. వ్యానత కరణము అని వాని పేర్లు.

1. ఉత్తానకరణము :- ఉత్తానమనగా వెలికిల పడియున్నది. భార్య వెలికిలిగా పరుండియున్నపుడు (నడుమును సెజ్జపై ఆన్చి పరుండుట) పురుషుడామెను గూడినచో అది 'ఉత్తానకరనము' అనబడుతుంది.

2. తిర్యక్కరణము :- తిర్యక్ అనగా 'ఏటవాలు' అని అర్ధము. శయ్యపై భార్య ప్రక్కవాటుగా కుడిప్రక్కకునైనను లేక ఎడమప్రక్కకునైనను వ్రాలి పరుండియుండగా పురుషుడామెనుకూడి రమించినచో అది 'తిర్యక్కరనము' అనబడుతుంది.

3. ఆసీనకరణము :- భార్య కూర్చుండియున్నపుడు పురుషుడామెతో గలిసి రతిక్రీడాసక్తుడైనచో ఆస్థితి ఆసీనకరణము అనబడుతుంది. 4. ఉత్థితకరణము :- భార్య నిలచిఉండగా, పురుషుడామె నే గోడకో స్తంభమునకో ఆన్చి రమించుట 'ఉత్థితకరణము' అనబడుతుంది.

5. వ్యానతకరణము :- 'వ్యానతము' అనగా మిక్కిలి వంగినది. భార్య తన చేతులను పాదములను క్రింద ఆన్చి యుంచినదై నాలుగుకాళ్ళ జంతువువలె వంగియుండగా పురుషుడామెను వెనుకనుండి కూడి రమించుట 'వ్యానతకరణము' అనబడుతుంది.

ఇట్లేర్పడిన ఈ కరణ భేదములందు తిరుగ అవాంతరభేదము లెన్నియో ఉన్నాయి. ఆ భేదములకే చౌశీతి బంధములు (84 బంధములు) అని లోకములో వాడుక వచ్చినది. కాని అవి అన్నియును శిష్టజన సమ్మతములు కానందున నాగరిక జనతలో ఆచరణలో ఉన్న బంధభేదములు మాత్రమే (35) ఇందు తెలుపబడుతున్నాయి.

ఉత్తానకరణ భేదములు

భార్య శయ్యపై వెల్లకిలా శయనించియుండగా పురుషుడామెను గూడి రమించు విధానము ఉత్తానకరణము. దీనియందు శిష్ట సమ్మతతైన భేదములు ఇరువది. వానిలో మొదటిది స్వస్తిక బంధము.

1. స్వస్తిక బంధము :- భార్య శయ్యపై వెల్లకిలగా (నడుమును శయ్యపై ఆన్చినదై) శయనించినదై తన కుడితొడను తన ఎడమతొడమీద చేర్చియుండగా భర్త ఆమెనుకూడి రమించుటకు స్వస్తికబంధ మనిపేరు. ఇట్లు ఎడమతొడపై తన కుడితొడను చేర్చియున్నవేళ స్త్రీయొక్క యోనియందు కొంతబిగువు ఏర్పడి, ఆస్థితిలో చేయబడిన రతిక్రీడ ఆమెకు భర్తకుకూడ ఒక వింత ఆనందాన్ని కలిగిస్తుంది.

2. మాండూకబంధము :- భార్య శయ్యపై వెలకిలగా శయనించినదై తన్ను కలియవచ్చిన భర్తయొక్క తొడలమీద తనతొడలను చేర్చగా భర్త ఆమెనుగూడి రమించుట 'మాండూక బంధము' అనబడుతుంది. ఈ బంధమున స్త్రీ శయనించియుండగా పురుషుడు కూర్చుండియుండును. 'మాండూకము' అనగా కప్ప. కప్పయొక్క రతిక్రీడవంటి దగుటచే దీనికీపేరు వచ్చినది.

4. అనుపాదబంధము :- చెక్కిలి (బుగ్గ) యొక్కమీది భాగమునకే హనువని పేరు. భార్యశయ్యపై వెలికిలగా శయనించి యుండి తనకాళ్లను పైకెత్తి - తన్ను కలియవచ్చి తనయోనియందు సంసక్తమైన పురుషాంగముకలవాండై, శయ్యపై తనకెదురుగా కూర్చుండియున్న భర్తయొక్క భుజములమీదుగా - పైకెత్తిన తనకాళ్ళను పోనిచ్చి - తనపాదములతో అతని చెక్కెళ్ల మీది భాగములను తాకుచుండగా రమించు స్థితికి "హనుపాదబంధము" అనిపేరు. భర్తయొక్క చెక్కెళ్ళ మీదభాగమునందు భార్యయొక్క పాదములస్పర్శ ఏర్పడుటవలన ఈబంధమనబడెను.

5. పద్మాసనబంధము :- భార్యశయ్యపై వెలికిలిగా శయనించినదై తనకాళ్ళను మోకాళ్ళ దగ్గరమడచి, ఎడమకాలి పిక్కపై కుడికాలి పిక్కకుచేర్చి (బాసికపట్టువేసి కూర్చున్నట్లు) ఉండగా - భర్త ఆమెయొక్క ఈ ఆసనస్థితిని విడదీయకయే ఆమె కాళ్ళను పైకెత్తి ఆమెయొక్క రెండుమోకాళ్ళయొక్క సందులలోనుండి తనచేతులను పోనిచ్చి - ఆమె కంఠమును గ్రహించినవాడై రమించుట 'పద్మాసనము' అనబడుతుంది. బాసికపట్టువేసి పరుండియున్న భార్యయొక్క రెండుమోకాళ్ళ సందులలోనుండియు చేతులనుపోనిచ్చి కంఠమును గ్రహించుటవలన భార్యయొక్క పాదపీఠము (తొడలతో సహా) సహజముగనే పైకిలేచి పురుషాంగము యోనియందు ప్రవేశించుటకు వీలుకలుగును. ఆ సమయమున భార్య తనమీదకు వ్రాలియున్న భర్తను మడువబడియున్న తనకాళ్ళయొక్క మధ్య