నరశింహా దండకం

శ్రీ హరి పతి నిన్ను - వేడితి నరశింహా

నరుడా గురుడా - నివే నమ్మితి నరశింహా

చీమల వరదా - చిత్తజీవుడా

భావజ వరదా - భక్త వత్సలా! 1



గండ్రగొడ్డలి గల రాజులనెల్లా

ఖండింతురు యమదూతలవల్లా

గాలి ఇతడు ధూళి ఇతడు

ఓనంబితడు, కైనంబితడు ! 2



అంది పొంది నేర్చిన ఆది నారాయణమూర్తి ఇతండు

ఇతండు అనగా నెవ్వరు గోళజంబు నరశింహా భళా నరశింహా

నరశింహా నామములు ఎవరు తలుతురో

నామీద భక్తితో ఎవరు ఉందురో! 3



చింతామణి రామనామం

కల్పవృక్షం రామనామం

కామధేనువు రామనామం

సకలం సంపూర్ణం రామనామం ! 4



పడుకొని పఠన చేస్తే పసిబాలలకెల్లా రక్ష

కూర్చొని పఠన చేస్తే గృహములకెల్లా రక్ష

ప్రాతః కాల పఠన చేస్తే మహాపాపములు తొలుగును

మధ్యన వేళ పఠన చేస్తే మహాపాతకములు బాసును ! 5



సంధ్య వేళ పఠన చేస్తే శ్రీ మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చును

అర్ధరాత్రి పఠన చేస్తే చొరభయంలేదు

అహొ వీర్యం

అహొ బాహు పరాక్రమం ! 6


శ్రీ నారశింహోనకు వైకుంఠ వాసునకి

ఉక్కు స్తంభమున ఊర్హిన ఊర్హునకు

వైకుంఠ వాసునకు వందితునకు

జయ మంగళం నిత్య శుభమంగళం ! 7


ఆకు మీదా ఉన్న ఆరామచంద్రునకు

వైకుంఠ వాసునకు వందితునకు

జయ మంగళం నిత్య శుభమంగళం

ఓం శాంతిః శాంతిః శాంతిః 8