నమ్మిన దొకటే నాకు నీశరణము

  (రాగం:[రేవతి[గుండక్రియ]) (తాళం:ఆది)}

పల్లవి: నమ్మిన దొకటే నాకు నీశరణము

    యెమ్మెలసంసార మింతే యిందేమి గలదు

చరణం:యేటికర్మము నా కేటిధర్మము

    యేటిదో నే జేయుగా నీ కేమి గూడెను
    నాటకపుతొంటివారు నడిచినమార్గమని
    యీటుకు జేసేగాక యిందేమి గలదు

చరణం:యేడతపము నా కేడజపము నే

     వాడిక జేయగ నీకు వచ్చినదేమి
     బెడిదపుబెద్దలెల్లా బెట్టినతిట్టములంటా
     యీడుకు జేసెగాక యిందేమి గలరు

చరణం: యెక్కడిపుణ్యము నా కెక్కడిభోగములు

     యిక్కువ నన్నిట్ల జేసి యేమిగంటివి
     నిక్కెపుశ్రీవేంకటేశ నిన్ను గనుటగాక
     యెక్కడి కెక్కడిమాయ లిందేమి గలద

బయటి లింకులు

మార్చు




అన్నమయ్య పాటలు  
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |