నందామయా గురుడ నందామయా
చిత్రం: పెద్ద మనుషులు (1954)
రచన: కొసరాజు
సంగీతం: ఓగిరాల, అద్దేపల్లి
గానం: ఘంటసాల
ఘంటసాల: నందామయా గురుడ నందామయా!
ఆనందదేవికి నందామయా
బృందం: నందామయా గురుడ నందామయా!
ఆనందదేవికి నందామయా
ఘంటసాల: స్వారాజ్య యుద్ధాన జయభేరి మ్రోగించి
శాంతమూర్తులు అంతరించారయా
స్వాతంత్ర్య గౌరవము సంతలో తెగనమ్ము
స్వార్ధ మూర్తులు అవతరించారయా
బృందం: నందామయా గురుడ నందామయా ఆనందదేవికి నందామయా
ఘంటసాల: వారు వీరౌతారు, వీరు వారౌతారు
మిట్ట పల్లాలేకమౌతాయయా
తూరుపూ దిక్కునా తోకచుక్కా పుట్టి
పెద్ద ఘటముల కెసరు పెట్టేనయా
బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా
ఘంటసాల: కనకాద్రి శిఖరాన శునకమ్ము సింహమై
ఏడుదీవుల రాజ్యమేలేనయా
గుళ్ళు మ్రింగేవాళ్ళు, నోళ్ళు గొట్టేవాళ్ళు
ఊళ్ళో చెలామణీ అవుతారయా
బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా
ఘంటసాల: అ,ఆ లు రానట్టి అన్నయ్య లందరికి
అధికార యోగమ్ము బడుతుందయా
కుక్క తోకా పట్టి గోదావరీదితే
కోటిపల్లీ కాడ తేలేరయా
బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా
ఘంటసాల: గొఱ్ఱెల్లు దినువాడు గోవింద గొడ్తాడు
బఱ్ఱెల్లు తినువాడు వస్తాడయా
పగలి చుక్కలు మింట మొలిపించునంటాడు
నగుబాట్లు పడి తోక ముడిచేనయా
బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా
ఘంటసాల: అప్పు చేసినవాడు పప్పు కూడు తిని
ఆనందమయుడౌచు తిరిగేనయా
అర్ధమిచ్చినవాడు ఆకులలములు మేసి
అన్నానికాపన్నుడౌతాడయా
బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా
ఘంటసాల: దుక్కి దున్నేవాడు భూమి కామందౌచు
దొరబాబు వలే చలాయిస్తాడయా
అద్దెకుండేవాడె యింటి కామందునని
ఆందోళనము లేవదీస్తాడయా
బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా
ఘంటసాల: ఆంబూరు కాడ యాటంబాంబు బ్రద్దలై
తొంబ తొంబగ జనులు చచ్చేరయా
తిక్క శంకరస్వామి చెప్పింది నమ్మితే
చిక్కులన్నీ తీరిపోతాయయా | తిక్క శంకర |
బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా
ఆనందదేవికి నందామయా