దేవా సేవకులన్న (పద్యం)
చిత్రం: కాళహస్తి మహత్మ్యం (1954)
రచన: తోలేటి
సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం
గానం: ఘంటసాల
దేవా సేవకులన్న నీచమతులై దీనాళి వేధించు దు
ర్భావుల్ యీ నరజాతి, యీ నరజాతి పూజకును ఆ... బ్రహ్మాది దేవేంద్ర సత్సే
వావ్రాతము వీడీ భిక్షకుడవై సేవింప యీ బంటుకే
ఈవే బంటుగ వచ్చినావు భళిరా... శ్రీకాళహస్తీశ్వరా
శ్రీకాళహస్తీశ్వరా... శ్రీకాళహస్తీశ్వరా...
ఈ పద్యము శార్దూలవిక్రీడితము అనబడు ఛందస్సు లో వ్రాయబడినది. ఛందో బద్ధముగా సవరించిన పద్యాన్ని ఈ క్రింద జత జేయటం జరిగింది.
శార్దూలవిక్రీడితము
- దేవా సేవకులన్న నీచమతులై దీనాళి వేధించు దు
- ర్భావుల్ యీ నరజాతి పూజకును ఆ... బ్రహ్మాది దేవేంద్ర సత్సే
- వావ్రాతమ్మును వీడి భిక్షకుడవై సేవింప యీ బంటుకే
- ఈవే బంటుగ వచ్చినావు భళిరా... శ్రీకాళహస్తీశ్వరా