దేవర చిత్తం (రాగం: ) (తాళం : )

దేవర చిత్తం దివ్య నిధి
దేవనిర్మిత నిధీ యవధానం ||

అతివలు నాట్యంబాడెదమని వు
న్నతి మెఅయుచు నున్నారిదివో
ప్రతినలతో రంధయు మేనకయును
ధ్రుతి విద్య తమకంబున వినుమని ||

గానవిద్య తమకంబున వినుమని
కానుకలివె సురకాంతలవి
కానుపించుకో గంధర్వ సతులను
ధీనుత పంపుసుధీ యవధానం ||

పరియంకంబున బవళించెదవో
సిరుల విభవముల జెలగెదవో
తిరువేంకటగిరిదేవ యన్నిటా
తిరమందితి విటు ధీ యవధానం ||


dEvara chittaM (Raagam: ) (Taalam: )

dEvara chittaM divya nidhi
dEvanirmita nidhI yavadhAnaM ||

ativalu nATyaMbADedamani vu
nnati meRayuchu nunnAridivO
pratinalatO raMdhayu mEnakayunu
dhruti vidya tamakaMbuna vinumani ||

gAnavidya tamakaMbuna vinumani
kAnukalive surakAMtalavi
kAnupiMchukO gaMdharva satulanu
dhInuta paMpusudhI yavadhAnaM ||

pariyaMkaMbuna bavaLiMchedavO
sirula vibhavamula jelagedavO
tiruvEMkaTagiridEva yanniTA
tiramaMditi viTu dhI yavadhAnaM ||


బయటి లింకులు

మార్చు



అన్నమయ్య పాటలు  
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |