దివ్యదేశ వైభవ ప్రకాశికా/శ్రీవిల్లి పుత్తూరు

ముఖచిత్రం

48. శ్రీవిల్లి పుత్తూరు 8

శ్లో. దివ్యే ముక్కళ తీర్థ సుందరతటే శ్రీ విల్లి పుత్తూర్ పురే
   శ్రీమత్సంశన దేవయాన నిలయ: ప్రాచీముఖ స్సంస్థిత:||
   భాతిశ్రీ వటపత్రశాయి భగవాన్ శ్రీ గోదయా సంస్తుత:
   శ్రీమద్విష్ణుహృదా ప్రశస్య విభవో మండూక యోగీక్షిత:||

వివ: వటపత్రశాయి పెరుమాళ్-రంగమన్నార్, ఆండాళ్ తాయార్-ముక్కళ తీర్థము-సంశన విమానము-తూర్పుముఖము-వటపత్ర శయనము. రంగమన్నార్ నిలచున్న సేవ-మండూక మహర్షికి ప్రత్యక్షము. పెరియాళ్వార్, ఆండాళ్ కీర్తించినది.

విశే: పెరియాళ్వార్ ఆండాళ్ అవతరించిన దివ్యదేశము. మిధునం స్వాతి పెరియాళ్వార్ తిరునక్షత్రం, కర్కాటకం పుబ్బ, ఆండాళ్ తిరునక్షత్రం పది దినములు అతి వైభవముగా జరుగును. కన్యా శ్రవణం తీర్థోత్సవం. ఇచ్చట పెరియాళ్వార్లు పెంచిన నందనవనము, ఆండాళ్ అవతరించిన స్థలము. కణ్ణాడి కిణర్ (ఆండాళ్ ముఖము చూచుకొన్న బావి)కలవు. ఈ దివ్యదేశమునకు 20 కి.మీ దూరములో కాట్టళగర్ సన్నిధి, 5 కి.మీ దూరములో శ్రీనివాసన్ సన్నిధి, 24 కి.మీ దూరములో తిరుత్తణ్‌గాల్ క్షేత్రము కలవు. మిధునమాస ఉత్సవములో 5వ రోజు ఉదయం రంగమన్నార్, వటపత్రశాయి, కాట్టళగర్, శ్రీనివాసన్, తణ్‌గలప్పన్ వేంచేయగా పెరియాళ్వార్లు మంగళాశాసనం చేయుదురు. నాటి రాత్రి ఆండాళ్ హంసవాహనారూడులై వేంచేయగా పెరుమాళ్లు అందరు గరుడ వాహనముపై వేంచేయుట సేవింపదగినది.

పంగుని ఉత్తరా నక్షత్రమున ఆండాళ్‌కు తిరుక్కల్యాణం జరుగును. ఈ సన్నిధిలో రంగమన్నార్ పెరుమాళ్లకు కుడివైపున ఆండాళ్; ఎడమవైపు గరుడాళ్వార్ వేంచేసియున్నారు.

ఆండాళ్ ప్రార్ధన వలన రంగమన్నారును రాజగోపాల రూపములో తీసుకొని వచ్చిన గరుడాళ్వార్ పెరుమాళ్లతో ఏకాసనమున వేంచేసి యున్నారు.

వటపత్రశాయి సన్నిధిలో ఆదిశేషన్, నాభికమలమున బ్రహ్మ, శ్రీదేవి భూదేవి; విల్లి; పుత్తర్ అను కిరాత రాజులైన భక్తులు కలరు. విల్లి; పుత్తర్ అను కిరాత రాజులచే కట్టబడుటచే ఈక్షేత్రమునకు విల్లి పుత్తూరను పేరు వచ్చినది.

ఇచట ప్రతి నిత్యము పెరియాళ్వార్లకు తిరుమంజనము జరుగును. పిమ్మట పెరియాళ్వార్ పెరుమాళ్లకు మంగళా శాసనం చేతురు. పెరియాళ్వార్ సన్నిధి ప్రక్కనగల నందన వనములో ఆండాళ్ సన్నిధి వేరుగా కలదు. శ్రీరంగములో వలె

                                       60 ఇచట కూడా అరయర్ సేవ కలదు. ఈస్వామి విషయమై శ్రీపరాశర్ భట్టర్ గోదాచతుశ్లోకి శ్రీమద్వేదాంత దేశికులు గోదాస్తుతి అనుగ్రహించి యున్నారు.

మార్గము: తెన్‌కాశి-విరుదునగర్ రైలు మార్గము మధురకు 65 కి.మీ.

పా. మిన్ననైయ నుణ్ణడియార్ విరికుழల్‌మేల్ నుழைన్దవణ్డు
    ఇన్నిశైక్కుం విల్లిపుత్తూరిని తమర్‌న్దాయ్, ఉన్నైక్కణ్డార్
    ఎన్ననోన్బు నోற்றா ళ్ గొలో వివవై పెற்ற వయిరుడై యాళ్
    ఎన్నుం వార్తై యెయ్‌దువిత్త విరుడికేశా! ములై యుణాయే
          పెరియాళ్వార్- పెరియాళ్వార్ తిరుమొழி 2-2-6

    మెన్నడై యన్నమ్ పరన్దు విళై యాడుమ్‌ విల్లిపుత్తూరుఱై వాన్ఱన్,
    పొన్నడి కొణ్బదోరాశైయినా లెన్ పొరుకయ ఱ్కణ్ణిణై తు--;
    ఇన్నడి శిలొడు పాలము తూట్టి యెడుత్త వెన్ కోలక్కిళియై;
    ఉన్నొడు తోழாమై క్కొళ్వన్ కుయిలే యులగళన్దాన్ వరక్కూవాయ్
           ఆండాళ్-నాచ్చియార్ తిరుమొழி 6-5

గోదా చతుశ్లోకి

   నిత్యాభూషా నిగమ శిరసా నిస్సమోత్తుజ్గవార్తాం
   కాన్తోయస్యా: కచవిలులితై: కాముకోమాల్య రత్నై:
   సూక్త్యా యస్యా శ్రుతిసుభగయా సుప్రభాతా దరిత్రీ
   సైషాదేవీ సకల జననీ సి--తాం మామపాజ్గై:|| (1)

   మాతా చేత్తులసీ పితాయదితవ శ్రీ విష్ణు చిత్తోమహాన్
   భ్రాతా చేద్యతి శేఖర: ప్రియతమ: శ్రీరజ్గదామాయది
   జ్ఞాతారస్తవయా స్త్వదుక్తి సరస స్తవ్యేన సంవర్ధితా:
   గోదాదేవి కధం త్వ మన్య మనిశం సాధారణా శ్రీ రసి|| (2)

   కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం
   ప్రోక్తం స్వస్యచ కీర్తనం ప్రపదనం స్వస్మైప్రసూనార్పణం
   సర్వేషాం ప్రకటం విధాతు మనిశం శ్రీ ధన్వినవ్యేపురే
   జాతాం వైదిక విష్ణు చిత్తతనయాం గోదా ముదారాం స్తుమ:|| (3)

   ఆకూతస్య పరిష్క్రియా మనుపమా మసేచనం చక్షుషో:
   ఆనన్దస్య పరం పరామనుగుణా మారామశైలే శితు:
   తద్దోర్మధ్య కిరీట కోటి ఘటిత స్వోచ్చిష్ట కస్తూరికా
   మాల్యామోదన మేది తాత్మవిభవాం గోదాముదారాం స్తుమ:|| (4)

                                               61