దివ్యదేశ వైభవ ప్రకాశికా/శాళక్కిఱామం

100. శాళక్కిఱామం (సాలగ్రామమ్‌) - 5

శ్లో. గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే|
   సాలగ్రామ పురశ్రేష్ఠ కనకాఖ్య విమానగ:||
   శ్రీ మూర్తిదేవ శ్శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థిత:|
   గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచర:
   శ్రీవిష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత నిగ్రహ:||

వివ: శ్రీమూర్తి పెరుమాళ్-శ్రీదేవి తాయార్-గండకీ నది-చంద్ర తీర్థము-కనక విమానము-ఉత్తరముఖము-నిలచున్నసేవ- గండకీ అనువేశ్యకు-శివునకు-బ్రహ్మకు ప్రత్యక్షము-పెరియాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: స్వయం వ్యక్తక్షేత్రము. నేపాల్ దేశమున గలదు. ఖాట్మండుకు 175 మైళ్ల దూరమున గల ముక్తినాధ్‌క్షేత్రమే సాలగ్రామము.(ఖాట్మండుకు 65 మైళ్ల దూరమున గల దామోదర కుండమే సాలగ్రామమని కొందరి అభిప్రాయము)గండకీనది జన్మస్థానము. ఈనదిలోనే మనము ప్రతినిత్యము ఆరాధన చేయు సాలగ్రామములు లభించును.

మార్గము: నేపాల్ రాజధాని ఖాట్మండుకు 100 కి.మీ.

పా. కలై యుమ్‌ కరియుమ్‌ పరిమావుమ్; తిరియుమ్‌ కానమ్‌ కడన్దుపోయ్,
   శిలై యుమ్‌ కణై యుమ్‌ తుణై యాగ; చెన్ఱాన్ వెన్ఱిచ్చెరుక్కళత్తు;
   మలై కొణ్డలై నీరణై కట్టి; మదిళ్ నీరిలజ్గై వాళరక్కర్
   తలై వన్, తరై పత్తుఱత్తుగన్దాన్; శాళక్కిరామ మడై నె--.
           తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 1-5-1


మంచిమాట

ఒకనాడు ఒక శ్రీవైష్ణవులు నంబిళ్ల గారిని ఇట్లు అడిగిరి. "కాకాసురుడు పాదములపైబడి శరణువేడినను శ్రీరామచంద్రమూర్తి ఆతని కంటి నొకదానిని పోగొట్టెను గదా! కావున శరణాగతుడైనను పూర్వకర్మను అనుభవించియే తీరవలెనా? "సాధ్య భక్తి స్తు:సాహన్త్రీ ప్త్రారబ్ధస్యాపి భూయసీ" అనునట్లు సాధ్య భక్తి ప్రారబ్ధమును కూడ పోగొట్ట వలదా! అందుకు నంబిళ్లైగారి సమాధానము, "నిజమే, కానీ అంతటి అపరాధియైన కాకాసురుని క్షమించి విడిచిన దానికి గుర్తుగా అట్లు చేరి. అంతేకాదు రెండు కళ్లతో చేయు పనిని ఒక్కకంటితోనే చేయగల ఉపకారమును సైతము చేసిరి కావున అది దండించుటయు కాదు."

134

99. దేవరాజన్-నైమిశారణ్యం

Devarajan - Naimisaranyam

100. శ్రీ మూర్తి-సాలగ్రామం

Sri Murthy - Salagramam

101. బదరీ నారాయణన్-బదరి

Badarinadh-Badari

102. నీలమేఘన్-కండమెన్ఱుం కడినగర్

Neelameghan-Devaprayaga

101. బదరికాశ్రమం (బదరినాధ్) - 6

శ్లో. శ్రీ తప్త కుండ తీర్థాడ్యే బదర్యాశ్రమ పట్టణే|
   అరవింద లతానాధో నారాయణ సమాహ్వయ:||
   తప్తకాంచన వైమానే సురనాథ దిశాముఖ:|
   పద్మాసన జ్ఞాన ముద్రా లంకృతో జపశీలవాన్||
   మంత్రోపదేశం కృతవాన్ పరాఖ్యస్య మునే:పురా|
   రథాంశ యోగి కలిజిత్ స్తుతో విజయతే తరామ్‌ ||

వివ: బదరీ నారాయణుడు-అరవిందవల్లి-తప్తకుండ తీర్థము-తప్తకాంచన విమానము-తూర్పుముఖము-పద్మాసనము-జ్ఞానముద్ర-నరునకు మంత్రోపదేశము చేసిన స్థలము-పెరియాళ్వార్ తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: స్వయం వ్యక్తక్షేత్రము. తిరు అష్టాక్షరీ మంత్రము అవతరించిన స్థలము. విశాలపురి యనియు తిరునామము గలదు. ఇచట స్వామి అగ్నితప్త కుండముగా వేంచేసియున్నారు. ముందుగా నారద కుండములో స్నానముచేసి పిమ్మట అగ్నికుండములో స్నానమాచరించవలెను. ఇచట పెరుమాళ్లు మాత్రమే దృవమూర్తిగా వేంచేసియున్నారు. మిగతావారు ఉత్సవమూర్తులు. ఈస్వామి ఎదుట తెరవేయరు. తిరుమంజనాదులన్నియు బహిరంగముగనే జరుగును. మంచు పడుట వలన తులమాసం పౌర్ణమినాడు(వెణ్ణకాప్పు) వెన్న సమర్పించి తలుపులు వేయుదురు. తిరిగి మేష మాసం పౌర్ణమినాడు తలుపులు తీయుదురు. సన్నిధికి వెనుకగల లక్ష్మీనృసింహ మందిరమున ఉడయవర్ వేదాంత దేశికులు మొదలగువారు వేంచేసియున్నారు. ఈ క్షేత్రమున మన శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారిచే నిర్మింపబడిన సన్నిధి గలదు. ఇచటకు 1 కి.మీ దూరములో బ్రహ్మకపాలము గలదు. ఇచటకు 8 కి.మీ. దూరమున గల వసుదార కలదు. ఇందు జలము పుణ్యులైన వారిమీదనే పడునని ప్రతీతి.

మార్గము: హరిద్వార్(కలకత్తా-డెహ్రాడూన్ మార్గం)నుండి హృషికేశ్ చేరి అట నుండి 300 కి.మీ. బస్‌లో ప్రయాణించి బదరీచేరవలెను.

పా. సణ్డుకామరానవాఱుమ్; పావైయర్ వాయముదమ్‌
   ఉణ్డవారుమ్‌, వాழ்న్ద వాఱమొక్క పురైత్తిరుమి,
   తణ్డుకాలావూన్ఱి యూన్ఱి; త్తళ్ళి నడవామున్;
   వణ్డుపాడుమ్‌ తణ్డుழாయాన్ పదరివణజ్గుదుమే.
           తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 1-3-5

                                      135